ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ - జ్ఞాన గుళికలు
సర్వేజనా సుఖినోభవంతు
కంద గుళికలు (రాధా కృష్ణ తత్వం-1)
కాలాన్నిమార్చలేను
సీలాన్ని నీకే అర్పించుటకు వేచి ఉన్నా
పలుకు కరువైనను
తలపులు నికోసం వేచి ఉన్నాయి కృష్ణ
కాగు తున్న వయసును
జాగు చేయక వేగిరమే చల్లార్చుటకు
తగు సమయము కాదనకు
నగు మోము నగుబాటు కాకా ఏలుకృష్ణ
ముసుగు మౌనం తో
పసుపు పారాయణంతో, పసిడిలా మెరుస్తున్నా
వసువులు ఆశిస్సుల, తే
జస్సు ఉన్నది నాలో, తన్మయత్వంతో రా కృష్ణ
హృదయ తపన, స
హృదయుడవు నీవు, అర్ధం చేసుకో గలవు
హ్రుదయామృతమున
మృదువుగా వెలుగు వర్షాన్ని కురిపించు కృష్ణ
ముచ్చటలు చెప్పుకుందాం
మచ్చికగా మక్కువగా మనోహరంగా
స్వచ్చమైన వెన్నలలో
ఇచ్చా కోరికలు తీర్చుకొని సుఖమివ్వు కృష్ణ
--((*))--
జ్ఞాన కంద గుళికలు (రాధాకృష్ణ తత్వం -2)
అలలై ఎగసే మనసుకు
చెలికాడు చెంత చేరి ఊరడిమ్చేదెపుడు
కలలో కల్లోల పరిచావు
కల్లలు కాకుండా కల తీర్చి పోవా కృష్ణ
సీతల పవనాలు నన్ను
మత్తు వదిలించి మనసును వేడి పరిచాయి
కతలు కాదు ఇది నిజం
వెతలు తీర్చుటకు వేగిరమున వస్తావా కృష్ణ
చెక్కిళ్ళు ఎరుపక్కినాయి
ఎక్కిళ్ళు పెరిగి దాహంతో తృప్తి పడమన్నాయి
వాకిళ్ళు ముత్యాల మెరుపు
సంకెళ్ళు వేసి మనసుకు శాంతి కల్పించవా కృష్ణ
సుకుమారి రాధను నేను
ఏకులా ఉన్నాను ఏకమై పోయేదేప్పుడు
చక్కిల గింతలతో చక్కగా
పక్కన చేర్చుకొని మనసు ఊరడించవా కృష్ణ
--((*))--
కంద గుళికలు (రాధాకృష్ణ తత్త్వం -3)
రాధా నీ ముఖకవళికలు
భాదా త్వక్తముతో తనువిచట మనసెచటో
సదా నీ ప్రేమ కోసంఉన్నా
వ్యధ చెందకు ఇక నీకు మమతల కొలువే
కమల నయనాలు
మమతల పారవశ్యంతో తపిస్తున్నాయి
సుమధుర వేణుగానం
సమభావం తో రాధా ఏకమవుదామనిలేదా
చిటికెడు చిలిపి దనం
మాటి మాటికి చేస్తున్న ఆరాధనా పర్వం
కటిక నేలపై వ్రత దీక్ష
ఏటికి ఎదురీదటం ఎందుకు రాధా నేనున్నా
భక్తి పారవశ్యంతో
రక్తి కట్టిస్తున్నావు సంగీత మాధుర్యం తో
శక్తి ధారపోస్తున్నావు
ముక్తిగా నాలో ఐక్యమ్ చేసుకుంటున్నా రాధా
త్వదీయ సౌందర్యం
మదీయ హృదయ మాధుర్య మేళవింపు
తో దివ్య భవ్య తేజం
రాధా భక్తి పారవశ్యం నన్ను చేసే మమేకం
--((*))--
రాదా కృష్ణ తత్వం-4
చూపుల వెన్నలలు
పిపాసి అగ్ని జ్వాలలు చల్ల పరుచు
తపనల గాలులు
తపిస్తూ తన్మయత్వంలో వెలుగుచు
తలపుల స్పర్సలు
పలుకుల వయసు కోరిక ఆశలు
పిలుపులో స్వరాలు
కల కాదు నిజం కలసే బ్రతుకులు
ఈ రాధను ఆరాదగా
మార్చుకోవా మదన గోపాల కృష్ణ
తరుణము మించి పోలేదు
త్వరగా వచ్చి రాధ మనస్సు ఏలుకో
రసిక రాగాల రాధను
వసీకరణంలా వశం చేసు కొనెదవా
వసంత ఘడియలల్లో
మసక చీకటిలో రాధను పాలిస్తావా కృష్ణ
స్వరాల తేనతో మురిపించు
వరాల వాహినిగా సంతోషం కల్పించు
నరాలలో ఉత్తేజ పరుచు
కరములతో రాధను భందిన్చావా కృష్ణ
కంద గుళిక
పసి బాలుని మదిలో
కసి లా కమ్ముకున్నది పడచు ప్రేమ
నుసిలో నిప్పు రగులు
మసి బారి మొద్దు బారే ప్రేమ సొగసు
పసి బాలుని మదిలో
కసి లా కమ్ముకున్నది పడచు ప్రేమ
నుసిలో నిప్పు రగులు
మసి బారి మొద్దు బారే ప్రేమ సొగసు
రక్తం కారుతున్న వి
రక్తి చెందకుండా రక్తి కల్పనే ప్రేమ
మకరాల కడలిలో
శక్తి తో ఈది పొంది గెలిచేదే ప్రేమ
పురి విప్పే ఎర్ర గులాబి
సరి లేదు నన్ను మించిన పుష్పం
మరి మరీ అలా చూడకు
తరిమ్పచేయుటకు కురులలో ఉంటా
రక్తి చెందకుండా రక్తి కల్పనే ప్రేమ
మకరాల కడలిలో
శక్తి తో ఈది పొంది గెలిచేదే ప్రేమ
పురి విప్పే ఎర్ర గులాబి
సరి లేదు నన్ను మించిన పుష్పం
మరి మరీ అలా చూడకు
తరిమ్పచేయుటకు కురులలో ఉంటా
--((*))--
ఈశ్వర కృపా తత్వం పర
మేస్వర పత్ని పార్వతి అభినవ తత్వం
సుశ్వర సంభాషణా తత్వం వి
స్వేశ్వర కోర్క తీర్చే ప్రణయ తత్వం..
మదము మత్సరము
మది తొలచి ఆవేశాన్ని పెంచుతుంది శివ
మదన కోర్కల నుండి
సదా నీ భక్తుని కాపాడవా నిటలాక్ష నిఖలేశ
--((*))--
కంద గుళికలు (వాన)
వాన వరద వెల్లువాయే
సనాతన దేవాలయాలు మునిగి పోయే
చెన్న పట్నం మునిగే
అన్నం దొరుకుటే కడు కష్టముగా మారే
యుద్ద ప్రాదిపతికగా
సద్దు చేయక ప్రజలకు సహాయం చేసే
మద్దతగల పార్టి అనక
హద్దు పెట్టక అందరిని వాన నుండే ఆదుకొనే
గుండె గుబులు పెంచే వాన
వండే వంట సరుకు దొరకనీ ప్రాంతాల్లో
ఉండే ప్రజా వాణికి కడుపు
మండి వీధి వీధి తిరిగిణా తిండి కరువాయె
కట్టే ఇల్లు భాధితులకు
పెట్టే అన్నము, పంచెను కట్టేడి వస్త్రములు
కట్టిన పడవలు చెడిన
తట్టుకొని జీవించే విధముగా ప్రభుత్వరక్షణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి