ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
చెడు అనకు - చెడు వినకు -చెడు కనకు
సర్వేజనా సుఖినోభవంతు
16.- వికసించిన పువ్వు లు *
మంచు
దుప్పటి తీసి, మత్తు కన్నులు తెరచి. మొబైల్ ని వెదికి, మాంచి మెసేజ్ టైపు
చేసి, ప్రియ మిత్రుల గుండెల్లో అలజడి సృష్టించి కుర్ర కారులు ఇప్పుడు
విజ్రుమ్భించు తున్నారు, దీనికి కారణం తల్లి తండ్రులు, అవసరానికి మించిన
ధనము. అని భార్యతో రామారావు చెప్పుతున్నాడు. వారు చూసే దృశ్యాలు చుస్తే నాకు భయమేస్తుంది. నాకు 50 ఏళ్లకు కళ్ళజోడు వస్తే 5 ఏళ్లకే వస్తున్నాయి పిల్లలకు. ప్రకృతి అందాలు ఎప్పుడు చూస్తారు అదేనాకు భాధ. ఇప్పుడు ఆన్ లైన్ ఉద్యోగాలు, చదువులు ఇంటికో లాబ్ టాబ్ 4 సెల్ ఫోన్లు అవసరమా అవునండి మీ కాలంలో లేవు ఇప్పుడున్నాయి అంతే . చాలా చక్కగా చెప్పవే అప్పుడు ఒక్కని సంపాదనతో అందరూ బతికేవారు ఇప్పుడు ఇద్దరు పనిచేసినా ఎల్కేజీ ఫీజు సరిపోవటంలేదంటున్నారు. సుఖము లేదు పని కళ్ళకు శ్రమ. ఇక ఆపండి మీ సోది మనకి పిల్లలున్నరు కదా మనం
కూడా పిల్లల భవిషత్ కారకులవుతాము కదండీ. అన్నది భార్య సీత
ఖచ్చితముగా అందుకనే చెప్పేది మన పిల్లలు చెడుదారి పడకుండా నేను నువ్వు గమనించాలి. నిజమే నండి అట్లాగే ఇద్దరం చూద్దమండి.
అందమైన పువ్వును చూడగానే కలిగే ఆకర్షణ వేరు, మొహం, కృతజ్ఞతగా, నిత్యం, ఆ పువ్వు నే చూడాలనిపించడమ్ ప్రేమ అంటారు. సృష్టి కర్త ఏర్పాటు " మొగ్గకు రేయి అంతా, చల్లని వెన్నలను పంపించి, చిక్కటి చీకటిని తరిమి రేకులు విప్పుకొని ఉల్లాసముగా ఉవిల్లురుతూ ఉంటుంది" . గాలి సెగలకు చేరి సంతోష పడాలను కుంటాయి, భోగానికి సహకరించాలను కుంటాయి, మరికొన్ని దేవుని పాదాలను చేరి యోగులుగా మారాలను కుంటాయి. పావనమయ్యే జీవితము భగవంతుని సాక్షిగా. పత్ర హరితాలను పీల్చుకొనే హృదయాలకు పూదోటలు సంజీవ కల్పలతలు. కలువలు, పొన్నలు మొగలి పొత్తులు నలిగిన కొద్ది పరిమళాలు పెరుగుతాయి. అబ్బా ఏమిటండి మీ వర్ణన పువ్వునా స్త్రీ నా నీవు ఎదను కుంటే అది.
సంపెంగది
మరో రకం నూన్యత, తెనటీగలు వాటి జోలికో పోవు, భార్య కొప్పులో సంపెంగ
పువ్వులు ధరిస్తే అదొక పారవశ్యం భర్తకు. ప్రకృతి పరవసిమ్చినప్పుడు,
పువ్వులు వికసిమ్చి నప్పడు వచ్చే పరిమళాలు మనసుకు ఉల్లాస భరితాలు. మండు
టెన్డల్లో సీతల పానీయాలు, మల్లె పూల గుభాలిమ్పులు ఆస్వాదించని వారెవరు.
బహుళ
అంతస్తులు భవనములు వచ్చాక, శబ్ద కాలుష్యము పెరిగాక, గాలి నీరు అందని
ప్రాంతలో జీవనములు గడపటం సహజ మానవులకే సాద్యము కావటములేదు. తుమ్మెదలు,
తెనటీగలు పుష్ప గుచ్చాలాపై దాడి చేసి కోరికలు తీర్చుకొవటానికి విపరీత
ప్రయత్నాలు చేస్తున్నాయి. గండు తుమ్మెదలను తరిమే శక్తి పువ్వులకు రావాలి.
ప్రత్యూష వేళల్లో పరిమళాలు వెదజల్లుతూ పరవసించి పోవాలి.
--((*))--.....
.
17.ప్రాంజలి ప్రభ నేనూ - నా సాహితీసృష్టులు
నేను
నా అనుభవాలు తెలుపుతున్నాను తెలుగు భాషా అభివృద్దికి నా వంతు కృషిగా నేను
చదివింది డిగ్రి (సైన్స్& మాధ మేటి క్సు), వృత్తి అకౌంట్స్ ఆఫీసర్.
అయి నప్పటికి కీర్తి శేషులు ( మా తాతగారు వేంకటాచల జ్యోష్యులు,
మానాన్నగారు లక్ష్మణ జ్యోష్యులు మా పెదనాన్నలు అందరు పాండిత్యములో
ఆరితేరినవారు). నాజన్మస్థానం తెనాలి, పెరిగింది చదివింది గుంటూరు, ఉద్యోగమూ రీత్యా ఉన్నది హైదరాబాద్ మరియు ఇప్పుడు ఉన్నది విజయవాడ.
నేనూ కవితలల్లుతాను, రచనలు చేస్తాను,
నలుగురి కోసం; కానీ కవిగా గాని రచయితగా గాని గుర్తింపుకు ప్రయత్నమూ చేయట
లేదు; అంతర్జాల మాధ్యమంలో తెలుగు సాహిత్యము మీద కోకొల్లలు, ఏది ఏమైనా అది
ఒక సముద్రము, ఆ సముద్రములో ఒక ధర్మమనే పడవ ద్వారా నా ప్రాయణము
సాగిస్తునాను. అంతర్జాలము ద్వారా అనేకమంది స్నేహితులు పండితులు కలుసుకొనే
అవకాసమ నాకు కలుగు తున్నది, తెలియని విషయాలు తెలుసుకొనుటకు వీలు
కలుగుతున్నది.
నేను నా కధలను, సృష్టులను అచ్చు వేయించు కోలేదు; పేరు పడిన విమర్శకులకు నేను, నా రచనలు పరిచయంలేవు
కొందరు
పాఠకులు ఆదరంగా ఆనందంగా పఠిస్తారు, నా సాహిత్యాన్ని; సంతోషాన్ని
తెలుపుతారు కూడా; నే నంతర్జాలాన్ని నమ్ముకున్నాను, నేను ధనాన్ని ఆశించి ఈ
పని చేయుటలేదు తెల్లవారుజామున లేచేఅలవాటు నాకు నా ఆలోచలను కమ్పూటర్
(బ్లాగ్ )లోనె పొందు పరుస్తాను. నిశ్శబ్ద సందేశాన్ని, పరిమళమైన
సాహిత్యాన్ని , ఆద్యాత్మికంగా దైవ ప్రార్దణలను, ఆనంద పారవశ్యాన్ని ఇచ్చే
లలిత శృంగారాన్ని, కల్లోల మనస్సుకు ప్రశాంత కల్పించే హాస్యాన్ని,
యువరక్తాన్ని ఉత్తేజపరచే విజ్ఞాన శాస్త్రములను, నా మెయిల్ కు వచ్చే
మహానుభావులు, మేధావులు రచించినవి కొన్ని సేకరించి నేను నడుపుతున్న
ఆద్యాత్మిక, విజ్ఞాన, హాస్య, సాంప్రదాయముగా కుటుంబ సమేతంగా చదవగల, వినగల
ఏకైక అంతర్జాల పత్రిక అదే ప్రాంజలి ప్రభ, (03-08-2012) ప్రారంభం చేసిన
మొదలు ఇప్పటి వరకు (9 బ్లాగుల ద్వారా) సేకరణ, మరియా నాభావలా పరంపర కు సహకరించిన గూగుల్, ఫేస్ )
బుక్ వారికి ప్రత్యే క కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ప్రాంజలి ఘటించి
ప్రతిఒక్కరికి హ్రుదయ్పూర్వక అభినందనలు తెలుపుతున్నాను. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందరి మనస్సు ప్రశాంతము ఉండేవిధముగా రచనలు అందించాలని సంకల్పంతో మీ ముందుకు వస్తున్నను, ఈ నెల 30వ తారీఖుకు 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ పెడుతున్నాను మరియు నా వయస్సు 60 నిండి 61లో ప్రవేశిస్తున్నాను అందరి ఆశీస్సులు, అభిప్రాయాలు తెలుసుకోవాలని మరొక్కసారి ప్రతిఒక్కరికి నమస్కారములు అందిస్తూ మనోధైర్యమును పెంచే హనుమంతుని ఆరాధిస్తూ అమ్మలుగన్న అమ్మను కొలుస్తూ విజ్ఞానాన్ని అందించాలని కృషి చేస్తున్నాను. నేను వ్రాసేవాటిలో తప్పులు దొర్లినా క్షమించగలరు ఆ పరమాత్ముడు అందరి హృదయాల్లో ఉండి సకర్మ మార్గంలో ఉంచాలనేదే నా ఆకాంక్ష.
--((*))--
3. రంగనాద్ అకస్మాత్ మృతి (20-12-2012) కి ప్రాంజలి ప్రభ శ్రద్దాంజలి వహిస్తున్నది
రంగనాథ్
అనగానే పొడవైన విగ్రహం, మంచి భాష, గంభీరమైన భాషణ గుర్తుకొస్తాయి. అగ్రశ్రేణి నటుల తరువాత స్థాయిలో మంచి పేరొందిన నటులు ఆయన. కొన్ని వందల చిత్రాలలో నటించారు. ఎన్నో మంచి విజయాలు సాధించాయి. వాటిలో పంతులమ్మ, ఇంటింటి రామాయణం, సెక్రెటరీ, అమెరికా అమ్మాయి, తాయారమ్మ బంగారయ్య, ఏడడుగుల బంధం మొదలైన చిత్రాలు ఉన్నాయి. వందల చిత్రాలలో ప్రతినాయకునిగా, సహాయ నటునిగా సహజమైన పాత్రలు పోషించారు. విలక్షణమైన నటుడిగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నటన ఒక ఎత్తైతే నిజ జీవితంలో అనారోగ్యంతో ఎన్నో ఏళ్లు బాధపడిన భార్యను కంటికి రెప్పలా చూచుకుని ఒక మంచి భర్త అయ్యారు. ప్రముఖ హాస్యనటి శ్రీలక్ష్మి వీరి చెల్లెలు. ఇంత మంచి నటుడైనా, ఆయనకు సరైన గుర్తింపు లభించలేదు. భార్య చనిపోయిన తరువాత ఒంటరితనం వేధించింది. నలభై మూడేళ్ల సుదీర్ఘ నటనా జీవితం గడిపిన రంగనాథ్ గారు ఆత్మహత్య చేసుకోవటం ఎంతో బాధ కలిగించింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన. నట జీవితం వెనుక బాధలు నటుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో అన్న దానికి రంగనాథ్ గారి మరణం మరో పాఠం. రంగుల ప్రపంచంలో సంతోషం కన్నా బరువైన జీవితాలే ఎక్కువ. సిరిమల్లె నీవే విరిజల్లు కావే అనే బాలుగారి పాటకు నాయకుడు రంగనాథ్ గారు. ఈ పాట బాలుగారి ప్రస్థానంలో ఒక కలికితురాయి. రంగనాథ్ గారి స్మృత్యర్థం ఆ పాట.... https://www.youtube.com/watch? | ||
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి