6, ఏప్రిల్ 2016, బుధవారం

Internet Telugu Magazine for the month of 4/2016-14

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ 
Elephant Rock sculpture, India.:  
సర్వేజనా సుఖినోభవంతు 



(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (14) (date 08-04-2016 to 15-04-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, నా భావ కవితలు,కధలు మరియు అనేకం
...........................................................................................................


 ఉగాదిస్పెషల్ 

1. ఉగాది 
మన్మధవత్సరం మరచిపోదాం 
 దుర్మిఖివత్సరాన్ని ఆహ్వానిద్దాం
కొత్త అందాలతో ముందుకు పోదాం 
 కోయిల గానాలను విందాం 

వింత సోగాసుతో ఉండే ప్రకృతిని పిలుద్దాం
   ఉదయభానుని చైతన్యాన్నిఆహ్వానిద్దాం 
అందరి వయసు పెరుగు సహజం 
ఉగాది వసంతాలు అంతకన్నా సహజం 

పండిత శ్రేష్ఠుల పంచాంగ శ్రవణం
కవుల మస్తిష్కాలన్ని ఉస్చాహభరితం 
దేశభక్తి, త్యాగనిరితి ఉన్న సమాజం 
ధర్మ పదంలో సాగేదే ఈ ఉగాది యుగం 

కంప్యూటర్  విస్తృత ఉపయోగం 
సెల్లుల ద్వారా వార్తా విహంగం 
ఆణువణువూ కొత్త రూపాంతరం 
బిడ్డల సేవలు పెద్దలకు తృప్తికరం  

ధర్మ కార్యాలు చేయుట అధికం
విద్యా వినయంతో దేశాభి వృద్ధి కరం
భందుత్వాలమద్య మమేకం 
స్వాగతమ్ము దుర్ముఖికి స్వాగతం

--((*))--

2. ప్రస్థానం (వహ్వారే )

వహ్వారే
వహ్వారే
వహ్వారే ఏమి దరహాసం
ఏమి చిరు మంద హాసం
ఏమి పున్నమి వీర విహారం

అయ్యారే మొహినీ దరహాసం
మన్మధుని వయ్యార విహారం
నవ వధువు మౌన స్మిత హాసం
నవ లావణ్య పున్నమి విరహం

పండు వెన్నెలలో పడవ విహారం
సాగి పోవును హృదయ విలాసం
నీటిలో నెలవంకలా పొందే తన్మయం
 
వహ్వారే వహ్వారే గూటి పడవ మమేకం   

--((*))--

3. కన్నులచూపులు :-
నీ పదపద్మములను చేరుటకై ;
ఎక్కెద సోపానముల
నెన్నైన నా స్వామీ! ||నీ||
;
మంచు కన్నియలు,
వెలుగు కుండలలో నింపి యుంచిరి,
నీటి ముత్యములు!
నీరాజనముల గైకొన
రా! రా! నా స్వామీ! ||నీ||
;
తొడిమ బాలికలు,
రెమ్మ దోసిట నింపుకొన్నవి ,
పూవులాకులను, తోమాలలను
స్వీకరించరా నా స్వామి!!
రా! రా! నా స్వామీ! ||నీ||
;
తరు పూజారులు,
కొమ్మ పళ్ళెముల ;
తెచ్చి యున్నవి ఫలములెన్నిటినో:
పక్వ ఫలములను గ్రోలర,
దయతో నా స్వామీ! ||నీ||

విరహ ధూపముల సొక్కి సోలిన ;
అన్నులమిన్న రాధను ఒక పరి ;
కడకన్నుల చూపున కనికరించరా! నా స్వామీ!!
రా! రా! నా స్వామీ! ||నీ|
|
 
4. ప్రస్థానం (స్థితి ప్రజ్ఞ )

కడలి లోతు తెలుసుకొనే లోపు
మనసులోని మమత తెలుసుకో
సంఘర్షణలు అర్ధంచేసుకొనే లోపు
మనసు ఘర్షణ పడకుండా చూసుకో

భాదపెట్టే మెరుపులు వచ్చే లోపు
సంతోష మనసు పదిల పరుచుకో
మౌన భాష తెలుసుకొనే లోపు
హృదయ వేదన బాష తగ్గించుకో

అదృస్య బాణాలు మనసు తాకే లోపు
యదపొంగు బయట పడక సరిచేసుకో
చూపుల శరాలు మనసుకు తాకేలోపు
తీయటి మధుర ఫలాలు పంచుకో

మన్మధుని ఇక్షుచాపాలు తగిలేలోపు
సంకల్పంతో మనసు కుదుట పరుచుకో
తేట తీయని ఊట నీరు త్రాగే లోపు
ఇంకి పోనీ ఆధర జలాలను దాచుకో

వెన్నెలపుంజాలు మనసుకు చేరే లోపు
మనో గవాక్షాలు పదిల పరుచుకో
అనురాగ బంధాలను పంచే లోపు
స్థితి ప్రజ్ఞను పెంచే మనోధైర్యాన్ని పంచుకో
  --((*))--


5. ప్రస్థానం ( బ్రతకాలని)

నాకొచ్చే స్వప్నాలను నిజం చేసుకోవాలని
కష్టాన్ని నమ్ముకొని సత్యాన్ని తెలుసుకోవాలని
మచ్చలు లేని జీవితాల  చరిత్రలు వ్రాయాలని
సంఘర్షణ సూణ్యంలో నుంచి బయట పడాలని
ప్రతి అస్తిత్వాన్ని లిఖించి సుబ్రపరచాలని  
నాగరిక విన్యాసంలో సుఖంగా బ్రతకాలని

మన్నించాలి నా మాటలను నటనలని
ఎప్పుడూ శ్రమైక జీవనాన్ని బ్రతికించాలని
పిల్లలకోసం గింజలు తెచ్చే పక్షిలాగ ఉండాలని
జీవించుటకు  పలు కాకుల లోకంలో బ్రతకాలని
వయసు మీరకు ముందు మమతలందు కోవాలని
మన్మధుని లీలలకు పావులగా ఉండ కూడదని     

విరామాలను సరాగాలను బ్రతికించాలని
కాలంలో ఉన్న నలుపు తెలుపు తెలుసు కోవాలని
జీవితం వడ్డించిన విస్తరని తెలుసు కోవాలని
సహనంగా ఉండి అసహనాన్ని ఎదుర్కోవాలని
కళ్ళలో ఉన్నదాన్ని కళ్ళతో తెలుసుకోవాలని
మనసులోని మమత ఎవ్వరికైనా చెప్పాలని 
   
అలలు ఎగసి పడి ఒడ్డును చేరాలని
మనసు మనసును అర్ధం చేసుకోవాలని
మనుష్యుల రాతలను తెలుసుకోవాలని
మలినాలకు మరణ శాసనం వెయ్యాలని
తట్టు కోవాలి స్వచ్చంగా వచ్చే కిరణాలని
ధైర్యంగా జీవితం నెట్టుకుంటూ రావాలని
సృష్టిలో ప్రతి ఒక్కరికి ఆసరా ఉండాలి
--((*))--
     
6. ప్రస్థానం (ప్రేమ జయించాలి)

పువ్వు  వికసించి నప్పుడు
మనసు పులరిస్తుంది
పువ్వు పరిమళాలు వేదజల్లె టప్పుడు
మనసు ఉరకలేస్తుంది

పువ్వు లాంటి కన్ను పిలుస్తున్నప్పుడు
వయసు పులకరిస్తుంది
కళ్ళ కదలికతో సైగ చేసినప్పుడు
వయసు ఉరక లేస్తుంది
 
ప్రేమ భావాలు వ్యక్తం చేసినప్పుడు
ఆకర్షణ పిలుస్తుంది 
ప్రేమ చిగురించి బలమైనప్పుడు
వయసు తపనకు గురౌతుంది

కన్నవారి ప్రేమ కనిపించినప్పుడు
వయసు ప్రేమే గొప్పదనిపిస్తుంది 
పెద్దలు ప్రేమ గుడ్డిదని హెచ్చరించినప్పుడు
వాదనొద్దు మా ప్రేమ బలమైనది   

ప్రేమించే హృదయాలు నిలబడాలన్నప్పుడు
ప్రేమ హార్మోన్సు గొప్పవనిపించు
బాధ్యత ఎరుగని ప్రాయములో ఉన్నవన్నప్పుడు 
వయసు తెచ్చే పోరు గొప్పదనిపించు

ప్రేమలో కష్టాలు ఎదుర్కోవాలన్నప్పుడు
ప్రేమలో ఉన్న అర్ధం అదే నంటుది
కన్నవారిని వదలి వెళ్ళే ప్రేమ కాదన్నప్పుడు
మీకష్టం చూడలేక దారి వెతుకున్నా నంటుంది

ప్రేమ పిచ్చిలో ఉన్న  వాల్లోతో మాట్లాడుట కష్టం
అనుభవాలు వారికి గుణపాటాలవుతాయని
దీవించటమే పెద్దల వంతు 
--((*))--

7. ప్రస్థానం (ఓ చెలి )
భగ భగ మండే సూర్యున్ని
పడమటి  సూన్య గగనానికి
నుదుట ఉన్న సింధూరాన్ని
విరిసిన ముద్ద మందారాన్ని
చల్లదనంతో పంచాలని ఉందా నీకు

అందాలకు మైమరిచే సూర్యుడ్ని
మేఘాల వళ్ళ వచ్చే ఆడ్డుని
క్షణమొక యుగంగా కదిలే వేగాన్ని
కదిలిస్తూ వచ్చే భాస్కరుడికి  
చల్లదనంతో పంచాలని ఉందా నీకు

ఆరాట పడుతున్నా ఆదిత్యుడ్ని
అందాల యామిని ఆదరించి
సహజ సోయగాలతో చల్లబరిచి
వెన్నెల విరహసాగరంలో ముంచి
చల్లదనంతో పంచాలని ఉందా నీకు

విరహతాపంతో ఉన్న అగ్నిని 
చల చల్లని మంచుతో చల్లార్చి         
రేయి అందాలను చూపించి 
మనసు ఆరాటాన్ని తగ్గించి
వెచ్చదనం అందించాలని ఉందా నీకు

ఓ చెలి పడమటి కనుమల కొచ్చా
ఈ రేయి అంతా స్వర్గసీమను తలపింప చేస్తా 
--((*))--


 
8. ప్రస్థానం (మనుగడ ?)

కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే
నీలి కన్నుల వెలుగు ఒక్కటవౌను
మనసును మనస్సుతో చూస్తే
మనుగడ ప్రశ్నార్ధకం తొలగును

బందాన్ని అనుబందంగా చూస్తే
అపశ్రుతులు అంట కుండాఉండును
మౌన వేదం రవలింప చేస్తే 
అనురాగ రాగం బల పడును

చేయి చేయి కలపి నడిస్తే 
పక్క చూపులు లేకుండా కదులును 
భావాలు ఒకటిగా చేసి బ్రమిస్తే
నిజాలకు విలువ పెరుగును

అక్షరాలకు క్షమను జోడిస్తే
సత్యవాక్కులు దొర్లు చుండును
కన్య సొగసులు కావ్యముగా మారిస్తే
చేడుమార్గాలకు దారి లేకుండును

వాలు కనులతో వలపులు కురిపిస్తే
సంసారంలో సమస్యలనేవి లేకుండును
నీలి కనులతో జాడను చూపిస్తే
నిన్న లేని స్వర్గాన్ని చూడ గలుగును

మనసుకు దిగులును చేరిస్తే
ప్రశ్నలతో సతమతమై నలిగి పోవును
కాలాన్ని బట్టి సుఖాలను ఆశిస్తే
సంతోషాలతో లోగిలి వెలుగుచుండును

కాలాన్ని ఎదిరించి బ్రతకాలనిపిస్తే
భయంతో జీవితాన్ని నరకంగా మార్చుకొను
ఊపిరి పూపిరిగా రమియిస్తే
జీవితములో సమరమనేది లేకుండును


9. ప్రస్థానం (ఎలా )

మస్తకంలో ఉన్న మహత్తును
మహిమాన్వితమైన జగత్ విషయాలను
వ్రాసి మందమతులను, ఉత్తెజులుగాను
ఉద్దండ పండితులుగా మార్చాలి ఎలా ?

అలా ఇలా అనుకోవటం అనవసరము
కంటితో చూసినది బుద్ధికి పదును పెట్టడము
బుద్ధిహీనులకు బుద్ధి చెప్పడమే కవిత్వము
కవిత్వం వ్రాతపూర్వకంగా ఉంటె అర్ధం కానివరికి ఎలా ?

కళ్ళతో అమాయకుల ఆక్రందనలు చూడాలి
ఆదుకొనే శక్తి పరుల ప్రోస్చాహంతో బ్రతికించాలి
ఆశయ సాధన లేని రాజకీయాలను వదలాలి
పకృతి సౌందర్యాన్ని ఆస్వాదించి మంచిని పంచాలి ఎలా?

హృదయంతరము లోని భావాలను ఉప్పెనలా
సందర్భోచిత పరిష్కారాలను పెను తుఫానులా
దుష్టచతుష్టయాలను ఎదుర్కోవాలి ప్రభంజనంలా
అస్తవ్యస్త సమాజానికి కవిగా చేయూత నివ్వాలి ఎలా ?
 

 
10. భామనే సత్య భామనే !
.
భామనే.. సత్యా ..భామనే! వయ్యారి ముద్దుల..
సత్య భామనే ..సత్యా భామనే..
భామనే పదియారువేలా కోమలులందరిలోనా
రామరో గోపాలదేవుని ప్రేమనుదోచినా ||సత్య||

అట్టహాసము చేసి సురల అట్టేగేలిచిన పారిజాతపు
చెట్టుతేచ్చి నాదు పెరటా గట్టిగా నాటించు కున్నా..||సత్య||

ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే..
జాణతనమున సతులలో నెరజాణనై..వెలిగేటి ||సత్య||

అందమున ఆనందమున గోవిందునకు నెరవిన్దునే
నందనన్దనుదేన్డుగానక ..నందనన్దనుదేన్డుగానక..
డెందమందున కుములుచుండే ||భామనే||

కూరిమి సత్రాజిత్తు కూతురై ఇందరిలోనా
లలనా.. చెలియా.. మగువా.. సఖియా..
గోపాల దేవుని బాసి తాళజాలక యున్నట్టి..||భామనే|| 

11.  ప్రస్థానం (మామా )

జళ్ళు కురవంగా వళ్ళు తడిసింది మామా 
వళ్ళు జలధరించి తపించింది మామా
కళ్ళు గిర్రని తిరుగు తున్నాయి మామా 
పళ్ళు లాగుతూ పెదాలు పిలుస్తున్నాయి రామామా 

కలవ నిప్పుకొనే యేళ కలుస్తావా మామా 
మంచులా విరజిమ్మే వెన్నెలుంది మామా
పిల్ల గాలి ఈడు కొచ్చి పిలుస్తుంది మామా    
పైరగాలి పులక రింపు చేస్తుంది రా  మామా

కలువపూవు ఖలేజా చూసి పోదువు  మామా
కన్నుల్లో కనుపాప చూసి పోదువు  మామా 
సరిగంగ స్నాన మాడు వేళాయినది మామా
సరసమాడు సమయమిదే జాగు చేయక రా మామా

నీ కళ్ళు , నాకళ్ళు కలిస్తే అదో తృప్తి  మామా
నీ వయసు నా వయసు పెరగాలి   మామా   
నీ మనసు నా మనసు కలవాలి  మామా 
నీ తనువు నా తనువు ఒకటవ్వాలి రా మామా

తరుణం మించ కుండా త్వరపడవా మామా
పరువాలు పదిలంగా పరచి ఉంచాను మామా
అందాల మకరందాన్ని  అందు కోవా మామ
పొదరింట సిరులు అందుకొని పొందువురా మామా
--((*))--

12. ప్రస్థానం (ఉగాది -1)

నదిని వద్దన్నా  కడలిలో  కలువకమానాదు
సమస్యలేన్నున్న కొంత ఫలితం రాక మానదు
కాకి ఎన్నివేషాలు మార్చినా రాజ హంస కాదు
ప్రగాల్బాలకు ఏ ఉగాది శుభసూచికములివ్వదు

ప్రకృతి అనుకూలించకపొతే నిజం తప్పు కాక మానదు
స్వార్ధపరులు, అవకాశవాదులు రాజ్యమేలక తప్పదు
సమాజానికి సర్వతోముఖాభి వృద్ధికి అప్పు తప్పదు
మనోవాంఛ ఫలసిద్ధికోరకు ఈ ఉగాది ఆశ చూపక మానదు

మిడి మిడి జ్ఞానంతో మిడతల్లా కొందరు మారక తప్పదు
గతకాలపపు మరకలను మసిబూసి మరువక  తప్పదు
మహోన్నతుడుగా మారుటకు ఆశ  పెట్టు కోక తప్పదు
కమలం వికసించినట్లు ఉగాది మనసు మార్చక తప్పదు

తెలుగు వైభవములతో వెలుగులు విరజిమ్ముతుంది
గుండె గుండెలో నిండి ఉన్న ఆశలు ఫలింప చేస్తుంది
ప్రతి గళంలో నవరాగాలు, సుఖశాంతులు కల్పిస్తుంది
ఆకలిచావులు, కుంభకోణాలులేని నవఉగాది వస్తుంది     
           


     


13. ప్రస్థానం (ధ్యానం) 

కాయానికి గాయం లేకుండుట కోసం
మనిషిని మనిషిగా గుర్తించుట కోసం
మనసుకు భాద కలుగ కుండుట కోసం 
నమ్మకాన్ని బ్రతికించటం కోసం

ఇహ పర సుఖాలందు కోవటం కోసం
దేహ భౌతిక భాదలు తోలగేందు కోసం
మనస్సు నిశ్చలంగా ఉండేందు కోసం
మెదడు పరిపక్వత వచ్చెందు కోసం

చిత్రిత చిత్రం అర్ధం అయ్యేందు కోసం 
జ్ఞాపకాలన్ని  పునరుద్ధరణ  కోసం 
అనుభూతి లెన్నున్న ఆధారం కోసం 
భావనలు ఎన్నున్నా భావ్యం కోసం

వైద్య వ్రుత్తి సక్రముగా నిర్వహించుట కోసం
న్యాయవృత్తి న్యాయాన్ని బ్రతికించుట కోసం
రక్షకవృతి ధర్మాన్ని నిలబెట్టుట కోసం
అధికారులు సత్య పరిపాలన చేయుట కోసం  

రూపాలెన్నున్నా మనస్సాంతి కోసం
జ్ఞాపకం ఉన్న లేకున్నా ధర్మం కోసం
దేహం దహనమైన ఆత్మ ఉండుట కోసం 
అందుకే పరమాత్మ ధ్యానం అందరి కోసం
 
14. పస్థానం (కళ్ళు )

చీకట్లో వెలిగే నీ కళ్ళు
నా మనసును వెలిగించే
చుక్కల్లా మేరిసే నీ కళ్ళు
న హృదయాన్ని చల్ల పరిచే

పగలు వెలిగే నీ కాటుక కళ్ళు
నా వయసుకి ప్రశాంతత కల్పించే
రాత్రి మైపరిపించే నీ మత్తు కళ్ళు
నా తనువు తపనలు తగ్గించే

నీ భీకర రౌద్రంగా చూసె కళ్ళు
నాలో ఏదో తెలియని ధైర్యాన్ని పెంచే
నీ జాలిగా  చూసే  కళ్ళు
నాలో ఆత్మీయతా భావం పెంచే  

నీ వెన్నెల్లా  మెరిసే కళ్ళు
నా కలలను పంచే మార్గం చూపే
నీవు ప్రేమతో చూసే కళ్ళు
నా జన్మ జన్మల భందం అనిపించే 
--((*))--
15. అవునన్నా కాదన్నా  మారదు ప్రేమ 

అవుననుకున్నా, కాదనుకున్నా 
  వచ్చే కళ్ళ నీరు రాక మానవు
కావాలనుకున్నా, వద్దనుకున్నా
  వచ్చే కలలు రాక మానవు
నీరు పోయకున్నా,  మందు వేయకున్నా  
పెరిగే వృక్షాలు పెరుగక మానావు 
చేనుకు గాలి ఉన్నా , లేకున్నా 
 కొమ్మ కొమ్మా రాచుకోక మానవు

చడువున్నా , చదువు లేకున్నా 
 శక్తి తో బ్రతుకక,  మానవు 
శబ్దం చేస్తున్నా, నిశ్శబ్ధంగా ఉన్నా
  కుటుంబంలో సుఖ దుఃఖాలు రాకమానవు 

కెరటాలు ఎగసి పడుతున్నా,  లేకున్నా
  కడలి ప్రయాణం కష్టం కాక మానవు 
రెండుక్షణాల ప్రేమ ఉన్నా, లేకున్నా
 తల్లితండ్రుల భాదలు తప్పవు
--((*))--




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి