23, ఏప్రిల్ 2016, శనివారం

Internet Telugu magazine for the month of 4/2016-16

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం 
సర్వేజనా సుఖినోభవంతు 
Looking Beyond Ourselves and seeing the beauty in all things, Realizing we are all connected. Is pure Magic.


(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (15) (date 16-04-2016 to 22-04-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, నా భావ కవితలు,కధలు మరియు అనేకం
...........................................................................................................1. ప్రస్థానం ( స్పందన )

సాహిత్యం అంటే సహనం నుండి వచ్చేది
అనుభవాల అక్షర సత్యాలను తెలిపేది
కవి హృదయం అర్ధం చేసుకోవటం ఎలా చెప్పేది
పదానికి అర్ధాలు ఎన్నో, అర్ధం కానివారికి ఎం చెప్పెది

వనంలోకి ప్రేమికులు రావద్దంటే ఆగుతారా
ఇది జంతు సాహిత్యం చదవద్దంటే ఆగుతారా
మనుష్యులకంటే జంతువులే మేలని తెలియదా
భావాన్ని అర్ధం చేసుకోలేనివారికి బూతు అంటే ఎలా

ఉత్తమ సాహిత్యాన్ని ఆదరించటం అందరి కర్తవ్యం
మనో నిగ్రహశక్తి పెంచేది, ఆలోచిన్పచేసేది కవిత్వం
సరస్వతీ పుత్రులను విమర్సించటం అవివేకం
మనలోలేనిది ఇతరుల్లో ఉన్నది గ్రహించటమే వివేకం    


--((*))-- 

2. ప్రస్థానం ( ప్రేమ )

లేదనకు నా మీద ప్రేమ
కాలమునకు లోబడి ప్రేమించాను
మనసుకు తట్టే మనోహర ప్రేమ
గంధపు గుబాళింపులతో ప్రేమించాను

నాది సమ న్యాయముగల ప్రేమ
మనకు సమస్యలుండవని ప్రేమించాను
మౌన మనస్సుతో పొందే ప్రేమ
మనసు మనసు కలవాలని ప్రేమించాను

ఘడియ ఘడియకు మారదు ప్రేమ
గగనంలా విస్తరించి పృద్విలా ప్రేమించాను
మరువ లేకున్నా మమతల ప్రేమ
మనమధ్య బలం ప్రేగాలని ప్రేమిస్తున్నాను   
--((*))--

3. ప్రస్థానం ( తోడులేని ప్రేమ )

జాబిల్లి నన్నుచూసి ఆసహ్యంగా నవ్వుతున్నాడు
మలయ మారుతం నా దగ్గరకు  రానంటున్నాడు
మత్తెక్కించే మరులుగొలిపే వేణుగానం లేదన్నాడు
పరిమళాలు వెదజల్లే పుష్పాలు వెక్కిరిస్తున్నాయి

నా ఊహల సప్తస్వరాలు నన్ను విడిచి పోయినాయి
సొగసు రెక్కలు విప్పారినమల్లెలు ముడుచుకున్నాయి  
మధురరాత్రుల సవ్వడులు మనసుకు తాకనంటున్నాయి
నా తనువులో ఉన్న ఊహలు ఆవిరులై బిందువులైనాయి
    
మనసు నీతో సరాగాలకై ఆరాటపడుతున్నా ఫలితమేది
వయసు వేధింపులకు బ్రహ్మచర్యమే నాకు శుభమైనది  
మనోనిగ్రహ శక్తితో వెచి ఉండుటే నాకు శ్రేయస్కరమైనది
ఎంత ఆలస్యమైనా ఓర్పు వహిస్తే అంతా ఆనందమయమే    
--((*))--

4. ప్రష్థానం (కధనం )

పురా సాహిత్య సహకారం
భాషా నైపుణ్యానికి శ్రీకారం
నవ నవాభ్యుదయ చరితం
కలియుగ కావ్య నాందిప్రస్తానం

లలిత సరళ పదాల తోరణం
రచనా చమత్కార వచనం
జీవిత వర్ణన బహుసులభం
మనస్సు తెలియుట గ్రాహ్యం

పదవిభజనే మూలవ్యాకరణం
ఇటికె ముడి సరుకుల మయం
అలంకారం ఆకర్షనకు చిహ్నం
నగిషి కోప్పతనానికి ఒక వరం

రక్త మాంసాదులతో ఉండేది దేహం
ధర్మా ధర్మాదులను తెలిపేది వాక్యం
మనసు పరి తపించేదే మూలభావం
గుండెచప్పుడుఉంటెనే మనిషికి ప్రాణం

జల, సాకామ్బర మేలికలయక రసం
సుఖదు:ఖాల జీవిత సమరమే కావ్యం
మనసుకు ఉల్లాస పరిచేది హృద్యం
సంఘటనల పరిమళం కధా కధనం

--((*))--
5. ప్రస్థానం (వస్తే )

అక్షరాలకు రెక్కలు వస్తే
దిక్కులు లేని గమ్యాలుగా మారుతాయి
సంకల్పాలకు బలం వస్తే
ఆశల సీతాకోక చిలుకలు ఎగురుతాయి

నిశ్శబ్దానికి కన్నీళ్ళు వస్తే
కళ్ళలోని మధురస్వప్నాలు కరుగుతాయి
ఓదార్పులో మౌనం వహిస్తే
నిరాశ, నిస్పృహలు కమ్ము కుంటాయి

కోరికలే గుర్రాలై వెంబడిస్తే
మస్తిష్కంలోని పుస్తకాలు వేడెక్కుతాయి
కావ్యాలకే మరణం వస్తే
జీవితాలన్నీ తిరగబడి చిక్కు కుంటాయి

జ్ఞాపకాలకు నీల్లొదిలేస్తే
నవ్వుల వెలుగులు దూరమవుతాయి
సంకెళ్ళకే ఎడబాటువస్తే
చీకటి రాత్రులు నరకంగా మారుతాయి

--((*))--


6. పస్థానం (ప్రయత్నం)

ముఖారవిందం మెరుపులా ప్రయత్నం
మా సుఖసంసారం తృప్తే నాకు ఫలితం

నా తనువుల తపనలు నిత్య సుగంధం
నా గాత్రం నిత్యం స్వస్చసుమధుర స్వరం

నా మనసే నేను విన్న వేదాంతాల సంగ్రహం 
నా గమనం నా సేవ నిత్య ధర్మభోదే నామార్గం

విషయ సుఖం, ద్వందాలు, మానవ జన్మకు సహజం
ఆశలు మంచు లాంటివి,  అయినా వదలను విశ్వాసం   

నిత్యమూ పూసే పువ్వులాంటి కవితా పదాలే ముఖ్యం
నామనసును బట్టి ఆరాదిన్చుటే నాముందున్న కర్తవ్యం  
--((*))--

7. ప్రష్థానం (కధనం )

పురా సాహిత్య సహకారం
భాషా నైపుణ్యానికి శ్రీకారం
నవ నవాభ్యుదయ చరితం
కలియుగ కావ్య నాందిప్రస్తానం

లలిత సరళ పదాల తోరణం
రచనా చమత్కార వచనం
జీవిత వర్ణన బహుసులభం
మనస్సు తెలియుట గ్రాహ్యం

పదవిభజనే మూలవ్యాకరణం
ఇటికె ముడి సరుకుల మయం
అలంకారం ఆకర్షనకు చిహ్నం
నగిషి కోప్పతనానికి ఒక వరం

రక్త మాంసాదులతో ఉండేది దేహం
ధర్మా ధర్మాదులను తెలిపేది వాక్యం
మనసు పరి తపించేదే మూలభావం
గుండెచప్పుడుఉంటెనే మనిషికి ప్రాణం

జల, సాకామ్బర మేలికలయక రసం
సుఖదు:ఖాల జీవిత సమరమే కావ్యం
మనసుకు ఉల్లాస పరిచేది హృద్యం
సంఘటనల పరిమళం కధా కధనం
--((*))--8. ప్రస్థానం (ఒకరికొకరు)

నీ నవ్వు నాకు - నా నవ్వు నీకు
నువ్వే నేను - నేనే నువ్వు
నువ్వు నేను - నేను నువ్వు
నేనైనా నువ్వు - నువ్వైనా నేను
ముందు నువ్వు - వెనుక నేను
వెనుక నువ్వు - ముందు నేను
ఎండకు తోడు నీడ - నీడకు తోడూ ఎండ
నాకు తోడు నీవు - నీకు తోడు నేను
ఎండకు గొడుగు నవుతా - నేను దప్పిక తీరుస్తా
మండేగుండెను చల్లబరుస్తా - ఎండిన గుండెను బ్రతికిస్తా
చమట పట్టకుండా చూస్తా - మంచులా చల్లదనం అందిస్తా
గాలితో బ్రమింప చేస్తా - మనసు నే చల్ల బరుస్తా
ఎండకు వళ్ళు పేలుతుండే - పౌడర్ నై సహకరిస్తా
కోపం వస్తే -మీ పిచ్చి కవిత్వం మీకె వినిపిస్తా
--((*))--

9. ప్రస్థానం (నేడు - రేపు )

నేటి ఆహ్వానం  - రేపటి ఆశా వాదం
నేటి మొగ్గల తలపు - రేపటి పువ్వుల వలపు
నేటి ఊసర క్షేత్రం - రేపటి పులకించిన పంట
నేటి పాల కంకి - రేపటి నవ్వించే గింజల కంకి
నేటి విద్యార్ధి - రేపటి భావి పౌరుడు
నేటి సెలయేరు - రేపటికి విస్తరించిన తరంగణి 
నేటి క్షోభితలోకం - రేపటికి స్వర్గ లోకం
నేటి రాత్రి తిమిరం - రేపటి ఉదయం ఉషోదయం
నేటి పరిణామం - రేపటికి అదే రమనీయమ్
నేటి వివాహం  - రేపటికి సంతోష నిలయం
నేటి ధర్మ మార్గం - రేపటికి సుఖ మార్గం
నేటి ప్రేమ మయం - రేపటికి ఆనంద వలయం
నేటి దైవ ప్రార్ధన - రేపటికి మనస్సే ప్రాశాంతం
 --((*))--

10. ప్ర్రస్థానం (సంప్రదాయం )

వదలకు మన సంప్రదాయం
అది పూర్వ సంస్కృతీ ప్రితిబింబం
నిర్విరామ కృషికి తార్కాణం
అకుంటిత దీక్షకు  ఆయుధం
సృజన నడ వడికి నిదర్సనం
భవిషత్  నిర్మాణానికి ఇది సోపానం
పరమాత్మ దర్సన ధర్మ మార్గం
వంశ చరిత్రకు ఇది  ప్రభంధం
ఐక్య మత్యమునకు ఇది దీపం
సత్య సీల సంపదల సుకృతం
ఐహిక బంధాలకు కారణం
సంప్రదాయమే దేశాభ్యుదయం
దేశాభ్యుదయానికి దశానిర్దేశికం 

--((*))--

11. ప్రస్థానం (ఊహలు )

ఊహలు అతీతాలు
పొరలు, తెరలు, ఆగని కెరటాలు
వెంబడిస్తున్న జ్ఞాపకాలు
మనము అందుకోలేని నిధులు

వెంబడిస్తున్న ఆశలు
దిగులునిపెంచే వికసించని మొగ్గలు
శ్రమించినా రాని జయాలు
భవిషత్తులో  వచ్చే విజయాలు

శిశిరంలో రాలే ఆకులు
వయసులో వచ్చే తీరని కోర్కలు
రంగు లద్దిన కళా చిత్రాలు
మనిషి జీవిత జ్ఞాపక చిహ్నాలు
 
కాలాన్ని బట్టి మారే రూపాలు
గుణాన్ని బట్టిమారే కొందరి జీవితాలు
మనలో మరుపు చూస్తారు లోకులు
కుటుంబాలే కాలాన్ని బట్టి కదిలే చక్రాలు

--((*))--