15, మార్చి 2016, మంగళవారం

Interent weekly magazine for the mjonth of 3/2016-11

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ - 
సర్వేజనా సుఖినోభవంతు 

(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (11) (date 16-03-2016 to 22-03-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, నా భావ కవితలు,కధలు మరియు అనేకం
...........................................................................................................

ప్రస్థానం ( అయ్యలకు అయ్యా నీవేనయ్యా )

మదిలో నిలిచి కదిలించావయ్య
జ్ఞానభోదకు సహకరించావయ్య
అజ్ఞానులు జ్ఞానులగా మార్చాలయ్యా
మనస్సు ప్రశాంత పరచ వయ్యా

పద్యరచన నాకు తెలప వయ్యా
పద్య రచనకు కలం పట్టానయ్యా
అమృతఘడియలో ఆదుకోవయ్యా  
ఆత్మ తృప్తి పరిచేది తెలపవయ్యా

ఘర్షణల నుండి  కాపడవయ్యా
ఆకర్షణలకు చిక్కి ఉన్నానయ్యా
వికర్షణలకు లొంగి ఉన్నామయ్యా
పవన పుత్రా మార్గం చూపవయ్యా

ఓం శ్రీ రాం అని పాడుతున్నానయ్యా
ఓం కార తత్వం ప్రశాంతపరుచునయ్యా
శ్రీ తత్వం నిగ్రహ శక్తిని పెంచునయ్యా
          " ఓం శ్రీ రాం "  ప్రార్ధన చేస్తున్నానయ్యా           
 
అయ్యలకు అయ్యా నీవేనయ్యా
కలియుగ బ్రహ్మవు నీవేనయ్యా
దృష్టుల నుండి   కాపడవయ్య
రామనామం చేస్తున్నామయ్యా
ఆదుకోవయ్యా రామభక్తా గ్రేసరా   
 --((*))--

ప్రస్థానం ( శివా )

మనసును ఆడిస్తావ్
హృదయాన్ని అలిపిస్తావ్
ప్రకృతిలో  గెలిపిస్తావ్
మాయలో పడేసి ఓడిస్తావ్
ఇదే సృష్టి అంటావా శివా

మనిషి తనం నేర్పిస్తావ్
సోమరితనం పెంచేస్తావ్
నిద్రలో ముంచేస్తావ్
మరోసారి ఓడిస్తావ్
ఇదే జీవితం అంటావా శివా
 
అడగకుండా అందిస్తావ్
అందకుండా లాగేస్తావ్
అంటి అంటనట్లు ఉంటావ్
మచ్చాలెన్నో అంటిస్తావ్   
మచ్చే జీవితం అంటావా శివా

నీ లీలలతో వేదిస్తావ్
తలతిక్క వదిలిస్తావ్
మమ్ము చీకటిలో తోసేస్తావ్
వెలుగు నువ్వే చూపిస్తవ్
లీలల జీవితం అంటావా శివా

పుట్టుట మార్గం చెపుతావ్ 
గిట్టుట మార్గం చెప్పవ్
అట్టేనువ్..గమనిస్తావ్..
పావులుగా మార్చేస్తావ్
పావుల జీవితమ్ అంటావా శివా
.
రక్తి అంటే ఏమిటో చూపవ్
అనురక్తి అంటే ఏమిటో చెప్పావ్
స్వశక్తి అంటే ఏమిటో తెలిపావ్
ముక్తికి మార్గం నేనే అన్నావ్
జన్మ జన్మల బ్రమరం అంటావా  శివా

--((*))--


 












ప్రస్థానం ( రాధా కృష్ణ లీల ) 

వెన్నపూస పెడతాను వేకువ జామున వస్తావా
వెన్ను చూపి పోకు గోపాల కృష్ణయ్యా

వన్నె వన్నె నూలుపొగులతొ చేసిన వస్త్రం ఇస్తా వస్తావా
సింగారించుకొని చక్కగా పోకు కృష్ణయ్యా

నీదు శ్రమ వృద్దా కాదు ఉన్నది దోచుకోవటానికి వస్తావా
నీ దనేది ఏముంది అంతా నాది అని చెప్పి పోతావా కృష్ణయ్యా

మువ్వాల రవళితో గానం చేస్తాను వేగముగా వస్తావా
అష్టమ తిధి కాదు అని చక్కగా వచ్చి పోకు కృష్ణయ్యా

ప్రకృతి వెన్నలంతా దాచి ఉంచా వస్తావా
వెన్నెలతో పనిఎంటి అని చెప్పి వచ్చి పోకు కృష్ణయ్యా

మబ్బు చాటు మాయలన్ని మాకు చూపిస్తావా
సర్వం నీకే అర్పణం అన్న వారివద్ద ఉంటాడు ఈ కృష్ణయ్యా
--((*))--


ప్రస్థానం (జీవితం)

బాల్యంలో చిలిపి తనం
యవ్వనంలో ప్రేమమయం
పసితనంలో అయ్యోమయం
ముసలి తనంలో అనుభవం

పేదరికంలో ఉండు పౌరుషం
బాలల్లో ఉండు నేర్పరితనం
బంగారం చూస్తే ఉస్చాహం
యవ్వనంలో వచ్చు కొత్త జ్వరం   

కడలిలో పుట్టు అగ్ని గుండం
కంటిలో ఉండు దృశ్య గోళం
మనసు ఊసులలో కోరు సుఖం
కనుల భాషలో ఉండు మమేకం 

అనుమానం మనసుకు గాయం
ప్రాణిలో కలత నిద్ర అనారోగ్యం
తేట నీరు తీర్చు కొనే దాహం
కన్నీరు మూలం ఉబికే దుఖం 

పక్షులలో గ్రద్ద చూపు దీర్ఘం
పూజారీకి అనుభవం అపారం
నిన్ని గురించి ఆలోచన వ్యర్ధం
నేటి గురిచి చర్చ అనివార్యం
రపటి విచారణ నేడు అనవసరం 
--((*))--

ప్రస్థానం (పొంగు )
వయసుకు పొంగు
సముద్రానికి పొంగు
వేడికి పాలు పొంగు
క్రోధానికి మనిషే లొంగు

సిరులు పెరిగి మనిషి నలుగు
తారలు చూసి మనసు కరుగు
ప్రాణాల కోసం దీపాల వెలుగు
 మచ్చలున్నా గుణాలు మెరుగు

మాలిన్యము తొలగుటకు మరుగు
సిద్ది కోసం కొన్ని జీవితాలు పరుగు
మధుర వాక్కుకు  మనసు కరుగు
నవనడవడిక లో మనుగడ పెరుగు

అందానికి అందలమే లొంగి మునుగు
వెన్నెలకు గాలి తోడై మనసు చెరుగు
చిక్కులు వెంబడించి  మనిషి మరుగు
దీపమున్న జ్ఞ్ఞానం లేని బ్రతుకు నలుగు
--((*))--

ప్రస్థానం ( నేస్తమా )

ఇది కుములుతున్న భారతం
ఇది జరుగుతున్న భారతం
ఇది చితుకుతున్న భారతం
ఇది మౌడ్య మహా భారతం
ఇది ఉద్యమాల భారతం

నేస్తమా ఇది కలియుగం
ఎవరు కర్త - ఎవరు కర్మ
క్రియకు జిక్కు - బ్రతుకులు
ఇది అగమ్యాల భారతం
నేస్తమా చేయకు యుద్ధం చేసినా వ్యర్ధం

ఎంగిలి కాని కలల కోసం
ఎదీ తాకని పెదాల కోసం
కడలిలో కలవని నదికోసం
ఎంత సేపని వేచి ఉంటావు 
నేస్తమా చేయకు యుద్ధం చేసినా వ్యర్ధం

గ్రాసం నీవు వద్దన్నా ఉండు
గ్రామం రానన్నా పిలుచు చుండు 
మానం  వలదన్నా చెడు చుండు
ఋణం వలదన్నా వెంబడించు చుండు
నేస్తమా చేయకు యుద్ధం చేసినా వ్యర్ధం అగు చుండు

తప్పుచేస్తూ నిజాన్ని మింగే   చోట
తప్పుని తప్పని నిరూ పించలేని చోట
మాటకు విలువ లేని చోట
విజ్ఞత విన్నవించలేని చోట
నేస్తమా చేయకు యుద్ధం చేసినా వ్యర్ధం

మందుకు బానిసలైనచోట
కవిత్వ౦ చెప్పిన వినలేనిచోట
నాగరికతే అరణ్యంగా మారిన చోట
ప్రేమ, స్నేహము లేని చోట  
నేస్తమా చేయకు యుద్ధం చేసినా వ్యర్ధం

మనిషిని మనిషిగా గుర్తించని చోట
ఇద్రియాలను విస్మరించిన చోట
లేత చిగురు ఎదగనీయని చోట
రక్తం లో స్వార్ధం నింపుకున్న చోట
నేస్తమా చేయకు యుద్ధం చేసినా వ్యర్ధం
--((*))--
ప్రస్థానం (ఎన్నో )

మనస్సుకు చేరు ఊహలు ఎన్నో
ఉహలలో పలికే రాగాలెన్నో
రాగాలకు మ్రోగే వీణ లెన్నో
మ్రోగే వీణలకు తీగలెన్నో

తీగలు పాడే పాటలెన్నో    
మదిలో మ్రోగే వీనలెన్నో
పెదవులు పలికే పదాలెన్నో
మదిలో జారిన ధారలెన్నో

కళ్ళల్లో వచ్చే కలలు ఎన్నో
కన్నులు తడిపిన కలులు ఎన్నో
ప్రేమ ప్రేమకు మార్గాలెన్నో
ప్రేమతో వచ్చే సుఖాలెన్నో

చీకటి తరిమే కిరణాలు ఎన్నో
చంద్రుడు కప్పే వలువలు ఎన్నో
తలలు వాల్చే కమలాలెన్నో
మనస్సుకు చేరే కోరికలెన్నో

గుండెకు తాకినా సంఘటనలెన్నో
గుండెలు తీసిన గడియలు ఎన్నో
గంధము  చూపిన స్వాసలెన్నో
పుట్టుక నేర్పిన బాసలెన్నో

నీటిలో తేలే పడవ లెన్నో
గాలిలో తేలే పక్షులెన్నో
పిల్లలు చేసే అల్లరిలెన్నో    
నవ్వులు చిందే తారలెన్నో

మనుష్యులకు ఓర్పు, దక్షత
లేక చితికిపోయే కుటుంబాలెన్నో
ఆశలకు, ఆశయాలకు చిక్కి
ఒడ్డున చేరలేని కుటుంబాలెన్నో 
 --((*))--
రావిశాస్త్రి - కథల్లో కవిత్వమే రాస్త్రి!
కోర్టులో ఆవరించి ఉన్న చీకటి మెజిస్ట్రేటుగారి మనసునిండా అలముకుంది. 
న్యాయం పేరుతో కోర్టులో జరుగుతున్న దురన్యాయాన్ని గురించి మథన పడతారు. 
ప్లీడర్ల నల్లకోట్ల నిండా వికృతంగా క్రూరంగా చీకటి పోలీసువారి ఎర్ర టోపీల నిండా చారలు చారలుగా చీకటి చుట్టూ పడున్న ఖాళీ సారా కుండలనిండా చల్లారని చీకటి ముద్దాయిల కళ్ళనిండా దీనంగా అజ్ఞానపు చీకటి.
.
కోర్టులో చట్టాన్ని కాపాడే పేరుతో ప్లీడర్లు, పోలీసులు చేస్తున్న అన్యాయాలకు ప్రతీక ఇక్కడి చీకటి పదం. పదే పదే చీకటి అనే పదం ఒక్కొక్క అర్థంలో ప్రయోగించబడింది.
.
చివరకు నిరపరాధులైనా సాక్ష్యాలు బలంగా ఉండడంతో, కోర్టులోని న్యాయసూత్రాలు తెలియక నిరక్ష్యరాస్యులుగా ఉన్న,  అమాయకపు ముద్దాయిలను శిక్షించవలసి రావడం మెజిస్ట్రేటుగారిని భయపెడుతుంది. నామీద కొన్ని వేల పగలు లోకంలో కోటానుకోట్ల పగలు అనుకుంటాడు.

పగ అనగానే సంప్రదాయపు విశ్వాసం, పాములు పగపడతాయని గుర్తువచ్చి, చుట్టూ ఉన్న సారా ట్యూబులు పాముల్లా కనిపించాయి. పాముల్లా వాటి పడగల్లా ఏమిటి ఏమిటవి రోజూ ఇలాగే పాముల్లా , సారూ ట్యూబులు మోటర్లవి, సైకిళ్ళవి, ఎర్రవి, నల్లవి అన్నిట్లోనూ సారా, కోర్టుకొస్తే సారా  కోర్టులో ఉన్నంతసేపూ సారా, రోజూ దాదాపు ప్రతి కేసూ సారా.....
ఇలా సారా కేసులు తీర్పుల మధ్య నలిగిన మెజిస్ట్రేటుగారికి నిరపరాధులకి జైలు శిక్ష వేసి పాపం మూటకట్టుకుంటున్నాననే అపరాథ భావం కలిగింది.రావుగారి మెదడంతా చీకటి గదిలా ఉంది

చీకటి గదిలో చీమల ఏడుపు వాటి గురించి తేళ్ళు, జెర్రులు నరకం ఎలా ఉంటుంది తేళ్ళతో, జెర్రులతో అతి చీకటిగా
అక్కడ ఏముంటాయి పగపట్టిన చలిచీమలు ....
రావుగారి మానసిక సంఘర్షణను ప్రతీకాత్మకంగా సూచించిన పదచిత్రాలు ఇక్కడ కనిపిస్తాయి. చీకటిగది జైలుని
, చీమల ఏడుపు అనే పదబంధం
జైల్లోని ఖైదీల బాధని, తేళ్ళు, జెర్రులు పోలీసులు వార్డర్లని సూచిస్తాయి. చలిచీమల చేత చిక్కి పద్యం గుర్తు రావడంలో ఆ నిరపరాధులంతా కలిసి తనను చంపుతారేమోని రావుగారికి భయం వేసింది.
.... రావుగారి మానసిక సంఘర్షణను ప్రతీకాత్మకంగా సూచించిన పదచిత్రాలు ఇక్కడ కనిపిస్తాయి. చీకటిగది జైలుని, చీమల ఏడుపు అనే పదబంధం జైల్లోని ఖైదీల బాధని, తేళ్ళు, జెర్రులు పోలీసులు వార్డర్లని సూచిస్తాయి. చలిచీమల చేత చిక్కి పద్యం గుర్తు రావడంలో ఆ నిరపరాధులంతా కలిసి తనను చంపుతారేమోని రావుగారికి భయం వేసింది.
నా చేతులు నల్లని తాచులు
నా చేతుల మూతుల్లో ఐదేసి నాలుకలు అన్నేసి కోరలు
ఈ సిరాలో విషం నా కలంలో కాటు
మెజిస్ట్రేటు పాత్రలో క్రమక్రమంగా కలిగే సంఘర్షణను
కవితాత్మకమైన, ప్రతీకాత్మకమైన పదచిత్రాలతో వర్ణించారు రావిశాస్త్రి గారు .
--((*))--    (సేకరణ అంతర్జాలం)
--((*))--

మ. మ . త  (పెద్దలకు మాత్రమే ) -1
మనసు మనసు తరుణామృతం - సాహిత్య వచన శృంగార  కావ్యం
(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) పచ్చటి తోటయందు పసిడి రంగుతోడ, ఓరచూపు ఇంపుతోడ, అడుగులు దడా  దాడా అనుచుండ, జారేడు కుచకుంభాలు కదులుచుండ, కాల్నడక పోవు చుండ, వదనాంచలమందున చిన్కుల చెమట, మడుగులా మారుచుండగా, వయ్యారంగా మల్లిక కన్పించే

పసినిమ్మ పండ్ల చాయలు, కొసరు ఆ కుసుమ గంధి కోమలపు తోడల్ (లేలేత తామర స్వేత తూడులా లేక పాల లాంటి అరటి ఊచలా ) 
 జారు చెమ్మ, నేలరారు ముత్యాల వరుస, సహజ సౌందర్యముతో వెలసిల్లుచుండా, పదహారో వసంతంలో అడుగుపెట్టి, వయసు వన్నెలతో, మాయని మెరుపు కానవస్తున్నది, బాల్యము వెడలి, నవ యవ్వనపు మొలచు లే లేత సిగ్గుల దొంతరలతో, మధుర మంద హాసంగా ఉండే, నడుస్తుంటే, పురజనులు ఆ ఆ అని నోరు తెరచి, సొంగ కార్చు చుండే, ముందుకు నడుస్తున్నప్పుడు ముందు వెనుక ఎవరున్నారు అనే జ్యాస అనేది లేదు, మరయు అమెకళ్ళకు ఎమీ కనిపించలేదు, కాని ఏదో తెలియని వయసు పొంగే మెరుపు ఆవహించినదని  మాత్రం అర్ధం అవుతున్నది, ఆమె ఏ శృంగార దేవత, కారణము ఏమగునో అని పలువురు ముచ్చట్లు చెప్పుకొనసాగిరి, సౌందర్యదేవత నడచి వెళ్ళినట్లు తన్మయులై ఉన్నారు ఆసమయాన?
   
   యవ్వన నడకతో నడుస్తుంటే  ఇసుక లో కాళ్ళు ఇరుక్కొని ఈడ్చు కుంటూ నడక  ఒకవైపు, మేనుపై  వేడి కిరణాల సెగ ఆవహించి, నిట్టూర్పులతో ఉన్న నడకను చూసిన వారికి కన్ను చెదిరింది,
పడచు జింక పిల్ల నడిచినట్లు నడుస్తుండగా, కాలి పాదాల చెమ్మ, అద్భుత మెరుపుగా కనిపించే., ఆవిధముగా  పొతూ ఉంటే  అక్కడ కొంత దూరములో మామిడి తోపులు కానవచ్చే, మామిడి పూవు నవ యవ్వన సౌందర్యానికి పరవశించి, కొమ్మలపై రేమ్మలపై నిలువలేక, జల జల రాలి పాదాల ముందు చేరే, ఆమె పాదాలు స్పర్శకు పూలు  నలిగినా చెప్పుకోలేని సంతోషముతో ఉండగా, జిలుగు పూల కళంకారి చీర జాఱ, కాలి కడియాలు మలుపు కొనుచు, తనువంతా వంచి సరిదిద్దు కొనుచు, సందెడు చీర కుచ్చెళ్లు చెదరనీక గట్టిగా అదుము కుంటూ, పిల్ల గాలి సవ్వడికే ఎగసిపడుతున్న చీరను పట్టుకొనుచు ఉండగా, ఆ వనమంతయు చూసి పరవసంతో పూల వర్షం కురుపించే.        
అప్పుడే పవనుడు (నిత్య  సంచారి) ఈవిధముగా పాడుచున్నాడు
Photo
ఓ బాల బాల నిన్నే కోరి
 నీచెంతకు చేరి
నవ్వులు కురిపిస్తా రాదరి
సొగసుతో అలుగకు నారి

ఓ పరువంలో ఉన్న తుంటరి
ఓ మనసును తపిస్తున్న చకోరి
ఓ వయసులో చేయద్దు చాకిరి
ఓ ఎందుకు ఉంటావు ఒంటరి

ఒంటరిగా తిరుగకు మయూరి
వస్తాడు పరువాన్ని దోచే పోకిరి
నేను వెంట పడ్డా సరి సరి
నీ ఆశ తీర్చనా ఈ సారి

కళ్ళలో భావం చూపే గడసరి
నేను సరిజోడు కానా మరి
తోడూ నీడవుతాడు ఈ బాటసారి
నీ చూపుకే నాకు వచ్చు శిరి

అంటూ తన్మయత్వంతో నారి మణి చూపుల  తప్పుకోలేక, ఒప్పించలేక మదన తాపముతో కదిలాడు ఆకాశ సంచార పవనుడు .
 ఆ మాటలకు కణతలు త్రిప్పి అనగా విచ్చుకున్న పువ్వులా చూసి కొంగ్రొత్త శోభతో చిరునవ్వు విసిరి, వెన్నెల చెండ్లు పట్టి చేతిలో ఉంచి నెమ్మదిగా ఊదే  కనులు నెలచూపులు చూస్తు, పాదాలు అలవోకగా కదిలిస్తూ చూసి చూడనట్లుగా ఓర చూపు చూస్తూ, చేతితో చీర కొసలు పైకి  ఎగదోస్తూ,  మద్య నిలిచే మల్లిక.  
స్వాగత పక్షి కుహు కుహు అని పిలుస్తున్నట్లు, హ్రదయము బరువెక్కగా, ఎద పొంగులు కాన రాకుండా చీర చుట్టు కొనగా,
 మోహనుడు కంచెను దాటి వచ్చినట్లుగా ఊహించె మోహనాంగి.
మిస మిస లాడు జవ్వనం, మేలిమి మైన పుత్తడి తనువును చేరి, ఓరగా సొగసు నంతా నలిపి నట్లుగా, మనసును పులకరింప చేసి నట్లుగా,  అతని చూపుల యందు ఆర్తి, హృదయాంతరము నందు తరింపక వేదన గురిచేసి వేళ్ళకు మోహనా, తొలకరి వానకు తడిసిన ముగ్ద మోహన లతాంగిని, నాలో ప్రవేశించి నన్ను ఇబ్బంది పెట్టకు.
 అందెల రవళితో, జల జల పారే నదిలా సాగుతున్న లతాంగిని హరిణ పుత్రి చూసి, తొడగని చల్లని చెమటలూరు హస్తంబున దువ్వుచూ చల్లని పలుకులతో  నెమ్మదిగా ముచ్చట్లు చేసే, కళ్ళ వెలుగులు నవరత్నాల వెలుగుల కన్నా మిన్నగా ఉన్నాయి, ఈ మెరిసే ప్రాలు మాలికలకు కారణం ఏదైనా ఉన్నదా ? 
ఈ వనము నందు వచ్చుటకు కారణం చిన్న తనపు చేష్ట అనుకొందునా, అని పలుకుతూ కళ్ళ యందు వాత్సల్య మును కురిపించే, ఆ మోహన హరినంబును ముద్దాడి, తృణ పరిమళమును ఆస్వాదించి     అనువంతా తపించే.

నడచి వచ్చిన ఆయాసము పోలేదు
చీర చెఱగుల తడి యైన ఆరలేదు
తృణమును ముద్దాడిన మక్కువ తీర లేదు
ఆ హా హా ఏనాటి ప్రేమార్ధమో తెలియుట లేదు 

వాలు చూపులతో ఉన్న సొగసుకు మరి కాస్త వన్నె తెచ్చేందుకు, లలిత సుకుమార కుసుమాలు, కురులకు చేరి పరిమళాలతో పరవశిస్తూ  తుమ్మెదలను పిలుస్తున్నట్లుగా, శిరో మండలమునందు ఉండి, ఈ చెట్టు నీడను చేరు ఓ కోమలాంగి అని అన్నాయి

                                             శశేషం ..





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి