ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ -
సర్వేజనా సుఖినోభవంతు
(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి)
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము -
మా లక్ష్యము
సంచిక (12) (date 23-03-2016 to 31-03-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ : మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, నా భావ కవితలు,కధలు మరియు అనేకం
...........................................................................................................
1. పస్థానం (క్షణ భంగురం )
మనసు కరుగుటకు దారేక్కడుంది -
కన్నీటి బొట్టుకు విలువేక్కడుంది
సమ సమానత్వానికి చోటెక్కడుంది
నిజాలు గ్రహించే శక్తి కాన రాకుంది
కొయ్య బొమ్మల్లా బ్రతుకాల్సి వస్తుంది
వ్యధతో సుఖాలు పంచా ల్సి వస్తుంది
కొలువుకులొంగి స్వరాలు పంచుతుంది
కన్నీటి బొట్టుకు విలువలేక విలపిస్తుంది
ఆణువణువూ అంతరాత్మను క్షోభ పెడ్తుంది
లోకతత్త్వం తెలుసుకోలేక తల్లడిల్లిపోతుంది
వేషధారణతో పరాయి అంతరంగాన్ని కవ్విస్తుంది
చరిత్ర లేని ఏకాకి మూగ జీవిగా మారుతుంది
కధలు కధలుగా చెప్పుకొన్న కర్కశంగా మారింది
ఓర్పు చూపిన ఓదార్పులేని జీవితమనుకున్నది
ఎప్పుడు వెలివాడ వెలవెల పోదు జీవికి దారి ఇది
తడి పొడి బ్రతుకుల క్షణ భంగుర జీవితమే ఇది
ఊపిరి ఉందా, లేదా, అని గమనించని బ్రతుకు ఇది
అర్ధం కోసం అద్దం లో సౌందర్యం చూపే జీవిత మిది
సానుభూతి మాలోమాకు, వచ్చిన వారి కెక్కడుంది
ఆవేశం చల్లార్చి, ఆదమరచి నిద్రే బ్రతుకుగా మారింది
2. ప్రస్థానం (ద్విపద విషాద ప్రేమ)
ఆమె
శాంతి లేదు, క్రాంతి లేదు - ఈ జీవి తానికి, తోడే లేదు
ఓర్పు లేదు, ఓకూర్పు లేదు - ఓర్చుకొనే, ఓపికా లేదు
అతడు
వేదన నీతో, యాతన నీతో - కోపము నీతో, తాపము నీతో
సాయము నీతో, పైకము నీతో – నిలువ,గెలువలేవు నాతో
ఆమె
ఆశా జ్యోతి, కాన లేదు - కోవెల క్రాంతి, తోడు లేదు
ఆర్తి తీర్చే, దారి లేదు - సఖుని ఆశకు, దిక్కేలేదు
అతడు
మొహం నీతో, దాహం నీతో - మురిపం నీతో, ముసలం నీతో
తరాలు నీతో, తెరలూ నీతో - తప్పుకోక, ఒప్పుకోవా నాతో
ఆమె
వయసు లేదు, ఊపిరి లేదు - ద్యానము లేదు, ప్రార్ధన లేదు
కదలిక లేదు, కన్నుచెదర లేదు- నటన లేదు, నమ్మకం లేదు
అతడు
మమత నీతో, మనుగడ నీతో - జ్యాస నీతో, జాప్యం నీతో
మాయ నీతో, మర్మం నీతో - నిలువవా నాతో, కలువవా నాతో
ఆమె
క్రాంతి లేదు, బ్రాంతి లేదు - యుక్తి లేదు, ముక్తి లేదు
తుళ్లు లేదు, కుళ్ళు లేదు - చూడ లేదు, చెప్పలేదు
అతడు
కధ నీతో సోద నీతో
- కల నీతో నీడ నీతో
కాంక్ష నీతో కక్ష నీతో - పలకవా నాతో కులకవా నాతో
ఆమె
స్మరణం లేదు, శ్రవణం లేదు - జాతి లేదు, నీతి లేదు
గతం లేదు, పొంతన లేదు - పాక లేదు, కేక అసలే లేదు
అతడు
విన్యాసం నీతో, వినోదం నీతో - ఉప్పెన నీతో, ఉల్లాసం నీతో
గలాభా నీతో, గమనం నీతో - విన్యాసం నాతో, సన్యాసం నాతో
3. ప్రస్థానం (సంగీతమ్)
కోరిక ఉన్నది నోట మాట రాదు
మాట వచ్చిన నోట పాట రాదు
పాట వచ్చిన ఒక్క పల్లవీ రాదు
పల్లవి నేర్చిన అవకాసం రాదు
ప్రేమ చరణాలు పాడక తప్పదు
సంగీతంపై అన్వేషణ తప్పలేదు
వయస్సును వంచించుట లేదు
ప్రకృతి పంచే వాకిలికి తప్పదు
పాటను పాడాలని కోరిక కలిగింది
అనుకోకుండా ఒక పల్లవి కుదిరింది
కానీ ఆపై అమరలేదు చరణాలు
అన్వేషణలోనే మనుగడ నలిగింది
నేనో గానం చేయాలను కుంటున్నా
వచ్చే అవరోధాలను దాటాళను కున్నా
ఎన్నో ప్రయత్నాలు చెస్తూ నే ఉన్నా
ఏది మంచో ఏది చెడో తెలియ లేకున్నా
నీకోసం సంగీతమ్ నేర్చుకున్నా
సంగీతంతో బ్రత కాలను కున్నా
నీ భందం కోసం కష్టపడుతున్నా
సంగీతానికి గానం తోడవ్వలనుకున్నా
--((*))--
4. ప్రస్థానం (పంచ భూతాలు )
పవిత్రంగా పునీతమౌతున్న పంచభూతాలు
పృథ్వి తొలకరి దిద్దిన మధుర వాసనతో
గ్రీష్మ తాపాన్ని తట్టుకొని నవ వనాలతో
ప్రకృతిమయమై అనేక అనుభూతులతో
ప్రతి మనసుకు తృప్తినివ్వాలని తపనతో
మోస్తూ చివరకు తనలోకి చేర్చుకోనేది భూమి
పగలు సూర్య వెలుగుతో, రాత్రి చెంద్రుని వెన్నెలతో
కడలిని పీలుస్తూ,
కుండల్లా మేఘాల వివిస్తరణతో
శబ్ద కాలుష్యాన్ని భరిస్తూ ఎవ్వరినీ అనలేని తనంతో
రంగులు మార్చే మేఘాల మెరుపుల కదలికలతో
లెక్కించలేని పరిధిలో అనంతంగా ఉన్నదే ఆకాశం
జాలువారు నదిలో గాలి చేరి తుమ్పరులతో
నిత్య సంచారము చేయు గాలి విహంగాలతో
ప్రాణులను రక్షించేగాలి తరువుల కదలికలతో
గాలికి కోరికల రెపరెపలు కళ్ళు కదలికలతో
పీల్చని వారుబ్రతకరు, అందుకే కావాలి ఈ గాలి
స్వార్ధంతో, నిస్వార్ధంతో దగ్గరవ్వాలని తపనతో
కడలిలో అగ్ని పుట్టి వచ్చి చేరే తుఫానులతో
అగ్నికి శిలలుకరిగి లార్వగామారి కప్పే బుడిదతో
అడవిని అగ్ని రగిల్చగా వణ్యప్రాణులు పరుగులతో
ఉదరంలోని ఆహారం జీర్ణ మగుటకు రక్తంతో కలిసేది అగ్ని
హృదయం తల్లడిల్లి చెమ్మగా వచ్చే కంటి నీరుతో
గంగ యంత్రాల ద్వారా ఉద్భ వించే జలాలతో
ఎడారిగా మారుతున్న మనసులపై చల్లే నీరుతో
బ్రతుకు తెరువుగా నిత్యమూ దొరికే జలాలతో
ఆభిషెకానికి, ఆఖరిచూపుకు పనికి వచ్చేది నీరు
5. ప్రస్థానం ( తీరు వేరు)
ఊట తేట, నీరు ఉడుకు, తగ్గించే తీపి నీరు
మాట బాటకు, ప్రేమ తపన, తంగ్గించే తీరు
వేనె మాట, చూపించె బాట, చెప్పే దారే వేరు
ఆణువణువూ చుట్టి, మతి పోగెట్టే, తీరే వేరు
లోపా లెత్తే తీరు పరిహాసం చేసే చూపె వేరు
దిద్దు బాటు, తడబడుతూ, మనసు తీరె వేరు
పూల బాట లేక, ముళ్ళ నడక, తప్పని తీరు
సాగుతూ, ఆగుతూ మదన పడే, తీరె వేరు
మబ్బుకు ఉరుము, పువ్వుకు తావే తీరు
నాకు నీవు, నీకు నేను, ఇది తప్పని తీరు
వెనుకా ముందు, ఆలోచించకు ఉండు, ఒకే తీరు
హని చేయకు, ప్రేమతో కలసి మెలసి, ఉండే తీరు
గాజుల సవ్వడి, మువ్వల సందడి స్త్రీల తీరు
మాటల్లో మెరుపు, చేతల్లో తలుకు ఒకే తీరు
స్నేహం ప్రేమ, భంధం, యుద్ధం ఒకే తీరు
నవ్వులాట, గువ్వలాట, సై సై అనే తీరు
--((*))--
6. ""ఓ "" అమ్మ కష్టం ఇంకా గుర్తుంది
నిద్ర లెస్తూనె కల్లాపు చల్లి ముగ్గు పెట్టేది
న్యూస్ ప్యాపర్ ఇంట్లో పెట్టి, పూలు కోసేది
పాల ప్యాకెట్లు తెచ్చి పాలు, నీల్లు కాచేది
స్టవ్ మీద కాఫీ పెడూతూ భర్తను నిద్రలేపేది
గీజర్ ఆన్ చేసి కొడుకులకు నీళ్ళు పోసేది
ఒకరికి టిఫెన్ పెట్టేది, మరొకరికి అన్నం పెట్టేది
భర్తకు కాఫీ ఇస్తూ వేన్నిళ్ళు పోసుకోమనేది
పిల్లల స్కూల్ బ్యాగుల్లో లంచ్ బాక్సు సర్ది ఉంచేది ,
పిల్లలు స్కూల్ రిక్షా ఎక్కె దాక ఉండి వచ్చేది
భారతః బట్టలు ఇస్త్రీ చేసి, షూస్ సరిచేసి ఉంచేది
భర్తః టైం ఐంది అని బొంగరంలా తిరుగుతూ ఉండేది
భర్తకు రీడింగ్ గ్లాసస్, బెల్ట్ తుడిచి ఇచ్చేది
కరంటు పోయినా భర్త టిఫెన్ తినేదాకా విసిరేది
భర్తకు లంచ్ బాక్సు సర్ది, పాస్, ఐడి కార్డు ఉంచేది
ఇంటి ఖర్చు అంతా ఆ అమ్మే చూసు కొనేది
క్షణం విశ్రాంతి లేకుండా గడియారంలా తిరిగేది
భర్త ఆఫీస్ కు వెళ్ళాక స్నానం చేసి వచ్చేది
పది నిముషాలు పూలతో దేవునికి పూజ చేసేది
నైవేద్యానికి పెట్టిన ప్రసాదాన్ని తిని ఆలోచించేది
బట్టలు సర్ఫు నీటిలో నానా బెట్టి ఉతికేది
అంట్ల గిన్నెలను బావి దగ్గర వేసుకొని తోమేది
యంత్రంలా బ్రతుకు నేట్టు కోస్తున్నాని భాద పడేది
చదువుకున్న వారిని చూసి, చదువే లేదని భాదపడేది
తోబుట్టువులు సహకరించక భాద పెట్టారని భాద పడేది
రేడియో ఆన్ చేసి జనరంజని పాటలు వినేది
ఇంత కష్టపడ్డ భర్త కోపానికి భయ పడేది
కొత్తచీర కొనుక్కోవాలన్నా అడగటానికి భయ పడేది
ఆర్ధిక పరిస్తితులు తారుమారుకాగా ఉప్పోషాలు ఉండేది
వండిన దానిలో పిల్లలకు సర్ది భర్తకు పెట్టి, నీల్లు త్రాగి బ్రతికేది
భర్తకు ఉద్యోగం పొతే అధైర్యపడ వద్దని ప్రోస్చ హించింది
భర్తతో వడియాలు, అప్పడాలు, చేసి ఇస్తా అమ్మమనేది
సేమ్యా, ఊరి మిరపకాయలు, చేసి ఇస్తా అమ్మ మనేది
భర్తకు ఉద్యోగం వచ్చి ఆర్ధికంగా కొంత మెరుగైనది
పిల్లల చదువులుకు కాలేజీలో చేర్చటం జరిగింది
కోర్టు చుట్టూ తిరుగుట వల్ల అమ్మ ఆరోగ్య చెడిపోయింది
ఆదాయం పెరిగింది, ఆ అమ్మ గుండె నెప్పి కూడా పెరిగింది
అమ్మద్వారా ఆస్తి వచ్చింది, నాన్న ఆదరణ తగ్గింది
నాన్న సుఖం కోసం బయట తిరగటంవళ్ళ అమ్మ రోగం పెరిగింది
అమ్మ ఆదరణ నోచుకోలేక అనంత వాయువులో కలిసింది
నాన్న స్వేస్చ వచ్చి తిరుగుటకు అవకాశము దొరికింది
డబ్బు ఉన్నా పిల్లల బ్రతుకుకు గుర్తింపు లేక పోయింది
మరో అమ్మ వచ్చి మనస్సు విరచి పిల్లలను వేరుచేసింది
పిల్లలకు తండ్రి ఉన్న లేని వాడి లెక్కలోకి చేరింది
మరో అమ్మ వచ్చాక సిరి పోయి కుటుంబం వీధిన పడింది
7. ప్రస్థానం ( కష్టం - అనుకోకు )
ఊహలు నిజం అవుటం కష్టం
లోకాలు చూడటం కష్టం అనుకోకు
వాస్తవాలు గ్రహించటం కష్టం
భౌతికాలు గ్రహించటం కష్టం అనుకోకు
మంచిని బ్రతికించటం కష్టం
చెడును చూడటం కష్టం అనుకోకు
ప్రశాంతంగా జీవించటం కష్టం
ప్రేమ పెంచుకోవటం కష్టం అనుకోకు
సమయాన్ని పాటించటం కష్టం
కల్పనలను కల్పించటం కష్టం అనుకోకు
మానవత్వాన్ని బ్రతికించటం కష్టం
మనసు అర్ధం చేసుకోవటం కష్టం అనుకోకు
చిత్రంలా మనిషి జీవించటం కష్టం
విచిత్రాలు సృష్టించటం కష్టం అనుకోకు
కలలోచూసిన స్వర్గం పొందటం కష్టం
కుటుంబం స్వర్గంగా మార్చుట కష్టం అనుకోకు
--((*))--
8. ప్రస్థానం (నా. నీ.)
నా పాట నీ మాట ఒక శ్లోకమై
నా నడక నీ బాట ఒక దీపమై
నా దాహం నీ తాపం ఒక జీవిమై
నా లక్ష్యం నీ ధ్యేయం ఒక మార్గమై
నా విషం నీ అమృతం ఒక రోగమై
నా తనువు నీ తనువు ఒక జీవమై
నా సిగ్గు నీ ఒగ్గు ఒక మమేకమై
నా వేడి నీ చల్ల ఒక అనురాగమై
నా ప్రశ్న నీనా జవాబు ఒక రాగమై
నా నిషీధానికి నీ ఉత్తేజ తేజమై
నా శోకానికి నీ ఊరట బలమై
నా బుద్ధికి నీ ఓర్పు శక్తి యై
నా స్నేహానికి నీ ప్రాణమై
నా కావ్యానికి నీ కలమై
నా ప్రేమకు నీ ప్రేమ దోహదమై
నా సమయం నీ వరం గా మారే
--((*))--
ఇంకా ఉన్నది వచ్చేవారం చదవండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి