om sri ram - sri maatrenama:
1. ఓ మనిషీ తెలుసుకో - తెలుసుకొని మసలుకో
జ్ఞానేంద్రియాలు నీవెంట ఉంటాయి
ద్వంద స్థితిలో బ్రతుకుట ఎందుకోయి
ఆశాపాశానికి చిక్కి దురాశకు పోకోయి
శరీర సుఖము కోసం పతనము కాకోయి
ఓ మనిషీ తెలుసుకో - తెలుసుకొని మసలుకో
స్వార్ధ భావముతో బ్రతుకుట ఎందుకోయి
కోరికలో నిజమెంతో తెలుసుకొని మెలగాలోయి
కోరిక ఆనే విత్తు చెడకుండా జాగర్త పడాలోయి
ప్రతి వ్యక్తి ఒక్క నిముషము గమనించాలోయి
ఓ మనిషీ తెలుసుకో - తెలుసుకొని మసలుకో
వయసు మార్పు బట్టి మనిషిగా ఎదగాలోయి
కోరికలనే గొలుసును తెంచి దగ్ధము చేయాలోయి
మనకు వచ్చే మంచి చెడులు బ్రహ్మాసృష్టియేనోయి
ప్రకృతి ననుసరించి శరీర సౌష్టము పెంచాలోయి
ఓ మనిషీ తెలుసుకో - తెలుసుకొని మసలుకో
బ్రహ్మాన్ని తెలుసుకొని అహాన్ని తొలగించుకోయి
నీవు స్వార్ధ పురితమైన పనుల జోలికి పోకోయి
ఏది సత్యము ఏది అసత్యము తెలుసుకోవాలోయి
అంధకారాన్ని తొలగించే సూర్యుడిలా ఉండాలోయి
ఓ మనిషీ తెలుసుకో - తెలుసుకొని మసలుకో
ప్రతి వ్యక్తి ప్రతి క్షణం వ్యర్ధము కాకుండా ఉండాలోయి
బంధనాలు, దు:ఖాలు శాశ్వతము కాదని తెలుసుకోవాలోయి
బుద్ధి వక్రమార్గాన్ని బట్టి తల్లి, తండ్రి, గురువులను దూషించకోయి
కష్టార్జితమే మనసుకు శాంతి సౌభాగ్యము అందునని గమనించవోయి
ఓ మనిషీ తెలుసుకో - తెలుసుకొని మసలుకో
--((*))_-
2. ప్రధాని మోదీ 67 వ పుట్టిన రోజున పురస్కరించుకొని పద కవిత
సత్య ధర్మ నాయకా
భారత రాజ్య పాలకా
కుల మతాల జాతీయత ఏలికా
శక్తి యుక్తి ముక్తి రాజ్య నీతికా
మాటతో ప్రజా హృదయాల చేరికా
సమస్త ప్రజానీకానికి వెలుగు దీపికా
గ్రామ నగర పట్టణాల అభివృద్ధి కీలకా
కార్మిక కర్షక సకల కళా జీవన్ముక్తికా
సకల సమస్య పరిష్కర రాజనీతిజ్నికా
ప్రపంచ దేశాల నాయక ఏకీకృతికా
చైతన్య విద్యా ఆరోగ్య న్యాయ నిర్ధారకా
భారత ప్రజా కర్తవ్య గమ్య పరిపాలకా
ధర్మో రక్షిత రక్షిత: అన్న నాయకా
సమయా సమయ దీక్షా దక్షికా
ఉద్యోగ వ్యాపార ఆర్ధిక పరి రక్షకా
సాంస్కృతిక పరిజ్ఞానాన్ని విశ్వవ్యాప్తికా
సమస్త ప్రజల కష్ట నష్టాల నివృత్తికా
సమస్త కళాభివృద్ధికి దోహద కారికా
సత్య ధర్మ నాయకా
భారత రాజ్య పాలకా
--((*))--
3. ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
మనిషి మనిషికీ మధ్య ఉండు తారతమ్యం
నిత్యా సత్యాలతో తెలిసికొన గలం గమ్యం
వర్తమానంలో ఉంటూ భవిషత్తుకు వేస్తా0గాళం
ఇంద్రియాలను జయించుటకు చేయాలి ప్రయత్నం
స్త్రీ పురుషుని మధ్య ఉండాలి ఏకత్వం
ఏకత్వంలో ఉంది ఇరువురి మధ్య సమానత్వం
సమానత్వంలో ఉంది నిత్య సుఖ మయం
సుఖంలోనే ఉంది వంశాభ్యుదయ లక్ష్యం
ఇరువురి మధ్య ఉద్వేగాన్ని తొలగించేది ప్రేమతత్వం
ఇరువురి మధ్య బేధాలను సృషించేది రాక్షస తత్వం
ప్రకృతి నననుసరించి నడుచుకోవటమే కాల తత్వం
కాలాన్ని అనుసరించి బ్రతికి బ్రతికించటమే మానవత్వం
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--
4. ఓ మనిషీ తెలుసుకో
తెలుసుకొని మసలుకో
లేదు లేదు అనేది ఏదియు లేదు
లేదు అనే పలుకే ఉందని చెపుతుంది అర్ధం
కాదు చేత కానిది ఏదియు లేదు
కాదు అనే పలుకే ఆలోచనను పంచే అర్ధం
అత్యంత రహస్యమనేది ఏదియు లేదు
ఆత్మజ్ఞానమే మొహాన్ని తగ్గించునని అర్ధం
జననము వచ్చాక మరణము తప్పదు
ప్రకృతి ననుసరించి దేశ,దేహ సేవని అర్ధం
సత్యా అసత్యాలు ఏమియు తెలియదు
తెలిసినా అనుకరించిటుకు వీలు కాదని అర్ధం
ఐశ్వర్యం తేజస్సు పెంచేదేదో తెలియదు
సమయాన్ని వ్యర్ధం చేయని జీవుడేనని అర్ధం
అన్నిటీలోకల్లా ఏది శ్రేష్ఠమైనదో తెలియదు
తల్లితండ్రి, దేవుని వాక్కే శ్రేష్టమైనదని అర్ధం
రహస్యమైన విద్య అనేది ఏదియు లేదు
విద్యార్హతపొంది సద్వినియోగం చేయుటలో అర్ధం
నాకు జ్ఞానమనేది లేదని ఎపుడు ఆనవలదు
అహంకార మమకారాలను వదులుటే జ్ఞానార్ధం
విద్య నాకు అబ్బలేదు అని ఎవ్వరు అనవలదు
తల్లి తండ్రి కృషి గతించిన వారి దీవెనలని అర్ధం
ఓ మనిషీ తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))__
5. ఓ మనిషీ తెలుసుకో
తెలుసుకొని మసలుకో
తెలుసుకొని మసలుకో
ఎన్నడు వీడకు ధర్మము
విన్నవి చెప్పిన ఆశలు చూపిన జగతిన్
ఎన్నడు వీడక ధైర్యము
అన్నము కోసము అండగ ఉండుము ప్రగతిన్
ఎవ్వడు నిత్యము పల్కిన
నెవ్వడు నమ్మిన నమ్మక పోయిన జగతిన్
నవ్వక ధర్మము చెప్పుము
మువ్వల శబ్దము చేయుచు హేతువు దెల్పున్
ఎవ్వరి నెవ్వరెరుగుదురు
తవ్విన కొద్దియు నీరును చూచుట జగతిన్
ఎవ్వరి గమ్యము తెల్పరు
దివ్వెగ వెల్తురు చూపుము జీవిత ప్రగతిన్
ఓ మనిషీ తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--తెలుసుకొని మసలుకో
6. ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
సముద్ర కెరటాన్ని చూసి భయ పడకు
తలవంచి నమస్కారము చేయి
నీ నీడను చూసి భయం చెందకు
నీకు రక్షగా కొన్ని ప్రాణాలున్నాయి
ముసురును చూసి భయ మెందుకు
నీకు అండగా కొన్ని శక్తులున్నాయి
కాలమును చూసి కలలెందుకు
సహాయంగా కొన్ని కరములున్నాయి
నీవు చీకటిని చూసి భయ పడకు
వెలుగును చూపే కొన్ని కళ్ళు న్నాయి
అనారోగ్యాన్ని చూసి గుబు లెందుకు
ఆరోగ్యంగా మార్చే కొన్ని మందులున్నాయ్
ధనమును చూసి దిగులెందుకు
దానం చేసి శాంతిపొందుటకు దారులున్నాయి
హక్కు అని వాదనలు ఎందుకు
కొన్ని ప్రాణాలే నీకు స్నేహంగా ఉన్నాయి
నమ్మకము- ఉన్నచోట -తోడూ నీడ- ఉండు
అహం - ఉన్నచోట- అంధకారము- ఉండు
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
7. ఓ మనిషీ తెలుసుకో
తెలుసుకొని మసలుకో
భూమిలో నిక్షేపాలు దాగి ఉండు
నింగిలో శబ్ధాలు దాగి ఉండు
నీటిలో జలచరాలు దాగి ఉండు
అగ్నిలో వెలుగు దాగి ఉండు
ఫలంలో మాధుర్యం దాగి ఉండు
వేలంలో ఐశ్వర్యం దాగి ఉండు
సేవలో చాతుర్యం దాగి చుండు
మాటలో ధర్మబధ్ధం దాగి ఉండు
రాతిలో బంగారం దాగి ఉండు
నాతిలో శృంగారం దాగి ఉండు
నేతిలో జీర్ణ శక్తి దాగి ఉండు
నూతిలో అమృతం దాగి ఉండు
విత్తనంలో తైలం దాగి ఉండు
పెత్తనంలో అహం దాగి ఉండు
ప్రేమలో త్యాగం దాగి ఉండు
చిత్తంలో ఆశయం దాగి ఉండు
హృదయంలో ఆకారం దాగి ఉండు
శృతిమయం లో సంగీతం దాగి ఉండు
పూజలో మన:శాంతి దాగి ఉండు
అతి మొహంలో అనారోగ్య దాగి ఉండు
జ్ఞానము లేని ధర్మం గుడ్డిదై ఉండు
కర్మ లేని ధర్మం కుంటిదై ఉండు
భక్తి లేని జ్ఞానం ప్రాణం లేనిదై ఉండు
మనిషి సమయాన్ని ప్రకృతిని అనుకరించి
సక్రమముగా అనే జీవితము మూడు పువ్వులు
ఆరు కాయలు కలిగి యుండు
ఓ మనిషీ తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి