18, డిసెంబర్ 2015, శుక్రవారం

ప్రాంజలి ప్రభ - చిన్న కధల ప్రభ .1. ఏమండో శ్రీమతి గారు, 2.సహకారం, 3. తెల్ల కుక్కపిల్ల

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 

belle image
    
చెడు అనకు - చెడు వినకు - చెడు కనకు 
సర్వేజనా సుఖినోభవంతు
 1. ఏమండో శ్రీమతి గారు 

 ఏమిటి శ్రీమతి గారు నేను స్నానం చేసి వచ్చే లోపే నా సెల్ నుండి తీసేస్తున్నవు, అలా చేయుట తప్పు కదూ, ఇతరుల సెళ్లులు చూడటం తప్పుకదా, మీరు మా వారే కదా అందు కనీ, అది నిజమే ఎవేమి డిలిట్ చేసావో కనీసం చెప్పు,  ఏమైనా ఆఫీస్ వి డిలిట్ చేసావనుకో, నాకు ప్రాబ్లం వస్తుంది, నాకెందుకు తెలియదండి నే నేమన్న చదువుకొని దాన్నా మీ భార్యనండి.

నేను వాడ్సప్ ఓపెన్ చేశా నాన్ వెజబుల్ జోక్స్ డిలిట్ చేశా, కొన్ని బొమ్మలు చూస్తే నావళ్లు కంపర మెక్కింది.

ఇంకా ఏమేమి తిసేసావు. నేను మిమ్మల్ని “వైరస్” లోకి తీసుకెల్లేవి తీసి వేసాను. ఇంకా పనికి రాని గాలి కబుర్లు డిలిట్ చేసాను. ఫేస్ బుక్ లోవచ్చే ప్రాంజలి ప్రభని తీయ లేదుకదా. నేనెందుకు తొలగిస్తానండి నాకేమన్న పిచ్చా,  రోజూ కొత్త కధలు, కవితలు, ఆద్యాత్మిక విషయాలు తెలుస్తున్నాయి కదా. నాకు కొంచం ధర్మం తెలుసండి అన్నది భార్య.

ఎం తెలుసు నీకు కొంచం చెప్పు,  చెపుతా వినండి “ మనిషి శరీరాన్ని వదలి వెళ్ళేటప్పుడు భందు మిత్రులుగాని, కుటుంబ సబ్యులుగాని వెంట రారు,  మనము అనుసరించిన ధర్మం ఒక్కటే అన్నాడు ఒక మహాకవి “

అందుకే నేను మీతో అంటాను,  దేనినైనా వదలివేయవచ్చును గాని, కామానికి వసుడయ్యో,  భయానికి లోనయ్యో, లోభం వల్లనో, లేదా ఎదో బతుకుదెరువు కోసమో ధర్మాన్ని నిర్లక్షం చేయరాదు, ధర్మాచరణను విడువరాదు.

అంటే నా ప్రవర్తన ధర్మం గా ఉన్నదా లేద, ఉన్నారు కాబాట్టే మీతో కాపురం చేస్తున్నాను, నేను ధర్మం తప్పా ననుకో ఆమాటలు ఏ భర్త నోటి వెంట రాకూడదు, వచ్చాయనుకో స్త్రీ కాళికావతారం ఎత్తటమే. ఏమిటే ఇప్పుడు అంత కోపంగ ఉన్నావు. శాంతం,శాంతం.

అసలు ధర్మాన్ని ఎరుగని వారెవరో తెలుసా నీకు అని అడిగాడు భర్త

లోకంలో ధర్మం ఎరుగని వారు పది మంది ఉన్నారు. అలాంటి వారితో సాంగత్యమును ఎర్పరుచుకోకూడదు

1.       మాత్తేక్కినవాడు, 2. పొరపాటుపడువాడు, ౩. పిచ్చివాడు 4.అలసినవాడు  5. క్రోధం కలవాడు 6.ఆకలిగొన్నవాడు 7. తొందరపా టుగలవాడు, 8. అత్యాస కలవాడు 9. భయ పడివవాడు 10. కాముకుడు  వేరేనని విదుర నీతిలొ చెప్పారండి.

సెల్ ఎందుకు ఓపెన్ చేసావంటి చిన్న కధ చెప్పావు, అసలు నా పాస్ వర్డ్ నీకెట్లా తెలిసింది. భర్త గుణం తెలుసుకొనే భార్య కాపురం చేస్తుందండి  . ఆ .. ఆ .. సెల్ మోగుతున్నది మీ అమ్మ గారుచేసారేమో చూడు లేదు ఇది మీ అక్క గారు చేసారండి    

                                                                   --((*))--

2.సహకారం

మాజీ ప్రిన్సిపాల్ గారు బాగున్నారా, మీ శృతి కి 95% మార్కులు వచ్చాయి, కానీ ఇక్కడ మీకు సీటు రాక పోవచ్చు, ఉత్తర దక్షణాలు ఎక్కువగా పనిచేస్తున్నాయి నమ్మకంగా పనిచేస్తున్న పాత లెక్చిరర్, ప్రిన్సుపాల్ రావటం సీటు లేదనటం జరిగింది.మనలానటి మధ్యతరగతి వారి చదవటం కష్టతరముగా మారుతున్నది. పద శృతి వెళ్దాం. 
       
నాన్న నీలో ఉన్నగుండే ధైర్యం ఎందుకు తగ్గింది, నా చదువు గురించి నీవు దిగులు చెందకు, నేను చదువును ఆపను,తల్లి తండ్రులారా మీరు ఏది చదవమంటే అది నేను చదువుతాను, అక్కల నలుగురికి పెళ్ళిళ్ళు చేసారు, నేను  మీకు భంధంలా ఉండ దలుచు కోలేదు,  నాకు తెలిసిన విద్యలలో  కంపూటర్ టైపింగ్, కుట్టు ఎంబ్రాయడరీ, నాకు తెలిసిన విద్యలద్వారా ఉద్యోగమూ చెస్తూ ప్రవేటుగా డిగరి చదువు తాను  నాన్న. నన్ను ఆసీర్వదించండి మీరిద్దరి ప్రోస్చాహముతో, ఒక దృడ సంకల్పము నకు వచ్చి, మనో ధైర్యముతో ముందుకు పొవాలని అనుకుంటున్నాను. ఒక్క మూడు సంవస్చరాలు దాకా పెళ్లి గురించి మాట్లాడకండి, నాకాళ్ళ మీద నేను నిలబడటానికి అవకశం ఇవ్వండి.

నేను ఆడపిల్లనే మొగవాళ్ళ, మ్రుగాల్లాంటి వాళ్ళు,  ఉన్న చోట బ్రతకటం కష్ట మంటావమ్మా, నన్ను ఒక మగవాడిగా పెంచారు, నేను బ్రతికి మిమ్మల్ని బ్రతికిన్చు కొనే శక్తి నాకివ్వండి. నాన్న నీ అను భవ మంత ఉచిత విద్యా భోధనకు ఉపయొగిన్చు, మనమే ఆర్ధికంగా వెనుకబడిన వారిని సేకరించి, వారికి తగిన ఉపాది కల్పించి మొగ వారి తో సమానముగా  అడవారు కూడా బ్రతుక గలరు అని నిరూపించాలి నాన్న. నీధైర్యమునకు మాలో యువరక్తం ప్రవహిస్తున్నదమ్మా నీకు మా పూర్తిసహకారమ్ మేము ఇస్తాము.                          
                                                         --((*))--
  3. తెల్ల కుక్కపిల్ల

ఏమిటి రామకృష్ణ  గారు ఈరోజు అన్నదానము చేస్తున్నారు, చెపుతాను రామారావుగారు కూర్చోండి   ఆరొజూ  
"ఏమిట్రా బాబు కుక్కపిల్ల అరుపు ఇంటిలో వినబడుతున్నది, అవునమ్మా నేనే తీసుకొనివచ్చా, పాపం చలికి వణుకుతున్నది, రగ్గు కప్పుకొని మరీ తీసుకొనివచ్చా, ఎక్కడతెచ్చావో  అక్కడ వదిలిరా, వాలమ్మ ఏడుస్తుంది, అవునమ్మ వాలమ్మ  కోసం చాలా సేపు వెతికాను ఎక్కడా కనబడలేదు అందుకే తెచ్చా, కాస్త అన్నం పెట్టు ఆకలేస్తున్నదేమో, ఇదిగో ఈ అన్నం పెట్టి ఎక్కడన్నా వదలేసిరా, లేదమ్మా నేనే పెంచుకుంటా, మీ నాన్న ఒప్పుకోడు, నీవే వప్పించ్చమ్మ.సరే దాన్ని జాగర్తగా చూసుకోవాలి, అట్లాగేనమ్మా .

తండ్రి రావటం, కుక్కపిల్ల చెప్పులు కొరకటం జరిగి పోయినాయి, కొడుకు గమనించి నాన్న ఈ పాత చెప్పులు బాగాలేదు అవి పారేస్తున్నాను కొత్తవి కొనుక్కో అన్నాడు, అవునండి కొత్తివి కొనుక్కోండి. ఏమిటే నీవు కూడా కొడుకును సమర్దిస్తావు.

నాన్న కుక్క అరుస్తున్నది, అవును ఉండు లైటు వేస్తా, ఎవరూ అటు పరుగేట్టేది అని గట్టిగా ఆరిచాడు, అప్పుడు దొంగలు పక్కింట్లో పడి దోచుకొని వెళ్లినట్లు గమనించారు. పక్కట్లోకి వెళ్లి ఓదార్చి, పరామర్శించి,పోలీస్ ఫోన్ చేసారు.

ఒక సారి కుక్కపిల్లను వెంట పెట్టుకొని విందుకు బయలు దేరారు, అందరూ చూస్తుండగా పాయసంలో మూతిపెట్టి  అరుస్తున్నది.  అక్కడున్నవారు కుక్కను కొట్ట పోయి గిన్నెను కొట్టారు, గిన్నేనుండి దొర్లిన పాయసంలో బల్లి కనిపించింది. అందరు కుక్క పిల్లను మెచ్చుకున్నారు.

కుక్కకు రకరకాల ఆటలు నేర్పారు,  పరిగెడుతూ గుంటలో పడింది, గుంటలో పాముతో పోరాడింది, పామును చంపివేసింది.

పాము విషముకుక్కకు ఎక్కకుండా డాక్టర్ సలహా ప్రకారము ఇంజక్షన్ చేయించారువారు. ఆ యింట్లో వారు కుక్కను భైరవునిగా భావించి పూజచేసి గారెలదండ వేసారు. కన్నా బిద్దలాగా చూస్తున్నారు.

అనుకోని విధముగా అందరూ కలసి ఊరికి పోవలసి వచ్చింది. కుక్క పిల్లను ప్రక్క ఇంటివారికి ఇచ్చి బయలు దేర బోయారు.  .
 ఆ ప్రక్క  యింట్లో ఉంచిన  కుక్క పిల్ల   ఒకటే ఏడుస్తూ పరుగెడుతూ మాకరుక్రిండ పడి  చని పోయింది. ఒక్కసారిగా మాబాబుకేవ్వుమని అరిచాడు, అపుడు చనిపోయిన కుక్క పిల్లను తీసుకువచ్చి మా తోటలో పాతిపెట్టాము.
అప్పుడే పిడుగు లాంటి వార్త ' మేము వెళ్ళే ట్రైన్ ను కొందరు దుండగులు పెట్రోల్ పోసి తగలేసినట్లు చాలా మంది సజీవ దహన మైనట్లు తెలిసింది.' మాప్రాణాల కోరకు  తన ప్రాణాన్ని అర్పించిన కుక్క పిల్ల చనిపోయిన రోజు అన్నదానము చేస్తున్నాము, అందుకే  మా యింట్లో కుక్క ఫొటోకు దండ వేశాము ఇది కధ "                   
                                

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి