ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక - కంద పద్యాలు
సేకరణ / రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ (1)
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:- శ్రీ కృష్ణాయన:
🌹. శ్రీ కృష్ణ శతకం - పద్య స్వరూపం - 1 🌹
పద్యము - భావము
🌻. 1 నుండి 14 పద్యాలు 🌻
🌻. 1 వ పద్యం
శ్రీ రుక్మిణీశ కేశవ
నారద సంగీతలోల నగధర శౌరీ
ద్వారక నిలయ జనార్ధన
కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణా.ll
భావం:--
శ్రీ రుక్మిణీదేవికి నాథుడవు, జలమున నిద్రించువాడవు, నారద సంగీతమునకు వశడవు గోవర్ధనపర్వతమెత్తి గోపకులమును రక్షించినవాడవు. ద్వారకా వాసుడవు. భక్తులను పాలించువాడవు అగు ఓ కృష్ణా ! దయతో మమ్ము రక్షింపుము.
🌻 2 వ పద్యం
నీవే తల్లి వి దండ్రి వి
నీవే నా తోడు నీడ నీవే సఖుఁడౌ
నీవే గురుఁడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా.ll
భావం :--
హే కృష్ణా ! నీవే నా తల్లివి, తండ్రియు, హితుడవు, వీడవలెవెన్నంటి యుండువాడవు, గురుడవు దైవము అయినవాడవు, నా ప్రభుడవు, నాకు ఆధారుడవు అని నమ్మితిని. నిజముగ సుమా !
🌻 3 వ పద్యం
నారాయణ పరమేశ్వర
ధారా ధర నీలదేహ దానవవై రీ
క్షీరాబ్ధిశయన యదుకుల
వీరా నను గావు కరుణ వెలయఁగ కృష్ణా.ll
భావం:--
నారాయణుడు, పరమేశ్వరుడు నీలదేహుడు, రాక్షసవైరి, క్షీరాబ్దిశయనుడు, యదువీరుడు అను బిరుదులతో విహరించే ఓ కృష్ణా ! దయతో నన్నుగావుమయ్యా.
🌻 4 వ పద్యం
హరియను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామమహత్మ్యము
హరి హరి పొగడంగవశమె హరి శ్రీకృష్ణా.ll
భావం:--
అంభుజనాభా ! కృష్ణా ! సమస్తపాపములు పోగొట్టు నీ పేరిటి "హరి" అను రెండక్షరముల మహిమను ఎవరును పొగడజాలరు. నా బోటి వానికి వీలగునా కాదుగదా ????
🌻 5 వ పద్యం
కౄరాత్ముఁ డజామీళుఁడు
నారాయణ యనుచు నాత్మనందను బిలువన్
ఏ రీతి నేలుకొంటివి
యేరీ నీసాటివేల్పు వెందును కృష్ణా.ll
భావం:--
దుర్మార్గుడగు అజామిళుడు తనకుమారుని "నారాయణ" అని పిలిసినందుకే అతనిని రక్షించితివి, నీకు సమానమైన దైవమెందును లేరు కదా ఓ కృష్ణా !??
🌻 6 వ పద్యం
చిలుక నొక రమణి ముద్దులు
చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరుం
బిలిచిన మోక్షము నిచ్చితి
పలరగ మిము దలఁచు జనుల కరుదా కృష్ణా.ll
భావం:-
కృష్ణా !ఒక స్త్రీ ముద్దుగా ఒక చిలుకను "శ్రీరామ" అని పిలిచినంత మాత్రమునే ఆదరించి మోక్షమిచ్చినావు కదా..... నిన్నుభక్తితో ధ్యానించు వారికి తప్పక ముక్తి కలుగును కదా కృష్ణా
🌻 7 వ పద్యం
అకౄరవరద మాధవ
చక్రాయుధ ఖడ్గపాణిశౌరి ముకుందా
శక్రాదిదివిజసన్నుత
శుక్రార్చిత నన్ను కరణఁజూడుము కృష్ణా.
భావం:-
అకౄరుని కాపడినట్టియు, ఇంద్రుడు మున్నగు దేవతలచే స్తుతించబడినట్టియు, చక్రము,ఖడ్గము, శార్జ్ఞము మొదలగు ఆయుధములు దాల్చినట్టి ఓ కృష్ణా ! నన్ను రక్షింపుము.
🌻 8 వ పద్యం
నందుని ముద్దులపట్టివి
మందరగిరి ధరుని హరుని మాధవు విష్ణున్
సుందరరూపుని మునిగణ
పండితు నిను దలఁతు భక్తవత్సల కృష్ణాll
భావం:-
భక్తులపై కరుణగల ఓ కృష్ణా ! నందుని ముద్దుల కొమరుడవై పుట్టితివి. మందరపర్వతమును దాల్చితివి. హరి, మాధవుడు, విష్ణువు అను పేర్లుచే నుతింపబడితివి. సౌందర్యసాలివని మునులచే పొగడబడితివి. అట్టి నిన్ను నా మదిలో ధ్యానించెదను.
🌻 9 వ పద్యం
ఓ కారుణ్యపయోనిధి!
నా కాధారంబ వగచు నయముగఁ బ్రోవ
న్నా కేల యితర చింతలు
నాకాధిప వినుత లోకనాయక కృష్ణాll
భావం:-
ఇంద్రునిచే సన్నుతింపబడిన లోకనాయకా ! కృష్ణా ! దయాసముద్రడవగు నీవు ఆధారముగానుండగా, నాకు ఇతర చింతలతో పనిలేదు.
🌻 10 వ పద్యం
వేదంబులు గననేరని
యాది పరబ్రహ్మమూర్తి వనఘ మురారీ
నా దిక్కు జూచి కావుము
నీ దిక్కే నమ్మినాఁడ నిజముగ కృష్ణాll
భావం:-
వేదంబులు తెలిసికొనజాలని, ఆదిపరబ్రహ్మవు, పాపరహితుడవు, దుష్టశిక్షకుడవు అగు ఓ కృష్ణా ! నీవే దిక్కని నమ్ముకున్నాను. నన్ను రక్షింపుమయ్యా.....
🌻 11 వ పద్యం
పదునాలుగు భువనంబులు
కుదురుగ నీకుక్షి నిలుపుకొను నేర్పరివై
విదితంబుగ నా దేవకి
యుదరములో నెట్టు లొదిగియుంటివి కృష్ణా.
భావం:--
కృష్ణా ! పదునాలుగు లోకములు నీ ఉదరములో గల వాడవు. నీ తల్లియగు దేవకీ దేవి కడుపులో ఎట్లు అణగియుంటివో ! చాలా చిత్రము నీ లీలలు.
🌻 12 వ పద్యం
అష్టమి రోహిణి ప్రొద్దున
నష్టమగర్భమున బుట్టి యా దేవకికిన్
దుష్టుని కంసు వధింపవె
సృష్టి ప్రతిపాలనంబు సేయగ కృష్ణా.
భావం:--
లోకమును ధర్మయుక్తముగా పాలించుటకు దేవకీ దేవికి ఎనిమిదవ బిడ్డవై పుట్టి, దుర్మార్గుడగు కంసుని చంపితివి కదా ! ఓ కృష్ణా నీ క్రియలు ధర్మాత్మకములు ప్రపంచమును రక్షించునవికదా.
🌻 13 వ పద్యం
అల్ల జగన్నాథుకు వ్రే
పల్లియ క్రీడార్థమయ్యె పరమాత్మునకున్
గొల్ల సతి యా యశోదము
తల్లి యునై చన్నుఁగుడిపె దనరగ కృష్ణా.
భావం:--
కృష్ణా ! జగన్నాధుడవైన నీకు వ్రేపల్లె ఆటస్థలమయ్యెను. గొల్లసతియగు యశోద తల్లియై పాలిచ్చెను. వ్రేపల్లె ధన్యమయ్యెను. యశోద ధన్యురాలయ్యెను.
🌻 14 వ పద్యం
అందెలు గజ్జెలు మ్రోయగ
చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందుని సతి యా గోపిక
ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా.
భావం:--
కృష్ణా ! నందుని భార్యయగు యశోద కాళ్ళ గజ్జెలు, అందెలు మ్రోయగా మిగుల వేడుకతో చిందులు త్రొక్కుచు ఆడెదవు. ఆమె అదృష్టమే అదృష్టము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీ కృష్ణ శతకం - పద్య స్వరూపం - 2 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. 15 నుండి 28 పద్యాలు 🌻
🌻 15 వ పద్యం
హరిచందనంబు మేనున
కరమొప్పెడు హస్తములను కంకణరవముల్
ఉరమున దత్నము మెఱయఁగఁ
బరిగితివౌ నీవు బాలప్రాయము కృష్ణా.
భావం:--
కృష్ణా ! నీవు చిన్నతనము నందు శరీరమున శ్రీగంథమును, చేతులయందు కంకణధ్వనులు, వక్షమున కౌస్తుభమణియు, మెరయగా అందముగా అగుపించితివి కదా...
🌻 16 వ పద్యం
పాణితలంబున వెన్నయు
వేణీమూలబునందు వెలయఁపింఛం
బాణిముత్యము ముక్కున
నాణెముగా దాల్చు లోకనాథుఁడ కృష్ణా.
భావం:--
కృష్ణా ! చేతిలో వెన్నముద్దయు, శిరస్సుపై నెమలి పింఛము, ముక్కునందు ముత్తెమును నేర్పుగా ధరించి, లోకమును మోహింపజేసిన శేషశాయివి నీవే కదా ....
🌻 17 వ పద్యం
మడుగుకు జని కాశియుని
పడగలపై భతరశాస్త్ర పద్దతి వెలయన్
గడు వేడుకతో నాడెడు
నడుగులు నా మదిని దలcతు నచ్యుత కృష్ణా.
భావం:--
కృష్ణా ! అచ్యుతా ! కాళీయుని మడుగుజొచ్చి, కాళీయుని పడగలపై భరతశాస్త్ర పద్ధతిగా, నాట్యమాడిన నీ పాదములను నామదిలో నిరతము ధ్యానింతును.
🌻 18 వ పద్యం
బృందావనమున బ్రహ్మ
నందార్భకమూర్తి వేణునాదము నీ వా
మందార మూలమున గో
విందాపూరింతువౌర వేడుక కృష్ణా.
భావం:--
కృష్ణా ! బృందావనమందు ఆనందమును గూర్చు బాలుని ఆకారముతో మందార వృక్షమూలమున విలాసముగా వేణువును మ్రోగించుచుందువు కదా.
🌻 19 వ పద్యం
వారిజనేత్రలు యమునా
వారిని జలకంబులాడవచ్చిన నీవా
చీరలుమ్రుచ్చిలియిచ్చితి
నేరుపురా యదియు నీకు నీతియె కృష్ణా.
భావం:--
గోపికలు యమునా నదిలో స్నానము చేయుటకు రాగా, వారి చీరలను నేర్పుగా దొంగిలించి, తెచ్చితివి. ఇట్లు చేయుట నీనేర్పు వెల్లడియగుటకా ! అటుల చేయుట నీకు తగునటయ్యా
🌻 20 వ పద్యం
దేవేంద్రుcడలుకరోడను
వావిరిగా ఱాళ్ళవాన వడిగుఱియింపన్
గోవర్థనగిరి యెత్తితి
గోవుల గోపకుల గాచుకొఱకై కృష్ణా.
భావం:--
కృష్ణా !పూర్వము ఇంద్రుడు కోపముచే గోకులముపై రాళ్ళవాన కురిపించెను. నీవు గోవర్ధనపర్వతమెత్తి అచటి వారిని కాపాడితివి కనుక, మిక్కిలి పరోపకార పరాయణుడవు కదయ్యా !
🌻 21 వ పద్యం
అండజవాహన వినుబ్ర
హ్మండంబుల బంతులపట్ల యాడెడు నీ వా
కొండల నెత్తితి వందురు
కొండిక పనిగాక దొడ్డకొండా కృష్ణా.
భావం:--
కృష్ణా ! బ్రహ్మాండములను బంతులాడినట్లు, ఆడింప సామర్ధ్యముగల నీకు, కొండలను ఎత్తుట తేలికయైన పనియేయగును కదా !
🌻 22 వ పద్యం
అంసాలంబిత కుండల
కంసాంతక! నీవు ద్వారకపురిలోనన్
సంసారరీతి నుంటివి
హంసేంద్ర! విశాలనేత్ర అచ్యుత కృష్ణా.
భావం:--
కృష్ణా ! భుజములను తాకు కుండలములు కలవాడా ! కంసాది దుష్టులను వధించి, కారణజన్ముడవయి కూడా, ద్వారకానగరిలో మామూలు సంసారివై యుండుట చాలా ఆశ్చర్యము కలిగించితివి.
🌻 23 వ పద్యం
పదియాఱువేల నూర్వురు
సుదతులు యెలమండ్రు నీకు సొంపుగ భార్య
ల్విదితంబుగ బహురూపుల
వదలక రమియింతువౌర వసుధను కృష్ణా.
భావం:--
కృష్ణా ! నీవు పదహారువేల గోపికలతో, ఎనిమిదిమంది భార్యలతో, బహురూపములతో నెడతెగక భోగించుచుందువు గదా ! నిజమైన రాజభోగమన్న నీదే కదయ్యా !
🌻 24 పద్యం
అంగన పనుపున ధోవతి
కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన యా సంగతి విని దయనొస్రుcగితివి
రంగుగ సంపదలు లోకరక్షక కృష్ణా.
భావం:--
కృష్ణా ! తన భార్యయైన వామాక్షీ పంపుటచే, కొంగున అటుకలు మూటకట్టుకొని, దారిద్ర్యభారంతో వచ్చిన, నీ స్నేహితుడగు కుచేలునికి అష్టైశ్వర్యములు ఇచ్చితివి కదా !
🌻 25 వ పద్యం
హా వసుదేవ కుమారక
కావుము నా మాన మనుచు కామిని వేడన్
ఆ వనజాక్షికి నిచ్చితి
శ్రీ వర! యక్షయ మంటంచు చీరలు కృష్ణా.
భావం:--
కృష్ణా ! కురుసభలో ద్రౌపతి "హా ! వసుదేవనందన! నా మనమును కాపాడుమని, నిన్ను వేడగా, ఆమెకు ఆక్షయముగా వలువలు ఇచ్చి కాపాడితివి కదా ! నీకు ఆశ్రిత వాత్సల్యము మిక్కిలి ఎక్కువ కదా !
🌻 26వ పద్యం
శుభ్రమగు పాంచజన్యము
అభ్రంకష మగుచు మ్రోవ నాహవభూమిన్
విభ్రమలగు దనుజసుతా
గర్భంబుల పగులజేయు ఘనుcడవు కృష్ణా.
భావం:--
కృష్ణా ! శుభ్రమగు పాంచజన్యమును ఆకాశమంటునట్లు మ్రోగించి, యుద్ధభూమిలో అనుజుల గర్భంబులు భేదింపజేయు ఘనుడవు నీవే కదయ్యా !
🌻 27వ పద్యం
జయమును విజయున కియ్యవె
హయముల ములుకోల మోపి యదలించి మహా రయమున రొప్పవే తేరున
భయమున తివుసేన విఱిగి పాఱగ కృష్ణా.
భావం:--
హే శ్రీకృష్ణా ! అర్జునునకు రథసారధివై, గుర్రముల కోలనదిలించి వైరిసేనలు, భయమున చెల్లాచెదరై పారిపోవునట్లుచేసి అర్జునునకు జయమును కూర్చితివి కదా !
🌻 28వ పద్యం
దుర్జనులగు నృపసంఘము
నిర్జింపగ దలచి నీవు నిఖిలాధారా !
దుర్జనులను వధియింపను
నర్జును రథచోదకుండ వైతివి కృష్ణా ll
భావం:--
కృష్ణా ! నీవు దుర్జనులగు నృపులను జయించుటకు, దుర్మార్గులను వధించుటకును అర్జునునకు రథచోదకుడవైతివి కానీ, ఇతరమునకు కాదు, ఇందువలన నిఖిలాధరుడవు అనదగినతివి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹🌹🌹🌹🌹🌹
శ్రీశంకరభగవత్పాదాః
విజయంతే
🌹🌹🌹🌹🌹🌹
-----------------------------
🔴 శ్రీమాత్రేనమః 🔴
పరము
నిష్కళము కనగ బ్రహ్మమదియె
చంద్రసూర్యానలకళల జగతికంత
మూల శక్తిగ రాజిలు ముఖ్య వేల్పు
మోహమెల్ల నశింపగ మోక్షమిడును.
(తోపెల్ల సత్యనారాయణ మూర్తి,
అమలాపురం.)
🙏🙏🙏🙏🙏🙏
-------------------------🌸🌸🌸🌸🌸🌸
🌹. శ్రీ కృష్ణ శతకము - పద్య స్వరూపం - 3 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. 29 నుండి 42 పద్యాలు 🌻
🌻 29వ పద్యం
శక్రసుతు గాచుకొఱకై
చక్రము చేపట్టి భీష్ము జంపగ చను నీ
విక్రమ మేమని పొగడను
నక్రగ్రహ సర్వలోకనాయక కృష్ణా .
భావం:--
కృష్ణా ! అర్జునుని కాపాడుటకు చక్రము చేతబూనిభీష్ముని చంపబోవు నీ పరాక్రమము ఏమని కొనియాడెదను ! నీ పరాక్రమము అద్భుతము కదా !
🌻 30వ పద్యం
దివిజేంద్రసుతుని జంపియు
రవిసుతు రక్షించినావు తఘురాముడవై
దివిజేంద్రసుతుని గాంచియు
రవిసుతు బరిమార్చితౌర రణమున కృష్ణా ll
భావం:--
కృష్ణా ! నీవు రామావతారములో ఇంద్ర తనయుడు అగు వాలిని చంపి, సూర్య తనయుడు అగు సుగ్రీవుని కాపాడితివి. కృష్ణావతారమున సూర్య తనయుడగు కర్ణుని బలహీనుడిని చేసి, ఇంద్రతనయుడు అగు అర్జునుని రక్షించితివి. నీ లీలలు అద్భుతాలు కదయ్యా !
🌻 31 వ పద్యం
దుర్భరబాణము రాగా
గర్భములోనుండి "యభవ !గావు" మటన్నన్
నిర్భరకృప రక్షించితి
వర్భకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా.
భావం:--
కృష్ణా ! వచ్చిన బాణమునకు భీతిల్లి ఉత్తర గర్భమందు ఉండి "కృష్ణా కావు" మనివేడి అభిమన్యుని కుమారుడగు పరీక్షిత్తుని కాపాడితివి. నీవు ఆర్తత్రాణపరాయణుడవు కదయ్యా మాధవా !
🌻 32 వ పద్యం
గిరులందు మేతివౌదువు
సురలందున నింద్రుడౌదువు చుక్కలలోనన్
బరమాత్మ చంద్రుడౌదువు
నరులందున నృపతి వౌదు నయముగ కృష్ణా.
భావం:--
కృష్ణా ! నీవు గిరులలో మేరువువు, దేవతలలో ఇంద్రుడవు, చుక్కలలో చంద్రుడవు, నరులలో రాజువు, అయినవాడవు కావున నీవు అన్నిటి యందును అధికుడవయ్యా .
🌻 33 వ పద్యం
చుక్కల నెన్నగ వచ్చును
గ్రక్కున భూరేణువులను గణుతింప నగున్
జొక్కపు నీ గుణ జాలము
నక్కజమగు లెక్కపెట్ట నజునకు కృష్ణా.
భావం:--
కృష్ణా ! చుక్కలను, భూరేణువులను లెక్కించవచ్చును. కానీ బ్రహ్మకైనను నీ గుణములు లెక్కింప సాధ్యము కాదు కదయ్యా !
🌻 34 వ పద్యం
కుక్షిని నఖిల జగంబులు
నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్
రక్షక ! వటపత్రముపై
దక్షత పవళించునట్టి ధన్యుడ కృష్ణా.
భావం:--
కృష్ణా ! నీ ఉదరములో జగములను దాచి, ప్రళయకాలమందు వటపత్రముపై పవళించియుందువు కదా ! వటపత్రశాయి అన్న కీర్తిశాలివి కదయ్యా నీవు.
🌻 35 వ పద్యం
విశ్వోత్పత్తికి బ్రహ్మవు
విశ్వము రక్షింపదలచి విష్ణుడ వనగా
విశ్వము జెరుపను హరుడవు
విశ్వాత్మక ! నీవె యగుచు వెలయగ కృష్ణా.
భావం:--
కృష్ణా ! సృష్టింప -- బ్రహ్మవు, పెంచ -- విష్ణుడవు, నశింప(త్రుంప) -- శివుడవుగా వెలసిన
త్రిమూర్తిస్వరూపుడవు నీవే కదయ్యా !
🌻 36 వ పద్యం
అగణిత వైభవ ! కేశవ !
నగధర ! వనమాలి ! యాదినారాయణ !యో
భగవంతుడ ! శ్రీమంతుడ !
జగదీశ్వర ! శరణు నీకు శరణము కృష్ణా.
భావం:--
శ్రీకృష్ణా ! ఎక్కువ వైభవం కలవాడా ! కేశవా ! నగధర ! వనమాలీ ! ఆదినారాయణా ! భగవంతుడా ! శ్రీమంతుడా ! జగదీశ్వరా ! మున్నగు బిరుదములు గల ఓ కృష్ణా ! నిన్ను శరణుజొచ్చితిని, నన్ను కాపాడుము.
🌻 37 వ పద్యం
మగ మీనమవై జలనిధి
పగతుని సోమకుని జంపి పద్మభవునకు
న్నిగమములు దెచ్చి యిచ్చితి
సుగుణాకర! మమ్ము గరుణ జూడుము కృష్ణా.
భావం:--
కృష్ణా ! మత్స్యావతారమెత్తి, సముద్రములో దాగిన సోమకుని చంపి, వేదములు బ్రహ్మకు అందించిన దేవా ! మమ్ము దయతో పాలింపుమయ్యా.....
🌻 38 వ పద్యం
అందఱు సురలును దనుజులు
పొందుగ క్షిరాబ్దిదరువ పొలుపున నీ వా
నందముగ కూర్మ రూపున
మందరగిరి యెత్తితౌర మాధవ కృష్ణా.
భావం:--
కృష్ణా ! దేవాసురులు మందరగిరిని కవ్వముగా చేసి, పాలసముద్రమును చిలికినపుడు, గిరి క్రుంగిపోతుండగా, నీవు కూర్మ రూపుడవై గిరినెత్తి, వారిని బ్రోచితివి కదా ! మమ్ము దయచూడుమయ్యా !
🌻 39 వ పద్యం
ఆది వరాహుడవయి నీ
వా దనుజ హిరణ్య నేత్రు హతుజేసి తగన్
మోదమున సురలు పొగడగ
మేదిని కిటి ముట్టికెత్తి మెరసితి కృష్ణా.
భావం:--
కృష్ణా !నీవు ఆదివరాహావతారమెత్తి, హిరణ్యాక్షుని చంపి, భూమిని కోరలపై ఎత్తి, దేవతలు పొగడగా ప్రకాశించితివి కదా !
🌻 40 వ పద్యం
కెరలి యఱచేత కంబము
నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్
ఉరమును జీరి వధించితి
నరహరి రూపావతార నగధర కృష్ణా.
భావం:--
కృష్ణా ! హిరణ్యకశిపుడు స్తంభమును అరచేత తట్టగా, అందుండిన నీవు నరసింహావతారుడవై వెడలి, వాని వక్షము చీల్చి సంహరించితివి కదా !
🌻 41 వ పద్యం
వడుగవువై మూడడుగుల
నడిగితివా బలిని భళిర, యఖిల జగంబుల్
తొడిగితివి నీదు మేనున
గడుచిత్రము నీ చరిత్ర ఘనుడవు కృష్ణా.
భావం:--
కృష్ణా ! వామనావతారమెత్తి, బలిని మూడడుగుల భూమినడిగి, లోకములన్నిటిని నీ మేనితో నింపితివి కదయ్యా మహాత్మా ! నీ చరిత్రలు కడు చిత్రములు.
🌻. 42 వ పద్యం
ఇరువ దొకమార్లు నృపతుల
శిరముల క్షండించి తౌర చేగొడ్డంటన్
ధర గశ్యపునకు నిచ్చియు
బరగవె జమదగ్ని రామభద్రుడ కృష్ణా.
భావం:--
కృష్ణా !పరశురామావతారము ఎత్తి ఇరువుదొక్కమార్లు రాజులను హతమార్చి, తెచ్చుకున్న రాజ్యాలను కశ్యపునకు యిచ్చితివి కదా ! నీ మహిమలు తెలుసుకొనలేకపోతిమి కదా !
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹🌹🌹🌹🌹🌹
శ్రీశంకరభగవత్పాదాః
విజయంతే
🌹🌹🌹🌹🌹🌹
-----------------------------
🔴 శ్రీమాత్రేనమః 🔴
మూడు గుణముల పనులవి మూర్తమంద
బ్రహ్మ విష్ణు మహేశులై పరగు చుండ
వారి పనులకు శక్తియె పరమమాయె
తనదు కృపనంద జనుడిల ధన్యుడగును.
🙏🙏🙏🙏🙏🙏
(తోపెల్ల సత్యనారాయణ మూర్తి,
అమలాపురం.)
🌹. శ్రీ కృష్ణ శతకం - పద్య స్వరూపం - 4 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. 43 నుండి 57 పద్యాలు 🌻
🌻 43 వ పద్యం
దశకంఠుని బరిమార్చియు
కుశలముతో సీత దెచ్చు కొనియు నయోధ్య
న్విశదముగ కీర్తి నేలిన
దశరథ రామావతార ధన్యుడ కృష్ణా.
భావం:--
🌻 44 వ పద్యం
ఘనులగు ధేనుక ముష్టిక
దనుజుల జెండాడి తౌర తగ భుజశక్తిన్
అనఘాత్మ? రేవతీ పతి
వనగ బలరామమూర్తి యౌగద కృష్ణా.
భావం:--
కృష్ణా ! బలసాలురగు ధేనుక, ముష్టికులను దనుజులను చంపి, సుజనులను రక్షించిన రేవతీ విభుడవగు బలరాముడవు నీవే కదా !
🌻. 45 వ పద్యం
త్రిపురాసుర భార్యల నతి
నిపుణతతో వ్రతము చేత నిలిపిన కీర్తుల్
కృపగల రాజవు భళిరే
కపటపు బౌద్దావతార ఘనుడవు కృష్ణా.
భావం:--
కృష్ణా ! నీవు త్రిపురాసుర భార్యల శీలము చెరచి, వారి భర్తలను సంహరింపచేసిన బుద్ధవతారుడవు కదా !
🌻 46 వ పద్యం
వెలిపపు తేజీ నెక్కియు
నిలపై ధర్మంబు నిలుప హీనుల ద్రుంపన్
కలియుగము తుదిని వేడుక
కలికివి గానున్న లోకకర్తవు కృష్ణా.
భావం:--
కృష్ణా ! ధర్మము నిలుపుటకు దుర్మతుల చంపుటకు, కలియుగాంతమందు నీవు కలికి రూపాన గుఱ్ఱమునెక్కి సంచరించెదవు కదా !
🌻. 47 వ పద్యం
వనజాక్ష ! భక్తవత్సల
ఘనులగు త్రైమూర్తులందు కరుణానిధివై
కన నీ సద్గుణ జాలము
సనకాది మునీంద్రులెన్నజాలరు కృష్ణా.
భావం:--
కృష్ణా ! భక్తవత్సలా ! త్రిమూర్తి స్వరూపుడవు, దయానిధివి, అయిన నీ గుణజాలము సనకాది మునీంద్రులను పొగడజాలరు.
🌻 48 వ పద్యం
అపరాధ సహస్రంబుల
నపరిమితములైన యఘము లనిశము నేనున్
గపటాత్ముడనై జేసితి
చపలుని ననుగావు శేషశాయివి కృష్ణా.
భావం:--
శేషసాయివగు కృష్ణా ! తప్పులు చేసితిని, పాపాత్ముడను, కపటుడను, చపలుడను, అగు నన్ను కాపాడుమయ్యా !
🌻 49 వ పద్యం
నరపశుడ మూఢచిత్తుడ
దురితారంభుడను మిగుల దోషగుడనునీ
గుణు తెఱుగ నెంతవాడను
హరి నీవే ప్రావు దాపు వౌదువు కృష్ణా.
భావం:--
కృష్ణా ! నరపశువును ! అజ్ఞానుడను, దోషిని, నిన్ను తెలుసుకోలేనివాడను, నన్ను తోడునీడై ఎల్లప్పుడూ కాపాడుము తండ్రీ.
🌻 50 వ పద్యం
పరనారీ ముఖపద్మము
గుఱుతుగ నొయ్యారినడక గొప్పును నడుము
న్నరయంగనె మోహింతురు
నిరతము నిను భక్తిగొల్వ నేర్వరు కృష్ణా.
భావం:--
కృష్ణా ! జనులు పరస్త్రీల ముఖమును, నడకను, కొప్పు, నడుము మొదలైనవి చూడగనే కామింతురు. కానీ నిన్ను భక్తితో కొలుచుట తెలియదు కదా అట్టివారికి.
🌻 51 పద్యం
పంచేంద్రియ మార్గంబుల
గొండెపు బుద్దిని జరించి కొన్ని దినంబుల్
ఇంచుక సజ్జన సంగతి
నెంచగ మిమ్మెరిగినాడ నిప్పుడె కృష్ణా.ll
భావం:--
కృష్ణా ! పంచేంద్రియ వ్యాపారము ననుసరించి ఇంతవరకు తిరిగి సాధు సంగతిచే నేనిప్పుడే నీ మహిమను తెలిసికొంటిని.
🌻 52 పద్యం
దుష్టుండ దురాచారుడ
దుష్టచరితుడను చాల దుర్భుద్దిని నే
నిష్ట నిను గొల్వనేరను
దుష్టుడ నను గావు కావు కరుణను కృష్ణా.
భావం:--
కృష్ణా ! నేను దుష్టుడను, దురాచారుడను, దుష్టబుద్ధిని, కావున నిను సేవింపనేరను, నీవే దయచేసి నన్ను కాపాడుము.
🌻. 53 పద్యం
కుంభీంద్రవరద ! కేశవ !
జంభాసురవైరి ! దివిజసన్నుత చరితా !
అంభోజనేత్ర జలనిధి
గంభీరా ! నన్ను గావు కరుణను కృష్ణా.
భావం:--
కృష్ణా ! గజేంద్రరక్షకా ! దేవతలచే పొగడబడువాడా ! తామర వంటి కన్నులు సముద్రమువంటి గాంభీర్యము గలవాడా ! దయతో నన్ను కాపాడుము.
🌻 54 పద్యం
దిక్కెవ్వరు ప్రహ్లాదుకు
దిక్కెవ్వరు పాండుసుతుల దీనుల కెపుడు
న్దిక్కెవ్వర య్యహల్యకు
దిక్కెవ్వరు నీవె నాకు దిక్కువు కృష్ణా.
భావం:--
కృష్ణా ! ప్రహ్లాదునకు పాండవులకు, దీనులకు, అహల్యకు నీవే దిక్కయితివి. నాకును నీవే దిక్కువు రక్షింపుము.
🌻 55వ పద్యం
హరి! నీవె దిక్కు నాకును
సిరితో నేతెంచి మకరి శిక్షించి దయం
బరమేష్టి సురలు బొగడcగ
కరిగాంచినరీతి నన్ను గాపుము కృష్ణా.
భావం:--
కృష్ణా ! లక్ష్మీయుతుడవై వచ్చి మొసలిని దునుమాడి ఏనుగును రక్షించినట్లు నన్ను కాపాడుము, నీవే నాకు దిక్కు కృష్ణా !
🌻 56వ పద్యం
పురుషోత్తమ ! లక్ష్మీపతి !!
సరసిజ గర్భాదిమౌని సన్నుత చరితా !
మురభంజన ! సుర రంజన !
వరదుడవగు నాకు భక్తవత్సల కృష్ణా.
భావం:--
కృష్ణా ! బ్రహ్మమొదలైనవారిచే కొనియాడబడినవాడా ! మురభంజన ! భక్తుల ప్రేమించువాడా ! నాకు వరములిచ్చి నన్ను కాపాడుము.
🌻 57వ పద్యం
క్రతువులు తీర్ధాగమములు
వ్రతములు దానములు సేయవలెనా? లక్ష్మీ
పతి! మిము దలచిన వారికి
నతులిత పుణ్యములు గలుగు టరుదా ? కృష్ణా.
భావం:--
కృష్ణా ! యజ్ఞములు , వ్రతములు , తీర్థయాత్రలు , దానములు చేయుటకంటే , మిమ్ములను కొలిచినవారికి, సాటిలేని పుణ్యము లభించును.
సశేషం......
🌹 🌹 🌹 🌹 🌹
🌹. భగవాన్ సద్గురు శ్రీధర స్వామి వారి జీవితచరిత్ర - 22 🌹
✍️. సంకలనము : సూర్య
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. అధ్యాయము - 6 - ఐదవ భాగము 🌻
శ్రీధర స్వామి ఎప్పటివలెనే ఆరోజు రాత్రి కూడా జపానుష్టానములో కూర్చుని ఉన్నారు. అతను కూర్చున్న వెంటనే అతి వికారమైన - వికృత రూపంలో ఒక యక్షిణి ఆయన మీదికి పరుగు పరుగున రావడం కనబడింది. అప్పుడు ఆయన 'రామా' 'రామా' అంటూ తమ ధ్యానము నుండి బయటకు వచ్చారు. మరుసటిరోజు ఈ కార్యం చేసిన మంత్రగాడు గుడి ప్రాంగణంలో పొర్లాడుతూ "సమర్ధా! క్షమించు! తప్పు చేశాను!" అని "మరొక్కసారి ఇటువంటి అపరాధము చేయనని" గట్టిగా ఏడ్వసాగాడు. అంతలో అతను సమాధి మందిరము మెట్టు ఎక్కసాగాడు. ఈ పరిస్థితుల్లో శ్రీధరుడు అచ్చటికి రావడం జరిగింది. ఆయన్ని చూస్తూనే ఆ మంత్రగాడు శ్రీధరునికి నమస్కారము చేసాడు.
అచ్చటకు వేంచేసిన కార్యనిర్వాహకుడు నీకేమయిందని ఆ మంత్రగాడిని ప్రశ్నించారు. అంద…
🌹🌹🌹🌹🌹🌹
శ్రీశంకరభగవత్పాదాః
విజయంతే
🌹🌹🌹🌹🌹🌹
-----------------------------
🔴 శ్రీమాత్రేనమః 🔴
భావవి శుద్ధి జూపగ ప్రభావ విహీనత గల్గిన బుద్ధినిచ్చి నీ
పావన నామ రూపముల భక్తియు జూడగ కొంతమాత్రమై
యావల బెట్టి నిట్లు నను నార్తిని నొందగ జేసినాడవే
కావగ నన్ను వేరెవరు కల్గిరి నీభువి శంకరా! హరా!
🙏🙏🙏🙏🙏🙏
(తోపెల్ల సత్యనారాయణ మూర్తి,
అమలాపురం.)
-----------------------------
🌸🌸🌸🌸🌸🌸
శుభోదయం
🌸🌸🌸🌸🌸🌸
శ్రీ కృష్ణ శతకం - పద్య స్వరూపం - 5 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. 58 నుండి 70 పద్యాలు 🌻
🌻 58వ పద్యం
స్తంభమున వెడలి దానవ
డింభకు రక్షించినట్టి రీతిని వెలయన్ !
అంభోజనేత్ర ! జలనిధి
గంభీరా ! నన్నుగావు కరుణను కృష్ణా.
భావం:--
స్తంభము నుండి వచ్చి, ప్రహ్లాదుని రక్షించినట్లుగా, పద్మము వంటి నేత్రములు గలవాడా ! సముద్రము వంటి గాంభీర్యము గలవాడా !కరుణజూపి నన్ను కూడా కాపాడుము కృష్ణా.
🌻 59వ పద్యం
శతకోటి భాను తేజా !
అతులిత సద్గుణ గణాడ్య ! యంబుజనాభా
రతినాధ జనక ! లక్ష్మీ
పతిహిత ననుగావు భక్తవత్సల కృష్ణా.
భావం:--
కృష్ణా ! అనేక సూర్యుల తేజము గలవాడా ! లక్ష్మీనాధా ! మన్మధునకు తండ్రీ !మంచి గుణములు గలవాడా !భక్తవత్సలా ! నన్ను కాపాడవయ్యా !
🌻 60 వ పద్యం
మందుడనే దురితాత్ముడ
నిందల కొడిగట్టి నట్టి నీచున్నన్నున్
సందేహింపక కావుము
నందుని వరపుత్ర ! నిన్ను నమ్మితి కృష్ణా
భావం:--
కృష్ణా ! నేను మందుడను, నీచుడను, దురితాత్ముడను, నిన్నే నమ్మితిని, నన్ను సందేహింపక కాపాడుము తండ్రీ !
🌻 61వ పద్యం
గజరాజ వరదే కేశవ !
త్రిజగత్కల్యాణమూర్తి దేవ మురారీ !
భుజగేంద్రశయన మాధవ
విజయాప్తుని నన్ను గావు వేడుక కృష్ణా.
భావం:--
కృష్ణా ! గజరాజును పాలించిన కేశవా ! మూడులోకములందు శుభమైన ఆకారము కలవాడా !మురాసురుని చంపినవాడా ! శేషునిపై పవళించిన వాడా ! మాధవా ! లోకవిషయములలో జయము కల్పించి, నన్ను కాపాడుము.
🌻 62వ పద్యం
గోపాల ! దొంగ ! మురహర !
పాపాలను పాఱద్రోలు ప్రభుడవు నీవే
గోపాలమూర్తి ! దయతో
నాపాలిట గలిగి బ్రోవు నమ్మితి కృష్ణా.
భావం:--
కృష్ణా ! గోపాలా ! వెన్నదొంగా ! మురాసురుని సంహరించినవాడా ! నా పాపములను పోగొట్టువాడివి నీవేనయ్యా!
నాయందు దయజూపి, నన్ను కాపాడుము.
🌻 63 వ పద్యం
దుర్మతిని మిగుల దుష్టపు
కర్మంబులు జేసినట్టి కష్టుని నన్నున్
నిర్మలుని జేయవలెని
ష్కర్ముడ నిను నమ్మినాను సతతము కృష్ణా.
భావం:--
కృష్ణా ! చెడుమనస్సు కలవాడను, దుర్మార్గమైన పనులు చేసినట్టి దుష్టుడను, పాపరహితునిగా చేసి పాలిచుమయ్యా ! నిరతము నిన్నే నమ్మియున్నాను కదయ్యా !
🌻 64 వ పద్యం
దుర్వార చక్రకరధర !
శర్వాణీ ప్రముఖ వినుత ! జగదాధారా !
నిర్వాణనాధ ! మాధవ !
సర్వాత్మక నన్నుగావు సరగున కృష్ణా.
భావం:--
కృష్ణా ! వారింపసాధ్యముకాని చక్రము చేతియందు గలవాడా ! పార్వతి మున్నగువానిచే పొగడబడినవాడా !లోకమునకు ఆధారుడైనవాడా ! మోక్షమునకు ప్రభువైనవాడా ! మాధవా ! సర్వాత్మక ! నన్ను కాపాడుము.
🌻 65 వ పద్యం
సుత్రామనుత ! జనార్థన !
సత్రాజిత్తనయనాధ ! సౌందర్యకళా !
చిత్రాపతార ! దేవకి
పుత్రా ! ననుగావు నీకు పుణ్యము కృష్ణా.
భావం:--
కృష్ణా ! ఇంద్రాదివినుతా ! జనార్థన ! సత్యభామా ప్రియా ! దేవకీ తనయా ! నన్ను కాపాడుము, నీకు పుణ్యమగును.
🌻 66వ పద్యం
బల మెవ్వడు కరి బ్రోవను
బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్
బలమెవ్వడు రవిసుతునకు
బలమెవ్వడు నాకు నీవె బలమౌ కృష్ణా.
భావం:--
కృష్ణా ! గజేంద్రునకు, ద్రౌపదికి, సుగ్రీవునకు బలమేవ్వరో, అట్టి నీవే నాకును బలము. నన్ను కాపాడుము తండ్రీ.
🌻 67వ పద్యం
పరుసము సోకిన యినుమును
పరుసగ బంగారమైన వడుపున జిహ్వన్
హరి ! నీ నామము సోకిన
సురపందిత నేను నటుల సులభుడ కృష్ణా.
భావం:--
కృష్ణా ! పరుసవేది సోకిన ఇనుము, బంగారమగునట్లు, మందుడనగు నేనును, నీ నామము ఉచ్చరించిన సన్మార్గుడునిగా అయ్యెదను.
🌻 68వ పద్యం
ఒకసారి నీదు నామము
ప్రకటముగా దలచువారి పాపము లెల్లన్
వికలములై తొలగుటకును
సకలార్థా ! యజామీళుడు సాక్షియె కృష్ణా.
భావం:--
కృష్ణా ! ఒకసారి నీ నామము స్మరింపగా పాపములు పోవుననుటకు అజామీళుడే సాక్షి గదయ్యా !
🌻 69 పద్యం
హరి సర్వంబున గలడని
గరిమను దైత్యుండు బలుక కంబము లోనన్
ఇరవొంద వెడలి చీల్చవె
శరణను ప్రహ్లాదకుండు సాక్షియె కృష్ణా.
భావం:--
కృష్ణా ! నీవు అంతటా కలవని ప్రహ్లాదుడు పలుకగా, స్తంభములోనుండి వచ్చి హిరణ్యకశిపుని చంపితివి. శరణు అనగా వచ్చి కాపాడితివి. అందుకు సాక్షి ప్రహ్లాదుడే కదయ్యా !
🌻 70 వ పద్యం
భద్రార్చిత పదపద్మసు
భద్రాగ్రజ సర్వలోక పాలక హరి! శ్రీ
భద్రాధిప ! కేశవ ! బల
భద్రానుజ ! నన్ను బ్రోవు భవహర కృష్ణా.
భావం:--
కృష్ణా ! భద్రార్చిత పాదపద్మా ! లోకపాలకా ! భద్రాద్రివాసా ! బలభద్రానుజ ! నా పాపములు పోగొట్టువాడా ! నన్ను రక్షింపుము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹🌹🌹🌹🌹🌹
శ్రీశంకరభగవత్పాదాః
విజయంతే
🌹🌹🌹🌹🌹🌹
-----------------------------
🔴 శ్రీమాత్రేనమః 🔴
కురిసెడి సుధల కదలక కుడుచు నుండు
కుండలి సుధలు లేకను కుంభకమున
కుదురు
గను నుండ లేకను కోపమొంది
చకచకగ లేచి పతినొంది శాంతమయ్యె.
🙏🙏🙏🙏🙏🙏
(తోపెల్ల సత్యనారాయణ మూర్తి,
అమలాపురం.)
-----------------------------
🌸🌸🌸🌸🌸🌸
శుభోదయం
🌸🌸🌸🌸🌸🌸
కర్మన్ ఘాట్ ఆంజనేయస్వామి కి జై.. . 💐
శ్రీ కృష్ణ శతకం - పద్య స్వరూపం - 6 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. 71 నుండి 85 పద్యాలు 🌻
🌻 71 వ పద్యం
ఎటువలె కరిమొర వింటివి
ఎటువలె ప్రహ్లాదు కభయమిచ్చితి కరుణ
న్నటువలె నను రక్షింపుము
కటకట ! నిను నమ్మినాడ గావుము కృష్ణా.
భావం:--
కృష్ణా ! ప్రహ్లాదుని ఎట్లు రక్షింతివో ! గజేంద్రుని ఎట్లు బ్రోచితివో ! అట్లే దయతో నన్ను కాపాడుము. కష్టములు పడినవాడను , నిన్నే నమ్మినవాడను.
🌻 72 వ పద్యం
తట తట లేటికి జేసెదు
కటకట పరమాత్మ నీవు ఘంటాకర్ణు
న్నెటువలె నిపుణుని జేసితి
వటువలె రక్షింపుమయ్య యచ్యుత కృష్ణా.
భావం:--
హే కృష్ణా ! అచ్యుత ఘంటాకర్ణుని ఎటుల నేర్పరిగా, బుద్ధిమంతునిగా చేసితివో, నన్ను అటులే రక్షింపుమయ్యా .
🌻 73 వ పద్యం
తురగాధ్వరంబు జేసిన
పురుషులకును వేరు యిలను పుట్టుటయేమో
హరి ! మిము దలచిన వారికి
యరుదా కైవల్య పదవి యచ్యుత కృష్ణా.
భావం:--
కృష్ణా ! అచ్యుత ! అశ్వమేధయాగము చేసినవారికి జనము లేకున్నచో, నిన్ను దలచినవారికి మోక్షమరుదా (కాదు) ముక్తి లభించును.
🌻 74 వ పద్యం
ఓ భవబంధ విమోచన
ఓ భరతాగ్రజ మురారి యో రఘురామా
ఓ భక్త కామధేనువ
ఓ భయహర నన్నుగావు మో హరి కృష్ణా.
భావం:--
కృష్ణా ! భవబంధములు తొలగించువాడా ! భక్తుల కోరికలిచ్చువాడా ! భరతాగ్రజా ! రామా ! నాపాపములు పోగొట్టి నన్ను కాపాడుము.
🌻 75 వ పద్యం
ఏ తండ్రి కనక కశ్యపు
ఘాతకుడై యతని సుతుని కరుణను గాచెన్
బ్రీతి సురకోటి బొగడగ
నా తండ్రీ ? నిన్ను నేను నమ్మితి కృష్ణా.
భావం:--
కృష్ణా ! ఏ తండ్రి దుర్మార్గుడగు హిరణ్యకశిపుని చంపి అతని సుతుడగు ప్రహ్లాదుని దేవతలు పొగడగా కాపాడెనో, ఆ తండ్రినే నా తండ్రిగా నమ్మితిని, నన్ను కాపాడుము.
🌻 76 వ పద్యం
ఓ పుండరీక లోచన
ఓ పురుషోత్తమ ముకుంద ఓ గోవిందా
ఓ పురసంహార మిత్రుడ
ఓ పుణ్యుడ నన్ను బ్రోవుమో హరి కృష్ణా.
భావం:--
కృష్ణా ! పుండరీకలోచనా ! ముకుందా ! గోవిందా ! పురుషోత్తమా ! శంకరమిత్రా ! మున్నగు నామములు కలిగిన హరీ ! నన్ను బ్రోవుమయ్యా .
🌻 77 వ పద్యం
ఏ విభుడు ఘోర రణమున
రావణు వధియించి లంకరాజుగ నిలిపెన్
దీవించి యా విభీషణు
నా విభు నే దలతు మదిని నచ్యుత కృష్ణా.
భావం:--
కృష్ణా ! ఏ ప్రభువు యుద్ధమునందు రావణుని చంపి విభీషణుని లంకకు రాజుగా చేసెనో అట్టి ప్రభువును నేను ధ్యానించెదను.
🌻 78 వ పద్యం
గ్రహభయ దోషము పొందరు
బహు పీడలు చేర వెఱుచు, పాయును నఘముల్
ఇహపర ఫలదాయక ! విను
తహ తహ లెక్కడివి నిన్ను దలచిన కృష్ణా.
భావం:--
నిన్ను తలచినవారికి గ్రహభయములు కలుగవు. బహుపీడలు కలుగవు. పాపములంటవు. ఇహఫలదాయకా ! కష్టములుండవు.
🌻 79 వ పద్యం
గంగ మొదలైన నదులను
మంగళముగ సేయునట్టి మజ్జనమునకున్
సంగతి గలిగిన ఫలములు
రంగుగ మిము దలచు సాటిరావుర కృష్ణా.
భావం:--
కృష్ణా ! గంగా మొదలైన నదులలో స్నానము చేయుటచే కలుగు ఫలితము, నిన్ను దరిచేరి ధ్యానించుటచే కలుగు ఫలితముతో సమానము కాదు.
🌻 80 వ పద్యం
అ దండకా వనంబున
కోదండము ! దాల్చినట్టి కోమలమూర్తీ !
నా దండ గావ రమ్మీ
వేదండము కాచినట్టి వేల్పువు కృష్ణా.
భావం:--
కృష్ణా ! దండకాడవిలో కోదండము దాల్చినవాడవు, గజేంద్రుని కాపాడినవాడవు, నా యెడనుండి, నన్ను కాపాడరమ్ము.
🌻 81 వ పద్యం
చూపుము నీ రూపంబును
పాపపు దుష్కృతములెల్ల పంకజనాభా
పాపము నాకును దయతో
శ్రీపతి నిను నమ్మునాcడ సిద్దము కృష్ణా ll
భావం
కృష్ణా !కమలనాభా ! శ్రీపతీ నీ మంగళాకారమును చూపుము. నాపాపములను బాపి కాపాడుము. నిజముగా నిన్నే నమ్మినవాడను.
🌻 82 వ పద్యం
నీనామము భవహరణము
నీ నామము సర్వసౌఖనివహకరంబు
న్నీ నామ మమృత పూర్ణము
నీ నామము నే దలంతు నిత్యము కృష్ణా ll
భావం
ఓ కృష్ణా!నీ నామము ఉచ్చరించిన సంసార దుఃఖములు తొలగిపోవును,నీ నామమే సర్వసౌఖ్యముల నిచ్చును,నీ నానమము అమృతముతో నిండి ఉండును,అట్టి నీ నామమునే నేను ఎల్లపుడు స్మరింతును.
🌻 83 వ పద్యం
పరులను నడిగిన జనులకు
కురచసుమీ యిదియటంచు గుఱుతుగ నీవు
న్గురుచcడవై వేడితి మును
ధర బాదత్రయము బలిని తద్దయు కృష్ణా ll
భావం
ఓకృష్ణా!పరులను యాచించుట మనుష్యులకు చులకనకు హేతువని గుర్తించుటకు నీవు ఒక గుజ్జు రూపుదాల్చి బలిని మూడఁడుగుల నేలను వేడితివి గదా!
🌻 84 వ పద్యం
పాలను వెన్నయు మ్రుచ్చిల
రోలను మీ తల్లిగట్ట రోషముతోడన్
లీలావినోది వైతివి
బాలుcడవా బ్రహ్మగన్న ప్రభుcడవు కృష్ణా ll
భావం
ఓకృష్ణా!నీవు పాలు వెన్నలను దొంగలించగా నీ తల్లి కోపించి నిన్ను ఱోటికి గట్ట, నీ వది ఒక లీలావినోదముగా ఎంచితివి.నీవు బ్రహ్మ దేవుని కన్న లోక ప్రభుఁడవు కాని పిల్లవాడవు కాదు.
🌻 85 వ పద్యం
రఘునాయక నీ నామము
లఘుపతితో దలcచగలనె లక్ష్మీరమణా
యఘములు బాపుడు దయతో
రఘురాముcడవైన లోకరక్షక కృష్ణా ll
భావం
ఓకృష్ణా!జగద్రక్షకా!మనస్పూర్తిగా కాకపోయినను ఒకసారి నీ నామము ఏక్షణములో తలచి ఆ క్షణమునందే పాపములు పోగొట్టుదువు అట్టి దయా మూర్తివి నీవు.లోకరక్షకుడవు,రాముని అవతారమూర్తి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
. శ్రీ కృష్ణ శతకం - పద్య స్వరూపం - 8 🌹
పద్యము - భావము
🌻 95 వ పద్యం
సర్వేశ్వర చక్రాయుధ
శర్వాణివినుతనామ జగదభిరామా
నిఎవాణనాధ మాధవ
సర్వాత్మక నన్నుగావు సదయత కృష్ణా ll
భావం
కృష్ణా!నీవు సమస్తమునకు ప్రభువును,సమస్తమునకు లోపల నుండువాడవు.చక్రమును ఆయుధముగా ధరించినవడవు. పార్వతీ దేవి చేత స్మరించబడు పేరుగల వాడవు.మోక్షమునుకు నదిపతివి.లక్ష్మిని భార్యగా గలవాడవు. నన్ను దయతో రక్షింపుము.
🌻 96 వ పద్యం
శ్రీధర మాధవ యచ్యుత
భూదర పురుహుతవినుత పురుషోత్తమ ఏ
పాదయుగళంబు నెప్పుడు
మోదముతో నమ్మినాcడ ముద్దుల కృష్ణా ll
భావం
లక్ష్మీ దేవిని హృదయమున దరించి,ఆమెకు భర్తయైన వాడా,శాశ్వతుడవైన వాడా!దేవేంద్రుని చేత స్తోత్రము చేయబడినవాడా, భూదేవిని దరించినవాడా,పురుషులయందు పరమశ్రేష్టునివైనవాడా,ముద్దులు మూటగట్టెడు రూపముగలవాడా, ఓ కృష్ణా నీ పాదముల జంటను ఎల్లపుడు సంతోషముతో నమ్మి ఉన్నాను.అట్టి నన్ను రక్షింపుము.
🌻 97 వ పద్యం
శిరమున తర్నకిరీటము
కరయుగమున శంఖచక్ర ఘనభూషణముల్
ఉరమున వజ్రపు పతకము
సిరినాయక అమరcదాల్తువు శ్రీహరి కృష్ణా ll
భావం
కృష్ణా!నీవు తలమీద రత్నములు చెక్కిన కిరీటమును కరములందు శంఖము,చక్రము,అనేక గొప్ప అలంకారములను, వక్షఃస్థలమున కౌస్తుభ రత్నముతో కూడిన పతకములను బహు అలంకారముగా నుండునట్లు ధరింతువు.
🌻 98 వ పద్యం
అందెలు పాదములందున
సుందరముగ నుంచినావు సొంపలరంగా
మందరధర ముని సన్నుత
నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణా ll
భావం
పాదములందు ముద్దులొలుకునట్లుగా అందమైన అందెలను ధరించి ఉన్నావు.మంధర పర్వతమును కూర్మావతారములో మోసినట్టి కృష్ణా మునులచేత నుతులను గైకొనువాడా!నందుని ప్రియపుత్రుడా!నిన్నే నమ్మితిని.నీవే నాకు దిక్కు.
🌻 99 వ పద్యం
కందర్పకోటి సుందర
మందరధర నామతేజ మధుసూదన యో
సుందరవిగ్రహ మునిగణ
వందిత మిము దలcతు భక్తవత్సల కృష్ణా ll
భావం
ఓకృష్ణా!కోటి మన్మదులంత సౌందర్యము కలిగిన్వాడవు.మందర పర్వతమును మోసినవాడను గొప్పపేరు గలవాడవు, మదువను రాక్షసుని చంపిన వాడవును,మునీశ్వరులచే నమస్కరింపబడు వాడవును అయిన నీ సుందర విగ్రహమును ఎల్లపుడును మనస్సులో తలంతును.
🌻 100 వ పద్యం
అనుదినము కృష్ణశతకము
వినిన పథించినను ముక్తి వేడుక గలుగున్
ధనధాన్యము గో గణములు
తనయులు నభివృద్ధిపొందు తద్దయు కృష్ణా ll
భావం
ఓ కృష్ణా!ప్రతిదినము నీ శతకము చదివినను,వినినను వారికి పరలోకమందు ముక్తియు,ఈలోకమందు ధనధాన్యములు పుత్రాభివృద్ది విశేషముగ గలుగును.
🌻 101 వ పద్యం
భరద్వాజ సగోత్రుడ
గారవమున గంగకసుతుడన్
పేరు నృసింహాహ్వయుడను
శ్రీ రమణా ! నన్నుగావు సృష్టిని కృష్ణా ll
భావం
ఓ లక్ష్మీదేవితో కూడిఉన్న శ్రీకృష్ణా ! నేను భారద్వాజస గోత్రమున పుట్టినవాడను, గౌరన్న- గంగమాంబ అను పుణ్య దంపతుల పుత్రుడను, నృసింహుడు అను పేరుగల నన్ను దయతో కాపాడుము.
సమాప్తం.
🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 64 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 7 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌸. ప్రభువు భోజనం 🌸
ఒకసారి మహాపండితులైన శాస్త్రి అనేపేరుగలవారు ప్రభు దర్బార్ కు వచ్చారు. దర్బార్ మర్యాదానుసారంగా వారికి భోజన, నివాస ఏర్పాట్లు చేయబడి ప్రభు దర్శనం కూడా అయింది. ప్రభువుతో రోజూ కొంతసేపు సంభాషించే యోగం కలిగింది.
ప్రభు దర్బార్ నడిచే విధానము, నిత్యం వేలమంది దర్శనానికి రావటం, బ్రాహ్మణ భోజనం జరుగుతూ ఉండటం, ప్రతీరోజూ 'నిత్యశ్రీ నిత్య మంగళం' కనిపించగానే శాస్త్రి గారు ఖంగు తిన్నారు. ఎవరివల్ల అయితే ఇలా జరుగుతుందో ఆ ప్రభువు విషయంలో వారికి ఆదరభావం పెరగసాగింది.
ఒకరోజు శాస్త్రి గారు ప్రభు వద్దకు వెళ్లి ఇలా విన్నవించుకున్నారు. మహారాజ్! 'నేను వచ్చినప్పటి నుండి పంక్తి భోజనం నాకు దొరకలేదు. పంక్తి ప్రసాదం తీస…
🌹🌹🌹🌹🌹🌹
శ్రీశంకరభగవత్పాదాః
విజయంతే
🌹🌹🌹🌹🌹🌹
-----------------------------
🔴 శ్రీమాత్రేనమః 🔴
ఇడయు పింగళయు నిలచి యిరుదిశలను
శక్తి కుండలి తనపతి సన్నిధికిని
చేరు చుండెడి మార్గాన సిద్ధులనిక
వీడి ముందుకు నడవగ వేడుకొనును.
(తోపెల్ల సత్యనారాయణ మూర్తి,
అమలాపురం.)
🌻 86 వ పద్యం
అప్పా యిత్తువు దయతో
నప్పాలను నతిరసంబు ననుభవశాలీ
యప్పాలను గనుగొనవే
యప్పానను బ్రోవు వేంకటప్పా కృష్ణా ll
భావం
ఓకృష్ణా!నీవు దయతో తినెడి అప్పాలు,అరిసెలు మొదలగు తియ్యని వస్తువుల ఒసంగుదవు,అట్లే నన్ను దయతోఁ జూడుము.నన్నుఁ బ్రోవుము.
🌻 87 వ పద్యం
కొంచెపు వాcడని మదిలో
నెంచకుమీ వాసుదేవ గోవిందహరీ
యంచితముగ నీ కరుణకు
గొంచెము నధికంబు గలదె కొంకయు కృష్ణా ll
భావం
ఓకృష్ణా!వసుదేవకుమారా!గోవిందా!నేను అల్పుఁడనని సందేహించి ఊరకొనకుము.నీ దయ కొంచెమనియు, గొప్పయనియు లేదు, అందరకును సమానమైనది.
🌻 88 వ పద్యం
వావిరి నీ భక్తులకుం
గావరమున నెగ్గుసేయు గర్వాంధుల మున్
దేవ వధించుట వింటిని
నీవల్లను భాగ్యమయ్యె నిజముగ కృష్ణా ll
భావం
కృష్ణా!నీ భక్తులకు హాని చేయువారిని నీవు ఖండిచితివని వింటిని.నీ వలన లోకములకు శుభమయ్యెను.నీవు నిజముగా భక్తపాలకుఁడవు.నీ వల్లనే మాకు భాగ్యము కలిగినది.
🌻 89 వ పద్యం
అయ్యా పంచేంద్రియములు
నుయ్యాలల నూచినట్టు లూచగ నేనున్
నీ యాజ్ఞ దలcపనేరను
కుయ్యాలింపుము మహత్మ గుఱుతుగ కృష్ణా ll
భావం
కృష్ణా!ఇంద్రియములు నా వశము తప్పి స్వేచ్చగా పరుగెత్తినన్నిటునటు లూపగానే నీ ఆజ్ఞను నేను దలఁచనేరకున్నాను,నామొర వినుము.
🌻 90 వ పద్యం
కంటికి రెప్పవిధంబున
బంటుగదా యనుచు నన్ను బాయక యెపుడున్
జంటయు నీ వుండుట నే
కంటకమగు పాపములను గడచితి కృష్ణా ll
భావం
కృష్ణా!నీకు నేను బంటునుగదా,అనుకొనుచు ఎల్లపుడు నన్ను వెంటబీటుకొని పోయి మనము ఇరువురము జంటగా ఉండుటచేతనే పాపములనుంచి బయటపడగలను.అందుచే ఎల్లపుడు కంటికి రెప్పలాగున నన్ను కాపాడుము.
🌻 91 వ పద్యం
యమునికి నికcనే నెఱవను
కమలాక్ష జగన్నివాస కామితఫలదా
విమలమగు నీదు నామము
నమరcగ దలcచెదను వేగ ననిశము కృష్ణా ll
భావం
ఓకృష్ణా!తామర పుష్పములవంటి కన్నులు గలవాడా!లోకములకు నివాసమైన వాడా కోరిన కోరికలను ప్రసాదించువాడా ఇఁక మృత్యువునకు నేను ఏ మాత్రము భయపడను.నీ పవిత్ర నామమును ఎల్లపుడు జాగ్రత్తగా స్మరించెదను.
🌻 92 వ పద్యం
దండమయా విశ్వంభర
దండమయా పుండరీక దళనేత్రహరీ
దండమయా కరుణానిధి
దండమయా నీకు నెపుడు దండము కృష్ణా ll
భావం
లోకములను భరించినవాడా!తామరరేకులాంటి కానులు గలవాడా!హరీ దయకు సముద్రము వంటి వాడా!కృష్ణా!నీకు ఎల్లపుడు నమస్కరించెదను.
🌻 93 వ పద్యం
నారాయణ లక్ష్మీపతి
నారాయణ వాసుదేవ నందకుమారా
నారాయణ నిను నమ్మితి
నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణా ll
భావం
జలము స్థానముగా గల ఓహరీ ! లక్ష్మీదేవికి భర్తయైన వాడా ! అవతారములు దరించినప్పుడు నరరూపమున వచ్చువాడా ! విష్ణుదేవా ! అన్నిలోకములను తనయందే కలవాడా ! నందుని కుమారుడా ! శబ్దమే గమ్యముగా గలవాడా ! నిన్నే నమ్మితిని. నర సమూహమునకు స్థానమైన కృష్ణా ! కొండను ధరించినవాడవు నన్ను కాపాడుము.
🌻 94 వ పద్యం
తిరుమణి దురిత విదూరము
తిరుమణి సౌభాగ్యకరము త్రిజగములందున్
తిరుమణి పెట్టిన మనుcజుడు
పరమణిపవిత్రుండు భాగ్యవంతుcడు కృష్ణా ll
భావం :
ఓకృష్ణా!తిరుమణి అనగా త్రిపుండములు పాపములను పోగొట్టును,భాగ్యమిచ్చును సంపదలను కలిగించును, కాబట్టి మూడు లోకములనందును తిరుమణిని ధరించినవాడు పాపరహితుడు,పవిత్రమైన వాడు,ఐశ్వర్య వంతుడు అగుచున్నాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి