12, డిసెంబర్ 2015, శనివారం

Pranjali prabha - smalla stories - ( telivigala manushyulu - kanuvippu -madyapaanam )-



ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - చిన్న కధల ప్రభ 
ingenious:

చెడు అనకు - చెడు వినకు - చెడు కనకు 
సర్వేజనా సుఖినోభవంతు

4.తెలివిగల మనుష్యులు (1)

ఏమిటి పంతులుగారు అట్లా దిగులుగా ఉన్నారు, అడిగాడు ఒక నాటి శిష్యుడు,  నను ఎంత సంపాదించానో అంతా  బూడిదలో  పోసిన పన్నీరు అయినది. నేను ప్రవేట్ స్కూల్  టీచర్ గా సంపాదించి పైకము మొత్తం నాకున్న ఇద్దరి కొడుకులకు, ఇద్దరి కూతుర్లకు, పంచి ఇచ్చాను, ఉండేందుకు సొంత ఇల్లు లేకుండా ఇట్లా తిరుగుతున్నాను.

మిమల్ని అడిగే అంత వాడను కాను కానిమీ పరిస్థితి ఇట్లా మారటానికి కారణం, చెప్తా ఇట్లా కూర్చొ, నా శ్రీమతి నన్ను విడిచి వెళ్లి నప్పటి నుండి న నామనసు నాలో లేదు, నాకళ్ళు, నాకళ్ళు నా అధినంలో లేవు .నా పెద్ద కొడు కు ఇంట్లో ఉంటున్నా వేలకు తిండి దొరకటంకష్టం గాఉన్నది , వారు తినేవి నేను తినలేక పోతున్నాను, మందులకు బాబు మందులు తెస్తావా అని అడుక్కోవాల్సిన పరిస్తితి వచ్చింది, అర్ధాకలితో మనసు చంపుకొని బ్రతుకుతున్నాను ఇప్పుడు  నేను ఏమి చేయ లేక పోతున్నబయటకొచ్చి స్వతంత్రంగా  బ్రతుకుదామంటే కష్టంగా ఉన్నది, మనవల్లను నాదగ్గరే వదిలేసి, వారు ఉద్యోగానికి వెళ్తారు, పని మనిషి లున్నారనుకో అయిన కష్టమని పిస్తున్నది. నీవు చెప్పు ఏంచేయాలో .....

పిల్లలందరి దగ్గర తిరగండి ఒక్కరి దగ్గర ఉండకుండా .. అదీ  చూసా, ఒక అల్లుడు పచ్చి త్రాగుబోతు అక్కడ మా అమ్మాయి నరకం అను బవిస్తున్నది, వెళ్ళంగానే నాన్న వచ్చావా అని అడుగుతుంది, వెంటనే నాదగ్గరుఅ ఉన్న కొంత పైకం  ఇచ్చేస్తాను మా అమ్మాయికి,  భోజనం చేసి వేల్ల మంటుంది . ఇక రెండో అమ్మాయి నాన్న ఇక్కడే ఉండిపో నేవేక్కడకు పోవనక్కరలేదు నేను నిన్ను పూలల్లో  పెట్టి  చూసుకుంటాను  అని ఉండ మంటుంది. కూతురు అల్లడు కామ్పుల్లకు వెళతారు మనవళ్ళను ఉంచుకొని నేను ఇల్లుకు కాపలాగా ఉండాల్సిన పరిస్తితి ఉంటుంది. ఇక నా రెండో కొడుకు నోరెత్తడు,  కోడలు మీరు ఊరకనే కూర్చొని పాపారు చదివేతే   అరగదు ఇక్కడ వంట పని, ఇంటిపని, చెయస్తూ ఉంటె ఆరోగ్యానికి మంచిది.  లేకపోతె షుగర్ బిపి  పెరుగుతుంది అని ఉన్న పనివాల్లకు సెలవు ఇస్తున్నది. ఎవరి ని ఏమనాలి ఎక్కడ ఉండాలి ఈ వయసులో, మరి నేవెం చేపుతావో చెప్పు 
ఆశ్రమం లో ఉండవచ్చుకదా,  అదిచూసా నాకొడుకులు వచ్చి మేం తక్కువేం  చేసాం, నీవిక్కడ ఉంటె  మా పరువు పోతుంది అని నన్ను లాకెళ్ళారు. పొనీ గుళ్ళో ఉండొచ్చుకదా, అదికూడా  చేశా కొద్ది రోజులు తీర్ధ యాత్రలు చేసి వచ్చా, పిల్లలకు పాటాలు చెప్పిన పంతుల్ని గుళ్ళో బిచ్చ మెత్తటం చేతకాలేదు, ట్యూషన్సు చేపుదామంటే ఇప్పటి పాటాలు మీరు చెప్పలేరు అన్నారు....

నేను చెప్పినట్లు చేస్తారా అది ఏమిటో చెప్పు
నేనొకటే చెపుతాను మీకు ఓపిక ఉన్నంత వరకు దేశ సేవకొరకు సహకరించండి. నా దగ్గర వేలకు భోజనం, టిఫిన్ రాత్రి  ఉండేందుకు ప్రత్యేక  గది, పని విషయం ఇప్పుడే చెప్పను, నామీద నమ్మకం ఉంటె, మీకిష్టమైతే,  పిల్లలను పిలవండి, మీ పిల్లలందరు  వచ్చి నాకు సంతకం పెట్టాలి అది నీకు సమ్మతెమేకదా.  
నీవు నాశిష్యుడవే ఐన నాకు గురువు ఈరోజునుంచే నీ దగ్గర పనిచేస్తాను,  ఇప్పుడే పిల్లలను పిలిపిస్తా నీవె  మాట్లాడు  వారి అభిప్రాయం తెలుస్తుంది.  .
 అందరినీ  పిలువగా లాయారు ,పొలీసు, డాక్టర్  ముందు మానాన్న మీ దగ్గర ఉంటానంటే మాకేం అభ్యంతరం  లేదు, ఆయన  ఇష్టానికి  వదిలేసాం" ఉండేందుకు, మందులు ఖర్చులు, తిండి ఖర్చులు మేమేం భరిస్తాం ఆ అవకాసం మాకివ్వండి  అన్నారు".
వీటి  మీద సంతకం పెట్టండి, అందరు కలసి పెట్టారు సాక్షులుగా పెట్టారు  మీరు ఏమి ఇవ్వ నక్కరలేదు మేము మీనాన్న గారి యోగక్షేమాలు తెలియపరుస్తాము, రెండు సంతోషపు కన్నీర్లు కారుస్తే చాలు.  అమాటలకు  ఎమీ మాట లాడలేక అందరు వెనుతిరిగారు.
ఇన్తకీ ఉద్యోగం చెప్పలేదు కదా శిష్యునిది సంచార వైద్యశాల, బస్సులో అన్ని సదుపాయాలతో పల్లెటూరులొకి వెళ్లి వైద్య సేవచేస్తున్నారు, పంతులుగారు కేవలం చీటిలు వ్రాయటమే  ...

  5.చిన్న కధ -కనువిప్పు (2)


ప్రేమకు  బలం  ఎంతున్నదో  తెలియదు  కాని, బ్రహ్మదేవుడు ఆడించినట్లు ఆడుతారనేది నిజం, ఎందుకంటే మంచి ఉద్యోగంలో ఉన్న (లెక్చిరర్ర్ )  భార్య తక్కువ ఉద్యోగంలో ఉన్న (జూ ర్. అకౌంటెంట్) భర్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నది, వారిమద్య అన్యూన్నత పెరుగుటవల్ల వేరేకాపురం పెట్టడం జరిగింది.   ఇంటి పనులు, వంటపనులు, వంతులు వారీగా చెసుకుంటూ ఉన్నారు. కానీ మన హీరోకు స్నేహితులన్న చాలాప్రేమ, వారిని ఇంటికి వచ్చి నప్పుడు శ్రీమతి మాత్రం రొజూ చేసే పనులు కూడా చేయక మొరాయిస్తున్నది.

ఒకసారి స్నేహితుని భార్య పిల్లలతో సహా ఆదివారము భోజనానికి ఇంటికి రమ్మనమని కోరాడు, ఆవిషయం శ్రీమతికి చెప్పాడు,. నేను రోజు కష్టపడుతున్నాను, ఆదివారము రెష్టు తీసుకొవాలి, మీరు కర్రీ పాయింట్ కు పోయి  ముందే (పప్పు కూర సాంబారు పెరుగు) రాత్రికే తేచి హాట్ కారియరో పెట్టండి   లేచాక  అన్నం నేను వండుతాను అన్నది.
 

వచ్చిన స్నేహితులకు ముభావముగ నమస్కరించి, మొక్కుబడిగా వడ్డన చేసి వెల్లి పడుకున్నది, వచ్చినవారు ధన్యవాదములు పలికి  వెనుతిరిగారు.
మరునాడు స్నేహితుడు అఫీస్ కు రాకపోవటం వళ్ళ కారణం తెలుసుకున్నాడు, (ఫుడ్ పోయ జన్) వెంటనే హాస్పటల్ కు పోయి క్షమాపణ చెప్పాడు వారికి,  భార్యను ఎమీ అనలేక మౌనం వహించాడు మనహీరొ.
స్నేహితుని కుటుంబము పూర్తి స్వచ్చతగా మారిన తర్వాత  మనహీరొ భార్య పిల్లలను విందుకు పిలిచాడు 


ఇద్దరు కలసి వచ్చారు వారి ఆహ్వానం, వారు ఏర్పాటు చేసిన భోజనాలకు రుచికరమైన భోజనాన్ని తిని చాలసంతో షించారు.ఏమండి ఈ వంటలన్నిమీరె చేసారా, అక్షరాలా నేనేచేసాను, బాగున్నాయాలేదా, బాగున్నాయి మీరు హౌస్ వైఫ్ మేమిద్దరం పోలీస్ ఆఫీసుర్లము, ఇంటిపనులు అన్నిమేమే చేసు కుంటూ వచ్చినవారికి మంచి భోజనం పెట్టె అలవాటు మాకు. మేము వేల్లోస్తమండి అనగా బట్టలుపెట్టారు, అవి ఇప్పు డెందుకండి అనగా మీ చలువ వళ్ళ
మేము హాస్పటల్లో ఉండుటవల్ల మాఇద్దరి ట్రాస్వర్లు కాన్సులయ్యాయి. 
  
మీస్నెహితుడు మంచిగా పలకరించాడు, మొన్ననేను వీరిని తూలనాడాను, నన్నుక్షమించండి . నాదీ తప్పు ఉన్నది నిల్వ ఉన్నవి  పెట్టి తప్పు చేసాను, వీరి అనారోగ్యానికి కారకులమయినాము, వారు మనమీద కేసుపెడితే మన ఉద్యోగాలుకూడా పోయేవి. నా కళ్ళు తెరిపించారు.

 
నన్నుక్షమించండి ఇక నుండి ఎన్నిపనులున్న స్నేహితులకు, పెద్దలకు, మీకు, రోజు నేను వండి  పెడతానండి, నీలొ మార్పు వచ్చినందుకు చాలా సంతోషముగా ఉన్నది ఆబ్రహ్మదేవుడు ఆడించు చున్న నాటకంలో  మన పాత్రదారులం ఒకరి నొకరు అర్ధం చేసుకొని బ్రతికేతే ఎప్పుడు సుఖం, కష్ట మనేది ఉండదు. 
                                

6. చిన్న కధ -  మద్యపానం ఆరోగ్యానికి హానికరం (3)

అది పల్లెటూరు కాదు,  బస్తి కాదు మద్యరకం ఊరు, అక్కడ ఎక్కువ మంది త్రాగుటకు బానిసలై వారే, ఆఊరిలో ఒక యిల్లాలు తనభర్తను త్రాగుడు నుండి మాన్పించుటకు చేయని ప్రయత్నములేదు, చేప్పని సలహాలేదు, చెవిటి వాని ముందు శంఖం ఊది నట్లైంది.  ఇసుకు పుట్టి తను కష్ట పడి సంపాదించినది అతనికిచ్చి మరీ త్రాగామన్నది,

ఒకనాడు డబ్బులు చేతి కందక భర్తఃకు త్రాగటానికి డబ్బులు ఇవ్వలేదు, ప్రక్క ఇంటికి పోయి బాకిచేసి మరీత్రాగి ఆ ఇంటికి వచ్చి గొడవచేస్తే అక్కడవారు చితక బాది నానా దుర్బాషలాడి, ఇల్లాలను కుడా తిట్టారు వారు.

ఒకనాడు త్రాగి వచ్చి పిల్లలను కొడుతుంటే  కోపమొచ్చే ప్రక్కన ఉన్న చీపురుతో నాలుగు ఉతికి మంచానికి కట్టి  వేసి బయటకు వెల్లిపోయింది కోపంతో. మరలా వచ్చి క్షమించు మామ తొందర పడ్డాను, నేను నిన్ను కొట్టాను, అవునే లచ్చీ నీ కష్టం  చూడలేక పొతున్నాను, నేను కష్ట పడతాను ఈరోజు నుంచి నన్నునీవె క్షమించవే.

ఈ రోజు మా పుట్టింటికి వెలుతున్న.నామాట ఇనకు వినలేదు,  వెళ్లాకే నేను త్రాగ నంటే త్రాగాను, త్రాగితే నాకుగుండుకొట్టి మరీవెల్లు, సరే నిన్ను నమ్మి ఇక్కడే ఉంటున్నాను

స్నేహితుల ప్రభావమువల్ల మరలా త్రాగివచ్చడుభర్త, భార్యకొపాన్నిచూపక కడుపునిండా తిని పెట్టింది, పాలల్లోమత్తు మందు కలిపి పెట్టింది. దానిప్రభావముగా నిద్రలోకి జారాడు మొగుడు. భార్య వెంటనే కట్టేసి బుర్ర గొరిగి ఉత్తరం వ్రాసి వెళ్ళింది.
నీ బుద్ది మార్చుకో, పిల్లలను పెళ్ళాన్ని పోషించాలి, యదార్ధం తెలుసుకొని మసలుకో, ఇతరులు ప్రేరేపించిన ఓర్పు వహించి నిజానిజాలు తెలుసుకో, మనసావాచాకర్మణా సత్యాన్నే పాటించు, నేనుతాగాను అని మనో నిగ్రహం ఉండు,     
నేను పుట్టింటికి పోవటం లేదు హైదరాబాదుకు పోతున్నా పాచి పని చేసేవారికి ఎక్కడికి పోయిన తిండికి కొదువ లేదు, పిల్లలను తీసుకొని చదివిస్తా, నీవు త్రాగుట మాని నాకోసం నా చిరునామాకు రావచ్చు. కనీసమ్ నీ పాత స్నేహితులను వదులుకొని వస్తే బాగుపడతావు, నీకొసమ్ ఎదురుచూస్తు ఉంటా. 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి