14, డిసెంబర్ 2015, సోమవారం

ప్రాంజలి ప్రభ - చిన్న కధల ప్రభ 1దంపతులు. 2.ప్రకృతి 3.ధనుర్మాస వైభవం

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 

| rePinned by CamerinRoss.com:
చెడు అనకు - చెడు వినకు - చెడు కనకు 
సర్వేజనా సుఖినోభవంతు
 7.దంపతులు. 

మూడు కాళ్ళ ముదుసల్లని, మూడు నేత్రాలుగల ముక్కంటిగారు  , అమ్మగారని, మూడుకాలాల భవిషత్ తెలిసిన మహా జ్ఞానులని, మూడు రంగుల గల జండాను పట్టుకొని “ధర్మో రక్షితి రక్షిత:” అని నినాదంతో తిరుగుతున్న మహానుభావులు మీరు.

ఎంతైనా వయసు ఉడికి, వాలి పోయే పొద్దు లాంటి జీవులు, జారుడబండ మీద నుండి జారే గుమ్మడికాయ బ్రతుకు మాదిరిగా మారిన వారు, ఇప్పుడు కష్టపడుట మీరు  ఎందుకు. కుక్క పిల్లలాగా విశ్వాసం చూపి, తోకాడిస్తూ తిరిగే వారు, ఇప్పుడు మీ  వెనుక కానరారు.  ఒంటరితనాన్ని నుండి బయట  పడటానికి నేర్చిన విద్యనూ చెప్పు కుందామన్న గుర్తించే వారు కరువయ్యారు. అయిన పట్టు విడవకుండా భోధ చేస్తున్నారు.

ఓపిక అనే ఊత కర్రను చేత పట్టుకొని, బ్రతుకు కొసను ఆసాంతం వెల్ల దీసుకొవటానికి, కన్న కొడుకులు , కన్నకూ తుర్ల దగ్గర చేరక బావిలో కప్పల్లాగా ఉండ కుండా, కొణ ఊపిరి దాక దేశ సేవ చేయాలని సంకల్పించారు మీరు అందుకు సంతోషించాలా, మీకు సేవచేయలేదని భాదపడాలా .

మాట పడకుండా ధర్మాన్ని భోధిస్తూ, మౌనం పూలదండను మెల్లో ధరిస్తూ , కాలాన్ని ధనుస్సు నుండి వచ్చిన భానంలా దూసుకుంటూ ప్రజల్లోకి పోతూ, కోర్కల మెలికలను తుంచేసి, రోగాల నుండి విముక్తి చెంది, పసితనం లేపనం పూసుకొని నవ యవ్వన దంపతుల్లాగా దేశ సేవచేస్తునారు.

అనుభంధం మల్లె తీగలను మనసుకు చుట్టు కొనీయ కుండా, దైవాన్ని ప్రార్ధిస్తూ, పుణ్యక్షేత్రాలను దర్సనం చేస్తూ,
నిగ్రహ శక్తి ఉన్నవారికి సాదించలేనిది అంటూ లేదని, కొన ఊపిరిలో కూడా కోటి సూక్తులు ప్రజలకు భోధించి మెల్కొన్న  మహానీయులుగా ఉన్న దంపతులు.

 Stalactites and stalagmites in Van Zyl's Hall inside the Cango Caves, Oudtshoorn, Western Cape, South Africa
8.ప్రకృతి

వయసు ఉడుకులో ఉన్నప్పుడు సమయము సరిపోదు, ఇంకా ఉంటె బాగుండును కదా అని అనుకుంటాం, ఆ రుచి, ఆ సంతోషము, సాస్వితము అనుకోని జీవిస్తాము . కాల చక్రము ఎప్పటిలాగా ఉండదు. అనుకోని అవాంతరాలు వెంబడిస్తాయి, చేప్పలేని ఆవకాశాలు చోటుచేసు కుంటాయి. అందులో కొన్ని " మన సంతోషం పిల్లల రూపమ్లొ మన ఇంట తిరుగుతూ  ఉంటాయి . ఇంట్లో బిడ్డల ఏడ్పులు, శ్రీమతి అలకలు, ఆర్ధిక సమస్యలు మనిషిని ఉక్కిరి బిక్కిరి చెస్తాయి. ఉండేందుకు సొంత ఇల్లు ఉండదు, తాతలు కట్టిన ఇల్లు ఇప్పటివారికి నచ్చదు, అది పాత బడిన యిల్లు, మొత్తం కురుస్తున్నది అని మనల్ని కొత్త ఇల్లు కొనాలని మనసు ఉర్రూత ఊగుస్తూ  ఉంటుంది, అది సాధించునంత వరకు  మానవుడు చేయని ప్రయత్నమూ ఉండదు. కృషి పలిస్తే సుఖం, వికసిస్తే నరంకం.
      
ఇక వంటకు వస్తే పూర్వంలాగా బొగ్గుల పొయి మీద వండే వారెవరు, కట్టెలమీద వండే వారెవరు, ఊక, రంపపు పొట్టు ద్వారా వాడె పద్దతి తగ్గి పోయింది. గ్యాస్ వాడటం పెరిగింది,  అన్నము సరిగా ఉడకనీయ కుండా,  ఉడికి ఉడకని కుక్కర్లద్వారా వంట వండుట, అది సమయము లేదంటూ గబా గబా తినుట  అది ఆరోగ్యానికి అవసరమా అనవసరమా మనమే ఆలొచీంచాలి. సుఖము పెరిగే  కొద్ది భద్దకం పెరుగు తున్నది అది గమనించాలి.

వయసు పెరుగుతూ  ఉన్నప్పుడు స్త్రీ పురుషులు ఆకర్షిమ్చుట, వికర్షిమ్చుట సహజం, దీనికి ప్రకృతి సహకరించుట నిజం, మంచి చెడు అల్లోచించే బుద్ధి మానవులకు ఇచ్చాడు,  అది గమనించి పంతాలకు పోకుండా ఆలోచింఛి  పవర్తించితే  అందరికి సంతోషం. 

కొందరి ఆలోచనలు పెళ్లి ఒక పీడకల, దాని వలన కష్టాలు తప్ప సుఖాలు ఉండవు,  మన ప్రవర్తన బాగుంటే మనచుట్టు
ఉన్న వారు అందరు మనల్ని గుర్తిమ్చుతారు. అనే అలోచనలు  వారిలో రావు ఎందుకు.

కొందరు తను కష్టపడి సంపాదిమ్చిన సొమ్ము భార్యకు చూపి  ఖర్చుల విషయం ఆమెకే వదిలి, మనస్సును ప్రశాంతముగా  మార్చుకుంటారు. ప్రతి విషయంలోను భార్య సలహా అడుగుతారు. మనస్సు  తృప్తి  పడాలంటే మనుగడ సుఖం పొందాలి, ఆవేశానికి పోకుండా,  ఓర్పుతో సమస్యలను పరిష్కరించుకుంటూ సాగే జీవితమే  నిజమైన ప్రకృతి..        


9.ధనుర్మాస వైభవం
గోదాదేవి శ్రీరంగానాదుడే తన నాదుడని భావించింది.
ఎక్కడున్నావో, ఎలా ఉన్నావో , ఓ శ్రీ రంగా నీకోసం ఎదురు చూస్తున్నాను పవలూ రేయీ.. నిన్నుతలచిన వేళ మదికేది హాయి?, చల్లని గాలి మదిని తొలుస్తున్నది, చిరుజల్లుకు తనువు తడుస్తున్నది, మనసు నిలువ నంటున్నది, యదలోని తీపిబాధ తనువెల్ల కనులై నీ కోసమే శ్రీ రంగా ఈ ఎదురుచూపులు.

నిన్ను తలవగా మది పరవశమున ఉహాల ఊయలు ఊగె, విరహపు వెన్నెలలో ప్రేమ ప్రతి పాదనలు, హంస రాయబారాలు నడిపింది, శ్రీ రంగనాదుడితో .


ఒక రోజు స్వామి దిగివచ్చి ... తనను చేయి పట్టుకొని గగనము లోకి తనను తీసుకెలతాడని త్రికరణ శుద్ధిగా నమ్మకముగా ఉన్నది. నేనే నువ్వు, నువ్వే నేను అని భక్తి భావనతో నిత్యం స్మరణతో మునిగి పోయినది. పూజారిగా ఉన్న విష్ణుచిత్తుడు శ్రీ రంగనాధుని పూజ కోసం సిద్దం చేసి మాలల్ని మేడలో వేసుకొని మురిసిపోయింది. ఆవిషయం వెంటనే తెలుసుకున్నాడు మందలించాడు, అయినా వినలేదు విష్ణుచిత్తుని కలలో కీ వచ్చి గోదాదేవి ధరించిన మాలలు నాకు చాల ఇష్టం అని సాక్షాత్తు శ్రీ రంగానాడుడే తెలియపరిచాడు .

మార్గశిర మాసంలోనే సూర్యుడు వృశ్చికం నుంచి ధనూరాసిలోనికి ప్రవేశిస్తాడు.దీన్నే ధనుస్సంక్రమణం అంటాము మల్లీ మకరరాశి లోకి ప్రవేసించేదాకా ఉన్న ముప్పైరోజులు పరమపవిత్రం, మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం, కాబట్టి, గోదాదేవి ధనుర్మాస వ్రతాన్నిచేపట్టింది. రోజుకో పాశురంతో నారాయణుడికి పారాయణ జరిపింది.  భక్తవల్లభుడు బాసిక కట్టుకొని పృద్వికి దిగివచ్చాడు. ముల్లోకాలకూ అధిపతి అయిన దేవుడు గోదాదేవి మేడలో మూడు ముళ్ళు వేసి... తనదాన్ని చేసుకున్నాడు, తనలో ఐక్యం చేసుకున్నాడు.