12, మే 2020, మంగళవారం

సృష్టి రహస్య విశేషాలు..!!


సృష్టి రహస్య విశేషాలు..!!
1  సృష్టి  ఎలా  ఏర్పడ్డది
2  సృష్టి  కాల చక్రం  ఎలా నడుస్తుంది
3  మనిషిలో  ఎన్ని  తత్వాలున్నాయి
( సృష్ఠి )  ఆవిర్బావము.
1  ముందు  (పరాపరము) దీనియందు శివం పుట్టినది
2  శివం యందు  శక్తి
3  శక్తి యందు నాధం
4  నాధం యందు బిందువు
5  బిందువు యందు సదాశివం
6  సదాశివం యందు మహేశ్వరం
7  మహేశ్వరం యందు ఈశ్వరం
8  ఈశ్వరం యందు రుద్రుడు
9  రుద్రుని యందు విష్ణువు
10 విష్ణువు యందు బ్రహ్మ
11  బ్రహ్మ యందు ఆత్మ
12  ఆత్మ యందు దహరాకాశం
13  దహరాకాశం యందు వాయువు
14  వాయువు యందు అగ్ని
15  ఆగ్ని యందు జలం
16  జలం యందు పృథ్వీ. 
17. పృథ్వీ యందు ఓషధులు
18. ఓషదుల వలన అన్నం
19. ఈ అన్నము వల్ల...... నర ,  మృగ , పశు , పక్షి  ,వృక్ష , స్థావర జంగమాదులు పుట్టినవి.
( సృష్ఠి ) కాల చక్రం.
పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది. ఇప్పటివరకు ఎంతో మంది శివులు ఎంతోమంది విష్ణువులు  ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు 
ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.
ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.
1 కృతాయుగం
2 త్రేతాయుగం
3 ద్వాపరయుగం
4 కలియుగం
నాలుగు యుగాలకు 1 మహయుగం.
71 మహ యుగాలకు 1మన్వంతరం.
14 మన్వంతరాలకు ఒక సృష్ఠి (ఒక కల్పం.)
15 సందులకు ఒక ప్రళయం (ఒక కల్పం)
1000 యుగాలకు బ్రహ్మకు పగలు (సృష్ఠి) .  
1000 యుగాలకు ఒక రాత్రి  (ప్రళయం.)
2000 యుగాలకు ఒక దినం.
ఇప్పుడు బ్రహ్మ వయస్సు 51 సం.
ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.
1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.
7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.
14 మంది మనువులు.
ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం. 
శ్వేతవరాహ యుగంలో ఉన్నాం.
5 గురు భాగాన కాలంకు 60 సం
1 గురు భాగాన కాలంకు 12 సం
1 సంవత్సరంకు 6 ఋతువులు.
1 సంవత్సరంకు  3 కాలాలు.
1 రోజుకు 2 పూటలు పగలు  రాత్రి
1 సం. 12 మాసాలు.
1 సం.  2 ఆయనాలు
1సం. 27 కార్తెలు
1 నెలకు 30 తిధులు
27 నక్షత్రాలు - వివరణలు
12 రాశులు
9 గ్రహాలు
8 దిక్కులు
108 పాదాలు
1 వారంకు 7 రోజులు
పంచాంగంలో 1 తిధి. 2 వార.  3 నక్షత్రం.  4 కరణం.  5 యోగం.
సృష్ఠి యావత్తు త్రిగుణములతోనే ఉంటుంది.
దేవతలు   జీవులు  చెట్లలో అన్ని వర్గంలలో మూడే గుణములు ఉంటాయి.
1  సత్వ గుణం 
2  రజో గుణం
3  తమో గుణం
( పంచ భూతంలు ఆవిర్భావం )
1 ఆత్మ యందు ఆకాశం 
2 ఆకాశం నుండి వాయువు
3 వాయువు నుండి అగ్ని
4 అగ్ని నుండి జలం
5 జలం నుండి భూమి అవిర్బవించాయి.
5  ఙ్ఞానేంద్రియంలు
5  పంచ ప్రాణంలు
5  పంచ తన్మాత్రలు
5  ఆంతర ఇంద్రియంలు
5  కర్మఇంద్రియంలు  = 25 తత్వంలు
1  ( ఆకాశ పంచికరణంలు )
ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల      ( జ్ఞానం )
ఆకాశం - వాయువులో కలవడం వల్ల  ( మనస్సు )
ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల          ( బుద్ది )
ఆకాశం - జలంతో కలవడంవల్ల          ( చిత్తం )
ఆకాశం - భూమితో కలవడంవల్ల        ( ఆహంకారం ) పుడుతుతున్నాయి
2( వాయువు పంచీకరణంలు )
వాయువు - వాయువుతో కలవడం వల్ల  ( వ్యాన)
వాయువు - ఆకాశంతో కలవడంవల్ల       ( సమాన )
వాయువు - అగ్నితో కలవడంవల్ల           ( ఉదాన )
వాయువు - జలంతో కలవడంవల్ల          ( ప్రాణ )
వాయువు - భూమితో కలవడంవల్ల        ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.
3 ( అగ్ని పంచీకరణములు )
అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల     ( శ్రోత్రం )
అగ్ని - వాయువుతో కలవడంవల్ల   ( వాక్కు )
అగ్ని - అగ్నిలో కలవడంతో           ( చక్షువు )
అగ్ని - జలంతో కలవడంతో         ( జిహ్వ )
అగ్ని - భూమితో కలవడంతో     ( ఘ్రాణం )  పుట్టెను.
4 ( జలం పంచికరణంలు )
జలం - ఆకాశంలో కలవడంవల్ల     ( శబ్దం )
జలం - వాయువుతో కలవడంవల్ల  ( స్పర్ష )
జలం -  అగ్నిలో కలవడంవల్ల        ( రూపం )
జలం - జలంలో కలవడంవల్ల         ( రసం )
జలం - భూమితో కలవడం వల్ల      ( గంధం )పుట్టెను.
5 ( భూమి పంచికరణంలు )
భూమి - ఆకాశంలో కలవడంవల్ల      ( వాక్కు )
భూమి - వాయువుతో కలవడం వల్ల  ( పాని )
భూమి -  అగ్నితో కలవడంవల్ల          ( పాదం )
భూమి - జలంతో కలవడంతో          ( గూహ్యం )
భూమి - భూమిలో కలవడంవల్ల      ( గుదం )  పుట్టెను.
( మానవ దేహ తత్వం )  5  ఙ్ఞానేంద్రియంలు
1  శబ్ద
2  స్పర్ష
3  రూప
4  రస
5  గంధంలు.
5  (  పంచ తన్మాత్రలు )
1  చెవులు
2  చర్మం
3  కండ్లు
4  నాలుక
5  ముక్కు
5  ( పంచ ప్రాణంలు )
1  అపాన 
2  సామనా
3  ప్రాణ
4  ఉదాన
5  వ్యాన
5  (  అంతఃర ఇంద్రియంలు  )  5  (  కర్మేంద్రియంలు )
1  మనస్సు
3  బుద్ది
3  చిత్తం
4  జ్ఞానం
5  ఆహంకారం
1  వాక్కు
2  పాని
3  పాదం
4  గుహ్యం
5  గుదం
6  (  అరిషడ్వర్గంలు  )
1  కామం
3  క్రోదం
3  మోహం
4  లోభం
5  మదం
6  మాత్సర్యం
3  (  శరీరంలు  )
1  స్థూల  శరీరం
2  సూక్ష్మ  శరీరం
3  కారణ  శరీరం
3  (  అవస్తలు  )
1  జాగ్రదావస్త
2  స్వప్నావస్త
3  సుషుప్తి అవస్త
6  (  షడ్బావ వికారంలు  )
1  ఉండుట
2  పుట్టుట
3  పెరుగుట
4  పరినమించుట
5  క్షిణించుట
6  నశించుట
6  (  షడ్ముర్ములు  )
1  ఆకలి
2  దప్పిక
3  శోకం
4  మోహం
5  జర
6  మరణం
.7  (  కోశములు  )  (  సప్త ధాతువులు  )
1  చర్మం
2  రక్తం
3  మాంసం
4  మేదస్సు
5  మజ్జ
6  ఎముకలు
7  శుక్లం
3  (  జీవి త్రయంలు  )
1  విశ్వుడు
2  తైజుడు
3  ప్రఙ్ఞుడు
3  (  కర్మత్రయంలు  )
1  ప్రారబ్దం కర్మలు
2  అగామి  కర్మలు
3  సంచిత  కర్మలు
5  (  కర్మలు  )
1  వచన
2  ఆదాన
3  గమన
4  విస్తర
5  ఆనంద
3  (  గుణంలు  )
1  సత్వ గుణం
2  రజో గుణం
3  తమో గుణం
9  (  చతుష్ఠయములు  )
1  సంకల్ప
2  అధ్యాసాయం
3  ఆభిమానం
4  అవధరణ
5  ముదిత
6  కరుణ
7  మైత్రి
8  ఉపేక్ష
9  తితిక్ష
10  (  5 పంచభూతంలు పంచికరణ   చేయనివి )
      (  5 పంచభూతంలు  పంచికరణం  చేసినవి  )
1  ఆకాశం
2  వాయువు
3  ఆగ్ని
4  జలం
5  భూమి
14  మంది  (  అవస్థ దేవతలు  )
1  దిక్కు
2  వాయువు
3  సూర్యుడు
4  వరుణుడు
5  అశ్వీని దేవతలు
6  ఆగ్ని
7  ఇంద్రుడు
8  ఉపేంద్రుడు
9  మృత్యువు
10  చంద్రుడు
11  చతర్వకుడు
12  రుద్రుడు
13  క్షేత్రజ్ఞుడు
14  ఈశానుడు
10  (  నాడులు  ) 1 (  బ్రహ్మనాడీ  )
1  ఇడా నాడి
2  పింగళ
3  సుషుమ్నా
4  గాందారి
5  పమశ్వని
6  పూష
7  అలంబన
8  హస్తి
9  శంఖిని
10  కూహు
11  బ్రహ్మనాడీ
10  (  వాయువులు  )
1  అపాన
2  సమాన
3  ప్రాణ
4  ఉదాన
5  వ్యాన
6  కూర్మ
7  కృకర
8  నాగ
9  దేవదత్త
10  ధనంజమ
7  ( షట్ చక్రంలు  )
1  మూలాధార
2  స్వాదిస్థాన
3  మణిపూరక
4  అనాహత
5  విశుద్ది
6  ఆఙ్ఞా
7  సహస్రారం
(  మనిషి  ప్రమాణంలు  )
96  అంగుళంలు
8  జానల పోడవు
4  జానల వలయం
33 కోట్ల రోమంలు
66 ఎముకలు
72 వేల నాడులు
62  కీల్లు
37  ముారల ప్రేగులు
1  సేరు గుండే
అర్ద సేరు రుధిరం
4  సేర్లు మాంసం
1  సేరెడు పైత్యం
అర్దసేరు శ్లేషం
(  మానవ దేహంలో 14 లోకాలు  )  పైలోకాలు 7
1  భూలోకం  -  పాదాల్లో
2  భూవర్లలోకం  -  హృదయంలో
3  సువర్లలోకం  -  నాభీలో
4  మహర్లలోకం  -  మర్మాంగంలో
5  జనలోకం  -  కంఠంలో
6  తపోలోకం  -  భృమద్యంలో
7  సత్యలోకం  -  లాలాటంలో
అధోలోకాలు  7
1  ఆతలం  -  అరికాల్లలో
2  వితలం  -  గోర్లలో
3  సుతలం  -  మడమల్లో
4  తలాతలం  -  పిక్కల్లో
5  రసాతలం  -  మొకాల్లలో
6  మహతలం  -  తోడల్లో
7  పాతాళం  -  పాయువుల్లో
(  మానవ దేహంలో  సప్త సముద్రంలు  )
1  లవణ సముద్రం  -  మూత్రం
2  ఇక్షి సముద్రం  -  చెమట
3  సూర సముద్రం  -  ఇంద్రియం
4  సర్పి సముద్రం  -  దోషితం
5  దది సముద్రం  -  శ్లేషం
6  క్షీర సముద్రం  -  జోల్లు
7  శుద్దోక సముద్రం  -  కన్నీరు
(  పంచాగ్నులు  )
1  కాలాగ్ని  -  పాదాల్లో
2  క్షుదాగ్ని  -  నాభిలో
3  శీతాగ్ని  -  హృదయంలో
4  కోపాగ్ని  -  నేత్రంలో
5  ఙ్ఞానాగ్ని  -  ఆత్మలో
7  (  మానవ దేహంలో  సప్త  దీపంలు  )
1  జంబుా ద్వీపం  -  తలలోన
2  ప్లక్ష ద్వీపం  -  అస్తిలోన
3  శాక ద్వీపం  -  శిరస్సుపైన
4  శాల్మల ధ్వీపం  -  చర్మంన
5  పూష్కార ద్వీపం  -  గోలమందు
6  కూశ ద్వీపం  -  మాంసంలో
7  కౌంచ ద్వీపం  -  వెంట్రుకల్లో
10  (  నాధంలు  )
1  లాలాది ఘోష  -  నాధం
2  భేరి  -  నాధం
3  చణీ  -  నాధం
4  మృదంగ  -  నాధం
5  ఘాంట  -  నాధం
6  కీలకిణీ  -  నాధం
7  కళ  -  నాధం
8  వేణు  -  నాధం
9  బ్రమణ  -  నాధం
10  ప్రణవ  -  నాధం
💐

అశ్వినీ దేవతలు ఎవరు ? - వారి విశేషాలేమిటి.




🌹. అశ్వినీ దేవతలు ఎవరు ? - వారి విశేషాలేమిటి...!! 🌹

అశ్వినీ దేవతలు పురాణ పురుషులు మరియు కవలలు. వీరు సూర్యునికి, ఛాయాదేవికి అశ్వరూపంలో ఉండగా సంభోగించుట మూలంగా జన్మించారు.

మహాభారతంలో పాండురాజు పత్ని మాద్రికి మంత్ర ప్రభావము వలన నకులుడు మరియు సహదేవుడు జన్మించారు. వీరు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుండి నేర్చుకొని ఇంద్రునికి నేర్పినట్లు చెబుతారు.వీరిసోదరి ఉష.

ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుందట. ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పుదిక్కు నుండి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన. వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం.

అది హిరణ్యయానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది. ఆ రథం చాలా బృహత్తరమైనది. అది బంగారంతో నిర్మించబడింది. ఆ రథానిని మూడు గుర్రాలు నడుపుతుంటాయి.

అద్వరాశ్వాలనే ఆగుర్రాలు తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతోత్యంత ఉత్సాహంతో ఉంటాయి. చిత్రమైన ఈ రథానికి చక్రాలూ మూడే. సారధి కూర్చోవడానికి త్రిఫలకాలు మరియు త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి.

ఆ రథంలో ఓకవైపు ధనం మరొకవైపు తేనె, సోమరసం మరొకవైపు ఆయుధాలు ఉంటాయి. రథం పైభాగంలో వేయిపతాకాలు సుందరంగా రెపరెపలాడుతూ ఉంటాయి. అశ్వినీ దేవతల కంఠద్వని శంఖనాదంలా మధురంగా ఉంటుంది.

ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు. ఉపాసకుల మంత్రాలలోని సత్యాన్ని మాత్రమే గ్రహించి వారిని అనుగ్రహిస్తుంటారు. వీరి చేతిలో తేనె, సోమరసం మరియు మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు.

వేదాలలో అశ్వినీ దేవతల వర్ణన ఉంది. వేదాలలో వీరి గురించి నూరు దాదాపు సూక్తాల వరకు ఉంది. వీరిని ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి. ఈ దేవతలు దయార్ధ హృదయులు, ధర్మపరులు మరియు సత్యసంధులు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి.

వీరు ఆరోగ్యసమస్యలు ఉన్నవాళ్ళను అనేక సమయాలలో ఆహ్వానంపై వచ్చి శస్త్రచికిత్సలు సైతం చేసినట్లు పురాణ వర్ణన.

వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేతలు కుడిచేతిలో అభయముద్ర ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృతసంజీవిని, విశల్యకరణి లాంటి ఔషధీ లతలు ఎడమవైపు అమృతకలశాన్ని పట్టుకున్న ధన్వంతరీ కలిగి ఉంటారని పురాణాలలో వర్ణించబడింది. ఈ దేవతలు విరాట్పురుషుని నాశికాభాగంలో ఉంటారు.

🌻. ఆవిర్భాగం పొందుట: 🌻

అశ్వినీదేవతలు దేవతలైనా వారికి యజ్ఞయాగాదులలో భాగం ఉండేది కాదు. వృద్దుడైన చ్యవనమహర్షికి సందర్భానుసారంగా యవ్వనవతియైన సుకన్య భార్యగా లభించింది.

సుకన్య భర్తను భక్తి శ్రద్ధలతో సేవించగా ఆమె సేవలకు తృప్తి చెందిన చ్యవనమహర్షి ఆమెను సంతోషపెట్టడానికి యవ్వనం కావాలని అనిపించింది. అనుకోకుండా వారింటికి విచ్చేసిన అశ్వినీ దేవతలకు ఆయన తనకు యవ్వనం ప్రసాదించమని కోరాడు. బదులుగా వారికి యజ్ఞయాగాదులలో హవిర్భాగం ఇప్పించగలనని చెప్పాడు.

🌻. ఋగ్వేదంలో అశ్వని దేవతల ప్రస్తావన: 🌻

అశ్వినీ దేవతలు పేరిట నక్షత్రములు ఉన్నాయి. కాని అవి వారి అనంతరము వారి పేరిట పెట్టబడిన జ్ఞాపక చిహ్నములని గుర్తించవలెను. మిథునరాశి లోని కేస్టర్‌, పోలక్స్ అనే నక్షత్రాల జంటకీ అశ్వినులకీ పోలికలు ఉన్నాయి.

అశ్వినిలు నాటి దేవ ప్రజాసమూహమునకు, అనగా ప్రాచీనార్యజాతికి వైద్యులుగా, ఓడలతో వ్యాపారముజేయువారుగా ఉండి ప్రజాసేవ చేయుచుండినట్లు ఋగ్వేదమున ఈ క్రింద దృష్టాంతరమున కన బడుచున్నది. వీరు పశువైద్యము గూడ చేయుచుండిరి.
శయుడను ఋషి యొక్క గోవు ఈనలేని స్థితిలో నుండగా, వీరు దానిని ఈనినట్లు సాయపడిరి.
🌹 🌹 🌹 🌹 🌹

9, మే 2020, శనివారం

మిణుకుమిణుకు కధ (9)

మిణుకుమిణుకు కధ (9)

#ఆఫీస్‌ నుండి వచ్చానో లేదో అన్నయ్య నుండి ఫోన్‌ వచ్చింది. వదినకి ఆరోగ్యం బాగా లేదని, బాగా నీరసమై పోయిందని చెప్పేసరికి గాబరా పడ్డాను. రెండిళ్ళ అవతలే అన్నయ్య కుటుంబం వుండేది. ఆలస్యం చెయ్యకుండా పరుగు పెట్టాను. దాదాపుగా అపస్మారక స్థితిలో వుంది వదిన. అబులెన్స్‌ రప్పించి, మా ఊర్లోనే వున్న ప్రసాద్‌ డాక్టర్‌ గారి దగ్గరికి తీసుకువెళ్ళాం. ''షుగర్‌ దాదాపుగా నాలుగు వందలు దాటింది. వెంటనే మీరు విశాఖపట్నం తీసుకెళ్ళిపోండి'' అని చెప్పగానే... అదే అంబులెన్స్‌లో విశాఖపట్నం తీసుకెళ్ళి కనకదుర్గ నర్సింగ్‌హోమ్‌లో జాయిన్‌ చేశాం.

అన్నయ్య గారబ్బాయి, కోడలు, పిల్లలతో కలిసి తిరుపతి వెళ్ళడం వల్ల... పూర్తి బాధ్యత నామీద పడింది. వదినకేమైనా అయితే తాను ఒంటరినై పోతానేమోనని అన్నయ్య భయపడిపోతూ... ఏడుస్తున్నాడు కూడా. అన్నయ్య ఏడవటం నేనెప్పుడూ చూడలేదు.

అందరికీ ఒకటే అనుమానం... వదిన ఇంక బతకదనే వారి నమ్మకం.
మరోవైపు వదినని ఎలాగైనా బతికించుకోవాలని తాపత్రయం నాది.

డాక్టర్లందరితోనూ మాట్లాడుతూనే వున్నాను. వదినకి షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోవడం వల్ల కిడ్నీ కూడా పనిచేయడం తగ్గిపోయింది. ఎవ్వరికీ ఎటువంటి ఆశలూ లేవు... నాకు మాత్రం ఏదో నమ్మకం... చిన్ని ఆశ ఏ మూలనో మిణుకుమిణుకు మంటూ వుండే దీపంలా కన్పిస్తోంది.

అన్నయ్య గారబ్బాయినీ, బంధువుల్నీ, దగ్గరివాళ్ళనీ రమ్మని అందరికీ కబుర్లు పంపేశారు. ఇవాళ్ళో రేపో ప్రాణం పోతుందన్నట్లుగా ఉంది వారి తీరు. నా ప్రయత్నం ఆపలేదు.

నా పరిచయాన్ని ఉపయోగించి మంచి డాక్టర్లనీ రప్పించాను. రెండ్రోజుల్లోనే షుగర్‌ లెవల్స్‌ బాగా తగ్గి, నార్మల్‌కి వచ్చేయి. కిడ్నీ పనితీరు కూడా సాధారణ స్థితికి వచ్చేసింది. వారం రోజుల్లో డిశ్చార్జ్‌ చేసేశారు. వదిన మరలా బతికి ఇంటికి వస్తుందనే నమ్మకం ఎవరికీ లేదు. తనలా వచ్చేసరికి... అన్నయ్య ముఖంలో ఏదో తెలీని ఆనందం. అవధులు లేని ధైర్యం కొట్టొచ్చినట్టుగా కన్పించడమే కాకుండా... నేనంటే అన్నయ్యకి ప్రత్యేకమైన అభిమానం, నమ్మకం ఏర్పడ్డాయి.

ఎవరెంతగా నిరుత్సాహ పరిచినా నేను వెనక్కి తగ్గలేదు. చివరి క్షణం దాకా ప్రయత్నిస్తూనే వున్నాను. ఏదైతేనేం ఫలితం దక్కింది. వదిన మామూలు మనిషయింది.
ఇంత జరిగినా అన్నయ్య ఒక్కడే సంతోషంగా వున్నాడు. మిగిలిన వాళ్ళంతా నిరుత్సాహంగానే వుండటం నేను గమనించకపోలేదు.
డబ్బు బాగా ఖర్చయిపోయిందనీ, తాము చనిపోతుందని చెప్పిన మనిషి, మరలా లేచి కూర్చుందనీ, తాము చెప్పింది నిజం కాలేదనీ... ఇలా ఏవేవో కారణాలతో వారు అసంతృప్తిగా వున్నారనే విషయం స్పష్టంగానే తెలుస్తోంది.
కాలచక్రం గిర్రున తిరిగింది.
ఐదు సంవత్సరాలు ఏమీ కాకుండానే గడిచిపోయాయి. వదిన ఆరోగ్యం పదిలంగానే ఉంది. అన్నయ్య ఆరోగ్యం కాస్త క్షీణించింది. అన్నయ్య నావైపు మరలా ఆశగా చూశాడు. నా ప్రయత్నం మరలా మొదలు పెట్టాను. మరలా విశాఖపట్నం తీసుకెళ్ళాలని నా వుద్దేశం. మరలా డబ్బు ఖర్చయిపోతుందేమోనని వారి భయం. అయినా అన్నయ్యను దక్కించుకోవాలంటే తప్పదు. దాదాపుగా బలవంతంగానే వాళ్ళకి పూర్తిగా ఇష్టం లేకపోయినా నా కారులో ఆసుపత్రి వరకూ తీసుకెళ్ళగలిగాను. పరీక్షలన్నీ అయ్యాయి. అవసరమైన మందులన్నీ ఇచ్చారు. నాకన్నా శ్రద్ధగా అన్నయ్య కోసం ఆలోచిస్తున్నట్లుగానే అన్పించింది. వాళ్ళపై నాకు నమ్మకం కలిగింది.

కానీ అన్నయ్యకు కలగలేదు. లేదు, బాగానే చూపిస్తున్నారులేమని చెప్పి, అన్నయ్యను నమ్మించాను.

దాదాపుగా ప్రతిరోజూ అన్నయ్యను కలిసేవాడిని. గతంలో తిరిగినట్లుగా బయటకు వెళ్ళలేకపోయేవాడు. ఇంటికే పరిమితమయ్యాడు.

ఏం కావాలంటే అవి కొని, ప్రతిరోజూ పట్టుకెళ్ళేవాడ్ని. కాసేపు కబుర్లు చెప్పి వచ్చేసేవాడ్ని.

అనుకోకుండా ఏవో పనులు తగిలినా, అన్నయ్యను కలవటం మానలేదు. అన్నయ్య కొడుక్కి ఇంకేం ట్రీట్‌మెంట్‌ చేస్తే బాగుంటుందో చెప్పి, అలా చేయించమని చెప్పేవాడ్ని ఎప్పటికప్పుడు. అన్నయ్య ఆరోగ్యం బాగవుతుందనే తప్ప, వేరే వుద్దేశ్యం నాకు లేదు.
ఒకసారి అనుకోకుండా అన్నయ్య గారమ్మాయి నుండి నాకు ఫోనొచ్చింది. 

''ఏంటి మీరు మా నాన్నగార్కి హాస్పిటల్‌ ట్రీట్‌మెంట్‌ చేయించమని మా తమ్ముడ్ని రోజూ సతాయిస్తున్నారట. ఆ మధ్య మా అమ్మ కోసమని మూడు లక్షల ఖర్చు పెట్టించారు. ఇప్పుడేమో మా నాన్న కోసం ఖర్చు పెట్టిదామనుకుంటున్నారు. వీళ్ళని చూసుకోవడం తప్ప, మా తమ్ముడింక బాగుపడక్కర్లేదా? జీవితాంతం వాళ్ళ గురించే వున్న డబ్బంతా ఖర్చు చేసేస్తే, ఇంక వాడు బతకక్కర్లేదా?'' దాదాపు నాకు వార్నింగ్‌ ఇచ్చింది.

ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ''అలాగే తల్లీ... నేన్జేసింది తప్పే'' అని మాత్రం చెప్పి ఫోన్‌ పెట్టేశాను.
ఈ సంఘటన జరిగిందగ్గర్నుండి నాకు లోలోపల ఏదో అపరాధ భావన కలిగేది. అన్నయ్య వద్దకు వెళ్దామనుకునేవాడ్ని. మరలా వెనకడుగు వేసేవాడ్ని.
అన్నయ్య ఫోన్‌ చేస్తేనే తప్ప వెళ్ళడానికి సంశయించేవాడ్ని.

అన్నయ్య వెళ్ళిన ప్రతిసారీ ఏవొక ఆరోగ్య సమస్యలు ఏకరువు పెట్టేవాడు. నేను అన్నయ్యని హాస్పిటల్లోకి తీసుకెళ్తే, వారిపరువుకి ఏదో భంగం కలిగినట్లు భావించేవారు. వాళ్ళు తీసుకెళ్ళేవారు కాదు. చివరికి ఒకసారి నేను ఆఫీస్‌ నుండి ఇంటికి చేరుకోగానే కబురొచ్చింది... పిలిచినా అన్నయ్య పలకడం లేదని!

మరలా యథావిధిగా పరుగు పెట్టాను. అప్పటికే అన్నయ్య గుండె ఆగిపోయింది. అంబులెన్స్‌, డాక్టర్లూ... అందర్నీ పిలిచినా వృథా ప్రయత్నమే అయ్యంది. ఏదైతేనేం... అన్నయ్యను మా నుండి దూరం చేసుకున్నాం. చివరకు వదిన ఒంటరయ్యింది. అన్నయ్య లేని జీవితాన్ని అలవాటు చేసుకోవటం మొదలుపెట్టింది. ఏదేమైనా డబ్బు కోసం కొడుకు, కోడలి మీద ఆధారపడాల్సిందే. 

వదిన పేరున కోట్ల విలువైన ఆస్తి వుంది. అన్నయ్య, వదినలకు నలుగురు సంతానం. ముగ్గురమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. అబ్బాయికి కూడా పెళ్ళయిపోయింది. ఆడపిల్లలు వాటాలడుగుతారేమోననే భయంతోనో, మరే కారణంతోనో అన్నయ్య కొడుకు... వదిన పేరనున్న ఆస్తినంతా తన పేరున రాయించేసుకున్నాడు. అదే వదిన పాలిట శాపమవుతుందని భావించి వుండదు పాపం! కొడుకు పేరునే కదా అని మరో ఆలోచన లేకుండా సంతకాలు చేసేసింది. 
అనుకోకుండా ఆ వెంటనే వదిన ఆరోగ్యం పాడయింది. మరలా షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోయాయి. తూతూమంత్రంగా ట్రీట్‌మెంట్‌ జరుగుతుందే తప్ప, సరైన చికిత్స అందలేదు. డయాబెటిక్‌ రెటినోపతి వచ్చి కంటి చూపు బాగా తగ్గిపోయింది. వదినకు ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరిపైనా ఆధారపడడం ఇష్టముండేది కాదు. తన వంట తనే చేసుకునేది. కంట్రోల్‌ లేకుండా తినేయటం వల్లే షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోయాయని, అందుకే చూపు కూడా పోయిందని తేల్చింది కోడలు. అన్నయ్యగారబ్బాయి కాదనలేదు. దాంతో వదిన దగ్గరున్న గ్యాస్‌ సిలెండర్‌ను వెనక్కి తీసేసుకున్నారు. ఫలితంగా కోడలు పెట్టిందే తప్ప అంతకు మించి తినే అవకాశం లేకుండా పోయింది. వదినది భారీ కాయం. ఏ మూలకీ రానంత తక్కువ తిండి ఆమెను బలహీనపరిచింది. దానికి తోడు ఆత్మాభిమానం చచ్చి మరింత కుంగిపోయింది. వదినని చూసి బాధపడటమే నా పనయింది.
ప్రతిరోజూ వెళ్ళినా గానీ, ఏం చెప్పినా గాని పట్టించుకునేవాళ్ళే లేకపోయారు. నేనేం తీసుకెళ్ళి పెట్టినా, తిననిచ్చేవారు కాదు. ట్రీట్‌మెంట్‌ చేయిద్దామని చెప్తే, చేయిస్తున్నాం కదా అనేవాళ్ళు. వారికి నచ్చిన మందులు ఇవ్వటమే కాని, డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్ళేవారు కాదు. నాతోపాటు ఇరుగుపొరుగు వారెవరు చెప్పినా వినిపించుకునేవారు కాదు.
వదిన మంచం పట్టింది. లేచి నిలబడే శక్తి కూడా లేకుండా పోయింది. మంచం పైనే అన్నీను. ''ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, తీసుకెళ్దాం'' ఈ సారి గట్టిగానే చెప్పాను.
''హాస్పిటల్‌ ఖర్చు ఎంతయినా నేను భరిస్తాను'' అని చెప్పాను. వారి నుండి అవునని గానీ, కాదనిగానీ ఏ సమాధానమూ లేదు. వదిన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఏం జరిగిందో తెలీదు. తిండితో పాటు, బీపీ టాబ్లెట్లు కూడా తగ్గించేశారేమో... వదిన మాట కూడా పడిపోయింది. తనకి అడిగే శక్తి లేదు. అడగాలనే ఆసక్తి వున్నా, మూగదైపోయిన నోరు ఆమెకు ఆ అవకాశం లేకుండా చేసింది. కళ్ళముందే అంతా జరుగుతున్నా, నైతిక విలువలు, కుటుంబ విలువలూ పతనమవుతున్నా... నేనూ మూగవాడ్నే అయ్యాను. నా మాటలు ఎవరూ వినిపించుకోలేదు. వదిన వేదననీ, నా ఆవేదననీ పట్టించుకునే వారే కరువయ్యారు.

ఏ కొంచెమో తిండి తినగలిగే నోరు, మింగే శక్తి కోల్పోయి, కేవలం ద్రవ పదార్థాల్ని మాత్రమే స్వీకరించే దీనస్థితికి చేరుకుంది.

ఈ సారి నోరు విప్పక తప్పలేదు. ''తల్లిదండ్రులనేవారు మనకి గొప్ప ఆస్తి. వారిని కాపాడుకోవటం మన విధి. కనీస చికిత్స చేయించకుండా వదిలేయటం దారుణం. తిండి తినలేని పరిస్థితుల్లో కూడా, మనం మెడికల్‌గా సపోర్టు ఇవ్వకపోవటం అత్యంత హేయం. ఆమెక ఖర్మకి ఆమెని వదిలేసి ఎప్పుడు చనిపోతుందా అని ఎదురు చూడటం... ఇంతకు మించిన ఘోరం ఇంకేముంటుంది? మీరు తీసుకెళ్తారా లేకుంటే నన్ను తీసుకెళ్ళమంటారా? ఏదో ఒకటి తేల్చుకోండి...'' దాదాపుగా పెద్ద గొడవే చేశాను.

మొక్కుబడిగా తీసుకెళ్ళి, ఒక్క రోజు మాత్రమే ఆసుపత్రిలో వుంచి, ఎవరికీ చెప్పకుండా వెనక్కి తీసుకొచ్చేశారు. కాని ఒక్క రోజులోనే ఆమెకి ఆరోగ్యం ఎంతో మెరుగు పడింది. ఎందుకు ఇంటికి తీసుకొచ్చారో కారణం వారికే తెలియాలి మరి! ఏదైతేనేం ఆమెను మంచానికే పరిమితం చేశారు.
రెండ్రోజుల్లోనే కోమాలోకి వెళ్ళిపోయింది. నోట్లో వేసినవి మింగటం తప్ప, చూపులేదు, మాటా లేదు. కనీసం ట్రీట్‌మెంటూ చేయించటం లేదు. దాదాపుగా పదిహేను రోజులు అలాగే గడిచిపోయాయి. తిండి లేకుండా, అనారోగ్యంతో వున్న వారెవరైనా అన్ని రోజులు ప్రాణంతో వుండగలరా? ఆరోగ్యంగా వున్నవాళ్ళు సైతం తిండి లేకపోతే ఆకలితో చచ్చిపోతారు. 
అన్నయ్య గారబ్బాయితో చెప్పాను... ''ఇప్పటికైనా డాక్టర్లకు చూపిద్దాం. కనీసం సుఖంగానైనా చచ్చిపోతుంది. ఇది కూడా హత్యే. ఇలా వదిలేయడం, తల్లి అనే దయాదాక్షిణ్యం కూడా లేకుండా తిండి లేని పరిస్థితుల్లో చంపేయటం క్రూరమైన హత్య కాకపోతే మరేమిటి?''
విన్నా విననట్లే వుండిపోయాడు. పదిహేను రోజులు ప్రాణంతో అచేతనంగా పడి వున్నా పట్టించుకోని ఆత్మీయులున్నారని తెలిసి, మర్నాడే ప్రాణం వదిలేసింది. ఏడుపాగలేదు నాకు. కళ్ళముందే నదిలో మునిగిపోతునన వ్యక్తిని కాపాడకుండా చూస్తూ వుండిపోవటం లాంటిదే ఇది.
ప్రమాదం జరిగి రక్తంతో రోడ్డంతా తడిసిపోయి, గిలగిల కొట్టుకుంటున్న ప్రాణాన్ని, ఏ ఆసుపత్రికీ తీసుకెళ్ళకుండా, ఏ సాయమూ చేయకుండా వదిలేసినట్లే అనిపిస్తోంది. నా నిస్సహాయ స్థితికి నన్ను నేనే నిందించుకున్నాను. ఈ పాపంలో ఎంతో కొంత నాక్కూడా భాగముందంటే అది అబద్దం కాదు. వదిననను ఈసారి కాపాడుకోలేకపోయాననే అపరాధ భావన నన్ను బాధిస్తోంది. గతంలో అన్నయ్య నాకు మద్దతుగా వున్నాడు. ఈసారి నాకు మద్దతిచ్చినవారే లేరు. వదిన వారికెవరికీ అక్కర్లేని ప్రాణమైపోవటం చాలా బాధగావుంది. తల్లిదండ్రులు సైతం అక్కర్లేని వారిగా, పనికిరాని వారిగా నేటి కాలంలో మారిపోతున్నారా అన్పించింది. 
వదిన కర్మకాండలు ఘనంగా జరిగాయి. మేళతాళాలతో, తప్పెడుగాళ్ళతో కోలాహలంగా సాగాయి. ఎక్కడా తక్కువ చేయలేదు. పెద్ద ఖర్మకి కూడా మరింత ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పత్రికలలో ప్రకటనలు - 'నీవు చనిపోయిననూ మా మదిలో నిలిచే వుంటావు... నీవు లేకపోయిననూ నీ జ్ఞాపకాలతో బతికేస్తాం'. 
అవాజ్యమైన ప్రేమను ఒలకబోస్తూ రాతలు... ఆమెకి కనీసం చివరి రోజుల్లో తిండి పెట్టకపోయినా, వేలాదిమందికి పెద్ద ఖర్మ రోజున విందు భోజనాలంట... ఆమె కడుపు కాలి మరణిస్తే, ఆమెకిష్టమైన కూరలూ, వంటకాలని చెప్పి వచ్చిన వారందరికీ వడ్డిస్తారట. 
ఆమె పేరున స్వయం పాక దానాలూ, నిలువెత్తు హోర్డింగులూ, బ్రాహ్మణులతో పూజలూ, గోదానం, వస్త్రదానం, ఛత్రదానం, పాదుకా దానం... ఒకటా రెండా! బతికున్నప్పుడు ఆమె బతిమిలాడినా కాశీకి తీసుకెళ్ళనివారు, కుటుంబమంతా ఆమె అస్థికలను కాశీకి తీసుకెళ్ళి గంగలో మునుగుతారంట. ఇవన్నీ చూస్తుంటే బాధగా, వింటుంటే కర్ణకఠోరంగా అన్పిస్తోంది. పూజలు జరుగుతుండగానే మధ్యలో లేచాను.
''బాబారు... ఉండండి... వెళ్ళిపోతున్నారేమిటి?'' మాటలు విన్పిస్తున్నాయి. కలకలం రేగిందక్కడ. 
మనస్సాక్షి అంగీకరించలేదు. మనిషిని బతికించడానికి పంచినా పర్వాలేదు... ఇంత క్రూరంగా చంపేశాక, ఇవన్నీ ఎవరికోసం?
వడివడిగా అక్కడ నుండి దూరంగా వచ్చేశాను.



*రచయిత - డా||ఎమ్‌.వి.జె.భువనేశ్వరరావు గారు*


చతుర్వేదాలు

ఎవరయినా వేదం నేర్చుకునేవారు చేయాలంటే మొత్తం వేదరాశిని అధ్యయనము చేయాల్సిందే.

వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది.

కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చేసరికి వేదరాశిని అధ్యయనము చేయవలెనంటే బహుకష్టమని ఎక్కువ మంది అంతగా ఉత్సాహము చూపించే వారు కాదు.

మొదట కలగలుపుగా ఉన్న వేదరాశి(వేదాలను)ని వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడు.

ఈ వేదరాశిని వ్యాసుడు ఋక్కులు అన్నింటిని ఋక్సంహితగాను, యజస్సులు అన్నింటిని యజుస్సంహితగాను, సామలన్నింటినీ సామసంహితగాను విడదీసి అలాగే అథర్వమంత్రాలన్నీ ఒకచోట చేర్చి అథర్వసంహితగా విభజన చేసాడు.

అలా నాలుగు వేదాలు మనకు లభించాయి.

1. ఋగ్వేదము
2. యజుర్వేదము
3. సామవేదము
4. అధర్వణవేదము

1. ఋగ్వేదము :

ఋగ్వేదః శ్వేత వర్ణస్యాత్ ద్విభుజో రాసబాననః |
అక్షమాలాదరః సౌమ్యః ప్రీతో వ్యాఖ్యా కృతో ద్యమః ||

ఋగ్వేదము తొలుత క్రీ.పూ. 1700 ప్రాంతములో ఉచ్చరించబడింది. ఋగ్వేదాన్ని దర్శించినప్పుడు ఆ వేదాన్ని ఒక రూపుతో దర్శించారు కనుక ఋగ్వేద పురుష అని వ్యవహరిస్తారు.

ఋగ్వేద పురుషుడు తెలుపు రంగులో ఉంటాడట. గాడిద ముఖం కలిగి ఉంటాడట. చేతిలో మాల ధరించి ఉంటాడట. ప్రశాంతంగా కనిపిస్తూ వేదాన్ని అందించాడట. సంహితలు ఎనిమిది ఆష్టకములుగా ఉంటుంది. ఒక్కో అష్టకం ఎనిమిది అధ్యాయాలుగా ఉంటుంది. మొత్తం 1028 సూక్తులుగా ఉంటుంది. 10552 ఋక్కులు(మంత్రాలు) ఉంటాయి. మొత్తం 397265 అక్షరాలు ఉంటాయి. ఈ మొత్తం 21 శాఖలుగా విభజించారు.

సంహితలని ఆ శిష్యుల పేర్ల రూపుతో వ్యాస, పైల, ఇంద్రప్రమాతి, మాండుకేయ, సత్య స్రవస్, సత్య హిత మరియూ సత్యశ్రీగా విభజించారు. ఒక్క సత్యశ్రీ శాఖను తీసుకుంటే అది వారి శిష్యులైన సాఖల, సాఖపూణి మరియూ భాష్కల అని మూడుగా విభాగం అయ్యింది. సాఖల మరో ఐదు భాగాలుగా, భాష్కల నాలుగు భాగాలుగా విభాగం అయ్యింది.

ఋగ్వేదంలో ఉపవేదంగా ఆయుర్వేదం ఉంటుంది. బ్రాహ్మణాలు నాలుగు భాగాలుగా, అవి పైంగ, బహ్-వ్రిచ, ఆశ్వలాయణ, గాలవ బ్రాహ్మణాలుగా విభాగం అయ్యాయి. ఆరణ్యకాలలో ఉపనిషత్తులు ఉంటాయి. అవి నిర్వాణ, ఐతరేయ, బహ్-వ్రిచ, సౌభాగ్య, కౌశీతకి, ముద్గల, నాదబిందు, త్రిపుర, ఆత్మ ప్రభోద మరియూ అక్షరమాలిక అని పది ఉపనిషత్తులుగా ఉంటాయి.

 2. యజుర్వేదము :

అజస్యపీత వర్ణస్యాత్ యజుర్వేదో అక్షసూత్ర ద్రుత్ |
వామే కులిసపాణిస్తూ భూతిదో మంగళప్రదః ||

మేక ముఖం కలిగి పసుపు రంగులో ఉంటాడు. ఎడమ చేతిలో కర్ర పట్టుకొని ఉంటాడు. సంపదలని, శుభముని ఇచ్చేలా ఉంటాడు. యజుర్వేద పురుషుడిని ఇలా దర్శించారు.

యజుర్వేదం రెండు భాగాలు ఉంటుంది.

౧. శుక్ల యజుర్వేదం
౨. కృష్ణ యజుర్వేదం.

శుక్ల యజుర్వేదం కాన్వ మరియూ మాద్యందిన అనే శాఖలుగా ఉంటుంది. కృష్ణ యజుర్వేదం తైత్తిరీయ, మైత్రాయణి, కఠ మరియూ కపిస్తల అనే శాఖలుగా ఉంటుంది.
కాన్వ శాఖ 40 అధ్యాయాలు, 328 అనువాకాలు, 2086 మంత్రాలుగా ఉంటుంది. మాద్యందిన 40 అధ్యాయాలు, 303 అనువాకాలు, 1975 మంత్ర ఖండాలు, 3988 మంత్రాలు, 29626 పదాలు, 88875 అక్షరాలుగా ఉంటుంది. ఇంత లెక్కతో జాగ్రత్తగా బద్రపరిచారు. తైత్తిరీయ శాఖ 7 ఖాండాలు, 44 ప్రపాతకాలు, 635 అనువాకాలుగా ఉంటుంది. మైత్రాయణి శాఖ 4 ఖాండాలు, 54 ప్రపాతకాలు, 2144 మంత్రాలుగా ఉంటుంది. కఠ శాఖ 5 ఖాండాలు, 40 ఆధ్యాయాలు, 13 అనువాచకాలు, 843 అనువాకాలు మరియూ 3091 మంత్రాలుగా ఉంటుంది. బ్రహ్మణాలు చరక, కాతక, తుంబుర, జాబల, కన్కతి, స్వేతాస్వేతర, మైత్రాయణి, ఖాందికేయ, హారిద్ర, ఆహ్వరాక, ఔకేయ మరియూ చాగలేయ అనే శాఖలుగా ఉంటుంది. శుక్ల యజుర్వేద ఉపనిషత్తులు ఈసావాస్య, బృహదారణ్యక, జాబాల, సుభాల మొదలైనవి. కృష్ణ యజుర్వేద ఉపనిషత్తులు కఠ, తైత్తిరీయ, స్వేతాస్వేతర మొదలైనవి.

 3. సామవేదము :

నీలోత్పలధలశ్యామోః సామవేదో హయాననః |
అక్షమాలాఅన్వితోదక్షే వామే కుంభదారణ స్మృతః ||

కృష్ణుడి వంటి నీలి రంగులో, గుఱ్ఱపు ముఖం కలిగి, ఒక చేతిలో కొరడా కలిగి, ఎడమ చేతిలో కుండ కలిగి ఉంటాడు. సామ వేద పురుషుడిని ఇలా దర్శించారు.

సామవేదం మొత్తం 1065 శాఖలుగా ఉంటుంది. అందులో ముఖ్యమైనవి తొమ్మిది. రాణాయణ, సాట్యాయన, సార్యముగ్ర, కల్వల, మహా కల్వల, లాంగల, కౌతుమీయ, గౌతమీయ, జైమినీయ అని ముఖ్య శాఖలు. అందులో రాణాయణ,కౌతుమీయ మరియూ జైమినీయ అనేవి మాత్రం ఉన్నాయి. మిగతా శాఖలు లభించడం లేదు.

సామవేద సంహితలు పూర్వర్చిక, ఉత్తరార్చిక మరియూ ఆరణ్యకాలుగా ఉంటుంది. పూర్వర్చిక 6 ప్రాతకాలు, 59 దషతీలు, 585 మంత్రాలుగా ఉంటుంది. ఉత్తరార్చిక 9 ప్రాతకాలు, 120 దషతీలు, 1220 మంత్రాలుగా ఉంటుంది. ఆరణ్యకాలు 55 మంత్రాలుగా ఉంటుంది.
బ్రాహ్మణాలు భాల్లవి, కాలబవి, రౌరుకి, సాట్యాయన అని నాలుగు భాగాలుగా ఉంటుంది.

ఉపనిషత్తులు చాందోగ్య, కేన, మైత్రాయణి, తల్వకారీయ మరియూ మహోపనిషత్తులుగా ఉంది.

 4. అధర్వణవేదము:

ఆధర్వణాభిదో వేదో ధవళో మర్కటాననః |
అక్షమాలాన్వితో వామే దక్షే కుంభదరః స్మృతః ||

తెలుపు రంగులో, కోతి ముఖం కలిగి, కుడి చేతిలో మాల ధరించి, కుడిచేతిలో కుండ కలిగి ఉంటాడు. ఆదర్వణ వేద పురుషుడిని ఇలా దర్శించారు.ఆదర్వణ వేదం 15 శాఖలు, 20 ఖండాలు, 736 సూక్తాలుగా ఉంటుంది. పైప్పాలద, సౌనక అనే శాఖలు మాత్రం లభిస్తున్నాయి.
శిల్పవేదం ఉపవేదంగా ఉంది.
By
Dr. Nerella Rajasekhar.
 దీనిని నేను మీకు అందించుచున్నాను.
🌷. శ్రీ శివ మహా పురాణము - 139 🌷
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
33. అధ్యాయము - 8

🌻. శబ్ద బ్రహ్మ - 4 🌻

ఏవం శబ్దమయం రూపమగుణస్య గుణాత్మనః | దృష్ట్వా తముమయా సార్ధం కృతార్ధోsభూన్మయా హరిః || 40

ఏవం దృష్ట్వా మహేశానం శబ్ద బ్రహ్మతనుం శివమ్‌ | ప్రణమ్య చ మయా విష్ణుః పునశ్చాపశ్యదూర్ధ్వతః || 41

ఓం కారప్రభవం మంత్రం కలాపంచక సంయుతమ్‌ | శుద్ధస్ఫటికం సంకాశం శుభాష్టత్రింశదక్షరమ్‌ || 42

మేధాకార మభూద్భూయస్సర్వదర్మార్ధసాధకమ్‌ | గాయత్రీ ప్రభవం మంత్రం సహితం వశ్యకారకమ్‌ || 43

చతుర్వింశతివర్ణాఢ్యం చతుష్కల మనుత్తమమ్‌ |

నేను మరియు విష్ణువు, నిర్గుణుడే అయిననూ గుణస్వరూపుడైన శివుని ఉమాసహితమైన ఈ శబ్దమయ రూపమును గాంచి కృతార్థులమైతిమి (40).

ఈ విధముగా నాదబ్రహ్మ రూపములో శివుని దర్శించి, నమస్కరించి, విష్ణువు మరియు నేను మరలపైకి చూచితిమి (41). …
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 10 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 4
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. వరాహావతార వర్ణనము - 2 🌻

వక్ష్యే పరశురామస్య చావతారం శృణు ద్విజ | ఉద్ధతాన్‌ క్షత్రియాన్‌ మత్వా భూభార హరణాయ సః. 12

అవతీర్ణో హరిః శాన్త్యై దేవవిప్రాదిపాలకః | జమదగ్నే రేణుకాయాం భార్గవః శస్త్రపారగః. 13

ఓ బ్రాహ్మణా! పరశురాముని అవతారమును గూర్చి చెప్పెదను వినుము. ఆ శ్రీమహావిష్ణువు, క్షత్రియులు ఉద్దతులుగా ఉన్నా రని తలచి, భూబారమును హరించుటకై, దేవతలను, విప్రాదులను పాలింపనున్నవాడై, శాంతిని నెలకొల్పుటకై, జమదగ్నినుండి రేణుకయందు సర్వశాస్త్రవిద్యాపారంగతు డైన భార్గవుడుగా (పరశురాముడుగా) ఆవతరించినాడు.

దత్తాత్రేయప్రసాదేన కార్తవీర్యో నృపస్త్వభూత్‌ | సహస్రబాహుః సర్వోర్యీపతిః స మృగయాం గతః. 14

కార్తవీర్యుడను రాజు దత్తత్రేయుని అనుగ్రహముచే వేయిబాహువులు కలవాడుగను, సకల భూమండలమునకును రాజుగను ఆయెను. అతడు వేటకు వెళ్లెను.

శ్రాన్తో నిన్త్రితో7రణ్య మునినా జమదగ్నినా | కామధేనుప్రభావేణ భోజితః సబలో నృపః. 15

అరణ్యములో అలసిన సేనానమేతు డైన ఆ రాజును జమదగ్ని మహర్షి నిమంత్రించి కామధేనవు ప్రభావముచేత భోజనము పెట్టెను.

అప్రార్థయత్కామధేను యదా స న దదౌ తదా | హృతవానథ రామేణ శిరశ్ఛిత్వా నిపాతితః. 16

యుద్ధే పరశునా రాజా సధేనుః స్వాశ్రమం య¸° |

కార్తవీర్యార్జునుడు ఆ కామధేనువును తన కిమ్మని కోరెను. జమదగ్ని ఈయ నిరాకరించెను. ఆపుడాతడు దానిని అపహరించెను. పిదప పరశురాముడు యుద్దములో పరశువుచే అతని శిరస్సు ఛేదించి సంహరించి ధేనువుతో ఆశ్రమమునకు తిరిగి వెళ్లెను.

కార్తవీర్యస్య పుత్త్రెస్తు జమదగ్నిర్ని పాతితః.
రామే వనం గతే వైరాదథ రామః సమాగతః | 17

 పితరం నిహతం దృష్ట్వా పితృనాశాభిమర్షితః. 18

త్రిఃసప్తకృత్వః పృథివీం నిఃక్షత్రామకరోద్విభుః |
కురుక్షేత్రే పఞ్చకుణ్డాన్‌ కృత్వా సన్తర్ప్య వై పితౄన్‌.
కశ్యపాయ మహీం దత్వా మహేన్ద్రే పర్వతే స్థితః | 19

పరశురాముడు వనమునకు వెళ్ళి యుండగా కార్తవీర్యుని పుత్రులు పూర్వవైరమువలన జమదగ్నిని చంపిరి. అంత తిరిగి వచ్చిన ప్రభావశాలి యగు పరశురాముడు చంపబడిన తండ్రిని చూచి, తండ్రిని ఆ విధముగ చంపుటచే కోపించి, ఇరువదియొక్క పర్యాయములు పృథివిని క్షత్రియులు లేనిదానినిగాచేసి, కురుక్షేత్రమునందు ఐదు కుండములను చేసి, వాటితో పితృదేవతలను తృప్తిపరచి, భూమి నంతను కశ్యపునకు దానము చేసి, మహేంద్రపర్వతముపై నివసించెను.

కూర్మస్య చ వరాహస్య నృసింహస్య చ వామనమ్‌ |
అవతారం చ రామస్య శ్రుత్వా యాతి దివం నరః. 20

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే వరాహనృసింహాద్యవతారో నామ చతుర్థోధ్యాయః.

కూర్మ, వరాహ, నరసింహ, పరశురామావతారగథలు విన్న మానవుడు స్వర్గమునకు వెళ్లును.

అగ్ని మహా పురాణములో వరాహనృసింహాద్యవతార మనెడు చతుర్థాధ్యాయము సమాప్తము.

సశేషం......
🌹 🌹 🌹

న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలు

న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలు

న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలను సందర్శించాలనుకునే వారు రాష్ట్రఎల్లలు దాటి పోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే చాలా క్షేత్రాలలో నవగ్రహ పూజలు చేసుకోవచ్చు. అలాంటివి మన రాష్ట్రంలోనే చాలా జిల్లాలలో ఉన్నాయి. వీటన్నింట నవగ్రహపూజలు చేసుకోవచ్చు.

సూర్యుడు

శ్రీ‌కాకుళం జిల్లా 1.హ‌ర్షవ‌ల్లి సూర్యనారాయ‌ణ స్వామి
తూర్పుగోదావ‌రి 2. పెద్దాపురం సూర్యనారాయ‌ణ స్వామి
తూర్పగోదావ‌రి 3. గొల్లల‌మామిడాడ సూర్యనాయ‌ణ స్వామి
క‌ర్నూలు 4. నందికొట్టూరు సూర్యనారాయ‌ణ స్వామి

చంద్రుడు

ప‌శ్చిమ గోదావ‌రి 1. గునుగుపూడిలో సోమేశ్వర స్వామి (భీమ‌వ‌రం).
తూర్పుగోదావ‌రి 2. కోటే ప‌ల్లి సోమేశ్వర స్వామి
కృష్ణ 3. విజ‌య‌వాడ‌లో క‌న‌క‌దుర్గాదేవి, పెద్దక‌ళ్ళే ప‌ల్లెలో దుర్గాదేవి.
నెల్లూరు 4. జొన్నవాడ కామాక్షిత‌యారు అమ్మవారు.

అంగార‌కుడు
కృష్ణ 1. మోపిదేవి సుబ్రమ‌ణ్యస్వామి మ‌రియు చోడ‌వ‌రం
తూర్పుగోదావ‌రి 2.బిక్కవోలు సుబ్రమ‌ణ్యస్వామి మ‌రియు పెద్దాపురం
గుంటూరు 3.పెద్ద నంది పాడు, నాగుల పాడు పుట్ట, పెద్దకూర‌పాడు పుట్ట, మంగ‌ళ‌గిరి సుబ్రమ‌ణ్య స్వామి, పొన్నూరు.

బుదుడు

ప‌శ్చిమ గోదావ‌రి 1. ద్వార‌కా తిరుమ‌ల‌
తూర్పుగోదావ‌రి 2. ర్యాలీ, అన్నవ‌రం, పిఠాపురం కుంతీమాధ‌వ స్వామి.
కృష్ణ 3.శ్రీ కాకుళంలో ఆంధ్రా మ‌హావిష్ణువు.
చిత్తూరు 4.తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వర స్వామి.

బృహ‌స్పతి

గుంటూరు 1. చేబ్రోలు బ్రహ్మ దేవుడు.
మ‌హ‌బూబ్ న‌గ‌ర్ 2. అలంపురంలో బ్రహ్మదేవుడు.
తూర్పగోదావ‌రి 3.కోటి ప‌ల్లోలో కోటిలింగేశ్వర స్వామి. మంద‌ప‌ల్లిలో బ్రహే్శ్వర స్వామి.
గుంటూరు 4. అమ‌రావ‌తిలో అమ‌ర‌లింగేశ్వర స్వామి. , కోట‌ప్పకొండ త్రికూటేశ్వర స్వామి.

శుక్రుడు

విశాఖ 1. విశాఖ ప‌ట్టణం క‌న‌క‌మ‌హాల‌క్ష్మి, పింహాచ‌లం ల‌క్ష్మీ దేవి.
చిత్తూరు 2. అలిమేలు మంగాపురం, ప‌ద్మావ‌తీ దేవి.
నెల్లూరు 3. పెంచ‌ల‌కోన ఆది ల‌క్ష్మీదేవి.
శ‌ని

తూర్పగోదావ‌రి 1. మంద‌ప‌ల్లెలో మందేశ్వర స్వామి.
అనంత‌పురం 2. హిందుపురం తాలూకా పావ‌గ‌డ‌లోని శ‌నిమ‌హాత్ముడు
కృష్ణ 3. విజ‌య వాడ‌లోని కృష్ణన‌ది తీరాన జ్యేష్ణదేవి స‌హిత శ‌నైశ్చర్య స్వామి
ప్రకాశం 4. న‌ర్శింగోలు (సింగ‌రాయ కొండ వ‌ద్ద) శ‌నీశ్వర స్వామి.

రాహువు, కేతువు
చిత్తూరు 1. శ్రీ కాళ‌హ‌స్తి
తూర్పుగోదావ‌రి 2. మంద‌మ‌ల్లి నాగశ్వర స్వామి
కృష్ణ 3. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గా దేవి.
విశాఖ 4. సంప‌త్ వినాయ‌క స్వామి.
గుంటూరు 5. అమ‌రావ‌తి వినాయ‌క‌స్వామి, తెనాలి వైకుంఠ‌పురం పుట్ట.

గ‌మ‌నిక‌
:
 ఈ క్షేత్ర ద‌ర్శన‌ముల‌న్నియు ఒక్క వార‌ము రోజుల‌లో పూర్తి చేసిన‌చో త‌గిన ప‌లిత‌ములు పొందుతారు.
By
Dr. Nerella Rajasekhar.

శ్రీ ఆదిశంకరాచార్య విరచిత– శ్రీ నృసింహ మంత్రరాజపద స్తోత్రం

శ్రీ ఆదిశంకరాచార్య విరచిత– శ్రీ నృసింహ మంత్రరాజపద స్తోత్రం
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩

పార్వత్యువాచ :–

మన్త్రాణాం పరమం మన్త్రం గుహ్యానాం గుహ్యమేవ చ |

బ్రూహి మే నారసింహస్య తత్త్వం మన్త్రస్య దుర్లభమ్ ||


శంకర ఉవాచ :–

1)వృత్తోత్ఫుల్లవిశాలాక్షం విపక్షక్షయదీక్షితం |

నినాదత్రస్తవిశ్వాణ్డం విష్ణుముగ్రం నమామ్యహమ్ ||


2) సర్వైరవధ్యతాం ప్రాప్తం సబలౌఘం దితేస్సుతం |

నఖాగ్రైశ్శకలీచక్రేయస్తం వీరం నమామ్యహమ్ ||


3) పాదావష్టబ్ధపాతాళం మూర్ధాఽఽవిష్టత్రివిష్టపం |

భుజప్రవిష్టాష్టదిశం మహావిష్ణుం నమామ్యహమ్ ||


4) జ్యోతీంష్యర్కేన్దు నక్షత్రజ్వలనాదీన్యనుక్రమాత్ |

జ్వలన్తి తేజసా యస్య తం జ్వలన్తం నమామ్యహమ్ ||


5) సర్వేన్ద్రియైరపి వినా సర్వం సర్వత్ర సర్వదా |

జానాతి యో నమామ్యాద్యం తమహం సర్వతోముఖమ్ ||


6) నరవత్సింహవచ్చైవ రూపం యస్య మహాత్మనః |

మహాసటం మహాదంష్ట్రం తం నృసింహం నమామ్యహమ్ ||


7) యన్నామస్మరణాద్భీతా భూతవేతాళరాక్షసాః |


రోగాద్యాశ్చ ప్రణశ్యన్తి భీషణం తం నమామ్యహమ్ ||


8) సర్వేఽపి యం సమాశ్రిత్య సకలం భద్రమశ్నుతే |

శ్రియా చ భద్రయా జుష్టో యస్తం భద్రం నమామ్యహమ్ ||


9) సాక్షాత్స్వకాలే సమ్ప్రాప్తం మృత్యుం శత్రుగణానపి |

భక్తానాం నాశయేద్యస్తు మృత్యుమృత్యుం నమామ్యహమ్ ||


10) నమస్కారాత్మకం యస్మై విధాయాత్మనివేదనం |

త్యక్తదుఃఖోఽఖిలాన్కామానశ్నుతే తం నమామ్యహమ్ ||



11) దాసభూతాస్స్వతస్సర్వే హ్యాత్మానః పరమాత్మనః |

అతోఽహమపి తే దాస ఇతి మత్వా నమామ్యహమ్ ||


శంకరేణాదరాత్ప్రోక్తం పదానాం తత్త్వముత్తమం |

త్రిసన్ధ్యం యో జపేత్తస్య విద్యాఽఽయుశ్శ్రీశ్చ వర్ధతే ||


ఇతి శ్రీ శంకరకృత శ్రీనృసింహమంత్రరాజపదస్తోత్రమ్ ||

🕉🌞🌏🌙🌟🚩


ఓం శ్రీ గురుభ్యో నమః .ఓం శ్రీ మాత్రే నమః.
  శ్లో// యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ /
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే//
(ఎవరిని స్మరించినంత మాత్రాన మనము జన్మ, జరా, విపత్తి, మరణాలనే సంసార బంధాలనుండి విముక్తులమవుతామో, సర్వ సమర్ధుడైన ఆ మహావిష్ణువునకు నమస్కారము)

చతుర్విధ పురుషార్ధములు సాధించగలిగే మనుష్య జన్మ వచ్చినంత మాత్రాన ప్రయోజనం లేదు." ఈశ్వరుని యందు భక్తి" ఉండాలి.భక్తి ఉంటే ఏ జన్మ అయినా ఫరవాలేదు,అని శ్రీ శంకర భగవత్పాదులవారుచెప్పిన విషయాన్నే,"శ్రీ ధూర్జటి మహాకవి" ఈ విధంగా చెబుతున్నారు:
" ఏ వేదంబు పఠించె లూత, భుజగంబే శాస్త్రముల్ జూచె దా/
నే విద్యాభ్యసనం బొనర్చె కరి, చెంచేమంత్ర మూహించె బో/
ధావిర్భావనిదానముల్ చదువులయ్యా! కావు! మీ పాద సం/
సేవాసక్తియే కాక జంతు తతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా//
(శ్రీకాళహస్తీశ్వరా! నీవు, సాలె పురుగునకు    (లూత),మోక్షం ఇచ్చావు.
పాముకు (భుజగం),ఏనుగునకు(కరి), చెంచునకు(భక్తకన్నప్ప లేక తిన్నడు), మోక్షమును ఇచ్చావు.
సాలెపురుగు, ఏ వేదాలు వల్లించ లేదు.
పాము ఏ శాస్త్రావలోకనము చెయ్యలేదు.
ఏనుగు ఏ విద్యలు అభ్యసించ లేదు.
చెంచు ఏ మంత్ర జపము చెయ్యలేదు.
కేవలము వారికి నీయందు ఉన్న భక్తి వల్ల మోక్షమును ఇచ్చావు.
కాబట్టి వేదపఠనము,శాస్త్రములు చడవడము, అరవైనాలుగు విద్యలు నేర్చుకోవడము, మంత్రాలు జపించడము, మోక్షాన్ని ఇవ్వలేవు. మీ పాదపద్మముల యందు భక్తి మాత్రమే సమస్త జీవులకు ముక్తిని ఇస్తుంది)
శ్లో// అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే/
తేషాం నిత్యాభి యుక్తానాం యోగక్షేమం వహామ్యహం//
(ఏ జనులు మనస్సులో వేరే ఆలోచనలు లేకుండా, నన్నే స్మరిస్తూ ఆరాధిస్తున్నారో, నిత్యమూ నాయందు ఏకాగ్రచిత్తంతో ఉన్న ఆటువంటి వారి యోగ క్షేమములను నేనే వహిస్తాను),
అని శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో చెప్పారు.

సర్వోత్తమమైన ఆ భక్తి మార్గాన్ని ఆశ్రయించి మనం జన్మసాఫల్యం పొందుదాం.
ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే.
[10:11, 09/05/2020] +91 90009 72611:
ఓం శ్రీ గురుభ్యో నమః.
 

8, మే 2020, శుక్రవారం

శ్రీ ఆది శంకరాచార్య విరచితం ..... గురు అష్టకము


ఓం నమః శివాయ:
శ్రీ ఆది శంకరాచార్య విరచితం
గురు అష్టకము
🔥ఓంశ్రీమాత్రే నమః🔥

“నిజమైన గురువుకి సమానమైనదానిని మూడులోకాలలోను చెప్పలేము. పరుసవేది దేన్నైనా బంగారంగా మార్చుతుందేమో కాని ఇంకొక పరుసవేదిగా మార్చదు. కాని ఒక గురువు తన్ను నమ్మి శరణుజొచ్చిన శిష్యుడిని తనంతటివాడిని చేస్తాడు. కాబట్టి గురువు అసమానుడు. అల్ప బుద్ధి కలవాణ్ణి కూడా పండితుణ్ణి చెయ్యగలడు గురువు.

జగద్గురువులైన ఆదిశంకరులు గురువు గురించి చాలా గొప్పగా చెబుతారు. వారు ఒకచోట అడుగుతారు,“ఎన్ని ఉన్నా, మనస్సు గురు పాదములను పట్టుకోకపోతే ఏమిటి దాని ఉపయోగం?”అని. వారి రచించిన ‘గురు అష్టకం’లో ప్రతి చోట అడుగుతారు. ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? అని. ఎనిమిది శ్లోకములలోను  దీన్ని మకుటంగా ఉంచి మనల్ని ప్రశ్నిస్తున్నారు.

శ్రీశంకర భగవత్పాదులు రచించిన గురు అష్టకం శిష్యునికి ఉండాల్సిన ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదిస్తుంది. శిష్యుడికి ఉండాల్సింది గురువు మీద నమ్మకం, విశ్వాసం. మనకు ఎవరిమీద ఐతే గురి కలుగుతుందో వారే గురువు.


శ్రీ శంకరాచార్య విరచిత గురు అష్టకం:-  
ॐॐॐॐॐॐॐॐ

1) శరీరం సురూపం తథా వా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్॥

మంచి దేహధారుడ్యము, అందమైన భార్య, పేరు ప్రతిష్టలు, మేరు సమానమైన ధనం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

2)కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం  గృహం బాంధవాః సర్వ మేతద్ద్విజాతం!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

భార్య, ధనము, పిల్లలు, వారి పిల్లలు, ఇళ్ళు, బంధువులు, గొప్ప వంశంలో జన్మ ఉన్నప్పటికి గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

3) షడంగాదివేదో ముఖే శాస్త్రవిద్యా  కవిత్వాది గద్యం సుపద్యం కరోతి!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

ఆరు వేదాంగములు (శిక్ష, చందస్సు, వ్యాకరణం, నిరుక్త, కల్ప, జ్యోతిష్య), నాలుగు వేదాలు, గద్య పద్య రాయగల జ్ఞానం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

4) విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః సదాచారవృత్తేషు మత్తో న చాన్యః!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

విదేశాలలో మంచి పేరు, స్వదేశంలో హోదా పలుకుబడి, అందరూ మెచ్చే గుణము, మంచి జీవితం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

5) క్షమామండలే భూపభూపాలవృందౌసదా సేవితం యస్య పాదారవిందమ్!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

గొప్ప రాజ్యానికి చక్రవర్తివైనా, రాజులు మహారాజుల చేత సేవింపబడుతున్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

6) యశో మే గతం దిక్షు దానప్రతాపాత్ జగద్వస్తు సర్వం కరే సత్ప్రసాదాత్!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

నీ ఖ్యాతి నలుదెశలా వ్యాపించి ప్రపంచమంతా నీ దయాగుణాన్ని ప్రశంచించినా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

7) న భోగే న యోగే న వా వాజిరాజౌ న కాన్తాసుఖే నైవ విత్తేషు చిత్తం!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

భోగము, యోగము, ఇష్టము, అగ్నికార్యము, విషయ సుఖము, విత్తములపై నీ మనస్సు విరక్తి పొందినా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

8) అరణ్యే న వా స్వస్య గేహే న కార్యే న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

నీ మనస్సు అరణ్యమున ఉన్నా, ఇంట్లో ఉన్న, సమాన్య విషయములపై తిరుగుతూ ఉన్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

9) అనర్ఘ్యాణి రత్నాది ముక్తాని సమ్యక్ సమాలింగితా కామినీ యామినీషు!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

వెలకట్టలేని మణులు, రత్నాలు, వజ్రవైఢూర్యాలు సదా నిన్ను అనిగమించే అంటిపెట్టుకునే భార్య ఉన్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

10) గురోరష్టకం యః పఠేత్పుణ్యదేహీ యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ !
లభేత్ వాంఛితార్థ పదం బ్రహ్మసంజ్ఞం గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నం ॥

ఫలశ్రుతి:-

ఎవరైతే ఈ గుర్వాష్టకాన్ని చెదువుతారో,నేర్చుకుంటారో, మననం చేస్తారో, గురువు చెప్పిన విషయాలను నిత్యం స్మరిస్తూ గురు పాదపద్మములపై మనస్సు లగ్నం చేస్తారో,అటువంటివారు యోగి అయినా, సన్యాసి అయినా, రాజు అయినా, బ్రహ్మచారి అయినా, గృహస్
తు అయినా తనికి శాశ్వత పరతత్వమగు పరబ్రహ్మం సిద్ధిస్తుంది.

సదాశివ సమారంభాం, శంకరాచార్య మధ్యమాం!
అస్మదాచార్య పర్యంతం, వందే గురు పరంపరాం!!

🕉🌞🌎🌙🌟🚩

మంచి దేహధారుడ్యము, అందమైన భార్య, పేరు ప్రతిష్టలు, మేరు సమానమైన ధనం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

భార్య, ధనము, పిల్లలు, వారి పిల్లలు, ఇళ్ళు, బంధువులు, గొప్ప వంశంలో జన్మ ఉన్నప్పటికి గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

ఆరు వేదాంగములు (శిక్ష, చందస్సు, వ్యాకరణం, నిరుక్త, కల్ప, జ్యోతిష్య), నాలుగు వేదాలు, గద్య పద్య రాయగల జ్ఞానం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

విదేశాలలో మంచి పేరు, స్వదేశంలో హోదా పలుకుబడి, అందరూ మెచ్చే గుణము, మంచి జీవితం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

గొప్ప రాజ్యానికి చక్రవర్తివైనా, రాజులు మహారాజుల చేత సేవింపబడుతున్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

నీ ఖ్యాతి నలుదెశలా వ్యాపించి ప్రపంచమంతా నీ దయాగుణాన్ని ప్రశంచించినా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

భోగము, యోగము, ఇష్టము, అగ్నికార్యము, విషయ సుఖము, విత్తములపై నీ మనస్సు విరక్తి పొందినా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

నీ మనస్సు అరణ్యమున ఉన్నా, ఇంట్లో ఉన్న, సమాన్య విషయములపై తిరుగుతూ ఉన్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

వెలకట్టలేని మణులు, రత్నాలు, వజ్రవైఢూర్యాలు సదా నిన్ను అనిగమించే అంటిపెట్టుకునే భార్య ఉన్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

--(())--

ఎవరైతే ఈ గుర్వాష్టకాన్ని చెదువుతారో,నేర్చుకుంటారో, మననం చేస్తారో, గురువు చెప్పిన విషయాలను నిత్యం స్మరిస్తూ గురు పాదపద్మములపై మనస్సు లగ్నం చేస్తారో,అటువంటివారు యోగి అయినా, సన్యాసి అయినా, రాజు అయినా, బ్రహ్మచారి అయినా, గృహస్
తు అయినా తనికి శాశ్వత పరతత్వమగు పరబ్రహ్మం సిద్ధిస్తుంది.

6, మే 2020, బుధవారం

శ్రీ నృసింహ స్తంభావిర్భావ స్తోత్రం


శ్రీమచ్ఛంకరభగవత్పాదపూజ్యకృత శివషడక్షరీస్తోత్రం
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

శ్రీ శివ షడక్షరీ స్తోత్రమ్

1) ‖ఓం ఓం‖
ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః |కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమోనమః ‖
2) ‖ఓం నం‖
నమంతి మునయః సర్వే నమంత్య ప్సరసాం గణాః | నరాణామాదిదేవాయ నకారాయ నమోనమః ‖
3) ‖ఓం మం‖
మహాతత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం | మహాపాపహరం తస్మాన్మకారాయ నమోనమః ‖
4) ‖ఓం శిం‖
శివం శాంతం శివాకారం శివాను గ్రహకారణం | మహాపాపహరం తస్మాచ్ఛికారాయ నమోనమః ‖
5) ‖ఓం వాం‖
వాహనం వృషభో యస్య వాసుకిః కంఠభూషణం | వామే శక్తిధరం దేవం వకారాయ నమోనమః ‖
6) ‖ఓం యం‖
యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభం |యం నిత్యం పరమానందం యకారాయ నమోనమః ‖
షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ |తస్య మృత్యుభయం నాస్తి హ్యపమృత్యు భయం కుతః ‖

శివశివేతి శివేతి శివేతి వా| భవభవేతి భవేతి భవేతి వా |
హరహరేతి హరేతి హరేతి వా| భుజమనశ్శివమేవ నిరంతరమ్ ‖


ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమచ్ఛంకరభగవత్పాదపూజ్యకృత శివషడక్షరీస్తోత్రం సంపూర్ణమ్ ||

🕉️🌞🌏🌙🌟🚩

శివలింగం నిర్గుణ పరతత్వ స్వరూపం. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. భక్తులు ఏ రూపంతో పూజించినా, ఏ విధంగా అర్చించినా, ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పరతత్వం ఒకటే. ఈ విధమైన పరతత్వానికి రూపం, ఆకారం, అవయవాలు లేవు. ఈ సత్య విషయాలను తెలియజెప్పే తత్వస్వరూపమే "లింగం".

లింగాభిషేకములో పరమార్ధం :- పానిపట్టుపై శివలింగం అంటే మానవుని హృదయపద్మంపై ఆత్మలింగము. పంచామృతాభిషేకం:- భక్తీ, మంత్రజపం, నామస్మరణం, ధ్యానం, కీర్తనాలతో దైవాభిషేకం చేయాలి. జలధారా పాత్ర అనన్య అచంచల నిరంతర సాధనాభక్తికి చిహ్నం, లింగం జీవాత్మకు సంకేతం. జీవాత్మ పరమాత్మలను అనుసంధానం కావించే సాధనమే అభిషేకం.

🕉️🌞🌏🌙🌟🚩

శ్రీ రంగనాథాష్టకం

శ్త్రే్ేే్ేే్ే్ేే్ే

1)ఆనందరూపే నిజబోధరూపే బ్రహ్మస్వరూపే శ్రుతిమూర్తిరూపే |

శశాంకరూపే రమణీయరూపే శ్రీరంగరూపే రమతాం మనో మే ||


2)కావేరితీరే కరుణా విలోలే మందారమూలే ధృత చారుకేలే |

దైత్యాంతకాలేఽఖిలలోకలీలే శ్రీరంగలీలే రమతాం మనో మే ||


3)లక్ష్మీనివాసే జగతాం నివాసే హృత్పద్మవాసే రవిబింబవాసే |

కృపానివాసే గుణవృందవాసే శ్రీరంగవాసే రమతాం మనో మే ||


4)బ్రహ్మాదివంద్యే జగదేకవంద్యే ముకుందవంద్యే సురనాథవంద్యే |

వ్యాసాదివంద్యే సనకాదివంద్యే శ్రీరంగవంద్యే రమతాం మనో మే ||


5)బ్రహ్మాదిరాజే గరుడాదిరాజే వైకుంఠరాజే సురరాజరాజే |

త్రైలోక్యరాజేఽఖిలలోకరాజే శ్రీరంగరాజే రమతాం మనో మే ||


6)అమోఘముద్రే పరిపూర్ణనిద్రే శ్రీయోగనిద్రే ససముద్రనిద్రే |

శ్రితైకభద్రే జగదేకనిద్రే శ్రీరంగభద్రే రమతాం మనో మే || 


7)సచిత్రశాయీ భుజగేంద్రశాయీ నందాంగశాయీ కమలాంగశాయీ |

క్షీరాబ్ధిశాయీ వటపత్రశాయీ శ్రీరంగశాయీ రమతాం మనో మే ||


8)ఇదం హి రంగం త్యజతామిహాంగం పునర్నశాంగం యది శాంగమేతి |

పాణౌ రథాం
గం చరణేంబు కాంగం యానే విహంగం శయనే భుజంగమ్ ||


9)రంగనాథాష్టకం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |

సర్వాన్కామానవాప్నోతి రంగిసాయుజ్యమాప్నుయాత్ ||

🕉🌞🌎🌙🌟🚩
💎💥💎💥💎💥💎

శ్రీ శారదా భుజంగ ప్రయాతాష్టకం
ఓంశ్రీమాత్రే నమః - ఓంశ్రీరాం - ప్రాంజలి ప్రభ 



1)సువక్షోజకుంభాం సుధాపూర్ణకుంభాం ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబామ్ |
సదాస్యేందుబింబాం సదానోష్ఠబింబాం భజే శారదాంబా మజస్రం మదంబామ్ || 

2)కటాక్షే దయార్ద్రాం కరే జ్ఞానముద్రాం కలాభిర్వినిద్రాం కలాపైః సుభద్రామ్ |
పురస్త్రీం వినిద్రాం పురస్తుంగభద్రాం  భజే శారదాంబా మజస్రం మదంబామ్ || 

3)లలామాంకఫాలాం లసద్గానలోలాం స్వభక్తైకపాలాం యశశ్శ్రీకపోలామ్ |
కరే త్వక్షమాలాం కనత్పత్రలోలాం భజే శారదాంబా మజస్రం మదంబామ్ || 

4)సుసీమంతవేణీందృశా నిర్జితైణీం రమత్కీరవాణీం నమద్వజ్రపాణీమ్ |
సుధామంథరాస్యాంముదా చింత్యవేణీం భజే శారదాంబా మజస్రం మదంబామ్ || 

5)సుశాంతాం సుదేహాం దృగన్తే కచాంతాం లసత్సల్లతాంగీ మనంతా మచిన్త్యామ్ |
స్మరేత్తాపసైః సర్గ పూర్వస్థితాం తాం భజే శారదాంబా మజస్రం మదంబామ్ || 

6)కురంగే తురంగే మృగేంద్రే ఖగేంద్రే మరాలే మదేభే మహోక్షేఽధిరూఢామ్ |
మహత్యాం నవమ్యాం సదా సామరూపాం  భజే శారదాంబా మజస్రం మదంబామ్ || 

7)జ్వలత్కాంతివహ్నిం జగన్మోహనాంగీం  భజే మానసాంభోజ సుభ్రాంతభృంగీమ్ |
నిజస్తోత్రసంగీత నృత్య ప్రభాంగీం  భజే శారదాంబా మజస్రం మదంబామ్ || 

8)భవాంభోజనేత్రాజ   సంపూజ్య మానాం లసన్మందహాస ప్రభావక్త్రచిహ్నామ్ |
చలచ్చంచలాచారుతాటంకకర్ణో  భజే శారదాంబా మజస్రం మదంబామ్ || 

🕉🌞🌎🌙🌟🚩

శ్రీ నృసింహ స్తంభావిర్భావ స్తోత్రం
ఓంశ్రీమాత్రే నమః  ఓం శ్రీ రామ్


1) సహస్రభాస్కరస్ఫురత్ప్రభాక్షదుర్నిరీక్షణంప్రభగ్నకౄరకృద్ధిరణ్యకశ్యపోరురస్థలమ్ |

అజస్తృజాండకర్పరప్రభిగ్నరౌద్రగర్జనం ఉదగ్రనిగ్రహాగ్రహోగ్రవిగ్రహాకృతిం భజే ||


2) స్వయంభుశంభజంభజిత్ప్రముఖ్యదివ్యసంభ్రమం ద్విజృంభమధ్యదుత్కటోగ్రదైత్యకుంభకుంభినిన్ |

అనర్గళాట్టహాసనిస్పృహాష్టదిగ్గజార్భటిన్ యుగాంతిమాంతమత్కృతాంతధిక్కృతాంతకం భజే ||


3) జగజ్వలద్దహద్గ్రసత్ప్రహస్ఫురన్ముఖార్భటిం మహద్భయద్భవద్దహగ్రసల్లసత్కృతాకృతిమ్ |

హిరణ్యకశ్యపోసహస్రసంహరత్సమర్థకృ- -

న్ముహుర్ముహుర్ముహుర్గళధ్వనన్నృసింహ రక్ష మామ్ ||


4) దరిద్రదేవి దుష్టి దృష్టి దుఃఖ దుర్భరం హరం 

నవగ్రహోగ్రవక్రదోషణాదివ్యాధి నిగ్రహమ్ |

పరౌషధాదిమన్త్రయన్త్రతన్త్రకృత్రిమంహనం అకాలమృత్యుమృత్యుమృత్యుముగ్రమూర్తిణం భజే ||


5) జయత్వవక్రవిక్రమక్రమక్రమక్రియాహరం స్ఫురత్సహస్రవిస్ఫులింగభాస్కరప్రభాగ్రసత్ |

ధగద్ధగద్ధగల్లసన్మహద్భ్రమత్సుదర్శనో- న్మదేభభిత్స్వరూపభృద్ధవత్కృపారసామృతమ్ ||


6) విపక్షపక్షరాక్షసాక్షమాక్షరూక్షవీక్షణం సదాఽక్షయత్కృపాకటాక్షలక్ష్మలక్ష్మివక్షసమ్ |

విచక్షణం విలక్షణం ప్రతీక్షణం పరీక్షణం పరీక్ష దీక్ష రక్ష శిక్ష సాక్షిణం క్షమం భజే ||


7) అపూర్వ శౌర్య ధైర్య వీర్య దుర్నివార్య దుర్గమం అకార్యకృద్ధనార్య గర్వపర్వతప్రహర్యసత్ |

ప్రచార్యసర్వనిర్వహస్తుపర్యవర్యపర్విణం సదార్యకార్యభార్యభృద్దుదారవర్యణం భజే ||


8) ప్రపత్తినార్ద్రనాభనాభివందనప్రదక్షిణా నతాననాంగవాఙ్మనఃస్మరజ్జపస్తువద్గదా |

అశ్రుపూరణార్ద్రపూర్ణభక్తిపారవశ్యతా సకృత్క్రియాచరద్ధవత్కృపా నృసింహ రక్ష మామ్ ||


9) కరాళవక్త్ర కర్కశోగ్ర వజ్రదంష్ట్రముజ్జ్వలం కుఠారఖడ్గకుంతరోమరాంకుశోన్నఖాయుధమ్ |

మహద్భ్రయూధభగ్నసంచలజ్ఞతా సటాలకం జగత్ప్రమూర్ఛితాట్టహాసచక్రవర్తిణం భజే ||


10) నవగ్రహాఽపమృత్యుగండ వాస్తురోగ వృశ్చికా- -ఽగ్ని బాడబాగ్ని కాననాగ్ని శతృమండల |

ప్రవాహ క్షుత్పిపాస దుఃఖ తస్కర ప్రయోగ దు- -ష్ప్రమాదసంకటాత్సదా నృసింహ రక్ష మాం ప్రభో ||


ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలన్తం సర్వతోముఖమ్ |

నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహమ్ ||

ఓం నమో నృసింహ దేవాయ ||

🕉🌞🌎🌙🌟🚩

శ్రీ సూర్య మండల స్తోత్రం
🔥ఓంశ్రీమాత్రే నమః🔥

1) నమోస్తు సూర్యాయ సహస్రరశ్మయే |సహస్రశాఖాన్విత సంభవాత్మనే |

సహస్రయోగోద్భవ భావభాగినే |సహస్రసంఖ్యాయుధధారిణే నమః ||



2) యన్మండలం దీప్తికరం విశాలం |రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |

దారిద్ర్య దుఃఖక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||



3) యన్మండలం దేవగణైః సుపూజితం | విప్రైస్తుతం భావనముక్తికోవిదమ్ |

తం దేవదేవం ప్రణమామి సూర్యం |పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||



4) యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం | త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |

సమస్త తేజోమయ దివ్యరూపం |పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||



5) యన్మండలం గూఢమతి ప్రబోధం |ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ |

యత్సర్వ పాపక్షయకారణం చ |పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||



6) యన్మండలం వ్యాధివినాశదక్షం |యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |

ప్రకాశితం యేన చ భూర్భువః స్వః |పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||



7) యన్మండలం వేదవిదో వదంతి | గాయంతి యచ్చారణసిద్ధసంఘాః |

యద్యోగినో యోగజుషాం చ సంఘాః | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||



8) యన్మండలం సర్వజనైశ్చ పూజితం |జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే |

యత్కాల కాలాద్యమరాది రూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||



9) యన్మండలం విష్ణుచతుర్ముఖాఖ్యం |యదక్షరం పాపహరం జనానామ్ |

యత్కాలకల్పక్షయకారణం చ |ఋపునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||



10) యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం |ఉత్పత్తి రక్ష ప్రలయ ప్రగల్భమ్ |

యస్మిన్ జగత్సంహరతే ఖిలం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||



11) యన్మండలం సర్వగతస్య విష్ణోః |ఆత్మా పరం ధామ విశుద్ధతత్త్వమ్ |

సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం |పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||



12) యన్మండలం వేదవిదోపగీతం |యద్యోగినాం యోగ పథానుగమ్యమ్ |

తత్సర్వ వేద్యం ప్రణమామి సూర్యం |పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||



13) సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః |

సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే ||


ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ కృష్ణార్జున సంవాదే శ్రీ సూర్యమండల స్తోత్రం..సంపూర్ణం.. ||

 🌞ఓం నమో సూర్యాయ నమః🚩

🕉🌞🌎🌙🌟🚩

శ్రీ వర్ణమాలా స్తోత్రమ్
 🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
 

అధ్బుత విగ్రహ అమరాదీశ్వర అగణిత గుణ గణ అమృత శివ
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ
ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ
ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ
ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత పాద శివ
ఉరగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ
ఊర్జిత దానవ నాశ పరాత్పర ఆర్జిత పాప వినాశ శివ
ఋగ్వేద శ్రుతి మౌళి విభూషణ రవి చంద్రాగ్ని త్రినేత్ర శివ
ఋప మనాది ప్రపంచ విలక్షణ తాప నివారణ తత్త్వ శివ
లింగ స్వరూప సర్వ బుధ ప్రియ మంగళ మూర్తి మహేశ శివ!!


లూతాదీశ్వర రూప ప్రియ శివ వేదాంత ప్రియ వేద్య శివ
ఎకానేక స్వరూప విశ్వేశ్వర యోగి హృది ప్రియ వాస శివ
ఐశ్వర్యా శ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశ శివ
ఓంకార ప్రియ ఉరగ విభూషణ హ్రీంకారాది మహేశ శివ
ఔర సలాలిత అంత కనాశన గౌరీ సమేత మహేశ శివ
అంబర వాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ
ఆహార ప్రియ ఆది గిరీశ్వర భోగాది ప్రియ పూర్ణ శివ
కమలాస్యార్చిత కైలాస ప్రియ కరుణా సాగర కాంతి శివ
గంగా గిరి సుత వల్లభ గుణ హిత శంకర సర్వ జనేశ శివ
ఖడ్గ శైల మృదుడ క్కాద్యా యుధ విక్రమ రూప విశ్వేశ శివ!!


ఘాతుక బంజన పాతక నాశన గౌరీ సమేత గిరీశ శివ
జజశ్రిత శ్రుతి మౌళి విభూషణ వేద స్వరూప విశ్వేశ శివ
చండ వినాశన సకల జన ప్రియ మండలా దీశ మహేశ శివ
చత్ర కిరీట సుకుండల శోభిత పుత్ర ప్రియ భువనేశ శివ
జన్మ జరా మృతి నాశన కల్మష రహిత తాప వినాశ శివ
ఝంకారా శ్రయ బృంగి రిటి ప్రియ ఓం కారేశ మహేశ శివ
జ్ఞానా జ్ఞానా వినాశక నిర్మల దీన జన ప్రియ దీప్త శివ
టంకాద్యాయుధ ధారణ సత్వర హ్రీంకాది సురేశ శివ
రంక స్వరూప సహకారోత్తమ వాగీశ్వర వరదేవ శివ
డంబ వినాశన డిండి మ భూషణ అంబర వాస చిదీశ శివ!!


డం డం డమరుక ధరణీ నిశ్చల డుండి వినాయక సేవ్య శివ
ణలిన విలోచన నటన మనోహర అళి కుల భూషణ అమృత శివ
తత్వమ సీత్యాది వాక్య స్వరూపక నిత్యానంద మహేశ శివ
స్థావర జంగమ భువన విలక్షణ భావుక మునివర సేవ్య శివ
దుఃఖ వినాశక దళిత మనోన్మన చందన లేపిత చరణ శివ
ధరణీ ధర శుభ దవళ మనోన్మన చందన లేపిత చరణ శివ
నానా మణి గణ భూషణ నిర్గుణ నట జన సుప్రియ నాట్య శివ
పన్నగ భూషణ పార్వతి నాయక పరమానంద పరేశ శివ
ఫాల విలోచన భాను కోటి ప్రభ హాలా హల ధర అమృత శివ
బంధ వినాశన బృహదీశామర స్కందాది ప్రియ కనక శివ
భస్మ విలోపన భవ భయ నాశన విస్మయ రూప విశ్వేస శివ!!


మన్మధ నాశన మధుపాన ప్రియ మందర పర్వత వాస శివ
యతి జన హృదయ నివాసిత ఈశ్వర విధి విష్ణ్యాది సురేశ శివ
రామేశ్వర రమణీయ ముఖాంభుజ సోమ శేఖర సుకృతి శివ
లంకాదీశ్వర సుర గణ సేవిత లావణ్యా మృత లసిత శివ
వరదా భయకర వాసుకి భూషణ వన మాలాది విభూష శివ
శాంతి స్వరూప జగత్త్రయ చిన్మయ కాంతి మతి ప్రియ కనక శివ
షణ్ముఖ జనక సురేంద్ర ముని ప్రియ షాడ్గుణ్యాది సమేత శివ
సంసారార్ణవ నాశన శాశ్వత సాధు హృది ప్రియ వాస శివ
హర పురుషోత్తమ అద్వైతామృత పూర్ణ మురారి సుసేవ్య శివ
ళాళిత భక్త జనేశ నిజేశ్వర కాళీ నటేశ్వర కామ శివ
క్షర రూపాది ప్రియాన్విత సుందర సాక్షి జగత్రయ స్వామి శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ!!

🕉🌞🌎🌙🌟🚩

2, మే 2020, శనివారం

శ్రీ కృష్ణ శతకం - పద్య స్వరూపం - 1 ***

ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక - కంద పద్యాలు 
సేకరణ / రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ (1)
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:- శ్రీ కృష్ణాయన:

🌹. శ్రీ కృష్ణ శతకం  - పద్య స్వరూపం - 1 🌹
పద్యము - భావము

🌻. 1 నుండి 14 పద్యాలు 🌻

🌻. 1 వ పద్యం

శ్రీ రుక్మిణీశ కేశవ
నారద సంగీతలోల నగధర శౌరీ
ద్వారక నిలయ జనార్ధన
కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణా.ll

భావం:--
శ్రీ రుక్మిణీదేవికి నాథుడవు, జలమున నిద్రించువాడవు, నారద సంగీతమునకు వశడవు గోవర్ధనపర్వతమెత్తి గోపకులమును రక్షించినవాడవు. ద్వారకా వాసుడవు. భక్తులను పాలించువాడవు అగు ఓ కృష్ణా ! దయతో మమ్ము రక్షింపుము.

🌻 2 వ పద్యం

నీవే తల్లి వి దండ్రి వి
నీవే నా తోడు నీడ నీవే సఖుఁడౌ
నీవే గురుఁడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా.ll

భావం :--
హే కృష్ణా ! నీవే నా తల్లివి, తండ్రియు, హితుడవు, వీడవలెవెన్నంటి యుండువాడవు, గురుడవు దైవము అయినవాడవు, నా ప్రభుడవు, నాకు ఆధారుడవు అని నమ్మితిని. నిజముగ సుమా !

🌻 3 వ పద్యం

నారాయణ పరమేశ్వర
ధారా ధర నీలదేహ దానవవై రీ
క్షీరాబ్ధిశయన యదుకుల
వీరా నను గావు కరుణ వెలయఁగ కృష్ణా.ll

భావం:--
నారాయణుడు, పరమేశ్వరుడు నీలదేహుడు, రాక్షసవైరి, క్షీరాబ్దిశయనుడు, యదువీరుడు అను బిరుదులతో విహరించే ఓ కృష్ణా ! దయతో నన్నుగావుమయ్యా.

🌻 4 వ పద్యం

హరియను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామమహత్మ్యము
హరి హరి పొగడంగవశమె హరి శ్రీకృష్ణా.ll

భావం:--
అంభుజనాభా ! కృష్ణా ! సమస్తపాపములు పోగొట్టు నీ పేరిటి "హరి" అను రెండక్షరముల మహిమను ఎవరును పొగడజాలరు. నా బోటి వానికి వీలగునా కాదుగదా ????

🌻 5 వ పద్యం

కౄరాత్ముఁ డజామీళుఁడు
నారాయణ యనుచు నాత్మనందను బిలువన్
ఏ రీతి నేలుకొంటివి
యేరీ నీసాటివేల్పు వెందును కృష్ణా.ll

భావం:--
దుర్మార్గుడగు అజామిళుడు తనకుమారుని "నారాయణ" అని పిలిసినందుకే అతనిని రక్షించితివి, నీకు సమానమైన దైవమెందును లేరు కదా ఓ కృష్ణా !??

🌻 6 వ పద్యం

చిలుక నొక రమణి ముద్దులు
చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరుం
బిలిచిన మోక్షము నిచ్చితి
పలరగ మిము దలఁచు జనుల కరుదా కృష్ణా.ll

భావం:-
కృష్ణా !ఒక స్త్రీ ముద్దుగా ఒక చిలుకను "శ్రీరామ" అని పిలిచినంత మాత్రమునే ఆదరించి మోక్షమిచ్చినావు కదా..... నిన్నుభక్తితో ధ్యానించు వారికి తప్పక ముక్తి కలుగును కదా కృష్ణా

🌻 7 వ పద్యం

అకౄరవరద మాధవ
చక్రాయుధ ఖడ్గపాణిశౌరి ముకుందా
శక్రాదిదివిజసన్నుత
శుక్రార్చిత నన్ను కరణఁజూడుము కృష్ణా.

భావం:-
అకౄరుని కాపడినట్టియు, ఇంద్రుడు మున్నగు దేవతలచే స్తుతించబడినట్టియు, చక్రము,ఖడ్గము, శార్జ్ఞము మొదలగు ఆయుధములు దాల్చినట్టి ఓ కృష్ణా ! నన్ను రక్షింపుము.

🌻 8 వ పద్యం

నందుని ముద్దులపట్టివి
మందరగిరి ధరుని హరుని మాధవు విష్ణున్
సుందరరూపుని మునిగణ
పండితు నిను దలఁతు భక్తవత్సల కృష్ణాll

భావం:-
భక్తులపై కరుణగల ఓ కృష్ణా ! నందుని ముద్దుల కొమరుడవై పుట్టితివి. మందరపర్వతమును దాల్చితివి. హరి, మాధవుడు, విష్ణువు అను పేర్లుచే నుతింపబడితివి. సౌందర్యసాలివని మునులచే పొగడబడితివి. అట్టి నిన్ను నా మదిలో ధ్యానించెదను.

🌻 9 వ పద్యం

ఓ కారుణ్యపయోనిధి!
నా కాధారంబ వగచు నయముగఁ బ్రోవ
న్నా కేల యితర చింతలు
నాకాధిప వినుత లోకనాయక కృష్ణాll

భావం:-
ఇంద్రునిచే సన్నుతింపబడిన లోకనాయకా ! కృష్ణా ! దయాసముద్రడవగు నీవు ఆధారముగానుండగా, నాకు ఇతర చింతలతో పనిలేదు.

🌻 10 వ పద్యం

వేదంబులు గననేరని
యాది పరబ్రహ్మమూర్తి వనఘ మురారీ
నా దిక్కు జూచి కావుము
నీ దిక్కే నమ్మినాఁడ నిజముగ కృష్ణాll

భావం:-
వేదంబులు తెలిసికొనజాలని, ఆదిపరబ్రహ్మవు, పాపరహితుడవు, దుష్టశిక్షకుడవు అగు ఓ కృష్ణా ! నీవే దిక్కని నమ్ముకున్నాను. నన్ను రక్షింపుమయ్యా.....    

🌻 11 వ పద్యం

పదునాలుగు భువనంబులు
కుదురుగ నీకుక్షి నిలుపుకొను నేర్పరివై
విదితంబుగ నా దేవకి
యుదరములో నెట్టు లొదిగియుంటివి కృష్ణా.

భావం:--
కృష్ణా ! పదునాలుగు లోకములు నీ ఉదరములో గల వాడవు. నీ తల్లియగు దేవకీ దేవి కడుపులో ఎట్లు అణగియుంటివో ! చాలా చిత్రము నీ లీలలు.

🌻 12 వ పద్యం

అష్టమి రోహిణి ప్రొద్దున
నష్టమగర్భమున బుట్టి యా దేవకికిన్
దుష్టుని కంసు వధింపవె
సృష్టి ప్రతిపాలనంబు సేయగ కృష్ణా.

భావం:--
లోకమును ధర్మయుక్తముగా పాలించుటకు దేవకీ దేవికి ఎనిమిదవ బిడ్డవై పుట్టి, దుర్మార్గుడగు కంసుని చంపితివి కదా ! ఓ కృష్ణా నీ క్రియలు ధర్మాత్మకములు ప్రపంచమును రక్షించునవికదా.

🌻 13 వ పద్యం

అల్ల జగన్నాథుకు వ్రే
పల్లియ క్రీడార్థమయ్యె పరమాత్మునకున్
గొల్ల సతి యా యశోదము
తల్లి యునై చన్నుఁగుడిపె దనరగ కృష్ణా.

భావం:--
కృష్ణా ! జగన్నాధుడవైన నీకు వ్రేపల్లె ఆటస్థలమయ్యెను. గొల్లసతియగు యశోద తల్లియై పాలిచ్చెను. వ్రేపల్లె ధన్యమయ్యెను. యశోద ధన్యురాలయ్యెను.

🌻 14 వ పద్యం

అందెలు గజ్జెలు మ్రోయగ
చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందుని సతి యా గోపిక
ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా.

భావం:--
కృష్ణా ! నందుని భార్యయగు యశోద కాళ్ళ గజ్జెలు, అందెలు మ్రోయగా మిగుల వేడుకతో చిందులు త్రొక్కుచు ఆడెదవు. ఆమె అదృష్టమే అదృష్టము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ కృష్ణ శతకం  - పద్య స్వరూపం - 2 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 15 నుండి 28 పద్యాలు 🌻

🌻 15 వ పద్యం

హరిచందనంబు మేనున
కరమొప్పెడు హస్తములను కంకణరవముల్
ఉరమున దత్నము మెఱయఁగఁ
బరిగితివౌ నీవు బాలప్రాయము కృష్ణా.

భావం:--
కృష్ణా ! నీవు చిన్నతనము నందు శరీరమున శ్రీగంథమును, చేతులయందు కంకణధ్వనులు, వక్షమున కౌస్తుభమణియు, మెరయగా అందముగా అగుపించితివి కదా...

🌻 16 వ పద్యం

పాణితలంబున వెన్నయు
వేణీమూలబునందు వెలయఁపింఛం
బాణిముత్యము ముక్కున
నాణెముగా దాల్చు లోకనాథుఁడ కృష్ణా.

భావం:--
కృష్ణా ! చేతిలో వెన్నముద్దయు, శిరస్సుపై నెమలి పింఛము, ముక్కునందు ముత్తెమును నేర్పుగా ధరించి, లోకమును మోహింపజేసిన శేషశాయివి నీవే కదా ....

🌻 17 వ పద్యం

మడుగుకు జని కాశియుని
పడగలపై భతరశాస్త్ర పద్దతి వెలయన్
గడు వేడుకతో నాడెడు
నడుగులు నా మదిని దలcతు నచ్యుత కృష్ణా.

భావం:--
కృష్ణా ! అచ్యుతా ! కాళీయుని మడుగుజొచ్చి, కాళీయుని పడగలపై భరతశాస్త్ర పద్ధతిగా, నాట్యమాడిన నీ పాదములను నామదిలో నిరతము ధ్యానింతును.

🌻 18 వ పద్యం

బృందావనమున బ్రహ్మ
నందార్భకమూర్తి వేణునాదము నీ వా
మందార మూలమున గో
విందాపూరింతువౌర వేడుక కృష్ణా.

భావం:--
కృష్ణా ! బృందావనమందు ఆనందమును గూర్చు బాలుని ఆకారముతో మందార వృక్షమూలమున విలాసముగా వేణువును మ్రోగించుచుందువు కదా.

🌻 19 వ పద్యం

వారిజనేత్రలు యమునా
వారిని జలకంబులాడవచ్చిన నీవా
చీరలుమ్రుచ్చిలియిచ్చితి
నేరుపురా యదియు నీకు నీతియె కృష్ణా.

భావం:--
గోపికలు యమునా నదిలో స్నానము చేయుటకు రాగా, వారి చీరలను నేర్పుగా దొంగిలించి, తెచ్చితివి. ఇట్లు చేయుట నీనేర్పు వెల్లడియగుటకా ! అటుల చేయుట నీకు తగునటయ్యా

🌻 20 వ పద్యం

దేవేంద్రుcడలుకరోడను
వావిరిగా ఱాళ్ళవాన వడిగుఱియింపన్
గోవర్థనగిరి యెత్తితి
గోవుల గోపకుల గాచుకొఱకై కృష్ణా.

భావం:--
కృష్ణా !పూర్వము ఇంద్రుడు కోపముచే గోకులముపై రాళ్ళవాన కురిపించెను. నీవు గోవర్ధనపర్వతమెత్తి అచటి వారిని కాపాడితివి కనుక, మిక్కిలి పరోపకార పరాయణుడవు కదయ్యా !

🌻 21 వ పద్యం

అండజవాహన వినుబ్ర
హ్మండంబుల బంతులపట్ల యాడెడు నీ వా
కొండల నెత్తితి వందురు
కొండిక పనిగాక దొడ్డకొండా కృష్ణా.

భావం:--
కృష్ణా ! బ్రహ్మాండములను బంతులాడినట్లు, ఆడింప సామర్ధ్యముగల నీకు, కొండలను ఎత్తుట తేలికయైన పనియేయగును కదా !

🌻 22 వ పద్యం

అంసాలంబిత కుండల
కంసాంతక! నీవు ద్వారకపురిలోనన్
సంసారరీతి నుంటివి
హంసేంద్ర! విశాలనేత్ర అచ్యుత కృష్ణా.

భావం:--
కృష్ణా ! భుజములను తాకు కుండలములు కలవాడా ! కంసాది దుష్టులను వధించి, కారణజన్ముడవయి కూడా, ద్వారకానగరిలో మామూలు సంసారివై యుండుట చాలా ఆశ్చర్యము కలిగించితివి.

🌻 23 వ పద్యం

పదియాఱువేల నూర్వురు
సుదతులు యెలమండ్రు నీకు సొంపుగ భార్య
ల్విదితంబుగ బహురూపుల
వదలక రమియింతువౌర వసుధను కృష్ణా.

భావం:--
కృష్ణా ! నీవు పదహారువేల గోపికలతో, ఎనిమిదిమంది భార్యలతో, బహురూపములతో నెడతెగక భోగించుచుందువు గదా ! నిజమైన రాజభోగమన్న నీదే కదయ్యా !

🌻 24 పద్యం

అంగన పనుపున ధోవతి
కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన యా సంగతి విని దయనొస్రుcగితివి
రంగుగ సంపదలు లోకరక్షక కృష్ణా.

భావం:--
కృష్ణా ! తన భార్యయైన వామాక్షీ పంపుటచే, కొంగున అటుకలు మూటకట్టుకొని, దారిద్ర్యభారంతో వచ్చిన, నీ స్నేహితుడగు కుచేలునికి అష్టైశ్వర్యములు ఇచ్చితివి కదా !

🌻 25 వ పద్యం

హా వసుదేవ కుమారక
కావుము నా మాన మనుచు కామిని వేడన్
ఆ వనజాక్షికి నిచ్చితి
శ్రీ వర! యక్షయ మంటంచు చీరలు కృష్ణా.

భావం:--
కృష్ణా ! కురుసభలో ద్రౌపతి "హా ! వసుదేవనందన! నా మనమును కాపాడుమని, నిన్ను వేడగా, ఆమెకు ఆక్షయముగా వలువలు ఇచ్చి కాపాడితివి కదా ! నీకు ఆశ్రిత వాత్సల్యము మిక్కిలి ఎక్కువ కదా !

 🌻 26వ పద్యం

శుభ్రమగు పాంచజన్యము
అభ్రంకష మగుచు మ్రోవ నాహవభూమిన్
విభ్రమలగు దనుజసుతా
గర్భంబుల పగులజేయు ఘనుcడవు కృష్ణా.

భావం:--
కృష్ణా ! శుభ్రమగు పాంచజన్యమును ఆకాశమంటునట్లు మ్రోగించి, యుద్ధభూమిలో అనుజుల గర్భంబులు భేదింపజేయు ఘనుడవు నీవే కదయ్యా !

🌻 27వ పద్యం

జయమును విజయున కియ్యవె
హయముల ములుకోల మోపి యదలించి మహా రయమున రొప్పవే తేరున
భయమున తివుసేన విఱిగి పాఱగ కృష్ణా.

భావం:--
హే శ్రీకృష్ణా ! అర్జునునకు రథసారధివై, గుర్రముల కోలనదిలించి వైరిసేనలు, భయమున చెల్లాచెదరై పారిపోవునట్లుచేసి అర్జునునకు జయమును కూర్చితివి కదా !

🌻 28వ పద్యం

దుర్జనులగు నృపసంఘము
నిర్జింపగ దలచి నీవు నిఖిలాధారా !
దుర్జనులను వధియింపను
నర్జును రథచోదకుండ వైతివి కృష్ణా ll

భావం:--
కృష్ణా ! నీవు దుర్జనులగు నృపులను జయించుటకు, దుర్మార్గులను వధించుటకును అర్జునునకు రథచోదకుడవైతివి కానీ, ఇతరమునకు కాదు, ఇందువలన నిఖిలాధరుడవు అనదగినతివి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹🌹🌹🌹🌹🌹 
 శ్రీశంకరభగవత్పాదాః  
       విజయంతే
🌹🌹🌹🌹🌹🌹
-----------------------------
 🔴 శ్రీమాత్రేనమః 🔴

పరము
నిష్కళము కనగ బ్రహ్మమదియె
చంద్రసూర్యానలకళల జగతికంత
మూల శక్తిగ రాజిలు ముఖ్య వేల్పు
మోహమెల్ల నశింపగ మోక్షమిడును.

(తోపెల్ల సత్యనారాయణ మూర్తి,
అమలాపురం.)

🙏🙏🙏🙏🙏🙏
-------------------------🌸🌸🌸🌸🌸🌸

🌹. శ్రీ కృష్ణ శతకము  - పద్య స్వరూపం - 3 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 29  నుండి 42 పద్యాలు 🌻

🌻 29వ పద్యం

శక్రసుతు గాచుకొఱకై
చక్రము చేపట్టి భీష్ము జంపగ చను నీ
విక్రమ మేమని పొగడను
నక్రగ్రహ సర్వలోకనాయక కృష్ణా .

భావం:--
కృష్ణా ! అర్జునుని కాపాడుటకు చక్రము చేతబూనిభీష్ముని చంపబోవు నీ పరాక్రమము ఏమని కొనియాడెదను ! నీ పరాక్రమము అద్భుతము కదా !

🌻 30వ పద్యం

దివిజేంద్రసుతుని జంపియు
రవిసుతు రక్షించినావు తఘురాముడవై
దివిజేంద్రసుతుని గాంచియు
రవిసుతు బరిమార్చితౌర రణమున కృష్ణా ll

భావం:--
కృష్ణా ! నీవు రామావతారములో ఇంద్ర తనయుడు అగు వాలిని చంపి, సూర్య తనయుడు అగు సుగ్రీవుని కాపాడితివి. కృష్ణావతారమున సూర్య తనయుడగు కర్ణుని బలహీనుడిని చేసి, ఇంద్రతనయుడు అగు అర్జునుని రక్షించితివి. నీ లీలలు అద్భుతాలు కదయ్యా !

🌻  31 వ పద్యం

దుర్భరబాణము రాగా
గర్భములోనుండి "యభవ !గావు" మటన్నన్
నిర్భరకృప రక్షించితి
వర్భకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా.    
                          
భావం:--
కృష్ణా ! వచ్చిన బాణమునకు భీతిల్లి ఉత్తర గర్భమందు ఉండి "కృష్ణా కావు" మనివేడి అభిమన్యుని కుమారుడగు పరీక్షిత్తుని కాపాడితివి. నీవు ఆర్తత్రాణపరాయణుడవు కదయ్యా మాధవా !

🌻  32 వ పద్యం

గిరులందు మేతివౌదువు
సురలందున నింద్రుడౌదువు చుక్కలలోనన్
బరమాత్మ చంద్రుడౌదువు
నరులందున నృపతి వౌదు నయముగ కృష్ణా.

భావం:--
కృష్ణా ! నీవు గిరులలో మేరువువు, దేవతలలో ఇంద్రుడవు, చుక్కలలో చంద్రుడవు, నరులలో రాజువు, అయినవాడవు కావున నీవు అన్నిటి యందును అధికుడవయ్యా .

🌻 33 వ పద్యం

చుక్కల నెన్నగ వచ్చును
గ్రక్కున భూరేణువులను గణుతింప నగున్
జొక్కపు నీ గుణ జాలము
నక్కజమగు లెక్కపెట్ట నజునకు కృష్ణా.

భావం:--
కృష్ణా ! చుక్కలను, భూరేణువులను లెక్కించవచ్చును. కానీ బ్రహ్మకైనను నీ గుణములు లెక్కింప సాధ్యము కాదు కదయ్యా !

🌻 34 వ పద్యం

కుక్షిని నఖిల జగంబులు
నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్
రక్షక ! వటపత్రముపై
దక్షత పవళించునట్టి ధన్యుడ కృష్ణా.

భావం:--
కృష్ణా ! నీ ఉదరములో జగములను దాచి, ప్రళయకాలమందు వటపత్రముపై పవళించియుందువు కదా ! వటపత్రశాయి అన్న కీర్తిశాలివి కదయ్యా నీవు.

🌻 35 వ పద్యం

విశ్వోత్పత్తికి బ్రహ్మవు
విశ్వము రక్షింపదలచి విష్ణుడ వనగా
విశ్వము జెరుపను హరుడవు
విశ్వాత్మక ! నీవె యగుచు వెలయగ కృష్ణా.

భావం:--
కృష్ణా ! సృష్టింప -- బ్రహ్మవు, పెంచ -- విష్ణుడవు, నశింప(త్రుంప) -- శివుడవుగా వెలసిన
త్రిమూర్తిస్వరూపుడవు నీవే కదయ్యా !

🌻 36 వ పద్యం

అగణిత వైభవ ! కేశవ !
నగధర ! వనమాలి ! యాదినారాయణ !యో
భగవంతుడ ! శ్రీమంతుడ !
జగదీశ్వర ! శరణు నీకు శరణము కృష్ణా.

భావం:--
శ్రీకృష్ణా ! ఎక్కువ వైభవం కలవాడా ! కేశవా ! నగధర ! వనమాలీ ! ఆదినారాయణా ! భగవంతుడా ! శ్రీమంతుడా ! జగదీశ్వరా ! మున్నగు బిరుదములు గల ఓ కృష్ణా ! నిన్ను శరణుజొచ్చితిని, నన్ను కాపాడుము.

🌻 37 వ పద్యం

మగ మీనమవై జలనిధి
పగతుని సోమకుని జంపి పద్మభవునకు
న్నిగమములు దెచ్చి యిచ్చితి
సుగుణాకర! మమ్ము గరుణ జూడుము కృష్ణా.

భావం:--
కృష్ణా ! మత్స్యావతారమెత్తి, సముద్రములో దాగిన సోమకుని చంపి, వేదములు బ్రహ్మకు అందించిన దేవా ! మమ్ము దయతో పాలింపుమయ్యా.....

🌻 38 వ పద్యం

అందఱు సురలును దనుజులు
పొందుగ క్షిరాబ్దిదరువ పొలుపున నీ వా
నందముగ కూర్మ రూపున
మందరగిరి యెత్తితౌర మాధవ కృష్ణా.

భావం:--
కృష్ణా ! దేవాసురులు మందరగిరిని కవ్వముగా చేసి, పాలసముద్రమును చిలికినపుడు, గిరి క్రుంగిపోతుండగా, నీవు కూర్మ రూపుడవై గిరినెత్తి, వారిని బ్రోచితివి కదా ! మమ్ము దయచూడుమయ్యా !

🌻 39 వ పద్యం

ఆది వరాహుడవయి నీ
వా దనుజ హిరణ్య నేత్రు హతుజేసి తగన్
మోదమున సురలు పొగడగ
మేదిని కిటి ముట్టికెత్తి మెరసితి కృష్ణా.

భావం:--
కృష్ణా !నీవు ఆదివరాహావతారమెత్తి, హిరణ్యాక్షుని చంపి, భూమిని కోరలపై ఎత్తి, దేవతలు పొగడగా ప్రకాశించితివి కదా !

🌻 40 వ పద్యం

కెరలి యఱచేత కంబము
నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్
ఉరమును జీరి వధించితి
నరహరి రూపావతార నగధర కృష్ణా.

భావం:--
కృష్ణా ! హిరణ్యకశిపుడు స్తంభమును అరచేత తట్టగా, అందుండిన నీవు నరసింహావతారుడవై వెడలి, వాని వక్షము చీల్చి సంహరించితివి కదా !

🌻 41 వ పద్యం

వడుగవువై మూడడుగుల
నడిగితివా బలిని భళిర, యఖిల జగంబుల్
తొడిగితివి నీదు మేనున
గడుచిత్రము నీ చరిత్ర ఘనుడవు కృష్ణా.

భావం:--
కృష్ణా ! వామనావతారమెత్తి, బలిని మూడడుగుల భూమినడిగి, లోకములన్నిటిని నీ మేనితో నింపితివి కదయ్యా మహాత్మా ! నీ చరిత్రలు కడు చిత్రములు.

🌻. 42 వ పద్యం

ఇరువ దొకమార్లు నృపతుల
శిరముల క్షండించి తౌర చేగొడ్డంటన్
ధర గశ్యపునకు నిచ్చియు
బరగవె జమదగ్ని రామభద్రుడ కృష్ణా.

భావం:--
కృష్ణా !పరశురామావతారము ఎత్తి ఇరువుదొక్కమార్లు రాజులను హతమార్చి, తెచ్చుకున్న రాజ్యాలను కశ్యపునకు యిచ్చితివి కదా ! నీ మహిమలు తెలుసుకొనలేకపోతిమి కదా !

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹🌹🌹🌹🌹🌹 
 శ్రీశంకరభగవత్పాదాః  
       విజయంతే
🌹🌹🌹🌹🌹🌹
-----------------------------
 🔴 శ్రీమాత్రేనమః 🔴

మూడు గుణముల పనులవి మూర్తమంద
బ్రహ్మ విష్ణు మహేశులై పరగు చుండ
వారి పనులకు శక్తియె పరమమాయె
తనదు కృపనంద జనుడిల ధన్యుడగును.
🙏🙏🙏🙏🙏🙏
(తోపెల్ల సత్యనారాయణ మూర్తి,
అమలాపురం.)

🌹. శ్రీ కృష్ణ శతకం  - పద్య స్వరూపం - 4  🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 43  నుండి 57 పద్యాలు 🌻

🌻 43 వ పద్యం

దశకంఠుని బరిమార్చియు
కుశలముతో సీత దెచ్చు కొనియు నయోధ్య
న్విశదముగ కీర్తి నేలిన
దశరథ రామావతార ధన్యుడ కృష్ణా.

భావం:--

🌻 44 వ పద్యం

ఘనులగు ధేనుక ముష్టిక
దనుజుల జెండాడి తౌర తగ భుజశక్తిన్
అనఘాత్మ? రేవతీ పతి
వనగ బలరామమూర్తి యౌగద కృష్ణా.

భావం:--
కృష్ణా ! బలసాలురగు ధేనుక, ముష్టికులను దనుజులను చంపి, సుజనులను రక్షించిన రేవతీ విభుడవగు బలరాముడవు నీవే కదా !

🌻. 45 వ పద్యం

త్రిపురాసుర భార్యల నతి
నిపుణతతో వ్రతము చేత నిలిపిన కీర్తుల్
కృపగల రాజవు భళిరే
కపటపు బౌద్దావతార ఘనుడవు కృష్ణా.

భావం:--
కృష్ణా ! నీవు త్రిపురాసుర భార్యల శీలము చెరచి, వారి భర్తలను సంహరింపచేసిన బుద్ధవతారుడవు కదా !

🌻 46 వ పద్యం

వెలిపపు తేజీ నెక్కియు
నిలపై ధర్మంబు నిలుప హీనుల ద్రుంపన్
కలియుగము తుదిని వేడుక
కలికివి గానున్న లోకకర్తవు కృష్ణా.

భావం:--
కృష్ణా ! ధర్మము నిలుపుటకు దుర్మతుల చంపుటకు, కలియుగాంతమందు నీవు కలికి రూపాన గుఱ్ఱమునెక్కి సంచరించెదవు కదా !

🌻. 47 వ పద్యం

వనజాక్ష ! భక్తవత్సల
ఘనులగు త్రైమూర్తులందు కరుణానిధివై
కన నీ సద్గుణ జాలము
సనకాది మునీంద్రులెన్నజాలరు కృష్ణా.

భావం:--
కృష్ణా ! భక్తవత్సలా ! త్రిమూర్తి స్వరూపుడవు, దయానిధివి, అయిన నీ గుణజాలము సనకాది మునీంద్రులను పొగడజాలరు.

🌻 48 వ పద్యం

అపరాధ సహస్రంబుల
నపరిమితములైన యఘము లనిశము నేనున్
గపటాత్ముడనై జేసితి
చపలుని ననుగావు శేషశాయివి కృష్ణా.

భావం:--
శేషసాయివగు కృష్ణా ! తప్పులు చేసితిని, పాపాత్ముడను, కపటుడను, చపలుడను, అగు నన్ను కాపాడుమయ్యా !

🌻 49 వ పద్యం

నరపశుడ మూఢచిత్తుడ
దురితారంభుడను మిగుల దోషగుడనునీ
గుణు తెఱుగ నెంతవాడను
హరి నీవే ప్రావు దాపు వౌదువు కృష్ణా.

భావం:--
కృష్ణా ! నరపశువును ! అజ్ఞానుడను, దోషిని, నిన్ను తెలుసుకోలేనివాడను, నన్ను తోడునీడై ఎల్లప్పుడూ కాపాడుము తండ్రీ.

🌻 50 వ పద్యం

పరనారీ ముఖపద్మము
గుఱుతుగ నొయ్యారినడక గొప్పును నడుము
న్నరయంగనె మోహింతురు
నిరతము నిను భక్తిగొల్వ నేర్వరు కృష్ణా.

భావం:--
కృష్ణా ! జనులు పరస్త్రీల ముఖమును, నడకను, కొప్పు, నడుము మొదలైనవి చూడగనే కామింతురు. కానీ నిన్ను భక్తితో కొలుచుట తెలియదు కదా అట్టివారికి.

🌻 51 పద్యం

పంచేంద్రియ మార్గంబుల
గొండెపు బుద్దిని జరించి కొన్ని దినంబుల్
ఇంచుక సజ్జన సంగతి
నెంచగ మిమ్మెరిగినాడ నిప్పుడె కృష్ణా.ll

భావం:--
కృష్ణా ! పంచేంద్రియ వ్యాపారము ననుసరించి ఇంతవరకు తిరిగి సాధు సంగతిచే నేనిప్పుడే నీ మహిమను తెలిసికొంటిని.

🌻 52 పద్యం

దుష్టుండ దురాచారుడ
దుష్టచరితుడను  చాల దుర్భుద్దిని నే
నిష్ట నిను గొల్వనేరను
దుష్టుడ నను గావు కావు కరుణను కృష్ణా.

భావం:--
కృష్ణా ! నేను దుష్టుడను, దురాచారుడను, దుష్టబుద్ధిని, కావున నిను సేవింపనేరను, నీవే దయచేసి నన్ను కాపాడుము.

🌻. 53 పద్యం

కుంభీంద్రవరద ! కేశవ !
జంభాసురవైరి ! దివిజసన్నుత చరితా !
అంభోజనేత్ర జలనిధి
గంభీరా ! నన్ను గావు కరుణను కృష్ణా.

భావం:--
కృష్ణా ! గజేంద్రరక్షకా ! దేవతలచే పొగడబడువాడా ! తామర వంటి కన్నులు సముద్రమువంటి గాంభీర్యము గలవాడా ! దయతో నన్ను కాపాడుము.

🌻 54 పద్యం

దిక్కెవ్వరు ప్రహ్లాదుకు
దిక్కెవ్వరు పాండుసుతుల దీనుల కెపుడు
న్దిక్కెవ్వర య్యహల్యకు
దిక్కెవ్వరు నీవె నాకు దిక్కువు కృష్ణా.

భావం:--
కృష్ణా ! ప్రహ్లాదునకు పాండవులకు, దీనులకు, అహల్యకు నీవే దిక్కయితివి. నాకును నీవే దిక్కువు రక్షింపుము.

🌻 55వ పద్యం

హరి! నీవె దిక్కు నాకును
సిరితో నేతెంచి మకరి శిక్షించి దయం
బరమేష్టి సురలు బొగడcగ
కరిగాంచినరీతి నన్ను గాపుము కృష్ణా.

భావం:--
కృష్ణా ! లక్ష్మీయుతుడవై వచ్చి మొసలిని దునుమాడి ఏనుగును రక్షించినట్లు నన్ను కాపాడుము, నీవే నాకు దిక్కు కృష్ణా !

🌻 56వ పద్యం

పురుషోత్తమ ! లక్ష్మీపతి !!
సరసిజ గర్భాదిమౌని సన్నుత చరితా !
మురభంజన ! సుర రంజన !
వరదుడవగు నాకు భక్తవత్సల కృష్ణా.

భావం:--
కృష్ణా ! బ్రహ్మమొదలైనవారిచే  కొనియాడబడినవాడా ! మురభంజన ! భక్తుల ప్రేమించువాడా ! నాకు వరములిచ్చి నన్ను కాపాడుము.

🌻 57వ పద్యం

క్రతువులు తీర్ధాగమములు
వ్రతములు దానములు సేయవలెనా? లక్ష్మీ
పతి! మిము దలచిన వారికి
నతులిత పుణ్యములు గలుగు టరుదా ? కృష్ణా.

భావం:--
కృష్ణా ! యజ్ఞములు , వ్రతములు , తీర్థయాత్రలు , దానములు చేయుటకంటే , మిమ్ములను కొలిచినవారికి, సాటిలేని పుణ్యము లభించును.

సశేషం......
🌹 🌹 🌹 🌹 🌹
🌹. భగవాన్ సద్గురు శ్రీధర స్వామి వారి జీవితచరిత్ర  - 22 🌹
✍️. సంకలనము : సూర్య
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అధ్యాయము - 6 - ఐదవ భాగము 🌻

  శ్రీధర స్వామి ఎప్పటివలెనే ఆరోజు రాత్రి కూడా జపానుష్టానములో కూర్చుని ఉన్నారు. అతను కూర్చున్న వెంటనే అతి వికారమైన - వికృత రూపంలో ఒక యక్షిణి ఆయన మీదికి పరుగు పరుగున రావడం కనబడింది. అప్పుడు ఆయన 'రామా' 'రామా' అంటూ తమ ధ్యానము నుండి బయటకు వచ్చారు. మరుసటిరోజు ఈ కార్యం చేసిన మంత్రగాడు గుడి ప్రాంగణంలో పొర్లాడుతూ "సమర్ధా! క్షమించు! తప్పు చేశాను!" అని "మరొక్కసారి ఇటువంటి అపరాధము చేయనని" గట్టిగా ఏడ్వసాగాడు. అంతలో అతను సమాధి మందిరము మెట్టు ఎక్కసాగాడు. ఈ పరిస్థితుల్లో శ్రీధరుడు అచ్చటికి రావడం జరిగింది. ఆయన్ని చూస్తూనే ఆ మంత్రగాడు శ్రీధరునికి నమస్కారము చేసాడు.

    అచ్చటకు వేంచేసిన కార్యనిర్వాహకుడు నీకేమయిందని ఆ మంత్రగాడిని ప్రశ్నించారు. అంద…
🌹🌹🌹🌹🌹🌹 
 శ్రీశంకరభగవత్పాదాః  
       విజయంతే
🌹🌹🌹🌹🌹🌹
-----------------------------
 🔴 శ్రీమాత్రేనమః 🔴

భావవి శుద్ధి జూపగ ప్రభావ విహీనత గల్గిన బుద్ధినిచ్చి నీ
పావన నామ రూపముల భక్తియు జూడగ కొంతమాత్రమై
యావల బెట్టి నిట్లు నను నార్తిని నొందగ జేసినాడవే
కావగ నన్ను వేరెవరు కల్గిరి నీభువి శంకరా! హరా!

🙏🙏🙏🙏🙏🙏
(తోపెల్ల సత్యనారాయణ మూర్తి,
అమలాపురం.)
-----------------------------
🌸🌸🌸🌸🌸🌸
       శుభోదయం
🌸🌸🌸🌸🌸🌸

శ్రీ కృష్ణ శతకం  - పద్య స్వరూపం - 5  🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 58  నుండి 70 పద్యాలు 🌻

🌻 58వ పద్యం

స్తంభమున వెడలి దానవ
డింభకు రక్షించినట్టి రీతిని వెలయన్ !
అంభోజనేత్ర ! జలనిధి
గంభీరా ! నన్నుగావు కరుణను కృష్ణా.

భావం:--
స్తంభము నుండి వచ్చి, ప్రహ్లాదుని రక్షించినట్లుగా, పద్మము వంటి నేత్రములు గలవాడా ! సముద్రము వంటి గాంభీర్యము గలవాడా !కరుణజూపి నన్ను కూడా కాపాడుము కృష్ణా.

🌻 59వ పద్యం

శతకోటి భాను తేజా !
అతులిత సద్గుణ గణాడ్య ! యంబుజనాభా
రతినాధ జనక ! లక్ష్మీ
పతిహిత ననుగావు భక్తవత్సల కృష్ణా.

భావం:--
కృష్ణా ! అనేక సూర్యుల తేజము గలవాడా ! లక్ష్మీనాధా ! మన్మధునకు తండ్రీ !మంచి గుణములు గలవాడా !భక్తవత్సలా ! నన్ను కాపాడవయ్యా !

🌻 60 వ పద్యం

మందుడనే  దురితాత్ముడ
నిందల కొడిగట్టి నట్టి నీచున్నన్నున్
సందేహింపక కావుము
నందుని వరపుత్ర ! నిన్ను నమ్మితి కృష్ణా

భావం:--
కృష్ణా ! నేను మందుడను, నీచుడను, దురితాత్ముడను, నిన్నే నమ్మితిని, నన్ను సందేహింపక కాపాడుము తండ్రీ !

🌻 61వ పద్యం

గజరాజ వరదే కేశవ !
త్రిజగత్కల్యాణమూర్తి దేవ మురారీ !
భుజగేంద్రశయన మాధవ
విజయాప్తుని  నన్ను గావు వేడుక కృష్ణా.

భావం:--
కృష్ణా ! గజరాజును పాలించిన కేశవా ! మూడులోకములందు శుభమైన ఆకారము కలవాడా !మురాసురుని చంపినవాడా ! శేషునిపై పవళించిన వాడా ! మాధవా ! లోకవిషయములలో జయము కల్పించి, నన్ను కాపాడుము.

🌻 62వ  పద్యం

గోపాల ! దొంగ ! మురహర !
పాపాలను పాఱద్రోలు ప్రభుడవు నీవే
గోపాలమూర్తి ! దయతో
నాపాలిట గలిగి బ్రోవు నమ్మితి కృష్ణా.

భావం:--
కృష్ణా ! గోపాలా ! వెన్నదొంగా ! మురాసురుని సంహరించినవాడా ! నా పాపములను పోగొట్టువాడివి నీవేనయ్యా!
నాయందు దయజూపి, నన్ను కాపాడుము.

🌻 63 వ పద్యం

దుర్మతిని మిగుల దుష్టపు
కర్మంబులు జేసినట్టి కష్టుని నన్నున్
నిర్మలుని జేయవలెని
ష్కర్ముడ నిను నమ్మినాను సతతము కృష్ణా.             

భావం:--
కృష్ణా ! చెడుమనస్సు కలవాడను, దుర్మార్గమైన పనులు చేసినట్టి దుష్టుడను, పాపరహితునిగా చేసి పాలిచుమయ్యా ! నిరతము నిన్నే నమ్మియున్నాను కదయ్యా !

🌻 64 వ పద్యం

దుర్వార చక్రకరధర !
శర్వాణీ ప్రముఖ వినుత ! జగదాధారా !
నిర్వాణనాధ ! మాధవ !
సర్వాత్మక నన్నుగావు సరగున కృష్ణా.

భావం:--
కృష్ణా ! వారింపసాధ్యముకాని చక్రము చేతియందు గలవాడా ! పార్వతి మున్నగువానిచే పొగడబడినవాడా !లోకమునకు ఆధారుడైనవాడా ! మోక్షమునకు ప్రభువైనవాడా ! మాధవా ! సర్వాత్మక ! నన్ను కాపాడుము.

🌻 65 వ పద్యం

సుత్రామనుత ! జనార్థన !
సత్రాజిత్తనయనాధ ! సౌందర్యకళా !
చిత్రాపతార ! దేవకి
పుత్రా ! ననుగావు నీకు పుణ్యము కృష్ణా.

భావం:--
కృష్ణా ! ఇంద్రాదివినుతా ! జనార్థన ! సత్యభామా ప్రియా ! దేవకీ తనయా ! నన్ను కాపాడుము, నీకు పుణ్యమగును.

🌻 66వ పద్యం

బల మెవ్వడు కరి బ్రోవను
బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్
బలమెవ్వడు రవిసుతునకు
బలమెవ్వడు నాకు నీవె బలమౌ కృష్ణా.

భావం:--
కృష్ణా ! గజేంద్రునకు, ద్రౌపదికి, సుగ్రీవునకు బలమేవ్వరో, అట్టి నీవే నాకును బలము. నన్ను కాపాడుము తండ్రీ.

🌻 67వ పద్యం

పరుసము సోకిన యినుమును
పరుసగ బంగారమైన వడుపున జిహ్వన్
హరి ! నీ నామము సోకిన
సురపందిత నేను నటుల సులభుడ కృష్ణా.

భావం:--
కృష్ణా ! పరుసవేది సోకిన ఇనుము, బంగారమగునట్లు, మందుడనగు నేనును, నీ నామము ఉచ్చరించిన సన్మార్గుడునిగా అయ్యెదను.

🌻 68వ పద్యం

ఒకసారి నీదు నామము
ప్రకటముగా దలచువారి పాపము లెల్లన్
వికలములై తొలగుటకును
సకలార్థా ! యజామీళుడు సాక్షియె కృష్ణా.

భావం:--
కృష్ణా ! ఒకసారి నీ నామము స్మరింపగా పాపములు పోవుననుటకు అజామీళుడే సాక్షి గదయ్యా !

🌻 69 పద్యం

హరి సర్వంబున గలడని
గరిమను దైత్యుండు బలుక కంబము లోనన్
ఇరవొంద వెడలి చీల్చవె
శరణను ప్రహ్లాదకుండు సాక్షియె కృష్ణా.

భావం:--
కృష్ణా ! నీవు అంతటా కలవని ప్రహ్లాదుడు పలుకగా, స్తంభములోనుండి వచ్చి హిరణ్యకశిపుని చంపితివి. శరణు అనగా వచ్చి కాపాడితివి. అందుకు సాక్షి  ప్రహ్లాదుడే కదయ్యా !

🌻 70  వ పద్యం

భద్రార్చిత పదపద్మసు
భద్రాగ్రజ సర్వలోక పాలక హరి! శ్రీ
భద్రాధిప ! కేశవ ! బల
భద్రానుజ ! నన్ను బ్రోవు భవహర కృష్ణా.

భావం:--
కృష్ణా !  భద్రార్చిత పాదపద్మా ! లోకపాలకా ! భద్రాద్రివాసా ! బలభద్రానుజ ! నా పాపములు పోగొట్టువాడా ! నన్ను రక్షింపుము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹🌹🌹🌹🌹🌹 
 శ్రీశంకరభగవత్పాదాః  
       విజయంతే
🌹🌹🌹🌹🌹🌹
-----------------------------
 🔴 శ్రీమాత్రేనమః 🔴

కురిసెడి సుధల కదలక కుడుచు నుండు
కుండలి సుధలు లేకను కుంభకమున
కుదురు
గను నుండ లేకను కోపమొంది
చకచకగ లేచి పతినొంది శాంతమయ్యె.

🙏🙏🙏🙏🙏🙏
(తోపెల్ల సత్యనారాయణ మూర్తి,
అమలాపురం.)
-----------------------------
🌸🌸🌸🌸🌸🌸
        శుభోదయం
🌸🌸🌸🌸🌸🌸
కర్మన్ ఘాట్ ఆంజనేయస్వామి కి జై.. . 💐

శ్రీ కృష్ణ శతకం  - పద్య స్వరూపం - 6  🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 71 నుండి 85 పద్యాలు 🌻

🌻 71 వ పద్యం

ఎటువలె కరిమొర వింటివి
ఎటువలె ప్రహ్లాదు కభయమిచ్చితి కరుణ
న్నటువలె నను రక్షింపుము
కటకట ! నిను నమ్మినాడ గావుము కృష్ణా.

భావం:--
కృష్ణా ! ప్రహ్లాదుని ఎట్లు రక్షింతివో ! గజేంద్రుని ఎట్లు బ్రోచితివో ! అట్లే దయతో నన్ను కాపాడుము. కష్టములు పడినవాడను , నిన్నే నమ్మినవాడను.

🌻 72 వ పద్యం

తట తట లేటికి జేసెదు
కటకట పరమాత్మ నీవు ఘంటాకర్ణు
న్నెటువలె నిపుణుని జేసితి
వటువలె రక్షింపుమయ్య యచ్యుత కృష్ణా.

భావం:--
హే కృష్ణా ! అచ్యుత ఘంటాకర్ణుని ఎటుల నేర్పరిగా, బుద్ధిమంతునిగా చేసితివో, నన్ను అటులే రక్షింపుమయ్యా .

🌻 73 వ పద్యం

తురగాధ్వరంబు జేసిన
పురుషులకును వేరు యిలను పుట్టుటయేమో
హరి ! మిము దలచిన వారికి
యరుదా కైవల్య పదవి యచ్యుత కృష్ణా.

భావం:--
కృష్ణా ! అచ్యుత ! అశ్వమేధయాగము చేసినవారికి జనము లేకున్నచో, నిన్ను దలచినవారికి మోక్షమరుదా (కాదు) ముక్తి లభించును.

🌻 74 వ పద్యం

ఓ భవబంధ విమోచన
ఓ భరతాగ్రజ మురారి యో రఘురామా
ఓ భక్త కామధేనువ
ఓ భయహర నన్నుగావు మో హరి కృష్ణా.

భావం:--
కృష్ణా ! భవబంధములు తొలగించువాడా ! భక్తుల కోరికలిచ్చువాడా ! భరతాగ్రజా ! రామా ! నాపాపములు పోగొట్టి నన్ను కాపాడుము.

🌻 75 వ పద్యం

ఏ తండ్రి కనక కశ్యపు
ఘాతకుడై యతని సుతుని కరుణను గాచెన్
బ్రీతి సురకోటి బొగడగ
నా తండ్రీ ? నిన్ను నేను నమ్మితి కృష్ణా.

భావం:--
కృష్ణా ! ఏ తండ్రి దుర్మార్గుడగు హిరణ్యకశిపుని చంపి అతని సుతుడగు ప్రహ్లాదుని దేవతలు పొగడగా కాపాడెనో, ఆ తండ్రినే నా తండ్రిగా నమ్మితిని, నన్ను కాపాడుము.

🌻 76 వ పద్యం

ఓ పుండరీక లోచన
ఓ  పురుషోత్తమ ముకుంద ఓ గోవిందా
ఓ  పురసంహార మిత్రుడ
ఓ  పుణ్యుడ నన్ను బ్రోవుమో హరి కృష్ణా.

భావం:--
కృష్ణా ! పుండరీకలోచనా ! ముకుందా ! గోవిందా ! పురుషోత్తమా ! శంకరమిత్రా ! మున్నగు నామములు కలిగిన హరీ ! నన్ను బ్రోవుమయ్యా .

🌻 77 వ పద్యం

ఏ విభుడు ఘోర రణమున
రావణు వధియించి లంకరాజుగ నిలిపెన్
దీవించి యా విభీషణు
నా విభు నే దలతు మదిని నచ్యుత కృష్ణా.

భావం:--
కృష్ణా ! ఏ ప్రభువు యుద్ధమునందు రావణుని చంపి విభీషణుని లంకకు రాజుగా చేసెనో అట్టి ప్రభువును నేను ధ్యానించెదను.

🌻 78 వ పద్యం

గ్రహభయ దోషము పొందరు
బహు పీడలు చేర వెఱుచు, పాయును నఘముల్
ఇహపర ఫలదాయక ! విను
తహ తహ లెక్కడివి నిన్ను దలచిన కృష్ణా.

భావం:--
నిన్ను తలచినవారికి గ్రహభయములు కలుగవు. బహుపీడలు కలుగవు. పాపములంటవు. ఇహఫలదాయకా ! కష్టములుండవు.

🌻 79 వ పద్యం

గంగ మొదలైన నదులను
మంగళముగ సేయునట్టి మజ్జనమునకున్
సంగతి గలిగిన ఫలములు
రంగుగ మిము దలచు సాటిరావుర కృష్ణా.

భావం:--
కృష్ణా ! గంగా మొదలైన నదులలో స్నానము చేయుటచే కలుగు ఫలితము, నిన్ను దరిచేరి ధ్యానించుటచే కలుగు ఫలితముతో సమానము కాదు.

🌻 80 వ పద్యం

అ  దండకా వనంబున
కోదండము ! దాల్చినట్టి కోమలమూర్తీ !
నా దండ గావ రమ్మీ
వేదండము కాచినట్టి వేల్పువు  కృష్ణా.

భావం:--
కృష్ణా ! దండకాడవిలో కోదండము దాల్చినవాడవు, గజేంద్రుని కాపాడినవాడవు, నా యెడనుండి, నన్ను కాపాడరమ్ము.

🌻 81 వ పద్యం
చూపుము నీ రూపంబును
పాపపు దుష్కృతములెల్ల పంకజనాభా
పాపము నాకును దయతో
శ్రీపతి నిను నమ్మునాcడ సిద్దము కృష్ణా ll

భావం
కృష్ణా !కమలనాభా ! శ్రీపతీ నీ మంగళాకారమును చూపుము.  నాపాపములను బాపి కాపాడుము. నిజముగా నిన్నే నమ్మినవాడను.

🌻 82  వ పద్యం
నీనామము భవహరణము
నీ నామము సర్వసౌఖనివహకరంబు
న్నీ నామ మమృత పూర్ణము
నీ నామము నే దలంతు నిత్యము కృష్ణా ll

భావం
ఓ కృష్ణా!నీ నామము ఉచ్చరించిన సంసార దుఃఖములు తొలగిపోవును,నీ నామమే సర్వసౌఖ్యముల నిచ్చును,నీ నానమము అమృతముతో నిండి ఉండును,అట్టి నీ నామమునే నేను ఎల్లపుడు స్మరింతును.

🌻 83  వ పద్యం
పరులను నడిగిన జనులకు
కురచసుమీ యిదియటంచు గుఱుతుగ నీవు
న్గురుచcడవై వేడితి మును
ధర బాదత్రయము బలిని తద్దయు కృష్ణా  ll

భావం
ఓకృష్ణా!పరులను యాచించుట మనుష్యులకు చులకనకు హేతువని గుర్తించుటకు నీవు ఒక గుజ్జు రూపుదాల్చి బలిని మూడఁడుగుల నేలను వేడితివి గదా!

🌻 84 వ పద్యం
పాలను వెన్నయు మ్రుచ్చిల
రోలను మీ తల్లిగట్ట రోషముతోడన్
లీలావినోది వైతివి
బాలుcడవా బ్రహ్మగన్న ప్రభుcడవు కృష్ణా  ll

భావం
ఓకృష్ణా!నీవు పాలు వెన్నలను దొంగలించగా నీ తల్లి కోపించి నిన్ను ఱోటికి గట్ట, నీ వది ఒక లీలావినోదముగా ఎంచితివి.నీవు బ్రహ్మ దేవుని కన్న లోక ప్రభుఁడవు కాని పిల్లవాడవు కాదు.

🌻 85  వ పద్యం

రఘునాయక నీ నామము
లఘుపతితో దలcచగలనె లక్ష్మీరమణా
యఘములు బాపుడు దయతో
రఘురాముcడవైన లోకరక్షక కృష్ణా  ll

భావం
ఓకృష్ణా!జగద్రక్షకా!మనస్పూర్తిగా కాకపోయినను ఒకసారి నీ నామము ఏక్షణములో తలచి ఆ క్షణమునందే పాపములు పోగొట్టుదువు అట్టి దయా మూర్తివి నీవు.లోకరక్షకుడవు,రాముని అవతారమూర్తి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
. శ్రీ కృష్ణ శతకం  - పద్య స్వరూపం - 8 🌹
పద్యము - భావము


🌻 95 వ పద్యం

సర్వేశ్వర చక్రాయుధ
శర్వాణివినుతనామ జగదభిరామా
నిఎవాణనాధ మాధవ
సర్వాత్మక నన్నుగావు సదయత కృష్ణా  ll

భావం
కృష్ణా!నీవు సమస్తమునకు ప్రభువును,సమస్తమునకు లోపల నుండువాడవు.చక్రమును ఆయుధముగా ధరించినవడవు. పార్వతీ దేవి చేత స్మరించబడు పేరుగల వాడవు.మోక్షమునుకు నదిపతివి.లక్ష్మిని భార్యగా గలవాడవు. నన్ను దయతో రక్షింపుము.

🌻 96 వ పద్యం

శ్రీధర మాధవ యచ్యుత
భూదర పురుహుతవినుత పురుషోత్తమ ఏ
పాదయుగళంబు నెప్పుడు
మోదముతో నమ్మినాcడ ముద్దుల కృష్ణా  ll

భావం
లక్ష్మీ దేవిని హృదయమున దరించి,ఆమెకు భర్తయైన వాడా,శాశ్వతుడవైన వాడా!దేవేంద్రుని చేత స్తోత్రము చేయబడినవాడా, భూదేవిని దరించినవాడా,పురుషులయందు పరమశ్రేష్టునివైనవాడా,ముద్దులు మూటగట్టెడు రూపముగలవాడా, ఓ కృష్ణా నీ పాదముల జంటను ఎల్లపుడు సంతోషముతో నమ్మి ఉన్నాను.అట్టి నన్ను రక్షింపుము.

🌻 97 వ పద్యం
శిరమున తర్నకిరీటము
కరయుగమున శంఖచక్ర ఘనభూషణముల్
ఉరమున వజ్రపు పతకము
సిరినాయక అమరcదాల్తువు శ్రీహరి కృష్ణా  ll

భావం
కృష్ణా!నీవు తలమీద రత్నములు చెక్కిన కిరీటమును కరములందు శంఖము,చక్రము,అనేక గొప్ప అలంకారములను, వక్షఃస్థలమున కౌస్తుభ రత్నముతో కూడిన పతకములను బహు అలంకారముగా నుండునట్లు ధరింతువు.

🌻 98 వ పద్యం
అందెలు పాదములందున
సుందరముగ నుంచినావు సొంపలరంగా
మందరధర ముని సన్నుత
నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణా  ll

భావం
పాదములందు ముద్దులొలుకునట్లుగా అందమైన అందెలను ధరించి ఉన్నావు.మంధర పర్వతమును కూర్మావతారములో మోసినట్టి కృష్ణా మునులచేత నుతులను గైకొనువాడా!నందుని ప్రియపుత్రుడా!నిన్నే నమ్మితిని.నీవే నాకు దిక్కు.

🌻 99 వ పద్యం
కందర్పకోటి సుందర
మందరధర నామతేజ మధుసూదన యో
సుందరవిగ్రహ మునిగణ
వందిత మిము దలcతు భక్తవత్సల కృష్ణా  ll

భావం
ఓకృష్ణా!కోటి మన్మదులంత సౌందర్యము కలిగిన్వాడవు.మందర పర్వతమును మోసినవాడను గొప్పపేరు గలవాడవు, మదువను రాక్షసుని చంపిన వాడవును,మునీశ్వరులచే నమస్కరింపబడు వాడవును అయిన నీ సుందర విగ్రహమును ఎల్లపుడును మనస్సులో తలంతును.

🌻 100 వ పద్యం

అనుదినము కృష్ణశతకము
వినిన పథించినను ముక్తి వేడుక గలుగున్
ధనధాన్యము గో గణములు
తనయులు నభివృద్ధిపొందు తద్దయు కృష్ణా  ll

భావం
ఓ కృష్ణా!ప్రతిదినము నీ శతకము చదివినను,వినినను వారికి పరలోకమందు ముక్తియు,ఈలోకమందు ధనధాన్యములు పుత్రాభివృద్ది విశేషముగ గలుగును.

🌻 101 వ పద్యం

భరద్వాజ సగోత్రుడ
గారవమున గంగకసుతుడన్
పేరు నృసింహాహ్వయుడను
శ్రీ రమణా ! నన్నుగావు సృష్టిని కృష్ణా  ll

భావం
ఓ లక్ష్మీదేవితో కూడిఉన్న శ్రీకృష్ణా ! నేను భారద్వాజస గోత్రమున పుట్టినవాడను, గౌరన్న-  గంగమాంబ అను పుణ్య దంపతుల పుత్రుడను, నృసింహుడు అను పేరుగల నన్ను దయతో కాపాడుము.

సమాప్తం.

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 64  / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 7 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌸. ప్రభువు భోజనం 🌸

   ఒకసారి మహాపండితులైన శాస్త్రి అనేపేరుగలవారు ప్రభు దర్బార్ కు వచ్చారు. దర్బార్ మర్యాదానుసారంగా వారికి భోజన, నివాస ఏర్పాట్లు చేయబడి ప్రభు దర్శనం కూడా అయింది. ప్రభువుతో రోజూ కొంతసేపు సంభాషించే యోగం కలిగింది.

ప్రభు దర్బార్ నడిచే విధానము, నిత్యం వేలమంది దర్శనానికి రావటం, బ్రాహ్మణ భోజనం జరుగుతూ ఉండటం, ప్రతీరోజూ 'నిత్యశ్రీ నిత్య మంగళం' కనిపించగానే శాస్త్రి గారు ఖంగు తిన్నారు. ఎవరివల్ల అయితే ఇలా జరుగుతుందో ఆ ప్రభువు విషయంలో వారికి ఆదరభావం పెరగసాగింది.

    ఒకరోజు శాస్త్రి గారు ప్రభు వద్దకు వెళ్లి ఇలా విన్నవించుకున్నారు. మహారాజ్! 'నేను వచ్చినప్పటి నుండి పంక్తి భోజనం నాకు దొరకలేదు. పంక్తి ప్రసాదం తీస…
🌹🌹🌹🌹🌹🌹 
 శ్రీశంకరభగవత్పాదాః  
       విజయంతే
🌹🌹🌹🌹🌹🌹
-----------------------------
 🔴 శ్రీమాత్రేనమః 🔴

ఇడయు పింగళయు నిలచి యిరుదిశలను
శక్తి కుండలి తనపతి సన్నిధికిని
చేరు చుండెడి మార్గాన సిద్ధులనిక
వీడి ముందుకు నడవగ వేడుకొనును.

(తోపెల్ల సత్యనారాయణ మూర్తి,
అమలాపురం.)

🌻 86  వ పద్యం

అప్పా యిత్తువు దయతో
నప్పాలను నతిరసంబు ననుభవశాలీ
యప్పాలను గనుగొనవే
యప్పానను బ్రోవు వేంకటప్పా కృష్ణా  ll

భావం
ఓకృష్ణా!నీవు దయతో తినెడి అప్పాలు,అరిసెలు మొదలగు తియ్యని వస్తువుల ఒసంగుదవు,అట్లే నన్ను దయతోఁ జూడుము.నన్నుఁ బ్రోవుము.

🌻 87  వ పద్యం

కొంచెపు వాcడని మదిలో
నెంచకుమీ వాసుదేవ గోవిందహరీ
యంచితముగ నీ కరుణకు
గొంచెము నధికంబు గలదె కొంకయు కృష్ణా  ll

భావం
ఓకృష్ణా!వసుదేవకుమారా!గోవిందా!నేను అల్పుఁడనని సందేహించి ఊరకొనకుము.నీ దయ కొంచెమనియు, గొప్పయనియు లేదు, అందరకును సమానమైనది.

🌻 88  వ పద్యం

వావిరి నీ భక్తులకుం
గావరమున నెగ్గుసేయు గర్వాంధుల మున్
దేవ వధించుట వింటిని
నీవల్లను భాగ్యమయ్యె నిజముగ కృష్ణా  ll

భావం
కృష్ణా!నీ భక్తులకు హాని చేయువారిని నీవు ఖండిచితివని వింటిని.నీ వలన లోకములకు శుభమయ్యెను.నీవు నిజముగా భక్తపాలకుఁడవు.నీ వల్లనే మాకు భాగ్యము కలిగినది.

🌻 89  వ పద్యం

అయ్యా పంచేంద్రియములు
నుయ్యాలల నూచినట్టు లూచగ నేనున్
నీ యాజ్ఞ దలcపనేరను
కుయ్యాలింపుము మహత్మ గుఱుతుగ కృష్ణా  ll

భావం
కృష్ణా!ఇంద్రియములు నా వశము తప్పి స్వేచ్చగా పరుగెత్తినన్నిటునటు లూపగానే నీ ఆజ్ఞను నేను దలఁచనేరకున్నాను,నామొర వినుము.

🌻 90  వ పద్యం

కంటికి రెప్పవిధంబున
బంటుగదా యనుచు నన్ను బాయక యెపుడున్
జంటయు నీ వుండుట నే
కంటకమగు పాపములను గడచితి కృష్ణా  ll

భావం
కృష్ణా!నీకు నేను బంటునుగదా,అనుకొనుచు ఎల్లపుడు నన్ను వెంటబీటుకొని పోయి మనము ఇరువురము జంటగా ఉండుటచేతనే పాపములనుంచి బయటపడగలను.అందుచే ఎల్లపుడు కంటికి రెప్పలాగున నన్ను కాపాడుము.

🌻 91 వ పద్యం

యమునికి నికcనే నెఱవను
కమలాక్ష జగన్నివాస కామితఫలదా
విమలమగు నీదు నామము
నమరcగ దలcచెదను వేగ ననిశము కృష్ణా ll

భావం
ఓకృష్ణా!తామర పుష్పములవంటి కన్నులు గలవాడా!లోకములకు నివాసమైన వాడా కోరిన కోరికలను ప్రసాదించువాడా ఇఁక మృత్యువునకు నేను ఏ మాత్రము భయపడను.నీ పవిత్ర నామమును ఎల్లపుడు జాగ్రత్తగా స్మరించెదను.

🌻 92 వ పద్యం

దండమయా విశ్వంభర
దండమయా పుండరీక దళనేత్రహరీ
దండమయా కరుణానిధి
దండమయా నీకు నెపుడు దండము కృష్ణా  ll

భావం
లోకములను భరించినవాడా!తామరరేకులాంటి కానులు గలవాడా!హరీ దయకు సముద్రము వంటి వాడా!కృష్ణా!నీకు ఎల్లపుడు నమస్కరించెదను.

🌻 93 వ పద్యం

నారాయణ లక్ష్మీపతి
నారాయణ వాసుదేవ నందకుమారా
నారాయణ నిను నమ్మితి
నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణా  ll

భావం
జలము స్థానముగా గల ఓహరీ ! లక్ష్మీదేవికి భర్తయైన వాడా ! అవతారములు దరించినప్పుడు నరరూపమున వచ్చువాడా ! విష్ణుదేవా ! అన్నిలోకములను తనయందే కలవాడా ! నందుని కుమారుడా ! శబ్దమే గమ్యముగా గలవాడా ! నిన్నే నమ్మితిని. నర సమూహమునకు స్థానమైన కృష్ణా ! కొండను ధరించినవాడవు నన్ను కాపాడుము.

🌻 94 వ పద్యం

తిరుమణి దురిత విదూరము
తిరుమణి సౌభాగ్యకరము త్రిజగములందున్
తిరుమణి పెట్టిన మనుcజుడు
పరమణిపవిత్రుండు భాగ్యవంతుcడు కృష్ణా  ll

భావం :
ఓకృష్ణా!తిరుమణి అనగా త్రిపుండములు పాపములను పోగొట్టును,భాగ్యమిచ్చును సంపదలను కలిగించును, కాబట్టి మూడు లోకములనందును తిరుమణిని ధరించినవాడు పాపరహితుడు,పవిత్రమైన వాడు,ఐశ్వర్య వంతుడు అగుచున్నాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🙏🙏🙏🙏🙏🙏
-----------------------------
🌸🌸🌸🌸🌸🌸
        శుభోదయం
🌸🌸🌸🌸🌸🌸