21, సెప్టెంబర్ 2017, గురువారం

వాహిక -2

om sri ram - sri matrenam:
ప్రాంజలి ప్రభ - వాహిక -2

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో

అజ్ఞానం లోనే ఉంది జ్ఞానం
విజ్ఞానం లోనే ఉంది వైభోగం
వైభోగం లోనే ఉంది అదృష్టం
అదృష్టం లోని ఉంది ఆదర్శం

ఆదర్శం లోనే ఉంది ఆత్మీయం
ఆత్మీయం లోనే ఉంది ఆదాయం
ఆదాయం లోనే ఉంది ఆనందం
ఆనందం లోనే ఉంది అనంతం

అనంతం లోనే ఉంది శబ్దం
శబ్దం లోనే ఉంది భయం
భయం లోనే ఉంది దడ
దడ లోనే ఉంది ప్రాణం


ప్రాణం లోనే ఉంది ప్రేమ
ప్రేమ లోనే ఉంది కామం
కామం లోనే ఉంది మైకం
మైకం లోనే ఉంది జీవం

జీవం లోనే ఉంది మర్మం
మర్మం లోనే ఉంది మాయ 
మాయ లోనే ఉంది చీకటి
చీకిటి లోనే ఉంది సర్వం   

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో

--((**))--

ఓ మనిషి  తెలుసుకో
తెలుసుకొని మసలుకో

కంటికి పదిలం రెప్ప
ఇంటికి పదిలం  బీగం
జంటికి పదిలం రెవిక
వంటికి పదిలం ప్రేమ

వేటకి పదిలం ధైర్యం
కోటకి పదిలం సైన్యం
ఆటకి పదిలం నేస్తాం
మాటకి పదిలం నీతి

వేరుకి పదిలం భూమి
నీరుకి పదిలం చలనం
మేరుకు పదిలం జీవం
నోరుకి పదిలం వాసన

అందానికి పదిలం సరసం
సరసానికి పదిలం విరసం
విరసానికి పదిలం జటిలం
జటిలానికి పదిలం కామం

మోసానికి పదిలం రోషం
రోషానికి పదిలం వైరం
వైరానికి పదిలం వేషం
వేషానికి పదిలం కామం

వియ్యముకి పదిలం బంధం
కయ్యముకి పదిలం మోసం
నెయ్యముకి పదిలం ప్రేమ
దెయ్యముకి పదిలం బోనం          

ఓ మనిషి  తెలుసుకో
తెలుసుకొని మసలుకో
 

--((**))--

ఓ మనిషి తెలుసుకో 
తెలుసుకొని మసలుకో 

నీది అనేది ఏది లేదు లోకంలో
శాంతి దొరికితే చాలని తృప్తిపడు  
నమ్మకంతో బ్రతకాలి లోకంలో 
జరిగింది మంచేనని తృప్తి పడు 

ప్రేమ అనేది గుడ్డిది కాదు లోకంలో 
అర్ధం చేసుకోలేనివాడు గ్రుడ్డివాడౌతాడు 
ప్రేమ ఎవ్వరికి బానిసకాదు లోకంలో 
శక్తి అనే ఓర్పుతో జీవితాన్ని లాగుతాడు 

సూర్య చంద్రులు స్థిర సంచారులు లోకంలో 
ఈజన్మలో వారిని అనుకరించేవాడు మనుష్యుడు
భూమి ఆకాశం ఎప్పటికీ కలవదు లోకంలో
మనిషి మాత్రము వాదనతో కాలాన్ని మరుస్తాడు  

సుఖదు:ఖాలు వెంబడిస్తాయి ఈ లోకంలో 
సమయాసమయాలబట్టి మారాలి మానవుడు 
పాపలు ఎక్కువ పుణ్యాలు తక్కువ ఈ లోకం లో
మనిషిని నమ్మి గౌరవించి బ్రతకమన్నాడు దేవుడు 

ఎవ్వరికి ఎటువంటి ఖర్చు ఉండదు లోకంలో 
వారికున్నదే మనకులేదని ఖర్చులు పెంచుతాడు 
కష్టం మీదవచ్చే సంపాదనతో సుఖపడరులోకంలో 
ఆశయాలు వదలి ఆశకు చిక్కి నలిగి పోతాడు  

ఓ మనిషి తెలుసుకో 
తెలుసుకొని మసలుకో   

--((**))--

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో 

ప్రేమలోనే ఉంది మన:శాంతి 
పనులలోనే ఉంది విజయశాంతి 
మాటలలోనే ఉంది నిత్య క్రాంతి
యవ్వనంలోనే ఉంది సంక్రాంతి 

ప్రేరణలోనే ఉంది సమశ్రుతి
వేసవిలోనే ఉంది చమత్కృతి
కాలములోనే ఉంది సమదృతి 
మనుష్యుల్లోనే ఉంది భేద నీతి

మూర్ఖుల్లోనే ఉంది సర్వచిత్తు 
నవతలోనే ఉంది భవిషత్తు 
కవితలోని ఉంది ఉపనిషత్తు 
వనితలోనే ఉంది విద్యుత్తు

ప్రణయం లోనే ఉంది ప్రళయం
కార్యములోనే ఉంది జీవితం 
భాద్యతలోనే ఉంది బంధం 
ఆశయంలోనే ఉంది అర్ధం 

జీవితార్ధంలోనే ఉంది ప్రారబ్ధం 
ప్రారబ్ధం లోనే ఉంది సేవార్ధం
అర్ధం లోని ఉంది పరమార్ధం 
పరమార్ధంలోనే ఉంది జీవితార్ధం   
    
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో 

--((*))--


ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో 

ప్రేమ కానరాదు  
కనబడేది ప్రేమే కాదు 
ప్రేమలో మర్మం తెలియదు 
ప్రేమను తొలగించుట చేతకాదు   

ప్రేమ ద్వేషింప పడదు 
ప్రేమ కాలాన్ని బట్టి మారదు
ప్రేమ ప్రేమించనివానికి దక్కదు 
ప్రేమ గుడ్డిది కానే కాదు  

హృదయాంతరములో ప్రేమ 
కన్నబిడ్డ నవ్వుల్లో ప్రేమ 
మాతృత్వం లో దాగిన ప్రేమ 
సంఘర్షణ సరిగమ ప్రేమ 


ఓ మనిషి తెలుసుకో

తెలుసుకొని మసలుకో 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి