11, డిసెంబర్ 2015, శుక్రవారం

చిన్న కధలు 1.కొందరి స్థితి*, 2. తుమ్ముకు - కేక, 3.మావారు మంచివారు

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - చిన్న కధల ప్రభ 

happy birthday:
చెడు అనకు - చెడు వినకు - చెడు కనకు 
సర్వేజనా సుఖినోభవంతు

ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక ... 23 (23-08-2020) 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

1. చిన్న కధలు  (కొందరి స్థితి)

 నాన్న ఆ వచ్చేది తాతయ్య అమ్మొమ్మ లాగున్నారు, నీవు ఎవరిని చూసి ఎవరనుకున్నావో ముందు స్కూల్లో నిన్ను దించాలి, మరలా వచ్చి మీ అమ్మను దించాలి గొడవ చేయ కుండా బుద్దిగా కూర్చో కార్లో.

ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కాలి నడకతో వస్తున్న శ్రీమతికి అదిగో, మనవుడు లా ఉన్నాడు ఆ కారులో అని అన్నది శ్రీపతితో. ఇదిగో నీవి గ్రద్ద కళ్ళు కావు కళ్ళజోడు లేందే చూడలేవు, ఎవరిని చూసి ఎవరనుకున్నవో, నేను అబ్బాయికి ఫోన్ చేశా స్టేషన్ కు వస్తూ ఉండవచ్చు ఏదో కొద్దిగా ఆలస్యముగా ట్రైన్ వచ్చిన్దోలేదో నీవే కోడలిని చూడాలి అని, ఈ పిండి వంటల సంచి ఒకవైపు, నీ, నా మందుల సంచి మరోవైపు పట్టుకోమని  నన్ను నడిపిస్తున్నావు. ఇల్లు దగ్గరగా ఉన్నదని తొందరగా . 

ఇదిగో ఇంటి దగ్గర వచ్చాము అబ్బాయి ప్లాట్ నెంబరు ఒక్కసారి చూడు, ఆ ఇదే 5వ అంతస్తులో 501 నెంబరు గల ప్లాట్ .పోదాం పదా ఇందాక వచ్చాక ఆగుతా వెందుకు, అవును మనబ్బాయేనే ఆకారులో 


గేటు ముందు నుంచి  పోతున్నాడు, మన నుంచే పోతున్నాడే, మనబ్బాయి మనల్ని చూడలేదండి,  తల్లి మనస్సుభాదపడింది . లిఫ్ట్ ఎక్కడుందో చూద్దామ్ పదా. ఈ టైమ్లో లిఫ్ద్ట్ పనిచేయదు ఎందుకు కరంటు ఉండదు కదా, మరి జనరేటర్ వేయవచ్చు కదా , ఈ బిల్డింగ్ ఒక్క రాత్రిపూటే వేస్తాము కదా, మరి పైకి వేల్లెదేట్లా, మెట్ల మీద ఎక్కి పోవాలికదా.

చూడవే శ్రీమతి నీ పుత్రుడు చేసిన ఘనకార్యం వస్తున్నానని చెప్పిన ఉండలేదు, ఎందు కండి అబ్బాయి నంటారు ఈ ట్రైన్ లేట్ రావటం వల్లే కదా ఈ కష్టాలంతా, ముందు నాకు కాస్త మంచి నీరు ఉంటె చూడండి నేను తెచ్చినవన్నీ అయి పోయినాయి. బాబు మంచి నీరు దొరుకు తాయ, ఇక్కడ వాటర్ దొరకవు కదా, దగ్గర షాపులో వాటర్  బాటిల్ తెచ్చుకోవాలికదా, నాదగ్గరైతే బోర్ నీరు ఇవ్వమంటారా, తాగలేరుకదా,   ఏంచేయాలో తోచలేదు వారిద్దరికీ ఒక వేపు దాహం 

అంతలో కొడుకు కారులో వచ్చాడు, దిగుతూ నాన్న అమ్మ మీరెందుకు  ఇప్పుడొచ్చారు, అదేమిటిరా నీకు ఫోన్ చేసే వచ్చాము కదా, నేను రమ్మనమని చెప్పలేదు కదానాన్న, అమ్మ యివిగో  ఈ మంచి నీరు త్రాగు, ఈ కారు ఎక్కండి అన్నీ విషయాలు చెపుతాను, ఎక్కడికిరా ఇల్లు ఇక్కడుండగా, అమ్మా మీ కోడలు మాట్లాడు తుందట మాట్లాడమ్మ ఫోన్ అందించాడుకొడుకు,  (అత్తగారికి మావయ్యగారికి పాదాభివందనములు మేము రోజు 8 గంటలకు పోయి 8గంటలకు తిరిగి ఇంటికి వస్తాము నేను ఆడిట్ క్యాంపు ఉండుట వల్ల కలవలేదు మేమే మీదగ్గర్కు సెలవులో వస్తాము, ) బాబు ఎక్కడకురా తీసికెల్లేది, గరుడ బస్సు ఎక్కించి నేను  అఫీస్ కు పోవాలి నాన్న, నాకు సెలవులేదు. 

బస్  స్టాండ్ వద్ద ఉన్న హోటల్ వద్ద దించి వేల్లురాబాబు, కాస్త టిఫిన్ చేసి ఎర్రబస్సు ఎక్కి వెల్తాము, మేము గరుడ, ఐరావత్, ఎక్కెంత స్టేజికి  ఎదగలేదురా, నన్ను క్షమించునాన్న, అంతకన్నా మేము ఏమి చేయలేము.. ఇవిగోరా నీకు మనవడికి అని బట్టలు, పిండి వంటలు, తీసుకో,  తీసుకొని తల్లి తండ్రులకు నమస్కరించి వెళ్ళాడు పుత్రుడు, వీరికి తిరిగు ప్రయాణము చేయక తప్పలేదు. ఇదే కొందరి  స్థితి        

--(())--


నీళ్ళు  24-08-2020  

నీరు పల్లమెరుగునిజం దేవుడెరుగు.నీళ్ళు పారతై  తప్పులేదు దొర్లుత్తై పొర్లుతై,తెర్లుతయ్యి కూడా.కాలుతై.నిండుతై.. నీళ్ళు ప్రవహిస్తాయ్,ప్రకాశిస్తాయ్ 
ఉప్పు నీళ్ళు,మంచి నీళ్ళు, వర్షం నీళ్ళు, సముద్రం నీళ్ళు,పంపు నీళ్ళు,బావినీళ్ళు,బోర్ నీళ్ళు.  మడి  నీళ్ళు,మైల నీళ్ళు వుంటాయి మీకు తెలిసినా తెలియకపోయినా ! వెన్నీళ్ళు,చన్నీళ్ళు సరే,వెన్నెళ్ళకి చన్నీళ్ళంటే ఆర్డమేవేరు. 
కొబ్బరి నీళ్ళు,మురికి నీళ్ళు,మురుగు నీళ్ళు,సబ్బు నీళ్ళు,సర్ప్ నీళ్ళు, మున్సిపల్ నీళ్ళు.చెరువు నీళ్ళు,కాలువ నీళ్ళు,సాగు నీరు,తాగు నీరు......అబ్బో నీళ్ళల్లో ఇన్ని రకాలా అనిపించటంలా! అంతేనా ఇంకా వున్నై.మినరల్ వాటర్,రైల్ వాటర్, బాటిల్ వాటర్,  హాట్ వాటర్,కూల్ వాటర్,ఫ్రిజ్ వాటర్, !........అలా....సరేగాని,రోజ్ వాటర్  వాడారా ఎప్పుడైనా!
నీళ్ళు తాగుతాము సరే అప్పుడప్పుడు నములుతా ము కూడా కదూ!నీళ్ళు వదిలేస్తాం కూడా! నేలమీదే కాదు, ఆశలమీదా,ఉత్స్తాహమ్ మీద కూడా నీళ్ళు చల్లేవాళ్లుంటా రు . జాగ్రత్త.అందరం రోజూ నీళ్ళు పోసుకుంటాం వింతేముందీ,ఆడొళ్లని  నీళ్లొసుకున్నవా అంటే మాత్రం అర్ధం వేరే వుంటుంది కదూ?
 కొంతమందికి కొన్ని కొన్ని చోట్ల నీళ్ళు బాగా వంటపడతై. కొన్ని చోట్ల నీళ్ళు సరిపడవ్ ..ఒళ్ళు అలాంటిదీ. అదేం చిత్రమో మరి,కొన్ని చోట్ల ఎంత లోతు తవ్వినా నీళ్ళు పడ వ్,కొన్ని చోట్ల కాస్తంత తవ్వితే చాలు నీల్లే నీళ్ళు.నే ల  అట్లాంటిది.
 నువ్వులు నీళ్ళు ఎప్పుడు వదుల్తామో తెలుసుగా ?నెత్తిన నీళ్ళు చల్లుకో చాలంటారు కొన్ని సందర్భాలల్లో .పసుపు నీళ్ళు పవిత్రమంటారు..తులసి తీర్ధం సరే తెలిసిందే అందరికీ, (కరోనా పుణ్యమా అని ఇవి అందరికీ ఔషధాలైనై)
నారు పోసినవాడు నీరు పోయడా అని పెద్దలంటే నీరు పోసినవాడు బీరు పోయడా అన్నాట్ట  ఓ తుంటరిఇదీబానే వుంది వినటానికి.
ఆకలేసినప్పుడు దొరికిన అన్నం కన్నా దాహమేసినప్పుడు దొరికిన నీళ్ళు మిన్న చలివేంద్రాలు పెట్టి జల దానాలు చేసేది మనమే,జలయుద్దాలు చేసి జనాన్ని చంపేదీ  మనమే.జలయజ్ఞాలు చేసిన వారు,జలదానాలు చేసిన వారు వున్నారు                                                  
జలజ అనగా జలమునుండి పుట్టి న దీ అని అర్ధమట మరి జలగా అనగా....? జలచరాల సంగతి సరే .జలాంతర్గాములు తెలుసుగా.
నీట ముంచినా,పాల ముంచినా …...ఖర్చు ఒకటే ఈ కాలంలో!కడివెడు నీళ్ళు కళాపి చల్లే రోజులు కరువై పోయి గుక్కెడు నీళ్ళు తాగటానికి దొరికితే చాలనుకునే రోజులోచ్చేసినై
మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి కదా . అర్ఘ్యం అన్నా,పాద్యం అన్నా నీరేట!అతిధులు రాగానే కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళివ్వటం మన ఆచారం. అందుకే హస్తో ప్రక్షోళ  యామి,పాదో ప్రక్షోళయామి ,శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటాం పూజలో. నివేదనలో మంచినీళ్ళు పెట్టటం మచిపోకూడదు సుమీ!
పచ్చి మంచి నీళ్ళు ముట్టుకోలేదంటుంటారు!  నీళ్ళు,నిమ్మ రసం ఎప్పుడిస్తారో తెలుసుగా.నిమ్మకు నీరేత్తినట్లు కూర్చోటామంటే !పేరుకు ఫైరింజెనే గానీ, దాన్లో ఉండేది నీళ్లే!!నీళ్లాడట మంటే తెలుసుగా ,వాటర్ దెరఫీ వినేవుంటార్లే .మంచి  నీళ్ళ ప్రాయం అనే సందర్భం మీకూ అనుభవంలోదే  అయి వుంటుంది.కూపోదకానికి ఓ ప్రత్యేకత వుంది తెలుసుగా.వేసవిలో చల్లగానూ,శీతా కాలంలో వెచ్చగానూ వుంటయ్యి నూతి నీళ్ళు.నీటి గండం వుంటుంది కొందరికి. రాబొయ్యే రోజుల్లో మనందరికీ నీతి గండమేనట (నీళ్ళు దొరక్కపోతే గండం కదూ మరి!)

Indic Nonpareil
పంజలి ప్రభ అంతర్జాల పత్రిక కధలు ... 23 
2.చిన్న కధ (తుమ్ముకు - కేక) 25-08-2020

డాక్టర్ గారు నాకు మంచి మందు ఇవ్వండి తుమ్ములు తగ్గటంలేదు, అవును నీకు నాకు తెలిసిన మందులన్నీ వ్రాసి ఇచ్చాను, ఎవీ పనికి రాలేదు, మీతుమ్ములు కాలమే తగ్గించాలి ఇంతకన్నా నేను ఏమి చేయలేను అన్న ఆమాటలకు ఒక్కసారి కల అని తెలుసుకొని నవ్వు కున్నాడు రామకృష్ణ....

లేచారా నిద్ర , మీరు బాత్ రూమ్లోకి పోయి రండి, కాఫీ తెస్తా సరే అని లోపలి వెళ్ళగా, వస్తూనే  పెద్దగా తుమ్మాడు రామకృష్ణ,  చేతులు వణికి ఉన్న కాఫీ కప్పు ఎగిరి మొహం మీద, చీరమీద పడింది. శ్రీమతి పెద్దగా కేక పెట్టింది,   అప్పుడే భయమేసింది రామకృష్ణకు , చూడండి  మీ తుమ్ములు ఎంత పనిచేస్తున్నాయో,  నేను చీరలు మార్చుకోలేక చస్తున్నా ....

ఇదిగో మనం పెళ్ళికి వెళుతున్నాం అక్కడ తుమ్మటం మాత్రం చేయకండి,  అందరిలో పరువు పోతుంది. ఇదిగో పిత్తు వచ్చిన తుమ్ము వచ్చిన ఆపలేరని శాస్త్రంలో ఉన్నది, మీరు నామాట వినండి , అట్లాగే లే  నన్ను చొ చొ అంటూ ఉండు ...  తాళి కట్టే సమయాన పెద్దగా తుమ్మాడు, అంతే అప్పుడే శ్రీమతి కుంకం పసుపు ఉన్న పళ్ళెం క్రింద పడేసింది పెళ్లి ఆగిపోయింది అందరూ అపశకునం అని తిట్టారు ఒకరు, సరిఐన కట్నం ఇవ్వలేదని ఒకరు పోప్ట్లాడుకున్నారు. అందరూ వెళ్లి పోయారు . చివరకు రామకృష్ణ భార్యతో వెల్లపొతూ ఉంటే పెల్లికూతురువాల్లు మీ తుమ్ము మాకు మంచే  చేసింది పెళ్ళివారు మోసకార్లు అని తెలిసింది,  ఇప్పుడే పోలీసులకు అప్పచెప్పి వచ్చాము .      

రామకృష్ణ గారు మీ శ్రీమతి ఉన్నదా, మా అమ్మ యి పురిటి నేప్పులతో భాదపడుతున్నది, ఒక్కరవ్ చూడటానికి పంపుతారా, మ ఆవిడా భయపడుతున్నది,  పక్కింట్లో కొత్తగాదిగాము మేము అన్నాడు సుబ్బారావు. డాక్టర్ వచ్చి చూసి కడుపులో  పిల్ల అడ్డం తిరిగింది అనిచెప్పారు పెద్ద హాస్పటల్ చేర్పించండి, ఆపరేషన్ చేయాలి అన్నారు, చేర్చామన్నారు తోడుగా  నర్సు ఉన్నది .

నేను మా ఆవిడా వస్తాం మీరు భయపడకండి అని, అమ్బులేన్సుకు పోన్ చేసారా. అ వస్తున్నదండి.

అంబులేన్సులో బయలు దేరారు అందరూ. డ్రైవర్ ప్రక్కన రామకృష్ణ కూర్చున్నాడు వ్యాను బయలు దేరింది రామకృష్ణ పొగకు తట్టుకోలేక పెద్దగా తుమ్మాడు, డ్రైవర్ ప్రక్కనే ఉన్న బండ రాయిని కొట్టి ఒక్క కుదుపుతో వ్యాన్ మిషన్ ఆగింది, అక్కడే ఉన్న భార్య పెద్దగా అరిచింది, ఆ కుదుపులకు మగ  బిడ్డ పుట్టినట్లు కేవ్వుమనికేక వినబడింది.

మా పాలిట పుణ్య దేవతలు అని అందరూ ఆహ్ఫానిమ్చటం మొదలపెట్టారు, మీ తుమ్మె మంచే చేస్తుంది, కాదు
నీ కాకే  మంచి చేస్తుంది ఆ..... ఆ... 




3.చిన్న కధ (మావారు మంచివారు )

ఎం లక్ష్మమ్మ  దిగులుగా ఉన్నావు,  ఏముంది అయ్యగారు రెక్కాడితే గాని డొక్క నిండదు మా బ్రతుకులకు,  నా కూతుర్లను చదివిద్దామను కున్నాను, నావల్ల కావటములేదు,  నా పిల్లలు, నా లాగ పని మనిషిగా మరకూడదని ఆలోచిస్తున్నాను. నీకు పిల్లల చదువు కొరకు  డబ్బు అవసరమా అదేనండి,  అడగా లంటే భయముగా ఉన్నది. అమ్మగారోస్తున్నారు తరువాత  అడుగుతాను అని లోపలి వెళ్లి పోయినది.

ఏమిటి లక్షమ్మతో గుసగుసలు, ఎమీలేదే ఏదో పాపం పిల్లల  స్కూల్ ఫిజులకు డబ్బులు కావలంటా.....
ఇస్తానన్నారా ...  అబ్బే లేదు లేదు ....    ఇదిగో మీరు ఇచ్చారనుకో నామీద ఒట్టు ...అదే అలుసుగా ప్రతిదీ ఏదో ఆనక చెప్పి డబ్బు అడుగు తారు,  నేను ఇంకా డబ్బు ఇవ్వ లేదుగా ...మీరివ్వద్దు,  ఇవి నా  డబ్బులు మీదబ్బులన్ని త్రాగుడుకి తగలేశారు కదా ... అబ్బా ఎందుకే చచ్చిన పాముని ఇంకా చంపుతావు.

సరే ఇదిగో ఈడబ్బు ఈ నెల కోట మీఖర్చులక్రింద  అంటూ ఇచ్చి ఆఫీసుకు వెళ్తున్న అని చెప్పి వెళ్ళింది భార్య.
అయ్యగారు నేను వెళ్ళొస్తా అంటూ లక్షమ్మ కూడా చెప్పి వెళ్ళబోతుంటే, ఆగు లక్షమ్మ ఈ డబ్బు తీసుకో. అమ్మగారు మిమ్మల్ని ఎమన్నా అంటారేమోనండి, ముందు మీపిల్లలను చదివించు ఇది  మాకు మామూలే ..
ఆట్టానే అయ్యగారు వెళ్ళొస్తా ... 

ఇదే విధముగా పని మనిషి పిల్లల చదువు నిమిత్తం కొంత డబ్బు సర్దాడు రమణ రావుగారు,
రోజులు మారుతున్నవి. భార్యకు నారాయణ రావు ప్రవర్తన అర్ధం కాలేదు చాలా ఉషారుగా ఉంటున్నారు.
ఒక రోజు భార్య భర్తను అడిగింది మీ ఉషారుకు కారణం ఏమిటి, నేను కష్ట పడుతున్నాను మీతొ మాట్లాడుటకే సమయం దొర కుటలేదు, ఎమనుకోకండి, మీ కష్ట సుఖాలు గమనించ కుండా తిరుగుతున్నా ఈ సంవస్చరంతో నేను రేటిర్ అవుతాను, పిల్లలు రెక్కలు వచ్చి వెళ్లి పోయారు నాకు మీరు మీకు నేను కదండీ. ఆవును  అది కాదనే వారెవరు మనభంధం తిరుగు లేనిది.

అప్పుడే లక్షమ్మ కూతుర్లతో వచ్చి, దంపతులకు దండం పెట్టిచ్చింది . అమ్మగారు, అయ్యగారి చలువ వళ్ళ మా అమ్మాయి లలో  ఒకరు 10th లో జిల్లా  ఫస్టు వచ్చింది, మరొకరు ఇంటర్లో కాలేజి ఫస్ట్, మరొకరు డిగ్రీలో 
యూనివర్సిటి  ఫస్ట్ వచ్చరు అని  చెప్పుదామని వచ్చావమ్మ గారు. 
ఏమిటే దాస్తున్నావు
అదేనమ్మ స్వీట్ మీకు ఇవ్వ వచ్చా లేదా అని
నాకుకూడా  సంతోషమేకదే తెచ్చిన స్వీట్ పెట్టు అయ్యగారికి నాకు
అట్లాగే నమ్మ గారు
ఇదిగో మీ పెద్దమ్మాయి  పెళ్ళికి నేను పైకం ఇస్తా మంచి సంభందహం చూడు 
అట్లాగే నమ్మగారు అని వెళ్లి పోయింది పని మనిషి.
ఏమండి నాకు తెలియకుండా ఈమెకు డబ్బులు ఎక్కడనుండి తెచ్చి ఇచ్ఛారు, మీ దగ్గర డబ్బులు లేవు కదా  నన్ను అడుగలేదు మరి ఎట్లా ఇచ్చారు.
ఏమీలేదే నీవు నా ఖర్చు క్రింద  ఇచ్చిన వాటిలో మొదట సిగరెట్టూ మానేసి ఇచ్ఛా, తరువాత త్రాగుడుమానేసి ఇచ్ఛా, ఆతరువాత కారు వాడడం తగ్గించి కాలి నడకన వెళ్తూ పెట్రోల్ ఆదా చేసి  ఇచ్ఛా, నామనసు ఏంటో నీకు బాగాతెలుసు, "మావారు ఎంత మంచివారో " అంటూ నేను సంపాదించే డబ్బునీదికదా మనిద్దరం కలసి బీద విద్యార్ధులకు సహాయం చేద్దాం , నీ మాటకు ఎప్పుడు కాదనన్నాను దేవి 

--(())--                                                                
                                                             

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి