23, సెప్టెంబర్ 2017, శనివారం

వాహిక -4


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: 
వాహిక -4

ఓ మనిషి తెలుసుకో తెలుసుకొని మసలుకో

భాదెందుకు నీకు పల్లె తోడున్నది
ఆశయంతో బ్రతికేందుకు మార్గమున్నది
ఓదార్చేందుకు పుడమి తల్లి ఉన్నది
ప్రేమతో ఆదుకొనే స్నేహ మున్నది

కడుపుతీపి తీరని తల్లి ఉన్నది
శ్రమించే శక్తి తండ్రి కున్నది
ఓర్పు వహిస్తే నీకు విజయ మున్నది
నమ్మకమే నిన్ను బ్రతికిస్తుంది

పిరికితనం తరిమే ధైర్యము నీకున్నది
దేశం నిన్ను ఆదు కుంటానంటున్నది
బతకలేనని భాధ తరుము తున్నది
జీవితమే సుఖదుఃఖాల నిలయమైనది

స్త్రీ వ్యమోహనికి చక్కి ఆరోగ్యం చెడు తున్నది
నీ గమ్యం నీకు తోడు ఉన్నది
నీ హ్రదయం లో దైవమున్నది 
నీలో మార్పే నేను కోరు తున్నది


ఓ మనిషి తెలుసుకో తెలుసుకొని మసలుకో
--((*))--

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో

సృష్టి కి మూలం స్త్రీ

స్త్రీ అనే మొగ్గ పువ్వుగా మారి పరిమళిస్తుంది
చిరు గాలి చెలిమికి శక్తినంతా ధారపోస్తున్నది
ప్రేమ చిగురించి పెళ్లిగా మారి సహకరిస్తున్నది
స్త్రీ మాతృత్వం కోసం సర్వం జీవికి అర్పిస్తుంది

ఉదయం ప్రస్నార్ధకముగా ఉండక ఉంటుంది
సరససంభాషణలతో చాతుర్యం వ్యక్తపరుస్తుంది
మగణి సమస్యకు  పరిష్కారం చూపుతుంది
సౌభాగ్యాన్ని అందిస్తూ చీకటిని తరుముతుంది

పీరియడ్స్ భాద భరిస్తూ మగవాని కాంక్షతీరుస్తుంది
మొగవాని అహంకారాన్ని తగ్గిస్తూ ప్రేమను పంచేది
సూర్యుడిలా వెలుగును వేడిని అందిస్తూ జీవిస్తుంది
చంద్రుడిలా చీకటిలో వెన్నెలతో చల్లదనం అందిస్తుంది          

క్షణమొక యుగంగా, దినమొక గండంగా ఉన్న భరిస్తుంది
విశ్వమంతా మానవత్వం, మంచితనంతో బ్రతుకు నందిస్తుంది
ఎండ, జల్లు, చలి, ఆవహించిన క్షణంలో సంతృప్తి పరచేది
దేవుని సృష్టి ఎలా ఉన్న మగవానికి మగువ ఆరాధ్య దేవత  

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో

స్త్రీ జీవితం  

నిత్య సుఘంద పరిమళాలాతో
మత్తును పెంచే విధానాలతో
మమతను పంచె ఆశయంతో
మృదు మధురహస్తాలతో

శ్రమను తగ్గించే భ్రమలతో
నిత్య యవ్వన సౌరభముతో
నిరాశను పారద్రోలే లక్ష్యంతో
హృదయ కుసుమాన్ని అందింటంతో

శాంతిని కల్పించే కర స్పర్శతో
పలకరించే తీయని పదజాలంతో
అజ్ఞానాన్ని తొలగించే ధైర్యంతో
మగనికి జ్ఞానాన్ని పంచటంతో

మాతృత్వాన్ని పొంది కన్న బిడ్డల
ఆలనా పాలన చూస్తూ సాగేదే
     
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--


టుడే ఈజ్ వరల్డ్  ప్రామిస్ డే  (4-09-2017)

ఎడబాటు ఒక స్వప్నం 
ప్రామిస్ చేసి చెప్పలేక పోతున్నాను 
నీ సమీపమే నాకు స్వర్గం
ప్రామిస్ చేసి ఉండమని చెప్పలేకపోతున్నాను

నిన్ను నేను కలసిన దినం 
ప్రామిస్ చేసి నిజం చెప్పాలేకపోతున్నాను
ప్రతిక్షణం నీతో నాకు ఒక అనుభవం 
ప్రామిస్ చేసి చెపుతున్నా మరువ లేకున్నాను

నీ వలపుల వడి నాలో ఆక్రమణం 
ప్రామిస్ చేసి చెపుతున్నా రేయి పగలు మరువలేను
నీ భ్రమలు తొలగించే సమయం 
ప్రామిస్ చేసి చెపుతున్నా త్వరలో చూస్తావనుకుంటాను

తరచి చూసిన మదిలో మమకారం
ప్రామిస్ చేసి చెపుతున్నా ఏ పరిస్థితిలో వదలలేకున్నాను 
నా మతి పోగొట్టింది నీ తృణ సహకారం           

ప్రామిస్ చేసి చెపుతున్నా సహకారానికి ఉపకారం చేస్తున్నాను  
--((*))--

వాహిక -3

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

ఓమనిషి తెలుసుకో 
అమ్మను ప్రార్ధించి జీవితాన్ని సరిదిద్దుకో 

త్రిమూర్తులను కన్న మాతృమూర్తి
లోకాలను ఆదుకుంటున్నదివ్యమూర్తి  
అక్షదామ, శుక, వారిజ, పుస్తక రమ్యమూర్తి 
నవరాత్రులలో పూజలందుకుంటున్న పెద్దమ్మ 

సృష్టి స్థితి లయకారులను జగత్తుకు అందించినఅమ్మ
అమ్మ ఒకనామము పఠించిన అమృతం పంచె అమ్మ 
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణగా చేస్తున్న మహంకాళికామ్మ 
దివ్య కాంతితో శత్రుసంహారము చేసిన మహాలక్ష్మమమ్మ 

మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను చేకూర్చే అమ్మ 
భక్తపాలనా, కరుణాంతరంగా వైభవాన్ని అందించే అమ్మ 
ఆధ్యాత్మిక భావనా శక్తి అఖండ దీప్తిని అందించే అమ్మ  
స్త్రీ శక్తి సమిష్టి చైతన్య స్వరూపమే అపరాజితగా అమ్మ 

ఇల్లాలి కాన కన్నీరొలికితే సిరి ఇంట నిలవదన్నది అమ్మ 
స్త్రీలను అగౌరపరచి, గృహలక్ష్మీని హింసిస్తే సహించదు అమ్మ 
హృదయాన్ని అర్పించి స్త్రీ పురుషులు ప్రార్ధించాలన్నది  అమ్మ 
దసరా పండుగ పరమార్ధం, చైతన్యాన్ని గ్రహించమన్నది అమ్మ             

ఓమనిషి తెలుసుకో 
అమ్మను ప్రార్ధించి జీవితాన్ని సరిదిద్దుకో 

అమ్మలు కన్న అమ్మలందరికి దసరా పండుగ సందర్భముగా శుభాకాంక్షలు 
ప్రాంజలి ప్రభను ఆదరిస్తూన్న తెలుగు ప్రపంచ ప్రజలందరికి శుభాకాంక్షలు
అందరి తరుఫున దుర్గామాతను ఆరాధిస్తూ దీవెనలను కోరుతున్నాను  
--((*))--

వాహిక -3 
ఓమనిషి తెలుసుకో 
తెలుసుకొని మసలుకో 

జీవించట మంటే తెలుసుకో 
నవ్వుతున్న పసిపాపను చూసి 
గాలికి ఊగుతున్న పువ్వుని చూసి
ఆకాశంలో ఎగురుతున్న పక్షిని చూసి 
ప్రకృతిలో సమస్తప్రాణుల జీవనం చూసి    

జీవించట మంటే తెలుసుకో
జీవన వనంలో ప్రేమను వికసింప చేసి
మనిషి మనిషిలో ఉన్న జీవితార్ధాన్ని చూసి 
విశ్వమనే ఊయలలో దేశానికి సేవలు చేసి 
సహజత్వంతో, పవిత్రతో సుఖాన్ని అందచేసి  

జీవన కళను వృద్ధి చేసి 
జీవనంలో ఉదాత్తత, ఔన్నత్యం చూపి 
ఆశయ లక్ష్యాన్ని అర్ధాన్ని చూపి 
ఆనంద సాగరంలో ఈదటమే జీవితం 

ఓమనిషి తెలుసుకో 

తెలుసుకొని మసలుకో 

21, సెప్టెంబర్ 2017, గురువారం

వాహిక -2

om sri ram - sri matrenam:
ప్రాంజలి ప్రభ - వాహిక -2

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో

అజ్ఞానం లోనే ఉంది జ్ఞానం
విజ్ఞానం లోనే ఉంది వైభోగం
వైభోగం లోనే ఉంది అదృష్టం
అదృష్టం లోని ఉంది ఆదర్శం

ఆదర్శం లోనే ఉంది ఆత్మీయం
ఆత్మీయం లోనే ఉంది ఆదాయం
ఆదాయం లోనే ఉంది ఆనందం
ఆనందం లోనే ఉంది అనంతం

అనంతం లోనే ఉంది శబ్దం
శబ్దం లోనే ఉంది భయం
భయం లోనే ఉంది దడ
దడ లోనే ఉంది ప్రాణం


ప్రాణం లోనే ఉంది ప్రేమ
ప్రేమ లోనే ఉంది కామం
కామం లోనే ఉంది మైకం
మైకం లోనే ఉంది జీవం

జీవం లోనే ఉంది మర్మం
మర్మం లోనే ఉంది మాయ 
మాయ లోనే ఉంది చీకటి
చీకిటి లోనే ఉంది సర్వం   

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో

ఓ మనిషి  తెలుసుకో
తెలుసుకొని మసలుకో

కంటికి పదిలం రెప్ప
ఇంటికి పదిలం  బీగం
జంటికి పదిలం రెవిక
వంటివో పదిలం ప్రేమ

వేటకి పదిలం ధైర్యం
కోటకి పదిలం సైన్యం
ఆటకి పదిలం నేస్తాం
మాటకి పదిలం నీతి

వేరుకి పదిలం భూమి
నీరుకి పదిలం చలనం
మేరుకు పదిలం జీవం
నోరుకి పదిలం వాసన

అందానికి పదిలం సరసం
సరసానికి పదిలం విరసం
విరసానికి పదిలం జటిలం
జటిలానికి పదిలం కామం

మోసానికి పదిలం రోషం
రోషానికి పదిలం వైరం
వైరానికి పదిలం వేషం
వేషానికి పదిలం కామం

వియ్యముకి పదిలం బంధం
కయ్యముకి పదిలం మోసం
నెయ్యముకి పదిలం ప్రేమ
దెయ్యముకి పదిలం బోనం          

ఓ మనిషి  తెలుసుకో
తెలుసుకొని మసలుకో
 

ఓ మనిషి తెలుసుకో 
తెలుసుకొని మసలుకో 

నీది అనేది ఏది లేదు లోకంలో
శాంతి దొరికితే చాలని తృప్తిపడు  
నమ్మకంతో బ్రతకాలి లోకంలో 
జరిగింది మంచేనని తృప్తి పడు 

ప్రేమ అనేది గుడ్డిది కాదు లోకంలో 
అర్ధం చేసుకోలేనివాడు గ్రుడ్డివాడౌతాడు 
ప్రేమ ఎవ్వరికి బానిసకాదు లోకంలో 
శక్తి అనే ఓర్పుతో జీవితాన్ని లాగుతాడు 

సూర్య చంద్రులు స్థిర సంచారులు లోకంలో 
ఈజన్మలో వారిని అనుకరించేవాడు మనుష్యుడు
భూమి ఆకాశం ఎప్పటికీ కలవదు లోకంలో
మనిషి మాత్రము వాదనతో కాలాన్ని మరుస్తాడు  

సుఖదు:ఖాలు వెంబడిస్తాయి ఈ లోకంలో 
సమయాసమయాలబట్టి మారాలి మానవుడు 
పాపలు ఎక్కువ పుణ్యాలు తక్కువ ఈ లోకం లో
మనిషిని నమ్మి గౌరవించి బ్రతకమన్నాడు దేవుడు 

ఎవ్వరికి ఎటువంటి ఖర్చు ఉండదు లోకంలో 
వారికున్నదే మనకులేదని ఖర్చులు పెంచుతాడు 
కష్టం మీదవచ్చే సంపాదనతో సుఖపడరులోకంలో 
ఆశయాలు వదలి ఆశకు చిక్కి నలిగి పోతాడు  

ఓ మనిషి తెలుసుకో 
తెలుసుకొని మసలుకో   

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో 

ప్రేమలోనే ఉంది మన:శాంతి 
పనులలోనే ఉంది విజయశాంతి 
మాటలలోనే ఉంది నిత్య క్రాంతి
యవ్వనంలోనే ఉంది సంక్రాంతి 

ప్రేరణలోనే ఉంది సమశ్రుతి
వేసవిలోనే ఉంది చమత్కృతి
కాలములోనే ఉంది సమదృతి 
మనుష్యుల్లోనే ఉంది భేద నీతి

మూర్ఖుల్లోనే ఉంది సర్వచిత్తు 
నవతలోనే ఉంది భవిషత్తు 
కవితలోని ఉంది ఉపనిషత్తు 
వనితలోనే ఉంది విద్యుత్తు

ప్రణయం లోనే ఉంది ప్రళయం
కార్యములోనే ఉంది జీవితం 
భాద్యతలోనే ఉంది బంధం 
ఆశయంలోనే ఉంది అర్ధం 

జీవితార్ధంలోనే ఉంది ప్రారబ్ధం 
ప్రారబ్ధం లోనే ఉంది సేవార్ధం
అర్ధం లోని ఉంది పరమార్ధం 
పరమార్ధంలోనే ఉంది జీవితార్ధం   
    
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో 

--((*))--


ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో 

ప్రేమ కానరాదు  
కనబడేది ప్రేమే కాదు 
ప్రేమలో మర్మం తెలియదు 
ప్రేమను తొలగించుట చేతకాదు   

ప్రేమ ద్వేషింప పడదు 
ప్రేమ కాలాన్ని బట్టి మారదు
ప్రేమ ప్రేమించనివానికి దక్కదు 
ప్రేమ గుడ్డిది కానే కాదు  

హృదయాంతరములో ప్రేమ 
కన్నబిడ్డ నవ్వుల్లో ప్రేమ 
మాతృత్వం లో దాగిన ప్రేమ 
సంఘర్షణ సరిగమ ప్రేమ 


ఓ మనిషి తెలుసుకో

తెలుసుకొని మసలుకో 


16, సెప్టెంబర్ 2017, శనివారం

" వాహిక "

om sri ram - sri maatrenama:

ప్రాంజలి ప్రభ - " వాహిక  "

1. ఓ మనిషీ తెలుసుకో - తెలుసుకొని మసలుకో

జ్ఞానేంద్రియాలు నీవెంట ఉంటాయి
ద్వంద స్థితిలో బ్రతుకుట ఎందుకోయి
ఆశాపాశానికి చిక్కి దురాశకు పోకోయి
శరీర సుఖము కోసం పతనము కాకోయి 

ఓ మనిషీ తెలుసుకో - తెలుసుకొని మసలుకో

స్వార్ధ భావముతో బ్రతుకుట ఎందుకోయి
కోరికలో నిజమెంతో తెలుసుకొని మెలగాలోయి
కోరిక ఆనే విత్తు చెడకుండా జాగర్త పడాలోయి
ప్రతి వ్యక్తి ఒక్క నిముషము గమనించాలోయి

ఓ మనిషీ తెలుసుకో - తెలుసుకొని మసలుకో

వయసు మార్పు బట్టి మనిషిగా ఎదగాలోయి
కోరికలనే గొలుసును తెంచి దగ్ధము చేయాలోయి  
మనకు వచ్చే మంచి చెడులు బ్రహ్మాసృష్టియేనోయి
ప్రకృతి ననుసరించి శరీర సౌష్టము  పెంచాలోయి   
      
ఓ మనిషీ తెలుసుకో - తెలుసుకొని మసలుకో

బ్రహ్మాన్ని తెలుసుకొని అహాన్ని తొలగించుకోయి
నీవు స్వార్ధ పురితమైన పనుల జోలికి పోకోయి
ఏది సత్యము ఏది అసత్యము తెలుసుకోవాలోయి 
అంధకారాన్ని తొలగించే సూర్యుడిలా ఉండాలోయి

ఓ మనిషీ తెలుసుకో - తెలుసుకొని మసలుకో

ప్రతి వ్యక్తి ప్రతి క్షణం వ్యర్ధము కాకుండా ఉండాలోయి 
బంధనాలు, దు:ఖాలు శాశ్వతము కాదని తెలుసుకోవాలోయి
బుద్ధి వక్రమార్గాన్ని బట్టి తల్లి, తండ్రి, గురువులను దూషించకోయి
కష్టార్జితమే మనసుకు శాంతి సౌభాగ్యము అందునని గమనించవోయి
       
ఓ మనిషీ తెలుసుకో - తెలుసుకొని మసలుకో

--((*))_-
2. ప్రధాని మోదీ 67 వ పుట్టిన రోజున పురస్కరించుకొని పద కవిత

సత్య ధర్మ నాయకా
భారత రాజ్య పాలకా 

కుల మతాల జాతీయత ఏలికా
శక్తి యుక్తి ముక్తి రాజ్య  నీతికా
మాటతో ప్రజా హృదయాల చేరికా
సమస్త ప్రజానీకానికి వెలుగు దీపికా

గ్రామ నగర పట్టణాల అభివృద్ధి కీలకా
కార్మిక కర్షక సకల కళా జీవన్ముక్తికా
సకల సమస్య పరిష్కర రాజనీతిజ్నికా
ప్రపంచ దేశాల నాయక ఏకీకృతికా

చైతన్య విద్యా ఆరోగ్య న్యాయ నిర్ధారకా
భారత ప్రజా కర్తవ్య గమ్య పరిపాలకా
ధర్మో రక్షిత రక్షిత: అన్న నాయకా
సమయా సమయ దీక్షా దక్షికా

ఉద్యోగ వ్యాపార ఆర్ధిక పరి రక్షకా
సాంస్కృతిక పరిజ్ఞానాన్ని విశ్వవ్యాప్తికా
సమస్త ప్రజల కష్ట నష్టాల నివృత్తికా
సమస్త కళాభివృద్ధికి దోహద కారికా               
 
సత్య ధర్మ నాయకా
భారత రాజ్య పాలకా 

--((*))--

3. ఓ మనిషి తెలుసుకో 

తెలుసుకొని మసలుకో  

మనిషి మనిషికీ మధ్య ఉండు తారతమ్యం

నిత్యా సత్యాలతో తెలిసికొన గలం గమ్యం 
వర్తమానంలో ఉంటూ భవిషత్తుకు వేస్తా0గాళం
ఇంద్రియాలను జయించుటకు చేయాలి ప్రయత్నం 

స్త్రీ పురుషుని మధ్య ఉండాలి ఏకత్వం 

ఏకత్వంలో ఉంది ఇరువురి మధ్య సమానత్వం 
సమానత్వంలో ఉంది నిత్య సుఖ మయం
సుఖంలోనే ఉంది వంశాభ్యుదయ లక్ష్యం 

ఇరువురి మధ్య ఉద్వేగాన్ని తొలగించేది ప్రేమతత్వం 

ఇరువురి మధ్య బేధాలను సృషించేది రాక్షస తత్వం 
ప్రకృతి నననుసరించి నడుచుకోవటమే కాల తత్వం
కాలాన్ని అనుసరించి బ్రతికి బ్రతికించటమే మానవత్వం

ఓ మనిషి తెలుసుకో 

తెలుసుకొని మసలుకో  
--((*))--

4. ఓ మనిషీ తెలుసుకో 

తెలుసుకొని మసలుకో 

లేదు లేదు అనేది ఏదియు లేదు 

లేదు అనే పలుకే ఉందని చెపుతుంది అర్ధం 
కాదు చేత కానిది ఏదియు లేదు
కాదు అనే పలుకే ఆలోచనను పంచే అర్ధం  

అత్యంత రహస్యమనేది ఏదియు లేదు 

ఆత్మజ్ఞానమే మొహాన్ని తగ్గించునని అర్ధం 
జననము వచ్చాక మరణము తప్పదు
ప్రకృతి ననుసరించి దేశ,దేహ సేవని అర్ధం 

సత్యా అసత్యాలు ఏమియు తెలియదు 

తెలిసినా అనుకరించిటుకు వీలు కాదని అర్ధం
ఐశ్వర్యం తేజస్సు పెంచేదేదో తెలియదు
సమయాన్ని వ్యర్ధం చేయని జీవుడేనని అర్ధం 

అన్నిటీలోకల్లా ఏది శ్రేష్ఠమైనదో తెలియదు

తల్లితండ్రి, దేవుని వాక్కే శ్రేష్టమైనదని అర్ధం
రహస్యమైన విద్య అనేది ఏదియు లేదు 
విద్యార్హతపొంది సద్వినియోగం చేయుటలో అర్ధం      

నాకు జ్ఞానమనేది లేదని ఎపుడు ఆనవలదు

అహంకార మమకారాలను వదులుటే జ్ఞానార్ధం 
విద్య నాకు అబ్బలేదు అని ఎవ్వరు అనవలదు
తల్లి తండ్రి కృషి గతించిన వారి దీవెనలని అర్ధం     

ఓ మనిషీ తెలుసుకో 

తెలుసుకొని మసలుకో 
--((*))__


5. ఓ మనిషీ తెలుసుకో 
తెలుసుకొని మసలుకో  

ఎన్నడు వీడకు ధర్మము
విన్నవి చెప్పిన ఆశలు చూపిన జగతిన్
ఎన్నడు వీడక ధైర్యము
అన్నము కోసము అండగ ఉండుము ప్రగతిన్

ఎవ్వడు నిత్యము పల్కిన
నెవ్వడు నమ్మిన నమ్మక పోయిన జగతిన్
నవ్వక ధర్మము చెప్పుము
మువ్వల శబ్దము చేయుచు హేతువు దెల్పున్

ఎవ్వరి నెవ్వరెరుగుదురు
తవ్విన కొద్దియు నీరును చూచుట జగతిన్
ఎవ్వరి గమ్యము తెల్పరు
దివ్వెగ వెల్తురు చూపుము జీవిత ప్రగతిన్  


ఓ మనిషీ తెలుసుకో 
తెలుసుకొని మసలుకో  
--((*))--

6. ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో  

సముద్ర కెరటాన్ని చూసి భయ పడకు
తలవంచి నమస్కారము చేయి
నీ నీడను చూసి భయం చెందకు
నీకు రక్షగా కొన్ని ప్రాణాలున్నాయి

ముసురును చూసి భయ మెందుకు
నీకు  అండగా కొన్ని శక్తులున్నాయి 
కాలమును చూసి కలలెందుకు
సహాయంగా కొన్ని కరములున్నాయి

నీవు చీకటిని చూసి భయ పడకు
వెలుగును చూపే కొన్ని కళ్ళు న్నాయి 
అనారోగ్యాన్ని చూసి గుబు లెందుకు
ఆరోగ్యంగా మార్చే కొన్ని  మందులున్నాయ్

ధనమును చూసి దిగులెందుకు
దానం చేసి శాంతిపొందుటకు దారులున్నాయి  
హక్కు అని వాదనలు ఎందుకు
కొన్ని ప్రాణాలే నీకు స్నేహంగా ఉన్నాయి 

నమ్మకము- ఉన్నచోట -తోడూ నీడ- ఉండు
 అహం - ఉన్నచోట- అంధకారము- ఉండు

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో  

7. ఓ మనిషీ తెలుసుకో
తెలుసుకొని మసలుకో

భూమిలో నిక్షేపాలు దాగి ఉండు 
నింగిలో శబ్ధాలు దాగి ఉండు 
నీటిలో జలచరాలు దాగి ఉండు 
అగ్నిలో వెలుగు దాగి ఉండు

ఫలంలో మాధుర్యం దాగి  ఉండు
వేలంలో ఐశ్వర్యం దాగి ఉండు
సేవలో చాతుర్యం దాగి చుండు
మాటలో ధర్మబధ్ధం దాగి ఉండు

రాతిలో బంగారం దాగి ఉండు 
నాతిలో శృంగారం దాగి ఉండు
నేతిలో జీర్ణ శక్తి దాగి ఉండు
నూతిలో అమృతం దాగి ఉండు

విత్తనంలో తైలం దాగి ఉండు
పెత్తనంలో అహం దాగి ఉండు 
ప్రేమలో త్యాగం దాగి ఉండు 
చిత్తంలో ఆశయం దాగి ఉండు 

హృదయంలో ఆకారం దాగి ఉండు   
శృతిమయం లో సంగీతం దాగి ఉండు
పూజలో మన:శాంతి దాగి ఉండు
అతి మొహంలో అనారోగ్య దాగి ఉండు    
   
జ్ఞానము లేని ధర్మం గుడ్డిదై  ఉండు
కర్మ లేని ధర్మం కుంటిదై  ఉండు
భక్తి లేని జ్ఞానం ప్రాణం లేనిదై ఉండు

మనిషి సమయాన్ని ప్రకృతిని అనుకరించి 
సక్రమముగా అనే జీవితము మూడు పువ్వులు 
ఆరు కాయలు కలిగి యుండు 
    
ఓ మనిషీ తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--

  దిగువగల (గోపికా కృష్ణుల) చిత్రానికి అనువయిన నేను వ్రాసిన పద్యాలు
యమునా తటియే మురిసెను
కమనీయమ్మైన వేణు గానము వినుచున్
సుమకోమలి తా జేరగ
సుమధుర ప్రణయమ్ము విరిసి శోభను గూర్చెన్
ఎదలో నిలిచిన కృష్ణుడె
యెదురుగ తా వచ్చినిలిచె నేమని తెలుపన్
సుదతిని ప్రేమగ హత్తుకు
నెదసడి వినిపింప రాధ యెదపొంగెనుగా.
అష్ట భార్యలున్న నతివ రాధయనిన
వల్లమాలినంత వలపు జూపు
శాశ్వతముగ వీరు జంటయై నిలిచెడు
ప్రేమ జంట నిజము విశ్వమందు.
చల్లలమ్మెడు దానవో సన్నుతాంగి
చెంత చేరగ రావేమె చింతమాని
కాచువాడనె నేనైతి, గరుణ జూపి
ముద్దుతీర్చవె దయతోడ ముగ్ద నీవు
పిల్లన గ్రోవి నూదుచును ప్రేమగ జేరుచు గొల్లభామల
న్నల్లరి పెట్టువాడు జన యాతన దీర్చెడు గోపబాలుడే
చల్లని వాడనంచు సరసాంగియె చేరెను ప్రేమమీరగ
న్నుల్లము దోచినాడని మహోన్నత మూరితి నందనందనున్

    

15, సెప్టెంబర్ 2017, శుక్రవారం

అహంభావము

om sri ram - sri maatrenama:
written by Mallapagada Ramakrishna


ప్రాంజలి ప్రభ

శ్రేయో హి జ్ఞాన మభ్యసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే!
ధ్యానాత్ కర్మ ఫలత్యాగ: త్యాగాత్ శాంతి రనంతరం!!

తా: అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్ఠమయినది, జ్ఞానముకంటె ధ్యానము శ్రేష్టమైనది, ధ్యానము కంటే కర్మ ఫలత్యాగము శ్రేష్టమైనది, ఆకర్మఫల త్యాగము వలన గొప్ప శాంతి లభించును.     
"అహం కృత్స్నస్య జగతః - ప్రభవః ప్రలయస్తథా|" 

(" నేనే యావత్పప్రంచానికీ మూలమూ,అంతమూ కూడా!") 


- గీతా 7-6


అహంభావము 


క్షణం మనిషిలో ఉండేది అహం 

అహం ప్రభావం చేదు అనుభవం 
క్షణ భంగురమైనది మనిషి జీవితం 
తనకు తానుగా చెప్పుకోలేనిది ప్రపంచం 

పరమాత్మ స్తూల పదార్ధంకు అతీతం 

నిద్రలేకుండా చేస్తుంది నేను అనే అహం
ఊహల ద్వారా కలల్లో చేరు తెలియని దాహం 
సాక్షిగా మారి నిరంతరం కలిగించును ఆవేశం

రక్తమాంసముల లో ఇమిడి యుండి ధనదాహం

భవిషత్ వర్తమాన కాలాల్లో చూపుతార్భుద్ది మాన్యం  
శాంతి అశాంతిఁ లమధ్య జరుగు నిరంతర పోరాటం 
అహం చేరిన వారిని ఆపటం సాధ్యముకాని సత్యం  

శాశ్వితము కాని శరీర పోషణకు చేస్తావు వ్యర్థం 

వంశమని, కుటుంబమని తపనతో పొందవు ఆనందం
అంతర్గత యొక్క సత్యముతో పొందాలి  పూర్ణ జ్ఞానం 
భౌతిక భావాన్ని తెలుసుకొని అహం వదిలితే జీవితం 

9, సెప్టెంబర్ 2017, శనివారం


pranjali Prabha.com (రచయత మల్లప్రగడ రామకృష్ణ ) స్త్రీ - పురుషులు ఒక్కరే

స్త్రీ అంటే ప్రగతి, జగతి జాగృతి
పురుషుడంటే జ్యోతి, జగతికి దివ్య జ్యోతి
స్త్రీ అంటే మాతృ మూర్తి, మానవతా మూర్తి
పురుషుడంటే స్నేహసహకార ఆదర్శ మూర్తి

నిత్యమూ సవాళ్ళను ఎదుర్కోవడం మగతనం
బడబగ్నినైన చల్లబరిచే హృదయం ఆడతనం
మాటల్లో వికసించే పురుష హావాభావం
చిరునవ్వుల సొగసు స్త్రీ సహజ స్వభావం

నలిగిన వేల వివేకం చూపే స్త్రీ తత్త్వం
విజ్ఞతతో ఆదుకొనే సహజ పురుష తత్త్వం
బ్రతుకు తెరువు నిత్య పోరాటం స్త్రీ మయం
సంపాదన, మమకారపు ఆరాటం పురుషమయం

స్త్రీ పురుషులలో ఉండు మానవత్వం
స్త్రీలో చక్కని సౌందర్యం గల ఆకృతి
పురుషుల్లో చాతుర్యం గల ఆకృతి
కష్ట నష్టాలలో జీవనయానం సమానం
--((*))--ప్రాంజలి prabha (జీవితం )
రచయత మల్లప్రగడ రామకృష్ణ

ఓ మనిషీ తెలుసుకో

గెలుపు జ్ఞాపకాల వరం
ఓటమి అనుభవాల పరం
గెలుపు ఓటమిలే అశాపాసం
సమయం వ్యర్ధం చేయక ఉండటమే జీవితం

ప్రకృతి అందించేది నవ వసంతం
సద్వినియోగం చేయుటలో ఉంది మీ సొంతం
మంచి-చెడులతో కదిలేది ప్రపంచం
నిత్యమూ సంత్యరించే ప్రయాణమే జీవితం

నిత్యమూ దీపారాధన చేస్తే చేరదు నిశీషధం
ధర్మ ప్రవర్తనకు దరి చేరదు నిత్య దరిద్రం
ప్రేమను పంచే హృదయానికి చేరదు ద్వేషం
ప్రేమను పంచి ప్రేమను పొందటమే జీవితం

మనిషి భవిషత్తు కు పునాది విశ్వాసం
మనిషికి ఉండాలి ధైర్యముతో నమ్మకం
భయపడకు నీ వెనుక ఉండు అభయం
మనిషి ధైర్యంతో ప్రకృతితో బ్రతికేదే జీవితం

పరిశ్రమలు పనిచేస్తేనే ప్రగతి పధం
అశాంతిని తొలగిస్తేనే ప్రశాంతి మయం
యవ్వన వికాసమే మనిషికి నూతన తేజం
దేశం, కుటుంబాన్ని బ్రతికించటమే సాఫల్య జీవితం
ఓ మనిషీ తెలుసుకో

కలికాలం 


చెప్పుడు మాటలు వింటారు 

విన్నమాటనే సమర్ధించుతారు 
చెప్పేమాట వినక పట్టు పడతారు 
కుందేలుకు మూడేకాళ్లని వాదిస్తారు

అనుకున్నది సాధించేదాకా ఒప్పుకోరు 

మేధావులు చెప్పింది వినమని బోధిస్తారు 
ఎమన్నా మీకున్న తెలివి మాకు లేదంటారు
మీతో సమానమని అంటూ మమ్ము వేధిస్తారు 

మీరు మగవాళ్ళు మాటలతో మాయ చేస్తారు 

మాకున్న బలహీనతతో  ఆడు కుంటారు 
చదువు తక్కువని చులకనగా మాట్లాడుతారు 
కోరిక తీర్చేదాకా ఒక పట్టాన నిద్ర పోనీయరు 

ముందు వెనుక చూడక ఎపుడూ కావాలంటారు

అనుకున్నప్పుడు అందివ్వక పొతే రెచ్చిపోతారు 
వయసొచ్చిన కోరికలకు అంతము లేదంటారు 
అప్పు చేసైనా హుందాగా బ్రతుకుదా మంటారు


మౌనము పలుకుటకంటే చాలా మేలైనదంటారు

కానీ పలుకులందున్నువిశేషము గ్రహించమంటారు

సత్యమైన వాక్కు, ప్రియమైన వాక్కును నమ్మమంటారు

మాకున్న ధర్మాలను బట్టి మేము మాట్లాడేది ధర్మమే అంటారు
   

     

3, సెప్టెంబర్ 2017, ఆదివారం


నాన్న భుజాల నుండి దిగి
నాన్న ఇచ్చిన చాక్లేట్ తిని
కాన్మెంటు బస్సు యెక్కి కదిలే

అమ్మా నాన్న లు పంచే ప్రేమ
అధ్యాపకులు పంచే ప్రేమ
నామనసులో అంతర్గ ప్రేమలే

పుస్తకాల బరువు తగ్గి
లాబ్ టాబ్ బరువు పెరిగి
మెదడంతా చదువుల ప్రేమలే

విద్యా వ్వాపార సంతలో
తల్లి తండ్రుల ప్రేమలలో
బాల్యపు కౌమార ప్రేమలే

చదువుల మందిరాన్ని దాటి
పెళ్ళి అనే ప్రేమ మందిరాన్ని చేరి
మనసు మనసుకు అర్పించే ప్రేమలే

అందమైన లోకాన్ని చూసి
మంచి తనం ఆయుధంగా మార్చి
రోబోగా సేవలందిం చే ప్రేమలే


విద్య గురించి నాల్గు వాక్యాల కవిత వ్రాయమనగా నాభావము ఇది

నవ కుసుమిత చూత లతిక
నవ విధ పఠనా నవ నీత
అనునయ కుసుమాల పీఠిక
నిజము తెలుపు వరాల దీపిక

యద వికసిత నవ గీతిక
అతి సులభ అక్షర మాలిక
కవితలపుల మెరుపు గుళిక
దినసరి సరిగమల వెల్లువ

నరముల ఉత్తేజ ఉషోదయ
శుభము తెలుపు నిత్య శుభోదయ
మతి మెరుపు సత్యము భావోదయ
మనసు పరికొలుపు మనోమయ

తనమన భేదము చూపని దయ
మంచి చెడు వెలుగుల  మాయ 
స్మ్రుతి,గతి,మతి, చిరునామాలు ప్రియ
ఒరా ఓరోరా  అనిపించే మదిలో లయ

ఎండకు ఎండి వానకు తడిసిన
మంచులా కరుగక సుస్థిరంగా ఉండిన
పంచభూతాల  అనుకరణ వలన
ప్రకృతి సహకారంతో మనసున ఉండేదే విద్య

--((*))--  hrudayam to uppongina ,