31, మార్చి 2016, గురువారం

Internet Telugu Weekly magazine for the month of 4/2016-13


ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ 
 Sunbeams .
సర్వేజనా సుఖినోభవంతు 



(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (13) (date 01-04-2016 to 07-04-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, నా భావ కవితలు,కధలు మరియు అనేకం
...........................................................................................................


1.ప్రస్థానం (ఒక అవసరం) 

రెండు పాదాల కదలిక
ప్రపంచ సృష్టికి మూల అవటం ఒక అవసరం
నడకకు నరాల కదలిక
ఆకలికి, ఆరోగ్యానికి ఇది ఒక అవసరము
కాళ్ళ మీద పడుతుంది శరీర భారం
గమ్యం చేరుటకు యోగాసనాలు ఒక అవసరం       
ప్రయాణం లో పదనిసలు
ప్రపంచ చరిత్ర తెలుసుకొనుటకు ఒక అవసరము
అడుగులో అడుగు ఎడడుగులకు
బంధమైన, భాద్యత సంసారానికి ఒక అవసరము
మూడడుగుల్లో సర్వాంతర్యామి
సర్వ సృష్టిని కాపాడుట కూడా ఒక అవసరము
ఏడు కొండలు నడుచుట
ఎనలేని ప్రశాంతి పొందుట కూడా ఒక అవసరం 

--((*))--
2. ప్రస్థానం (ఏమిటి )
మాయ కమ్మిందా ఏమిటి
చెప్పిన మాట చెప్ప కుండా చెపు తున్నావా
రాజకీయంలో చేరావా ఏమిటి
చేసేపని చెప్పక చేయని పని చెపు తున్నావా
కవిగా మారుతున్నావా ఏమిటి
ఉన్నవి లేనివి కల్పించి రాద్దామను కున్నావా
రాక్షసుడుగా మారావా ఏమిటి
పైకో రకంగా లోపల వికారంగా ఆలోచిస్తున్నావా
ప్రేమికుడుగా మారావా ఏమిటి
అపరిచుతడ్ని పరిచుడుగా మర్చాలనుకున్నావా
మూర్కుడుగా మారావా ఏమిటి
చిరు చిరుకోపంతో వెర్రి వెర్రి వేషాలు వేస్తున్నావా
నమ్మకద్రోహిగా మారావా ఏమిటి
కబుర్లు అమ్ముకుంటూ గోతులు తవ్వుతున్నావా 
ప్రేమా గురించి ప్రశ్నలా  ఏమిటి
తల్లిని మించిన ప్రేమ లేదని తెలుసు కున్నావా
--((*))--

3. ప్రస్థానం (కర్తవ్యం )

మన మనసే ఒక దేశం
దేశంలో ఉన్నవి అన్ని మన కణాలు
కణాలలో కలుస్తుంది రక్తం అనే మతం
మతంలో ఉంది అనురాగ ప్రేమ
ప్రేమలో ఉంది అమ్మ తత్త్వం
అమ్మ మనసును అర్ధం చేసుకొని
జీవించటమే మనిషి ధర్మం
ధర్మం ఉన్న చోట అంతా ప్రశాంతత
ప్రశాంతత ఉన్న చోట అంతా సుఖం
సుఖంలో కష్టాలు సహజం
కష్టాలను తట్టుకొని జీవించటమే,
సామూహిక స్వేస్చ కోసం బ్రతకడమే 
యుద్ధం చేయక సంధి చేసుకోవడమే
ధైర్యంగా ఒకరికొకరు తోడుగా ఉండటమే
న్యాయాన్ని రక్షించుటకు శ్రమించుటయే
కన్న తల్లిని, కన్న తండ్రిని, ప్రకృతిని
కన్న దేశాన్ని కాపాడుట అందరి కర్తవ్యం
--((*))--




4. ప్రస్థానం (నిరీక్షన)

క్షనమోక యుగంగా నిరీక్షన అంటూ
క్షణ మాగాలేక కటిన దండన అంటూ
ఉద్రేకముతో మనమద్య వాదన వద్దంటూ
ఆవేశంలో ఉన్నానని మౌనం వహించావా 

మాటలు గారడికి లొంగాల్సిన పనిలేదంటూ
రాద్ధాంతం చేసి గుట్టు రట్టు చేయ వలదంటూ  
నెమ్మదిగా ఉంటె పోరాట శక్తిలేని దానినంటూ
నెమ్మదిగా ఉన్నానని నామీద కోపం చూపావా

విద్య ఉన్నదని విచక్షణ చూప లేదంటూ
అర్హత ఉందని అధికారం చెలాయించ లేదంటూ
నా ఓటమిని చూసి గెలుపుగా భావించు కుంటూ
మాట విలువ లేని వాడినని మౌనం వహించావా 

మన మద్యన ఉన్న దూరాన్ని దగ్గర చెయాలంటూ 
మన నమ్మకానికి వమ్ము కాకుండా ఉండా లంటూ 
మన ఆశా, ఆశయాలను ఆచరణలో పెడదామంటూ
కోపం దగ్గించుకుంటే మౌనం వీడి సుఖం అందిస్తానోయి  

image not displayed

5. ప్రస్థానం (వాళ్ళు )

వాళ్లకు బుద్ధిలేదనకు
వళ్ళంతా కళ్ళు ఉంటాయి
వాళ్ళ ప్రవర్తన బాగోలేదనకు
కుళ్ళు మాటలు బయటకొస్తాయి
వాళ్ళ తప్పును బయట పెట్టకు
నకళ్ళు చూపందే నమ్మనంటరు
వాళ్ళు మందు పెడతారణకు
లోళ్లి చేస్తే మంచిది కాదంటారు
వాళ్ళు పిలవకుండా వస్తారణకు
వెళ్ళు మాజోలికి రావద్దంటారు  
వాళ్ళను మూర్ఖులని వాదించకు
కళ్ళు పెద్దవిచేసి కలబడతారు
వాళ్ళ అభిప్రాయాలు నచ్చవణకు
ఏళ్లతడబడి ఉన్నాం ప్రస్నలేస్తారా మీరు
అనిపించుకోవటం ఎందుకు
తుళ్ళి పడే మాటలు మాట్లాడకు
గుళ్ళో కూర్చోని దేవుళ్ళను ప్రార్ధించటం మేలు   





6. ప్రస్థానం (ఒక్కటే)

దేహాలు రెండైన హృదయం ఒక్కటే
ఆలోచనలు రెండైన  ప్రేమ ఒక్కటే
భావాలు వేరైన మనబంధం ఒక్కటే
స్వరాలు వేరైన మనగమ్యం ఒక్కటే
ఎవరనుకున్న నాకు మీరు ఒక్కటే
ఎందరుకాదన్న మీరు నాకు ఒక్కటే
సందేహాలు ఉన్న సంగమం ఒక్కాటే
సంతోషాలు ఉన్న మనసుఖం ఒక్కటే
పాదరసము, వధువును పట్టుటా ఒక్కటే
భార్యకు ప్రేమను పంచేది భర్త ఒక్కడే
బర్తను తృప్తి పరిచేది భార్య ఒక్కతే
కుటుంబాన్ని ఆదుకొనేది దేవుడొక్కడే

https://encrypted-tbn2.gstatic.com/images?q=tbn:ANd9GcTqKyfAidMYKyeIOlxv2er4UKJyoZBCmhPLr8tIdcNQT6X5hsmw
7. ప్రస్థానం (అనుకోకు) 

లోకమంతా  శూణ్యం అనుకోకు
మనసంతా  అగమ్యం అనుకోకు
స్వప్నమంతా కల్లోలం అనుకోకు
శ్రమయంతా వ్యర్ధం    అనుకోకు

శ్రావ్యమంతా సరళం అనుకోకు
భవిష్యంతా  సుస్థిరం అనుకోకు
సవ్యమంతా స్వస్థం   అనుకోకు
గమ్యమంతా గరళం  అనుకోకు  

నిత్యమంతా  సత్యం అనుకోకు
జ్ఞానమంతా  స్వపక్షం అనుకోకు
తృప్తి అంతా  ధర్మం   అనుకోకు
శక్తి అంతా  విజ్ఞానం  అనుకోకు

దేహమంతా సుందరం అనుకోకు
ప్రకృతంతా  పరిమళం అనుకోకు
ప్రేమఅంతా  సుస్తిరం  అనుకోకు
           కర్మఅంతా నిష్కామం అనుకోకు  
         --((*))--


సరదాల చిన్నది

సరదాల చిన్నది,
చాటు మాటు రమ్మన్నది 
దరి కొచ్చి ముద్దిస్తానంటే
భయమెందుకన్నది

అడుగులే తడబడ కుండగా
గువ్వలా  రావా ముందుగా
ఇష్టంగా పిలిచే దాన్నే నుండగా
భయ మెందుకు నీకు దండగా  

మువ్వల పట్టిలు ఘల్లు మనిపించి
చివి జూకాలు జల్లు జల్లు మనిపించి
చేతి కడియాలు ఘల్లు ఘల్లు మానిపించి
కులుకుతూ ఓర చూపులతొ రుచి పెంచి

గళ్ళ చీర చుట్టి, పచ్చ రైకా కట్టి  
కాళ్ళ నిండుగా కాటుక పెట్టి
చెతిలో చేయిపెట్టి, గట్టిగా లాగి పట్టి
మొజుతీర్చరా మగడా అని ముద్దు పెట్టె

సెచ్చని సొగసుల  పైట సవరించి
పరువ మంతా  ఎగసి చూపించి 
పొద్దు తిరుగుడుపువ్వులా తిప్పించి
చిరుగాలి సోకింది తపనలు తగ్గించు

ముచ్చట్లు చెప్పింది
మూతి బిగేసింది
పచ్చని ఛాయా మెరిసింది
జాజి పూల వాసన చూడమంది

సిరి మొగ్ద్గాలై నవ్వింది
జాజి పూలు జరా విడిచింది   
తుమ్మెద ముంగురులకు
కిల కిల రావము పెరిగింది 

సరదాల చిన్నది,
చాటు మాటు రమ్మన్నది
దరి కొచ్చి ముద్దిస్తానంటే
భయమెందుకన్నది
--((*))--


8. మౌనం
శ్రుతి చేసిన మౌన వీణ
అణగారి పోయిన ఆనందానికి  తార్కాణం
తరుణం వచ్చిన ఆగదు ప్రేమ
చీకటి తెరలు తొలిగి వెలుగుకు ఆహ్వానం

మకరంద మధుర స్మ్రుతి
స్మ్రుతి లేనిదే వికసించదు మనస్సు మౌనం
మానం మౌనార్ధం అంగీకారం
మౌనం మమేకం కానిదే తెలియదు అర్ధం

అర్ధంలో తెలుసుకో పరమార్ధం
వ్యర్ధంగా మనస్సును బంధించినా అనర్ధం
స్వార్ధంతో ఎప్పుడు ఆలోచించకు
నిస్వార్ధ జీవితమే మనో నిబ్బరానికి మూలం   
--((*))--

9. ప్రస్థానం  (కన్నులు)

కన్నుల కాంతులు మిన్నలు తాకగా
పున్నమి వెన్నులలు వెలవెల పోయె
స్వేస్చ నయనాలు కాంతలను చూడగా
కన్ను చెదిరి చూపులు కాంతులు చేరే

కన్నులు లేకుంటే లోకం కానలేరుగా
అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానమే
ప్రేమికులల్లో కన్ను కన్ను కలవగా
కన్నులలో వసంతాలు కురుయుట తద్యమే

కంటి భాషతో కను విందు చేయగా
అనంత కోటి భావాలు మనస్సునకు  చేరే
కంటిలో విశేష, విభిన్న భావాలుండగా
గ్రహించే శక్తికి విశేషమో, విభిన్నమో తెలిసే

కళ్ళు మూసుకున్న డంటే నిద్రగా
కన్ను మూసాడంటే అనంత లోకాలు చేరే
కల్ళల్లో నిప్పులు చిమ్ముతున్నాయనగా
కంటి చూపుల్లో అసూయ భావ ముండే

కళ్ళు వేదనకు చిక్కి కన్నీరు కార్చగా
ఆనందానికి, ద:ఖానికి కన్నులు విలపించే
కంటి సోయగం కొందరిని మురిపించగా
ఆ కళ్ళే కుటుంబ సౌఖ్యానికి నాంది పలికే     
     --((*))--


3వ భాగము
మ. మ . త  (పెద్దలకు మాత్రమే )
మనసు మనసు తరుణామృతం   - శృంగార సాహిత్య వచన కావ్యం 
రాం తాత తో మమతల వల్లి, మాణిక్యాల మల్లి, మనసెరిగిన మల్లి  ఈ విధముగా  పలకరించే
   
ప్రియనేస్తమా!!

మరువలేకున్న నేస్తం 
మదిలోని చెడు జ్ఞాపకాలనుండి

కాంతివై రావా నేస్తం 
హృదయంలో ఉన్న అజ్ఞానందకారం తొలగించుటకు

స్వప్నంలోకి రావా నేస్తం
నిదురెరగని నయనాలకు విశ్రాంతి కల్గించుటకు
 
రవళివై రావా నేస్తం
మూగ పోయిన గొంతులో సరాగాలు నింపుటకు

తుంటరివై రావా నేస్తం 
ఒంటరి నైన బతుకుకు ధర్మాన్ని తెలుపుటకు

జ్ఞాపకానివై రావా నేస్తం
మరచి పోయిన మానవత్వాన్ని గుర్తు చేయుటకు
 
భందువై రావా నేస్తం
ప్రేమను రాగాలు పంచి బ్రతికించుటకు

గంధానివై  రావానేస్తం
దుర్ఘంధపు దురాలోచనలు తొలగించుటకు

కుసుమానివై రావా నేస్తం
దేవునిపూజకు, మనస్సు పరిమళించుటకు  

చాలా చక్కగా చెప్పావు పరిమళ మల్లి,      
ఎవరో నిన్ను వెంబడిస్తున్నారు, వారు చెప్పే మాటలు విను అందులో ఉన్న సత్యాన్ని గ్రహించు, తరువాత నీవు చెప్పాలను కున్నది ఆలోచించి చెప్పు అదే నేను నీకు చెప్పేది. వసంతుడు ఈ విధముగా చెపుతున్నాడు
ఓ ప్రియ మల్లిక, అనురూపమైన గుణాల కలిగిన దానవు, ప్రసన్న  సీల వంతురాలవు, నవనీత వర్ణంలో వికసించిన పుష్పానివి నీవు, ప్రణయ మృదుల హృదయ రాణివి నీవు, నీ కోసం నా ప్రాణాలను అర్పించాలని అనుకుంటున్నాను.
నిన్ను నేను ఏంతో ఘాడంగా ప్రేమిస్తున్నాను, నీ మీద ఎన్నో ఆశలు పెట్టు కున్నను, ఆశయాలతో జీవించాలను కున్నను, అందుకు గురుతుగా నా హ్రుదయ్ముమీద నా రక్తం తో నీ బొమ్మ గీసాను చూడు అంటూ ముందుకు వంగి చూపించాడు. ఇప్పుడు నా బ్రతుకు గ్రహణం పట్టిన చంద్రునిలా ఉన్నది,  అక్కడ చంద్రుడు గ్రహణం నుండి బయటకు వస్తాడెమో కాని, ప్రేమ గ్రహణంలో ఉన్నాను, ఈ గ్రహణం వీడి  ప్రేమ ఎప్పుడు ఫలిస్తుండో నాకే అర్ధం కావటం లేదు. నా పరిస్తితి కొన్ని నాళ్ళు మనస్సు భిన్న మదో వికారముగా మారిపోయింది, వలలో చిక్కిన పక్షిలాగా గిల గిల నీ కోసం కొట్టుకుంటూ తప్పించుకొని తిరుగు తున్నాను, ఈ ప్రాయము ఆకర్షణ తగ్గక ముందే నా ప్రేమను వప్పు కుంటావని నేను ఆసిస్తున్నాను.
 నీ ఓర చూపు మహాత్యముతో, నేను నీకు వశ మయ్యాను, నీమాటల తేటలకు చిక్కినాను, నిను పొందలేక, నిన్నుకలువలేక, నా మనసులో ఉన్న కోరిక చేప్పలేక, కాలానికి చిక్కి, మదన తాపముతో,
 విరహవేదనతో తిరుగుతున్నాను సఖీ. 
పువ్వు వికసించి వాడి పోయిందని చెప్పుకోలేక, భగ్న ప్రేమికుడుగా మారలేక, సముద్రములో నది కలసినట్లుగా నీవెప్పటికైనా నాతో  కలుస్తావని, నేను నీకోసం వేచి ఉండుట శ్రేయస్కరమని భావింఛి ఉన్నాను. 
లలితా లావణ్య పూర్ణ బింబ రూపమైన నీ రూపు, నేను ఎప్పుడు మరవలేకున్నను, కనులుమూసిన తెరిచినా నీవే నన్ను వెంబడిస్తున్నట్లు, నా ప్రేమును పొందు నేను నీ దాసిని అని పలు విధములుగా ప్రాధేయ పడినట్లు నాకు కలలోకి వచ్చి మరీ చెపుతున్నావు, ఇప్పుడు నా ప్రేమను తిరస్కరిస్తున్నావు ఎందుకు ?
మకరందాన్ని పొందుటకు తుమ్మెద ఎంతో కష్టపడుతుంది, మకరందాన్ని గ్రోలిన తర్వాత తన ఇష్టాను సారంగా తిరుగు తుంది.దానిలాగా నేను ప్రవర్తించను,నీ ప్రేమను పొందుటకు 
కాలమంతా వేచి యుంటాను  
     అని చెప్పి వచ్చిన దారిన వెళ్లి పోయాడు వసంతుడు. 

రాం తాత  అంతా విన్న తరువాత ప్రేమ అనేది చాల గొప్పది, అది ప్రేవేసించిన తర్వాత ఎవ్వరిని నిల్వనీయదు, ప్రత్యక్షముగా కాని, పరోక్షముగా కాని అది మనిషి జీవితానికి మంచి మర్గాన నడిపిస్తుంది అదిమాత్రం నాకు తెలుసు అసలు ఆడజన్మ గొప్పదనం గురించి ఒక కవి (సిరివెన్నెల గారు) చెప్పిన సినమా గీతం వినిపిస్తాను విను మల్లిక 
నాకు నీవు చెప్పే మాటలు వినాలి ఉన్నది చప్పు అన్నది 

     కార్యేషు దాసి కరణేషు మంత్రి
 
భోజ్యేషు మాత శయనేషు రంభ

 
అపురూపమైనదమ్మ ఆడజన్మ
 
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
 
అపురూపమైనదమ్మ ఆడజన్మ
 
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
 
మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా
 
జీవితం అంకితం చేయగా...
 

అపురూపమైనదమ్మ ఆడజన్మ
 
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా

 
పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై
 
బ్రతుకుతుంది పడతి పతే లొకమై
 
మగని మంచి కొసం పడే ఆర్తిలో
 
సతిని మించగలరా మరే ఆప్తులు
 
ఏ పూజ చెసినా ఏ నోము నోచినా
 
ఏ స్వార్థము లేని త్యాగం
 
భార్యగ రూపమే పొందగా...

 
అపురూపమైనదమ్మ ఆడజన్మ
 
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
 
అపురూపమైనదమ్మ ఆడజన్మ
 
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా

 
కలిమిలేములన్నీ ఒకే తీరుగా
 
కలిసి పంచుకోగా సదా తొడుగా
 
కలిసి రాని కాలం వెలి వేసినా
 
విడిచిపోని బంధం తనై ఉండగా
 
సహధర్మచారిణి సరిలేని వరమని
 
సత్యాన్ని కనలేని నాడు
 
మోడుగా మిగలడా పురుషుడు...

 
అపురూపమైనదమ్మ ఆడజన్మ
 
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
 
అపురూపమైనదమ్మ ఆడజన్మ
 
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
 
మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా
 
జీవితం అంకితం చేయగా...

 
కార్యేషు దాసి కరణేషు మంత్రి
 
భోజ్యేషు మాత శయనేషు రంభ

 ఇంకా కొన్ని ప్రేమ పాటలు తరువాత వారపత్రికలో చదవండి
              ఇంకా ఉన్నది


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి