16, మార్చి 2016, బుధవారం

ప్రాంజలి ప్రభ - భగవద్గీత - జ్ఞాన యోగం - నాల్గవ అధ్యాయం (Telugu Listen Magazine)


ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   

సర్వేజనా సుఖినోభవంతు  

ముందు మంచిమాట : (12.28) జ్ఞానమే మనిషికి శోభనిస్తుంది. నీతోనే  ఉండేది, నిన్ను ఉద్దరించేది,నీజన్మ చరితార్ధం చేసేది జ్ఞానం మాత్రమే, అందుకే  జ్ఞానం  మనిషికి భూషణం, అందచందాలు, ఆస్తి పాస్తులు, వస్తుభూషణములు, అధికారం , పదవులు , ఇవి అన్ని అనిశ్చితమైనవి అని శ్రీకృష్ణ భగవానుడు మనకు తెలియపరిచాడు . ఇందులో దివ్యజ్ఞాన ప్రకరణం ( 1 నుండి  11 శ్లోకాలుగా) 2. దివ్య కర్మ ప్రకరణం ( 12 నుండి  22 శ్లోకాలుగా), యజ్ఞ ప్రకరణం ( 23 నుండి  33 శ్లోకాలుగా), జ్ఞాన ప్రకరణం ( 34 నుండి  42 శ్లోకాలుగా). ఈ క్రింద ఉదహరించిన వొకారో  టిక్ చేసి పూర్తిగా ఉపోద్ఘాతము విని శ్రీకృష్ణ పరమాత్ముని ఆరాధించి మోక్షం పొందాలని ఇందు పొందు పరుస్తున్నాను. వినండి, వినమని చెప్పండి మనస్సు ప్రశాంత పరుచుకోండి.శ్రీ కృష్ణ పరమాత్ముని ప్రార్ధించండి      
 ప్రాంజలి ప్రభ - భగవద్గీత - జ్ఞాన యోగం  -  నాల్గవ  అధ్యాయం
 రచన, సేకరణ, వ్యాఖ్యానం చేసిన వారు : మల్లాప్రగడ రామకృష్ణ 
ఈ క్రింద ఉదహరించిన వొకారో  టిక్ చేసి వినండి వినమని చెప్పండి
మంచి మాట

1మొదటి శ్లోక భాష్యం : భగవానుడు తెలియజేస్తున్నాడు - అవ్యయమైన ఈ యోగాన్ని నేను సూర్యునికి బొధించెను. సూర్యుదు మనువుకు, మనువుకు ఇక్ష్వాకు మహారాజుకు చెప్పాడు ( 7. 48) 

http://vocaroo.com/i/s147mKxcqBxn 

2రెండవ శ్లోక భాష్యం: పరులను తపింప చేసేవాడు ధర్మాన్ని మరిచి పొతాడు. స్వస్థితిని మరిచిపొతాడు. కనుక తిరిగి స్వస్థితికి చేరాలి.అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు

http://vocaroo.com/i/s0pjaNW5DNiR

3. మూడవ శ్లోక భాష్యం: నీవు నాకు భక్తుడవు, స్నేహితుడవు అందుకే సనాన యోగ్ఫా రహస్యాన్ని నెనునీకు భోధించు చున్నాను (8. 03)
http://vocaroo.com/i/s1COSYu7351O 

4. నాల్గవ శ్లోక భాష్యం: నీవు ఇప్పుడు జన్మించావు, సూర్యుడు ఎప్పుడో జనించాడు ఈ సనాతన యోగాన్ని ఎట్లుభోదిన్చానంటావు ,అది నే నెట్లా అర్ధం చేసుకొనేది .అని అర్జునుడు భగవానున్ని అడిగాడు  (4.. 48)
http://vocaroo.com/i/s0TZust2y6jw 

5. ఐదవ శ్లోక భాష్యం: అర్జునా నాకు నీకు అనేక జన్మలు గడచి పోయి నాయి వాటిని నేను ఎరుగుదును. ఓ పరంతపా నీవు వాటిని ఎరుగవు .అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (7. 35)
http://vocaroo.com/i/s07CL4wjjyXS 

6. ఆరవ శ్లోక భాష్యం: పుట్టుకలేని వాణ్ని, నాశనం లేని వాణ్ని, జీవులందరికి అధిపతిని అయినప్పటికీ, ప్రకృతిని స్వాధీనంలో  పెట్టుకుని నా మాయవల్ల జన్మిస్తూ ఉంటాను .అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (    )

http://vocaroo.com/i/s1jqrfj0fQMQ 

7. ఏడవ శ్లోక భాష్యం:   అర్జున ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం పెచ్చుమీరిపొతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృజించుకుంటాను .అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  5.59)

http://vocaroo.com/i/s05TjzujoqN7 

8. ఎనిమిదవ శ్లోక భాష్యం:  అర్జున సాధుపురుషులను రక్షించటానికి, దుష్టులను నాశనం చెయ్యటానికి, ధర్మాన్ని స్తాపించాటానికి యుగయుగములందు జన్మిస్తుంటాను .అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )
http://vocaroo.com/i/s0G8NXA9mRzo

9. తొమ్మిదవ  శ్లోక భాష్యం:  అర్జునా . ఎవరైతే నా  దివ్యజన్మ, కర్మల గురించి ఈ విధంగా యదార్ధం తెలుసుకుంటారో, అతడు ఈశరీరాన్ని విడచి పెట్టిన తర్వాత తిరిగి పుట్టాడు, నన్నే చేరుకుంటాడు అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  ).

http://vocaroo.com/i/s01KzRzlhjWH 

10. పదవ  శ్లోక భాష్యం:  అర్జునా  రాగము, భయము ,క్రోధము విడిచిపెట్టి, నాయందే చిత్తము నిల్పి నన్నే ఆశ్రఇంచి, జ్ఞాన తపస్సు వళ్ళ పవిత్రులైన ఎందరో నా స్వరూపాన్ని పొందారు .అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )
.
http://vocaroo.com/i/s0MThX0eeR6b

11. పదకుండవ  శ్లోక భాష్యం:  అర్జునా  ఎవరు నన్ను ఎలా కొలిస్తే వారిని నేను అలాగే అనుగ్రహిస్తాను మనుష్యులు అందరూ అన్ని వేళలా నన్నే అనుసరిస్తూ ఉన్నారు అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  


http://vocaroo.com/i/s1Ywowdip0Y1

12. పన్నెండవ  శ్లోక భాష్యం:  అర్జునా.కర్మల యొక్క ఫలితాన్ని కోరుకునే వారు ఇక్కడి దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే  ఈమానవ లోకంలో కర్మల వళ్ళ వచ్చే ఫలిం త్వరగా లభిస్తుంది కనుక   అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )

http://vocaroo.com/i/s1hkw2VV8DC8
13. పదమూడవ శ్లోక భాష్యం:  అర్జునా వారి వారి గుణ కర్మల విభాగాన్ని  అనుసరించి నాలుగు వర్ణాలు నా చేత సృష్టించ బడ్డాయి. వాటిని సృష్టించినది నేనే అయిన కరను కానని, నాశనం లేని వాడినని  తెలుసుకో అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )

http://vocaroo.com/i/s0Rtbqh8Rir5 
14. పదునాలుగవ  శ్లోక భాష్యం:  అర్జున నన్ను తెలుసుకున్నవాడు కర్మలచేత బంధింప బడడు .అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )

http://vocaroo.com/i/s0vgGofuiIuc 

15. పదిహేనవ శ్లోక భాష్యం:  అర్జునా ఇది తెలిసే పూర్వమ్ ముముక్షువుల చేత కర్మ చేయ బడింది. అందువల్ల పూర్వీకులచేత పూర్వం కర్మ చేయబడినట్లే నీవు కూడా నిష్కామ కర్మను చేయి .అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )


http://vocaroo.com/i/s1CPHC3fGSLF

16. పదహరవ శ్లోక భాష్యం:  అర్జునా కర్మ అంటే ఏమిటి ? అకర్మ  అంటే  ఏమిటి? అనే విషయంలో ఋషులు కూడా మొహం చెందుతున్నారు . దేనిని తెలుసుకుంటే నీవు ఈ సంసార బంధం నుండి విడుదల పొందు తావో ఆ కర్మ గురించి నీకు చక్కగా తెలియజేస్తాను .అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )


http://vocaroo.com/i/s1ZZASYT6Z6J 

17. పదిహేనవ శ్లోక భాష్యం:  అర్జునా. కర్మ వికర్మల గురించి తెలుసుకోవాలి. కర్మయోక్క మార్గం మహా నిఘూడమైనది. ఆకర్మల గురించి కూడా తెలుసుకోవాలి . అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )

http://vocaroo.com/i/s0PdguoPAPRj

18. పదిహేనవ శ్లోక భాష్యం:  అర్జునా కర్మ యందు ఆకర్మను, ఆకర్మ  యందు కర్మను గుర్తించేవాడు, మనుష్యులలో బుద్దిమంతుడు, అతడే యోగి .అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )

http://vocaroo.com/i/s0aXdBvbWtQ0

19. పదిహేనవ శ్లోక భాష్యం:  అర్జునా కామ సంకల్పాలు లేకుండా సమస్త కర్మలను ఎవరు ప్రారంభిస్తారో, కర్మ ఫలాలను జ్ఞానాగ్నిలో ఎవరు దగ్ధం చేసు కుంటారో అట్టి వానిని వివేకి అని అంటారు .అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు ( 
http://vocaroo.com/i/s0fd45asMG6Y 

20. . ఇరవై వ శ్లోక భాష్యం:  అర్జునా కర్మ ఫలంతో సంగభావాన్ని విడిచిపెట్టినిత్య తృప్తుడై యుండి, దేనిమీదా ఆధారపడకుండా కర్మలలో నిమగ్నుడై యున్నప్పటికీ  ఏ కర్మ చేయనివాడే అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )

http://vocaroo.com/i/s0iWUWDOK0am

21. ఇరవై ఒకటవ శ్లోక భాష్యం:  అర్జునా ఆశలేకుండా, మనోబుద్దులను స్వాధీనములో ఉంచుకొని , పరిగ్రహ భావాన్ని విడిచి, కేవలం శరీరంతో  కర్మ చేసినా పాపాన్ని పొందడు  అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  


http://vocaroo.com/i/s0O650Hyk3Es

22. ఇరవై రెండవ శ్లోక భాష్యం:  అర్జునా లభించినదానితో తృప్తి చెంది,  ద్వందాలకు అతీతుడవై కార్యం సిద్ధిన్చినా, సిద్ధించక పోయిన సమభావం కలిగినవాడు కర్మలు చేసినా బంధింపబడడు  అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )



http://vocaroo.com/i/s0BeMLYmv8VV

23. ఇరవై మూడవ శ్లోక భాష్యం:  అర్జునా  దేనియందు సంగ భావం లేనివాడు, ఫలాసక్తి లేనివాడు, ఆత్మజ్ఞానమునందు నిలిచినవాడు, భగవత్ప్రీతి కరంగా చేసే కర్మ పూర్తిగా నశించి పోతున్నది అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )


http://vocaroo.com/i/s0PjB1r5XweW 

24. ఇరవై నాల్గవ శ్లోక భాష్యం:  అర్జునా బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన  వానిచేత అగ్ని  వ్రేల్చబడిన హవిస్సు బ్రహ్మమే, స్రుక్ సువాలు బ్రహ్మమే  సర్వము బ్రహ్మమే  అను భావము నిశ్చయముగా  అట్టి జ్ఞానిచేత పొందదగినది కూడా బ్రహ్మమే   అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )

.

http://vocaroo.com/i/s1VwqRQcfEOS


25. ఇరవై ఐద రెండవ శ్లోక భాష్యం:  అర్జునా కొందరు యోగులు దైవయజ్ఞాన్ని చక్కగా చెస్తారు. మరికొందరు బ్రహ్మమనే  అగ్నిలో యజ్ఞం ద్వారా యజ్ఞాన్ని అర్పిస్తారు    అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )



http://vocaroo.com/i/s0gXapNK9LpH

26. ఇరవై ఆరవ శ్లోక భాష్యం:  అర్జునా శ్రోత్రాది ఇంద్రియాలను కొందరు నిగ్రహమనే అగ్నిలో వ్రెలుస్తారు. మరి కొందరు శబ్దాది విషయాలను ఇంద్రియాలనే అగ్నియందు వ్రేల్చు చున్నారు   అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )


http://vocaroo.com/i/s0jbyRzEhZDH 

27. ఇరవై ఏడవ  శ్లోక భాష్యం:  అర్జునా  మరికొందరు సమస్తమైన ఇంద్రియ కర్మలను, ప్రాణ కర్మలను జ్ఞానంచే ప్రకాసింప జేయబడిన ఆత్మ సంయమమనే అగ్ని యందు వ్రేల్చుచున్నారు. అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )
27
http://vocaroo.com/i/s1cC7FCxE92D

28. ఇరవై ఎనిమిదవ  శ్లోక భాష్యం:  అర్జునా  నియమములుగాలయతులు కొందరు ద్రవ్య యజ్ఞములు, తపోయజ్ఞములు, యోగ యజ్ఞములు, స్వాధ్యాయ యజ్ఞములు, జ్ఞానయజ్ఞములు చేస్తారు అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )

http://vocaroo.com/i/s1ZZ6ziY1RpG 

29. ఇరవై తొమ్మిదవ  శ్లోక భాష్యం:  అర్జునా ప్రాణాయామ పరాయణు లైన కొందరు ప్రాణ అపాన మార్గాలను నిరోధించి, అపాణము నందు ప్రాణాన్ని, ప్రాణమునందు అపాణాన్ని ఆహుతులుగా వ్రేలిస్తారు   అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )


http://vocaroo.com/i/s08ELMDIedai 

30 ముపై వ  శ్లోక భాష్యం:  అర్జునా కొందరు నియమితమైన ఆహారాన్ని తీసుకుంటూ ప్రాణాలను ఆహుతి ఇస్తారు, వీరందరూ యజ్ఞవిదులే. యజ్ఞం వాళ్ళ కల్ముషాలను తొలగించు కుంటారు   అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )

http://vocaroo.com/i/s1IYiG2OgplZ 
31 ముపైవకటవ  శ్లోక భాష్యం:  అర్జునా కురుశ్రేశ్టా యజ్ఞం చేయగా మిగిలిన అమృతాన్ని భుజించినవారు సనాతన బ్రహ్మాన్ని చేరు కుంటారు. యజ్ఞం చెయ్యని వాడికి ఈ లోకమే లెదు.  పరలోకమేక్కడ?  అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు ( 

http://vocaroo.com/i/s0zqsFZX31X7 

32 ముపైరెండవ  శ్లోక భాష్యం:  అర్జునా బ్రహ్మ ముఖమునుండి  వచ్చిన వేదములను తెలుసుకోవాలి   అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు ( 


http://vocaroo.com/i/s0S6DtqBB7nK 

33 ముపైరెండవ  శ్లోక భాష్యం:  పరంతపా ద్రవ్యంతో చేసే యజ్ఞాలన్నింటి కన్నా జ్ఞాన యజ్ఞం శ్రేష్ట మైనది. అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )
http://vocaroo.com/i/s0pFBZXlr6zh

34 ముపై వ  శ్లోక భాష్యం:  ఆత్మజ్ఞానాన్ని సాష్టాంగ నమస్కారం చేసి,  సేవించి,సమయం చూసి, ప్రశ్నించి తెలుసుకో ఆత్మానుభావం, శాస్త్రజ్ఞానం గల గురువులు నీకు ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు   అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )
http://vocaroo.com/i/s1b4xRn0b0k9

35 ముపై ఐదవ శ్లోక భాష్యం:  అర్జునా దేనిని తెలుసు కొంటే  తిరిగి ఈ ప్రకారంగా మొహాన్ని చెందవో, దేనిచేత  అశేషమైన జీవుళ్ళను నీలోను, నాలోనూ చూడ గలుగుతావొ అదే ఈ జ్ఞానం   అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )

http://vocaroo.com/i/s1FKIR68t3C7

36 ముపై ఆరవ శ్లోక భాష్యం:  అర్జునా పాపాములందరిలోకి గొప్ప పాపం చీసిన వాడివైన  నీ సమస్త పాపాన్ని జ్ఞానమనే పడవ సాయంతో  దాటివేస్తావు   అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )

http://vocaroo.com/i/s058RTbygk6p

37ముపై ఎదవ  శ్లోక భాష్యం:  అర్జునా  ప్రజ్వలిస్తున్న ఆగ్ని ఏ  విధంగా కట్టెలను భస్మీపటలమ్ చేస్తుందో అలాగే జ్ఞానాగ్ని అన్ని కర్మలను భస్మీపటలమ్ చేస్తుంది అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )  
 http://vocaroo.com/i/s0y02zHfcK4K


38 ముపై ఎనిమిదవ శ్లోక భాష్యం:  అర్జునా జ్ఞానంతో  సమానమైన పవిత్ర వస్తువు మరొకటి ఇక్కడ లెదు. అత్మ జ్ఞానాన్ని కర్మయోగంలో సిద్దిపొందినవాడు కాలక్రమంలో తనయందే స్వయంగా పొందుతాడు   అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )
 http://vocaroo.com/i/s07CaJYoFWGu

39ముపై తొమ్మిదవ  శ్లోక భాష్యం:  అర్జునా  శ్రద్దగలవారు, జ్ఞానమునందే తదేక కనిష్ట గలవారు, ఇంద్రియనిగ్రహం గలవారు జ్ఞానాన్ని పొంద గలగుతారు. జ్ఞానానుభవాన్ని పొంది సీఘ్రముగా శ్రేష్టమైన శాంతిని పొందగలుగుతారు అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు ( 

http://vocaroo.com/i/s1lxAheGSpXv

40 నలబై వ శ్లోక భాష్యం:  అర్జునా జ్ఞానం లేనివాడు, శ్రద్దలేనివాడు, సంశయాత్ముడు నశించిపోతాడు, అన్నింటిని సందేహించేవాడికి ఇహమూలేదు, పరమూలేదు, సుఖమూలేదు   అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (7. 27  )  

http://vocaroo.com/i/s0m2OyjLZktq


41 నలబై ఒకటవ శ్లోక భాష్యం:  అర్జునా నిష్కామకర్మయోగంచేత కర్మ ఫలాలను సన్యసించి, జ్ఞానంచేత  ఆత్మవంతున్ని కర్మలు భందించవు    అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )

http://vocaroo.com/i/s0VuWYbK3RR2


42 నలబై రెండవ  శ్లోక భాష్యం:  అర్జునా  అజ్నానం వల్లా పుట్టి నీ హృదయంలోనే ఉన్న సంశయాన్ని ఆత్మజ్ఞానమనే ఖడ్గంతో చేదించి నిష్కామ కర్మయోగాన్ని ఆచరించు లెమ్ము అని శ్రీకృష్ణ భగవానుడు భోదించాడు (  )

http://vocaroo.com/i/s0RRJVY2fFWU 


 ఓం తత్ సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాను ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్దోధ్యాయ :
 
(4వ ఆధ్యాయం సమాప్తం)
ఓం శాంతి:    ఓం శాంతి:    ఓం శాంతి:

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి