8, మార్చి 2013, శుక్రవారం

7.Womens' day


8-03-2013/8-03-2015                                        

                  ప్రతి ఒక్కరి  జీవితము సుఖము కావాలంటే  "స్త్రీ "  సుఖముగా ఉండాలి, సుఖము అనేది ఒకరు ఇచ్చేది కాదు, బలవంతమున పొందేది కాదు, కేవలము " స్త్రీ " మాత్రమూ మార్గదర్సకురాలు సలహాలు ఇచ్చి మంచి మార్గమున నడుచుటకు సహకరించు తుంది. "స్త్రీలకు ఒక విధమైన కొన్ని శక్తులు అంతర్గతముగా పనిచేస్తాయి.
     " వేదనను శాంతి పరిచి సందేహము తీర్చే శక్తి "
     " జిజ్ఞాసనూ, జ్ఞానమును తెలిపే నిశ్చల శక్తి "
     " భేదాలను తొలగించి మర్గాన్వేషణకు వెగపరిచె శక్తి "
     " వ్యక్తిత్వ పరి పూర్ణత అవఘాహన పెంచే  శక్తి "
     " స్తన్య మోహనమైన వాశ్చల్య  రక్తి "
     " సాక్షి మాత్రా సుందరమైన సఖ్య  శక్తి "
     " పరమ ధర్మార్తమైన దాంపత్య భక్తి  "
     " ఈ సుఖంబును కష్టంబును నెందుకొరకు   "
     " ఈ భవంబును  నాశంబు  నెందుకొరకు   "
     " ఈ జగంబున నన్నియు  నెందుకొరకు   "
      " ప్రేమకొరకు, ప్రేమకొరకు ప్రేమకొరకు  "

   
 ఎ వయస్సు ముచ్చట్లు ఆ వయ్యస్సులో జరిగితే అంతా శుభప్రదం, జీవితము స్వర్గ తుల్యము చేసుకోవాలన్న, నరక తుల్యము చేసుకోవాలన్న ఇంటి ఇల్లాలు పై ఆధారపడి ఉంటుంది.  " స్త్రీ మాట, నడవడిక, ప్రవర్తన "  బట్టి అందరి జీవితాలు స్వర్గతుల్య్యమవుతాయి.ఇదే విధము గా కొందరి స్త్రీల ప్రవర్తన నరక తుల్యము అవుతుంది. 

                                              

   " దారా దారుణ: దారా ద్రావిక: దారా దానవారి : దారా దేవత: "
       " దారా దర్పణ: దారా దండనీతి: దారా దండ సూక: దారా ద్యుతి: "
       " దారా దిత: దారా దినమణి : దారా ద్రుశ : దారా దేవనం: "
       " ధరణీ ధనాదిప: ధవళ ధర్మ: ధీమతి ధృతి  దివ్య తెసస్సు "
            " కొందరు స్త్రీలు భయనకరసం కలవారు "                                          " కొందరు స్త్రీలు దెవతానుగ్రహముతొ పుట్టినవారు  "
                     " కొందరు స్త్రీలు అద్దము లాంటి వారు "                                        " కొందరు స్త్రీలు  నిత్యమూ  దేవుని ఆరాధించేవారు"
    " కొందరు స్త్రీలు ఎప్పుడు సర్పములా బుసలు కొడుతూ ఉంటారు "    " కొందరు స్త్రీలు ఇంట్టిల్లి పాటి వేలుగును పంచే వజ్రము వంటి వారు "                 " కొందరు స్త్రీలు కామ శాస్త్రము తెలిసినవారు "
                        " కొందరు స్త్రీలు భూదేవి వంటి వారు "                                         " కొందరు స్త్రీలు  ధైర్య వంతులు, తేజోవంతులు "
                     " కొందరు స్త్రీలు మధుర స్వరముకలవారు "                                       " కొందరు స్త్రీలు ధనవంతులు, మదవతులు "
స్త్రీలు ఉన్నదానిలో తృప్తి పడి , ఆశకు పోకుండా సంపాదనలో వచ్చిన  దానిని నలుగురికి ఆహారము వండి భర్తకు పిల్లలకు పేట్టి  మిగిలన
దానిని తిని  పిల్లలను నిద్ర పుచ్చి, సంసారము చేయు కొందరు స్త్రీలు.     



                                                                   
                                                  
ఆకార్ణ్నాంత  విశాల నేత్రములు గల ఆనంద దాయివి
కనురెప్పలు వేయక కలకాలం కళ్ళతో కట్టక్షిమ్చే కామాక్షివి
నయన మనోహరములైన నగవు చూపులు గల నీర జాక్షివి
మహేశ్వరిని మైమరిపిమ్చిన మహానేత్రాలు గల మాహేశ్వరివి
వేకువజామున వేద  ఫటనం చేయువారికి  వేదములు నేర్పే గాయత్రివి
సహస్త్ర కోటి సహస్త్ర చంద్ర  సమ సుధా నేత్ర సుగుణ సుందరివి
త్రినేత్రుని యందు వామ భాగమున తిష్టగాఉన్న త్రిలోక సుందరివి 
ముక్కంటిని చేరి మూడు లోకాలకు ముక్తిని ప్రసాదించే ముక్తే శ్వరివి
ఉష్ణం, సీతలం గల నేత్రాలతొ ప్రపంచాన్ని కాపాడుతున్న చాముండివి
వెలుగు, చీకటిలను, ప్రకృతిని క్రమ పద్ధతి లో ఉంచిన సుకుమారివి
అఖండ జ్యోతిగా నిత్యమూ వెలుగుచూపు నేత్రములు గల అఖిలాండేశ్వరివి
మరకత మణుల కాంతిగల నయనాలు ఉన్న నంద నందుని సోదరివి
రణరంగమున రుద్రనేత్రవై రక్త బీజుని హత మార్చిన రమ్య్యత వర్ధివి
పద్మరేకులుకళ్ళుగల హంసవాహన దారివైన బాలా త్రిపురసుందరివి
శ్రీశైల శిఖరమునందు శివునితో బ్రమల చూపులుగల బ్రమరాంభవి
ఆత్రుత చూపులతో ఉన్న  అన్నార్తులకు ఆకలి తీర్చిన అన్నపుర్ణవి
కరుణించి, కణికరించి, కన్న తల్లివై కళ్ళళ్లో నీరు తుడిచిన కామేశ్వరివి 
కడ కంటి చూపులతో కారున్య మూర్తిని చూసె కన్యా కుమారివి
విశాల నేత్రములతొ విశ్వమంతా విస్తరిమ్చి ఉన్న విశ్వేశ్వరివి
కనురెప్పలు పెద్దవిచేసి ఖటి నాత్ముని కృపచూపిన కుమారివి
కనుచూపు కరువైన వారికి కళ్ళను ప్రసాదించిన ధాక్షాయినివి
మహాదేవికి మంగళహారతులు, మహాదేవుల్నకు మంగళహారతులు,
అమృతధారాలను కురిపించు అఖిలండేశ్వరికి మంగళ హారతులు,
మంగళం అందరిని ఆదుకొనే అఖండ జ్య్యోతిని ప్రసాదించే అర్ధనారిశ్వరునికి
మంగళం నా మననులో తోచిన భావాలను వర్ణించిన మనిషిని మన్నించమని
వేడు కుంటు మహాశక్తికిమంగళం, పార్వతి పరమేశ్వరులకుమంగళం.    
మంగళం. జయ మంగళం. శుభ మంగళం.  

                                                                             
జో కొట్టినా , పాల్లిచ్చినా, భయపెట్టినా, లాలించినా, గోరుముద్దలు తినిపించినా,బల్యంలోనైనా, యవ్వనంలో నయినా,  వృద్ధాప్యంలోనైనా,  భాద్యతలలోనైనా,భాదలలోనైనా, అందరు సంతోషముగా ఉండేందుకు అమ్మే ఆధారం.
మనస్సాంతికైనా, మమకారములకైనా, కోరికలకైనా, వేడుకలకైనా, సమస్స్వలకైనా వేదన పరిష్కారమునకైనా, ఏ విషయాలకైనా, కామధెనువువలె, కల్పతరువు వలె, చీకటిని తరిమి వేలుగును అందరికీ పంచుటకు  అమ్మే ఆధారం.
ప్రియ మైన భర్తపై ఉండే అనురాగముతో, భార్య ఎలాగైతే అతనిని విడువదో,                                                                                           భక్తి పారవశ్వముతో దేవుని పాదాలు బక్తులు విడవరో, పిల్లలకు పౌష్టిక
ఆహారమును పెట్టి, తృప్తి కల్గించి,  కోరికలను తీర్చి, అందరి గుణ గణాలు
వృద్ధి అగుటకు అమ్మే ఆధారం.
                  


స్త్రీ పురుషులు  ఎకమవుటకు అమ్మ తనవంతు సహాయము చేస్తుంది. స్మరణము, గుణా లు వర్ణించుట,కొన్ని ఆటలలో  కలవటము,  కామ, తదేక దృష్టితో చూడటమ్, రహస్వ్యముగా మాట్లాడటం, సంకల్పబలము, ప్రయత్న  బలము సిద్దిమ్చటం, దైహికముగా ఎకముకావటానికి అమ్మే ఆధారం.
పురుషునికి స్త్రీ ఒక దాసిగా, ఒక తల్లిగా, శృంగార దేవతగా, సలహాదారునిగా, అనేకవిధాలుగా పురుషునికి సహకరిస్తూ  ఉంటుంది. అదేవిధముగా  స్త్రీ కి పురుషుడు సత్య- ధర్మ -న్యాయముతో ఏక పత్ని వ్రతుడుగా ఉండుటకు అమ్మే ఆధారం .
నింగికి, నేలకు, జాలానికి, గాలికి, అగ్నికి, ఆశకు ఆధారాలు లేనట్లే తల్లి ప్రేమకు ఇంత అని చెప్పుటకు ఎవరికీ సాద్యముకాదు. పిల్లల సుఖము, భర్త సుఖము అందరి సుఖమునకు అమ్మే ఆధారం.
కళ్ళతో చూసిన విషయం, మనసుతో చుసిన విషయం, హృదయంతో చూసే విషయం, స్పృహతో చూసే విషయం, స్మృతితో చూసే విషయం, అంత రంగంతో చూసే విషయం, ఆదిభౌతికముతో చూసే విషయం, చల్లని చూపులతో హృదయములో దాచుకుంటు, వంశం, కులం మర్యాదలను కాపాడు కుంటూ ఉండటానికి అమ్మే ఆధారం.
అరమరికలు లేకుండా,  అందరి మన్ననలను పొందుటకు,  అనుకున్నది సాధించుటకు, ఆత్మీయులను కలుపుటకు అసాధ్యము కానిది సుసాధ్యము చేయుటకు అమ్మే ఆధారం  
                                                  
ఈఈ కాలంలో అమ్మ తత్వము అర్ధం చేసుకోలెకుండా  నికేమి తెలుసు, ఇంగ్లీషు వచ్చా, కంప్యూటర్ వచ్చా, నలుగురులో నీకు  మాట్లాడుట రాదు, నీ పాత కతలు ఎవరికీ కావాలి, రోబోలు సంచరించే కాలం ఇది అంటు ధనమదంతో  ఆశ్రమంలో చేర్చటం, లేదా ఉడిగం చేయించు కోవటం, అందరి ముందు అత్తా మామలను, కన్న  తల్లి తండ్రులను చూడనివారిని ఆ దేవుడు కూడా రక్షించాడు అని ఉపన్యాసం ఇస్తారు. ముసలి కన్నీరు కారుస్తారు.  కన్నీరు ఎరుగని కన్నా తల్లికి కన్నీరు పెట్టించడం.  ఈఈ భారత భూమికి మంచిదికాదు. ఒకరిద్దరు చాలు అని పోషణ చేయలేమని మనము ఏ చదువు చదివి ఇంత వారము ఐనామని ఒక్క సారి గుర్తు తెచ్చుకొని కన్న  తల్లి తండ్రులను కొడుకులు కూతుర్లకు పోషణ అవసరమని గుర్తించి జీవితము మూడూ పూలు ఆరు కాయలు చేసుకోవాలని ఈఈ ప్రపంచ మహిళా దినోత్చవము సందర్భము గా  నా ముఖ్య సందేశం ఇది వ్రాయుటకు మా అమ్మే ఆధారం.                      
   


                                                                      

2 కామెంట్‌లు: