31, డిసెంబర్ 2015, గురువారం

ప్రాంజలి ప్రభ ( అంతర్జాల వార పత్రిక ) for the month of jan. 2016

ప్రాంజలి ప్రభ ( అంతర్జాల వార పత్రిక )
ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (1 ) (date 1-1-2016 to 7-1-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
H.No 6-18-13,.సుబాష్ నగర్, నిజామాబాదు, తెలంగాణ, ఇండియా   .........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు,
నా మైల్ కు  వచ్చే కధలు, మరియు నా భావాలు  
...........................................................................................................


ఫ్రత్యక్షదైవమైన ఆదిత్యునికి ప్రాంజలి ఘటిస్తున్నాము 
http://vocaroo.com/i/s1TvXFLFiqN7 (9.43)
వినండి , వినమని చెప్పండి

ఆదిత్య హృదయం చాలా మహిమాన్వితమైనది. దీనిని వాల్మీకి రామాయణములో శ్రీరామునికి అగస్త్య మహర్షి ఉపదేశిస్తాడు.. ఆదిత్యోపాసనతో శ్రీరాముడు శతకోటి సూర్య కిరణాలతో,   కోటి సమతేజుడై యుద్ధ రంగములో బాసిల్లి,  రావణ సంహారం పూర్తి చేసి ధరణిలో ధర్మ రక్షణ చేస్తారు. ఆదిత్య హృదయం శ్లోకాలు యుద్ధకాండములో 107 వ సర్గలో వస్తాయి.పారా యన చేసినా కనీసం విన్నా అమిత పుణ్యదాయకమ్. 
(ఈ క్రింద ఉన్న ఇంగ్లీషు పదాలను టిక్ చేయండి ఆదిత్య హృదయం వినండి )

ఆదిత్య హృదయంలో మెత్తం 30 శ్లోకాలు ఉన్నాయి.

మొదటి రెండు శ్లోకాలు అగస్త్యుడు , శ్రీ రాముడి వద్దకు వచ్చుట
3 నుండి 5 శ్లోకాలు : ఆదిత్య హృదయ పారాయణ వైసిష్ట్యత చెప్పబడింది.
6 నుండి 15 శ్లోకాలు : సూర్యుడంటే బయటకు వ్యక్తమవుతున్న లోపలి ఆత్మ స్వరూపమని, బాహ్యరూపము అంత స్వరూపము ఒక్కటే అని చెప్పబడినది.
16 నుండి 20 శ్లోకాలు : మంత్ర జపం
21 నుండి 24 శ్లోకాలు : సూర్యుడు గురించి శ్లోక మంత్రాలు
25 నుండి 30 శ్లోకాలు : పారాయణ వల్ల కలిగే ఫలం, పారాయణ చేయ వలసిన విధానం, సూర్యభగవానుడు శ్రీ రాముడు విజయాన్ని పొందేటట్లు అశీర్వదించడం

ఆదిత్య హృదయం
తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్
రావణాం చాగ్రతో చాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితమ్

దైవతైశ్చ సమాగమ్ ద్రష్టు మభ్యాగతో రణమ్
ఉపగమ్యా బ్రవీద్రామగస్త్యో భగవాన్ ఋషి: అగస్త్వోవాచ

రామ రామ మహాబాహో శృణు గుహ్యాం సనాతనమ్
యేన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి

ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శతృ వినాశనమ్
జయవహం జపేన్నిత్యమక్షయం పరమం శుభం

సర్వ మంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనమ్
చింతాశోక ప్రశమన మాయర్వర్థన ముత్తమం

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్
పూజాయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్

సర్వదేవాత్మ కోహ్యేష తేజస్వీ రశ్మిభావన:
ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతిభస్తిభి:

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివ స్కంద: ప్రజాపతి:
మహేంద్రో ధనధ:కాలో యమ స్సోమోహ్యపాంపతి:

పితరో వసవ స్సాధ్యా హ్యాశ్వినౌమరతోమను:
వాయుర్వహ్ని ప్రజా: ప్రాణా ఋతుకర్త ప్రభాకర:

ఆదిత్యస్సవితా సూర్య: ఖగ: పూషా గభస్తిమాన్
సువర్ణ సదృశోభాను: స్వర్ణరేతా దివాకర:

హరిదశ్వ సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్
తిమొరోన్మధన శ్శంభు స్త్వష్టా మార్తాండ అంశుమాన్

హిరణ్యగర్భ స్త్రిశిరో స్తపనో భాస్కరో రవి:
అగ్ని గర్భోదితే: పుత్రశ్శంఖ శ్శిశిరనాశన:

వ్యోమనాధ స్తమోభేదీ ఋగ్యజు స్సామ పారగ:
ఘనవృష్టి రపాంమిత్రో వింధ్య వీధీ ప్లవంగమ:

అతపీమండలీ మృత్యు: పింగళ స్సర్వతాపన:
రవిర్విశ్వో మహాతేజో రక్తస్సర్వభవోద్భవ:

నక్షత్ర గ్రహ తారాణా మధిపో విశ్వభావన:
తేజసా మపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే

నమ: పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమ:
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ:

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమ:
నమో నమ స్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ:

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ:
నమ: పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమ:

బ్రహ్మాశానాచ్యుతేశాయ సూర్యాదిత్య వర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమ:

తమోఘ్నాయ హిమాఘ్నాయ శతృఘ్నాయ మితాత్మనే
కృతఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమ:
తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే
నమోస్తమోభినిఘ్నాయ రవయే లోకసాక్షిణే

నాశాయ త్యేషవైభూతం తదైవ సృజతి ప్రభు:
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభి:

ఏష సుస్తేషు జాగర్తి భూతేషు పరినిష్టిత:
ఏషచై వాగ్ని హోత్రం చ ఫలం చైవాగ్ని హొత్రిణామ్

వేదశ్చక్రతవైశ్చైవ క్రతూనాం ఫలం మే వచ
యాని కృత్యాని లోకేషు సర్వాణ్యేషు రవి: ప్రభు:

ఏన మాపత్సు కృచ్చ్రేషు కాంతారేషు భయేషుచ
కీర్తయన్ పురుస: కశ్చిన్నావసీదతి రాఘవ

పూజయ స్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిమ్
ఏత త్రిగుణితం జప్త్యా యుద్దేషు విజయిష్యసి

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ యుధాగతమ్

ఏత చ్చ్రుత్వా మహాతేజా సష్టశోకో భవత్తధా
ధారయా మాననసుప్రీతో రాఘవ: ప్రియతాత్మవాన్
ఆదిత్యం ప్రేక్ష జప్త్వాతు పరం హర్ష మవాప్నుయాత్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వయత్నేన మహతా వధే తస్య దృతో భవత్

అధరవిరవద న్నిరీక్ష్య రామం ముదితమనా: పరమం ప్రహృష్యమాణ:
నశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి

--((*))--1. ప్రాంజలి ప్రభ - ఆద్యాత్మిక కధ - మానవధర్మం

 http://vocaroo.com/i/s04fgSxFsZQn (5. 00)
వినండి , వినమని చెప్పండి

ఒక అడవిలో ఒక మహర్షి జపం చేసుకుంటూ ఉన్నాడు, అక్కడకే ఆకలి, ఆకలి అంటూ ఒక మనిషి వచ్చి ప్రాణాలు వదిలాడు, దగ్గరలో ఉన్న నక్క ఆ శవాన్ని తినటానికి ముందుకు వచ్చింది. ఆ ఋషి నక్కతో నేను చెప్పే మాటలు విను ఆ తర్వాత తినుటకు మునుకు రావచ్చు అన్నాడు. సరే చెప్పండి వింటాను     

లోకంలో ఎందఱో ధనవంతులుంటారు, కానీ అందరిలో దానగుణం ఉండదు. కొందరికేమో బాగా దానధర్మాలు చేయాలనే తపన ఉంటుంది. కాని వారి దగ్గర అదిక ధనం లేని కరనంగా వారి సంకల్పం ఫలవంతం కాదు .

సంపదలు కలిగిన కొందరేమో ఇతరుల ప్రేరణతో ప్రతినిత్యం దానధర్మాలు చేస్తుంటారు.  కానీ దానం చేసే సమయంలో  దానాన్ని గ్రహి౮మ్చెవారిని తక్కువ చేసి మాట్లాడటమో, లేదా, నాకన్నా గొప్ప దాత లోకంలో లేడనే అహంకారంతోనో దానం చెస్తూ ఉంటారు.

కాని అట్లా కాకుండా మృదువుగా మధురంగా మాట్లాడుతూ తమ సంపాదణకు తగినట్లుగా దానం చేసే వ్యక్తుల మనకు కనిపించడం చాలా కష్టం.

అట్లాగే నిండుగా, మెండుగా జ్ఞానాన్ని కలిగి ఉండి కూడా ఎ మాత్రం గర్వం లేకుండా సాదు స్వభావాన్ని వినయాన్ని కలిగి ఉండే వ్యక్తులు లభించడం కుడా చాలా అరుదు.

అమిత సౌర్య పరాక్రమాలు కల వ్యక్తిలో ఓర్పు అనే గుణం ఉండటం చాలా కష్టమే ఐస్వర్యం వంతులైన వా రిలో సహస సిద్దమైన దానగుణం ఉండాటం కూడా కష్టమే అనే విషయం. మరి ఈ మనిషి ఎలాంటివాడో నా దివ్యజ్ఞానంతో తెలుసుకొని చెపుతాను అప్పుడు తిందువు అన్నాడు మహర్షి.

“దానం ప్రియవాక్య హితం జ్ఞానమగర్వం క్షమాన్వితం శౌర్యం
విత్తం త్యాగ సమేతం దుర్లభమేతచ్చతుర్విదం భద్రం "

 ఆ శవాన్ని తినేందుకు నక్క ముందుగా శవం చేతులను సమీపించింది. ఆ మహర్షికి అతరాయం కలిగి కన్నులు తెరచి చూశాడు. వెంటనే దివ్య దృష్టితో చనిపోయిన ఆ వ్యక్తిని గురించి తెలుసుకున్నాడు. నక్కను ఉద్దేశించి " ఈతని చేతులు ఎన్నడూ దానం చేసి ఎరుగవు. కనుక వాటిని తినకూడదని" అన్నాడు. అప్పుడా నక్క చేతులను వదలి చెవులను తినబోగా, " ఈతని చెవులు ఏనాడు ధర్మశాస్త్రాలు గాని, ఆత్మజ్ఞానానికి సంబంధించిన అంశాలనుగాని వినలేదు. కాబట్టి చెవులు ముట్టతగినవి కావు" అని అన్నాడు. అప్పుడా నక్క కళ్ళను తినబోయింది. " ఈ నేత్రాలెన్నడు సాధువులను దర్శించినవి కావు. కనుక తినరాదని" అన్నాడు. అప్పుడా నక్క కాళ్ళను తిందామనుకుంది. అది గ్రహించి, " ఆ కాళ్ళు ఏనాడు మానవులను భవసాగరమునుంచి తరింప సజ్జనులను, తీర్ధాలను దర్శించి ఎరుగవు. కావున తినడానికి తగినవి కావని" అన్నాడు.

మృతుడి ఉదరం అన్యాయార్జితంతో పెరిగింది కాబట్టి అదీ తినకూడనిదేనని మహర్షి చెప్పాడు. అప్పుడా నక్క కనీసం తలనైనా తిని తన పొట్ట నింపుకొందామనుకుంది. బతికి ఉండగా ఇతగాడి తల గర్వంతో మిడిసిపడుతుండేది. అదీ తినేందుకు తగింది కాదని మహర్షి వారించాడు. మహర్షి ఆ నక్కకు తన ఆశ్రమంలోని కందమూలములు ఇచ్చి దాని క్షుద్భాధ తీర్చి పంపాడు.

" సత్యవాది, ధర్మాత్ముడు, సదాచారశీలి . సౌశీల్యమూర్తిగా మనిషి మెలగితేనే మానవధర్మాన్ని సంపూర్ణంగా నిర్వర్తించినట్లు " అని ఈ కధ ద్వారా మనం గ్రహించాల్సినది. 
--((*))--

2. శ్రీనాథ మహకవి "శృంగరనైషదము" నుండి సరస్వతీ ప్రార్థన
http://vocaroo.com/i/s08a801ATWFb (2. 29)

వినండి , వినమని చెప్పండి
సింహాసనము చారుసితపుండరీకంబు, చెలికత్తె జిలుబారు పలుకుచిలుక
శృంగారకుసుమంబు చిన్నిచుక్కలరాజు, పసిఁడికిన్నెరవీణె పలుకుదోడు
నలువనెమ్మోముఁదమ్ములు కేళిగృహములు, తలుకుటద్దంబు సత్కవులమనము
వేదాదివిద్యలు విహరణస్థలములు, చక్కనిరాయంచ యెక్కిరింత

యెపుడు నేదేవి కాదేవి యిందుకుంద
చంద్రచందనమందారసారవర్ణ
శారదదేవి మామకస్వాంతవీథి
నిండువేడుక విహరించుచుండుఁగాత

ఏసరస్వతీదేవికి పుండరీకము (తెల్లని తామరపువ్వు)సింహసనమయి, చిలుక చెలికత్తెయయి, చంద్రుండు శృంగారపుష్పమయి, మాటతోడు కిన్నెరయనునట్టి వీణెయై, కేళీ మందిరములు బ్రహ్మముఖపద్మములయి, కవీశ్వరుమననము తళుక్కుటద్దమయి, విహారస్థలములు వేదములు మొదలగు విద్యలయి, వాహనము రాజహంసమై యొప్పునో యట్టియు, చంద్రకుందాదుల చాయవంటి ఛాయగలిగియొప్పుచున్న యా సరస్వతి నాచిత్తమునందెల్లప్పుడు సంచరించుగాకా
--((*))--http://vocaroo.com/i/s1JNILfB64Nm (5.24)
వినండి , వినమని చెప్పండి

3. ప్రాంజలి ప్రభ - హాస్య కధ - అమాయకులు                                        

ఒక రైతుకు నలుగురు కొడుకులు ఒకే కాన్పుకు పుట్టారు, పుట్టుకతోనే తల్లిని పొట్టను పెట్టుకున్నారు, ఓపికతో పిల్లలను పెంచాడు రైతు, కాని వీళ్ళు మనుష్యులుగా ఎదిగారు కాని, మానసికంగా ఎదుగలేదు. చదువుకోలేదు, లోకజ్ఞానం అసలే లేదు, వారికి తండ్రి షలుమంచి మాటలు చెప్పిన ఫలితము లేకుండా పోయింది.  ఒక ఆటో కొన్నాడు, ఇంటి దగ్గరే ఉండే నలుగురు ఆటో నేర్చుకున్నారు, తండ్రికి చెప్పి బ్రతకటానికి నగరానికి బయలుదేరారు ఆటోతో, ఒకరు నడుపుతూ ముగ్గురు వెనక కూర్చొని నగరం అంతా తిరిగారు, కాని ఒక్కడు అటో ఎక్కలేదు కారణం, వీల్లే కూర్చుంటే ఎవరు ఎక్కుతారు. ఆటో వేడెక్కి ఆగింది. తోస్తే కదులు తుంది అన్నారు ఇద్దరు,  సరే తోయడం పదండి అన్నారు ముందు  ఇద్దరు వెనక్కి, వెనక ఇద్దరు ముందుకి తోస్తుంటే వీసం కూడా కదలలేదు ఆటో.

దారిన పోయేవాడు అమాయకులని తెలుసుకొని, నేను నడుపుతానని చెప్పి ఆటోని వేగంగా నడపగా, అందుకోలేక పోయారు ఆనలుగురు, ఒక చెట్టుక్రింద చేరి ఆటో పోయిందని భాద పడుతున్నారు.

 ఒక బ్రాహ్మణుడు భోజనం పెడతానని ఒక శవాన్ని మోయించి, వారికి తిండి పెట్టించాడు. శవం కాలి  బూడిద అయ్యేదాకా ఉండి మీరు ఉండి మీదారి మీరు పోండి అని బ్రహ్మణుడు వెళ్లి పోయాడు, శవాన్ని కాటికాపరి కదిలిస్తే వానితో పోట్లాట మొదలి పెట్టారు  అందరూ తన్నులు తిని బయట పడ్డారు.

 కారులోనుంచి బయటకు విసిరేశాడు కారు డ్రైవర్ , నలుగురిలో ఒకడు క్రిందబడింది తీసి (సిగరెట్టు) కారు ఆగగానే దానిలో పడేసాడు.(సిగరెట్టు కుడా తెలియని అమాయకులు )                   

అంతే కారు భగభగ మని మండింది, దానిలో ఉన్న వారు గబగబా దిగారు, వెనుక పోలీసులు వచ్చి వారిని పట్టు కున్నారు. కారులో దొంగబంగారం స్వాధీనమ్ చేసుకున్నారు.

దొంగలు అన్నారు,  మీరు ఆ బర్రేలేక్కి ఊరేగ బోయారా, అనవరంగా మజోలికి వచ్చారు అన్నారు, పోలీసులు మీకు బహుమతి ఇస్తామన్న వద్దని బర్రేలపై ఎక్కి మాఊరికి పోతామనీ ఎక్కారు. ఇల్లాంటి అమాయకులో లోకంలో ఎందఱో ..... 
               

 అమాయకులు చేసే పనులు కొందరికి శుభ ఫలితలిస్తాయి 
--((*))--
4. సాహితీ కిరణాలు (సేకరణ ఫేస్ బుక్ )


5. మనోధైర్యానికి మార్గాలు -
                                     

http://vocaroo.com/i/s1zZvh0orliZ
వినండి , వినమని చెప్పండి

నారదా శీతల ప్రాంతమునకు వెళ్లి కాస్త విశ్రాంతి తీసుకుంటే  బాగుంటుందనిపిస్తుంది,  ప్రకృతి చల్లని వాతా వరణములో అలా అలా  సంచారము చేస్తే మనసుకు ఏంతో  ఉల్లాసముగా, ఉస్చాహంగా  ఉంటుంది కదా నారదా  అన్న విఘ్నేశ్వరుని మాటలకు అవునవును అని నిద్రనుండి లేచినట్లు పలికాడు నారదుడు.
 .
నారదా నీవు ఈలోకంలో  ఉన్నట్లు లేవు ఎక్కడో  విహరిస్తున్నావు, ఏమిటి విశేషము అని  అన్నాడు విఘ్నేశ్వరుడు.
నేను కొన్ని ప్రశ్నలకు   మీనుండి  సమాదానుములు తెలుసుకోవాలని అనుకుంటున్నాను మీరు చెపితే సంతృప్తి పడగలను  

అడుగు నారదా నాకు తెలిసినవి చెప్పగలను , తెలియనివి తల్లి తండ్రులనడిగి చెపుతాను, మరి అడగటమే ఆలస్యము, కాస్త ఈ లడ్డులు తినవచ్చా  మీ ప్రశ్నల కేమన్న అడ్డమా.

నారదుడు: మహాప్రభు ఎంతమాట, మీరు తినేటప్పుడు వచ్చానని అనుకోకండి

విఘ్నేశ్వరుడు : అడుగుమరి ఆలస్యమెందుకు     


నారదుడు :(1) ఆనందం అంటే ఏమిటి ?
విఘ్నేశ్వరుడు : కామానికి మించిన వ్యాధి లేదు ,మొహానికి మించిన  
         శత్రువు లేదు, క్రోదానికి మించిన అగ్ని లేదు, ఆత్మజ్ఞాన్నానికి 
         మించిన సుఖం లేదు, ఆద్యాత్మికతకు మించిన ఆనందం లేదు. 

          ప్రవహించిన నది సముద్రములో కలసినట్లు, సంసారం కష్ట 
          సుఖాలు పోవటానికి నవ్వుతూ బ్రతకటమే నిజమైన ఆనందం. 

నారదుడు: (2) భార్య భర్త లమధ్య ఉండాల్సినదేది ?. 
విఘ్నేశ్వరుడు: నవ్వు, ఏడుపు మరియు తృప్తి 

నారదుడు : (3) నిరాశవాదులు ఎవరు ?
విఘ్నేశ్వరుడు : చాలామంది ఆశావాదులకు అప్పులిచ్చి తాము నిరాశా 
          వాదులవుతారు. అటువంటి వారే

నారదుడు : (4) తల్లితండ్రుల వ్యత్యాసం ఏమిటి ?
విఘ్నేశ్వరుడు : తల్లి జీవితాంతము తల్లిగా ఉంటుంది, కాని తండ్రి కొత్త  
           భార్యను తెచ్చుకొనే వరకు తండ్రిగా ఉంటాడు.

నారదుడు :(5) సారధ్యం, ప్రేరణ, దృక్పధం గురించి వివరిస్తారా?
విఘ్నేశ్వరుడు : నీవు ఏమి చేయ గలవో చెప్పేది సామర్ద్యం  
            నీవు ఏమి చేయాలో నిర్ణయించేది  ప్రేరణ 
            నీవు ఎంత నైపుణ్యంతో ఆపని చేయగలవో నిర్ణయించేది  
            దృక్పదం. 

నారదుడు :(6)  ప్రామానికియా గ్రంధం అంటే ఏమిటి ?
విఘ్నేశ్వరుడు: ప్రామాణిక గ్రంధం అంటే ప్రజలు కొనియడేది, కాని 
            చదవనిది

నారదుడు: (7) పిల్లలలో ఎ భావం ఉంటుంది ?
విఘ్నేశ్వరుడు: ప్రేమభావము, మధురభావము, హాస్య భావము 
            మరియు కఠోరభావము.

నారదుడు:(8) వివాహ కలయిక అంటే ఏమిటి ?
విఘ్నేశ్వరుడు : సంతోష దాయక మైన వివాహము, క్షమ (ఓర్పు ) 
             గుణమున్న ఇద్దరి కలయక.     

నారదుడు :(9) పిల్లలు ఎవరి మాట వింటారు ? 
విఘ్నేశ్వరుడు : పిల్లలు తల్లి, తండ్రి, గురువు మరియు ధనం మాట 
             వింటారు

నారదుడు : (10) టి.వి చూస్తె లాభమా, నష్టమా ?
విఘ్నేశ్వరుడు : లాభం మెదడుకు మించిన మేత, నష్టం:కళ్ళ జోడుకు 
              ఖర్చు 

ఆనందం ఆద్యాత్మిక మైతె సచ్చిదానందం 
ఆనందం పరిమిత మైతే సంసారమే ఆనందం
ఆనందం ప్రకృతి అయితే శరీరమునకు ఆనందం
ఆనందమే వికృతి అయితే వైద్యులకు ఆనందం 

నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేక పోవడం రోగం 
 అందరికి శుభాకాంక్షలు 
6. నవ్వుకుందామా

1.  ప్రేమప్రియుడు : నేను మనసు మార్చుకున్నాను అన్నాడు    
                              ప్రియసితో
ప్రియసి: మంచిపని చేసావు, మనసు మారకపోతే నన్ను కలువు వస్తా

2. "రోబో "
భర్త: భార్యతో మనబ్బాయి నీవు ఇంటి పని చేసు కోలేక పోతున్నావని
       "రోబో "ను పంపిస్తున్నాడు.
భార్య: అవునండి పనిమనిషిని పెట్టుకుంటే రోజు రాదు, వచ్చినా రోజు
          కాఫీ, టిఫిన్ పెట్టలేక పోతున్నాను.
         "రోబో " ఐతే ఎం అడగదు, ఖర్చు అసలే ఉండదు కదండి
భర్త: రోబో తిమ్డే "చిప్సు" అది తెలీదా ................    

3."గలత్ "
హింది టీచెర్: పిల్లలు డిక్టేషన్ చెప్తా రాయండి
                    1. మేరనాం జోకర్
                     రాము ఇటు చూపించు ఎలా రాసావో
                     "  మేరనాం ధర్మాత్మ "  అలా రాసావెంటి
                     నాపేరు అదేగదా టీచరు ....అవనవును
                      చార్ జీరో ఏక సాత్ అని వ్రాయండి.
                     ఎది ప్రతుష చూపించు
                     ఏమిటి ఇలా రాసావు (నాలుగు సున్నాలు చూసి )
                     అవును టీచర్ మిరే అన్నారుగా  చార్ జీరో అని
                     "గలత్ " 4017 అని వ్రాయాలి అవునా టీచర్


http://www.upsc.gov.in/ 

(యు.పి.ఎస్సి. లో ఉద్యోగాలు )
యూనియన్ పబ్లికే సర్విస్ కమిషన్ (యుపి. యస్సి) నేషనల్ డిఫెన్సు నావెల్ అకాడమీ ఎగ్జామినేషన్. 2016 కు ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షలొ అర్హతగా పొందిన వారికి ఇండియన్ ఆర్మీ/నేవి /ఎయిర్ ఫోర్సుకు సంబందించిన ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ విభాగాల్లో పోష్టింగ్ ఇస్తారు. 
పోస్టులు : 375 
వీటిలొ ఇండియన్ ఆర్మీకి 208, ఇండియన్ నేవికి 42, ఇండియన్ ఏయిర్  ఫోర్సు కు 70. నావెల్ అకాడ మీకి 55 పోష్టులు కేటాయించారు. 
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి రెండో ఏడాది పరీక్షలు రాస్తున్న అభ్యర్ధులూ దరఖాస్తూ చేసుకోవచ్చు. 
ఎంపిక: రాత పరీక్ష సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ  ద్వారా 
ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 2 నుంచి 
ఆన్ లైన్ దరఖాస్తుకు ఆఖరు తెదీ: జనవరి 29 
రాత పరీక్ష: ఏప్రిల్ 17
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విసఖపట్నం . వెబ్ సైట్  తీసి అన్ని వివరాలు తెలుసుకొని విజయం సాధించాలని ప్రాంజలి ప్రభ ఆశిస్తున్నది.


అన్ని పోటి పరీక్షలకు ఈ క్రింది ప్రశ్నలు - జవాబులు వినండి , వినమని చెప్పండి

1. ohttp://vocaroo.com/i/s0mtwraU0gno

వేకువ వెలుగులు
వకుండా మంచులా నన్ను వెంబడించు, 

పువ్వుకు మధువుచేరగ 
చురుకుగా ఉల్లాసంగా ఉస్చాహంగా నిండిఉండు  

రేయంతా సుఖ సంతోషాలతో
మేయలేని తీర్చుకోలేని ఆశల వలయాలతో 
మాయా ప్రపంచములో, 
సమయాన్ని సద్వినియోగం చేయాలని తాపత్రయం

మౌన జ్ఞాపకాలు,
నయనాల మాటున ఇరుక్కొని, కన్నీరులా
వాణి నినాదంలతో,  మనసు
నును వెచ్చని కోరికలు తీర్చు కోవటానికే ప్రయత్నం 


కంటిలో చేమ్మేగా ఉంటూ,
ఇంటిలో చెలిమిగా, గుండెలో శబ్దంగా ఉంటూ,
తుంటరి గా కలలో ఏడిపిస్తూ,
ఒంటరిదాన్ని చేసి, ప్రేమను క్రుమ్మరించి ఎడిపిస్తావా

నింగిలో జాబిలివై
యగయుగాలు నిలిచి ఉందువు, 

కలి యుగాన నా మనసులో వె
లుగుల జ్యోతివై నిత్యమూ వేలుగుతూ, ఉండిపో

కిరణపు వెలుగులు
కరుణ చూపుతూ నన్ను ఆవహించినాయి
తక్షణము తపనలు తగించే
తరుణము ఇదేనని వదలక నా ఆశలు తీర్చు  
--((*))__


 :

నీతులు చెప్పే వారు

రసజ్ఞులై ఆలోచనలేని వారు
అభిరుచులుపై, ఆభరణాలపై చేస్తారు పోరు
సంస్కారం,  ఔనత్యం,  అడ్డులేని జోరు

గుండెలోని తపన తీర్చుకొనే పద్దతి వేరు
సూక్తులు ఆచరించకుండా తిరిగేవారు
కుయుక్తులగా మారి ఏడిపించే ఉన్నారు
మాయలో ఉంచి అందరిని దోచేవారు

సిరితో తపనలు తగ్గించు కొనేవారు
వైద్యులున్నారని, త్రాగి తిరిగేవారు
దుర్మార్గానికి అడ్డు లేదనే చెప్పే వారు

అడ్డు చెప్పేవారు లేదనే మాట్లాడే వారు

మొండి పట్టుతో బ్రతికేవారున్నారు
పక్కన ఉన్నవారిని పట్టించు కోరు
మంచి మనుషులతో స్నేహం చేయరు

విషం కక్కే వారిని చెరదీసి పోషిస్తారు

బ్రతుకుపై దెబ్బతగిలిన వారినే ఆదరిస్తారు

పాపమని తెలిసినా అదే చేస్తారు
జిహ్వ చాపల్యాన్ని వదలకోలేరు
అద్దంలో మోఖమే చూడరు
నీతులే పెద్దగా చెపుతారు వారు


జనరల్ ప్రశ్నలు జవాబులు 

2. http://vocaroo.com/i/s1uTUfNXspdl (10mi)3. http://vocaroo.com/i/s0XtI8ZDaP8b (12.50)


 
సర్వేజనా సుఖినోభవంతు  ఓం శాంతి: ఓం శాంతి: ఓం శాంతి:
మీ అమూల్య సలహాలే మాకు అక్షర సత్యాలు అందరకి నూతన
 సంవస్చరము(2016) మరియు సంక్రాంతి శుభాకాంక్షలు

--((*))--

29, డిసెంబర్ 2015, మంగళవారం

ప్రాంజలి ప్రభ – చిన్న కధ – 1. కొత్తకాపురం 2.దేవుడున్నాడా ? 3. సహధర్మచారి

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం

Ballerina:

చెడు అనకు - చెడు వినకు -చెడు కనకు
సర్వేజనా సుఖినోభవంతు ప్రాంజలి ప్రభ – చిన్న కధ – కొత్తకాపురం
మావగారు మీ ప్రవర్తన, మీ అబ్బాయి ప్రవర్తన నాకు నచ్చుట లేదు, ప్రతి చిన్న విషయానికి మీ కొడుకు నలుగురిలో చులకనగా మాట్లాడుతాడు, తెలిసి మాట్లాడుతాడో, తెలియక మాట్లాడుతాడో ఆర్ధం కావటం లేదు. మీరేం తక్కువతిన్నారా ఈ వంట చేయి అని చెప్పక చేసిన వంట నచ్చలేదు అని గొనుగుతారు, తినకుండా వెళ్లుతారు. నా మనసుకు భాద కలిగించే విధముగా ఉంటున్నారు. కష్టాలన్నీ ఆడవారికి ఇచ్చి సుఖాలన్నీ మగవారికి ఇచ్చారు కదా మావగారు.
అది కాదమ్మా యి ఎవరి కష్టాలు వారివి, మీ రేం మాట్లాడినా “ మీ అబ్బాయి నాకు నచ్చుట లేదు” , వాడు నచ్చక పోవట మేమిటి కోడలా, నాకొడుకు నిన్ను భాద పెడుతున్నాడా, చెప్పుకుంటే పరువు పోతుంది,” నాకు నచ్చలేదు అంతే”.
మీ అబ్బాయి దృష్టిలో నేనొక బీరువాలో ఉన్న పుస్తకాన్ని, భద్రంగా ఉండాలి అంటాడు, తెరిచి చూడడు, జీవితమ్ సరళ రేఖలాగా ఉండాలంటాడు, షోకేస్ లో బొమ్మలా ఉండెందుకా నన్ను పెళ్లి చేసుకున్నది. మీ అబ్బాయి ఎప్పుడు ఏదో ఆలోచిస్తాడు ఎందుకు మావగారు.
పెళ్లి ఇప్పుడొద్దన్నా నేనే బలవంతం గా పెళ్ళికి వప్పించాను, జరిగిన సంఘటన మరువలేకున్నాడు, నాకు చెప్పండి మావగారు ఎం జరిగిందో. చెపుతాను విను.
నా తమ్ముడి కొడుకు (శ్రీధర్), నాకొడుకు (కృష్ణ) ఇద్దరు కలసి చదువుకున్నారు, ఇద్దరికీ వేరే వేరే కమ్పెనీల్లో ఉద్యోగా లొచ్చాయి , శ్రీధర్ తనతో పనిచేస్తున్న (సమీరా ) నీ పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు, ఇద్దరు ఇష్ట పడ్డారు, లక్ష్మిని ఆ కమ్పెనీలొ పనిచేయుచున్న హెడ్ తో పెళ్లి నిస్చయమైనది, తనను మోసగించి వేరొకరిని పెళ్లి చేసు కుంటున్న దని భావించి మరచి పోలేక, విషం పుచ్చుకొని మరణించే ముందు ఈ విషయం కృష్ణకు చెప్పి ఉత్తరం వ్రాసి ఎక్కడకేల్లాడో ఇంతవరకుతెలియదు.
శ్రీధర్ ఫోటో ఉన్నదా ఇదిగో మాబ్బాయితో కలసి ఉన్న ఫోటో. ఫోటో చూస్తూ అట్లాగే నిలబడింది. ప్రేమించిన అమ్మాయి ఫోటో లేదా లేదు, అప్పుడే భర్త లోపలకు అడుగు పెడ్తూ ఈ అమ్మాయి, మోసం చేసి పెళ్లి చేసుకున్నది. అందుకే ఆడవాళ్లంటే నాకు కోపం అన్నాడు కోపంగా. లోపలి వెళ్లి పోయాడు.
అమ్మాయి నా స్నేహితురాలు , పెళ్లి దాకా ప్రేమించినట్లు చెప్పలేదుమాకు, పెళ్ళికి ముందు శ్రీదర్ నుండి ఉత్తరం వచ్చింది, నీవు రాకపోతే నేనుచేచ్చిపోతాను అని ఉన్నది, పెళ్లి పీటల నుండి వేగంగా కారు నడుపుకుంటూ వచ్చింది.
ప్రాంజలి ప్రభ – చిన్న కధ – దేవుడున్నాడా ?

కొత్తగా తెలుగు మాష్టారు గారు క్లాసురూం లో అడుగు పెట్టారు, నల్ల బల్ల మీద వినాయకుని బొమ్మ వేసారు పిల్లలు, అది చూసి దేవుడున్నాడని మీరు నమ్ముతారా అని గాట్టిగా అన్నారు మాష్టార్, అంటే గట్టిగా మీరు నమ్మరా అని సమాధానముగా చెప్పారు పిల్లలు.

మాష్టార్ " భగవంతున్ని ఎవరైనా తాకారా, మాట్లాడారా, చూసారా "  లేదు కనుక దేవుడు లేడని నమ్మవచ్చా  అన్న మాష్టార్  మాటలకు ఒక విద్యార్ధి లేచి దేవుడు లేదన్న వారు ఎందుకు తలిచారు,  ఇప్పుడు. ఉన్నారని మేము నిరూ పిస్తాము,  మాకు మీరు ఏమి ఇస్తారు మాష్టార్. నిరూపించండి చూద్దామ్, మీ అందరి ఫీజులు నేను కడతాను అన్నాడు మాష్టార్.

కుక్క క్లాసురూం లోకి వస్తున్నది,  వెంటనే తరమండి అన్నాడుమాష్టార్, ఆకలేస్తే అన్నం పెట్టేవాడని ఏమంటారు మాష్టార్ అని అడిగాడు ఒక విద్యార్ధి,  దేవుడుతో సమానము.అన్నాడు మాష్టార్,  ఆ కుక్క నోటిలో నాఅన్నం కారేజ్ ఉన్నది నా ఆకలి తీర్చటానికి ఆహారం తెచ్చింది అది దేవుడితో సమానము కదా మాష్టార్. మాష్టార్ కు అవుననక తప్పలేదు.

         ఎవరు క్లాసులో టపాసులు కాలుస్తున్నారు, పిల్లలు టపాసులు కాల్చుట కాదు మాష్టార్,  కరంట్ వైర్ తగల బడుతున్నది, త్వరలో ఈ భవనపు కప్పు కూల బోతున్నది, దేవుడు ముందుగా హెచ్చరిస్తున్నాడు, దేవుడు లేడన్నవారు ఉండండి, ఉన్నాడు అన్నవారు బయటకు రండి, మాష్టార్ అందరూ వెళ్ళాక నెమ్మదిగా బయటకు వస్తూనే భవణం  కూలిన శబ్దంతో ఒక్కసారి బయటకు పరుగెత్తాడు. దేవుడున్నాడు కదా మాష్టార్ గారు అన్నారు పిల్లలు.

పిల్లలందరూ అక్కడ ఉన్న ప్రయోగశాల వద్దకు చేరారు, అందరూ వెంటనే నవ్వటం మొదలు పెట్టారు, విద్యారుల వద్దకు మాష్టారు వచ్చి ఎందుకు నవ్వుతారు, దేవుణ్ణి చూసి మేము నవ్వు తున్నాము, మాష్టర్ కూడా నవ్వుతున్నాడు, మాష్టార్ మీరు కూడా దేవుడ్ని చూసారు కదూ నవ్వు తున్నారు, ఆ చూసాను నవ్వు అపుకో లేక పోతున్నను. మీ అందరి ఫీజులు నేనే కడతాను దేవుడున్నాడు నమ్ముతున్నాను అన్నాడు గట్టిగా మాష్టార్ (వెంటనే ఒక విద్యార్ధి నైట్రోజన్ గ్యాసు బిగించి  వచ్చాడు అందరి నవ్వులు ఆగినాయి).

మాష్టర్ ఒకే సారి నశించే వస్తువులు ఏవో చెప్పగలరా అని అడిగారు ?, పిల్లలముందు మాష్టార్  నోరు ఎత్తలేక పోయారు. ఒక విద్యార్ధి తెలియ పరిచాడు మనకు వెలుగు నిచ్చి ఆరిపోయే అగ్గి పుల్లను, మన ఆకలి తీర్చే పండ్లను సృష్టించినది దేవుడే కదండి, సమస్త లోకల్ని రక్షించేది దేవుడే గదండి. అవును పిల్లలారా దేవుడున్నాడు.సహధర్మచారి   


అడుగులు తడబడుతూ  పెళ్లి పీటల ప్రక్కన చేరి, అడుగులో అడుగేసి , ఏడడుగులు నాతో వేసి..తాళి కోసమే తలవంచి తన్మయత్వంతో తలంబ్రాలు పోసి, పూల దండలు వేసి, పాదాల గోళ్ళు  త్రొక్కి, పరవసంతో తొణికిసలాడే వెలుగును తన సొంతం చేసుకున్నది.నా శ్రీమతి.   

నా..తలను పదిమందిలో పైనుంచి.. ఏడేడు జన్మల భంధం అంటూ,  ఈ జన్మనుండే చిటికన వేలు బట్టి..కొంగుకొంగు ముడివేసుకొని, అర్ధాంగి వై అగ్ని చుట్టు ప్రమాణంచేసి, నలుగురి దీవెనలు అందుకొని, అరుంధతి నక్షత్రం చూసి, బిందెలో ఉంగరాన్ని తీసి నేనే గొప్ప అని గర్వంగా తెలియ పరిచి, పెద్దలకు  పాదాబి వందనములు చేసి, తోబుట్టువులను వదిలేసి తోటి స్నేహితులను వదిలేసి మంగళ తోరణాల  కళ్యాణ మండపంలో తల్లి తండ్రుల హితవాక్యాలు వినినాతో కాపురానికి వచ్చింది . 

" చూడు తల్లి ఏలోటు రనీయ కుండా, మా శక్తికి మించిన సంభంధమని మేము తలచి నీ ఇష్ట ప్రకారముగా  పెళ్లి చేసినాము, నువ్వున్నచోటికే అన్నీ వచ్చి వాలవు, మంచి చెడు అర్ధం చేసుకొని మనమే అవి వ్వున్నచోటుకే మనం వెళ్లితీరాలి,  గమ్యం ఎప్పుడూ నీ దగ్గరికి రాదు, మనమే ధర్మం, సత్యం , న్యాయం గల గమ్యాన్నివెదుక్కొని  చేరాలి.

చూడు తల్లి విజయసాధనకు, నీకు మనోధర్యమే నీకు ఆధారము, నీవు నమ్ము కున్న దేవుడే నీకు రక్ష,  అడ్డ దారులు పోకుండా, ధర్మ మార్గాన నడిచేవారిని వరించె శక్తిని పొంది, అడ్డొచ్చే ముళ్ళయినా ,రాళ్ళయినా, కన్నీళ్ళయినా కడవరకు నిలబడవు, సంకల్పం బలంతో ముందుకు నడవాలి.

ఓర్పుతో సహనం వహించి, ఎవరు ఎమన్నా నిగ్రహించుకొని, తగిన సమాధానములు చెప్పి, నలుగురిలో పుట్టినింటికి ,  మెట్టినింటికి  పేరు తెచ్చి పెట్టాలి. పుడమితల్లి గర్భంనుండి జన్మించిన గడ్డి పరక సైతం, గాలివానలోనైనా సగర్వంగానే నిలబడుతుంది. కరకు పాదాలక్రింద నలిగిపోతానని పుష్పానికి తెల్సినా కడవరకూ  పరిమళాలును అందిస్తున్నే ఉంటుంది

గుడ్డు నుంచి బయటపడ్డ పక్షి పిల్ల సైతం, లేత రెక్కలిప్పి సుడిగాలి కెదురు నిలుస్తుందియోజనాల దూరాన్నిఆలవోకగా దాటేస్తుంది. సంకల్పం,విశ్వాసం తనకు రెక్క లైనవేళ తానే విజేతనని ప్రకటిస్తుంది. సానుకూల దృక్పధం అలవరుచుకో, ప్రకృతి నేర్పే పాఠాలెన్నో నేర్చుకో, నిరాశకు అవకాసము ఇవ్వక కోర్కలలో మంచి చెడు గమనించి మంచికే అవకాసము ఇచ్చి  తీరుస్తూ ముందుకు సాగాలి.  
చూడు తల్లి ఎన్ని ఓడు  దుడుకులు వచ్చిన మనోధైర్యం తో బ్రతకటమే బ్రతుకుఅర్ధం, వెన్నెలధారల్లొ తడవాలనుకున్నావు, చీకటి రాత్రులు ఎన్ని ఉన్న వెలుగు నీవెంట  ఉంటుంది అదే నీకు దారి చూపకలదు
తల్లి హిల్ భోద చేసింది.   
అలా నా భార్య నాజన్మతో జతగలిపి, ఈజన్మంత జత నిలిచి, ఆనందానికి అర్దాంగివై, నా చిరునవ్వుకు ప్రమిదవు నీవై.., చీకటిని తరిమే వెలుగువై ..కష్ట నష్టాలలో కన్నీటికి నేస్తానివై సుఖ దు:ఖాలలో సుధారాశిపై...., ఆకలికి అమ్మవై నడిజామున కోమలివై, నా కోపానికి ఓపిక నీదై..కష్టపెట్టినా ఇష్టమే నంటు నీ కంట తడి వచ్చినా ఇంటిగుట్టు ఇల్లంటు..నన్నునన్నుగా ఇన్నేల్లు నన్నంటి వెన్నంటి, సాదక బాదకలో సరి జోడువై..
పుట్టినింటి మరచి మెట్టినింట తన సర్వస్వమని తలచి,  తన భర్తే తనను స్వర్గంలో ఉంచి సుఖపెడతావని భావించితివి, నీవు ఆనందం పొందినది  ఎంతో నాకు తెలియదుగాని..చివరిగా నీకు నేనేమిచ్చుకోను చెలి ఈ భాహుభందాల మద్య కౌగిలితప్ప ?

ప్రాంజలి ప్రభ – చిన్న కధలు 01 ఆలు మగలు - అనురాగపు స్వరాలు, 02.కొత్త కోడలు, 03. ఏ ఎండకు ఆ గొడుగు పట్టండి, 04నాకు బుద్ధి వచ్చిందిఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం


చెడు అనకు - చెడు వినకు -చెడు కనకు
సర్వేజనా సుఖినోభవంతు 
*ఆలు మగలు - అనురాగపు స్వరాలు (చిన్న కధ )
 తన విధిగా భర్తను కడుపునిండా మంచి ఆహారము పెట్టాలని, సుఖ పెట్టాలని, నా సలహాలతో వృద్ధిలోకి వచ్చి, సంపాదన పెరగాలని, తనను బానిసగా చూడక ప్రేమగా చూడాలని, పుట్టింటి వారిని ఆదరించి గౌరవించాలని, కోరికలన్నీ, తనతోటే తీర్చుకోవాలని, వ్యసనపరుడుగా మారి భాద పెట్ట కూడదని, పరుల ముందు కించ పరచకుండా ఉండాలని, సాధింపులు లేకుండా విశ్రాంతి కల్పించాలని, తన మాంగల్యం భంధం సుఖ సౌక్యాలతో ఉండాలని ఆశతో, ఆశయాలతో  కోరుకునేది భార్య.

భార్య కడుపు పండాలని, పొదుపు నేర్చుకోవాలని, తనకు బాసటగా నిల్వాలని, తనవారిని ఆదరించి గౌర వించాలని, తనకు ఎదురు తిరిగి మాట్లాడ కూడదని, అందంగా అలంకరించుకొని ఎప్పుడు ఉండాలని, ఎటువంటి కోరికలు కోరుకో కూడదని, తనకుటుంబాన్ని గుర్తించాలని, ఇంటి గుట్టు కాపాడాలని, సంపూర్ణ ఆరోగ్యవతిగా సుఖ పెట్టాలని కోరుకునేవాడు మగవాడనే ధీమాతో ఉండేవాడు  భర్త.                            
భార్య భర్తల మధ్య ఉండాల్సింది ఆకర్షణ, ఎ పరిస్తితిలోను కుడా వికర్షణ అనే భావము మనసులో కూడా రాకూడదు. 
అస్తమించు చున్న సూర్యుడికి తూర్పున ఉదయిస్తానాని నమ్మకం ఉంటుది, అట్లే కష్టాలు ఎప్పుడు ఉండవని సుఖాలు వస్తాయని నమ్మకంతో బ్రతకాలి, అమావాస్యపు చికట్లు తొలగి పున్నమి వెలుగులు వస్తాయని గమనించాలి. ఎన్ని సార్లు ఓటమిని చూసిన, లోకమంతా వేలెత్తి చూపినా, మనోధైర్యంతో రేపటి యుద్దంలో గెలవాలని బ్రతికి బ్రతికిన్చుకోవాలి ప్రతిఒక్కరు. ఒకరి భావాలు ఒకరు అర్ధం చేసుకొని జీవిన్చటమే ఆలూమగల - అనురాగపు స్వరాలు
                                                       --((*))--

ప్రాంజలి  ప్రభ – చిన్న కధలు – కొత్త కోడలు
గాలికి తెరలు కదిలినట్లుగా, చెట్ల మీద ఎండు టాకులు రాలినట్లుగా, చిలక కొట్టిన జామపండ్లు పడినట్లుగా, గాలికి ఇసుక తుఫాన్ వచ్చి మనిషిని చుట్టి నట్లుగా, కొడుకు పంపే మెసేజులు మనసును తూట్లు పొడుస్తున్నాయి. కొడుకుకూ చెప్పలేక, విధిని ఎదిరించలేక, అబద్ధ మాడలేక, నిజం చెప్పలేక, భార్యతో రాజేశ్వరరావు, నీ కొడుకు వస్తున్నాడుట, ఇక్కడ ప్రళయం సృష్టిస్తాడో, మరి ఏమ్చేస్తాడో, నీకు అసలే షుగర్, బి.పి జాగర్త అన్నాడు.

ఏమిటండి మన అబ్బాయి అనక నీకొడుకు అంటారు, ఎదో తొందరలో అన్నాను, వాడు మంచి వాడైతే అనుకో నవసరము లేదు. సరేలే కొడుకొచ్చిన తర్వాత "యువరానర్ మన అబ్బాయి కోరిక సబబుగా ఉన్నది, తీర్చమని" మాత్రం వత్తిడి చేయకు.

కోరికలనే సంకేల్లకు చిక్క కుండా జీవితాన్ని సాగిస్తున్నాము, ఆచి తూ చి మాట్లాడితే మనసు తేలిక బడుతుంది, ఇన్నాళ్ళు మన ఉద్యోగాలు మన డబ్బు మాట్లాడినాయి, అందుకే నేమో మాటలు రావటములేదు, ఇంతవరకు కొడుకు చూపిన అనుభూతులున్నాయి, అవి జ్ఞాపకాలుగా మారి, కుక్కల్లాగా మనసును వేమ్బడిస్తున్నాయి.
మన మనస్సును చిత్తు కాగితములా నలిపివేసి, ఎన్నో విషాదాలు భరించి, కన్న కొడుకుని గారాబంగా పెంచాము.
మన కష్టసుఖాలగురించి ఎప్పుడైనా మాట్లాడుకున్నామా, ఇన్నేళ్ళు రైళ్లో ప్రయాణంలో ఆగి ఎక్కినట్లు, మన సహచర్యం సూర్య చంద్రుడిలాగా వెలుగు చీకట్ల మద్య సాగింది జీవితమ్, కొడుకు వచ్చినట్లు ఉన్నాడు జాగర్తగా మాట్లాడు అన్నాడు రాజారావు భార్యతో.
కొడుకు పెళ్లి చేసుకొని దండలు వేసుకొని ఇంటి గుమ్మం ముందు కారులో దిగాడు, నాన్న కారు వాణికి డబ్బులిచ్చి పంపించు అన్నాడు. గత్యంతరం లేక తండ్రి డబ్బు లిచ్చి పంపించాడు అద్దె కారుకు.
బిక్క మొహవేసి చూడకు, వాడు చేసిన ఘనకార్యాలలో ఇది కూడా ఒకటి, హారతిచ్చి లోపలకు పిలువ్ అన్నాడు. భర్త భార్యతో. 
వారు లోపలకు వచ్చారు, మేమిద్దరం పెళ్ళికి వెళ్తున్నాము, మీరు తలుపు లేసుకొని ఉండండి అని చెప్పి వెళ్ళారు తల్లి తండ్రులు.
ఏమిటండి అతయ్యగారు, మామయ్యగారు, అట్లావెల్లిపోయారు, ఎమీలేదే నేను పేకాడేవాన్ని, గుర్రపు పందాలు కాసేవాన్ని, లాటరీటిక్కెట్లు కోనేవాన్ని, ధూమపానం, మద్యపాణం అలవాటు చేసుకున్నా ఇంకా మా తల్లితండ్రులను ఎప్పుడు వేదిన్చేవాన్ని, నిన్ను మాత్రం ప్రేమించాను, నామాటనమ్ము.
నమ్మక చస్తానా, చీకటిదాక, పహారా కాసి, నీకు పట్టిన దెయ్యాన్ని దులిపి అత్త మామల వద్ద మంచి కోడలని పించుకుంటా, అల్లా చూస్తావే తలుపేసి రా ....      
దయచేసి కధను చదివిన వారు షేర్ చేయగలరు              
                             --((*))--
ప్రాంజలి ప్రభ – చిన్న కధ – ఏ ఎండకు ఆ గొడుగు పట్టండి

ముఖ్య మంత్రిగారు ప్రజలు ఎండకు తట్టుకోలేక నగరాలు వదలి వెళ్లి పోతున్నారు, మరి నేను ఎంచేసేది,  నేను ఇప్పుడు కాశ్మిర్ టూర్లో ఉన్నా, ఆరోగ్యశాఖా మాత్యులు గారు,  మీరే ప్రజలకు నీటి వసతి కల్పించండి, మేఘాలు కాన రావటములేదు, ఎంతో ఖర్చు పెట్టి మేఘ మధనం కూడా కల్పించాము, ఫలితము లేదు కదా,  సూర్యకిరణాలు భూమిపై విజ్రుమ్భిస్తూ ఉన్నాయి, పుడమితల్లి ఘర్భం ఎండి  పోతున్నది, నిలుచుందామంటే నేల వేడి, కూర్చుమ్దామంటే కుర్చీ వేడి, పడుకుందామంటే మంచం వేడి, బయటకు నడిస్తే ఆకులు రాలినట్లు ప్రజలు నేలకు ఒరుగుతున్నారు, ఎ అల్లర్లు లేకపోయిన సూర్యభగవానుడు కర్ఫి విధించాడు, ఉన్న నీటితో ఉండాలని జనం బయటకు రాకుండా ఉండటంవల్ల వీదులన్నివెలవెలపోయిఉన్నాయి.  .                                      
నీరు దొరికే ప్రాంతం వారు ఎండతాపం తగ్గించు కొనుటకు డబ్బు ఉన్నవారు ఎయిర్ కండిషనర్ గదుల్లో, కూలర్ల వద్ద, ఫాన్లు వేసుకొని ఉంటున్నారు, భవనాలపైన చెట్లను పెంచుతున్నారు, కార్లపైన, ఇళ్లపైనా గడ్డి పెంచుతున్నారు.    బీదవారు విసిని కర్రలు, వట్టివెల్ల తడికలు, తడి గుడ్డలు గుమ్మాలకు కట్టుకొని చల్లదనం కోసం ప్రయత్నం చేస్తున్నారు.

మంత్రిగారు మీరు వెంటనే మన అస్తానా గాయకుడు, ఆస్తాన వైద్యుడు, అస్తాన జ్యోతిష్యుడు, అస్తాన తాత్వికుడు,ప్రజల కొరకు ఏమ్చేస్తున్నారు, అని అడిగారు ముఖ్యమంత్రిగారు.
గాయకుడూ తనకు వచ్చిన అన్ని రాగాలతో అద్భుతముగా మాధుర్యంగా పాడారు, చల్ల దనము దేముడెరుగు, బయట వేడికి చమట పట్టిందే తప్ప ఎండ మాత్రం తగ్గలేదు.
వైద్యుడు చల్లటి కుండలు ఏర్పాటు చేసినా ఎండ వేడికి కుండలో నీరు ఆవిరై పోతున్నాయి. 
జ్యోతిష్యుడు చండి యాగాలు చేసినాడు, దేవాలయాల్లో పూజలు చేయిస్తున్నాడు, ఫలితము లేదు,  
తాత్వికుడు కొబ్బరి బొండాలు, తాటిమున్జలు, చల్లదనం కోసం మంచు గడ్డలు విమానంలో ప్రజలకొరకు తెప్పిస్తున్నాడు, కాని వేడి తగ్గలేదు.
ప్రజల్లో ముసలివారు, పిల్లలు వడగాలి తగిలి మంచాన కరుచుకు పోయారు, మానవుల ప్రయాత్నాలు తత్కాలికి ఉపశమనాలు, ఏ  ఎండకు ఆ గొడుకు పట్టటమే, ప్రకృతిని ఎదిరించి బ్రతుకుట కష్టం, ఒకరికొకరు తోడుగా ఉండి కలసి మెలసి జీవిస్తూ, దేవుణ్ణి ప్రార్దిమ్చటం తప్ప ఎమీ చేయలేము కదా మంత్రిగారు.ఎట్టి పరిస్థితిలో ప్రక్క రాష్ట్రమునుండి, నీరు, గ్రాసము, విద్యుత్తు, నిత్యావసర వస్తువులు అందుబాటులోఉంచి ప్రజలకు సహకారం అందిద్దాము, నేనూఐరోజే తిరిగి వస్స్తున్నాను కాశ్మిర్ నుండి ప్రజాసేవయే మనకు ప్రధాన లక్ష్యం    
కలిసిపో కరిగిపో ప్రకృతిలో
 
ఎగసిపో వెలిగిపో అంబరాన
 
దిగులు చెందుట మనిషి ధర్మము
 
దిగులు తీర్చుట రచన పరమార్థము
                                                               --((*))--
  
గోచీకాపురం (పాత కధ)
  ఒక సాధువు సంసారం మీద విరక్తి తో ఊరి బయట ఒక పాక వేసుకొని గురువుగారు చెప్పినట్లు ధ్యానం చేసుకుంటూ వూరి ప్రజలు తనకు సమర్పించే పళ్ళు,తిని పాలు మాత్రం తాగి జీవిస్తూ వుండే వాడు.
అతనికి రెండు కౌపీనాలు(గోచీలు) మాత్రమే ఉండేవి స్నానం చేసి ఒకటి ఆరేసుకునే వాడు,ఒకటి కట్టుకునే వాడు. కొన్నాళ్ళకు ఒక ఎలుక ఆ కౌపీనాన్ని రోజూ కోరికి వెయ సాగింది.
ఎన్ని కౌపీనాలు మార్చినా అలాగే కోరికేస్తూండేది.
గ్రామస్తుడొకడు ఆ సాధువు కు ఒక పిల్లిని యిచ్చి దీనివలన మీకు ఎలుక బాధ వుండదు స్వామీ అని చెప్పాడు.
మరి ఆ పిల్లికి పాలు పొయ్యాలి కదా! గ్రామస్తులంతా కలిసి అతనికి ఒక ఆవును కొనిచ్చారు.
ఆ ఆవు పాలు పితికేందుకు, దాని అడవి కి తీసుకొని పోయి మేపు కొని వచ్చేందుకు మనిషి కావాలి కదా!
ఎవరినైనా పెట్టుకుంటే వాడికి జీతమివ్వాలి. అందుకని గ్రామస్తులు అతన్ని పెళ్లి చేసుకోమని సలహా యిచ్చారు. అమ్మాయిని కూడా చూపించారు.
అతను పెళ్లి చేసుకున్నాడు. భార్య గోచీ బాగా లేదు పంచె కట్టుకోండి అని అన్నది.
సరే పంచెలు కొన్నాడు. బిడ్డలు పుట్టారు
వాళ్ళను పోషించేందుకు డబ్బు కావలిసి వచ్చింది. గ్రామస్తులతో మాట్లాడి ఒకరి పొలాన్ని కౌలు కు తీసుకొని సేద్యం చేయ సాగాడు.
తర్వాత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. సొంతంగా పొలం కొనుక్కున్నాడు. ఎద్దులు కొన్నాడు. సంసారం పెరిగి పోయింది.. ధ్యానం,తపస్సు వెనక బడి పోయాయి.
డబ్బు యావ పెరిగి పోయింది. ధ్యానం బదులు ధాన్యమే ముఖ్య మైంది. శాంతి కరువైంది. యిది యిలా వుండగా ఒకసారి అతని గురువు అతన్ని చూడ టానికి వచ్చాడు.
ఆయన యిదంతా చూసి ఆశ్చర్య పోయి యిదేమిటి రా నేను చెప్పిందేమిటి? నీవు చేసిందేమిటి? అని అడిగాడు.
.గురుదేవా! నా గోచిని కాపాడు కోవడానికి ఇంత పటాటోపం పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పి నాకు బుద్ధి వచ్చింది అని లెంపలు వేసుకొని .ఆ సంపదనంతా భార్యను చూసుకోమని చెప్పి అడవికి వెళ్లి పోయి హాయిగా కంద మూలాదులు తింటూ తపస్సు చేసుకుంటూ శాంతి గా గడిపాడట.

కాలమే మనుష్యులను మారుస్తుంది, సంసారములోనికి దింపుతోంది, ఆకాలమే వైరాగ్యుయునిగా మారుస్తుంది, ఈతప్పు కాలందా మనుష్యులుదా, అది మియర్ ఆలోచించండి. 
                              --((*))--

21, డిసెంబర్ 2015, సోమవారం

ప్రాంజలి ప్రభ - చిన్నకధలు - వికసించిన పువ్వు లు నేనూ - నా సాహితీసృష్టులు-రంగనాద్ అకస్మాత్ మృతి (20-12-2012)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం

`

చెడు అనకు - చెడు వినకు -చెడు కనకు
సర్వేజనా సుఖినోభవంతు 

16.- వికసించిన పువ్వు లు 

మంచు దుప్పటి తీసి, మత్తు కన్నులు తెరచి. మొబైల్ ని వెదికి, మాంచి మెసేజ్ టైపు చేసి, ప్రియ  మిత్రుల గుండెల్లో అలజడి సృష్టించి కుర్ర కారులు ఇప్పుడు విజ్రుమ్భించు తున్నారు, దీనికి కారణం తల్లి తండ్రులు, అవసరానికి మించిన ధనము. అని భార్యతో రామారావు  చెప్పుతున్నాడు. మనకి పిల్లలున్నరు కదా మనం కూడా పిల్లల భవిషత్ కారకులవుతాము కదండీ. అన్నది భార్య సీత
ఖచ్చితముగా అందుకనే చెప్పేది మన పిల్లలు చెడుదారి పడకుండా నేను నువ్వు గమనించాలి. నిజమే నండి అట్లాగే ఇద్దరం చూద్దమండి.
       అందమైన పువ్వును చూడగానే కలిగే ఆకర్షణ వేరు, మొహం, కృతజ్ఞతగా, నిత్యం, ఆ పువ్వు నే చూడాలనిపించడమ్ ప్రేమ అంటారు.   సృష్టి కర్త ఏర్పాటు " మొగ్గకు  రేయి అంతా, చల్లని వెన్నలను పంపించి, చిక్కటి చీకటిని తరిమి రేకులు విప్పుకొని ఉల్లాసముగా ఉవిల్లురుతూ ఉంటుంది" . గాలి సెగలకు  చేరి సంతోష పండాలను కుంటాయి, భోగానికి సహకరించాలను కుంటా యి, మరికొన్ని దేవుని పాదాలను చేరి యోగులుగా మారాలను కుంటాయి. పావనమయ్యే జీవితము భగవంతుని సాక్షిగా. పత్ర హరితాలను పీల్చుకొనే హృదయాలకు పూదోటలు సంజీవ కల్పలతలు. కలువలు, పొన్నలు మొగలి పొత్తులు నలిగిన కొద్ది పరిమళాలు పెరుగుతాయి. అబ్బా ఏమిటండి మీ వర్ణన పువ్వునా  స్త్రీ నా నీవు ఎదను కుంటే అది.            

సంపెంగది మరో రకం నూన్యత, తెనటీగలు వాటి జోలికో పోవు, భార్య  కొప్పులో  సంపెంగ పువ్వులు ధరిస్తే అదొక పారవశ్యం భర్తకు. ప్రక్రుతి పరవసిమ్చినప్పుడు, పువ్వులు వికసిమ్చి నప్పడు వచ్చే పరిమళాలు మనసుకు ఉల్లాస భరితాలు. మండు టెన్డల్లో  సీతల పానీయాలు, మల్లె పూల గుభాలిమ్పులు ఆస్వాదించని వారెవరు.

బహుళ అంతస్తులు భవనములు వచ్చాక, శబ్ద కాలుష్యము పెరిగాక, గాలి నీరు అందని ప్రాంతలో జీవనములు గడపటం సహజ మానవులకే సాద్యము కావటములేదు. తుమ్మెదలు,  తెనటీగలు పుష్ప గుచ్చాలాపై దాడి చేసి కోరికలు తీర్చుకొవటానికి  విపరీత ప్రయత్నాలు చేస్తున్నాయి. గండు తుమ్మెదలను తరిమే  శక్తి పువ్వులకు  రావాలి. ప్రత్యూష వేళల్లో పరిమళాలు వెదజల్లుతూ పరవసించి పోవాలి.
                                                           --((*))--
.            
17.ప్రాంజలి ప్రభ  నేనూ - నా సాహితీసృష్టులు

నేను నా అనుభవాలు తెలుపుతున్నాను  తెలుగు భాషా అభివృద్దికి నా వంతు కృషిగా నేను చదివింది డిగ్రి (సైన్స్& మాధ మేటి క్సు), వృత్తి  అకౌంట్స్ ఆఫీసర్.  అయి నప్పటికి  కీర్తి శేషులు ( మా తాతగారు వేంకటాచల జ్యోష్యులు, మానాన్నగారు లక్ష్మణ జ్యోష్యులు మా పెదనాన్నలు అందరు పాండిత్యములో ఆరితేరినవారు). నాజన్మస్థానం తెనాలి, పెరిగింది చదివింది గుంటూరు, ఉద్యోగమూ రీత్యా ఉన్నది హైదరాబాద్ మరియు ఇప్పుడు ఉన్నది విజయవాడ.  
      
నేనూ కవితలల్లుతాను, రచనలు చేస్తాను, నలుగురి కోసం; కానీ కవిగా గాని రచయితగా గాని గుర్తింపుకు ప్రయత్నమూ చేయట లేదు; అంతర్జాల మాధ్యమంలో  తెలుగు  సాహిత్యము మీద కోకొల్లలు, ఏది ఏమైనా అది ఒక సముద్రము, ఆ సముద్రములో ఒక ధర్మమనే పడవ ద్వారా నా  ప్రాయణము సాగిస్తునాను.   అంతర్జాలము ద్వారా అనేకమంది స్నేహితులు పండితులు కలుసుకొనే అవకాసమ నాకు కలుగు తున్నది, తెలియని విషయాలు తెలుసుకొనుటకు వీలు కలుగుతున్నది. 

నేను నా కధలను, సృష్టులను అచ్చు వేయించు కోలేదు; పేరు పడిన విమర్శకులకు నేను, నా రచనలు పరిచయంలేవు
కొందరు పాఠకులు ఆదరంగా ఆనందంగా పఠిస్తారు, నా సాహిత్యాన్ని; సంతోషాన్ని తెలుపుతారు కూడా; నే నంతర్జాలాన్ని నమ్ముకున్నాను,  నేను ధనాన్ని ఆశించి ఈ పని చేయుటలేదు తెల్లవారుజామున లేచేఅలవాటు నాకు నా ఆలోచలను  కమ్పూటర్ (బ్లాగ్ )లోనె పొందు పరుస్తాను. నిశ్శబ్ద సందేశాన్ని,  పరిమళమైన సాహిత్యాన్ని , ఆద్యాత్మికంగా దైవ ప్రార్దణలను, ఆనంద  పారవశ్యాన్ని ఇచ్చే లలిత శృంగారాన్ని,  కల్లోల మనస్సుకు ప్రశాంత కల్పించే హాస్యాన్ని, యువరక్తాన్ని  ఉత్తేజపరచే విజ్ఞాన శాస్త్రములను, నా మెయిల్ కు వచ్చే మహానుభావులు, మేధావులు రచించినవి కొన్ని  సేకరించి నేను నడుపుతున్న ఆద్యాత్మిక, విజ్ఞాన, హాస్య, సాంప్రదాయముగా కుటుంబ సమేతంగా చదవగల, వినగల ఏకైక అంతర్జాల పత్రిక అదే ప్రాంజలి ప్రభ, (03-08-2012) ప్రారంభం చేసిన మొదలు ఇప్పటి వరకు (9 బ్లాగుల ద్వారా) సేకరణ, మరియా నాభావలా పరంపర కు సహకరించిన గూగుల్, ఫేస్ ) బుక్ వారికి ప్రత్యే క కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ప్రాంజలి ఘటించి ప్రతిఒక్కరికి  హ్రుదయ్పూర్వక అభినందనలు తెలుపుతున్నాను. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందరి మనస్సు ప్రశాంతము ఉండేవిధముగా రచనలు అందించాలని సంకల్పంతో మీ ముందుకు వస్తున్నను, ఈ నెల 30వ తారీఖుకు 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ  పెడుతున్నాను మరియు నా వయస్సు 60 నిండి 61లో ప్రవేశిస్తున్నాను అందరి ఆశీస్సులు, అభిప్రాయాలు తెలుసుకోవాలని మరొక్కసారి ప్రతిఒక్కరికి నమస్కారములు అందిస్తూ మనోధైర్యమును పెంచే హనుమంతుని ఆరాధిస్తూ అమ్మలుగన్న అమ్మను కొలుస్తూ విజ్ఞానాన్ని అందించాలని కృషి చేస్తున్నాను. నేను వ్రాసేవాటిలో తప్పులు దొర్లినా క్షమించగలరు ఆ పరమాత్ముడు అందరి హృదయాల్లో ఉండి సకర్మ మార్గంలో ఉంచాలనేదే నా ఆకాంక్ష.                  
                                           --((*))--

3. రంగనాద్ అకస్మాత్ మృతి (20-12-2012) కి ప్రాంజలి ప్రభ శ్రద్దాంజలి వహిస్తున్నది 

రంగనాథ్ అనగానే పొడవైన విగ్రహం, మంచి భాష, గంభీరమైన భాషణ 
గుర్తుకొస్తాయి. అగ్రశ్రేణి నటుల తరువాత స్థాయిలో మంచి పేరొందిన నటులు ఆయన. కొన్ని వందల చిత్రాలలో నటించారు. ఎన్నో మంచి విజయాలు సాధించాయి. వాటిలో పంతులమ్మ, ఇంటింటి రామాయణం, సెక్రెటరీ, అమెరికా అమ్మాయి, తాయారమ్మ బంగారయ్య, ఏడడుగుల బంధం మొదలైన చిత్రాలు ఉన్నాయి. వందల చిత్రాలలో ప్రతినాయకునిగా, సహాయ నటునిగా సహజమైన పాత్రలు పోషించారు. విలక్షణమైన నటుడిగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నటన ఒక ఎత్తైతే నిజ జీవితంలో అనారోగ్యంతో ఎన్నో ఏళ్లు బాధపడిన భార్యను కంటికి రెప్పలా చూచుకుని ఒక మంచి భర్త అయ్యారు. ప్రముఖ హాస్యనటి శ్రీలక్ష్మి వీరి చెల్లెలు.

ఇంత మంచి నటుడైనా, ఆయనకు సరైన గుర్తింపు లభించలేదు. భార్య చనిపోయిన తరువాత ఒంటరితనం వేధించింది. నలభై మూడేళ్ల సుదీర్ఘ నటనా జీవితం గడిపిన రంగనాథ్ గారు ఆత్మహత్య చేసుకోవటం ఎంతో బాధ కలిగించింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన. నట జీవితం వెనుక బాధలు నటుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో అన్న దానికి రంగనాథ్ గారి మరణం మరో పాఠం. రంగుల ప్రపంచంలో సంతోషం కన్నా బరువైన జీవితాలే ఎక్కువ.

సిరిమల్లె నీవే విరిజల్లు కావే అనే బాలుగారి పాటకు నాయకుడు రంగనాథ్ గారు. ఈ పాట బాలుగారి ప్రస్థానంలో ఒక కలికితురాయి. రంగనాథ్ గారి స్మృత్యర్థం ఆ పాట....

https://www.youtube.com/watch?v=UAShKhmjpmQ
Sirimalle Neeve Virijallutaave Song - Pantulamma Movie Songs - Lakshmi - Sarath Babu - Ranganath
Watch Sirimalle Neeve Virijallutaave Song From Pantulamma Movie, starring Ranganath, Lakshmi, Deepa ...

19, డిసెంబర్ 2015, శనివారం

ప్రాంజలి ప్రభ - చిన్న కధలు - 01.భాహుమతి --02.పృథ్వి కి ఆకాష్ కి పెళ్లి ,03. శ్రీ హనుమంతుని వేదాంతం కధ ( ”నువ్వు శివుడవు .నేను భద్రుడను")

ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్  ఓం శ్రీ రామ్
PRANJALI: Love story -13 (చేతిలో పైకము లేకుండా చేసే పెళ్లి )...

చెడు - చెడు - వినకు చెడు కనకు 
సర్వే జనాసుఖినో భావింతు
13.- భాహుమతి -
 ఏమండోయి శ్రీమతి గారు నీ పుట్టిన రోజు సందర్భముగా ఏదైనా కోరు కోండి తీసుకొస్తాను అని ముద్దుగా భర్త అడిగాడు, అసలే మీకు గుండె జబ్బు నేను కోరానుకో పడిపోతావు, అడుగు నేను తీసుకొస్తాను. సరే అడుగుతున్నాను బహుమతి  గుండె ధైర్యం చేసుకోండి నాకూ సొంత జెట్ విమానం కొని పెట్టన్డి చాలు మీరు నేను పిల్లలు అందరం కలసి దేశాలు చూసి వద్దామండి  నా  కోరిక తీర్చండి ఆ మాటలకే భర్త బ్రహ్మానందం క్రింద బడి గిల గిల కొట్టు కుంటూ ఉన్నాడు .

నీరు చల్లి లేపి గొప్పలుకు పోకు, ఎప్పటిలా గుడికి పోయి దీవున్ని  చల్లగా చూడమని ప్రార్ధిం తిరిగి వద్దాం, మీరు సుఖంగా ఉండి నన్ను పిల్లలను చక్కగా చూసు కుంటే  రోజూ పుట్టిన రోజులే. నేను నీతో సఖ్యత చూపుట లేదా, అది నీ అంత రాత్మకే తెలుసు వేరేచెప్పాలా.

సరే నీవు బహుమతి ఏమి తేద్దామనుకున్నావో చెప్పు, అప్పుడు నా నిర్ణయం చెపుతాను. నేను చెప్పాకా నీవు కోపం తెచ్చుకో కూడదు, నన్ను తిట్ట కూడదు, ఆ చెప్పు  నీలాంటి బలహిన గుండె కాదు నాది, నీతో ఎన్నికష్టాలు పడలేదు చెప్పు. బహుమతిగా, బహుమతిగా ఆబ్బా చెప్పండి,  వేదించక, ఉండవే చెపుతాను, ప్రక్కన ఉన్న కర్ర, చీపురు  తీయనీవె, అసలే నామతి పొతున్నది,  ఏ బహుమతో చెప్పరా మొగుడా, చంపకు  .

నాలో అర్ధబాగాం నీవు ఆక్రమించావు, మిగతా అర్ధబాగాన్ని ఇవ్వటానికి, నీకు తోడుగా సవితిని తెద్దామను కుంటున్నానే, నీవు కష్టపడకుండా సహాయముగా ఉంటుంది,  ఏమన్నావ్  అదే నీ పుట్టిన రోజు గిఫ్ట్ గా నా రెండవ బార్యను ఇంటికి తెద్దా మనుకుంటున్నాను అంతే

ఎమీ అనకుండా ఇంట్లోకి పోయి తలుపెసుకున్నది, భర్త కు కంగారు పుటింది ఆత్మ హత్యచేసు కుంటుందని అనుకున్నాడు
తెల్లచీర కట్టుకొని పిల్లలను తీసుకొని బయటకు నడిచింది.

నాకు మీ బహుమతి వద్దు, దానితోనే ఉండండి, నేనే నా సవితిని నీకు నా పుట్టిన రోజుగా బహుమతి ఇస్తున్నాను వేల్లోస్తానండి. నవ్వులాటతో అన్నానే, నామోహానికి రెండో పెళ్ళాము కూడానా, నన్ను కరుణిమ్చవే, పిల్లలను వదలవే నీవు రావే, చేమలేసుకున్తున్నాను,  లోపలకు రావే , నాకెవ్వరూ లేరే నీవు తప్ప “నిజమైన ప్రేమ ముందు చిన్న అబద్దపు మాట సముద్రపు ఊప్పెనలా తయారవుతుంది “ నవ్వులాటకూ కూడ నీతో అభద్దం చెప్పను, అంటూ కాళ్ళు పట్టు కున్నాడు, ఒక్క సారికాల్లువిదిలించగా ప్రక్కన నిద్రపోతున్న భర్త క్రింద పడ్డాడు. నీ పుట్టిన రోజు బహుమతి నీ పాదంతో  పూజా, నన్నుక్షమించండి, మీకాల్లకు దండం పెట్టుకోవాలి అంటూ మంగలసూత్రాలను కాళ్ళ కూ అడ్డు కుంది.    అయ్యో ఇది కల  అని నవ్వుకున్నది, పొద్దున్నే నీ నవ్వు మొఖమ రోజూ చూడాలనిపిస్తున్ది, నీకిఉ బహుమతి తెస్తా, వద్దండి మనం హాయిగా ఏదైనా హోటల్కు  పోయి, అలా సినమాకు పోయి తిరిగి రావటమే మీరు నాకు ఇచ్చే బహుమతి.    


14.ప్రాంజలి ప్రభ - చిన్న కధ - పృథ్వి కి ఆకాష్ కి పెళ్లి

అది ఒక మారుమూల అడవి ప్రాంతంలో ఉన్న కొన్ని గుడిసెలు నిర్మించుకొని కొందరు ఆటవికులు అనాదిగా నివసిస్తున్నారు, అక్కడ  పురుషులకు, స్త్రీలకు, మర్మావయవాల దగ్గర తప్ప మరి ఎక్కడ గుడ్డే ఉండదు.  ఇక్కడ మనుష్యులు శ్రమించటం తప్ప విశ్రమించటం ఎరుగరు, నిర్విరామ కృషి వలురు. శ్రామిక జీవన మాధుర్యాన్ని పరి పూర్ణంగా గ్రోలెడు అడవి మల్లెలు, కల్ముష హృదయులు, నిష్కపట నిరాడంబరులు, ఒక రకంగా చెప్పాలంటే నీటిలో ఉండే తామరలు. వీరికి నిద్రేరుగని నిసిరాత్రులు ఎరుగరు, పంచభక్ష పరవాన్నలు ఎరుగరు, ప్రకృతి వనరులు, జంతువుల వేట వీరికి ఆహారాలు.  వీరికి వాళ్ళ నాయకుడుచేప్పిందే వేదం.

ఇక్కడ ఒకేస్త్రిని (పృద్వి)  ఇద్దరు (ఆకాష్, గగన్ )  పెల్లిచేసు కుంటామని ముందుకు రాగా వాళ్ళ పెద్ద
నాయకుడు  5. పరీక్షలు  పెట్టారు.

1.       ఈ త్రిశూలాన్ని ఎంత దూరం విసర కలిగితే  వాళ్ళు గెలిచినట్లు,  (గగన్  కొంత దూరం విసిరాడు, ఆకాష్ విసరగా దూరంముగా ఉన్న గ్రద్ద ఎగురుకుంటూ వచ్చి కాళ్ళతో దూరంగా తన్ను కేల్లటం వళ్ళ దూరంగా పడింది )

2.        మామిడి పండ్లను ఎక్కకుండా ఎక్కువరాల్చాలి (గగన్ కఱ్ఱతో పండ్లను కొట్టాడు కొన్ని రాలాయి, ఆకాష్  చెట్టు దగ్గరకు పోతుండగానే పెంపుడు వానరులు మామిడి పండ్లు క్రింద గడ్డి మీదకు విసురుతూ పగలకుండా ఉన్నాయి )

3.       ఇరువురు గుఱ్ఱము మీద పోయి దూరముగా ఉన్న కొండ దేవత దగ్గర ఈ పతాకము పెట్టి  రావాలి గగన్, ఆకాష్  గుర్రాల మీద బయలు దేరారు, ఆకాష్ గుర్రం వెనుక బడింది, గగన్ గుర్రం ముందు పరిగెడు తున్నది. ఎక్కడ నించో పులి ఘాట్రింపు
ఆకాష్ గుర్రం విని  ఆఘమేఘాల్లో ఎగిరుకుంటూ వెళ్లి ముందుగా వచ్చింది.

4. మీ ఇద్దర ముందు రాళ్ళు, బియ్యపు గింజలున్నాయి, వాటిలో ఉన్న  బియ్యం గింజలు లేకుండా చేయాలి, రాళ్ళు తీయకూడదు ఇది నిభందన.  ఆమాటలకు గగన్ పళ్ళెం ముందు పెట్టుకొని బియ్యపు  గింజలు నోట్లో వేసుకోవటం మొదలు పెట్టాడు. ఆకాష మాత్రం పళ్ళెంలో ఉన్నవి ఒక గుడ్డమీద వెడల్పుగా పోసాడు, అప్పుడు ఎక్కడనుంచొ  కొన్నిపావురాలు ఎగురు కుంటు బియ్యపు గింజలు మొత్తం తినేసి ఎగిరి పోయినాయి.

5. చివరిగా మీ ఇద్దరికీ గాలిలోకి గాజులు ఎగరేస్తాము వాటిని భాణంతో గాజులోనుంచి పోవాలి ఇది నిభందన.
గగన్ భాణముతో మూడు సార్లు ప్రయత్నం చేసి ఓడిపోయాడు. ఆకాష మాత్రం క్రింద పడుకొని గాజులు వేసినప్పుడు  వేగంగా మూడు బాణములు వదిలాడు అందులో ఒకటి  గాజులోనుండి  పోయినది.
       
చివరకు నాయకుడు ఆకాషే పృద్వికి మొగుడు అని చెప్పాడు, మొదటి నాలుగు పందేములలో మూగ ప్రాణులద్వార, చివరిగా బుద్ది కుశలత ద్వారా విజయము సాధించాడు. ప్రేమ, బుద్ధి ఉన్నవారు స్త్రీలను బాగుగా చూసు కుంటారు. వీరికి పెళ్లి ఏర్పాట్లు చేయండి.   అని కుల పెద్ద చెప్పి  వెను తిరిగాడు.      

15.
శ్రీ హనుమంతుని వేదాంతం కధ ( ”నువ్వు శివుడవు .నేను భద్రుడను")

ఒక రోజు శ్రీ రాముడు హను మంతుని దగ్గరికి పిలిచి ”హనుమా !నేను చెప్పిన వేదాంత విషయాలన్నీ విన్నావు కదా .దేహ ,జీవ ,పరమాత్మ లకు సమన్వయము చేస్తూ చెప్పు ”అని కోరాడు .అదే శిరో ధార్యం గా భావించిన పరమ భక్త శిఖా మణి మారుతి ”శ్రీ రామా !వేదాంత రహస్యము తెలిసిన తరు వాత కూడా ఈ దేహం ఉన్నంత వరకు దేహాన్ని ,జీవుణ్ణి ,పరమాత్మ ను వేరు వేరు గా నే భావించాలి .దేహ దృష్టి తో పరమేశ్వరుని ధ్యానిస్తూ ,సేవించాలి .అన్ని భావాలను త్యజించి ,శరణా గతి పొందాలి

 .ఇతరులకు ఉపకారం చేస్తూ ,వారు కూడా భగవంతుని స్వరూపం గా భావించి ,సేవించాలి .ఇలాంటి దానినే భక్తి లక్షణం అంటారు .ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతం .జీవుడు వేరు ,పరమాత్మ వేరు అని భావిస్తూ ,భగవంతుని స్మరిస్తూ , ,భగవంతుని పూజలు చేస్తూ ,భగ వంతుని మూర్తులను చూసి ఆనందిస్తూఉండటానికి ద్వైతం అంటారు .


జీవుడు ,పరమాత్మ ఒక్కరే .ఎందు లోను భేదం అనేది లేదు అని భావన లో ,ఆచరణ లో చూపించటం జ్ఞాన లేక ,విజ్ఞాన లక్షణం అంటారు .ఇదే అద్వైత భావన .–”దేహ బుధ్యాతు దాసోహం ,జీవ బుద్ధ్యాతు త్వదంశః –ఆత్మా బుధ్యాతు త్వమేవాహం ఇతి మే నిశ్చితా మతిహ్ ” –రామా ! దేహ దృష్టి లో నేను నీకు దాసుడిని .జీవ దృష్టి లో నీవు పరమాత్మవు .నీ అంశ చేత నేను జీవ స్వరూపుడను .

పరమాత్మ దృష్టి లో ”నీవే నేను -నేనే నీవు ”.ఈ మూడు లక్ష ణాలు నాలోనూ ,నీలోను ఉన్నాయి .ఇంక భేదానికి అవకాశమే లేదు .”అని స్పష్ట పరచాడు హనుమ .అంజనా నందనుడి సమాధానం విని పరమానంద భరితు డయాడు దాశరధి .”త్వమేవాహం ,త్వమేవాహం ”అని చాలా సార్లు హనుమ ను అభి నందించాడు .

”యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః –యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః –శ్రీ మారుతిత్సేవన తత్పరాణాం –భోగశ్చ ,మోక్షశ్చ ,కరస్త యేవ ”–అంటే ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు .ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగానికి అవకాశమే లేదు .కాని శ్రీ హనుమ సేవా తత్పరు లైన వారికి భోగమూ ,మోక్షమూ రెండు తప్పక లభిస్తాయి అని శ్రీ రాముడు ”వరం ”అను గ్రహించాడు .దానికి వెంటనే ఆంజనేయుడు ”నువ్వు శివుడవు .నేను భద్రుడను .నీకూ నాకు భేదమే లేదు ”అని చెప్పాడు ( జి జి శర్మగారికి కృతజ్ఞతలు )