జగద్గురు శంకరాచార్య విరచిత ప్రశ్నోత్తర మాలికను ఆంధ్ర పద్యానువాదము చేసినవారు గుంటూరు వాస్తవ్వులు " శ్రీ అక్కిరాజు వేంక టే శ్వరశర్మ గారు , విద్వాన్ సాహిత్య శిరోమణి బిరుదు పొందిన వారు. వీరు తెలుగు మరియు సంస్క్రుతమునందు అనేకరచనలు చేసినారు. విరి కుమారుడు శ్రీధర్ నాకు పంపగా నేను ఇందు పొందు పరిచినాను..
1..ప్ర : ఈ లోకమున అవశ్య ము స్వీకరింప దగినదేది? స : గురువాక్యము
2. ప్ర : అవశ్య ము పరిత్య్యజిమ్పదగినదేది? స: వెదసాస్త్రములకు నిషిద్దమగుకర్మ.
3. ప్ర : గురువనగా నెవరు? స: పరతత్వము బాగుగా తెలిసికొన్న వాడై శి ష్యులకు మేలు
చేయ యత్నించువాడు .
4. ప్ర : విద్వాంసులు త్వరగా జేయదగినదేది ?
స : జనన మరణ పరం పరగా కొనసాగు సంసారమును ఛేదించుట.
5. ప్ర: మోక్షమను వృక్షమునకు బీజమేది ?
స: సత్కార్యా చరణము వలన నేర్పబడిన బ్రహ్మజ్ఞానము.
6. ప్ర : హితకరమైనది ఏది ?
స: ధర్మము .
7. ప్ర : సుచియైన వాడేవాడు?
స : ఎవని మనస్సు పరిశుద్ధమో అతడే.
8. ప్ర : పండితుడెవడు ?
స: వివేకము కలవాడు.
9. ప్ర : విషమనగానేమి ?
స : గురువులను తిరస్కరించుట.
10. ప్ర : సంసారమందు సారమైనదెది?
స : సంసారమున సారమెది అని పలుమార్లు ఆలోచించటమే.
11. ప్ర: అందరి కిని కోరదగినడేది ?
స: తనకు తనవారికిని ఇతరులకును హితమును కోరేడి జన్మము.
12.ప్ర: మద్యమువలె మోహమును కలిగించునదియేది ?
స: స్నేహము.
13. ప్ర: దొంగ లేవారు?
స: రూప రస గంధాది విషయములు ఇంద్రియాలయోక్క మనస్సు
యొక్క సామర్ద్యమును.
అపహరిమ్చునవి గనుక ఇవి దొంగలు.
14. ప్ర: పేరాశ ఏది?
స: ప్రయత్నము చేయక ఫలితముకోసం చూచుట.
15. ప్ర: భయము దేని వలన కలుగును?
స : మరణము వలన .
16. ప్ర: గ్రుడ్డి వానికంటె పేద గ్రుడ్డి ఎవరు ?
స: విషయ సుఖములందు ఆసక్తి కలవాడు.
17. ప్ర: శూరుడెవ్వడు ?
స: అంగనల వాలు చూపులను భాణములచేత పీడింపబడనివాడు
18. ప్ర: చేవులను దోసిళ్ళతో అమృతము వలే త్రాగ దగినదేది?
స: సత్పురుషుల హితోపదేశము.
19. ప్ర: గౌరవమును పొందుటకు మూలమేది?
స: యా చింపకుండుట.
20. ప్ర: తెలిసికొనుటకు సాధ్యము కానిదేది?
స: స్త్రీలనడవడి.
21. ప్ర: స్త్రీల ప్రవర్తన చేత తప్పు దారి పట్టనివాడు?
స : శూరుడు.
22.ప్ర: దు:ఖమనగానేమి?
స: సంతోషము లేకపోవుటయే.
23.ప్ర : మానవుడు దేనిచేత చులకన యగును?
స : యాచనచేత .
24.ప్ర: ఎట్టి జీవితము ప్రశస్తమైనది ?
స: దోషరహితమైన జీవితము.
25.ప్ర : సోమరితనమననేమి ?
స : వేదశాస్త్రములు చదివి మరల చదవకుమ్దుట.
26.ప్ర: ఎవరు జాగరూకత కలవాడు ?
స: వివేకము కలవాడు .
27.ప్ర : నిద్ర అన నేమి?
స : అజ్ఞానము .
28.ప్ర: తామరాకుపై నీరువలె చంచమైనదేది?
స: య్యోవ్వనము
29.ప్ర: చెంద్రకిరణములవలె చల్లనైనవారెవరు ?
స: సజ్జనులు.
30.ప్ర : నరకమేది?
స : పరులకు లోబడి యోండుట.
31.ప్ర : సౌఖ్య హేతువేది?
స : సర్వసంగ పరిత్యాగము.
32.ప్ర : సత్యవాక్కు అనగానేమి ?
స : హితమును ప్రీతిని కలిగించు వాక్యము.
33.ప్ర: అందరికి ప్రియమైనదేది?
స: ప్రాణము .
34.ప్ర: అనర్ధకమైనదేది ?
స: గర్వము
35.ప్ర: సుఖకరమైనదేది?
స: సజ్జనులతోడి స్నేహము.
36.ప్ర: సమస్త దు:ఖములను పోగొట్టువాడేవాడు ?
స: సర్వజనుల మేలుకోరు త్యాగధనుడు.
37.ప్ర: మరణముతో సమానమైనదేది ?
స: మూర్ఖత్వము .
38.ప్ర: వేలకట్టుటకు వీలుకానిదేది?
స: అవసరమైనప్పుడు ఈయబడినది.
39.ప్ర: మరణము వరకు శల్యము వలే భాదిమ్చునదేది ?
స: రహస్యముగా చేయబడిన పాపము.
40. ప్ర: ఎ విషయమున ప్రయత్నము చేయదగును ?
విద్యాభ్యాసము నందు , తగిన ఔషధమును సేవిమ్చుటయందు,
దానములు చేయుట యందు.
41. ప్ర: ఎచ్చట తిరస్కారము చేయదగును ?
స: చెడ్డవారితో స్నేహముచేయుట యందు, పరస్త్రీలను కామించుట
యందు, పరధనమును అపహరించుట యందు.
42. ప్ర: రాత్రింబవళ్ళు ఆలోచింపతగినదేది ?
స: సంసారము నిస్సారము అనే అంశము అంటే కాని స్త్రీ కాదు .
43:ప్ర: చాల ప్రేమతో సంపాదిమ్పడగినదేది ?
స: దీనుల యందు.దయ.
44.ప్ర: మరణము ఆసన్నమైనపుడు ఆత్మ ఎవనిచేత జింప బడదు?
స: 1. మూర్కునకు 2. సంశయాత్మునకు 3. నిరంతరం దు:ఖపడు
శ్వభావము గలవానికి 4. చేసిన మేలు మరచిన వానికి.
45. ప్ర: సాధువనగా నెవరు ?
స: శాస్త్ర సమ్మతము ఐన ప్రవర్తన కలవాడు.
46: ప్ర: ఎవనిని అధముడని అందురు ?
స: శాస్త్ర సమ్మతమగు ప్రవర్తన లేని వాడిని.
47.ప్ర: ఈ జగత్తు ఎవనిచే జేఇంప బడును ?
స: సత్యమునే పల్కువారిచేత, ఓర్పు సహనము గలవానిచేత.
48.ప్ర: దేవతలు ఎవనికి నమస్క రిమ్తురు ?
స: దయ అధికము కలవారికి, మంచి బుద్ధి గలవారికి.
49.ప్ర: దేనివలన జుగుప్స కలుగును ?
స: అరణ్యమువంటి భీకరమైన సంసారమువలన .
50.ప్ర: ప్రాణులందరు ఎవని వశమందు ఉందురు ?
స: ఎల్లప్పుడూ సత్యమునే పల్కు వానికి, వినయముతో
ప్రవర్తిమ్చువానికి
51.ప్ర: ఎక్కడ నిలకడగా నుండవచ్చును?
స: ఇహికములు, అముష్మికములైన స్రయస్సులను కలిగించు
న్యాయ మార్గమునందు.
52.ప్ర: గ్రుడ్డివాడెవ్వడు ?
స: చెయదగినదికూడ చేయలేనివాడు.
53.ప్ర: చేవిటి వాడెవ్వడు?
స: పెద్దలు చెప్పిన హితము వినని వాడు
53.ప్ర: మూగవాడేవ్వడు ?
స: సమయము వచ్చినప్పుడు ప్రియ వచనములు పలకనివాడు.
54.ప్ర : దానమనగానేమి?
స: యాచింపకయే ఇచ్చునది.
55.ప్ర: మిత్రుడెవ్వడు ?
స: పాపకార్యములను చేయకుండ నివారిమ్చువాడు.
56.ప్ర; ఏది అలంకారము?
స: సత్య్యమును వచించుట .
57. మెరుపు వాలే చెంచలమేద?
స్త్రీల ప్రేమ, దష్టులతో మైత్రి
58.ప్ర: కులము గురించి ఆలోచన లేనివారెవరు?
స: కేవలము సజ్జనులు మాత్రమే .
59.ప్ర: చతుర్భుద్రము అనగానేమి ?
1. ప్రియవచనములతో ఇచ్చు దానము, గర్వరహితమైన
జ్ఞానము, క్షమాగుణముతోడి పరాక్రమము, త్యగాముతో
కూడిన ధనము.
60.ప్ర: ఐశ్వర్యము ఉన్నప్పుడు దేనిని గూర్చి విచారపడవలసి
ఉండును ?
స: లోభము గూర్చి
61.ప్ర: ప్రశంసింప దాగిన గుణమేది?
స: ఔదార్యము.
62.ప్ర: విద్వామ్సులచేత పుజంప దాగిన వాడేవాడు?
స: సహజ మైన వినయగుణముతో ఒప్పుచుండువాడు.
63. ప్ర: లక్ష్మీ ఎవనిని కోరి వచ్చును?
స: నీతితో ఉన్న వారి, సోమరితనము లేని వారి వద్దకు లక్ష్మి
వచ్చును.
64. ప్ర: ఎందు నివసిమ్చదగును?
స: కాశీ యందు, సజ్జనుల సన్నిధి యందు.
65. ప్ర: విడిచిపెట్టదగిన దేశమేది ?
స: లోభి పాలించు దేశము.
66. ప్ర: పురుషుడు దేనితోకూడి విచారములేనివాడుగా ఉండును.
స: వినయశీలవతియగు భార్య తో
67. ప్ర: గొప్పవైభవముతొ కూడి ఉన్నవాడు ?
స: తగినసంపద ఉన్నవాడును దాత్రుత్వములేనివాడు.
68. ప్ర: చాలా తేలికతనమును కలిగిమ్చునదేది ?
స: అల్ల్పులను యాచించుట.
69. ప్ర: శ్రీ రాముని కంటే గొప్ప శూరుడేవడు ?
స: మన్మధుని భాణమునకు కలత చెందనివాడు.
70. ప్ర: రాత్రిం పగళ్ళు ధ్యానించ దగినది ఏది ?
స: భగవంతుని పాదము, సంసారముకాదు.
71. ప్ర: కుంటి వాడుగా ప్రసిద్ధుడేవడు ?
స: ముసలితనమున తీర్ద్ధయార్త చేయు వాడు.
72. ప్ర: మనుష్యులు సమ్పాదీమ్పదగినదెది?
స: ధనము,కీర్తి ,విద్య ,పుణ్యము, బలము.
73. ప్ర: నాశనము చేయదగినదేది?
స: లోభము.
74. ప్ర: శత్రువు ఎవడు ?
స: కామమే శత్రువు.
75. ప్ర: ప్రాణముకంటే రమ్యమైనదేది ?
స: ధర్మము
76. ప్ర: సంరక్షిమ్పవలసినదేది?
స: కీర్తి, ప్రతివ్రత
77. ప్ర: చేతిలోని ఆయుధమువలె రక్షించునట్టిదేది?
స: తగిన ఉపాయము .
78. ప్ర: తల్లివలె కాపాడునట్టిదేది ?
స: ఆవు
79 . ప్ర: బలమనగానేమి?
స: ధైర్యము
80. ప్ర: మరణ సమానమైనదెది?
స: జాగరూకత లేకపోఫుట
81. ప్ర: విషము ఎవరియందు ఉండును?
స: దుర్జనుల యందు
82. ప్ర: అందరికి అశుచిత్వము కల్గిమ్చునట్టిదేది ?
స: ఋణము
83. ప్ర: అందరికి భయము కల్గిమ్చునది ?
స: ధనము .
84. ప్ర: లోకమునందు ధన్య్యుడేవడు ?
స: సర్వసంగ పరిత్యాగి యగు సన్యాసి .
85. ప్ర: సంన్మా నిమ్పదగినవాడేవాడు ?
స: సత్పర్తన గల పండితుడు .
86. ప్ర: సేవింప దగిన వాడేవాడు?
స: యాచకులకు తృప్తి కల్గునట్లు నిచ్చువాడు .
87. ఏది మహాభాగ్యము ?
ఆరోగ్యమే మహాభాగ్యము.
88. ప్ర: ఎవడు ఫలమును పొందును?
స: కష్టపడి పనిచేయువాడు .
89. ప్ర: పాపములెట్లు నశించును?
స: సంన్మంత్ర జపమువల్ల
90. ప్ర: ఎవరు పరిపూర్ణుడు ?
స: సత్సంతానవంతుడు .
91. ప్ర: మానవులకు కడు దుస్కరమైనదేది?
స: నియమనిష్టలుకలిగి మనస్సును నిగ్రహించుట
92. ప్ర: పరదేవతని స్తుతింపబడు దేవత ఎవరు ?.
స: చిచ్చక్తి
93. ప్ర: జగద్భాన్దవుడేవాడు ?
సూర్య భగవానుడు .
94. ప్ర: అందరికి జీవనము ఇచ్చువాడు ?
స: మేఘుడు .
95. ప్ర: జగద్గురువు ఎవరు?
స: పరమేశ్వరుడు .
96. ప్ర: ముక్తి దేనిచేత పొందవచ్చును?
స: హరిభక్తి
97. ప్ర: అవిద్య అనగానేమి ?
స: ఆత్మ స్వరూప భోధనకు అవరోధమైన మాయ .
98. ప్ర: దు:ఖములేనివాడేవాడు?
స: కోపములేనివాడు
99. ప్ర: సుఖమనగానేమి?
స: మనస్సుకు తృప్తి
100. ఇమ్ద్రజాలమేది?
ప్రపంచము, స్త్రీ మనస్సు
101. ప్ర: మిధ్య అనగానేమి?
స: విద్యచేత, జ్ఞానముచేత నశించునది .
102. ప్ర అనిర్వచానమైన వస్తువేది:
స: మాయ
103. ప్ర: అజ్ఞానము ఎక్కడనుండి పుట్టినది ?
స: అనాది నుండి ఉన్నది, ఇది పుట్ట్టేడిది కాదు.
104. ప్ర: ప్రారబ్దము అనగానేమి?
స: ఆయుర్దాయము
105. ప్ర: ప్రత్యక్ష దేవత ఎవరు ?
స : తల్లి
106. ప్ర: ప్రత్యక్ష గురువు ఎవరు ?
స: తండ్రి
107. ప్ర: సర్వదేవతా స్వరూపుడై భాసించు వాడేవాడు?
స: వేదవేదాంగా పారీణుడు సదాచార సంపన్నుడైన
బ్రాహ్మణుడు.
108. ప్ర: స్ర్వవెదములకు మూలమేది ?>
స: ఓంకారం .
ఈ ప్రశ్నోత్తర రత్నమాలను చదివినవారికి, వినిపించినవారి ముత్యాలహరమువలె ప్రకాశింతురు.
వ్రాసితిని నేను మల్లప్రగాడంశ భవుడ
రామకృష్ణ శర్మ యన్పేరువాడ
శంకరా చర్య విరచిత ప్రశ్నోత్తర మాలిక
తెనుగున ఆన్ లైన్లో లో పెద్దల దీవేనలతో,
స్న్హేహితుల సహాయముతో ఇందు పొందు పరిచినాను
ప్రతిఒక్కరు ఇంద్రియములను, మనస్సును, నిగ్రహించుట వలన హ్రుదయమునందు వున్న భగవంతుని దర్శించగలరు
ఇది నా నమ్మకము, ఫలితముగూర్చి ఆలోచించక చెయ్యటమే
భగవద్గీత కర్త ఉపదేశము, అదే నా అనుకరణము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి