3, సెప్టెంబర్ 2017, ఆదివారం


నాన్న భుజాల నుండి దిగి
నాన్న ఇచ్చిన చాక్లేట్ తిని
కాన్మెంటు బస్సు యెక్కి కదిలే

అమ్మా నాన్న లు పంచే ప్రేమ
అధ్యాపకులు పంచే ప్రేమ
నామనసులో అంతర్గ ప్రేమలే

పుస్తకాల బరువు తగ్గి
లాబ్ టాబ్ బరువు పెరిగి
మెదడంతా చదువుల ప్రేమలే

విద్యా వ్వాపార సంతలో
తల్లి తండ్రుల ప్రేమలలో
బాల్యపు కౌమార ప్రేమలే

చదువుల మందిరాన్ని దాటి
పెళ్ళి అనే ప్రేమ మందిరాన్ని చేరి
మనసు మనసుకు అర్పించే ప్రేమలే

అందమైన లోకాన్ని చూసి
మంచి తనం ఆయుధంగా మార్చి
రోబోగా సేవలందిం చే ప్రేమలే


విద్య గురించి నాల్గు వాక్యాల కవిత వ్రాయమనగా నాభావము ఇది

నవ కుసుమిత చూత లతిక
నవ విధ పఠనా నవ నీత
అనునయ కుసుమాల పీఠిక
నిజము తెలుపు వరాల దీపిక

యద వికసిత నవ గీతిక
అతి సులభ అక్షర మాలిక
కవితలపుల మెరుపు గుళిక
దినసరి సరిగమల వెల్లువ

నరముల ఉత్తేజ ఉషోదయ
శుభము తెలుపు నిత్య శుభోదయ
మతి మెరుపు సత్యము భావోదయ
మనసు పరికొలుపు మనోమయ

తనమన భేదము చూపని దయ
మంచి చెడు వెలుగుల  మాయ 
స్మ్రుతి,గతి,మతి, చిరునామాలు ప్రియ
ఒరా ఓరోరా  అనిపించే మదిలో లయ

ఎండకు ఎండి వానకు తడిసిన
మంచులా కరుగక సుస్థిరంగా ఉండిన
పంచభూతాల  అనుకరణ వలన
ప్రకృతి సహకారంతో మనసున ఉండేదే విద్య

--((*))--  hrudayam to uppongina ,



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి