30, ఏప్రిల్ 2016, శనివారం

Internet Telugu magazine for the month of 5/2016-17


ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం 
సర్వేజనా సుఖినోభవంతు 
image not displayed


(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (17) (date 1-05-2016 to 07-05-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, నా భావ కవితలు,కధలు మరియు అనేకం
...........................................................................................................


1. ప్రమితి (లొంగి పోయే ప్రేమ) 

కన్న తల్లి ఉగ్గు పాలతో
రంగరించి పంచుతుంది ప్రేమ
ఎన్నెన్నో మాటలతో పాటలతో
జోలపాడి నిద్రపుచ్చేది ప్రేమ

ఉన్నత స్వేస్చా భావాలతో
ధర్మ మార్గాన నడిపించేది ప్రేమ
చన్ను పాలు లేక ఆవు పాలతో
బిడ్డ ఆకలి తీర్చేది ప్రేమ

కన్నులో కారం పడిన భాదతో
ఉన్నా బిడ్డ రోదన తగ్గించేది ప్రేమ
తన్నులు కనిపించక మూలుగుతో
తనయుని తపనను తగ్గించేదే ప్రేమ

పన్ను పోటు తెప్పించే మాటలతో
సతాయించే వారున్న బిడ్డపై ఉండు ప్రేమ
అన్నల, అత్తల,  అక్కలు పలుకలతో
కన్న బిడ్డపై తరుణికి పెరిగేది ప్రేమ

అందుకే బంధం  తెగనిది      
సుఖమున్నా భాద్యతలు తరగనివి
పెగుభంధం కష్టాలు ఒర్చుకోమంటుంది
కాల చక్రానికి లొంగిపోతున్నది ప్రేమ 
--((*))--

2. ప్రమితి  (మూగజీవి ఆలాపన )

నామీద  ప్రేమ ఎంతో చూపినావు -
నేనొక మూగ జంతువునై ఉన్నాను కదా
నన్ను మృదువుగా నిమిరావు
నీలో నా తల్లిని ఈరోజు చూసాను కదా

పుట్టిన నాటినుండి పెంచినావు
ఏంతో విశ్వాసము ఉంచినావు కదా
పురిటి మకిలినంతా పూర్తిగా తుడిచావు
నా తల్లి కంటే ఎక్కువ శ్రమపడ్డావు కదా

నన్ను దగ్గర తీసుకొని ముద్దాడినావు
తడబడే అడుగులను సరిచేసి పరుగెత్తావుకదా
పౌష్టి కరమైన ఆహారమును పెట్టావు
అజీర్తి రోగం వచ్చిన మందు ఇచ్చావు కదా

కన్న బిడ్డలా ప్రేమ చూపి పెంచావు
నమ్మకం కల్పించి బ్రతుకును మార్చావుకదా 
మానవుడిగా ఉండి నన్ను పెంచావు
ఈ రోజు నేను నీలో దానవుడ్ని చూసాను కదా

నా విశ్వాసాన్ని నీవు కొల్లగొట్టావు
దయాదాక్షిణ్యం లేకుండా కత్తితో నరికవు కదా
పెంచిన ప్రేమ లేక క్రూరుడిగా మారావు
ఒక్క రోజు తిండికోసం నన్ను బలిచేసావుకదా

ఇన్నాల్లు చూపిన ప్రేమ నాటకంగా మార్చావు
నాపై కూర్మిచూపి ఒక్కరోజుకూరగా మార్చావుకదా
దేవుడా బ్రతికే హక్కు మాకు ఎందుకు లేదందువు
మౌనం వహించావా దేవా మా బాధ గమనించావా

--((*))--


3. ప్రమితి (పకృతి విలయతాండవం)

పకృతి అందం వికృతి రూపం దాల్చింది
భగ భగ మండే సెగలు కమ్ముకుంటున్నాయి 
తరువులు తపన చెంది ఎండుట జరిగింది
సకల ప్రాణులకు భయాలు కమ్ముకుంటున్నాయి

పుడమి తల్లి పురిటిలో భగ్గు మంటున్నది
నీరు ఆవిరిగా మారి సెగలు కమ్ముకుంటున్నాయి     
ప్రజా గుండె ఘోష చెప్పలేక బాధ పడింది
ధరణి భారం పెరిగి తుఫాన్లు కమ్ముకుంటున్నాయి

మమకారం కనుమరుగై వికటాట్ట హసమైనది 
అందరికి భరించరాని కష్టాలు కమ్ముకుంటున్నాయి
వనాలు నీరులేక వడలి పోవటం జరుగుతున్నది
అనురాగం అసలులేక చీకట్లు కమ్ముకుంటున్నాయి

ప్రపంచమంతా కలుషితముతో నిండి పోయింది
పచ్చదనం లేక వెచ్చదనం కమ్ముకుంటున్నాయి
భోగాలకోసం, చల్లదనం కోసం, పోవటమవుతుంది
విద్యుత్ పరికరాలు ఎన్ని ఉన్న వేడి కమ్ముకుంటుంది

--((*))--

4. ప్రమితి (భార్య అలాపన) 

తెరలు చాటు వెలుతురు నాది
కనురెప్పల కదలిక సంబాషణ నాది
వలలో చిక్కిన పావురం మనసునాది
మొండి భర్తకు స్వేస్చ లేని భార్యనై నందుకా

హద్దులు దాటవద్దని నిఖా పెట్టె
ముఖ కవలికలు చూపవద్దని షరతు పెట్టె   
మౌన సంభాషణలే అని నోటికి తాళం పెట్టె
మొండి భర్తకు స్వేస్చ లేని భార్యనై నందుకా

ప్రక్కన చేరి పలకరింపు చూపు చూసిన తప్పే
అనేకత్వంలో పోక ఎకత్వములో  ఉన్నా తప్పే
ఓం శ్రీ రామ్, ఓం శ్రీ రామ్ అనుట కూడా తప్పే
ఎవరిని పిలుస్తున్నావని చీదరించె భర్త భార్తేనా    

పత్రిక చదివితే పరుష వాక్యాలు నేర్చు ఉంటావ్ 
టి .వి.అందని వన్నె తెచ్చేవి కావలిని కోరుకుంటావ్
సినమా చూస్తె నామేదే తిరగబడి యుద్ధం చేస్తావ్
నిబంధణలు పెట్టె భర్తకు భార్యగా ఉండుత సమంజసమా

ఆణువణువూ అనుమానంతో వేదిస్తావ్
మంచిగా మాట్లాడిన తప్పు  పడతావ్     
సాంప్రదాయానికి బద్ధులై ఉండాలంటావ్
గౌరవించలేని భర్తతో ఉండుట నిజమేనా
 
మంగళ సూత్రమ్ విలువ తెలియని వాడిటో
మృగానికి మనిషికి తేడా తెలియని వాడితో  
నడమంత్రపు సిరికోసం భార్యనే పొమ్మనేవాడితో
అది కాపురమా, దిక్కులేనివాడికి దేముడే దిక్కి
వస్తా వెళ్ళొస్తా ఇకరాను, నీవు కుక్కల చింపిన
బతుకుతావ్ , నీఖర్మా ఇక వస్తా, వెళ్లి రాను     
--((*))-- 

 
 
5. ఫోటో బట్టి వానరుల ముద్దుల పై నా కవిత

సభ్యత లేని సమాజంలో ఒక అసభ్యమా
కళ్ళువళ్ళు కంపించి నాట్యమాడడటం కన్నానా
సమయ సందర్బాలలో ఒక అసౌఖ్యమా
వళ్ళు వనికిన్చేవిదంగాఉండే శృంగారం కన్నానా

దిగజారి పోతున్నా ఒక సాంప్రదాయమా
బహిరంగ ప్రదేశాల్లో సిగ్గులేని ముద్దులు కన్నానా
మనుష్యులలో జంతువుల ప్రయత్నమా
సిరి కోసం సీఘ్రంగా శరీరం పంచె  అద్దేకన్నానా

అడవులు నరకటం వళ్ళ దాహానికి వస్తున్నామా
మానవుల బహిరంగ బుద్దులు కమ్ముకుంటున్నాయా
ఏది ఏమైనా మనుష్యుల వ్యసనాలు మనకోస్తున్నాయా
మనజాతి వీరుని ఆరాధించి విధముగా ఉండాలి కదా
 --((*))--

6. పస్థానం (మాట్లాడు )

వేదాలు ఉపయోగాన్ని బట్టి
గ్రంధాలు చదవ టాన్ని బట్టి
పదాలు వ్రాయ టాన్ని  బట్టి
మాటలు పొందికగా మాట్లాడు

కళల సౌరభాన్ని బట్టి
కలల సారాంశాన్ని బట్టి
తలల తారతమ్యాన్ని బట్టి
తరతమ బేధం చూసి మాట్లాడు  

వ్యాధులు వివరాన్ని బట్టి
స్వామీల విశేషాన్ని బట్టి
హమీల తలపుల్ని బట్టి
మనసు నొప్పించక మాట్లాడు

కార్యాల అవసరాన్ని బట్టి
చర్యల చేష్టల ను బట్టి
సిరుల వినయాన్ని బట్టి
సరిగమ అర్ధంతో మాట్లాడు

స్త్రీ పురుషుల వాక్కు బట్టి
పురుష, స్రీల వాక్కు బట్టి         
సమయాసమయాలను బట్టి
సమస్యలు రాని మాటమాట్లాడు

ప్రక్రుతి వికృతి గమనాన్ని బట్టి
అకృతి అణాకృతి ఆహ్లాదాన్ని బట్టి
స్వీకృతి పరాకృతి భావాల్ని బట్టి
మనస్సు అమస్సు కాకుండా మాట్లాడు
--((*))--

7. ప్రమితి  (ఆంక్షలు )

మలుపు లుంటే తలపు లుండవు
తలపు లుంటే అలక లుండవు
అలక లుంటే  తగువు లుండవు
తగువు లుంటే కత మలుపే ఉండు

కోర్కలు ఉంటే ఆశయాలు ఉండవు
ఆశయాలు ఉంటే పశ్నలు ఉండవు
ప్రశ్నలు ఉంటే జవాబులే ఉండవు
జవాబులే ఉంటే కత ఆశలే ఉండు

నడక లుంటే నవ్వు లుండవు
నవ్వులు ఉంటే కారణా లుండవు
కారణాలు ఉంటే ఇష్టా  లుండవు
ఇష్టాలు ఉంటే  కత నడకే ఉండు

ఎల్లలు ఉంటే  ద్వారాలు ఉండవు            
ద్వారాలు ఉంటే భయాలు ఉండవు
భయాలు ఉంటే భావాలు ఉండవు
భావాలు ఉంటే కధకు ఆంక్ష ఉండు

--((*))--

8. కంద  గుళిక

ఒక్క  నిముషం ఆలస్యం
ఎక్కాలనుకున్న విమానం ఉండదు
ముక్క సుబ్రత నిర్లక్షం
ఎక్కసం వచ్చి కక్కు రాక మానదు

వక్క పలుకు లక్ష్యం
తోక్కు తిన్నది అరుగుటే ముఖ్యం
అక్క పలుకు ధ్యేయం
చక్కని సంసారం ఇంటికి మణిదీపం

ఎక్కాలను కున్న ఎక్క లేవు
అక్కరకు రాని చట్టం అడ్డు పడితే
కక్కాలను కున్నా కక్కవు
చక్కని మాటకు మనసు చల్ల బడితే

చెక్కిన శిల్పాలు ఎన్ని ఉన్నా     
చక్కని రూపంతో ఆకర్షించుట మిన్నా
నొక్కులు పుత్తడికి ఎన్ని ఉన్నా
చుక్కలాంటి అందాన్ని పెంచుటే మిన్నా    

వక్కాణించి చెపుతున్నా
నక్క బుద్ధులు కట్టి బెట్టి మాట్లాడు
ఒక్క మాట చెపుతున్నా
చుక్క మాని సుఖపెట్టి సుఖపడు

 --((*))--

     9. ప్రమితి (ఎన్నాళ్ళు) 

కన్నిటికి వీడ్కోలు లేదా
విరహంతో ఉండాలి ఎన్నాళ్ళు
కోర్క తీర దారి లేదా
కలలో స్వరాలు ఇంకా ఎన్నాళ్ళు

కాగడా వెలుగు సరిపోలేదా
పరువాల వాసనలు ఇంకా ఎన్నాళ్ళు  
హరివిల్లు రంగులు చూడలేదా
ముద్దుల మురిపాలు ఇంకా ఎన్నాళ్ళు

కంటి పాప అలుక చూడలేదా
నవ్వుల ముచ్చట్లు ఇంకా ఎన్నాళ్ళు
తాపానికి తగు ఒదార్పు లేదా   
ఓర్పుతో ప్రార్ధనలు ఇంకా ఎన్నాళ్ళు

మాధవా రాధ ప్రార్ధణ వినలేదా
ఉడికించి వేడుక చూచుట ఇంకా ఎన్నాళ్ళు
రాధగానామృతానికి విందు లేదా
ఉంది ఓర్పుతో మాధవునిపే ప్రేమ ఉన్ననాళ్ళు

--((*))--


*10. ప్రమితి  (పువ్వులు )

పువ్వుకు మాలి అవసరం
పువ్వులు దేవుని పాదాలు చేరుట వరం
పువ్వులు సిగలో చేరి నలుగుట మరోవరం
పువ్వులు మకరందాన్ని పంచుటే దేవుని వరం

పువ్వుల సుఘందాన్ని గ్రోలే మాలి
పువ్వులను డేగ కళ్ళతో చేసే మాలి
పువ్వును పరీక్షకు పంపే మరో మాలి
పువ్వును నలిపి అగ్నికి ఆహుతి చేసే మాలి

పువ్వులు మృగ తృష్ణ కు బలి
పువ్వులు శీల పరీక్షకు నలిగి 
పువ్వులు సుఖభరితాలకు నాంది 
పువ్వులు తుమ్మెదలకు సిరి

పువ్వులకు స్వతంత్రం చాలు
పువ్వులు గాలికి  బానిసలు
పువ్వులు అన్ని దశలు సుఘందాలు 
పువ్వులకు ఉంటాయి మౌన రోదనలు

పువ్వులను రక్షించే తోటమాలి కోసం
పువ్వులు ఆశలకు నలగ కుండుట కోసం 
పువ్వులు నిత్యం నవ్వినవ్వించటం  కోసం
పువ్వులు సుఖపడి సుఖపెట్టడం కోసమే కదా 
  --((*))--

11. ప్రమితి (ఎలా చెపుతాం) 

చిరునవ్వు అందం ఇంతని ఎలా చెపుతాం
నవ్వు అందుకే అది మనస్సు ఉల్లాసపరిచే ఆయుధం
నవ్వితే నవరత్నాలు రాలునని ఎలచెపుతాం
నవ్వుల్లో అందుకే  కనిపించు నవ్య భావాల వసంతం

నవ్వలేనిది జంతువు మాత్రమని ఎలా చెపుతాం
నవ్వు కళ్ళతో గుండె హత్తు కొనే జంతు ముఖారవిందం
నవ్వులు మనస్సుకే వెలుగులని ఎలా చెపుతాం
హితకరమైన గుండెకు పెదవుల నవ్వే హాస్య భరితం

లేత చిరునవ్వు జీవకళ అని ఎలా ఎలా చెపుతాం
ముగ్దమొహనరూప మోనాలిసా నవ్వుచూపె చిత్రసౌరాభం
ప్రేమాతో ద:ఖాన్ని పోగొట్టేవినవ్వులే అని ఎలాచెపుతాం
పువ్వులవలె ప్రేమ రసమాధుర్యం చూపెది స్త్రీ హృదయం

నవ్వు కళ్ళ కదలికల్లో కనిపిస్తుందని ఎలా చెపుతాం
ఆరోగ్యకరమైన చూపు ఆహ్లాదాన్ని పంచుతుందని ఆంతర్యం
నవ్వితే మానసిక రుగ్మతులు పోతాయని ఎలా చెపుతాం
మనస్సంతా దర హాసంతో ఉండి మందు ఇస్తే అదే అమృతం

చిరునవ్వు చిద్విలాసం మంత్రం అని ఎలా చెపుతాం
నిస్సహాయతలో ఆనదాన్నిపంచే నవ్వే దేవుడిచ్చిన వరం
మనిషికి నవ్వు నాలువిదాల చేటు అని ఎలా చెపుతాం      
మాటకన్నా మందహాసంతో నవ్విస్తే తొలగు హృదయతాపం

--((*))--


23, ఏప్రిల్ 2016, శనివారం

Internet Telugu magazine for the month of 4/2016-16

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం 
సర్వేజనా సుఖినోభవంతు 
Looking Beyond Ourselves and seeing the beauty in all things, Realizing we are all connected. Is pure Magic.


(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (15) (date 16-04-2016 to 22-04-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, నా భావ కవితలు,కధలు మరియు అనేకం
...........................................................................................................1. ప్రస్థానం ( స్పందన )

సాహిత్యం అంటే సహనం నుండి వచ్చేది
అనుభవాల అక్షర సత్యాలను తెలిపేది
కవి హృదయం అర్ధం చేసుకోవటం ఎలా చెప్పేది
పదానికి అర్ధాలు ఎన్నో, అర్ధం కానివారికి ఎం చెప్పెది

వనంలోకి ప్రేమికులు రావద్దంటే ఆగుతారా
ఇది జంతు సాహిత్యం చదవద్దంటే ఆగుతారా
మనుష్యులకంటే జంతువులే మేలని తెలియదా
భావాన్ని అర్ధం చేసుకోలేనివారికి బూతు అంటే ఎలా

ఉత్తమ సాహిత్యాన్ని ఆదరించటం అందరి కర్తవ్యం
మనో నిగ్రహశక్తి పెంచేది, ఆలోచిన్పచేసేది కవిత్వం
సరస్వతీ పుత్రులను విమర్సించటం అవివేకం
మనలోలేనిది ఇతరుల్లో ఉన్నది గ్రహించటమే వివేకం    


--((*))-- 

2. ప్రస్థానం ( ప్రేమ )

లేదనకు నా మీద ప్రేమ
కాలమునకు లోబడి ప్రేమించాను
మనసుకు తట్టే మనోహర ప్రేమ
గంధపు గుబాళింపులతో ప్రేమించాను

నాది సమ న్యాయముగల ప్రేమ
మనకు సమస్యలుండవని ప్రేమించాను
మౌన మనస్సుతో పొందే ప్రేమ
మనసు మనసు కలవాలని ప్రేమించాను

ఘడియ ఘడియకు మారదు ప్రేమ
గగనంలా విస్తరించి పృద్విలా ప్రేమించాను
మరువ లేకున్నా మమతల ప్రేమ
మనమధ్య బలం ప్రేగాలని ప్రేమిస్తున్నాను   
--((*))--

3. ప్రస్థానం ( తోడులేని ప్రేమ )

జాబిల్లి నన్నుచూసి ఆసహ్యంగా నవ్వుతున్నాడు
మలయ మారుతం నా దగ్గరకు  రానంటున్నాడు
మత్తెక్కించే మరులుగొలిపే వేణుగానం లేదన్నాడు
పరిమళాలు వెదజల్లే పుష్పాలు వెక్కిరిస్తున్నాయి

నా ఊహల సప్తస్వరాలు నన్ను విడిచి పోయినాయి
సొగసు రెక్కలు విప్పారినమల్లెలు ముడుచుకున్నాయి  
మధురరాత్రుల సవ్వడులు మనసుకు తాకనంటున్నాయి
నా తనువులో ఉన్న ఊహలు ఆవిరులై బిందువులైనాయి
    
మనసు నీతో సరాగాలకై ఆరాటపడుతున్నా ఫలితమేది
వయసు వేధింపులకు బ్రహ్మచర్యమే నాకు శుభమైనది  
మనోనిగ్రహ శక్తితో వెచి ఉండుటే నాకు శ్రేయస్కరమైనది
ఎంత ఆలస్యమైనా ఓర్పు వహిస్తే అంతా ఆనందమయమే    
--((*))--

4. ప్రష్థానం (కధనం )

పురా సాహిత్య సహకారం
భాషా నైపుణ్యానికి శ్రీకారం
నవ నవాభ్యుదయ చరితం
కలియుగ కావ్య నాందిప్రస్తానం

లలిత సరళ పదాల తోరణం
రచనా చమత్కార వచనం
జీవిత వర్ణన బహుసులభం
మనస్సు తెలియుట గ్రాహ్యం

పదవిభజనే మూలవ్యాకరణం
ఇటికె ముడి సరుకుల మయం
అలంకారం ఆకర్షనకు చిహ్నం
నగిషి కోప్పతనానికి ఒక వరం

రక్త మాంసాదులతో ఉండేది దేహం
ధర్మా ధర్మాదులను తెలిపేది వాక్యం
మనసు పరి తపించేదే మూలభావం
గుండెచప్పుడుఉంటెనే మనిషికి ప్రాణం

జల, సాకామ్బర మేలికలయక రసం
సుఖదు:ఖాల జీవిత సమరమే కావ్యం
మనసుకు ఉల్లాస పరిచేది హృద్యం
సంఘటనల పరిమళం కధా కధనం

--((*))--
5. ప్రస్థానం (వస్తే )

అక్షరాలకు రెక్కలు వస్తే
దిక్కులు లేని గమ్యాలుగా మారుతాయి
సంకల్పాలకు బలం వస్తే
ఆశల సీతాకోక చిలుకలు ఎగురుతాయి

నిశ్శబ్దానికి కన్నీళ్ళు వస్తే
కళ్ళలోని మధురస్వప్నాలు కరుగుతాయి
ఓదార్పులో మౌనం వహిస్తే
నిరాశ, నిస్పృహలు కమ్ము కుంటాయి

కోరికలే గుర్రాలై వెంబడిస్తే
మస్తిష్కంలోని పుస్తకాలు వేడెక్కుతాయి
కావ్యాలకే మరణం వస్తే
జీవితాలన్నీ తిరగబడి చిక్కు కుంటాయి

జ్ఞాపకాలకు నీల్లొదిలేస్తే
నవ్వుల వెలుగులు దూరమవుతాయి
సంకెళ్ళకే ఎడబాటువస్తే
చీకటి రాత్రులు నరకంగా మారుతాయి

--((*))--


6. పస్థానం (ప్రయత్నం)

ముఖారవిందం మెరుపులా ప్రయత్నం
మా సుఖసంసారం తృప్తే నాకు ఫలితం

నా తనువుల తపనలు నిత్య సుగంధం
నా గాత్రం నిత్యం స్వస్చసుమధుర స్వరం

నా మనసే నేను విన్న వేదాంతాల సంగ్రహం 
నా గమనం నా సేవ నిత్య ధర్మభోదే నామార్గం

విషయ సుఖం, ద్వందాలు, మానవ జన్మకు సహజం
ఆశలు మంచు లాంటివి,  అయినా వదలను విశ్వాసం   

నిత్యమూ పూసే పువ్వులాంటి కవితా పదాలే ముఖ్యం
నామనసును బట్టి ఆరాదిన్చుటే నాముందున్న కర్తవ్యం  
--((*))--

7. ప్రష్థానం (కధనం )

పురా సాహిత్య సహకారం
భాషా నైపుణ్యానికి శ్రీకారం
నవ నవాభ్యుదయ చరితం
కలియుగ కావ్య నాందిప్రస్తానం

లలిత సరళ పదాల తోరణం
రచనా చమత్కార వచనం
జీవిత వర్ణన బహుసులభం
మనస్సు తెలియుట గ్రాహ్యం

పదవిభజనే మూలవ్యాకరణం
ఇటికె ముడి సరుకుల మయం
అలంకారం ఆకర్షనకు చిహ్నం
నగిషి కోప్పతనానికి ఒక వరం

రక్త మాంసాదులతో ఉండేది దేహం
ధర్మా ధర్మాదులను తెలిపేది వాక్యం
మనసు పరి తపించేదే మూలభావం
గుండెచప్పుడుఉంటెనే మనిషికి ప్రాణం

జల, సాకామ్బర మేలికలయక రసం
సుఖదు:ఖాల జీవిత సమరమే కావ్యం
మనసుకు ఉల్లాస పరిచేది హృద్యం
సంఘటనల పరిమళం కధా కధనం
--((*))--8. ప్రస్థానం (ఒకరికొకరు)

నీ నవ్వు నాకు - నా నవ్వు నీకు
నువ్వే నేను - నేనే నువ్వు
నువ్వు నేను - నేను నువ్వు
నేనైనా నువ్వు - నువ్వైనా నేను
ముందు నువ్వు - వెనుక నేను
వెనుక నువ్వు - ముందు నేను
ఎండకు తోడు నీడ - నీడకు తోడూ ఎండ
నాకు తోడు నీవు - నీకు తోడు నేను
ఎండకు గొడుగు నవుతా - నేను దప్పిక తీరుస్తా
మండేగుండెను చల్లబరుస్తా - ఎండిన గుండెను బ్రతికిస్తా
చమట పట్టకుండా చూస్తా - మంచులా చల్లదనం అందిస్తా
గాలితో బ్రమింప చేస్తా - మనసు నే చల్ల బరుస్తా
ఎండకు వళ్ళు పేలుతుండే - పౌడర్ నై సహకరిస్తా
కోపం వస్తే -మీ పిచ్చి కవిత్వం మీకె వినిపిస్తా
--((*))--

9. ప్రస్థానం (నేడు - రేపు )

నేటి ఆహ్వానం  - రేపటి ఆశా వాదం
నేటి మొగ్గల తలపు - రేపటి పువ్వుల వలపు
నేటి ఊసర క్షేత్రం - రేపటి పులకించిన పంట
నేటి పాల కంకి - రేపటి నవ్వించే గింజల కంకి
నేటి విద్యార్ధి - రేపటి భావి పౌరుడు
నేటి సెలయేరు - రేపటికి విస్తరించిన తరంగణి 
నేటి క్షోభితలోకం - రేపటికి స్వర్గ లోకం
నేటి రాత్రి తిమిరం - రేపటి ఉదయం ఉషోదయం
నేటి పరిణామం - రేపటికి అదే రమనీయమ్
నేటి వివాహం  - రేపటికి సంతోష నిలయం
నేటి ధర్మ మార్గం - రేపటికి సుఖ మార్గం
నేటి ప్రేమ మయం - రేపటికి ఆనంద వలయం
నేటి దైవ ప్రార్ధన - రేపటికి మనస్సే ప్రాశాంతం
 --((*))--

10. ప్ర్రస్థానం (సంప్రదాయం )

వదలకు మన సంప్రదాయం
అది పూర్వ సంస్కృతీ ప్రితిబింబం
నిర్విరామ కృషికి తార్కాణం
అకుంటిత దీక్షకు  ఆయుధం
సృజన నడ వడికి నిదర్సనం
భవిషత్  నిర్మాణానికి ఇది సోపానం
పరమాత్మ దర్సన ధర్మ మార్గం
వంశ చరిత్రకు ఇది  ప్రభంధం
ఐక్య మత్యమునకు ఇది దీపం
సత్య సీల సంపదల సుకృతం
ఐహిక బంధాలకు కారణం
సంప్రదాయమే దేశాభ్యుదయం
దేశాభ్యుదయానికి దశానిర్దేశికం 

--((*))--

11. ప్రస్థానం (ఊహలు )

ఊహలు అతీతాలు
పొరలు, తెరలు, ఆగని కెరటాలు
వెంబడిస్తున్న జ్ఞాపకాలు
మనము అందుకోలేని నిధులు

వెంబడిస్తున్న ఆశలు
దిగులునిపెంచే వికసించని మొగ్గలు
శ్రమించినా రాని జయాలు
భవిషత్తులో  వచ్చే విజయాలు

శిశిరంలో రాలే ఆకులు
వయసులో వచ్చే తీరని కోర్కలు
రంగు లద్దిన కళా చిత్రాలు
మనిషి జీవిత జ్ఞాపక చిహ్నాలు
 
కాలాన్ని బట్టి మారే రూపాలు
గుణాన్ని బట్టిమారే కొందరి జీవితాలు
మనలో మరుపు చూస్తారు లోకులు
కుటుంబాలే కాలాన్ని బట్టి కదిలే చక్రాలు

--((*))--

16, ఏప్రిల్ 2016, శనివారం

Internet Telugu magazine for the month of 4/2016-15ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ 
A great site for retro stationary:  
సర్వేజనా సుఖినోభవంతు (చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (15) (date 16-04-2016 to 22-04-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, నా భావ కవితలు,కధలు మరియు అనేకం
...........................................................................................................1. ప్రస్థానం (నిగ్రహ శక్తి) 

మనసు సూణ్యం ఉన్నా
అలల అలికిడి ఆలకిస్తున్నా
వంటరి తనాన్ని మరవాలని కున్నా
అర్ణవుడిని ఆరాధిస్తూ పిలుస్తున్నా

తరంగాలు తపన పెడుతున్నా
కెరటాలు మౌనం చేదిస్తున్నా   
శబ్దాలతో కాలాన్ని మింగేస్తున్నా
సాగర తీరాన్ని ఆలింగనం చేసుకుంటున్నా

చీకట్లో జాబిల్లి వెన్నెల పంచుతున్నా
పెదవుల పలుకులు తెలపాలని ఉన్నా  
మనస్సులోనిఘర్షణలు తెలుపాలనుకున్నా
కడలి కరుణించాలని అనుకోని ఇక్కడే  ఉన్నా 

నిరాశా, అశ్రువులతో నేను ఉన్నా
నన్ను నీలో నిమజ్జనం చేసుకోవాలన్నా
ధర్మం అడ్డు పడుతుంది, కోరిక చావద్దంటుంది
సంద్రమా నిగ్రహశక్తి ఇవ్వమని కోరుతున్నా
   --((*))--

 
2. ప్రస్థానం (రతి) 

రావద్దా నేను లోనికి
రాక రాక వచ్చాను నన్ను రమ్మనవా
రాస్తున్నా ఒక చేరిత్రను
రావద్దు కాదిది వేళ

రాకుంటే నీ మనసు నడవదు
రావద్దంటే నీ కలము కదలదు
రాను నీ కలలోకి కూడా రావద్దంటావా   
రానులే నికాలము ఎలా కదులుతుందో

రాటు తేలిఉన్నాను
రాపిడికి లొంగే వాడిని కాను
రాజరికపు ఎత్తులు చూపకు
రాసలీలలు నావద్ద పనిచేయవు

రా రా కన్నులలో వసంతాలు
రా నీకు మనమద్య నీలి నీడలు
రారా నా గుస గుసలు వినిపిస్తా  
రాత్రి ఉండిపో రంజుగా సుఖం అందిస్తా

రాకు కదలిపోవు ఆశాసౌధములు
రాకు కూలు నా గాలి మేడలు
రాకు మారు నా ఆలోచనా మార్గాలు
రానులే నీమనసు నాదగ్గరున్నప్పుడు

రాయలేను మనసు నీదైనప్పుడు
రా కూర్చో నీ రూప లావన్యంతో
రాసి కవిత నీకు అందిస్తా
రాత్రి, పగలు నాతో సహకరించు 
       
--((*))--

3. ప్రస్థానం (భయం వదలండి )

తుచ్చులు, నీచులు పెరిగే
మనసు, మనసు నలిగే
పాపులు, క్రూరులు పెరిగే
మమత, మానవతా నలిగే

పచ్చగా ఉంటె పక్కలో బల్లెంగా 
చక్కగా ఉండే మనుష్యులకే కళ్ళెంగా 
మతాల మద్య పెట్టెను వైరం
కులాల మద్య పెట్టెను ద్వేషం

వికృత చేష్టల భీపత్యం తో
సిగ్గులేని వెకిలి తనం తో
మానవమృగాల తాండవం తో
విషం విరజిమ్ముతున్న వయనం

తుచ్చులు, నీచులు పెరిగే
పాపులు, క్రూరులు పెరిగే

ఆకలి అంటూ చేసే దుర్మార్గం
చీకటి అంటూ చేసే మారణహోమం
ప్రజల జీవనానికే తెచ్చెను భయం
ప్రపంచ మంతా శాంతికి లోపం
   
శ్లో !! గుణవంతా: క్లిశ్యంతే ప్రాయేణ పరవేదనాం!
బంధన మాయాంతి సుకా: యదేష్ట సంచారినా: కాకా :!!

మంచివారికే కష్టాలు అధికం. దుర్మార్గులకు ఎప్పుడూ సుఖమే,
ఎలాగంటే  మాటలు నేర్చిన చిలకను పంజరంలో భందిస్తారు.
 ఏ విలువలేని కాకులు మాత్రం స్వేచ్ఛా విహారం  చెస్తూ ఉంటాయి. 
   
ఐక్య మత్యంగా నడవండి - దుర్మార్గాన్ని ప్రతిఘటించండి


  
4. ప్రస్థానం ( ఉంటె )
(భార్య భర్తలు దగ్గరగా ఉంటె)
 
వయసు నడుస్తూ ఉంటె
చుక్కలు పొడుస్తూ ఉంటె
మాటల్లోని మృదుత్వం కనబడు తుంటె 
మక్కువ తీర్చ మంటం తప్పా 

మనస్సు ఊహల్లో ఉంటె
తేజస్సు కలుద్దామని ఉంటె
కన్నులలోని చల్లదనం ఉంటె  
మక్కువతో ముద్దివ్వ మంటం తప్పా 

కోకిల గానం వింటూ ఉంటె 
పగడాల చిగురాకు రమ్మంటె
తపనలోని తియ్యదనం ఉంటె
మక్కువ తక్కువ చేయద్దంటె తప్పా

వయ్యారి సిగ్గుతో ఉంటె
పరువం పిలుస్తూ ఉంటె  
నవ్వులో  మెత్తదనం.ఉంటె
మక్కువ తీర్చమనటం తప్పా

కలలు తీర్చాలని ఉంటె
వసతులకై వేచి ఉంటె
తలపుల్లో పున్నమి ఉంటె
ఆధునిక వస్త్రాలు వేసుకోమనటం తప్పా

అందాలను పంచాలనుకుంటె
వెన్నెల విస్తరేసి ఉంటె
నిద్ర ఎందుకు స్మృతులు తెలిపె
ఈ హృదయం దగ్గర ఉంటె
అందుకోవా ఈ వెచ్చని కౌగిలిని
--((*))--5. ప్రస్థానం (అదే జీవితం) 

మనసు మాట చెప్పుట
చెప్పిన మాట వినుట
విన్న మాట ఆచరించుట
అదే అనుభూతుల సమాహారం

అనుభవాన్ని నలుగురుకి పంచుట
కొత్త విషయాలను సేకరింఛి చెప్పుట
అందరి శ్రమ సమానముగా చూచుట  
అదే అనుభవాల కోశాగారం

స్నేహితులను ఆదరించుట
గురువులను, పెద్దలను, ఆదరించుట
దేశంలో ఉన్నా అందరిని ఆదరించుట
అదే బంధాల భాండాగారం 

నేర్చుకున్న విద్యపై దృడపడుట
అధిర్యపడక ధైర్యముగా ఉండుట 
నమ్మకముతో జీవితాన్ని సాగించుట 
అదే భవిష్యత్తు పై అనురాగం,

తాహతుకు మించి బతకాలను కొనుట
గొప్పవారవ్వాలని అతిగా శ్రమించుట
అదృష్టం కోసం ఉన్నది వదులుకొనుట   
అదే అంతులేని ఆశావహం,

చిన్న విషయాలకే కోపం తెచ్చుకొనుట
మాట మాట చెపుతున్నవని ఎగిరిపడుట
బలహీనతను చెప్పినందుకు కోపించుట
అదే అవధి లేని ఆక్రోశం
--((*))--


6. మన బ్రతుకులు

సలహాల తప్పులు, ప్రవర్తనల కాట్లు
భావాల చిచ్చులు తేస్తాయి చీకట్లు
ఒకరి కొకరి మద్య ద్వేషాలతో ఇక్కట్లు
ఔదార్యం కనబడక వచ్చు శిగపట్లు

నైతికత్వం అర్ధం చేసుకోలేని చోట్లు
సౌభాతృత్వం ఉన్న చోట ముచ్చట్లు
చరిత్ర గుర్తించని కొందరి బీదలపాట్లు
మహిళల మద్య తగువు తీర్చలేక చీవాట్లు
 
సహజత్వం లోపించింది కొన్ని చోట్లు
దుర్మార్గుల మాటలే  ప్రశాంతికి చోట్లు 
ప్రశాంతత కరువైంది అన్నీ చోట్ల
మన బ్రతుకులను ఆదుకోనే దెట్లు
--((*))-- 

7. ప్రస్థానం (తాత మనవడు)

ఆకాశం దూరం ఏంతో చెపుతావా తాత
మనవడా చేయి చాపి ఎగిరినా అంద నంత దూరం 

రాత్రి చుక్కలు అందుకోవాలని ఉంది  తాత
మనవాడా పక్షిలా ఎగిరినా అంద నంత దూరం

చంద్రుడిలో మచ్చ తాకాలని ఉంది తాత
మనవడా అద్దంలో తాకు అదితాకాలంటే చాలా దూరం

మేఘాలు ఎక్కి తిరగాలని ఉంది తాత
మనవడా నీవు ఎక్కాలనుకున్నా అవి ఆగనంత దూరం 

నేను మనసుతో  పోవాలని ఉంది తాత
మనవడా కలతో చేరుకో  తెలుసు కోలేనంత దూరం

ఊహలకు ఎలా రెక్కలు వస్తాయి తాత
మనవడా ఆశయాలు, ఆశలు, మారణంత దూరం 
--((*))--   


5వ భాగం 
మ. మ . త  (పెద్దలకు మాత్రమే )
మనసు మనసు తరుణామృతం   - శృంగార సాహిత్య వచన కావ్యం"రామ్ తాతా " నేను అడిగిన దానికి ఇంకా చెప్పలేదు, ఆప్పుడే రాజ సభలోకి జాలరుడు వచ్చి ఈవిధముగా చెప్పాడు  నేను సముద్రముపైకి వేటకు వెళ్ళినప్పుడు, ఎప్పటిలాగా వల వేసినాను, ఆ వలలో నాకు అద్భుతమైన చాప పడింది, అది నా  అదృష్టమని భావించి ఇంటికి తీసుకెల్లి కూర వండ మనగా, ఆ చేప పొట్టల ఈ విలువైన ఉంగరము ఉన్నది మహారాజ, ఇది రాజులకు చెందినది అని భావించి, మీ వద్దకు తెచ్చాను స్వీకరించండి అని, రాజు  దగ్గర ఉంచి వినయముగా ప్రక్కకు తోలి గాడు జాలరుడు. ఆ ఉంగరము చూసిన వెంటనే గతస్మ్రుతులు వెంబడించి నిండు సభలో తన తప్పును అందరిముందు వప్పుకొని శకుంతలను భార్యగా  స్వీకరించాడు. ఇదేనమ్మ క్లుప్తముగా కధ నీకు చెప్పాను ఈకధలొ ముఖ్యంగా నేరాలు చేసిన వారికి శిక్షలు విదించే  అధికారం న్యాయస్థానానికే ఉంటుంది. అయితే అపరాదులు ఎవరు, నిరపరాదులు ఎవరు  అని తగిన విచారణ చేసిన తర్వాతనే న్యాయమూర్తి శిక్షను ఖరారుచేస్తారు. నేర నిర్ధారణకు సాక్షుల వాంగ్మూలం చాలా ముఖ్యం.  వ్యక్తులు చూడనప్పుడు తప్పు చేసినవారు, సాక్ష్యం చెప్పేవారు, ఎవరూ లేరు, కాబట్టి నాకు శిక్ష పడద నీ అనుకుంటారు.  కానీ చేసే పుణ్య-పాపకర్మలకు అంతస్సాక్షులు ఉంటారని తెలుసుకోవాలి,  తప్పు అనేది ఎప్పటికి చేయకూడదు అని  నేను నీకు చెప్పు తున్నది, రాం  తాత ఈరోజు సూర్యుడు అస్తమించే సమయము అవుతున్నది, చీకటిని పిలుస్తున్నది, నేను త్వరగా ఇంటికి పోవాలి, రేపు మల్లా కలుసుకొని  చక్కని మంచి మాటలు చెప్పుకొని సంతోష జ్ఞానాన్ని పొందుతాను 
  మంచిది నేను కాస్త విశ్రాంతి తీసుకొంటాను. ఆమాటలు విని తిరుగు మొఖం పట్టింది మమత .     
అలా ఇంటికి చేరింది మమత, తల్లి సరస్వతి  చాలా కోపముగా నీవు ఎక్కడకు పోయావు, ఇంతసేపు ఎం చేసావు అని అడిగింది, అమ్మ నేను వనమునకు పోయాను "రామ్ తాత" కలిసాను కధలు చెపుతుంటే విని తిరిగి వచ్చాను, చూడు  నీ మొఖముఎలా మారిపోయిందో,  తెల్లని బుగ్గలపై నల్లని కాటుక జారింది, కేశములు విడి పోయి అలంకారం తగ్గింది, కళ్ళ అందం తగ్గి, కమ్మే కేశాలతో నిండిఉన్నది. ముందు నీవు మొఖం కాళ్ళు చేతులు కడుక్కొని లోపలకు వచ్చి ముందు అల్పాహారము తిను, ఆ తర్వాత నీకు ఇష్టమైన పని చేసుకో అన్నది.
అసలు అల నీవు  పిరికి దానిలా ఉండకు, పోకిరికుర్రవాళ్ళు ఉంటారు ప్రేమించామని వెంబడిస్తారు, వారి మాటలు నమ్మి మమ్ము అన్యాయము చేయకు, మా జీవితాలు, నీ మీదె ఉన్నాయి, త్వరలో నిన్ను ఒక ఇంటి దాన్ని చేసి, మా భాద్యత కొంత తగ్గించుకో గలము అని అన్నది తల్లి . 
అమ్మ నీకో విషయం చెప్పాలనుకున్నాను, చెప్పమ్మా, నీవు  మనసులోని విషయాన్ని నీవు చెపితే కోపం వస్తుం దేమోనని అనుమానమగా ఉన్నదమ్మా , అనమానం లేకుండా నిర్భయంగా చెప్పు , నన్ను ఒకడు వెంబడి చ్చాడమ్మ, చెప్పుతీసుకొని బుద్ది చెప్ప పోయావా, అట్లా చేయ లేదమ్మా, మరి ఎంచేసావే, వాడ్ని వదిలించుకొని ఎలా వచ్చావే, ఆవిషయం నన్ను చెప్పనిస్తెగా నీవు., బి పి పెంచు కోకమ్మ ఎమీ కాలేదు, మరి ఎం చేసావే చెప్పవే, నా మనసులో మనసులోలేదు అన్నది తల్లి. అందకనే నమ్మ నీకు ఏ విషయ చెప్పదలుచు కోలేదు, ఆ చెప్పు చెప్పు , అమ్మ నేను రాం తాతను కలిసానమ్మ అది పాత విషయమే కదా, ఎప్పుడు పోతూనే ఉంటావు కదా, చిన్నప్పుడు నిన్ను ఎత్తుకొని పెంచాడే ఆయన, ఆయనకు మనం ఋణపడి ఉన్నాము, మన ఇంటికి రమ్మనమని చెప్ప బోయావా, ఆయన్ని చూసి చాలా రోజులు అయింది, పిలుస్తాలేమ్మ, నీలో గాబరా లేదుగా, ప్రశాంతముగానే ఉన్నావుగా, ఆ ఉన్నానే చెప్పవే నన్ను వెంబడించాడని చెప్పానుగా అంతే, ఎమన్నా నిన్ను ఇబ్బంది పెట్టాడే, లేదమ్మా, మరి ఎం చేసాడే ఏవో కవితలు చపుతూ నా వెనక పడ్డాడే ఎం కవితలే బాబు ఉండు స్థిరం గా ముందు కూర్చో, ఈ మంచి నీల్లు త్రాగు అంటూ కూర్చొని ఇక చెప్పు అన్నది, కూతురు చెప్పటం మొదలు పెట్టింది. 


your Profile Photo
ప్రక్రుతి దృశ్యాలు చూడనెంచి కాళ్ళు కదిపే 
చినుకులు రాలగ జలదరించి వళ్ళు  తడిసే
జలాశయమున కమలము మనసు కుదిపే
కమలాన్ని  అందు కోవాలని ఆరాటం పెరిగే
నాలో
కడు  విశాల   నేత్రములు  కలిగి  నట్టి    
కను విందు  చెస్తూ కదులు తున్నట్టి
జలక మాడుతున్న జలకన్య  కాబట్టి
కన్య సౌందర్యం చూసి నామతి చెడింది
ఇప్పుడు
కన్య  సౌందర్యం  వర్ణింప  నా   తరమా
సుందర  ప్రభ వలే  ఉన్న చెంద మామా
బరువైన పిరుదులపై ఉన్న కెశజాలమా  
బరువుతో కదులుతున్న వక్షో జాలమా 
అని వర్ణిం చాడే
కవ్వించే హృదయం గాలిలో  తేలగా
బంగారు వర్ణం  మదిలో    నిలువగా
ఆకర్షించే నేత్రములు త్రిప్పు చుండగా
బ్రహ్మకైన భామను చూస్తె తిక్కరేగదా
అన్నాడే
ఒడ్డున చేరిన జవరాలు వంగి వంగి చీర కట్టి
పాలిండ్లపై   పావడాను  ఊపి ఊపి  ఆర బెట్టి
వయ్యారంగా నడుంపెట్టి ముఖంపై బొట్టు పెట్టి
జలములో ముఖం చూసుకొని నవ్వు కుంటుంటే 
 

అందం ఇంతని చెప్పలేనన్నాడే 

చెట్టు చాటున  అంతా  చూసి  ఉండ  పట్ట   లేక
వంపుసొంపు నడకచూసి తపనకు తట్టుకోలేక
భువి  నుండి  దివికి   వచ్చిన నవరత్న మాలిక
దరిచేరి   ఆమెను   పలకరించే మనసు నిలవక  
       
హే   లావాన్య  ఎవరి బిడ్డవు ఎచ్చట  ఉందువు
నా  కంటికి నీవు సుకమార   సుందర వనితవు
ఇది స్వప్నము కాదు ప్రత్యక్ష శృంగార దేవతవు  
యవ్వనంలో ఉన్న బ్రాహ్మణ పుత్రిక ఐ ఉందువు 

తాపసి   గారాల   ముద్దు   బిడ్డవను   కున్నాను
దేహకాంతి చూసి ఆగలేక నీముందుకు వచ్చాను
మనసులో ఉన్న కోరికను తెలియపరుస్తున్నాను
చిరునవ్వుతో   మాట్లాడితే   ముత్యాలు   రాలునా
అని పలరించ బోయాడే
మందహాసపు మాటలు వినాలని ఉంది
విశ్వమంత విశాల హ్రుదయము ఉంది
కోకిల గానంతో వరుస కలపాలని ఉంది
చిలుకపలుకుల చిన్నారి మాటలు రావా

సుధలు   చిందు   నధరాలు కదలాడ
బిడియ   మేళ    విన్న   వించు  జాడ
మదిని శాంత పరుచు చెప్పు ఉండే వాడ
మాటలాడక నా హృదయంలో పెంచకు దడ

దడ తో వేగంగా నదుస్తూ వస్తునాను అమ్మా

మౌనమేల వహింతువు మనసు చెప్పు మాలినీ
వచ్చి నాను నీవెంట  పలకవు అందాల భామినీ
నన్ను గానక వేగంగానడుస్తున్నావు సునయనీ
వేడుకొందును మనసు తెలుపవా కామిని

నా మీద నీకు  జాలి   కలుగుట లేదా
అలుకమానుటకు నీకు ఏమి చెప్పేదా
నా మదిలో మెదిలిన   కోరిక తెలిపెదా
ప్రేమ వున్నచో నీతోడు నేనే ఉండాలి సదా

అన్నాడమ్మా 

పుడమి   పై   ఇంద్ర  భవనము    నిర్మించేదను
వజ్ర   వైఢూర్యముల  తొ  నగలు  చేయించెదను
సుందర ప్రాంతములు నిత్యమూ చూపించెదను
లలనా కష్ట పెట్టకుండా నిన్ను  సుఖ పెట్టగలను

అని ఆశలు రేపాడమ్మా
 

నీ మదిలో మెదిలిన  కాంక్షను  తీర్చెదను
నీ   అడుగు  జాడలలో నడుచు కొందును
నీ హృదయమును సంతసింప చేయుదును      
నీవు నామనసు అర్ధం చేసుకొని పలుకుము 


అని జాలితో ప్రేమనువ్యక్త పరిచాడమ్మా 

అంటూ మన ఇంటి దాకా వచ్చాడమ్మ ఎం చేయ లేక, అంతే కదా వాడెవడో ప్రేమ పిచ్చోడు, వాడు ఈసారి కనబడితే 
నేరుగా యింటికి తీసుకురా వాడెవడో, వాడి కులమేదో, గోత్రమేదో  కనుక్కొని నీ ముక్కుకు తాడేసి కట్టేస్తా, అమ్మ వాడొక బైరాగి లా ఉన్నాడు, గడ్డాలు పెంచి ఉన్నాడు, కొందరు పిచ్చి పిచ్చిగా కవితలు వ్రాసి పాడుకుంటారు అవి ఏమి పట్టించుకోకు, అన్నం పెడతా హాయిగా నిద్రపో  అన్నది తల్లి . తల్లికి మొట్ట మొదటి సారిగా అబద్ధం చెప్పింది, ఎందుకంటే ఆ కుర్రోడు, మన ఇంటి ప్రక్కన అబ్బాయి అంటే అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. ఎందుకంటే ఆ యింటికి మా యింటికి తర తరాలనుండి విభేదాలు ఉన్నాయి, అవి ఎప్పుడు తీరుతాయో, నాప్రేమకు బలం ఎప్పుడు వస్తుందో అనుకుంటూ అన్నం తిని పడుకుంది.                            ఇంకా ఉన్నది
--((8))--

8. ప్రస్థానం (తప్పదు )

అజ్ఞాతంలో ఉన్న వారు రావడం
ఆనందం కోసం వచ్చారనక తప్పదు
ఒంటరితనం నుండి జంటగా మారడం
దేవుని లీల అని అనుకోక తప్పదు

ఒక్కడు నలుగురిలో ఒక్కడవటం
గుణాన్ని బట్టి అనుకోక తప్పదు
స్పర్శిమ్చుకున్న కళ్ళు ఎకమవ్వడం
సాశ్వితమని అను కోక తప్పదు

అతిగొప్ప పూవు  పూయడం
చెట్టు చేసుకున్న పుణ్యమని అనుకోక తప్పదు 
నట్టింట్లో ప్రేమ ఊయల కట్టడం
 యిరువురి ఆనంద హొళీ అనుకోక తప్పదు 

గగనంలో హరివిల్లు చూసి ఆహా అనుకోవడం
అది స్థిరంగా  ఉండదని తెలుసుకోక తప్పదు 
మైదానంలో పిల్లలు ఆడుకోవడం
కొంతవరకు వ్యాయామమని అనుకోక తప్పదు

జంక్షన్లో రెడ్ లైట్ పడటం
ఎంతటి వారికైనా ఆగక తప్పదు
జంక్షన్లో గ్రీన్ లైట్ పడటం
ఎంతటి వారికైన పరుగులేయక తప్పదు

వసంతం వచ్చిందని సంబరపడటం
వేసవి వేడిని భరించక తప్పదు
తప్పతడుగుల ముద్దు మాటలు వినడం
పిల్లల్ని ప్రేమతో కొట్టక తప్పదు

 --((*))--


9. ప్రస్థానం (పుడమి బిడ్డలు )

చూచే చూపులు - వేసే అడుగులు
చెప్పే మాటలు - నీటిపై రాతలు
కానీ ఆలోచనలు - పొంతన లేని యోచనలు
పొద్దు గూకులు - వేదన బ్రతుకులు

మది సొబగులు - మాయ గుర్తులు
అభిమానాలు  - కొలిచే తూనికలు
అరవు బ్రతుకులు - కుత్రిమ కాంతులు
సుఖం లేని బ్రతుకులు - ఆకాశంలో మేఘాలు

చొక్కాలేని తాతలు - చెపుతారు నీతులు
బతుకు వేలం పాటలు - దోచే మదాంధులు
గుబాలిమ్పే లేనిపూలు - నీటిలో పడవలు
బీదరికపు మనుష్యులు - మండపంపే పూలు

అంతరంగంలో ఆశలు - తీర్చుకోలేని కోర్కలు
చీకట్లో మిణుగురులు - ఆకాశంలో నక్షత్రాలు
వెలుగులో వెలిగే దీపాలు  - వెలలేని జీవితాలు    
సూణ్యం లో నిట్టూర్పులు - కొనఊపిరి బ్రతుకులు

కల్లాపే కల్లోలాలు - విసిరేసిన విస్తరాకులు
తిండికి వచ్చే తిప్పలు - బ్రతుకు నేర్పే ఆటలు
మొగ్గలైన సమస్యలు - చూడని తోరణాలు
వెలుగే లేని బ్రతుకులు - పుడమి బిడ్డలు   
 --((*))--

10. ప్రస్థానం (ఉంటె )

వయసు నడుస్తూ ఉంటె
చుక్కలు పొడుస్తూ ఉంటె
మక్కువ తీర్చ మంటూ ఉంటె 
మనస్సు ఊహల్లో ఉంటె

తేజస్సు కలుద్దామని ఉంటె
మక్కువతో ముద్దివ్వ మంటె
కోకిల గానం వింటూ ఉంటె  
పగడాల చిగురాకు రమ్మంటె 

మక్కువ తక్కువ చేయద్దంటె
వయ్యారి సిగ్గుతో ఉంటె
పరువం పిలుస్తూ ఉంటె   
మక్కువ తీర్చి పొంమంటె

సందులో నిల్చొని ఉంటె
వసతులకై వేచి ఉంటె
ఆధునిక వస్త్రం వేసుకొని ఉంటె
అందాలను పంచాలనుకుంటె
అలసి నిద్ర ముంచు కొచ్చే
  --((*))__

11.ప్రస్థానం (వహ్వారే )

వహ్వారే
వహ్వారే
 
వహ్వారే ఏమి దరహాసం 

ఏమి చిరు మంద హాసం 

ఏమి పున్నమి వీర విహారం 


అయ్యారే మొహినీ దరహాసం

మన్మధుని వయ్యార విహారం

నవ వధువు మౌన స్మిత హాసం

నవ లావణ్య పున్నమి విరహం 


పండు వెన్నెలలో పడవ విహారం

సాగి పోవును హృదయ విలాసం 

నీటిలో నెలవంకలా పొందే తన్మయం
  
వహ్వారే వహ్వారే గూటి పడవ మమేకం 
  
  --((*))--