29, డిసెంబర్ 2015, మంగళవారం

ప్రాంజలి ప్రభ – చిన్న కధ – 1. కొత్తకాపురం 2.దేవుడున్నాడా ? 3. సహధర్మచారి

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం

Ballerina:

చెడు అనకు - చెడు వినకు -చెడు కనకు
సర్వేజనా సుఖినోభవంతు 



ప్రాంజలి ప్రభ – చిన్న కధ – కొత్తకాపురం
మావగారు మీ ప్రవర్తన, మీ అబ్బాయి ప్రవర్తన నాకు నచ్చుట లేదు, ప్రతి చిన్న విషయానికి మీ కొడుకు నలుగురిలో చులకనగా మాట్లాడుతాడు, తెలిసి మాట్లాడుతాడో, తెలియక మాట్లాడుతాడో ఆర్ధం కావటం లేదు. మీరేం తక్కువతిన్నారా ఈ వంట చేయి అని చెప్పక చేసిన వంట నచ్చలేదు అని గొనుగుతారు, తినకుండా వెళ్లుతారు. నా మనసుకు భాద కలిగించే విధముగా ఉంటున్నారు. కష్టాలన్నీ ఆడవారికి ఇచ్చి సుఖాలన్నీ మగవారికి ఇచ్చారు కదా మావగారు.
అది కాదమ్మా యి ఎవరి కష్టాలు వారివి, మీ రేం మాట్లాడినా “ మీ అబ్బాయి నాకు నచ్చుట లేదు” , వాడు నచ్చక పోవట మేమిటి కోడలా, నాకొడుకు నిన్ను భాద పెడుతున్నాడా, చెప్పుకుంటే పరువు పోతుంది,” నాకు నచ్చలేదు అంతే”.
మీ అబ్బాయి దృష్టిలో నేనొక బీరువాలో ఉన్న పుస్తకాన్ని, భద్రంగా ఉండాలి అంటాడు, తెరిచి చూడడు, జీవితమ్ సరళ రేఖలాగా ఉండాలంటాడు, షోకేస్ లో బొమ్మలా ఉండెందుకా నన్ను పెళ్లి చేసుకున్నది. మీ అబ్బాయి ఎప్పుడు ఏదో ఆలోచిస్తాడు ఎందుకు మావగారు.
పెళ్లి ఇప్పుడొద్దన్నా నేనే బలవంతం గా పెళ్ళికి వప్పించాను, జరిగిన సంఘటన మరువలేకున్నాడు, నాకు చెప్పండి మావగారు ఎం జరిగిందో. చెపుతాను విను.
నా తమ్ముడి కొడుకు (శ్రీధర్), నాకొడుకు (కృష్ణ) ఇద్దరు కలసి చదువుకున్నారు, ఇద్దరికీ వేరే వేరే కమ్పెనీల్లో ఉద్యోగా లొచ్చాయి , శ్రీధర్ తనతో పనిచేస్తున్న (సమీరా ) నీ పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు, ఇద్దరు ఇష్ట పడ్డారు, లక్ష్మిని ఆ కమ్పెనీలొ పనిచేయుచున్న హెడ్ తో పెళ్లి నిస్చయమైనది, తనను మోసగించి వేరొకరిని పెళ్లి చేసు కుంటున్న దని భావించి మరచి పోలేక, విషం పుచ్చుకొని మరణించే ముందు ఈ విషయం కృష్ణకు చెప్పి ఉత్తరం వ్రాసి ఎక్కడకేల్లాడో ఇంతవరకుతెలియదు.
శ్రీధర్ ఫోటో ఉన్నదా ఇదిగో మాబ్బాయితో కలసి ఉన్న ఫోటో. ఫోటో చూస్తూ అట్లాగే నిలబడింది. ప్రేమించిన అమ్మాయి ఫోటో లేదా లేదు, అప్పుడే భర్త లోపలకు అడుగు పెడ్తూ ఈ అమ్మాయి, మోసం చేసి పెళ్లి చేసుకున్నది. అందుకే ఆడవాళ్లంటే నాకు కోపం అన్నాడు కోపంగా. లోపలి వెళ్లి పోయాడు.

అమ్మాయి నా స్నేహితురాలు , పెళ్లి దాకా ప్రేమించినట్లు చెప్పలేదుమాకు, పెళ్ళికి ముందు శ్రీదర్ నుండి ఉత్తరం వచ్చింది, నీవు రాకపోతే నేనుచేచ్చిపోతాను అని ఉన్నది, పెళ్లి పీటల నుండి వేగంగా కారు నడుపుకుంటూ వచ్చింది. 

ప్రాంజలి ప్రభ – చిన్న కధ – దేవుడున్నాడా ?


కొత్తగా తెలుగు మాష్టారు గారు క్లాసురూం లో అడుగు పెట్టారు, నల్ల బల్ల మీద వినాయకుని బొమ్మ వేసారు పిల్లలు, అది చూసి దేవుడున్నాడని మీరు నమ్ముతారా అని గాట్టిగా అన్నారు మాష్టార్, అంటే గట్టిగా మీరు నమ్మరా అని సమాధానముగా చెప్పారు పిల్లలు.

మాష్టార్ " భగవంతున్ని ఎవరైనా తాకారా, మాట్లాడారా, చూసారా "  లేదు కనుక దేవుడు లేడని నమ్మవచ్చా  అన్న మాష్టార్  మాటలకు ఒక విద్యార్ధి లేచి దేవుడు లేదన్న వారు ఎందుకు తలిచారు,  ఇప్పుడు. ఉన్నారని మేము నిరూ పిస్తాము,  మాకు మీరు ఏమి ఇస్తారు మాష్టార్. నిరూపించండి చూద్దామ్, మీ అందరి ఫీజులు నేను కడతాను అన్నాడు మాష్టార్.

కుక్క క్లాసురూం లోకి వస్తున్నది,  వెంటనే తరమండి అన్నాడుమాష్టార్, ఆకలేస్తే అన్నం పెట్టేవాడని ఏమంటారు మాష్టార్ అని అడిగాడు ఒక విద్యార్ధి,  దేవుడుతో సమానము.అన్నాడు మాష్టార్,  ఆ కుక్క నోటిలో నాఅన్నం కారేజ్ ఉన్నది నా ఆకలి తీర్చటానికి ఆహారం తెచ్చింది అది దేవుడితో సమానము కదా మాష్టార్. మాష్టార్ కు అవుననక తప్పలేదు.

         ఎవరు క్లాసులో టపాసులు కాలుస్తున్నారు, పిల్లలు టపాసులు కాల్చుట కాదు మాష్టార్,  కరంట్ వైర్ తగల బడుతున్నది, త్వరలో ఈ భవనపు కప్పు కూల బోతున్నది, దేవుడు ముందుగా హెచ్చరిస్తున్నాడు, దేవుడు లేడన్నవారు ఉండండి, ఉన్నాడు అన్నవారు బయటకు రండి, మాష్టార్ అందరూ వెళ్ళాక నెమ్మదిగా బయటకు వస్తూనే భవణం  కూలిన శబ్దంతో ఒక్కసారి బయటకు పరుగెత్తాడు. దేవుడున్నాడు కదా మాష్టార్ గారు అన్నారు పిల్లలు.

పిల్లలందరూ అక్కడ ఉన్న ప్రయోగశాల వద్దకు చేరారు, అందరూ వెంటనే నవ్వటం మొదలు పెట్టారు, విద్యారుల వద్దకు మాష్టారు వచ్చి ఎందుకు నవ్వుతారు, దేవుణ్ణి చూసి మేము నవ్వు తున్నాము, మాష్టర్ కూడా నవ్వుతున్నాడు, మాష్టార్ మీరు కూడా దేవుడ్ని చూసారు కదూ నవ్వు తున్నారు, ఆ చూసాను నవ్వు అపుకో లేక పోతున్నను. మీ అందరి ఫీజులు నేనే కడతాను దేవుడున్నాడు నమ్ముతున్నాను అన్నాడు గట్టిగా మాష్టార్ (వెంటనే ఒక విద్యార్ధి నైట్రోజన్ గ్యాసు బిగించి  వచ్చాడు అందరి నవ్వులు ఆగినాయి).

మాష్టర్ ఒకే సారి నశించే వస్తువులు ఏవో చెప్పగలరా అని అడిగారు ?, పిల్లలముందు మాష్టార్  నోరు ఎత్తలేక పోయారు. ఒక విద్యార్ధి తెలియ పరిచాడు మనకు వెలుగు నిచ్చి ఆరిపోయే అగ్గి పుల్లను, మన ఆకలి తీర్చే పండ్లను సృష్టించినది దేవుడే కదండి, సమస్త లోకల్ని రక్షించేది దేవుడే గదండి. అవును పిల్లలారా దేవుడున్నాడు.



సహధర్మచారి   


అడుగులు తడబడుతూ  పెళ్లి పీటల ప్రక్కన చేరి, అడుగులో అడుగేసి , ఏడడుగులు నాతో వేసి..తాళి కోసమే తలవంచి తన్మయత్వంతో తలంబ్రాలు పోసి, పూల దండలు వేసి, పాదాల గోళ్ళు  త్రొక్కి, పరవసంతో తొణికిసలాడే వెలుగును తన సొంతం చేసుకున్నది.నా శ్రీమతి.   

నా..తలను పదిమందిలో పైనుంచి.. ఏడేడు జన్మల భంధం అంటూ,  ఈ జన్మనుండే చిటికన వేలు బట్టి..కొంగుకొంగు ముడివేసుకొని, అర్ధాంగి వై అగ్ని చుట్టు ప్రమాణంచేసి, నలుగురి దీవెనలు అందుకొని, అరుంధతి నక్షత్రం చూసి, బిందెలో ఉంగరాన్ని తీసి నేనే గొప్ప అని గర్వంగా తెలియ పరిచి, పెద్దలకు  పాదాబి వందనములు చేసి, తోబుట్టువులను వదిలేసి తోటి స్నేహితులను వదిలేసి మంగళ తోరణాల  కళ్యాణ మండపంలో తల్లి తండ్రుల హితవాక్యాలు వినినాతో కాపురానికి వచ్చింది . 

" చూడు తల్లి ఏలోటు రనీయ కుండా, మా శక్తికి మించిన సంభంధమని మేము తలచి నీ ఇష్ట ప్రకారముగా  పెళ్లి చేసినాము, నువ్వున్నచోటికే అన్నీ వచ్చి వాలవు, మంచి చెడు అర్ధం చేసుకొని మనమే అవి వ్వున్నచోటుకే మనం వెళ్లితీరాలి,  గమ్యం ఎప్పుడూ నీ దగ్గరికి రాదు, మనమే ధర్మం, సత్యం , న్యాయం గల గమ్యాన్నివెదుక్కొని  చేరాలి.

చూడు తల్లి విజయసాధనకు, నీకు మనోధర్యమే నీకు ఆధారము, నీవు నమ్ము కున్న దేవుడే నీకు రక్ష,  అడ్డ దారులు పోకుండా, ధర్మ మార్గాన నడిచేవారిని వరించె శక్తిని పొంది, అడ్డొచ్చే ముళ్ళయినా ,రాళ్ళయినా, కన్నీళ్ళయినా కడవరకు నిలబడవు, సంకల్పం బలంతో ముందుకు నడవాలి.

ఓర్పుతో సహనం వహించి, ఎవరు ఎమన్నా నిగ్రహించుకొని, తగిన సమాధానములు చెప్పి, నలుగురిలో పుట్టినింటికి ,  మెట్టినింటికి  పేరు తెచ్చి పెట్టాలి. పుడమితల్లి గర్భంనుండి జన్మించిన గడ్డి పరక సైతం, గాలివానలోనైనా సగర్వంగానే నిలబడుతుంది. కరకు పాదాలక్రింద నలిగిపోతానని పుష్పానికి తెల్సినా కడవరకూ  పరిమళాలును అందిస్తున్నే ఉంటుంది

గుడ్డు నుంచి బయటపడ్డ పక్షి పిల్ల సైతం, లేత రెక్కలిప్పి సుడిగాలి కెదురు నిలుస్తుందియోజనాల దూరాన్నిఆలవోకగా దాటేస్తుంది. సంకల్పం,విశ్వాసం తనకు రెక్క లైనవేళ తానే విజేతనని ప్రకటిస్తుంది. సానుకూల దృక్పధం అలవరుచుకో, ప్రకృతి నేర్పే పాఠాలెన్నో నేర్చుకో, నిరాశకు అవకాసము ఇవ్వక కోర్కలలో మంచి చెడు గమనించి మంచికే అవకాసము ఇచ్చి  తీరుస్తూ ముందుకు సాగాలి.  
చూడు తల్లి ఎన్ని ఓడు  దుడుకులు వచ్చిన మనోధైర్యం తో బ్రతకటమే బ్రతుకుఅర్ధం, వెన్నెలధారల్లొ తడవాలనుకున్నావు, చీకటి రాత్రులు ఎన్ని ఉన్న వెలుగు నీవెంట  ఉంటుంది అదే నీకు దారి చూపకలదు
తల్లి హిల్ భోద చేసింది.   
అలా నా భార్య నాజన్మతో జతగలిపి, ఈజన్మంత జత నిలిచి, ఆనందానికి అర్దాంగివై, నా చిరునవ్వుకు ప్రమిదవు నీవై.., చీకటిని తరిమే వెలుగువై ..కష్ట నష్టాలలో కన్నీటికి నేస్తానివై సుఖ దు:ఖాలలో సుధారాశిపై...., ఆకలికి అమ్మవై నడిజామున కోమలివై, నా కోపానికి ఓపిక నీదై..కష్టపెట్టినా ఇష్టమే నంటు నీ కంట తడి వచ్చినా ఇంటిగుట్టు ఇల్లంటు..నన్నునన్నుగా ఇన్నేల్లు నన్నంటి వెన్నంటి, సాదక బాదకలో సరి జోడువై..
పుట్టినింటి మరచి మెట్టినింట తన సర్వస్వమని తలచి,  తన భర్తే తనను స్వర్గంలో ఉంచి సుఖపెడతావని భావించితివి, నీవు ఆనందం పొందినది  ఎంతో నాకు తెలియదుగాని..చివరిగా నీకు నేనేమిచ్చుకోను చెలి ఈ భాహుభందాల మద్య కౌగిలితప్ప ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి