7, ఆగస్టు 2015, శుక్రవారం

Pranjali Prabha-5 భావ కవిత్వం-2

ఓం శ్రీరాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి  ప్రభ -5



సర్వేజనా సుఖినోభవంతు
భావ కవిత్వం-2
జన్మదిన (10-08-1957) శుభాకాంక్షలు పంపిన వారందరికి హ్రుదయపూర్వక అభినందనలు
మీ అందరి అభిమానంతో నాలో నూతనొత్తెజం
మీ కందరికీ హ్రుదయ పూర్వక  అభినందనం
నాలో నిండే ఉషోదయ ఉషస్సుల అశిర్వాదబలం
పెద్దలను  గురువులు అర్ధించుతున్న జ్ఞానం పంచమని    


కవికుమారకులారా - కదలి రండయ్యా 

కన్నుల పండువై  - కనుపించే యుగమయ్యా
తొలకరి మనందరి లక్ష్మి -  తొంగి చుచిందయ్యా
తొల్లింటి పాపము  - తొలగి పోయిందయ్యా


వేద పఠణములోన  - కలదురా తీపి

మన మానసములోన - కలదురా తేట
ప్రేమ పలుకులోన - కలుగునురా తృప్తి
 స్నేహ  సేవలోన - ఉండునురా సంతృప్తి  


1. ఆ నవ్వుతో ఏటో వెళ్లి పోయింది నా వయసు 
ఆ చూపుతో ఏటో వెళ్లి పోయింది నా మనసు 
ఆ నడకతో నన్ను కలవర పెట్టు  నీ సొగసు
ఆ చేతితో పావడా తిప్పటం చూసి పడే నలుసు    


ప్రాంజలి ప్రభ 
తళుకు బెళుకు తన్మయ నవతరుణి 
తరుణోపాయం తెల్పే  విధు  షీమణి 
తేట తెలుగు లా  వెలుగుల  జవ్వణి
తేనపలుకు తెమ్మెరలా సాగే తరంగిణి



2. ఆరుబయట అందాలు ఆరబోస్తుంటివి ఎలా చెప్మా..!

ఒయ్యారాలను వలకబోస్తూ చేనుగట్టు కూర్చుంటే ఎలా చెప్మా..!

కొనసీమ కొబ్బరి చెట్ల అందాలన్ని నీలొఉంటే ఎలా చెప్మా..!

ఆకర్షించే చూపులతొ నన్ను తికమిక పెడితే ఎలా చెప్మా..!


https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgucM3WR7PieRH4HMg2_IYBEWl7kbfJW6v0w4defGtrkDww7QnPFTrTX3S6rCfU5mclzNblI0Ha8i8znATvKyWTZjD3QLyQqQMO05-xBqeFRYs4PQs3lAmZrn4XEzAVIiFAy-q7UdCGd3tb/s1600/1.png


శంకరాభరణం బ్లాగ్ వారు పంపిన చిత్రానికి నాభావ కవిత్వం



3. భయ మెరుగని భవ్య దివ్య భవుడు

భవ భంధ బగ భగలు లేని భద్రుడు
భాండము లేక కేసరినెదిరించిన భర్గుడు
భద్రదారువు వలే  శార్దూల రక్ష భానుడు



4. శ్రీ రాఘవం దశరధాత్మజ మప్రమేయం 
 


సీతా పతిం రఘుకులాన్వయ రత్న దీపం 
 


ఆజానుబాహుమ్ అరవింద దళాయ తాక్షం 
 

రామం నిశాచర వినాశ కరం నమామి... 



5. చెరువు లెండె - చేలములు కరువాయె 

వాననిండు కుండె - ఎండలు మంది పోయె 
చెట్లు ఎండకు మండె - నీడకు కరువాయె 
మనుగడ లేకుండె - ఓం శ్రీ రామ కాపాడవయ్య

 

 6. సరస సల్లాపముతో సరసుని సముదాయించే 
సరళ శ్రావ్య స్వర్ణ ప్రియని తనువుతో సంతృప్తిపరిచే 
సంతసముతో సంతుష్టినియై సవ్యసాచికి మనసుపంచే
 సమాన సమిష్టిగా తలపుల రంగులకల ఫలించే 


దొబూచి లాటలు సంసారంలో ఉంటె ఆ త్రిల్లే వేరు 
దొంగ ముద్దులిస్తు ఉడికించి చల్లపరిచే కిక్కే వేరు 
దొండకాయగున్నా, దొండపండులాగున్నా రుచీ వేరు
దంపతులెటులున్న అరచు కొని సర్దుకోవటం వేరు      



మనకు అక్కరలేని విషయాల గురించి అలోచించి భాదచెందవద్దు 
చదువుకున్నవారు కూడా చెప్పలేరని వాదించ వద్దు 
 దేవునిలీల గురించి  ప్రశ్నలు వేయొద్దు
ధర్మమార్గమునే  నడుచు కోవటం మనకు హద్దు
 
మనసనేది  ఉన్నదా  - ఉండినా ఎక్కడున్నాదో తెలియదు
ప్రేమ అనేది ఉన్నదా - ప్రేమకు కొలమానం ఎమిటో తెలియదు 
హృదయ మనేది ఉన్నదా  - ఉండినా రక్త జలాలమద్య ఎలాఉందో తెలియదు
బుడ్డి అసలు ఉందా - ఆ బుద్దు ఎప్పుడు ఎలామరుతుందో ఎవరికీ తెలియదు 

ఈ విషయం ఎలా చెప్పాలి - విషయం ఎలా తెలియాలి 
నిజం తెలియాలి - గుట్టు తెలిసుకోవాలి 
లొసుగు విప్పాలి - సద్దు చేయాలి 
ప్రేమ పండించాలి - సుఖాన్ని ఇవ్వాలి 

మనకు అసలు సమస్య ఎలా వివరించాలో తెలియదు 
ఎప్పుడు మొదలు పెట్టాలో అసలే  తెలియదు 
ఎప్పుడు అపా లో అంతకన్నా తెలియదు 
ఆ మద్యలో ఏంచేయాలో తెలియదు 

చిత్రం మహా అద్భుతం - సేకరణ అమోఘం 

విశ్వమ్ విశ్వాన్తరాళలో వెలిసిన ఒక అద్భుతం 
విశ్వనాద సత్యనారాయణకు అదేకల్ప వృక్షం 
ఆనందపారవశ్యం తో వర్ణన చేసే  రామాయణం
అదే ఈనాటి కి చెక్కు చెదరని మాహ వృక్షం 
  
తెలుసుకోవాల్సింది ఏముంది నీ అన్వేషణలో 
ఎజన్మభందం అని తెలుసుకోవు ఈ లోంకంలో  
గమ్యానికి అంతు తెలుసుకోలేవు ఎవిషయం లో 
ఎన్నిమాటలు మార్చిన అర్ధం కాని పదాలు ఎన్నో    

నా గమ్యం నీవె అంటూ ఓ మంద హాసం 
నన్ను మరువకు అంటూ ఓ మౌన హాసం 
నిన్నుచూసి చూడకుండ ఓ చిరు దరహాసం
నీలొ నాలో ఎప్పుడు పల్లవించాలి సా హాసం    



అన్నీ ఉన్నప్పుడు మన వైఖిరి తెలుస్తుంది -
 ఎమీలేనప్పుడు మన ఓర్పు కనిపిస్తుంది 



ఈ పాట  నాకు ఎంతోఇష్టం .. మీకుఇష్టమని భావిస్తా 
ఒక్కసారి ఈ పాట విని సంతోషిమ్చగలరని ఆశిస్తున్నాను

మూగనోము చిత్రంలోని ఒక అందమైన పాట
చిత్రం : మూగనోము (1969)
సంగీతం : ఆర్. గోవర్ధన్
సాహిత్యం : దాశరథి
గానం : ఘంటసాల, సుశీల
 
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు...
లోలోన ఏవో విరిసెలే వలపులు
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు...
లోలోన ఏవో విరిసెలే వలపులు
 
నీలోని ఆశలన్నీ నా కోసమే...
నా పిలుపే నీలో వలపులై విరిసెలే
నీలోని ఆశలన్నీ నా కోసమే...
నా పిలుపే నీలో వలపులై విరిసెలే
 
నీ చూపులో స్వర్గమే తొంగి చూసే..
నీ మాటలో మధువులే పొంగిపోయే
నీ చూపులో స్వర్గమే తొంగి చూసే..
నీ మాటలో మధువులే పొంగిపోయే
 
నాలోని ఆణువణువు నీదాయెలే..
బ్రతుకంతా నీకే అంకితం చేయనా..
నీలోని ఆశలన్నీ నా కోసమే..
నా పిలిపే నీలో వలపులై విరిసెలే..
లా ... లాలలా... లలలా... లా...
 
నీ రూపమే గుండెలో నిండిపోయే...
నా స్వప్నమే నేటితో పండిపోయే
నీ రూపమే గుండెలో నిండిపోయే...
నా స్వప్నమే నేటితో పండిపోయే
ఉయ్యాల జంపాల ఊగేములే..
 
కలకాలం మనకు ప్రేమయే ప్రాణము..
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు..
లోలోన ఏవో విరిసెలే వలపులు
లా ...లా ...లా ... లాలలా
లాలలా... ఊ హూ హు.

https://youtu.be/oiN8f-LaHng
Ee Vela Naalo Enduko || Mooga Nomu Telugu Hit Song - ANR , Jamuna (HD)
Subscribe For More Telugu Movies: http://goo.gl/V65dIk Subscribe For More Tamil Movies: http://goo.g...


 నాకు చిత్రములు, కవితలు, గీతాలు, మెయిల్ కు  పంపినవారికి పేరు పేరున కృతజ్నతలు చెప్పుకుంటున్నాను (మంచిని నలుగురికి పంచాలని ఒక ఆశయంతో సేకరిస్తున్నాను )


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి