29, డిసెంబర్ 2015, మంగళవారం

ప్రాంజలి ప్రభ – చిన్న కధలు 01 ఆలు మగలు - అనురాగపు స్వరాలు, 02.కొత్త కోడలు, 03. ఏ ఎండకు ఆ గొడుగు పట్టండి, 04నాకు బుద్ధి వచ్చింది



ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం


చెడు అనకు - చెడు వినకు -చెడు కనకు
సర్వేజనా సుఖినోభవంతు 
*ఆలు మగలు - అనురాగపు స్వరాలు (చిన్న కధ )
 తన విధిగా భర్తను కడుపునిండా మంచి ఆహారము పెట్టాలని, సుఖ పెట్టాలని, నా సలహాలతో వృద్ధిలోకి వచ్చి, సంపాదన పెరగాలని, తనను బానిసగా చూడక ప్రేమగా చూడాలని, పుట్టింటి వారిని ఆదరించి గౌరవించాలని, కోరికలన్నీ, తనతోటే తీర్చుకోవాలని, వ్యసనపరుడుగా మారి భాద పెట్ట కూడదని, పరుల ముందు కించ పరచకుండా ఉండాలని, సాధింపులు లేకుండా విశ్రాంతి కల్పించాలని, తన మాంగల్యం భంధం సుఖ సౌక్యాలతో ఉండాలని ఆశతో, ఆశయాలతో  కోరుకునేది భార్య.

భార్య కడుపు పండాలని, పొదుపు నేర్చుకోవాలని, తనకు బాసటగా నిల్వాలని, తనవారిని ఆదరించి గౌర వించాలని, తనకు ఎదురు తిరిగి మాట్లాడ కూడదని, అందంగా అలంకరించుకొని ఎప్పుడు ఉండాలని, ఎటువంటి కోరికలు కోరుకో కూడదని, తనకుటుంబాన్ని గుర్తించాలని, ఇంటి గుట్టు కాపాడాలని, సంపూర్ణ ఆరోగ్యవతిగా సుఖ పెట్టాలని కోరుకునేవాడు మగవాడనే ధీమాతో ఉండేవాడు  భర్త.                            
భార్య భర్తల మధ్య ఉండాల్సింది ఆకర్షణ, ఎ పరిస్తితిలోను కుడా వికర్షణ అనే భావము మనసులో కూడా రాకూడదు. 
అస్తమించు చున్న సూర్యుడికి తూర్పున ఉదయిస్తానాని నమ్మకం ఉంటుది, అట్లే కష్టాలు ఎప్పుడు ఉండవని సుఖాలు వస్తాయని నమ్మకంతో బ్రతకాలి, అమావాస్యపు చికట్లు తొలగి పున్నమి వెలుగులు వస్తాయని గమనించాలి. ఎన్ని సార్లు ఓటమిని చూసిన, లోకమంతా వేలెత్తి చూపినా, మనోధైర్యంతో రేపటి యుద్దంలో గెలవాలని బ్రతికి బ్రతికిన్చుకోవాలి ప్రతిఒక్కరు. ఒకరి భావాలు ఒకరు అర్ధం చేసుకొని జీవిన్చటమే ఆలూమగల - అనురాగపు స్వరాలు
                                                       --((*))--

ప్రాంజలి  ప్రభ – చిన్న కధలు – కొత్త కోడలు
గాలికి తెరలు కదిలినట్లుగా, చెట్ల మీద ఎండు టాకులు రాలినట్లుగా, చిలక కొట్టిన జామపండ్లు పడినట్లుగా, గాలికి ఇసుక తుఫాన్ వచ్చి మనిషిని చుట్టి నట్లుగా, కొడుకు పంపే మెసేజులు మనసును తూట్లు పొడుస్తున్నాయి. కొడుకుకూ చెప్పలేక, విధిని ఎదిరించలేక, అబద్ధ మాడలేక, నిజం చెప్పలేక, భార్యతో రాజేశ్వరరావు, నీ కొడుకు వస్తున్నాడుట, ఇక్కడ ప్రళయం సృష్టిస్తాడో, మరి ఏమ్చేస్తాడో, నీకు అసలే షుగర్, బి.పి జాగర్త అన్నాడు.

ఏమిటండి మన అబ్బాయి అనక నీకొడుకు అంటారు, ఎదో తొందరలో అన్నాను, వాడు మంచి వాడైతే అనుకో నవసరము లేదు. సరేలే కొడుకొచ్చిన తర్వాత "యువరానర్ మన అబ్బాయి కోరిక సబబుగా ఉన్నది, తీర్చమని" మాత్రం వత్తిడి చేయకు.

కోరికలనే సంకేల్లకు చిక్క కుండా జీవితాన్ని సాగిస్తున్నాము, ఆచి తూ చి మాట్లాడితే మనసు తేలిక బడుతుంది, ఇన్నాళ్ళు మన ఉద్యోగాలు మన డబ్బు మాట్లాడినాయి, అందుకే నేమో మాటలు రావటములేదు, ఇంతవరకు కొడుకు చూపిన అనుభూతులున్నాయి, అవి జ్ఞాపకాలుగా మారి, కుక్కల్లాగా మనసును వేమ్బడిస్తున్నాయి.
మన మనస్సును చిత్తు కాగితములా నలిపివేసి, ఎన్నో విషాదాలు భరించి, కన్న కొడుకుని గారాబంగా పెంచాము.
మన కష్టసుఖాలగురించి ఎప్పుడైనా మాట్లాడుకున్నామా, ఇన్నేళ్ళు రైళ్లో ప్రయాణంలో ఆగి ఎక్కినట్లు, మన సహచర్యం సూర్య చంద్రుడిలాగా వెలుగు చీకట్ల మద్య సాగింది జీవితమ్, కొడుకు వచ్చినట్లు ఉన్నాడు జాగర్తగా మాట్లాడు అన్నాడు రాజారావు భార్యతో.
కొడుకు పెళ్లి చేసుకొని దండలు వేసుకొని ఇంటి గుమ్మం ముందు కారులో దిగాడు, నాన్న కారు వాణికి డబ్బులిచ్చి పంపించు అన్నాడు. గత్యంతరం లేక తండ్రి డబ్బు లిచ్చి పంపించాడు అద్దె కారుకు.
బిక్క మొహవేసి చూడకు, వాడు చేసిన ఘనకార్యాలలో ఇది కూడా ఒకటి, హారతిచ్చి లోపలకు పిలువ్ అన్నాడు. భర్త భార్యతో. 
వారు లోపలకు వచ్చారు, మేమిద్దరం పెళ్ళికి వెళ్తున్నాము, మీరు తలుపు లేసుకొని ఉండండి అని చెప్పి వెళ్ళారు తల్లి తండ్రులు.
ఏమిటండి అతయ్యగారు, మామయ్యగారు, అట్లావెల్లిపోయారు, ఎమీలేదే నేను పేకాడేవాన్ని, గుర్రపు పందాలు కాసేవాన్ని, లాటరీటిక్కెట్లు కోనేవాన్ని, ధూమపానం, మద్యపాణం అలవాటు చేసుకున్నా ఇంకా మా తల్లితండ్రులను ఎప్పుడు వేదిన్చేవాన్ని, నిన్ను మాత్రం ప్రేమించాను, నామాటనమ్ము.
నమ్మక చస్తానా, చీకటిదాక, పహారా కాసి, నీకు పట్టిన దెయ్యాన్ని దులిపి అత్త మామల వద్ద మంచి కోడలని పించుకుంటా, అల్లా చూస్తావే తలుపేసి రా ....      
దయచేసి కధను చదివిన వారు షేర్ చేయగలరు              
                             --((*))--
ప్రాంజలి ప్రభ – చిన్న కధ – ఏ ఎండకు ఆ గొడుగు పట్టండి

ముఖ్య మంత్రిగారు ప్రజలు ఎండకు తట్టుకోలేక నగరాలు వదలి వెళ్లి పోతున్నారు, మరి నేను ఎంచేసేది,  నేను ఇప్పుడు కాశ్మిర్ టూర్లో ఉన్నా, ఆరోగ్యశాఖా మాత్యులు గారు,  మీరే ప్రజలకు నీటి వసతి కల్పించండి, మేఘాలు కాన రావటములేదు, ఎంతో ఖర్చు పెట్టి మేఘ మధనం కూడా కల్పించాము, ఫలితము లేదు కదా,  సూర్యకిరణాలు భూమిపై విజ్రుమ్భిస్తూ ఉన్నాయి, పుడమితల్లి ఘర్భం ఎండి  పోతున్నది, నిలుచుందామంటే నేల వేడి, కూర్చుమ్దామంటే కుర్చీ వేడి, పడుకుందామంటే మంచం వేడి, బయటకు నడిస్తే ఆకులు రాలినట్లు ప్రజలు నేలకు ఒరుగుతున్నారు, ఎ అల్లర్లు లేకపోయిన సూర్యభగవానుడు కర్ఫి విధించాడు, ఉన్న నీటితో ఉండాలని జనం బయటకు రాకుండా ఉండటంవల్ల వీదులన్నివెలవెలపోయిఉన్నాయి.  .                                      
నీరు దొరికే ప్రాంతం వారు ఎండతాపం తగ్గించు కొనుటకు డబ్బు ఉన్నవారు ఎయిర్ కండిషనర్ గదుల్లో, కూలర్ల వద్ద, ఫాన్లు వేసుకొని ఉంటున్నారు, భవనాలపైన చెట్లను పెంచుతున్నారు, కార్లపైన, ఇళ్లపైనా గడ్డి పెంచుతున్నారు.    బీదవారు విసిని కర్రలు, వట్టివెల్ల తడికలు, తడి గుడ్డలు గుమ్మాలకు కట్టుకొని చల్లదనం కోసం ప్రయత్నం చేస్తున్నారు.

మంత్రిగారు మీరు వెంటనే మన అస్తానా గాయకుడు, ఆస్తాన వైద్యుడు, అస్తాన జ్యోతిష్యుడు, అస్తాన తాత్వికుడు,ప్రజల కొరకు ఏమ్చేస్తున్నారు, అని అడిగారు ముఖ్యమంత్రిగారు.
గాయకుడూ తనకు వచ్చిన అన్ని రాగాలతో అద్భుతముగా మాధుర్యంగా పాడారు, చల్ల దనము దేముడెరుగు, బయట వేడికి చమట పట్టిందే తప్ప ఎండ మాత్రం తగ్గలేదు.
వైద్యుడు చల్లటి కుండలు ఏర్పాటు చేసినా ఎండ వేడికి కుండలో నీరు ఆవిరై పోతున్నాయి. 
జ్యోతిష్యుడు చండి యాగాలు చేసినాడు, దేవాలయాల్లో పూజలు చేయిస్తున్నాడు, ఫలితము లేదు,  
తాత్వికుడు కొబ్బరి బొండాలు, తాటిమున్జలు, చల్లదనం కోసం మంచు గడ్డలు విమానంలో ప్రజలకొరకు తెప్పిస్తున్నాడు, కాని వేడి తగ్గలేదు.
ప్రజల్లో ముసలివారు, పిల్లలు వడగాలి తగిలి మంచాన కరుచుకు పోయారు, మానవుల ప్రయాత్నాలు తత్కాలికి ఉపశమనాలు, ఏ  ఎండకు ఆ గొడుకు పట్టటమే, ప్రకృతిని ఎదిరించి బ్రతుకుట కష్టం, ఒకరికొకరు తోడుగా ఉండి కలసి మెలసి జీవిస్తూ, దేవుణ్ణి ప్రార్దిమ్చటం తప్ప ఎమీ చేయలేము కదా మంత్రిగారు.ఎట్టి పరిస్థితిలో ప్రక్క రాష్ట్రమునుండి, నీరు, గ్రాసము, విద్యుత్తు, నిత్యావసర వస్తువులు అందుబాటులోఉంచి ప్రజలకు సహకారం అందిద్దాము, నేనూఐరోజే తిరిగి వస్స్తున్నాను కాశ్మిర్ నుండి ప్రజాసేవయే మనకు ప్రధాన లక్ష్యం    
కలిసిపో కరిగిపో ప్రకృతిలో
 
ఎగసిపో వెలిగిపో అంబరాన
 
దిగులు చెందుట మనిషి ధర్మము
 
దిగులు తీర్చుట రచన పరమార్థము
                                                               --((*))--
  
గోచీకాపురం (పాత కధ)
  ఒక సాధువు సంసారం మీద విరక్తి తో ఊరి బయట ఒక పాక వేసుకొని గురువుగారు చెప్పినట్లు ధ్యానం చేసుకుంటూ వూరి ప్రజలు తనకు సమర్పించే పళ్ళు,తిని పాలు మాత్రం తాగి జీవిస్తూ వుండే వాడు.
అతనికి రెండు కౌపీనాలు(గోచీలు) మాత్రమే ఉండేవి స్నానం చేసి ఒకటి ఆరేసుకునే వాడు,ఒకటి కట్టుకునే వాడు. కొన్నాళ్ళకు ఒక ఎలుక ఆ కౌపీనాన్ని రోజూ కోరికి వెయ సాగింది.
ఎన్ని కౌపీనాలు మార్చినా అలాగే కోరికేస్తూండేది.
గ్రామస్తుడొకడు ఆ సాధువు కు ఒక పిల్లిని యిచ్చి దీనివలన మీకు ఎలుక బాధ వుండదు స్వామీ అని చెప్పాడు.
మరి ఆ పిల్లికి పాలు పొయ్యాలి కదా! గ్రామస్తులంతా కలిసి అతనికి ఒక ఆవును కొనిచ్చారు.
ఆ ఆవు పాలు పితికేందుకు, దాని అడవి కి తీసుకొని పోయి మేపు కొని వచ్చేందుకు మనిషి కావాలి కదా!
ఎవరినైనా పెట్టుకుంటే వాడికి జీతమివ్వాలి. అందుకని గ్రామస్తులు అతన్ని పెళ్లి చేసుకోమని సలహా యిచ్చారు. అమ్మాయిని కూడా చూపించారు.
అతను పెళ్లి చేసుకున్నాడు. భార్య గోచీ బాగా లేదు పంచె కట్టుకోండి అని అన్నది.
సరే పంచెలు కొన్నాడు. బిడ్డలు పుట్టారు
వాళ్ళను పోషించేందుకు డబ్బు కావలిసి వచ్చింది. గ్రామస్తులతో మాట్లాడి ఒకరి పొలాన్ని కౌలు కు తీసుకొని సేద్యం చేయ సాగాడు.
తర్వాత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. సొంతంగా పొలం కొనుక్కున్నాడు. ఎద్దులు కొన్నాడు. సంసారం పెరిగి పోయింది.. ధ్యానం,తపస్సు వెనక బడి పోయాయి.
డబ్బు యావ పెరిగి పోయింది. ధ్యానం బదులు ధాన్యమే ముఖ్య మైంది. శాంతి కరువైంది. యిది యిలా వుండగా ఒకసారి అతని గురువు అతన్ని చూడ టానికి వచ్చాడు.
ఆయన యిదంతా చూసి ఆశ్చర్య పోయి యిదేమిటి రా నేను చెప్పిందేమిటి? నీవు చేసిందేమిటి? అని అడిగాడు.
.గురుదేవా! నా గోచిని కాపాడు కోవడానికి ఇంత పటాటోపం పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పి నాకు బుద్ధి వచ్చింది అని లెంపలు వేసుకొని .ఆ సంపదనంతా భార్యను చూసుకోమని చెప్పి అడవికి వెళ్లి పోయి హాయిగా కంద మూలాదులు తింటూ తపస్సు చేసుకుంటూ శాంతి గా గడిపాడట.

కాలమే మనుష్యులను మారుస్తుంది, సంసారములోనికి దింపుతోంది, ఆకాలమే వైరాగ్యుయునిగా మారుస్తుంది, ఈతప్పు కాలందా మనుష్యులుదా, అది మియర్ ఆలోచించండి. 
                              --((*))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి