11, ఏప్రిల్ 2016, సోమవారం

శ్రీమత్ భగవత్ గీత - ఐదవ అధ్యాయం - కర్మసన్యాస యోగం (listen magazine only)

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం

gita-129


సర్వేజనా సుఖినోభవంతు
శ్రీమత్ భగవత్ గీత - ఐదవ అధ్యాయం - కర్మసన్యాస యోగం 
ఉపోద్ఘాతం 
నేను కర్తను అనే భావన విడిచిపెట్టి, నేను నిమిత్త మాత్రున్ని అని గాని, ఇది నా కర్తవ్యమ్ అని గాని చేయాలి. కర్త ఎవరో అజ్ఞాత వ్యక్తి. అతడే పరమాత్మ నీవు కేవలం గుమాస్తావి. అంతే. ఇలా కర్త్రుత్వాన్ని వదిలి కర్మ చేయుటయే కర్మ సన్యాసమ్. కర్మ చేసి చేయని వాడవు కావటమే కర్మసన్యాసం దీనిని తెలియజెప్పే అధ్యాయమే కర్మసన్యాస యోగం  
http://vocaroo.com/i/s1lmg5HBT6aQ

1 ఒకటవ శ్లోక భాష్యం 
అర్జునుడు అంటున్నాడు. కృష్ణా కర్మల యొక్క సన్యాసాన్ని, మల్లీకర్మ యోగాన్ని ప్రశంసిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది  కలిగిస్తుందో ఆ ఒక్కదానినే నిశ్చఇంచి నాకు భోధించు. 
http://vocaroo.com/i/s0Kim9c9Nid6

2. రెండవ శ్లోక భాష్యం
శ్రీ భగవానువాచ
 సన్యాసమూ కర్మయొగమూ రెండు శ్రేయోదాయక ములె. వాటిలో కర్మ   శ్రేష్టమైనది - అని భగవానుడు  అన్నాడు
http://vocaroo.com/i/s16NJ8CdoHRr 

3.  మూడవ శ్లోక భాష్యం 
ఎవరైతే ద్వేషించకుండా, కాంక్షించకుండా ఉంటారో అతడే నిత్యసన్యాసి  అని తెలుసుకో, ఓ మహా బాహుడా ! ద్వందాలు లేనివాడే బంధాలనుండి సుఖంగా బయట పడతాడు(8. 29)


http://vocaroo.com/i/s1olPZ4Iq7MK 

4. నాల్గవ  శ్లోక భాష్యం 
సాంఖ్యం యోగం రెండు వేరు వేరని ఎమీ తెలియనివారు అంటారు కాని పండితులు అలా అనరు. ఏ  ఒక్కదానినైనా చక్కగా ఆచరిస్తే రెండింటి  ఫలితాన్ని పొందుతారు. (8. 43)
http://vocaroo.com/i/s1mdIst08w0B 

5. ఐదవ  శ్లోక భాష్యం
ఏ స్థానం జ్ఞానులు పొందుతారో దానినే యోగులు కూడా పొందుతారు.సాంఖ్యం, యోగం ఒక్కటే  అని ఎవరు చూడ గలుగుతారో  వారే సరైన దృష్టి గలవారు(5.20)


http://vocaroo.com/i/s1BdSQiEc8o2 

6. ఆరవ శ్లోక భాష్యం
కర్మయోగం ఆచరించకుండా కర్మసన్యాసాన్ని  పొందటం చాలా కష్టం. కర్మయోగాన్ని ఆచరించన సాదహకుడు మాత్రమే మననసీలుడై (ఆత్మజ్ఞాన్నాన్ని గ్రహించి, మననం చేసి, సాధన చేసి )బ్రహ్మ పదవిని సీఘ్రంగా  పొంద గలుగుతారు (8.13) 


http://vocaroo.com/i/s0iOD6P4eJ21

 7. ఏడవ శ్లోక భాష్యం
బుద్ధిలో కోరికలు లేకుండా మనస్సు శాంతముగా ఉండి, ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకొని, సర్వ ప్రాణులను తన వలెనె భావిస్తూ కర్మయోగాన్ని ఆచరించే వాడు ఎట్టి కర్మలు చెస్తున్నప్పటికీ అతడికి ఎ కలంకము అంటదు. (6. 55)
 http://vocaroo.com/i/s0d8PcRhmWlp

 8. ఎనిమిది,9. తొమ్మిది  శ్లోకాల భాష్యం(9. 15   )
చూస్తున్నప్పుడు, వినుచున్నప్పుడు, తాకుతున్నప్పుడు, వాసన చూస్తు న్నప్పుడు, తింటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, నిద్ర పోతున్నప్పుడు, స్వాసిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, మల విసర్జన చేస్తున్నప్పుడు, పట్టుకుంటున్నప్పుడు, కనురెప్పలు వేసి తీస్తున్నప్పుడు , తత్వవిదుడు ఇంద్రియాలు ఆయా విషయాలలో పవర్తిస్తున్న యి  గ్రహించుకొని, నేను మాత్రం ఎమీచే యుటలేదు   

http://vocaroo.com/i/s1PXRmnJPoBX


10. పదవ శ్లోక భాష్యం(10. 41)
సకల కర్మలను పరమాత్మ యందు సమర్పించి, సంగ భావాన్ని విడిచి ఎవడు కర్మలు చేస్తాడో అతడు నీరు అంటని తామరాకులాగా పాపంచేత అంటబడదు. 
http://vocaroo.com/i/s1dNEepUzo3F 


11. పదకొండవ శ్లోక భాష్యం(11)
నిష్కామ కర్మయోగులైనవారు సంగభావాన్ని విడిచిపెట్టి శరీర మనోబుద్దులు ద్వారాను, కేవల ఇంద్రియాల ద్వారాను చిత్తశుద్దిని పొందటం కోసం కర్మలు చేస్తుంటారు. 
http://vocaroo.com/i/s1CndwzZDUmQ


12. పన్నేండవ శ్లోక భాష్యం()
నిష్కామకర్మయోగి కర్మ ఫలంపైగల ఆపేక్షను విడిచి పరమశాంతిని పొందుతాడు.  కామ్యకర్మల నాచరించేవాడు కోరి ఫలంపై అపేక్షతో సంసారంనందు బంధించపడు తున్నాడు.

http://vocaroo.com/i/s1IDLAJjygG9 

13. పదమూడవ శ్లోక భాష్యం()
ఇంద్రియాలను వశంలో మనస్సు ద్వారా అన్ని కర్మలను విడిచిపెట్టి, తొమ్మిది ద్వారాలు గల ఈ దేహమనే పురంలో ఎమీ చెయ్యకుండా, ఎమీ చేయించ కుండా సుఖంగా ఉంటాడు. 

http://vocaroo.com/i/s0XqTuNRWBrF 

14. పద్నాల్గవ శ్లోక భాష్యం()
భగవంతుడు ఈ లోకంలోని ప్రాణులకు కర్తుత్వాన్ని గాని, కర్మలనుగాని, కర్మఫలంతో సంభందాన్ని గాని సృష్టించటం లేదు. జన్మాంతర  సంస్కారాలే ఈ కర్త్రుత్వాదులకు కారణం స్వభావమే.

 http://vocaroo.com/i/s0qc35KLHHnp

15. పదిహేనవ శ్లోక భాష్యం()
భగవంతుడు ఎవరి యొక్క పాపాన్ని గాని, పుణ్యాన్ని గాని గ్రహించుటం లేదు. అజ్ఞానంచేత జ్ఞానం కప్పబడి 
ఉంటున్నది. అందువల్ల జీవులు మోహ చెందు తున్నాడు 

http://vocaroo.com/i/s0zoO4nN3v4C 

16. పదహరవ శ్లోక భాష్యం()
ఆత్మజ్ఞానం చేత ఎవరి యొక్క అజ్ఞానం నశించి పోతుందో వారియొక్క జ్ఞానం సూర్యుని వలే ఆ పరబ్రహ్మస్వరూపాన్ని ప్రకాశింపజేస్తుంది. 

http://vocaroo.com/i/s17TLF72krDj

*17. పదిహేడవ శ్లోక భాష్యం()
పరమాత్మయందే బుద్దిని నిల్పి, పరమాత్మయందే మనస్సు నిల్పి, పరమాత్మయందే నిష్ఠ గలిగి, పరమాత్మనే ఆశ్రయించినవారు జ్ఞానం చేత కల్మషాలునశించిన వారై  తిరిగి రాని మోక్ష పదవిని పొందుతారు. 

http://vocaroo.com/i/s1Ezm21tLRO8 

*18 పద్యెనిమిదవ  శ్లోక భాష్యం()
విద్యా వినయ సంపదలతో కూడిన బ్రాహ్మణుని యందును, గోవు యందును, ఏనుగు యందును, కుక్క యందును, కుక్క మాంసము  తినే చండాలుని యందును జ్ఞానులైన వారు సమత్వమును దర్సిమ్చుచుందురు. 


http://vocaroo.com/i/s0IXiEAMGwBl

19 పందొమ్మిదవ శ్లోక భాష్యం 
ఎవరి మనస్సు సకల ప్రాణులయందు సమస్తితిలో ఉంటుందో వారు ఈ దేహంతోనే ఈ లోకాన్ని జయిస్తారు.  నిర్దోషమైన బ్రహ్మం అంతటా సమంగా ఉన్నందున వారు బ్రహ్మం నందే ఉండిపోతారు .

 http://vocaroo.com/i/s1ELgFZUtkqo

20. ఇరవై యవ శ్లోకభాష్యం 
బ్రహ్మమ్నందు నిలిచి బ్రహ్మవేత్త స్థిరమైన ప్రజ్ఞతో, మొహరహితుడై, ఇష్ట మైన దానిని పొందినప్పుడు సంతోషించక, ఇష్టం లేనిదానిని పొందినప్పుడు ఉద్వేగాన్నిచెందక ఉంటాడు. 

 http://vocaroo.com/i/s14ZbK91h3fk


21.ఇరవై ఒకటవ శ్లోకభాష్యం
బాహ్య విషయములందు ఆసక్తి లేని బ్రహ్మవిష్ణుడు  ఆత్మ యందు గల సుఖాన్ని పొన్దుతాడు.  నిరంతరం  ఆ బ్రహ్మవిష్ణుడు అక్షయమైన ఆత్మసుఖాన్ని పొందుతాడు. 

  http://vocaroo.com/i/s1gEryXfkUzu

22.ఇరవై రెండవ శ్లోకభాష్యం
 అర్జునా విశాలతో ఇంద్రియాల కలయికవల్ల కలిగే భాగాలన్నీ దు:ఖాన్ని కలగజేసేవే. అంతేకాదు, అవి అది అంతా లతో కూడుకున్నవి. అందువల్ల వివేకులెవరూ ఆ భాగాలలో రమించరు. 
http://vocaroo.com/i/s16EMuf0fTY9


23.ఇరవై మూడవ శ్లోకభాష్యం 
ఎవరైతే శరీరరమ్ రాలి పోవడానికి ముందే ఇక్కడే కామక్రోధాల వేగాన్ని తట్టుకొని నిలబడగలదో అట్టివాడే యోగ సిద్ధిని పొందినవాడు, అతడే శాశ్వత ఆనందాన్ని పొందినవాడు .
http://vocaroo.com/i/s1Mmq9KB0Rjl

24.ఇరవై నాలుగవ శ్లోక భాష్యం 
ఎవరు ఆత్మయందే సుఖిస్తూ, ఆత్మయందే రమిస్తూ, అలాగే ఎవరు ఆత్మ యందె ప్రకాశం గలవాడై యున్నాడో అట్టి ధ్యాన యోగి బ్రహానందాన్ని పొందుతున్నాడు .  

http://vocaroo.com/i/s08ABG2zYw6w

25.ఇరవై ఐదవ శ్లోక భాష్యం 
పాపాలు తొలగించుకున్నవారు, ద్వైతభావనను ఛేదించిన వారు, మనస్సును స్వాధీనంలో పెట్టుకున్నవారు, సమస్త ప్రాణుల హితాన్నికోరేవారు అయిన ఋషులు బ్రహ్మ నిర్వాణ రూప ఆనందాన్ని పొందగలుగుతారు


http://vocaroo.com/i/s1PVaBivZNk6

26.యావి ఆరవ శ్లోక భాష్యం 
కామ క్రోధాల నుండి విడుదల పొందినవారు, స్వాధీనమైన మనస్సు గ లవారు, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నవారు, ప్రయత్నా శీలురు ఆయిన వారికి బ్రహ్మ నిర్వాన రూప మోక్షం అంతటా ఉంటుంది. 
http://vocaroo.com/i/s0O6LrQYiMib

 27,28 ఇరవై ఏడూ, ఇరవై ఎనిమిది శ్లోకాల భాష్యం
ఎవరు బాహ్యమైన స్పర్సాది విషయాలను బయటనే నిలిపి వేసి, దృష్టిని భ్రూ మధ్యమునందు నిలిపి, ముక్కులో సంచరించే ప్రాణ అపాన వాయువులను సమం చేసి, మనోబుద్దులను ఇంద్రియాలను నిగ్రహించి, ఆశ-భయ క్రోదాలను విడిచి పెట్టి, మోక్షాన్ని కోరుకునే మనన శీలుడో  అతడు ఎల్లప్పుదూ ముక్తుడే.

http://vocaroo.com/i/s1Dh45enQVfV

 29. ఇరవై తొమ్మిదవ శ్లోక భాష్యం 
యజ్ఞాలకు, తపస్సులకు భోక్తగాను, సర్వలోకాలకు ప్రభువు గాను, సర్వప్రాణి కోటికి మేలు చేసే వానిని గాను నన్ను తెలుసుకొని శాంతిని పొందుతాడు .

http://vocaroo.com/i/s1lJuKmeMAMC

ఉపనిషత్తుల సారమై, బ్రహ్మ విద్యా ప్రతిపాతిమై, యోగ శాస్త్రమై, శ్రీకృష్ణ - అర్జునుల మద్య జరిగిన సంవాద రూపమైన భగవద్గీత యందు కర్మ సన్యాస యోగామనే ఐదవ అధ్యాయం సమాప్తం
ఓం శాంతి: ఓం శాంతి: ఓం శాంతి:

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి