19, డిసెంబర్ 2015, శనివారం

ప్రాంజలి ప్రభ - చిన్న కధలు - 01.భాహుమతి --02.పృథ్వి కి ఆకాష్ కి పెళ్లి ,03. శ్రీ హనుమంతుని వేదాంతం కధ ( ”నువ్వు శివుడవు .నేను భద్రుడను")

ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్  ఓం శ్రీ రామ్
PRANJALI: Love story -13 (చేతిలో పైకము లేకుండా చేసే పెళ్లి )...

చెడు - చెడు - వినకు చెడు కనకు 
సర్వే జనాసుఖినో భావింతు
13.- భాహుమతి -
 ఏమండోయి శ్రీమతి గారు నీ పుట్టిన రోజు సందర్భముగా ఏదైనా కోరు కోండి తీసుకొస్తాను అని ముద్దుగా భర్త అడిగాడు, అసలే మీకు గుండె జబ్బు నేను కోరానుకో పడిపోతావు, అడుగు నేను తీసుకొస్తాను. సరే అడుగు తున్నాను బహుమతి  గుండె ధైర్యం చేసుకోండి నాకూ సొంత జెట్ విమానం కొని పెట్టన్డి చాలు మీరు నేను పిల్లలు అందరం కలసి దేశాలు చూసి వద్దామండి  నా  కోరిక తీర్చండి ఆ మాటలకే భర్త బ్రహ్మానందం క్రింద బడి గిల గిల కొట్టు కుంటూ ఉన్నాడు .

నీరు చల్లి లేపి గొప్పలుకు పోకు, ఎప్పటిలా గుడికి పోయి దీవున్ని  చల్లగా చూడమని ప్రార్ధిం తిరిగి వద్దాం, మీరు సుఖంగా ఉండి నన్ను పిల్లలను చక్కగా చూసు కుంటే  రోజూ పుట్టిన రోజులే. నేను నీతో సఖ్యత చూపుట లేదా, అది నీ అంత రాత్మకే తెలుసు వేరేచెప్పాలా.

సరే నీవు బహుమతి ఏమి తేద్దామనుకున్నావో చెప్పు, అప్పుడు నా నిర్ణయం చెపుతాను. నేను చెప్పాకా నీవు కోపం తెచ్చుకో కూడదు, నన్ను తిట్ట కూడదు, ఆ చెప్పు  నీలాంటి బలహిన గుండె కాదు నాది, నీతో ఎన్నికష్టాలు పడలేదు చెప్పు. బహుమతిగా, బహుమతిగా ఆబ్బా చెప్పండి,  వేదించక, ఉండవే చెపుతాను, ప్రక్కన ఉన్న కర్ర, చీపురు  తీయనీవె, అసలే నామతి పొతున్నది,  ఏ బహుమతో చెప్పరా మొగుడా, చంపకు  .

నాలో అర్ధబాగాం నీవు ఆక్రమించావు, మిగతా అర్ధబాగాన్ని ఇవ్వటానికి, నీకు తోడుగా సవితిని తెద్దామను కుంటున్నానే, నీవు కష్టపడకుండా సహాయముగా ఉంటుంది,  ఏమన్నావ్  అదే నీ పుట్టిన రోజు గిఫ్ట్ గా నా రెండవ బార్యను ఇంటికి తెద్దా మనుకుంటున్నాను అంతే

ఎమీ అనకుండా ఇంట్లోకి పోయి తలుపెసుకున్నది, భర్త కు కంగారు పుటింది ఆత్మ హత్యచేసు కుంటుందని అనుకున్నాడు
తెల్లచీర కట్టుకొని పిల్లలను తీసుకొని బయటకు నడిచింది.

నాకు మీ బహుమతి వద్దు, దానితోనే ఉండండి, నేనే నా సవితిని నీకు నా పుట్టిన రోజుగా బహుమతి ఇస్తున్నాను వేల్లోస్తానండి. నవ్వులాటతో అన్నానే, నామోహానికి రెండో పెళ్ళాము కూడానా, నన్ను కరుణిమ్చవే, పిల్లలను వదలవే నీవు రావే, చేమలేసుకున్తున్నాను,  లోపలకు రావే , నాకెవ్వరూ లేరే నీవు తప్ప “నిజమైన ప్రేమ ముందు చిన్న అబద్దపు మాట సముద్రపు ఊప్పెనలా తయారవుతుంది “ నవ్వులాటకూ కూడ నీతో అభద్దం చెప్పను, అంటూ కాళ్ళు పట్టు కున్నాడు, ఒక్క సారికాల్లువిదిలించగా ప్రక్కన నిద్రపోతున్న భర్త క్రింద పడ్డాడు. నీ పుట్టిన రోజు బహుమతి నీ పాదంతో  పూజా, నన్నుక్షమించండి, మీకాల్లకు దండం పెట్టుకోవాలి అంటూ మంగలసూత్రాలను కాళ్ళ కూ అడ్డు కుంది.    అయ్యో ఇది కల  అని నవ్వుకున్నది, పొద్దున్నే నీ నవ్వు మొఖమ రోజూ చూడాలనిపిస్తున్ది, నీకిఉ బహుమతి తెస్తా, వద్దండి మనం హాయిగా ఏదైనా హోటల్కు  పోయి, అలా సినమాకు పోయి తిరిగి రావటమే మీరు నాకు ఇచ్చే బహుమతి.    


14.ప్రాంజలి ప్రభ - చిన్న కధ - పృథ్వి కి ఆకాష్ కి పెళ్లి

అది ఒక మారుమూల అడవి ప్రాంతంలో ఉన్న కొన్ని గుడిసెలు నిర్మించుకొని కొందరు ఆటవికులు అనాదిగా నివసిస్తున్నారు, అక్కడ  పురుషులకు, స్త్రీలకు, మర్మావయవాల దగ్గర తప్ప మరి ఎక్కడ గుడ్డే ఉండదు.  ఇక్కడ మనుష్యులు శ్రమించటం తప్ప విశ్రమించటం ఎరుగరు, నిర్విరామ కృషి వలురు. శ్రామిక జీవన మాధుర్యాన్ని పరి పూర్ణంగా గ్రోలెడు అడవి మల్లెలు, కల్ముష హృదయులు, నిష్కపట నిరాడంబరులు, ఒక రకంగా చెప్పాలంటే నీటిలో ఉండే తామరలు. వీరికి నిద్రేరుగని నిసిరాత్రులు ఎరుగరు, పంచభక్ష పరవాన్నలు ఎరుగరు, ప్రకృతి వనరులు, జంతువుల వేట వీరికి ఆహారాలు.  వీరికి వాళ్ళ నాయకుడుచేప్పిందే వేదం.

ఇక్కడ ఒకేస్త్రిని (పృద్వి)  ఇద్దరు (ఆకాష్, గగన్ )  పెల్లిచేసు కుంటామని ముందుకు రాగా వాళ్ళ పెద్ద
నాయకుడు  5. పరీక్షలు  పెట్టారు.

1.       ఈ త్రిశూలాన్ని ఎంత దూరం విసర కలిగితే  వాళ్ళు గెలిచినట్లు,  (గగన్  కొంత దూరం విసిరాడు, ఆకాష్ విసరగా దూరంముగా ఉన్న గ్రద్ద ఎగురుకుంటూ వచ్చి కాళ్ళతో దూరంగా తన్ను కేల్లటం వళ్ళ దూరంగా పడింది )

2.        మామిడి పండ్లను ఎక్కకుండా ఎక్కువరాల్చాలి (గగన్ కఱ్ఱతో పండ్లను కొట్టాడు కొన్ని రాలాయి, ఆకాష్  చెట్టు దగ్గరకు పోతుండగానే పెంపుడు వానరులు మామిడి పండ్లు క్రింద గడ్డి మీదకు విసురుతూ పగలకుండా ఉన్నాయి )

3.       ఇరువురు గుఱ్ఱము మీద పోయి దూరముగా ఉన్న కొండ దేవత దగ్గర ఈ పతాకము పెట్టి  రావాలి గగన్, ఆకాష్  గుర్రాల మీద బయలు దేరారు, ఆకాష్ గుర్రం వెనుక బడింది, గగన్ గుర్రం ముందు పరిగెడు తున్నది. ఎక్కడ నించో పులి ఘాట్రింపు
ఆకాష్ గుర్రం విని  ఆఘమేఘాల్లో ఎగిరుకుంటూ వెళ్లి ముందుగా వచ్చింది.

4. మీ ఇద్దర ముందు రాళ్ళు, బియ్యపు గింజలున్నాయి, వాటిలో ఉన్న  బియ్యం గింజలు లేకుండా చేయాలి, రాళ్ళు తీయకూడదు ఇది నిభందన.  ఆమాటలకు గగన్ పళ్ళెం ముందు పెట్టుకొని బియ్యపు  గింజలు నోట్లో వేసుకోవటం మొదలు పెట్టాడు. ఆకాష మాత్రం పళ్ళెంలో ఉన్నవి ఒక గుడ్డమీద వెడల్పుగా పోసాడు, అప్పుడు ఎక్కడనుంచొ  కొన్నిపావురాలు ఎగురు కుంటు బియ్యపు గింజలు మొత్తం తినేసి ఎగిరి పోయినాయి.

5. చివరిగా మీ ఇద్దరికీ గాలిలోకి గాజులు ఎగరేస్తాము వాటిని భాణంతో గాజులోనుంచి పోవాలి ఇది నిభందన.
గగన్ భాణముతో మూడు సార్లు ప్రయత్నం చేసి ఓడిపోయాడు. ఆకాష మాత్రం క్రింద పడుకొని గాజులు వేసినప్పుడు  వేగంగా మూడు బాణములు వదిలాడు అందులో ఒకటి  గాజులోనుండి  పోయినది.
       
చివరకు నాయకుడు ఆకాషే పృద్వికి మొగుడు అని చెప్పాడు, మొదటి నాలుగు పందేములలో మూగ ప్రాణులద్వార, చివరిగా బుద్ది కుశలత ద్వారా విజయము సాధించాడు. ప్రేమ, బుద్ధి ఉన్నవారు స్త్రీలను బాగుగా చూసు కుంటారు. వీరికి పెళ్లి ఏర్పాట్లు చేయండి.   అని కుల పెద్ద చెప్పి  వెను తిరిగాడు.      

15.
శ్రీ హనుమంతుని వేదాంతం కధ ( ”నువ్వు శివుడవు .నేను భద్రుడను")

ఒక రోజు శ్రీ రాముడు హను మంతుని దగ్గరికి పిలిచి ”హనుమా !నేను చెప్పిన వేదాంత విషయాలన్నీ విన్నావు కదా .దేహ ,జీవ ,పరమాత్మ లకు సమన్వయము చేస్తూ చెప్పు ”అని కోరాడు .అదే శిరో ధార్యం గా భావించిన పరమ భక్త శిఖా మణి మారుతి ”శ్రీ రామా !వేదాంత రహస్యము తెలిసిన తరు వాత కూడా ఈ దేహం ఉన్నంత వరకు దేహాన్ని ,జీవుణ్ణి ,పరమాత్మ ను వేరు వేరు గా నే భావించాలి .దేహ దృష్టి తో పరమేశ్వరుని ధ్యానిస్తూ ,సేవించాలి .అన్ని భావాలను త్యజించి ,శరణా గతి పొందాలి

 .ఇతరులకు ఉపకారం చేస్తూ ,వారు కూడా భగవంతుని స్వరూపం గా భావించి ,సేవించాలి .ఇలాంటి దానినే భక్తి లక్షణం అంటారు .ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతం .జీవుడు వేరు ,పరమాత్మ వేరు అని భావిస్తూ ,భగవంతుని స్మరిస్తూ , ,భగవంతుని పూజలు చేస్తూ ,భగ వంతుని మూర్తులను చూసి ఆనందిస్తూఉండటానికి ద్వైతం అంటారు .


జీవుడు ,పరమాత్మ ఒక్కరే .ఎందు లోను భేదం అనేది లేదు అని భావన లో ,ఆచరణ లో చూపించటం జ్ఞాన లేక ,విజ్ఞాన లక్షణం అంటారు .ఇదే అద్వైత భావన .–”దేహ బుధ్యాతు దాసోహం ,జీవ బుద్ధ్యాతు త్వదంశః –ఆత్మా బుధ్యాతు త్వమేవాహం ఇతి మే నిశ్చితా మతిహ్ ” –రామా ! దేహ దృష్టి లో నేను నీకు దాసుడిని .జీవ దృష్టి లో నీవు పరమాత్మవు .నీ అంశ చేత నేను జీవ స్వరూపుడను .

పరమాత్మ దృష్టి లో ”నీవే నేను -నేనే నీవు ”.ఈ మూడు లక్ష ణాలు నాలోనూ ,నీలోను ఉన్నాయి .ఇంక భేదానికి అవకాశమే లేదు .”అని స్పష్ట పరచాడు హనుమ .అంజనా నందనుడి సమాధానం విని పరమానంద భరితు డయాడు దాశరధి .”త్వమేవాహం ,త్వమేవాహం ”అని చాలా సార్లు హనుమ ను అభి నందించాడు .

”యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః –యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః –శ్రీ మారుతిత్సేవన తత్పరాణాం –భోగశ్చ ,మోక్షశ్చ ,కరస్త యేవ ”–అంటే ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు .ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగానికి అవకాశమే లేదు .కాని శ్రీ హనుమ సేవా తత్పరు లైన వారికి భోగమూ ,మోక్షమూ రెండు తప్పక లభిస్తాయి అని శ్రీ రాముడు ”వరం ”అను గ్రహించాడు .దానికి వెంటనే ఆంజనేయుడు ”నువ్వు శివుడవు .నేను భద్రుడను .నీకూ నాకు భేదమే లేదు ”అని చెప్పాడు ( జి జి శర్మగారికి కృతజ్ఞతలు )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి