31, మార్చి 2013, ఆదివారం

15.sri Chaganti koteswara Rao Garu, Speech for students. by Varunkumar

నాకు నచ్చిన లలితా సంగీతమ్ 



ఏ  దేశ మేగిన ఎందు కాలిడినా పాగడరా భూమి భారతిని                
                  
  

30, మార్చి 2013, శనివారం

14.Prasnottara Ratnamaalika



జగద్గురు శంకరాచార్య విరచిత  ప్రశ్నోత్తర  మాలికను  ఆంధ్ర పద్యానువాదము చేసినవారు గుంటూరు  వాస్తవ్వులు  " శ్రీ అక్కిరాజు వేంక టే శ్వరశర్మ గారు , విద్వాన్ సాహిత్య శిరోమణి బిరుదు పొందిన వారు. వీరు తెలుగు మరియు సంస్క్రుతమునందు అనేకరచనలు చేసినారు. విరి కుమారుడు శ్రీధర్ నాకు పంపగా నేను ఇందు పొందు పరిచినాను..


1..ప్ర :   ఈ లోకమున అవశ్య ము స్వీకరింప దగినదేది?                                   స :   గురువాక్యము 

2. ప్ర :   అవశ్య ము పరిత్య్యజిమ్పదగినదేది?                                                 స:      వెదసాస్త్రములకు నిషిద్దమగుకర్మ.


3. ప్ర :    గురువనగా నెవరు?                                                                         స:   పరతత్వము
బాగుగా  తెలిసికొన్న  వాడై శి ష్యులకు మేలు     

               చేయ యత్నించువాడు .

4. ప్ర :  విద్వాంసులు త్వరగా జేయదగినదేది ?
    స :  జనన మరణ పరం పరగా  కొనసాగు సంసారమును ఛేదించుట.
 

5. ప్ర:   మోక్షమను వృక్షమునకు బీజమేది ?
    స:    సత్కార్యా చరణము వలన  నేర్పబడిన  బ్రహ్మజ్ఞానము.  
 

6. ప్ర :  హితకరమైనది ఏది ?
    స:    ధర్మము .
 

7. ప్ర :  సుచియైన వాడేవాడు?
    స :   ఎవని మనస్సు పరిశుద్ధమో అతడే.
 

8. ప్ర :   పండితుడెవడు ?
    స:    వివేకము కలవాడు.
 

9. ప్ర :   విషమనగానేమి ?
    స :   గురువులను తిరస్కరించుట. 


10. ప్ర :   సంసారమందు సారమైనదెది?
      స :    సంసారమున సారమెది అని పలుమార్లు ఆలోచించటమే.

11. ప్ర: అందరి కిని  కోరదగినడేది ?
      స:  తనకు తనవారికిని ఇతరులకును హితమును కోరేడి జన్మము.

12.ప్ర:    మద్యమువలె మోహమును కలిగించునదియేది ?
      స:    స్నేహము.

13. ప్ర:   దొంగ లేవారు?
      స:    రూప రస గంధాది  విషయములు ఇంద్రియాలయోక్క మనస్సు 

              యొక్క సామర్ద్యమును.   
              అపహరిమ్చునవి గనుక ఇవి దొంగలు.

14. ప్ర:    పేరాశ  ఏది?
       స:    ప్రయత్నము చేయక ఫలితముకోసం చూచుట.

15. ప్ర:   భయము దేని వలన కలుగును?
       స :  మరణము వలన .

16. ప్ర:    గ్రుడ్డి వానికంటె  పేద గ్రుడ్డి ఎవరు ?
      స:     విషయ సుఖములందు ఆసక్తి కలవాడు.

17. ప్ర:    శూరుడెవ్వడు ?
       స:    అంగనల వాలు చూపులను భాణములచేత పీడింపబడనివాడు

18. ప్ర:   చేవులను  దోసిళ్ళతో అమృతము వలే త్రాగ దగినదేది?
       స:   సత్పురుషుల హితోపదేశము.

19.  ప్ర:  గౌరవమును పొందుటకు మూలమేది?
       స:   యా చింపకుండుట.

20.  ప్ర:   తెలిసికొనుటకు సాధ్యము కానిదేది?
        స:   స్త్రీలనడవడి.  


21. ప్ర:   స్త్రీల ప్రవర్తన చేత తప్పు దారి పట్టనివాడు?
      స :  శూరుడు.

22.ప్ర:  దు:ఖమనగానేమి?
      స:  సంతోషము లేకపోవుటయే.

23.ప్ర :   మానవుడు దేనిచేత చులకన యగును?
     స :    యాచనచేత .

24.ప్ర:  ఎట్టి  జీవితము ప్రశస్తమైనది ?
     స:   దోషరహితమైన జీవితము.

25.ప్ర :  సోమరితనమననేమి ?
      స :  వేదశాస్త్రములు చదివి మరల చదవకుమ్దుట.

26.ప్ర:  ఎవరు జాగరూకత కలవాడు ?
      స:  వివేకము కలవాడు .

27.ప్ర :  నిద్ర అన  నేమి?
     స :   అజ్ఞానము .

28.ప్ర:  తామరాకుపై నీరువలె చంచమైనదేది?
      స:  య్యోవ్వనము

29.ప్ర:  చెంద్రకిరణములవలె చల్లనైనవారెవరు ?  
     స:   సజ్జనులు.

30.ప్ర :  నరకమేది?
      స :  పరులకు లోబడి యోండుట.


31.ప్ర :  సౌఖ్య హేతువేది?
      స :  సర్వసంగ పరిత్యాగము.

32.ప్ర :  సత్యవాక్కు అనగానేమి ?
      స :  హితమును ప్రీతిని కలిగించు వాక్యము.

33.ప్ర:   అందరికి ప్రియమైనదేది?
      స:   ప్రాణము .

34.ప్ర:  అనర్ధకమైనదేది ?
      స:  గర్వము

35.ప్ర:  సుఖకరమైనదేది?
      స:  సజ్జనులతోడి  స్నేహము.

36.ప్ర:  సమస్త దు:ఖములను పోగొట్టువాడేవాడు ?
      స:  సర్వజనుల మేలుకోరు త్యాగధనుడు.

37.ప్ర:  మరణముతో సమానమైనదేది ?
     స:   మూర్ఖత్వము .

38.ప్ర: వేలకట్టుటకు వీలుకానిదేది?
      స:  అవసరమైనప్పుడు ఈయబడినది.

39.ప్ర: మరణము వరకు శల్యము వలే భాదిమ్చునదేది ?
    
స:  రహస్యముగా చేయబడిన పాపము.

40. ప్ర:  ఎ విషయమున ప్రయత్నము  చేయదగును ?
            విద్యాభ్యాసము నందు , తగిన ఔషధమును సేవిమ్చుటయందు,  

            దానములు చేయుట యందు. 

41. ప్ర:  ఎచ్చట తిరస్కారము చేయదగును ?
       స:   చెడ్డవారితో స్నేహముచేయుట యందు, పరస్త్రీలను కామించుట 

              యందు, పరధనమును అపహరించుట యందు.

42. ప్ర:  రాత్రింబవళ్ళు ఆలోచింపతగినదేది ?
       స:  సంసారము నిస్సారము అనే అంశము అంటే కాని స్త్రీ కాదు .

43:ప్ర:  చాల ప్రేమతో సంపాదిమ్పడగినదేది ?
      స:  దీనుల యందు.దయ.

44.ప్ర: మరణము ఆసన్నమైనపుడు ఆత్మ ఎవనిచేత జింప బడదు?
      స: 1. మూర్కునకు  2. సంశయాత్మునకు 3. నిరంతరం దు:ఖపడు 

               శ్వభావము గలవానికి 4. చేసిన మేలు మరచిన వానికి.

45. ప్ర:  సాధువనగా నెవరు ?
       స:  శాస్త్ర  సమ్మతము ఐన ప్రవర్తన  కలవాడు.

46:  ప్ర:  ఎవనిని అధముడని అందురు ?
        స:  శాస్త్ర  సమ్మతమగు  ప్రవర్తన లేని వాడిని.

47.ప్ర:  ఈ జగత్తు ఎవనిచే జేఇంప  బడును ?
      స:  సత్యమునే పల్కువారిచేత, ఓర్పు సహనము గలవానిచేత.
 
48.ప్ర:  దేవతలు ఎవనికి నమస్క రిమ్తురు ?
     స:  దయ అధికము కలవారికి, మంచి బుద్ధి గలవారికి.

49.ప్ర:  దేనివలన జుగుప్స కలుగును ?
     స:  అరణ్యమువంటి భీకరమైన సంసారమువలన .

50.ప్ర:  ప్రాణులందరు ఎవని వశమందు  ఉందురు ?
      స:   ఎల్లప్పుడూ సత్యమునే పల్కు వానికి, వినయముతో   

             ప్రవర్తిమ్చువానికి

51.ప్ర:   ఎక్కడ నిలకడగా నుండవచ్చును?
      స:   ఇహికములు, అముష్మికములైన స్రయస్సులను కలిగించు  

              న్యాయ  మార్గమునందు.

52.ప్ర:  గ్రుడ్డివాడెవ్వడు ?
      స: చెయదగినదికూడ  చేయలేనివాడు.

53.ప్ర:   చేవిటి వాడెవ్వడు?
      స:  పెద్దలు చెప్పిన హితము వినని వాడు

53.ప్ర:  మూగవాడేవ్వడు ? 
     స:  సమయము వచ్చినప్పుడు  ప్రియ వచనములు పలకనివాడు.



54.ప్ర :  దానమనగానేమి?
      స: యాచింపకయే  ఇచ్చునది.

55.ప్ర:  మిత్రుడెవ్వడు ?
      స:  పాపకార్యములను  చేయకుండ  నివారిమ్చువాడు.

56.ప్ర;  ఏది అలంకారము?
      స:  సత్య్యమును వచించుట .

57. మెరుపు వాలే చెంచలమేద?
       స్త్రీల ప్రేమ, దష్టులతో మైత్రి 

58.ప్ర:   కులము గురించి ఆలోచన లేనివారెవరు?
      స:   కేవలము సజ్జనులు మాత్రమే .

59.ప్ర:   చతుర్భుద్రము అనగానేమి ?
            1. ప్రియవచనములతో  ఇచ్చు దానము, గర్వరహితమైన 

                జ్ఞానము, క్షమాగుణముతోడి  పరాక్రమము, త్యగాముతో 
                కూడిన ధనము.

60.ప్ర:  ఐశ్వర్యము  ఉన్నప్పుడు దేనిని గూర్చి విచారపడవలసి 

            ఉండును ?
      స:  లోభము గూర్చి

61.ప్ర:  ప్రశంసింప దాగిన గుణమేది?
      స:  ఔదార్యము.

62.
ప్ర:   విద్వామ్సులచేత పుజంప దాగిన వాడేవాడు?
    
స:   సహజ మైన వినయగుణముతో ఒప్పుచుండువాడు. 


63.  ప్ర:  లక్ష్మీ  ఎవనిని కోరి వచ్చును?
       స:  నీతితో ఉన్న వారి, సోమరితనము లేని వారి వద్దకు లక్ష్మి  

       వచ్చును. 

64.  ప్ర:  ఎందు  నివసిమ్చదగును?
       స:   కాశీ యందు, సజ్జనుల సన్నిధి యందు.

65.  ప్ర:  విడిచిపెట్టదగిన  దేశమేది ?
       స:   లోభి పాలించు దేశము.

66.  ప్ర:  పురుషుడు దేనితోకూడి విచారములేనివాడుగా  ఉండును.
       స:  వినయశీలవతియగు భార్య తో

67.  ప్ర:  గొప్పవైభవముతొ కూడి  ఉన్నవాడు ?
       స:  తగినసంపద ఉన్నవాడును దాత్రుత్వములేనివాడు.

68.  ప్ర:  చాలా తేలికతనమును కలిగిమ్చునదేది ?
       స:  అల్ల్పులను యాచించుట.

69.  ప్ర:  శ్రీ రాముని కంటే  గొప్ప శూరుడేవడు ?
       స:  మన్మధుని భాణమునకు కలత చెందనివాడు. 


70.  ప్ర:  రాత్రిం పగళ్ళు ధ్యానించ దగినది ఏది ?
       స:  భగవంతుని పాదము, సంసారముకాదు.

71.  ప్ర:  కుంటి వాడుగా ప్రసిద్ధుడేవడు ?
       స:  ముసలితనమున తీర్ద్ధయార్త చేయు వాడు.

72.  ప్ర:  మనుష్యులు సమ్పాదీమ్పదగినదెది?
       స:  ధనము,కీర్తి ,విద్య ,పుణ్యము, బలము.

73.  ప్ర:  నాశనము చేయదగినదేది?
       స:  లోభము.

74.  ప్ర:  శత్రువు ఎవడు ?
       స:  కామమే  శత్రువు.

75.  ప్ర:  ప్రాణముకంటే  రమ్యమైనదేది ?
       స: ధర్మము

76.  ప్ర:  సంరక్షిమ్పవలసినదేది?
       స:  కీర్తి, ప్రతివ్రత

77.  ప్ర:  చేతిలోని ఆయుధమువలె రక్షించునట్టిదేది?
       స:  తగిన ఉపాయము .

78.  ప్ర:  తల్లివలె కాపాడునట్టిదేది ?
       స:  ఆవు

79 . ప్ర: బలమనగానేమి?
       స:  ధైర్యము

80.  ప్ర:  మరణ సమానమైనదెది?
       స:  జాగరూకత లేకపోఫుట

81.  ప్ర:  విషము ఎవరియందు ఉండును?
       స:  దుర్జనుల యందు

82.  ప్ర:  అందరికి అశుచిత్వము కల్గిమ్చునట్టిదేది ?
       స: ఋణము

83.  ప్ర:  అందరికి భయము కల్గిమ్చునది ?
       స:  ధనము .    


84. ప్ర:   లోకమునందు ధన్య్యుడేవడు ?
       స:  సర్వసంగ  పరిత్యాగి యగు సన్యాసి .

85.  ప్ర:   సంన్మా నిమ్పదగినవాడేవాడు ?
       స:    సత్పర్తన గల పండితుడు .

86.  ప్ర:  సేవింప దగిన వాడేవాడు?
        స:  యాచకులకు తృప్తి కల్గునట్లు నిచ్చువాడు .

87.  ఏది మహాభాగ్యము ?
        ఆరోగ్యమే మహాభాగ్యము.

88. ప్ర:   ఎవడు ఫలమును పొందును?
       స:   కష్టపడి పనిచేయువాడు .

89.  ప్ర:  పాపములెట్లు నశించును?
        స:  సంన్మంత్ర జపమువల్ల

90. ప్ర:  ఎవరు పరిపూర్ణుడు  ?
      స:  సత్సంతానవంతుడు .

91.  ప్ర:  మానవులకు కడు  దుస్కరమైనదేది?
       స:  నియమనిష్టలుకలిగి మనస్సును నిగ్రహించుట

92. ప్ర: పరదేవతని స్తుతింపబడు  దేవత ఎవరు ?.
      స:  చిచ్చక్తి

93.  ప్ర:  జగద్భాన్దవుడేవాడు ?
        సూర్య భగవానుడు .

94. ప్ర:   అందరికి జీవనము ఇచ్చువాడు ?
       స:   మేఘుడు .

95. ప్ర:   జగద్గురువు ఎవరు?
      స:   పరమేశ్వరుడు .

96.  ప్ర:  ముక్తి దేనిచేత పొందవచ్చును?
        స:  హరిభక్తి

97.  ప్ర:  అవిద్య అనగానేమి ?
        స:  ఆత్మ స్వరూప భోధనకు అవరోధమైన మాయ .

98. ప్ర:  దు:ఖములేనివాడేవాడు?
       స:  కోపములేనివాడు

99.  ప్ర:  సుఖమనగానేమి?
       స:  మనస్సుకు తృప్తి

100.  ఇమ్ద్రజాలమేది?
          ప్రపంచము, స్త్రీ మనస్సు

101.  ప్ర:  మిధ్య అనగానేమి?
          స:  విద్యచేత, జ్ఞానముచేత నశించునది .

          102.  ప్ర అనిర్వచానమైన వస్తువేది:
         స:  మాయ

103. ప్ర:  అజ్ఞానము ఎక్కడనుండి  పుట్టినది ?
         స:  అనాది నుండి ఉన్నది, ఇది పుట్ట్టేడిది  కాదు.

104. ప్ర:  ప్రారబ్దము అనగానేమి?
         స:  ఆయుర్దాయము

105.  ప్ర:  ప్రత్యక్ష దేవత ఎవరు ?
         స :   తల్లి

106.  ప్ర:    ప్రత్యక్ష గురువు ఎవరు ?
          స:   తండ్రి

107.  ప్ర:  సర్వదేవతా స్వరూపుడై భాసించు వాడేవాడు?
          స:  వేదవేదాంగా పారీణుడు సదాచార సంపన్నుడైన  

         బ్రాహ్మణుడు.

108.  ప్ర:  స్ర్వవెదములకు మూలమేది ?>
          స:  ఓంకారం .               
   
 
 
  
ఈ ప్రశ్నోత్తర రత్నమాలను చదివినవారికి, వినిపించినవారి ముత్యాలహరమువలె ప్రకాశింతురు.
వ్రాసితిని నేను మల్లప్రగాడంశ భవుడ
రామకృష్ణ శర్మ యన్పేరువాడ
శంకరా చర్య విరచిత ప్రశ్నోత్తర మాలిక
తెనుగున ఆన్ లైన్లో లో పెద్దల దీవేనలతో,
స్న్హేహితుల  సహాయముతో ఇందు పొందు పరిచినాను
ప్రతిఒక్కరు ఇంద్రియములను, మనస్సును, నిగ్రహించుట                      వలన హ్రుదయమునందు వున్న భగవంతుని దర్శించగలరు
ఇది  నా నమ్మకము,   ఫలితముగూర్చి  ఆలోచించక చెయ్యటమే
భగవద్గీత  కర్త ఉపదేశము, అదే నా అనుకరణము.                                                                                                        
                                                                                                        

23, మార్చి 2013, శనివారం

13.Kanakadhaaraa Sthavamu (Stotram)



  
www.mallapragadaramakrishna.blogspot.in.              
                శ్రీ జగద్గురు  శంకర భాగవత్పాదులచే రచితమైన
                                                  కనకధారాస్తవము
ఆంధ్రపద్యానువాదకర్త: కీర్తిశేషులు శ్రీ అక్కిరాజు వేంకటేశ్వరశర్మగారు 
                        (ఆంధ్ర పద్య తాత్పర్య సహితము )

                    నా స్నేహితుడు కీర్తిశేషులు శ్రీ అక్కిరాజు వేంకటేశ్వరశర్మగారి     కుమారుడు "శ్రీధర్ " అందచేసిన శ్రీ జగద్గురు  శంకర భాగవత్పాదులచే రచితమైన కనకధారాస్తవము (ఆంధ్ర పద్య తాత్పర్య సహితము )
ఆన్ లైన్ లో ప్రతివక్కరు చదువుకొనుటకు, ముద్రణద్వార నలుగురు ఒక చోట కూర్చొని భక్తితో లక్ష్మీ దేవి కరుణా కటాక్షము, సమస్త శుభములు కలగాలని ఇందు పొందు పరుస్తున్నాను.
                         సర్వేజనా స్సుఖినోభవంతు                                                                                                విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 
                            పరిచయము                                          శ్రీ శంకర భగవత్పాదులు  బ్రహ్మ చర్యాశ్రమమునవలంబించి  మధుకర వృత్తితో జీవించుచు వేద వేదాంగాది విద్యల నభ్య్యసించు  చున్నకాలమది. ఆయన ఒకనాడు మధుకరమునకై  ఒక గృహము వాకిట నిలిచి "భవతి! భిక్షాందేహి" యని అనెను.  ఆ ఇల్లాలు నిరుపేద . మహాసాద్వి  తమ  పేదరికమునకు వగచుచు ఒక్క ఉసిరిక పండును భిక్షగా పెట్టి కన్నీరు కార్చేను.  శ్రీ శంకర దేశి కేంద్రుడు ఆశువుగా ఇరువదినాలుగు శ్లోకములతో శ్రీ మహాలక్ష్మిని స్తుతించెను.  ఆ దేవి ప్రత్యక్షమై శ్రీ శంకరులు కోరిన విధముగా బంగారు ఉసిరిక  పండ్లను  ఆ నిరుపెదరాలి  గృహమున వర్షముగా  కురిపించెను.    శ్రీ శంకర భగవత్పాదులు  ఆ లక్ష్మీదేవినిస్తుతించిన ఇరువదినాలుగు శ్లోకములకే  కనకధారాస్తవము (స్త్రోత్రము) అని పేరు .  దీనిని అనుదినము చదివిన వారికి సకల సంపదలు చేకూరును.  అనాదిగా అనుదినము అనేకమంది దీనిని చదువుతున్నారు,  భారతదేశము మరియు  ఇతర దేశాలలో ఉన్న తెలుగువారు  మరియు   ప్రతిఒక్కరు చదివి ఆ లక్ష్మిదేవి కృపకు పాత్రులగుదురు.  


                                    

1) శ్లో.  వందే వందారు మందార మిందిరా  నందకందలమ్ 
           ఆమందానంద  సందోహ భంధురం సింధురాననమ్.
 

2) శ్లో.   అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ 
            భ్రుంగాంగ నేవ ముకులాభరణం తమాలం
            అంగీ కృతాఖిల విభూతి రపాంగ లీలా
            మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయా:     
 

3)శ్లో.    ముగ్ధా ముహర్విదధతీ వదనే మురారే:
            ప్రేమ త్రపా ప్రణిహితాని గతా గతాని
            మాలా దృశో  ర్మ్దుదుకరీవ మహోత్పలే యా   
           సామే శ్రియం దిశతు సాగర సంభవాయా:
 

4.శ్లో.    విశ్వా మరేంద్రపద విభ్రమ దాన దక్ష
            మానందహేతు రధికం మురవిద్విషో పి
            ఈ షన్నిషీదతు మయి  క్షణ మీ క్షణార్ధం
             ఇందీ వరోదర సహోదర మిందిరాయా:   
 

5.శ్లో.     అమీలితాక్ష మధిగమ్య ముదా ముకుందం
             ఆనంద కంద మనిమేష  మనంగతంత్రం
             ఆకేకరస్థిత కానీనిక పద్మనేత్రం
             భూత్యై భవే న్మమ భుజంగ  శయాంగనాయా:
 

6.శ్లో.      కాలాంబుదాళి  లలితితోరసి కైటభారే:
              ధారాధరే స్పురతి  యా తటి  దంగనేవ
              మా తుస్సమస్త జగతాం  మహానీయమూర్తి:
               భద్రాణి మేదిశతు భార్గవ నందనాయా: 


7. శ్లో :     బాహ్వాంతారే మురజిత: శ్రితకౌస్తుభే యా 
               హారావళీవ   హరినీలమఈ 
వినిభాతి
               కామప్రదా భాగవతోపి  కటాక్షమాలా
               కళ్యాణ మావహాతు మే కమలాలయాయా: 

8. శ్లో :      ప్రాప్తం పదం ప్రధమత: ఖలు యత్ప్రభావాత్
                మాంగల్య  భాజి  మధుమాధిని మన్మధేన
                మయ్యా పతే  త్తదిహ మంధర మీక్షణార్ధం
                మందాలసంచ  మకరాలయ కన్యకాయా:

9. శ్లో :      దద్యా ద్దయ్యానుపవనో ద్రవిణాంబుధారా
                మస్మి న్నకించన విహంగశిశౌ  విషణ్ణే
                దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
                నారాయణ ప్రాణయినీ  నయనాంబువాహ:

10.శ్లో       ఇష్టా వశిష్ట మతయోపి యయా దయార్ద్ర  
               దృష్టా స్త్రివిష్ట మపదం  సులభం భజన్తే
               ద్రష్టి: ప్రహృష్ట కమలోదరదీప్తి రిష్టాం
               పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయా:

11.శ్లో      గిర్దేవతేతి  గరుడధ్వజ సుందరీతి
              శాకంభరీతి శశి  శేఖర వల్లభేతి
              సృష్టి  స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై  
              తస్యై  నమ స్త్రిభువనైకగురో స్తరు ణ్యై:

12. శ్లో     శృ త్యై  నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
               రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై 
              శక్యై నమోస్తు శతపత్ర  నికేతనాయై
              పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ ఫల్లభాయై: 


13.  శ్లో :    నమోస్తు నాళీ క నిభానానయై
                 నమోస్తు దుగ్దోదధి  జన్మభూమ్యై
                 నమోస్తు సోమామృత సోదరాయై
                  నమోస్తు నారాయణ వల్లభాయై

14.   శ్లో :   నమోస్తు హే
మాంబుజ పీటికాయై
                నమోస్తు భూమండల నాయి కా యై
                 నమోస్తు దేవాది సుపుజితాయై
                  నమోస్తు శార్జాయుద వల్లభాయై :

15: శ్లో :     నమోస్తు దేవ్యై  భ్రుగునందనాయై
                నమోస్తు విష్ణో రురసి స్థితాయై
                 నమోస్తు లక్ష్మ్యే కమలాలయాయై
                  నమోస్తు దామోదర  వల్లభాయై :

16.:శ్లో :    నమోస్తు కాన్యై కమలేక్షణాయై
                నమోస్తు
భూత్యై భువన ప్రసూ త్యై
                 నమోస్తు దేవాదిభి రర్చితాయై
                  నమోస్తు నందాత్మజ  వల్లభాయై :

17: శ్లో :      సంపత్కరాణి  సకలేంద్రియ నందనాని
                  సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి
                  త్వద్వందనాని దురితాహరణోద్యతాని
                  మామేవ మాత రనిశం కలయంతు మాన్యే  

18. శ్లో :       యత్కటాక్ష సము పాసనా  విధి:
                 సేవకస్య  సకలార్ద  సంపద:
                 సంతనోతి వచనాం గ  మానసై
                 త్వాం  మురారి హ్రుదయేశ్వరీం  భజే.  


19. శ్లో :        సరసిజ నయనే సరోజ హస్తే
                    ధవళ తరాం శుక  గంధ మాల్య శోభే
                    భగవతి హరివల్లభే మనోజ్జ్నే
                    త్రిభువన భూతికరి ప్రసీద మహ్య్యాం

20. శ్లో :         దిఘస్తిబి: కనకకుంభ ముఖావ సృష్ట
                     స్రగ్వా హినీ  విమల
చారు జల ప్లు తాంగీం
                     ప్రాతర్నమామి జగతాం  జననీ మశేష
                     లోకాధినాథ గృహిణీ   మమృతాబ్ది పుత్రీం

21. శ్లో           కమలే కమలాక్ష వల్లభే త్వం
                     కరుణాఫూ ర తరంగితై  రపాంగై :
                     అవలోకయ
చారు మా  మకించ నానాం
                     ప్రధమం పాత్ర మకృ త్రిమం దయాయా:

22.
శ్లో :        బిల్వాట వీమధ్య లసత్సరోజే
                    సహస్రపత్రే సుఖ సన్ని విష్టాం
                    అష్టాపదాంభోరుహ పాణి పద్మాం
                    సువర్ణా వర్ణాం  ప్రణమామి నిత్యం

23.
శ్లో :       కమలాసన పాణినా లలాటే 
                   లిఖితా మక్షర పంక్తిమస్య జంతో:
                   పరిమార్జయ మాత  రంఘ్రిణా  తే
                   ధనిక 
ద్వార నివాస దు:ఖ దోగ్ద్రీం 


24. శ్లో :  అంభోరుహం జన్మగృహం భవత్యా;
              వక్షస్థలం భర్త్రు గృహం మురారే
              కారుణ్యత: కల్పయా పద్మవాసే !
              లీలా  గృహం మే హ్రుదయార విందం

25. శ్లో :   స్తువంతి యే  స్తుతి భి రమూ భి రన్వహమ్
               త్ర ఈ మ ఈమ్ త్రిభువన మాతరం రమాం
               గుణాధికా  గురుతర భాగ్య  భాజినో
               భవంతి తే భువి బుధ భావితాశయా;      


.................................................................................................................................................................

1) శ్లో.  వందే వందారు మందార మిందిరా  నందకందలమ్ 
           ఆమందానంద  సందోహ భంధురం సింధురాననమ్
 

ప:          ఇందిరా నంద కందలు నేకదంతు
              అఖిల పందారు మందారు నభయవరదు
              ప్రవిమలానంద సందో హ భందురుని ప్ర
              నటుల్ నర్పింతు భక్తి  విఘ్నంబు  తొలగ  

 ............................................................................................................
2) శ్లో.   అంగం హరే: పులక భూషణ మాశ్రయంతి
            భ్రుంగాంగ నేవ ముకులాభరణం తమాలం
            అంగీ కృతాఖిల విభూతి రపాంగ లీలా
            మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయా:     
 

ప:   రంగాగుమోగ్గలంబరగు రమ్యత మాలముపైకినేగు సా
       రంగి యనంగ వెన్నుని యురమ్మున నుండిన సారసాక్షి ఆ
       మంగళమూర్తి  నాపయి సమంచిత ముగ్ధ  కృపావలోకనా
       పొంగ  కటాక్ష లీలలను బర్వేడుగాక నిరంతరంబుగా

 
తా:    మొగ్గలే  నగలు గాగల తమాల వృక్షమును ఆడు తుమ్మెద ఆశ్ర  

          యించినట్లు, పులకలతో  నిండిన శ్రీ హరిపైకి ప్రసరించు నదియు  
          భక్తులకు సర్వసంపద లొసంగు  జాలు నట్టి మంగళ  
           దేవతయైన  లక్ష్మీదేవి కరుణ తోడి కడగంటి చూపు నాకుమంగళ 
           ముల నోసంగునుగాక .         
.............................................................................................................
3)శ్లో.    ముగ్ధా ముహర్విదధతీ వదనే మురారే:
            ప్రేమ త్రపా ప్రణిహితాని గతా గతాని
            మాలా దృశో  ర్మ్దుదుకరీవ మహోత్పలే యా   
           సామే శ్రియం దిశతు సాగర సంభవాయా:
 

ప:    చూచుచు  ప్రేమతోడ హరి సుందరరూపము,  శౌరి ప్రేమతో
        జూచినయంత సిగ్గుమెయి చూపుమరల్చుచు నుత్పలంబులో
        నేచు మరందముంగొనగ నేగెడి  భ్రుంగి విలాసలీలలన్
        దోచేడు భాగ్యలక్ష్మి కృపతోడుత  నన్నును జూచుగావుతన్   

 
తా:      మకరమ్దముకై నల్లగలువపైకి రాకపోకలు సాగించు ఆడు   

             తుమ్మేద వలె శ్రీ మహావిష్ణువు మొగముపైకి ప్రేమతో సిగ్గుతో 
             మనోహరములగు చూపులను పరపుచు అయన 
             చూచినంతనే  మాటికి సిగ్గుతో మరల్చునట్టి లక్ష్మీదేవి  
             చూపుల పరంపర నాకు సిరిసంపద లోసగునుగాక.
........................................................................................................
 
4.శ్లో.    విశ్వా మరేంద్రపద విభ్రమ దాన దక్ష
            మానందహేతు రధికం మురవిద్విషో పి
            ఈ షన్నిషీదతు మయి  క్షణ మీ క్షణార్ధం
             ఇందీ వరోదర సహోదర మిందిరాయా:   


 ప:     ఈ యగుజాలునట్టి దమరేం ద్రుని రాజ్యమునైనగని, నా
          రాయనమూర్తికెంతయు ముదావహమైనది, తమ్మిదుద్దుమే
          ల్చాయకు సాటివచ్చునది సారసవాసినిఐన లక్ష్మి  అ
          త్యాయత లోచనాంచల కటాక్షము నాపైబర్వుగావుతన్
 
తా:     దేవేంద్రుని రాజ్యమునైన ఈయగలదియును శ్రీ మహా  

           విష్ణువునకు ఆనందము  కలిగించునది    యును, తామర  
           దుద్దు పసిమి మిసిమి గలిగిన మేనిఛాయగల లక్ష్మీ దేవి
           కరుణా కటాక్షము  నాపై సదా ప్రసరించు  గాక      

 .....................................................................................................
5.శ్లో.     అమిలితాక్ష మధిగమ్య ముదా ముకుందం
             ఆనంద కంద మనిమేష  మనంగతంత్రం
             ఆకేకరస్థిత కానీనిక పద్మనేత్రం
             భూత్యై భవే న్మమ భుజంగ  శయాంగనాయా:
 

ప:     అరమర లేని ప్రేమను ననంగుని మోహము మోడ్పుకన్నులన్
        గురియగుదన్నుజూచెడి ముకుందుని మోహమును గాంచి సిగ్గుచే
        మురిపెముగా మురారి నరమోడ్పు కనంగతోడ జూచు ఆ
        సిరి కరుణా కటాక్షములు శ్రీల నొసంగుత నాకు నెప్పుడున్

తా:   మన్మధుని ప్రేరణచేత అమందానందముతో, అరమోడ్పు      

        కన్నులతో రెప్ప వాల్చక తనవైపు చూచుచున్న మహావిష్ణువును 
       గాంచి సిగ్గుతో కమలములవంటి అరమోడ్పు  కన్నులతో  కంటి
        పాప నోరగా జేసి పతివైపు చూచుచున్న పాలకడలి పట్టి లక్ష్మీ దేవి 

        కటాక్షము నాకు సమస్తైశ్వరములు నోసగుగాక.  
............................................................................................................
6.శ్లో.      కాలంబుదాళి  లలితితోరసి కైటభారే:
              ధారాధరే స్పురతి  యా తటి  దంగనేవ
              మా తుస్సమస్త జగతాం  మహానీయమూర్తి:
               భద్రాణి మేదిశతు భార్గవ నందనాయా: 



ప :            నీలపయౌ ధరంబునను నిగ్గులుదేరు తటిల్లతాంగానం
                 బోలిమురారి వక్షమున మొదముతోడ వసించి కుర్మిమై
                 హేలగ సర్వలోకముల నేలుచు నుండెడి  కన్న  తల్లి  ప
                 ద్మాలయ  నాకోసంగుతను మంగళముల్ సతతం  

                 బుదారతన్

తా:           నల్లని మబ్బులో మెర యు చున్న మెరుపు తీగవలె  శ్రీ 

               మహావిష్ణు హ్రుదయమున వసించుచు, సమస్త లోకములను 
                చల్లగా పాలించు కన్న తల్లి భ్రుగు నందనయగు  లక్ష్మీ  
                దేవి నాకు సమస్త శుభములు నొసంగును గాక             

........................................................................................................... 
7. శ్లో :     బాహ్వాంతారే మురజిత: శ్రితకౌస్తుభే యా 
               హారావళీవ   హరినీలమఈ  నిభాతి
               కామప్రదా భాగవతోపి  కటాక్షమాలా
               కళ్యాణ మావహాతు మే కమలాలయాయా: 
 


ప:  అతులిత కౌస్తుభం బురమునందున దాల్చిన విష్ణు  వక్షమం
      దతి  రుచిరంబు నీల మణిహారము వోలె వెలుంగు నిందిరా
      సతి సవిలాస ముగ్ధ వికసన్నవకైరవ  లోచనాంచలా
      తత కమనీయదృక్కులు సతంబు శుభంబు లోసంగు గావుతన్

తా:  కౌస్తుభ రత్నాలంకృతమైన శ్రీ మహావిష్ణువు వక్షమునందు  

       వసించేడి  లక్ష్మీ దేవి యో క్క ఇంద్ర నీల మణిహారము వలే 
       విరాజిల్లు కరుణా తరంగితములైన కడగంటి చూపులు సదా నాపై  
       ప్రసరించు నుగాక.  

 .......................................................................................................
8. శ్లో :      ప్రాప్తం పదం ప్రధమత: ఖలు యత్ప్రభావాత్
                మాంగల్య  భాజి  మధుమాధిని మన్మధేన
                మయ్యా పతే  త్తదిహ మంధర మీక్షణార్ధం
                మందాలసంచ  మకరాలయ కన్యకాయా:
 

ప:  ఏయమప్రేమపూర్ణములు దృక్కులు విశ్వ ము నేల్లగావ, నా    
      యణమూర్తి కాదినిననంతముశక్తినొసంగేనట్టి                                
      త్యాయత పద్మనేత్ర మకరాలయపుత్రి కటాక్షవీక్షణల్
      చేయుత  మంగళంబుల సశేషముగాను నిరంతరంబుగా

తా:  సంపూర్ణప్రేమ భరితములైన ఏ చూపులు సృష్ట్యా దిని శ్రీ 

       మహావిష్ణువునకు విశ్వసంరక్షనకై అనంత శక్తి నొసంగెనో అట్టి  
       క్షీరసాగరతనయయగు లక్ష్మి దేవి కటాక్షవీక్షణములు నాపై 
       ప్రసరించును గాక.
...........................................................................................................  

9. శ్లో :      దద్యా ద్దయ్యానుపవనో ద్రవిణాంబుధారా
                మస్మి న్నకించన విహంగశిశౌ  విషణ్ణే
                దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
                నారాయణ ప్రాణయినీ  నయనాంబువాహ:

ప:  కరుణా మారుత చోదితంబులతులే కల్యాణి దృక్పధముల్
      చిర కాలార్జిత పాపపుంజము వలె న్వేదంబు పోకార్చునో
      పరితప్తాకుల చాతకంబునగు నాపై నార్తి చల్లారగా
      కురియుమ్గాక దరిద్రతా జడిమ లేకుండా న్నిరుల్ సంపదల్

తా:  శ్రీ మహావిష్ణువు ప్రియసతియైన శ్రీ మహాలక్ష్మి కటాక్షవిక్షణ మనేడి  

      మేఘము దయయను మారుతముచేత ప్రేరితమై చిరకాలార్జిత పాప 
      రూపమగు చెమటను పోగొట్టి పేద చాతక  పక్షికూననగు నాపై కనక 
       వర్షమును తనివితీరా కురియునుగాక .  
..........................................................................................................
10.శ్లో       ఇష్టా వశిష్ట మతయోపి యయా దయార్ద్ర  
               దృష్టా స్త్రివిష్ట మపదం  సులభం భజన్తే
               ద్రష్టి: ప్రహృష్ట కమలోదరదీప్తి రిష్టాం
               పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయా:
 

ప:  అనయం బెవ్వడు పుణ్యకార్యముల జేయన్లేదో యవ్వానికిన్
      అనంఘంబైన మహేం ద్ర రాజ్యమును నీయంజాలునో  సత్క్రుషణ్
     కనకాభ్జోదర సోదరంబాగు తటిత్కామ్తి స్త్రకాసిమ్చు ఆ
     కనదబ్జాసన  లక్ష్మి  నాకిడు సనర్ఘంబైన భాగ్యంబులన్

తా:  ఎన్నడును ఎట్టి పుణ్యమును కుడ  చేసి యుమ్దరో అట్టి వారికి  

       సైతము దయతో దేవేంద్ర పదవినైన ఈయగల్గినదియును 
       పద్మములోని పసిడి కాంతులుగల మేనిచాయ గల లక్ష్మీ దేవి
       కటాక్ష వీక్షణము నాకు అనంత సంపదల నొసగును గాక.  
 ........................................................................................................

 11.శ్లో      గిర్దేవతేతి  గరుడధ్వజ సుందరీతి
              శాకంభరీతి శశి  శేఖర వల్లభేతి
              సృష్టి  స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై  
              తస్యై  నమ స్త్రిభువనైకగురో స్తరు ణ్యై:


ప:  వనజభవునకు సృష్టిలో వాణి  యనగా
      రక్షణము నందు శౌరికి రమ యనంగ
      ప్రళయవేళను శివునకు పార్వతి యన
      సాయపడు నిందిరకును సాస్టాంగ నతులు

తా:  లోకములను సృజించువేళ  బ్రహ్మాకు సరస్వతిగాను, లోక రక్షణ    

        మందు నారాయణునకు లక్ష్మిగాను ప్రళయ కాలమున 
        శంకరునకు  శాకంభరియనబడు  పార్వతిగాను 
        సర్వవిధముల  సహకరించు ఆ పరాశక్తికి నమస్కారములు.    

...............................................................................................................................................................
12. శ్లో     శృ త్యై  నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
               రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై 
              శక్యై నమోస్తు శతపత్ర  నికేతనాయై
              పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ ఫల్లభాయై:


ప:  శుభ ఫలప్రద  యగునట్టి శ్రుతికి సతులు
      రమ్య గుణరత్న నిధిఐన రతికి సతులు
      స్వ ఛ శత పాత్ర  వాసినీ  శక్తి  సతులు
      పూజ్య పురుషోత్తముని పత్ని పుష్టి సతులు

తా:  యజ్ఞాది పుణ్యకార్యములకు కారణ భూతఇన వెదరూపిణికి  

       శ్రీలక్ష్మికి నమస్కారములు,  సద్గుణములకు సాగారమైన రతి 
       స్వరూపిణికి నమస్కారములు, నూరు రేకుల పద్మ మందు  
       వసించు శక్తి  స్వరూపిణికి నమస్కారములు.  పురుషోత్తముడగు 

       విష్ణు దేవునకు పత్నిఐన  పుష్టి  స్వరూపిణికి నమస్కారములు.
...............................................................................................................................................

13.  శ్లో :    నమోస్తు నాళీ క నిభానానయై
                 నమోస్తు దుగ్దోదధి  జన్మభూమ్యై
                 నమోస్తు సోమామృత సోదరాయై
                  నమోస్తు నారాయణ వల్లభాయై


ప:  సరసిజాత  సమాస్యయౌ సతికి నతులు
      క్షీరసాగారభవయైన సరికి నతులు
      తత సుధాకర సుధల సోదరికి నతులు
      సరసిజోదర పత్నికి సతము నతులు

తా:  కమలమువంటి మొగముగల లక్ష్మికి నమస్కారములు.  పాల 

       కడలి గారాబుపట్టియగు సిరికి నమస్కారములు.  చంద్రునకు  
       అమృతమునకు తోబుట్టువగు  లక్ష్మికి నమస్కారములు.  శ్రీ 
       మహావిష్ణువునకు ప్రియసతి ఐన  లక్ష్మీదేవికి నమస్కారములు. 

 ...........................................................................................................
14.   శ్లో :   నమోస్తు హేమామ్భుజ పీటికాయై
                నమోస్తు భూమండల నాయి కా యై
                 నమోస్తు దేవాది సుపుజితాయై
                  నమోస్తు శార్జాయుద వల్లభాయై :


ప:  కనక పద్మ నివాసినీ  కమల నతులు
      రమ్య భుమండలంబెలు రాజ్ఞి నతులు
      వానవాదుల కరుణించు పద్మ నతులు
      శార్జ  పాణిప్రియా సరోజాన్య  నతులు  

తా:  స్వర్ణ పద్మ వాసినియగు లక్ష్మీదేవికి నమస్కారములు.  సమస్త 

       భుమండలమును పాలించు మహారాజ్నికి నమస్కారములు.  
       ఇంద్రాదేవతలను కరుణతో కాపాడు కన్నతల్లికి నమస్కారములు.  
       సార్జమను విల్లు గల శ్రీ మహావిష్ణువునకు ప్రియసతిఐన శ్రీ 
       మహాలక్ష్మికి నమస్కారములు.
.........................................................................................................
15: 15. శ్లో :     నమోస్తు దేవ్యై  భ్రుగునందనాయై
                నమోస్తు విష్ణో రురసి స్థితాయై
                 నమోస్తు లక్ష్మ్యే కమలాలయాయై
                  నమోస్తు దామోదర  వల్లభాయై :
 

ప:  భ్రుగుతనూభవ అలికులవేణి నతులు
      విష్ణువక్షోనివాసినీ వేలనతులు
      కమలవాసిని శ్రీ దేవి కమల నతులు
      నతిననాభుని వల్లభా నతులు నీకు

తా:  భ్రుగు మహర్షిపుత్రిఐన శ్రీదేవికి నమస్కారములు.  శ్రీ విష్ణు వక్షస్థల 

       నివాసినికి లక్ష్మికి నమస్కారములు.  కమలవాసినిఐనకమలకు 
        నమస్కారములు.  నందసుతుడైన శ్రీ  కృష్ణునకు   రుక్మిణి 
        నామముతో పత్నిఐన శ్రీ మహాలక్ష్మికి నమస్కారములు.      
........................................................................................................
 16.:శ్లో :    నమోస్తు కాన్యై కమలేక్షణాయై
                నమోస్తు
భూత్యై భువన ప్రసూ త్యై
                 నమోస్తు దేవాదిభి రర్చితాయై
                  నమోస్తు నందాత్మజ  వల్లభాయై :


 ప:  కాంతి రూపిణి  ఐన ఒకమల  నతులు
      అఖిల సంపత్ప్ర దాయి నీ  అంబ నతులు
      దేవముని గణపూజితా దేవి  నతులు
      నందన సుత వల్లభా పద్మన  న నతులు

తా:  పద్మములవంటి  కన్నులుగల కాంతరూపిణికి   

      నమస్కారములు.   లోకజననికి, ఐస్వర  రూపిణికి  
      నమస్కారములు,  ఇంద్రాది దేవతలు చేత పుజింప బడు
      శ్రీదేవికి నమస్కారములు. నందసుతుడగు శ్రీ కృష్ణునకు
    రుక్మిణి నామముతో సతిఐన లక్ష్మీదేవికి నమస్కారములు .     ...........................................................................................................
17: శ్లో :      సంపత్కరాణి  సకలేంద్రియ నందనాని
                  సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి
                  త్వద్వందనాని దురితాహరణోద్యతాని
                  మామేవ మాత రనిశం కలయంతు మాన్యే  


            ప:  సకల సంపత్క రంబులు  సారసాక్షి
                  విందు లఖిలేంద్రి  యమల ఆనందములకు
                  పాపహరములు సామ్రాజ  అ  భాగ్యదములు
                  పద్మ జనయిత్రి నీకిడు వందనములు

తా:  పద్మ పత్ర విశాలలోచనా మాతా నీకు చేయు    

       వందనములు , సకల  సంపద్ర్పదములు
       సకలెంద్రియములకు ఆమమ్దా అమందా నంద ముల
       విందు చేయును .  సర్వ పాపములను తొలగిమ్చును. 
       సామ్రాజ  వైభవమును  సైతము యీయ గలవు. తల్లి
       నీకు సదా వందన మొనర్చు భాగ్యము  నాకే 
       కలుగునుగాక  
............................................................................................................
18. శ్లో :       యత్కటాక్ష సము పాసనా  విధి:
                 సేవకస్య  సకలార్ద  సంపద:
                 సంతనోతి వచనాం గ  మానసై
                 త్వాం  మురారి హ్రుదయేశ్వరీం  భజే.  


ప:  సకల సంపద్ర దంబులు  జనని నీదు
      సాంద్ర  కరుణా కటాక్ష వీక్షణములమ్మ
      భక్తితో గొల్తు నీ పాద పద్మములను
      స్తుతి యో నార్చెద త్రికరణ  శుద్ధిగాను

తా:  ఎవరి కరుణా కటాక్ష వీక్షణము  భక్తితో సేవించు వారికి సమస్త 

        సంపదలోసంగునో అట్టి మహాలక్ష్మీ  శ్రీ హరి హృదయేశ్వరి  నిన్ను 
       త్రికరణ శుద్ధిగా ఆరాధించెదను 
.........................................................................................................................................................................
 ..........................................................................................................................................................................
19. శ్లో :        సరసిజ నయనే సరోజ హస్తే
                    ధవళ తరాం శుక  గంధ మాల్య శోభే
                    భగవతి హరివల్లభే మనోజ్జ్నే
                    త్రిభువన భూతికరి ప్రసీద మహ్య్యాం 


ప :  కమలలోచన  జనయిత్రి  కమలహస్త
       ధవళతర గంధ  మాల్య  వస్త్రా మానోజ్న
       భగవతీ  హరివల్లభా భాగ్యదాత్రి
       కరుణతో  బ్రోవుమా మమ్ము కన్నతల్లి.

తా : కమలముల  కన్నులు గల తల్లీ,  కమలము కరమునందు  గల 

        జననీ,  తెల్లని పట్టు వస్త్రములను ధరించి, తెల్లని గంధమును 
        పూసికొని, తెల్లని పూలమాలలతో శో భిమ్చు లక్ష్మీ దేవి,  
        నారాయణ ప్రియసతీ, నన్ను అనుగ్రహింపుము.    
         ............................................................................................................
20. శ్లో :         దిఘస్తిబి: కనకకుంభ ముఖావ సృష్ట
                     స్రగ్వా హినీ  విమల
చారు జల ప్లు తాంగీం
                     ప్రాతర్నమామి జగతాం  జననీ మశేష
                     లోకాధినాథ గృహిణీ   మమృతాబ్ది పుత్రీం 


ప:  కనక కలశాల  నాకాశ  గంగ దెచ్చి
      తీ ర్ధ మాడింపగా నిన్ను దిగ్గజములు
      స్నాతవై  యోప్ప త్రైలోక్య జననీ  క్షీర
      వారాశి  పుత్రికా వందనములు

తా:  బంగారు కలశములతో నిర్మలమైన ఆకాశ గంగా నది 

       జలములను  తొండముతో దిగ్గజములు తెచ్చి స్నానము 
       చేయింపగా  నిర్మల  శరీరముతొ ప్రకాశించుచున్న తల్లీ, సమస్త 
       లోకములకు  ప్రభువైన నారాయాణుని ప్రియ పత్నీ  
       నమస్కారములు      .............................................................................................................
21. శ్లో           కమలే కమలాక్ష వల్లభే త్వం
                     కరుణాఫూ ర తరంగితై  రపాంగై :
                     అవలోకయ
చారు మా  మకించ నానాం
                     ప్రధమం పాత్ర మకృ త్రిమం దయాయా:

             
ప: కమల కమలాక్షవల్ల్లభా కమలనయన
     కనుము కరుణా కటాక్ష వీక్షణముతోడ
     వరమ దారిద్ర్య  వంతులం బ్రథముడనగు

        నన్ను బ్రోవుము! దినునిగన్న తల్లీ !
                
                   పద్మదళములవంటి కన్నులు గల తల్లీ !  పద్మాక్షుడగు  నారాయణుని  ప్రేయసి!   నేను పరమ దరిద్రులలో ప్రథముడను, నీ  దయకు పాత్రుడ నగు నన్ను కరుణా వీక్షణములతో కనుగొనుము  
.............................................................................................................
22.
శ్లో :        బిల్వాట వీమధ్య లసత్సరోజే
                    సహస్రపత్రే సుఖ సన్ని విష్టాం
                    అష్టాపదాంభోరుహ పాణి పద్మాం
                    సువర్ణా వర్ణాం  ప్రణమామి నిత్యం 


ప::అమ్మ మారేడు వనములో  నలరు నరసి
     వేయి రేకుల తమ్మిలో వెలయు  దీవు
     కనక కమలము కరమున గలిగి పసిడి
     చాయ నొప్పెడి సిరి నమస్కారమమ్మ

            మారేడు వనములో గల తామర కొలనులో  వేయి  రేకుల పద్మ మందు సుఖముగా కూర్చుండి, పసిడి తామర పువ్వు కరమునందు దాలిచి మిసిమి గల మేని చాయతో నొప్పారు లక్ష్మీదేవీ  ! అమ్మ! నమస్కారము.         ...............................................................................................................,,,
23.
శ్లో :       కమలాసన పాణినా లలాటే 
                   లిఖితా మక్షర పంక్తిమస్య జంతో:
                   పరిమార్జయ మాత  రంఘ్రిణా  తే
                   ధనిక 
ద్వార నివాస దు:ఖ దోగ్ద్రీం 

ప: నాదు  నుదుటను వ్రాసెను నలువ యిట్లు
     వరమ దారిద్ర్య  దు:ఖంబు పడయు మంచు
     కలిమి గలవారి వాకిట నిలువు మంచు
     బ్రహ్మ వ్రాతను తుడువు నీపదముతోడ

                    పరమ దరిద్రులలో ప్రథముడవై కలవారి వాకిళ్ళ ముందు నిల్చి బిచ్చమెత్తుకొనుమని బ్రహ్మదేవుడు  నా నుదుటిపై వ్రాసెను.  తల్లి నీవు ఆ బ్రహ్మవ్రాతను నీ  పాద పద్మముతో తుడిచి వేయుము 

.....................................................................................................................................................................
24. శ్లో :  అంభోరుహం జన్మగృహం భవత్యా;
              వక్షస్థలం భర్త్రు గృహం మురారే
              కారుణ్యత: కల్పయా పద్మవాసే !
              లీలా  గృహం మే హ్రుదయార విందం


ప: ముద్దు గొల్పెడి తమ్మి  నీ పుట్టినిల్లు
     ఆ మహావిష్ణు హృదయమే అత్తయిల్లు
     కమలవాసిని! కొలు వుండు  కరుణతోడ
     ఎల్లవేళల నాదగు హ్రదయ పీట్టి 
 
                    తల్లీ శ్రీ మహాలక్ష్మి పద్మము నీకు పుట్టినిల్లు, శ్రీ మన్నరాయణుని హృదయమే నీకు మెట్టినిల్లు, ఓ పద్మాలయా కరుణతో నా హృదయారవిమ్దమును నీ  విలాస మందిరముగా చెసికొనుము. 

..............................................................................................................................................................
25. శ్లో :   స్తువంతి యే  స్తుతి భి రమూ భి రన్వహమ్
               త్ర ఈ మ ఈమ్ త్రిభువన మాతరం రమాం
               గుణాధికా  గురుతర భాగ్య  భాజినో
               భవంతి తే భువి బుధ భావితాశయా;      

ప:   ఎవరు స్తుతియింతురో వారలి స్తవమున
       మాన్య వేదాత్మ త్రిభువన మాత  రమను
       అతుల సంపద గల్గి గుణాధికులయి
       పండితుల మెప్పు గాంతురు వసుధయందు

                 ప్రతిదినము ఎవరు ఈ స్తుతులతో ముల్లోకములకు తల్లి ఐయిన లక్ష్మీదేవిని స్తుతిమ్తురో వారు గుణములచే నధికులగుచు అధిక ధనవంతులై  పండితుల మెప్పు గాంతురు









.................................................................................................................

12.Jai Ganesh Deva - Aarti - Popular Hindi Devotional Songs


16, మార్చి 2013, శనివారం

10.Children Special

Diseases వ్యాధులు रोगों                                                                     1 adenoid: అడెనాయిడ్: कण्ठशालक:                                               2 amenorrhoea: బహిష్టు: amenorrhoea:                                             3 anthrax దొమ్మరోగం एंथ्रेक्स                                                          4 anux fistula: anux నాడివ్రణము: anux नालव्रण:                                 5 apoplexy: అవయవములలో రక్తము చిమ్ముట: मिरगी:                 6 ascities ascities ascities                                                                 7 asthma ఉబ్బసం दमा                                                                      8 autophonia autops autophonia autops autophonia autops        9 bronchitis శ్వాస నాళముల వాపు रोंकाइटिस                               10 cancer క్యాన్సర్ कैंसर                                                                  11 carbuncle కెంపు मसा                                                                 12 cataract. కంటిశుక్లం. मोतियाबिंद.                                              13 catarrh. ముక్కు దిబ్బడ. सर्दी.                                                    14 cholera. కలరా. हैजा.                                                                     15 cold చల్లని ठंड                                                                             16 cold fever చల్లని జ్వరం सर्दी बुखार                                             17 colic. ఉదర సంబంధిత వ్యాధి. पेट का दर्द.                                      18 coma. కోమా. कोमा.                                                                       19 constipation. మలబద్ధకం. कब्ज.                                                  20 consumption వ్యయము खपत                                                           21 cough దగ్గు खांसी                                                                    22 cycosis cycosis cycosis                                                               23 diptheria డిఫ్తీరియా జ్వరము diptheria                                          24 diuresis అతిమూత్ర విసర్జనము मूत्रलता                                      25 diabetes మధుమేహ వ్యాధి मधुमेह                                                 26 diarrhoea నీళ్ల విరేచనాలు दस्त                                                       27 dropsy మహోదరం जलोदर                                                      28 dysentry dysentry dysentry                                                      29 dyspepsia అజీర్తి अपच                                                                 30 ear-ache చెవి నొప్పి कान का दर्द                                                  31 elephantiasis బోద వ్యాధి फ़ीलपाँव                                              32 epilepsy కాకిసోమాల मिर्गी                                                         33 erysipelas అక్కి विसर्प                                                                  34 felon fever నేరస్ధడు జ్వరం अपराधी बुखार                                  35 fistula నాడివ్రణము नालव्रण                                                        36 head-ache తల నొప్పి सिर में दर्द                                                 37 hear disease వ్యాధి వినడానికి रोग सुना                                       38 haemtemesis haemtemesis haemtemesis                                     39 haemorrhage గాయపడుట వల్ల కలిగే రక్త స్రావము रक्तस्त्राव         40 haemorrhoids మూల వ్యాధి अर्श                                                41 herpes సలిపి दाद                                                                        42 hiccough ఎక్కిళ్ళు హ్క్హ్క్ శబ్దములు हिचकी                                  43 influenza ఉర్థ్వ శ్వాసనాళ ప్రాంతములో వైరస్ వలన కలుగు విషపడిశము इन्फ्लुएंजा                                                                   44 itch దురద खुजली                                                                       45 jaundice కామెర్ల వ్యాది पीलिया                                                     46 lepsory lepsory lepsory                                                                47 leucoderrma leucoderrma leucoderrma                                    48 humbago humbago humbago                                                    49 malaria మలేరియా मलेरिया                                                       50 measles. తట్టు. खसरा.                                                                    51 migraine పార్శ్వపు నొప్పి माइग्रेन                                               52 mumpse mumpse mumpse                                                        53 mypopia mypopia mypopia                                                      54 nausea వాంతివచ్చేటట్టు मतली                                                    55 naurasihenia naurasihenia naurasihenia                                56 paralsis paral sis PARAL बहन                                                 57 pleurisy . ఫుఫుసావరణ శోధ. परिफुफ्फुसशोथ.                             58 pneumonia. న్యుమోనియా. निमोनिया.                                      59 piles మూలశంక వ్యాధి बवासीर                                                          60 plague. ప్లేగు వ్యాధి. प्लेग.                                                        61 py rexia py rexia py rexia                                                        62 py rosi. py rosi. py rosi.                                                             63 renal colic ఉక్క శూల गुर्दे का दर्द                                                 64 rheumatism కీళ్ళ నొప్పి गठिया                                                    65 rickets ఎముకలు మెత్తబడుట सूखा रोग                                      66 ringworm రింగ్వార్మ్ दाद                                                             67 sciatica తుంటి నొప్పి कटिस्नायुशूल                                           68 serofula serofula serofula                                                         69 small pox చిన్న పాక్స్ चेचक                                                         70 sore-ey e గొంతు-EY ఇ गले-ey ई                                                71 sprain. బెణుకు. मोच.                                                                   72 stranguary . stranguary. stranguary.                                          73 sun stroke. సూర్యుడు స్ట్రోక్. सूरज स्ट्रोक.                                    74 tuberculosis క్షయరోగము यक्ष्मा                                                 75 whitlow గోరుచుట్టు बिसहरी                                                        76 whooping-cough. కోరింత దగ్గు-. काली खांसी.





































www.mallapragadaramakrishna.blogspot.in.