8, మార్చి 2016, మంగళవారం

Internet weekly magazine - Pranjalai prabha for the month of 3/2016-10

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం
 lord shiva photo: LORD NXZ_zps2c74bdc7.jpg
(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (10) (date 08-03-2016 to 15-03-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, నా భావ కవితలు,కధలు మరియు అనేకం
...........................................................................................................



ప్రస్థానం (స్త్రీ హృదయం )

స్త్రీ హృదయం చిరు దివ్యల వలయం
సుఖాన్ని పంచి చింతల తీర్చే అది ఒక దేవాలయం

పువ్వు వైనానీవె, సాహస స్పూర్తివైనా నీవే
సహనానికి పేరు నీదే, ఘనకీర్తికి మరోపేరు నీదే   
ఓర్పు వహించి, నిగ్రహాన్ని పెంచే స్త్రీవి నీవే   
రాతలలో ఘనత నీదే, మాటలలో నేర్ప నీదే

అందుకే స్త్రీ హృదయం చిరు దివ్యల వలయం
సుఖాన్ని పంచి చింతల తీర్చే అది ఒక దేవాలయం

స్త్రీ అణకువ తనాన్ని చులకచేయుట ఎందుకు
స్త్రీని చూసి నిర్మల హ్రదయంతో సాగు ముందుకు   
స్త్రీ సీలాన్ని పరీక్ష చేసి వేదించుట ఎందుకు
స్త్రీని ఎప్పుడు అవమానించి సాగలేవు ముందుకు  
స్త్రీ గౌరవాన్ని నలుగురిలో చులకన ఎందుకు
స్త్రీని అందరిముందు ఆదరంచుట మరువకు  
స్త్రీ శ్రమలో శ్రవంతి అంటూ హింసించుట ఎందుకు
స్త్రీకి శ్రమలో సహాయపడి ఆనందించుట మరువకు      

అందుకే స్త్రీ హృదయం చిరు దివ్యల వలయం
సుఖాన్ని పంచి చింతల తీర్చే అది ఒక దేవాలయం
--((*))--
ప్రస్థానం (బావమరదల సంభాషణ)
 
కళ్ళు కళ్ళు కలిపి,  కలసి మెలసి తిరిగి,
 కాన రాతివి ఓ మరదలా
వలచి వలచి నీ జాడ కనబడక,
 వగచి వగచి  క్రుంగితిని ఓ బావా 

వల్లంతా కళ్ళు చేసి వెతికి వెతికి
 వేసారి విసిగి నిలచితిని ఓ మరదలా
మొహమన్నావు, దాహమన్నావు
 పిలవగా కానరాతివి ఓ బావా

కోరి కోరి వెంట తిప్పుకొని, మోహమును
కనులలో చూపితివి ఓ మరదలా
కళ్ళల్లో నీ రూపును దాచాను, కన్ను తెరిస్తే,
 నీరూపు చెరుగునెమో ఓ బావా

మరల మరల చూసి, కొంటె నవ్వు నవ్వి
 హృదయాన్ని దోచితివి ఓ మరదలా
ఆశలు చూపి, ఆశయాల గొప్పచేప్పి,
 ప్రేమను చూపక మారితివి ఓ బావా

తొలగి తొలగి తెరమాటునచేరి,
వలపులో ఉన్నా వేడితగ్గించవా ఓ మరదలా
మనసు పొరలు మరగి పోతున్నాయి,
తపణలు చల్లార్చి పోవా ఓ బావా

మరమనిషి అనక, మనసున్న మనిషిని,
 మమతలు  అందిస్తా ఓ మరదలా
పెద్దల ఆసీర్వాదంతో ఇద్దరం ఏకమై
అనంత సౌఖ్యాలు పొందుదామా బావా

నీ మాటే నామాట, నీ ప్రేమ సఫలం
         ఈనాడని ఆ బ్రహ్మ వ్రాసాడు మరదలా                       
నీ మాటే నామాట, నీ, నా  ప్రేమ సఫలం
ఈనాడని ఆ బ్రహ్మ వ్రాసాడు బావ       
---((*))--

-ప్రస్థానం (చీకటి) 
మనసు మనసులో లేక, వెలుగు లేని అంధ కారంలో చిక్కి, కనురెప్పలు పైకి ఎత్తి ఎంత వెతికినా, రెటినాకు కాన రాని అంతర్గతముగా చిక్కుకొనిఉన్నా, బహిర్గాతముగా చెప్పలేని, వెలుగు చూడలేని, మసక చీకటిలో మసిబారిన నా కళ్ళకు అంతా  చీకటి కమ్ము కుంది, మనసుకు చెప్పలేను, వెలుగును చూడలేను, ఇప్పుడున్న నా పరిస్తితి అర్ధం చేసుకొనేది ఒక్క చీకటి మాత్రమే, దానిని చూడాలనుకొని వెలుగును తెచ్చావనుకో, ఎవరికీ కనిపించకుండా ఉడా యిస్తుంది  చీకటి, మరి దానికేందుకో అంత భయము, అందుకే పారిపోకుండా మనల్ని భయంలో మున్చేస్తున్నది చీకటి.

అభాగ్యుల జీవితాలు చీకటిలొ నలిగిపొతాయి, కానరాని అకృత్యాలు చీకటిలో జరుగు తుంటాయి, కళ్ళున్న వారికి కూడా  అపాయాలు జరుగుతాయి, అన్యాయాలు జరిగినా, ధర్మదేవత కళ్ళకు గుడ్డ కట్టి మరీ మనం చీకటిలో న్యాయం వెతుకుతున్నాము,  అశ్లీలతల, అంధకారంలో కదిలే నీడలు, అంతరాలు అర్ధం చేసుకోలేని అగమ్య గోచరణమైన నీలి దృశ్యాలు, కనుమూసుకున్న చీకటిలో కలలో ప్రవేశిం వేదనకు ఆవేశానికి గురిచేసి కనుమరుగైపోయేది చీకటిలో, మనిషిని వెంటాడుతూ ఉంటాయి చీకటిలో చూసిన, అస్తిరాత్వాలు, అమానుషత్వాలు, వెలుగు చూడలేని  పరిస్థితి కల్పించేది చీకటి.
చీకటిలో సాగే వ్యాపారం, నల్ల బంగారం, మనిషి మనిషిగా చూడకుండా సృష్టి రహస్యాన్ని చేధించేది చీకటి.
                                
అందుకే వెలుగులో పనివేరు, చీకటిలో పని వేరు, అంతా  ద్వందాల మయం, సుఖానికి దుఖం (చీకటి), తెలుపు కు నలుపు లా. చీకటి వెలుగుల మయమే మానవుల జీవితం     
--((*))--

ప్రస్థానం (చీకటి )
కళ్ళకు కానారాదు - అటు అంధకారము కాదు
మనసుకు చిక్కదు - అటు స్థిరంగా ఉండేది కాదు
గమ్యం ఎటో చూపదు - అటు తిమిరాన్ని తరిమేది కాదు
వర్ణాలతో కలసే ఉంటుంది - అటు వెలుగుకు అడ్డు రాదు
  
పొద్దు గూకితే వస్తుంది - చల్లని వెన్నెలలోకలువక తప్పదు 
ప్రపంచములో ఉన్నా నంటుంది - ప్రతి మనసులో ఉంటుంది
ధనాశపరులకు నాదారి అన్నది - నిసాచారులకు నిలయమన్నది
తస్కరులకు సహాయమన్నది  - నల్ల బంగారమని చెప్పుకుంటుంది

మనోనిద్రకు నా సహకారమన్నది - సృష్టికి నామార్గమన్నది
జ్ఞాపకాలు నిద్ర పుచ్చేది - చీకటిలో కలలు కళ్ళల్లో చూపించేది  
--((*))--

ప్రస్థానం (ఇదేనంటా)  

పొగడుట  ఆయువు క్షీణమంటా
తప్పును సరిదిద్దుటే ధర్మమంటా
ఒకరి నొకరి గొప్పలు  వర్ధమంటా
నమ్మకాన్ని వమ్ము చేయనంటా 

వేలు చూపే వారిని ఎక్కిరిస్తారంటా 
చిన్న- పెద్దలను గమనిస్తా నంటా 
జనం మెచ్చేలా నాయకనేనేనంటా 
డబ్బు ఉన్నా కరుణ చూపిస్తానంటా

రాజీ లేనికూడు వ్యర్ధమే నంటా 
రాజకీయపు కూడు  వద్దంటా
పేడ పురుగులా ఉండ నంటా 
ప్రకృతిని బట్టి ప్రవర్తిస్తూ ఉంటా   

కాకి గరుత్మంతుడుగా మారదంటా
ఔనత్యం గుణాల వల్లే, ఆసనం కాదంటా
వెన్నెలమారినట్లు సంపద మారునంటా
వివేకశూన్యులు సత్యాన్ని గ్రహించలేరంటా   
--((*))--

ప్రస్థానం (శిశిరం)
శిశిరానికి ఎందు కాన కోపం
అదిఅందరి పై చూపిస్తుంది తాపం
పచ్చని బ్రతుకుకు అదొక విరహం
అంది నంతా ఆవిరిచేసే శాడిజం

నగ్నంగా ఉన్న వళ్ళంతా తడి
పచ్చగా ఉన్న పండ్లు ఎండు
ఎండు టాకులు రాలినట్లు రాలుచుండు
క్రూరత్వంగా చూసే చూపుకూ
రాళ్ళు పగులు చుండు    

దాహం తీరక తప్పికతో ఎండు 
ఎన్ని ఆధునిక యంత్రాలున్నా
శిశిరం ముందు తలవంచక తప్పదు
చల్లదనం కోసం వేమ్పర్లాడుచుండు
--((*))--


ప్రస్థానం ( నా మనసు)
  
విరిసింది నా మనసు
 

వలపుల తనువు కొరకు
 

మకరంద మైనది నా సొగసు
 

తపనాలు తగ్గించుట కొరకు

 

ఝుమ్మంది రతి వేదం
 

జతకూడే తుమ్మెద కొరకు
 

ఆవహించే మోహపు దాహం
 

మరులూరే బ్రమల మైకం కొరకు

 

పరువాల వాహిని రాగం   
 

వసంత వేడుకుల కొరకు  
 

పులకించే యువతి నయనం
 

కాంతుడు పిలుపు కొరకు

 

చిరుజల్లు తడిపె వయసు
 

లతలా వయసును పెనవేసేందుకు
 

రాసలీలకు సరియైన వయసు    
 

మాయ మనసును దోచేందుకు  
--((*))--
 

ప్రస్థానం (కోరిక )
కొండ, కోన, వెళ్ళు విరిసే
కోకిలమ్మా కూ కూ కూసే
చేను ఎపుకేక్కి గాలి వీచే
మంచేనేక్కి గావు కేక వేసే

ఊరు వారు ఉరిమి చూసే
ఎలుక కందకాలు  మూసే
ఇంటి ఇల్లాలు మంచే నెక్కే   
మల్లెపూల చండు చుట్టే

సుందరాంగుడు పక్క చేరే
సిల్కు చీర రెవిక ఇచ్చి కోరే
సరసమాడుదాం ఇటు రావే
తీపి తెచ్చా ముద్దిచ్చి తినవే

సారా తాగ కుండా  వచ్చానే  
చూపుల్లో ఉన్నరుచి చూడవే
మావాముందు జావా త్రాగరాదే
ముద్ద తిను కాస్త ఒపికవస్తుందే

నీ చూపులకే కడుపు నిండినదే
అయితే మావా పోద్దువాలకముందే
వచ్చేయి, నీ కోరిక తీర్చు కొందువులే
--((*))--


ప్రస్థానం (అధరం ) 

అధరం  ఎంత  మధురం
మధురం అంతా ప్రేమ మయం
అతడు
అందమైన యువతీ
ఎందుకు యవ్వనం వ్యర్ధం చేస్తావు
ముందు ప్రేమించా నేను
తొందరగా ప్రేమ వ్యక్తంచేయ వెందుకు
ఆమె
సందు దొరికితే చాలూ 
వద్దనే దాకా వెంబడిస్తూ వేదిస్తా వెందుకూ
సద్దు చేయక తప్పుకో
ఎద్దులా ఉన్నావు నీ ప్రేమ నాకు వద్దులే
అతడు
 యదాహి లోకంలో  
సతదా సహస్త్రదా నా ప్రేమ మారదన్నావు
దాదాలా మారి వేధించకు
సదా ప్రేమను పంచి సుఖపడే దెప్పుడు
ఆమె
పద్దు మాటలు మల్లీ
పొద్దుకు మరుగున పడతాయి కదా
హద్దు లేని ప్రేమ సరి
హద్దు అడ్డుగా ఉంటె ప్రేమ ఎలా పంచను
అతడు
  యద పొంగు  అరగక
ముందే ప్రేమించే వాన్ని మనసు గుర్తించుకో           
మదమెక్కి ఎగిరి పడకు
మృదు మధురముగా ప్రేమించే వాణ్ని వదలకే

ఆమె:అధరం అందిస్తాను నేను
మధురం మధురంగా చేసి తినిపిస్తాను నేను
సుందరస్వప్నాలు  తీరుస్తాను
తొందర తొందర అనకు సమస్తం అర్పిస్తాను నేను  

అధరం  ఎంత  మధురం
మధురం అంతా ప్రేమ మయం
--((*))--


ప్రస్థానం(ప్రయాణం)
కడలిలో భారంగా పరుగెత్తే కెరటమా
ఆశయ సాధనకు సాగే విహంగమా
అలుపెరగగా విస్తరించే  తరంగామా
హాయిని ఆదిలోఅంతంచేసే మధనమా

తరతరాలను కలిపే స్నేహభంధమా
మానవుల ప్రశాంతత తొలిచే శబ్ధమా
కలలో కల్లోల పరిచే ఊహా చిత్ర రాజమా
ఓహో అంటే ఓహో అనే కోకిల గలమా

ఇంధన ఇరుసుద్వారా నడిచే యంత్రమా
నీటిపై తేలి సాగే ప్రయాణ నౌకాయానమా
చూచినవి చూసినట్లు చెప్పలేని నయనమా        
తనవారు అనేవారు లేనివారి ప్రయాణమా 

("మ. మ .త" . వారం వారం వచ్చే కధా నిక  త్వరలో )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి