31, డిసెంబర్ 2014, బుధవారం

203 by by 2014 -(Politics story)

ఓం శ్రీ రాం                         ఓం శ్రీ  రాం                             ఓం శ్రీ రాం
                                                                  


by by 2014 - Welcome 2015




ఒక మనిషిని గుర్తించడం ఎంత కష్టమో, గుర్తించిన వాడిని మరీ గుర్తుపెట్టు కోవడం మరీ కష్టం.  ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఆంద్ర ప్రదేశ్  రెండుగా మారిపోయింది.2-6- 2014 న  ప్రత్యేక ప్రభుత్వాలు ఎర్పడి నాయి. తెలంగాణా ముఖ్యమంత్రి గా కే . చెంద్రశేఖరరావుగారు, ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా నారా చెంద్రబాబునాయుడు గారికి బాగా కలసి వచ్చింది . కేంద్రంలో భారతీయ జనతాపార్టికి విజయడంకా మోగించింది." నరేంద్ర మొదీ" ప్రచారల వళ్ళ అధికారం చెజిక్కించుకున్నది అధికారంలో ఉన్న కాంగ్రేస్ చుక్కలు చూపించింది కోలుకోలేని విధముగా పార్టి వెనక పడింది.   

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చేసింది తక్కువ,  ప్రపంచ దేశాలలో మనదేశం  ప్రతిష్ట ను పెంచారు. చేసిన వాగ్దానాలు ఎమీ నెరవెర్చలేదు, స్వచ్చ బారత్ అని ప్ర\చారంగా ప్రజలలో నిలబడి పోయారు, కారణం (ప్రధానమంత్రి స్వయముగా చీపురు పట్టి వీధులను సుబ్రం చెయ్యడం ) పెట్రోల్ తగ్గింది, బంగారం తగ్గింది తప్ప ఇంతవరకు ఎమీచెయలేక పోయారు. నల్ల దానం బయటకు తెస్తామని అన్నారు ఇంకా ప్రచారంలా ఉన్నది, గ్రామా గ్రామాలలో  బాంక్ ఎకౌంట్ ఓపెన్ చేయాలని సంకల్పం విజయ మవు తున్నది
టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జాకు రెండు పర్యాయ్యాలుగా రెండు కోట్లు  ఇవ్వటం జరిగింది, రైతులకు రుణమాఫీ కొంతవరకు జరిగింది. ముఖ్య మంత్రి కలల ప్రపంచంలో హైదరాబాద్ నగరం ఇప్పుడు అగ్రభాగానా ఉంది టవర్లు, అకశహర్యాలు, బహులఫరుసల వంతెనలు, ఒకటేమిటి ఇంకాఎన్నొ ఉన్నాయ్ , కలను కార్యరూపములోకి మార్చి తే ప్రజలలో హీరోగా నిలబడతారు, లేకపోతె జీరోగా నిలబడతారు.  బడ్జెట్ మొత్తం అభివృద్ధి జరిగిన హైదరాబాదుకు మరలా అభివృద్ధి అని పెట్టటం ప్రజలలో కొంత అవిశ్వాసం ఏర్పడినది, తెలంగాణా అంటే కేవలము హైదరాబాదు మాత్రమె కాదు.  అభివృద్ధి చేయాలనేదే నా ఉద్దేశ్యము. మద్యాన్న భోజన  పధకాన్ని 1/1/2015 నుండి మనిషికి 6 కెజీలు బియ్యము ఇవ్వదలచినది, పట్టా కార్డులు రద్దు పరచి కోట కార్డులు ఇవ్వటం జరుగుతున్నది  

ఆంద్రప్రదేశ్  ముఖ్య మంత్రి  సమీక్షలు పేరున క్షనం తీరిక లేకుండా  రాజధాని అనేది లేకుండా ప్రజలకు చేసిన వాగ్దానాలలో  రైతుల రుణ మాఫి  తప్ప కాలక్షేపం చేసారని మాత్రమే తెలుస్తుంది .   ఆంద్రప్రదేశ్లో హుద్ హుద్ తుఫాన్ సందర్బముగా  ముందు జాగర్తలు తీసుకొవటం వల్ల ప్రాణనష్టం జరుగలేదు. జరిగిన నష్టాన్ని వేగంగా నగరాన్ని సుబ్ర పరుచుటకు సహకరించటం వళ్ళ మంచి పేరు వచ్చింది .  

ప్రభుత్వం వారు ప్రారిశ్రామిక వృద్ది మా లక్ష్యం, పరిశ్రమలకు సత్వర అను మతులు, ప్రపంచ స్తాయి  మొలిక వసతులు యువతకు ఉపాది కల్పన మా సంకల్పం అన్నరు కాని  గెలిచిన తర్వాత పాత  విధానాలను స్వస్తి పలికి  కొత్త విధానాలు అమలు చేస్తున్నారు, నిరుద్యోగులకు ఉద్యోగములు కల్పించాలని, ప్రజలకు మేలు చేయాలని తలంపు  ఏకోశాన కని పించుటలేదు. కాని నాయకులకు జీతాలు మాత్రమె పెంచుకున్నారు.

అందుకే తల్లి తండ్రులారా మాతృభాషలో విద్యను భోదిమ్చాలని ప్రభుత్వాన్ని అడగండి. ఎందుకంటే రేపు తెలుగు  భాషలో కంప్యూటర్ అభివృద్ధి చెందే  దిశలో నడుస్తుంది. ప్రభుత్వమువారు కూదా తెలుగు ఉత్తర ప్రచ్చుత్త రములు తెలుగులో నడిపితే పిల్లల తల్లితండ్రులు అందరు తెలుభాషలో చదివిన్చుటకు ముందుకు వస్తారు. ప్రభుత్వమువారె నిద్రపోతున్నారు మన రాష్ట్ర భాషను మరచి పోయే విధముగా ప్రవరిమ్చుతున్నారు,. తెలుగు భాషా సంఘాలు వారు నిద్ర పోతున్నారు దయ్యచేసి ఇప్పుడన్నా కళ్ళు తెరచి మనభాషను రక్షించండి అని నాయకులకు, మేధావులకు తెలుపుతున్నాను. 

  కోకిల మాతృ భాష  "కుహు కుహు"  సంగీత భాష !
లెగదూడ మాతృ భాష" అంబా " కేరింత అరుపు భాష !
కప్పు మాతృ భాష "బెక బెక" లాడు ముచ్చటిమ్చ్ భాష !
పిల్లల మాతృ భాష "అమ్మా అమ్మా" అని మరువలేని స్వర భాష !
మాతృ భాష మారేది లేదు, మరోభాష వచ్చేది లేదు !
మనుగడకు మాతృభాష, బ్రతుకు తెరువుకు మర భాష !
ఎన్నివేషాలు వేశిన, ఏ విద్య నేర్చు కున్న మారదు తల్లి భాష ! 







సూర్యుని ఒక్క  ధర్మం తాపం, జలము ఒక్క ధర్మం రసం !
అగ్ని ఒక్క ధర్మం దహనం, జీవుని ఒక్క దర్మం ఆత్మజ్ఞానం !
కుటుంబములో  సత్యం,న్యాయం, ధర్మం, మార్గమే సంసారం !
మతములో ఉన్న సమస్త ధర్మాలకు అందరం భద్దులం !
ఎక్కడ ధర్మం ఉంటుందో, అక్కడ తేజస్సు విస్తారం !
ఎక్కడ  తేజస్సు విస్తారంగా ఉంటుందో, అక్కడ భక్తి మయం !
ఎక్కడ భక్తి ఉంటుందో,  అక్కడ లక్ష్మి దేవి స్థిరనివాసం !
ఎక్కడ సత్సాంగత్యమ్ ఉంటుందో, అక్కడ ఉత్తమ గుణం !
ఎక్కడ ఉత్తమ గుణం ఉంటుందో అక్కడ భగవంతుని సాక్షాత్కారం !
ఎక్కడ భగవంతుని సాక్షాత్కారం ఉంటుందో, అక్కడ బ్రహ్మా జ్ఞానం !
ఎక్కడ బ్రహ్మా జ్ఞానం పంచ బడుతుందో, అక్కడ నిత్య కళ్యాణం !
ఎక్కడ నిత్య కళ్యాణం  ఉంటుందో,  అక్కడ పత్స తోరణం !
                                    by by 2014 - welcome 2015
 The above story are you like, please omit any mystics, and you prepare development of family and state, my opinion is your memory is peaceful. please share and write comments.
once again Than "Q" for all of you.   



27, డిసెంబర్ 2014, శనివారం

202.Family comedy story (Amma Andariki Amme)

ఓం  శ్రీ రాం          ఓం శ్రీ రాం          ఓం శ్రీ రాం
                                                                                 
అమ్మ అందరికి అమ్మే
అప్పుడే గుమ్మంలో అడుగు పెట్టాడు రామకృష్ణ, నెమ్మదిగా భార్య శ్రీదేవికి చేతిలో, ఉన్న బ్యాగును, అందిస్తూ జానకమ్మ గారు టిఫిన్  తిన్నారా అని అడిగాడు, ఆ తిన్నది అంటూ చెట్టంత పెళ్ళాన్ని తిన్నావా అని  అడగ కుండా ఆమె తిన్నదా అని అడిగే మొగుడ్ని నేనే చూస్తున్నాను, అంటూ గొనుక్కుంటున్న భార్య తో నీ గొణుగుడు  అవతలపెట్టు, నేను అడిగిన దానికి సమాధానము ఇవతల పెట్టు   అన్న మాటలకు  ఆ కుర్చీలొ దర్జాగా కూర్చొని జపమాల తిప్పుకుంటూ  "శివ నామం " చెస్తున్నది, .అన్నది గట్టిగా .

సరే,  సరే,  నేను కాళ్ళు కడుక్కొని వస్తాను, నాకు టిఫిన్ పెట్టు, ఇప్పుడే వస్తాను.

బాత్ రూం నుండి లోపలకు అడుగుపెడుతున్న రామకృష్ణ మోకాళ్ళు వంక చూస్తు, "జానకమ్మగారు  " మడమ తడవ కుండా కాళ్ళు కడుక్కోవటం మంచిది కాదు,  మన పురాణాలలో నలమహరాజుకు కాళ్ళు కడుక్కోనేటప్పుడు తొందరపాటుగా మడమ తడవకుండా కడుక్కోవడంవల్ల "శని" ప్రవేసించి సర్వం హరించాడు, ఏదో తొందర పడి వచ్చాను మరలా కడుక్కొని వస్తాను, అని లోపలకు వెళ్లి, కడుక్కొని వచ్చాడు రామకృష్ణ. జానకమ్మ రుద్రాక్షమాల త్రిప్పుతూ " నమ: శివాయ "  అంటూ వరండాలోకి  వెళ్ళింది. 

అవునండి ఆ జానకమ్మగారు మిమ్మల్ని  గట్టిగా అంటుంటే  నాకు ఎదోలాగున్నది, అంత  పెద్దావిడ చేత మీరు మాట పడటం సబబుగా  ఉన్నదా,తప్పేమన్నది,  మంచి చెప్పింది, చేయమన్నది అది తప్పేట్లావుతుంది,  పెద్దవాళ్ళు చెప్పే మాటలు మంచి మాటలు, వాళ్ళ అనుభవాలు పిల్లలకు చెపుతారు, మనం మూర్ఖులుగా ప్రవర్తిమ్చాకుండా  గౌర వించి, ఆచరించి,  ఆదుకోవాలి, అదే మన ఇద్దరి కర్తవ్యం కూడ, అమ్మ ఎమన్నా,  తప్పుచేసిన,  ఓపికతో ఉండు,  పొరపాటున నోరు జారకు, అని పలుకుతు, టిఫిన్ తిని చేతులు కడుకున్నాడు. అయ్యో రామ ఆమెను నేను ఒక్క మాటను కూడా అనను, ఆమెను మా అమ్మతో సమానముగా చూసు కుంటున్నాను. మీకు నిజం చెబుతున్నాను, మీ మీద ఒట్టు అన్నది శ్రీమతి.       
  
జానకమ్మ గారికి కోడుకులున్నప్పుడు, మన దగ్గర ఉంచుకొని "పోషణ భాద్యతలు " స్వీకరించటం సబబా అని అడు గుదామనుకుంటున్నాను, అమ్మ  పరిస్తితులు అంతంత మాత్రమె, ఏదన్న రోగం వస్తే ఎవరు భాద్యులు. మీరు నేనే కదా ఒక్క సారి ఆలోచించండి, జానకమ్మను బయటకు పంపమని చెప్పను,  బొందిలో ప్రాణం ఉన్నంతవరకు నేను ఆమెకు సేవలు చేస్తాను, అత్తగారిగా భావించి సేవలు చేస్తాను అన్నది శ్రీమతి శ్రీదేవి 

నీవు ఒక అత్తగారిగా, ఒక తల్లిగా గౌరవించటం మాత్రం మరువకు, ఆమ్మ  కధ నీకు చెప్పక పోవటం నాదే తప్పు, నీవు అడిగావు కాబట్టి అని నేను చెప్పుటలేదు, చెప్పుట నా భాద్యత. 

మాది చాలా బీద కుటుంబము, మానాన్న గారు వీధి వీధి తిరిగి, చిలకద్వారా ప్రశ్నలు చెప్పించి ఆ వచ్చే పైకముతో నన్ను, నా చెల్లిని చదివించారు. మా నాన్న గారి స్నేహితుడు  కైలాసం గారు ఈ జానకమ్మ గారి భర్త, ఎంత మంచివాడో అంత  త్రాగు బోతు. నేను డిగ్రి చదువుకొనుటకు నగరానికి రావలసి వచ్చింది, నేను వారి ఇంట ఉన్న పంచ గదిలో ఉండి  చదువుకొని ఇంతవాడి నయ్యాను. వెళ ప్రకారము వాళ్ళ ఇద్దరు పిల్లలతో సమానముగా నన్ను కుడా చూస్తు ఉండేది, భోజనము, టిఫిన్ పెట్టేది. ఎందుకండీ మీరు శ్రమ పడుతున్నారు అన్న వినిపించుకోదు, ఎప్పుడు అనేది కష్ట పడి  చదువు తున్నావు, నీకునేను చేసే సహాయము ఎమీ  లేదు, నాకోడుకులతో పాటు, నీకు అన్నం పెడుతున్నాను, ఆశ్రయం కల్పించాను అంతే కదా అనేది. 

అప్పుడు నాకు అనిపించింది, ఆమె ఓపికతో గుంటను త్రవ్వి, అందులో రెండు చేతులతో మొక్కను నాటి నీరు పోసి రోజు చుట్టూ ప్రక్కల సుబ్రం చెస్తూ ఉండేది. 
                                                                             


ఆ మొక్కను ఏవిధముగా పెంచేదో,  ఆవిధముగా నాకు కష్టమనేది  తెలియకుండా,  అమ్మ  ఇంటిలో చదువును   పూర్తి చేసాను, నాగార్జున యూనివర్సిటి మాధమెటిక్సు గ్రూపులొ మంచి మార్కులు సమ్పాఇంచాను.. 

ఉద్యోగము కొరకు వీధి వీధి తిరిగాను,  కాల చక్రము తిరిగింది తప్ప,  .ఆ కాలములో నేను ఎదన్న చిన్న ఉద్యోగము  చేస్తానన్న వప్పుకోనేది కాదు, ఒకటే మాట అనేది శక్తి వంచన లేకుండా కష్టపడి పోటి పరిక్షలకు చదువు, ఇంటర్వు ఖర్చులు, అప్లికేషన్ ఖర్చులు మొహమాటము లేకుండా అడుగు అన్ని నేను సర్దుతాను అని నన్ను కదలనిచ్చేది కాదు, చిన్న పనులు (పాలు తేవటం, కూరలు తేవటం అన్న వప్పుకోనేది కాదు) ఈ అమ్మ. నాకు రెండు సంవస్చరాలకు గవర్నమెంట్ కలెజీలొ  లెక్చరర్  ఉద్యోగము వచ్చింది

మరి మీ నాన్న గారు ఏమి పైకము పంపలేదా, మీ కుటుంబ  విషయాలు ఎమీ చెప్పలేదు.  అంత తొందరెందుకు నీకు నిద్ర వస్తే నిద్ర పో రేపు మిగతా కధ రేపు చెపుతానులే అన్న మాటలకు లేదండి కధ ఇంట్రష్టుగా ఉన్నది చెప్పండి.

అమ్మ నిద్ర పోయిందో లేదో ఒక్క సారి చూసి  వస్తాను, ఎందుకండీ అంత  భాధ  పడతారు, అమ్మ చేసిన సహాయమును గుర్తు కొస్తే నాకు ఏడు పొ స్తుంది, ఆ కన్నీరు  తుడుచు కొండి, చిన్న పిల్ల వాడిలా, అమ్మకు నేను చిన్న పిల్ల వాడినే కదే, పదండి నేను వస్తాను అని ఇద్దరు అమ్మ గదిలోకి వెళ్ళారు, నిద్ర పోతున్న తల్లికి ప్రక్కన ఉన్న దుప్పటి కప్పి, పాదాలకు నమస్కరించి వేనక్కు  తిరిగారు. ఇంతకీ మన ముగ్గురమ్మాయిలు నిద్ర పోయారా అని అడిగాడు భార్యను. 

లేదండి వారు ఆ గదిలో చదువు కుంటున్నారు, మనం పదండి అన్న మాటలకు కదిలారు బెడ్ రూం లోకి. 

నాకు ఉద్యోగము రాని కాలములో, మా ఇంటి పరిస్తితి తలక్రిందలు అయింది, మా నాన్న గారు, అమ్మ గారు వాకింగ్ చేస్తున్నప్పుడు వెనుకనుండి వేగముగా ఒక లారి అదుపు తప్పి మా తల్లితండ్రుల ప్రాణాలను హరించి వేసింది. నేను నా చెల్లి భాదతో ఎదుస్తున్నాప్పుడు ఏం చేయాలో  తోచనప్పుడు, తల్లి తండ్రుల శవాలను చూస్తు భాదపడు తున్నప్పుడు, ఈ అమ్మ దగ్గరకు తీసుకొని, నాకు, నా చెల్లికి ధైర్యము చెప్పి, దహన కార్యక్రమాలు, పిండ ప్రదానాలు దగ్గరుండి చేయించిన మహా తల్లి ఈమె. 

నా చెల్లికి చదువుకొన్న వాడిని, మంచి ఉద్యోగస్తుడిని చూసి పెళ్ళిచేసి కాపురానికి [పంపించింది. ఖర్చులన్నీ అమ్మే పెట్టుకున్నది.

అమ్మ త్రాగుబోతు భర్త తో సంసారము చేస్తూ, కష్టాలు, భాదలు, భరిస్తూ, మరోవైపు టిచరుగా చెస్తూ,  తన ఇద్దరి పిల్లలకు చదువు   చెప్పించింది.  పెద్ద కొడుకు ను ఇంజనీర్ను చేసింది, చిన్న కొడుకుని డాక్టర్ను చేసింది. పిల్లలు వృద్ధిలోకి వచ్చారుకడా ఆదుకుంటారని ఆశించింది పిచ్చి తల్లి.  పై చదువులు చదివేందుకు అమెరికాకు వెళ్ళారు ఉన్న  ఆస్తి అంతా చదువుల క్రింద ఖర్చుఅయి పోయింది.  

అమెరికాలోనే మన భారతదేశానికి చెందిన ఇంజనీర్ని ఇంజనీర్ , డాక్టర్ని డాక్టర్  పెళ్లి  చేసు కున్నారు. తండ్రి   త్రాగుబోతు అని చెప్పు కోవటం వారికి నామర్దా అయింది, తండ్రి టాక్సీ నడిపి మనల్ని     చది విన్చాడని ఇంకితజ్ఞానం కూడా వాళ్లకు లేదు. 

ఒక సారి కొడుకులకు నా  చేత ఉత్తరం వ్రాయించింది, నాన్న గారి పరిస్తితి బాగోలేదు, మీరు వెంటనే వచ్చి చూసి పోగలరు. 

దానికి సమాధానముగా తమ్ముడు కాని తమ్ముడుకు మన ఆస్తినంత ఖర్చు పెట్టావు, ఇప్పుడు మాకు మిగల్చకుండా చేసావు, అక్కడ ఏముందని మేము రావాలి, నాన్న ఆరోగ్యమును  తమ్ముడు నీవు  ఎలాగో చూస్తున్నారు, నేను నా భార్య పనిచేస్తే గాని ఇక్కడ సరి పోవుటలేదు, నాన్నకు మంచి మందులు వాడమని తమ్ముడు కాని తమ్ముడుకు చెప్పు, మేము త్వరలో  అక్కడకు రాగలము అని మాత్రమె ఉత్తరం వ్రాసారు. 

నాకు అమ్మ మనస్తత్వం తెలుసు గనక, నాన్నకు మంచి మందు ఇప్పించి, ఇక్కడకు, అమ్మ నాన్నను తెచ్చాను, తర్వాత మన పెళ్లి అయింది, తర్వాత విషయాలు అన్ని నీకు తెలుసు కదా అన్నాడు రామ కృష్ణ.   

ఏమండి నేను అడిగానని అనుకోవద్దు, ఇంత పెద్ద బొట్టు   పెట్టుకొని   తిరుగుతుంది,  ఇంతవరకు కనిపించలేదు, భర్త  అసలు ఉన్నారా, పోయాడా ? కలియుగం కదా బొట్టు పెట్టుకొని తిరుగుతున్నడను కున్నాను అన్నది. 

తొందర పాటుతో ఒక మనిషిని అనకూడదని నీకు ఎన్నో సార్లు చెప్పను అయన నీవు అడుగుతున్నావు, భర్త ఉన్నాడు అయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు . 
అదేగా నేను అడిగింది అంతకన్నా ఎమన్నా తప్పు మాట్లాడినా, తప్పు  మాట్లాడితే క్షమించండి అన్నది భార్య శ్రీదేవి. 

నీకోసారి గుర్తుందా  నేను క్యాంపుకు  పోయాను, పరీక్ష  పాపర్లు దిద్దటాని వెళ్ళినప్పుడు నాకు ఫోన్ వచ్చింది, ఆ గుర్తుకొచ్చింది, మీరు హడావిడిగా వెళ్లి పోయారు నాకు అదే గుర్తు. అమ్మ  పుణ్య కేత్రాలకు కదా పోయింది,  అప్పుడు అమ్మే మాత్రమె తిరిగి  వచ్చింది.   నీకు అంత  వరకే తెలసు. అదేకదా నేనన్నది. 

అప్పుడేమి జరిగిందో చెపుతా విను అన్నాడు రామ కృష్ణ 
నాన్న ఆరోగ్యము బాగుండకపోతే నీకు చెప్పకుండా ఆసుపత్రిలో చేర్పించాము, నాన్నకు త్రాగటం వాళ్ళ లివర్, కిడ్ని చెడిపోయినాయి   చేయుట లేదు అని డాక్టర్లు చెప్పారు, అమ్మ ఒకటే కన్నీరు పెట్టు కుంటూ నా దగ్గరకు వచ్చింది  

 నీవె నాకోడుకువి, మీనాన్నను రక్షించు కోవాలి, ఇదిగో ఈ నగలు అమ్మి డబ్బు తెచ్చి ఆసు పత్రిలో డబ్బు కట్టు అన్నది .  అమ్మ నేను డబ్బు కడతాను నా దగ్గరున్నవి,  నీవెందుకు  భాద పడతావు అన్నాను. ఈ నగలన్నీ నా పుట్టింటివారు పెట్టినవి, కొన్ని మీ నాన్న కొన్నవి, ఏనాడు త్రాగటానికి నా నగలు తాకట్టు పెట్టని మహానుభావుడు  మీనాన్న, నాకు వళ్ళంత నెప్పులు ఉన్నాయి,   దానిని తగ్గించుకొనుటకు తాగుడు అలవాటు అయింది దానిని మానుకోలేక పోతున్నాను నీకు అన్యాయం చేస్తున్నానా అనేవాడు.

ఆ  మాటలకు నాకు కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగాయి, ముందు అన్నయ్యలకు చెప్పుదాం  అన్నాను, మీ అన్నయ్య ల విషయం నీకన్నా నాకే బాగా తెలుసు, కొత్తగా పెళ్లి చేసుకున్నారు వారిని భాద పెట్టుట  ఎందుకు అన్నది.
 ఆయినప్పటికీ అమ్మకు తెలియకుండా నేనే అన్నలకు కబురు పంపినాను, నాన్న పరిస్తితి వివివరించాను. 
ఆ అప్పుడు కొడుకులు వచ్చారా అని అడిగింది   శ్రీమతి శ్రీదేవి

అమ్మను నాన్నను జాగర్తగా చూసుకొ, మేము కొంత పైకము పంపగలము, ఇప్పుడు మేము వచ్చే విధముగా లేదు వీసా కూడా దొరక లేదు , ఇక్కడ మాకే కష్టం గా ఉన్నది, మాకే నాన్న కాదు నీవుకూడా మానస పుత్రుడువు కదా అన్న మాటలకూ ఫోన్ కట్ చేశాను. 

మొత్తం ఖర్చులు నేనే పెట్టుటకు   సిద్ద పడ్డాను, అమ్మ మాత్రము వప్పుకోలేదు, నగలు అమ్మి ఆ డబ్బును ఆసుపత్రిలో   డబ్బుకట్టమన్నది  కట్టాను, నాన్నకు ఆపరేషన్ చేసారు, కాని బలంగా బయటకు తిరుగుటకు చాలా కష్టం కలిగింది, అమ్మే దగ్గరుండి అన్ని  చేసింది, వేలకు తిండి, బట్ట కట్టు కొనుటకు, అమ్మే సహకరించింది. డాక్టర్  లేని సమయాన, నాన్న భాదను తట్టుకోలేక, ఎవ్వరుకు చెప్పకుండా రాత్రికి రాత్రి  ఎటో వెళ్లి పోయారు, ఎంత వెతికినా కనిపించలేదు. 
మరి మీ అమ్మ ఉన్నదికదా చూడ  లేదా 
తెల్లవారుజామున నిద్ర పట్టుట వల్ల గమనించ లేక పోయింది. 

ఈవిషయము కొడుకులకు కబురు పంపమన్నది అమ్మ 

కొడుకులు ఏమన్నారు

నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాము మేము బయలుదేరి వద్దామని చెప్పారు, రమ్మనమని చెప్పాను 
వారేమన్నారు  అడిగింది శ్రీమతి 
ఏముంది అమ్మను నీదగ్గరె ఉంచుకో, నాన్న దొరికేదాకా వెతుకు అన్నారు, మేము ఇండియా కు వచ్చినతర్వాత నిన్ను కలుస్తాము అన్నారు 
ఆ ఆమాటలు అమ్మతో చెప్పాను లోకం తీరు బాబు, ఇది ఎవరిని తప్పు పట్టే విషయం కాదు, ఋణం తీర్చుకొని కొందరు దూరమవుతారు, దూరముగా ఉండి  ఋణం తీర్చుకొలదని భాదపడుతారు. 
నేనోకటే నీకు అక్షర సత్యం చెప్పాలను కుంటున్నాను అన్నది 
ఆ ఏమి చెప్పింది మీ అమ్మగారు 
ఒక కవిత ఇలా చెప్పింది 

అక్షరాలు  నేర్చుకో       -  అదృష్టాన్ని  నమ్మకు 
ఆలోచించు                   -  ఆవేశపడకు 
ఇవ్వడం అలవర్చుకో    -  ఇచ్చింది పెట్టకు 
ఈ తరం నీదె                  -  ఈర్ష్యను త్వజించు 
ఉన్నతంగా జీవించు      -  ఉనికిని కోల్పోకు 
ఊహించు                      -  ఊసరవెల్లివి కాకు 
ఋషివికా                      -  ఋగ్మతలను జయించు    
ఎదుగు                          -  ఎవ్వరిని  వంచిమ్చకు 
ఏదోఒక లక్షం పెట్టుకో     -  ఎడుస్తూ కూర్చోకు 
ఐకమత్యంగా ఉండు       -   లొంగకు 
ఒద్దికగా ఉండు               -  ఒకరితో పోల్చుకోకు
ఓర్పును పాటించు         -  ఓటమికి చింతించకు 
ఔపోసన పట్టు                -  ఔనత్యాన్ని వీడకు
అందరితోకలువు            -  అంధకారాన్ని వీడు 
అ:హర్నిశం శ్రమించు      -  అ:న్ని జయించు
   
అవునండి మీరు ఎట్లా చెపితే, అట్లా,  నా ప్రవర్తణను మార్చుకుంటాను, నాకు మీరు అత్తయగారు రెండు కళ్ళు. 
మరి పిల్లలు మూడో  కన్నుగా మీరున్నరుగా అన్నమాటలకు నవ్వుకున్నారు ఇద్దరు. 
బాబు అంటూ పిలుస్తున్నది జానకమ్మ, అత్తయ్య  నేనోస్తున్నాను, మీకు ఏపని చేయమన్న నేనుచేసి పెడతాను. 
ఎమీ లేదు అంటూ వేనకు వెల్ల బోయింది. 
ఎందుకమ్మ భాధపడతావు వేరాకరికి చెప్పుకుంటే మనస్సు ప్రశాంతముగా ఉంటుందని నేవే చెప్పావుగా
అవును చెప్పాను, ఈరోజుకు నాన్నగారు వెళ్లి పోయి సంవస్చరము అయింది, శివాలయములొ అభిషేకము చేయించి అన్నదానము చేయి ద్దామని  అనుకుంటున్నాను, ఎం బాబు నీకు ఇష్టమేనా
ఇదుగోనమ్మ నేను ముందే కన్టేశ్వరాలయము పైకము కట్టా , నీకు చెపుదామనుకున్నా చెప్పలేక పోయాను అంతే, అందరం గుడికి వెళ్లి తీర్ధ ప్రసాదాలు తీసుకున్దాము  
మరి నా మనవరాల్లను పిలువు గుడికి వస్తారోలేదో, కలియుగం కదా 
అందరు శివదర్సనం చేసుకున్నారు, అక్కడే అమ్మ మాత్రము రుద్రాక్షమాలతో నమ:శివాయ అంటూ జపం చేస్తూ కూర్చున్నది.  
      
ఈ కధ  నచ్చితే షేర్ చేయగలరు, ఎమన్నా కాకామెంట్సు  వ్రాయగలరు



    

  
  .        . 
.  

20, డిసెంబర్ 2014, శనివారం

201.Daily spl. kavitalu - (చిరు దివ్వె వెలుగులు -4)

.......  ఓం శ్రీ రాం      .....  ఓం శ్రీ  రాం      .....  ఓం శ్రీ రాం
                                                   
                                                         

నా మనసుకు తోచినవి, ఫోటోలను బట్టి ఒక నెలలో (11- 12-2014 to 31-12-2014) వ్రాసిన అంత్యాను ప్రాస కవితలు

                                                                            
1. పరిమళం
స్పర్శవేది తాకగానే   అవుతుంది ఇనుము బంగారం
గంగనీరు తాకగానే   అవుతాయి మురికినీరు పవిత్రం
బుద్ధికినిజం తెలియగానే ఉంటుంది మనస్సు నిర్మలం
మాయకు చిక్కి మనస్సు ఉంటుంది ప్రార్ధనతో పరిమళం  


2. ఔదార్యం
జిహ్వకు మాత్రమె తెలుసు తేనే మాధుర్యం
పతికి  మాత్రమె  తెలుసు  సతి   సౌందర్యం
శివునికి మాత్రమే తెలుసు పార్వతి ఔదార్యం
మనిషికి మాత్రమె తెలుసు మనసు జాడ్యం

చాతక   పక్షి   నోటిలో మేఘడు   జలాలు   కురిపించే
భూదేవి పరిధిలో మేఘుడు వర్షపు జల్లులు కురిపించే
ధర్మాత్ముడు  ధర్మ పరులపై  దయా  వర్షం  కురిపించే  
మనుష్యులు వత్తిడికి అభాద్ధాలు వర్షం ప్రజలపై కురిపించే   


3. కన్నెవయస్సు
కన్నెవయస్సుకు సొగసు తగ్గడంఉండదు
కల్లల్లో  ఉండే  కాంక్షలు    తగ్గడంఉండదు
కళలు పండించుకోవటానికి తీరక ఉండదు
కడలిఅలలకు నదులు చేరిన అలుపె ఉండదు

నీలొ తప్పున్నప్పుడు సుఖ మనేది ఉండదు
నీతి లేనపుడు గెలుపనేది ఎప్పుడు ఉండదు
నీది కానిదానిపై ఎప్పుడు మనస్సు  ఉండదు
నీ తల రాతకు  ఎప్పుడు   మార్పు   ఉండదు

స్త్రీ  వలపులకు   దాహం  తీరదు
తండ్రి మాటల్లో  తప్పు  కనబడదు          
తల్లి ప్రేమను గుర్తించటం జరుగదు
కవి తలపులకు మరుపు ఉండదు   


3. బాల్యం
ప్రాణానానికి  ప్రాణం పసి ప్రాణం
ప్రేమకు ప్రేమ పసి హృదయం
స్నేహానికి   స్నేహం  బాల్యం
ప్రేమను మరువలేము మనం    


4. తలచు
పిల్లను చూసి తన్ను తాను మరచు
ముద్దు  లలో మనసు   మై మరచు
కన్న బిడ్డ ముందు అందర్నీమరచు
తల్లి ప్రేమ ఆ బ్రహ్మ కూడా    తలచు   


5. సామెతల
సామెతల సామ్రాట్ కు ధన్యవాదాలు
తెలుగు భాషాభి వృద్ధికి నీరాజనాలు
మీ పట్టుదల,కృషి మాకు దీవెవెనలు
మనసుకు సంతోషం కలిగించేసామెతల


6. పునాది
దేనికైనఎప్పుడు ఉండాలిపునాది
ఓటమి ఒక  గెలుపుకు పునాది
అనుభవం   పురోగతికి పునాది 
స్తిర నిర్ణ  యానికి  ఒక పునాది
  17-12-2014
ముష్కర ఘాతకులు పెషావర్లో మారణ హోమం
బడి పిల్లల పై బన్దూకులు  కాల్పుల  విజుమ్భనం
132మంది విద్యార్ధులు,9మంది సిబ్బంది మరణం
ఖండించిన ఇండియా మరియు అన్తర్జాతీయ సమాజం    
 

7 మార్గం
నే నొక  పౌరున్ని  నాకు సమాజమే దేవాలయం
నేనొక వర్గాన్ని కాదు నేను  బతికిస్తా మానవత్వం
నేనొక ప్రపంచాన్ని హితాన్నిభోదిమ్చటమే కర్తవ్యం
నేనొక దూతను, ఎప్పుడు ధర్మామార్గమే నా మార్గం   


8. అమ్మ
అమ్మ  ప్రేమ  అనంతం, అద్భుతం
అమ్మను తలుస్తే  మనస్సు ప్రశాంతం
అమ్మ ఆత్రుతే నా  హృదయ స్పదనం
అమ్మను మరువలేము ఎప్పుడు మనం  


9. సొంతం
కళ్ళు చూస్తె కలవర  పెట్టి కన్ను  గీటె
వళ్ళు చూస్తె వయ్యరంతో వలపు చాటె  
ఏళ్ళు చూస్తె సలపరింతలు  మరిగినటె
చేళ్ళు చూస్తె ఇక నీ  సొంతం ఆయినటె 


10. పాట
తెలుగు పాటల మాధుర్యం ఖండాన్తరములు తాకింది
బాలికలు మాదుర్యముతో పాడి తెలుగు విస్తరించింది
జ్ఞాపకాల మాధుర్యాన్ని అక్కడ పరవసిమ్ప  చేసింది
సంగీత మాదుర్యముతో మంత్రం ముగ్ధులను  చేసింది  


11. మనమే
మనకు  ఎవ్వరు రారు పోటి మనకు మనమే
మనం నలుగురం కాదు మనసుతో ఒక్కరమే
మనలో ఉండాలి ప్రక్రుతి పరవ శించే ప్రేమయే
బాల్య ప్రశాంత జీవనమ్ మరచి  పోనీ వారమే 


12. మారదు
నాఅడుగు ముందుకి వేస్తే నా  గమ్యం మారదు
అడుగు ముందు వేసి ధర్మంభోధించిన మారదు
నా పట్టుదల, కృషి, నిగ్రహశక్తి ఎప్పటికి మారదు
పొగ త్రాగటం మానేదాక   నా ప్రయాణం మారదు   

  
13. మార్పు ఎక్కడ
దుష్టుల హస్తాలలో నలిగి కనుమరుగవుతున్న బాల్యం
               సిరికోసం అమాయక బాలికలను అమ్ముడవుతున్న వైనం           
రాక్షస బల్లుల చేతికిచిక్కి విలవిల లాడిన యవ్వనం
అమ్మతనం మరచి స్త్రీలు అమ్మ బడుతున్న ఆడమాంసం

ఆటవిక క్రీడలకు తలవంచుతున్న సమాజం 
కడలి తరంగంలా స్త్రీలపై పడుతున్న మృగాల మయం
బ్రతికిఉన్న చావుకోసం బ్రతుకుతున్న స్త్రీ యవ్వనం 
ప్రతిఒక్కరిలొ ఉండాలి స్త్రీ జాతి రక్షణ కర్తవ్యం

14. ప్రకాశాన్ని
  ఎ  ప్రకాశాన్ని  ఎ  చీకట్లు అడ్డుకో   గలవు
ఎ ప్రయాణాన్నిఎ దు:ఖాలు అడ్డుకో గలవు 
ఎ ఆవేశాన్ని   ఎ  ప్రేమలు అడ్డుకో   గలవు
ఎ ఆలోచనల్ని ఎ బ్రమలు తొలగించగలవు 


15. సౌందర్యం
ఎ సౌందర్యం ఎ మనిషికి  సొంత   మవుతున్న దో ?
ఎ సౌందర్యం ఎ మనిషిని పిచ్చి వాడిని  చేస్తున్న దో ?
ఎ సౌందర్యం ఎ మనిషి మరణానికి కారణమవుతుందో ?
ఎ సౌందర్యం ఎన్ని కుటుంబాలను  నాశనం చేసిందో ?    





 
16 . నిర్మలుడవు నీవె 
ప్రవర్తన గురించి చాల చక్కగా విశదపరిచారు, మాకు తెలియా పరిచిన వారికి ధన్యవాదములు  నాకు తోచిన ఒక కవితను ఇందు పొందు పరుచు చున్నాను మీరు పంపిన దాని అనుకరించి
ప్రవర్తన నిర్మలంగా ఉండాలంటే
 

కాల నియమాది సంగుడవై
తత్వమును తెలిసిన వాడవై
తామసం తగ్గించుకొన్న వాడవై
నిద్రమత్తును వదిలించుకొన్న వాడవై

మనసు ఆనంద పరుచుకున్న వాడవై
విశాల హృదయం కల్పించుకున్న వాడవై
ధైర్యముతొ భయమును తరిమిన వాడవై
తెజరిల్లితే జీవితములొ నిర్మలుడవు నీవె   


17. యోగి
నవ  శిసువు  నోరు  లేని  యోగి
నవ  వధువు నోరు   లేని    భోగి
నవ జనులను మోస్తున్నది  బోగి
నవ విధాల విద్యు త్తుతో ఉన్నరాగి 

నవ  సంగీతం వినలేని సోది
నవ రోగాలతో జీవించలేని రోగి
నవ ఆశలతొ సుఖపెట్టలేని భోగి
నవ ప్రార్ధనలతో జీవిస్తున్న యోగి       


18. ప్రవర్తన
ఎన్ని సత్కారాలు, భాహుమతులు పొందినా 
ఎన్ని ఆరాధనలు ఆచరించినా 
ధార్మిక వస్త్రధారణ ధరించినా 
ప్రవర్తన బాగుంటేనే మనిషికి విలువ 

వాక్కు మంచిగా లేక పోయినా
సాటి వారి పట్ల సానుభూతిలేక పోయినా
    సమాజం పట్ల అవగాహన లేక పోయినా
ప్రవర్తన సరిగా లేక పోయినా 
మనిషిగా ఉన్నా లేనట్టే 

19. వేశ్య 
ఎవరేమనిన తనని కాదని నవ్వుచుండు 
సిరికోసం తనదికాదని తనువు అర్పిమ్చుచుండు 
బ్రతుకుతెరువుకోసం సిగ్గును పందెంలో పెట్టుచుడు 
మగవాడికి క్షణ సుఖం ఇచ్చి, క్షణం కష్టం పడి నవ్వుచుండు

20. బ్లాక్ డె
బ్లాక్ డె అనేది ఎదీ ఉండదు, సుఖాన్ని ఇచ్చే చీకటి ఉంటుంది
మనసులో చీకటి ఉంటుంది, ఇకవెలుగు కోసం పరిగెడుతుంది   
కష్టాల్లోకళ్ళకు చీకటి కమ్ముకున్నా, ధైర్యమనే వేలుగుంటుంది
ప్రభుత్వము నిరుద్యోగులకు ఉద్యోగములు కల్పించలేక నిద్ర పోతుంది 


21. కష్ట పడే
కష్ట పడే వాడు కడుపు  నిండా తినలేడు
సుఖపడే వాడు కడుపునిండా నిద్రపోలేడు
100 కెజీలు దాణ్యం మోసేవాడు కొనలేడు     
కొన్నవాడు దాన్యాన్ని మోయ లేడు
దేవునికి వెతరేకమగా ఏమనిషి ఎమీ చేయలేడు  

22సుఖం
ఎ సుఖం అమలినంగా ఉండదు
ఎ క్షణం   స్వచ్చంగా    ఉండదు
ఎ లాభం  స్పష్టంగా      ఉండదు
ఎ నష్టం    భయంగా    ఉండదు

ఎ సందేహం  నిజంగా   ఉండదు
ఎ ఉపదేశం ఆచరణంగా ఉండదు
ఎ వ్యవహారం సమంజసంగా ఉండదు
ఎ సమయం సద్వినియోగం ఉండదు
 అందుకే
మనసు తెలుసు కున్నవాడు మర్మజ్ఞుడు
తనను తెలుసు కున్నవాడు   తత్వజ్ఞుడు
ప్రేమను తెలుసు కున్నవాడు  ప్రేమికుడు
దైవాన్ని తెలుసుకున్నవాడు    దైవజ్ఞుడు 



www.ramakrishnamallapragada.com

24ఇది ఒక సౌందర్య లహరి
మేఘాలు నింగిలో గాలికి  కదులు తున్నాయి
మనసులోని ఊహలు ఆనందలో  మునిగాయి
ప్రకృతి ద్రుస్యాలు మనస్సుకు శాంతికలిగించాయి
ప్రేమలో ఉరకలు వేస్తున్న ప్రేమికులాగున్నాయి

నింగిలో మేఘ ఘర్జనలు అద్భుతముగా ఉన్నాయి
జాలువారు జలపుస్పాలు మరీ అందంగా ఉన్నాయి
నింగినేల కలసి అద్భుతముగా కనబడుతున్నాయి         
ప్రకృతినిచిత్రంగా తీసినవారి కృషి అనుభవాలయ్యాయి 


25. బరువు
మనిషిని ప్రేమ ప్రేమగా గుర్తింపు తెచ్చుకోవటం పెద్ద బరువు 
మనిషి  సమస్త  ఆలోచనలతో   మెదడు  వేడెక్కి  బరువు
గడ్డి పరాకే కదా అనకు ఇరువురి మద్య ఉండే పెద్ద బరువు
మనిషి చేసిన లారియంత్రం గడ్డి మోపుకు మించిన బరువు 
కళల పరిపక్వతకు  కొత్త ప్రభుత్వాలు
కలల సాఫల్యంకు కొత్త సంవస్చరాలు
సంతోషముతో ఉండాలి తల్లి తండ్రులు
ఆకలి దప్పులు తీర్చె కొత్త సంవస్చరం వస్తుంది
ప్రతి ఒక్కరికి నూతన సంవస్చర శుభాకాంక్షలు    
Good by 2014, happy new year 2015      

18, డిసెంబర్ 2014, గురువారం

200 family story / (ప్రేమ ఎవరిపై ఉండాలి)

Om Sri ram                          Om Sri ram                              Om Sri ram                                                  
    అన్నయ్యగారు మిమ్మల్ని ఎప్పడి నుంచో  అడుగుదామను కున్నాను, మీకు ఎంత మంది పిల్లలు, వారి చదువులు, వివాహములు, విషయాలు మాకు  అబ్యంతరము లేకపోతె చెప్పగలరు అని అడిగింది ప్రకాశరావు భార్య సుభద్రగారు.
దీనిలొ అబ్యంతరము ఏముంది నాకు ముగ్గురు పుత్రికలు వారికి  పెట్టుకున్నాను మొదటి  వారి పేరు  "సమీర " ఈ పేరు పెట్టుటకు కారణం మాతాతగారు, మా నాన్న గారు హనుమంతుని ఉపాసకులు   తలచుకొని ఆ పేరు  పెట్టుట జరిగింది  రెండవ పుత్రిక పేరు  "జాహ్నవి" మూడవ పాప పేరు, ప్రత్యూష , (గాలి, నీరు, వెలుతురు,  అందరికి కావాలి అవే  మా పాపల పర్లు )నా ముగ్గురు కుమార్తెలకు తగిన విద్య నేర్చుకొనుటకు వీలు కల్పించాను, పెద్ద  పాప బీటేక్ (కంప్యూటర్స్ ) ప్రస్తుతము బెంగుళూరులో ఉద్యోగము  చేస్తున్నది, రెండవ పాప   బీటేక్ (ఎలెక్ట్రానిక్ కంప్యూటర్స్ + ఏమ్బైడెడ్ ) ప్రస్తుతము  ఉద్యొగము విరమిమ్చి హౌస్ వైఫ్ గా ఉట్టున్నది, ఇక మూడో పాప M Sc.( ఆర్గాన్ కెమిస్ట్రి ) ప్రస్తుతము టిచర్గా పనిచేస్తుంది. నా ముగ్గురు అమ్మాయలకు వివాహము  జరిగినది, వారికి పిల్లలు కుడా ఉన్నారు.
మీ శ్రీ మతి ఎమన్నా చదువుకున్నదా అని అడిగింది సుభద్రగారు.
మీ ప్రక్కనే ఉన్నదిగా మీరె అడగ వచ్చు కదా, ఎమీలేదు శంఖం  లో నుండి వచ్చేదే తీర్ధమ్  అని ఎవరో అన్నారు అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను     
మీరు చమత్కారులు ఎమీ తెలియదని అన్ని అడుగుతున్నారు .
నా శ్రీమతి B. A (పాలిటిక్స్ & పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) నేను మాత్రం B.Sc (ఫిజిక్స్ మెయిన్ మాధమేటిక్సు & కెమిస్ట్రీ అన్సలరీస్).    
మీ నాన్న గారు, మీ  తాత గారి గురించి, తెలియపరుస్తారా.
మా నాన్న గారు కీర్తి శేషులు  మల్లాప్రగడ లక్ష్మణ రావు గారు , మా తాతగారు కీర్తిశేషులు వేంకటాచల జ్యోష్యులు, నిజాం నవాబు దగ్గర ఆస్థా న జ్యొతీష్యు డుగా ఉండేవారని చెప్పావారు, వారికి జ్యోష్యులు ఆని బిరుదు కూడా  ఉండేది, నల్ల పంతులు గారు  మొఖం చూసి అన్ని విషయాలు చెప్పావారు అనేవారు,  ఇక  మానాన్నగారు ప్రభుత్వ ఉద్యోగిగా (ఫైర్ స్టేషన్లో డ్రైవర్ పనిచేసి రిటైర్ అయినారు, మరియు హనుమాన్ జ్యోతిషాలయం అని గుంటూరు నందు బాలాంజనేయ ప్రశ్నలు (అంజనం ద్వారా ప్రశ్నలకు సమాధానములు తెలియపరుస్తూ జీవితము గడిపినారు) ఇరువురు హనుమంతుని ఉపాసకులు మరియు బాలా ఉపాసకులు,  వృత్తి " బ్రతుకు తెరువుకోసం జ్యోతిషం యంతో కష్ట  జీవితములు గడిపినట్లు తెలిపే వారు".
మా పెద్దల మార్గమునె నేను కూడా  కష్టపడదలిచాను నేను నేర్చుకున్న మాదమేటిక్స్ ను, మా పెద్దలద్వారా వచ్చిన తెలుగు కళను వృద్ది పరచాలని ఈ బ్లాగ్ ద్వారా తెలియ పరుస్తున్నాను నేను మొదట 9 సమ్వస్చరాలు మాధమేతిక్స్ భోధకుడిగా పనిచేసాను, మరియు ఇంగ్లిష్, తెలుగు టైపిస్ట్  గా పనిచేసినాను,  ఆ అనుభవమే,  నాకు తెలుగు భాషా బివృద్ధికి,  లెక్కలు అన్న భయం పోగొట్టాలని నా కృషి ని, మీరందరు  సహకరించగలరని ప్రార్ధించు  తున్నాను, తప్పులు దొర్లిన క్షమించి మన్నిమ్చగలరని వేడుకుంటున్నాను,  అందుకనే నేను " ప్రాంజలి - మల్లాప్రగడాస్ మాధమేటిక్స్ " ద్వారా లెక్కలను విశద పరుస్తున్నాను, నేను మొట్ట మొదట కాశి వేల్లినతర్వాత ఆ పరమేశ్వరుని కృపవల్ల, కులదైవం శ్రీ వేంకటేశ్వరుని దయవల్ల,  నేను కవితలు కధలు వ్రాయుట మొదలు పెట్టినాను, అప్పటిదాకా నేను అకౌంటెంట్ గా, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గా, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేసి ప్రస్తుతము అసిస్టెంట్ ట్రజరి  ఆఫీసర్ గా పని చేస్తున్నాను.
నా సలహా ఏమిటంటే ప్రతిఒక్కరు " నిన్నటి గురించి విచారించద్దొ , నేటి గురించి చర్చించ వద్దు, రేపటి గురించి ఆలోచించ వద్దు "   ప్రతి విషయాన్ని ప్రకృతి అనుసరించి, ఇంట్లో  ఉన్న వారిని గమనిస్తు, మనము నముకున్న ఆదిదేవతలను కొలుస్తూ, మన ప్రవర్తన ఉండాలి, వెలుగు నిచ్చే అమ్మవారిని, తేజస్సును, ధైర్యమును, ఆరోగ్యమును ఇ చ్చె  హనుమంతున్ని ద్యానిమ్చే మార్గం నాది మీరు కూడా  ప్రార్దిమ్చితే మనసు  ప్రశాంతం, మంచి మాట, ఆరోగ్యము కలుగుతాయని నా నమ్మకము నన్ను,నా బ్లాగ్ను ఆదరిస్తు ఉన్న వారికీ మరియు పెద్దలు మహానుభావులు, కవులు పండితులు పేరు పేరు న ప్రతిఒక్కరికి నా శతకోటి వందనములు, మీ అందరి అశీర్వాద బలముతో నాకు తెలిసినవి, నేను నేర్చుకున్నవి " ధర్మాన్ని రక్షించాలని, న్యాయాని నిలబెట్టాలని సత్యం పలుకు జీవతమ్ గడపాలని ఒక ధ్యేయంతో ముందుకు పోతున్న వాడిని,  మనం భారతీయులమ్ దేశానికి రక్షణగా నిలబడుదాం, నలుగురికి సహాయపడుదాం,  స్నేహానికి విలువ నిచ్చి బ్రతుకుదాం.  ప్రేమిమ్చుదాం,  ప్రేమను పంచుదాం ,ప్రేమకు విలువ నిచ్చి బ్రతుకుదాం.      అందరు సుఖముగా ఉంటె మనము సుఖముగా ఉండ గలుగుతాము స్త్రీ లను గౌరవిమ్చుదాం, పెద్దలని ఆడరించుదాం, పిల్లకు విద్య బుద్ధులు నేర్చుకొనుటకు సహకరించుదాం, వారి భవిషత్తు దేశానికి ఉపయోగ పడే విధముగా తీర్చి దిద్దుదాం
ఇప్పటిదాకా ప్రేమ ఎవరిపై ఉండాలి అన్న దానికి న భావన మాత్రమె మొదట మనల్ని మోస్తున్నా భూమాతపై ప్రేమ ఉండాలి, కన్న బిడ్డలుగా బ్రతకటానికి సహకరిస్తున్న దేశమాత పై ప్రేమ ఉండాలి, మనల్ని ఆదరిస్తూ మనల్ని ప్రోశ్చహిమ్చి, విద్యా బుద్దులు నేర్పిన గురువు గారిపై ప్రేమ ఉండాలి, మనకు సహకరించిన స్నేహితులపై ప్రేమ ఉండాలి, మన కున్న  తల్లి తండ్రుల ఋణము తీర్చుకొనె అవకాము కలగాలి, వారిని ప్రేమతో ఆదరించి, వారి మనస్సు భాధపడ కుండ మన ప్రవర్తనను మార్చు కుంటూ, వారి శేష జీవితానికి మనవంతు సహకారం అన్దిస్తూ, వారిని        గౌరవించుతూ,   ప్రేమించాలి, ముఖ్యముగా మన గురించి ఆహార్నిసాలు ఆలోచిస్తూ, ప్రేమను అందిస్తూ, సుఖ శాంతులను కలుగ చేస్తు, ఆరోగ్యవంతుడిగా పౌష్టికాహారం అందిస్తూ, అనారోగ్యునిగా ఉన్నా మందులు ఇచ్చి సేవచేస్తూ, సమయానికి సలహాలు ఇస్తూ నమ్ముకొని పుటింటి వారిని వదులుకొని మనకు సర్వం అర్పిస్తున్న శ్రీమతిని ప్రేమించాలి.    
ప్రేమను పొందటానికి నిర్మలమైన మనస్సుతో కోరేది ప్రేమ !
అనుకున్నది సాధించుటకు మురిపములు అందిమ్చి పొందే కపట ప్రేమ !
ఇతర్లు తమధర్మం పాటించకపోతే, ధర్మమార్గంలో నడిపే ఆగ్రహిమ్చేప్రేమ !
కల్లబొల్లి మాటలనునమ్మక వాస్తవ దృష్టిని గ్రహించి పొందేది వాస్తవ ప్రేమ !
భార్యభర్తలమద్య ఉండేది, అన్దరూ బాగుండాలని చెప్పేది, సృష్టి కర్త  ప్రేమ !
ఆకర్షణకు లొంగి, విశ్వాసముతో ఏకంగా మారి పెద్దలను ఎదిరించే   ప్రేమ !
కన్నపిల్లలుతిట్టినా,కొట్టినా,చీదరించు
కొన్న,ప్పు పిల్లలది కాదని, నా దే నని తప్పూ అన్న కన్నా తల్లి ప్రేమ !

అందాలు వెదజల్లి, మనసును, ధనమును దోచి,  రోగమును పంచే కపట  ప్రేమ !      
84  లక్షల జీవరాసులలొ ప్రేమలేని ప్రాణి లేదు, అన్నింటిలో ఉంటుంది ప్రేమ !
కొండగాలి విచే చోట, పూల పరిమళాలు వెదజల్లే చోట ఉంటుంది ప్రేమ !
అలల తుంపర్లు వెదజల్లే చోట, చిరుజల్లుల్లో తడిసిన ఉంటుంది ప్రేమ !
కిరణాలు విస్తరిమ్చినచోట, ఇంటిని చక్కగ్గా అలంకరించిన చోట ఉంటుంది ప్రేమ !
మమతలుకలసి మనసైనచోట, పేగు భంధం కలసినచోట ఉంటుందిప్రేమ!
  
 
ప్రేమించటము కన్న ప్రేమించ బడటం అసలైన నిజమైన ప్రేమ


  శ్రీమతి  ఒక దివ్య మణి
 నయన మనోహర కలువల అపరంజి  మణి !
మనసును దోచే, నవ నవోన్మష రక్తి స్వరూపిణి !
కోరికలు తీర్చి, యశస్సును పెంచే, యశశ్విణి  !
మనోధైర్యం, తేజస్సును వృద్ధి పరిచే, తేజస్విణి  !
ధర్మశాస్త్రములు తెలి
పి, ఆదు కొనే అంతర్వా ణి  !
కొన్ని విషయాలు తెలిసుకోనుట
కు,  సహాయపడే అన్వేషిణి !
మనసును మెప్పించిన, వారి కోర్కెలు తీర్చిన, అభిలాషిణి !
అంతరాత్మను ప్రభోదించి, అవసరమునకు సలహాఇచ్చె, ఆత్మజ్ఞాణి !
ఆస్తిని, అదాయమును,పెంచి ఆహారమును అందించే, అన్నప్రదాయిణి ! 
పురాణములు, వేదములు అనర్గాలముగా వర్ణించి చెప్పే, అవృత్తిణి !  
ఇంటిని, సభను, పిల్లలను,  హుందాగా తీర్చి దిద్దన, అస్థాణి !
కామాందులకు, దుర్మార్గులకు, దుష్టులకు, చిక్కిన ఆహుతిణి !
పరిమళాలు వెదజల్లి, మనస్సును ఉల్లాసపరిచే, ఇష్ట ఘంధిణి !
రౌద్రరసమును చూపి, శత్రువుల గుండెలలో ఉండే, ఉగ్రరూపిణి !
మనో భిష్టమును నెరవేర్చి, ఉచ్చాహమును పెంచే, ఉజ్వల రాణి !           
తెలివితో తెలియనివి తెలియపరిచే ఉపన్యాసిణి !
ఉపవాసములు ఉండి ఉపాయములు తెలియపరిచే ఉపచారిణి !
భర్త దుర్వసనములు లోనైతే వ్యసనములను మాన్పిమ్చే ఉపాధ్యాయిణి !
ఉరొభాధను భరించి ఉష్ణమును పెంచి ఉన్మాదునికి ఊరట కలిగించే విలాసిణి !
బలము, ధెర్యము, మనోనిగ్రహ శక్తి పెంచే తేజస్సుగల ఓజస్వి ణి !
అనారోగ్య భర్తను ఆరోగ్య్యవంతునిగా మార్చుటకు శ్రమించే ఔషదణి !    
   నవనీత హృదయ వేణి , మంజుల మధుర వాణి ! 



"శ్రీమతి  ఒక దివ్యమణి - మాట మంజులమధుర వాణి"


                                                                 
 

11, డిసెంబర్ 2014, గురువారం

199.Family comedy story -102(ప్రేమ ఎవరిపై ఉండాలి ?-7)

ఓం శ్రీ రామ్                                 ఓం శ్రీ రామ్                            ఓం శ్రీ రామ్
                                                         
ప్రకాశరావుగారు, సుభద్రగారు మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకు నాకు తెలిసినవి మీకు తెలియపరిచినాను ఇంకా ఎమన్నా సందేహాలు ఉంటె నన్ను అడుగ గలరు అన్నాడు రామకృష్ణ. సందేహాలు చాలా ఉన్నాయి. 
ప్రేమ గురించి నాలుగు అంత్యాను ప్రాస పదకవితలు చెప్పండి అవి వింటాము మేము అన్నారు సుభద్ర గారు.నేను చెప్పినవి నీ మనసు నొప్పించిన మీరు భాదపడ కూడదు, ఎందుకంటే ఇది ప్రేమ విషయం "నీ ప్రేమను నేను , నా ప్రేమవు నీవు అనవలసి వస్తుంది ", మీరు అన్యధా భావించవద్దు ఇది కవితగా భావించండి. మీరు కవితా దృష్టిలో చెపుతున్నారు మేము ఎందుకు భాద పడుతము అని అన్నది సుభద్రగారు. 

నీ చూపుల చినుకుల్లో తడిచాను నేను
నీ పెదాల కదలికల్లో చిక్కాను నేను
నీ హృదయంల్లో జ్ఞాపకాన్ని నేను
నీ తలపుల్లో ఒక మెరుపై ఉన్నాను

నీ శ్వాస మలయ సమీరాన్ని నేను
నీ యద పొంగు  బీజాన్ని నేను
నీ రెప్పల కదలికలమూలం నేను
నీ అడుగుల్లో అడుగునై ఉన్నాను 

నీ వీక్షనా తరంగాలలో ఉన్నా నేను 
నీ నర్తన భావాలల్లో ఉన్నా నేను 
నీ బిడియ సౌందర్యంలో ఉన్నా నేను
నీ ఆనందం పంచె తుమ్మెదనై ఉన్నాను 

నీ ఆరోగ్య రహస్య  మూలం  నేను
నీ కొరిక తీర్చటానికి మూలం నేను
నీ అలుపెరుగని ప్రయాణానికి మూలం నేను
నీ రూపురెఖలు అందంగా వర్నిస్తూ ఉన్నాను

నీ ఆణువణువూ చలించే రక్తాన్నినేను 
నీ చల్లని మేనులో వెచ్చదనాన్ని నేను
నీ సమస్యకు పరిష్కారాన్ని నేను 
నీ వత్తిల్లకు లొంగి బ్రతుకుతూ ఉన్నాను

నీ నమ్మకానికి భద్రతను నేను 
నీ ఆవేశానికి శిలను నేను 
నీ ఓర్పుకు  ఒదా ర్పును నేను
నీ తీర్పుకు లొంగుతూ బ్రతుకుతూ ఉన్నాను

నీ పల్లవి లో రాగాన్ని నేను
నీ ఊహలలొ దీపాన్ని నేను
నీ తేజంలో ఉత్తేజాన్ని నేను 
నీ ప్రేమ లో మునిగి తేలుతూ ఉన్నాను
అందుకే
"నీ ప్రేమను నేను , నా ప్రేమకు  నీవు"
కలసి మెలసి బ్రతికి నలుగుర్ని బ్రతికిద్దాం

అన్నయ్య గారు చాలా చక్కగా వర్ణించారు ప్రేమ గురించి, ఏం  శ్రీదేవి మీ వారిలో ఇంత  టాలెంటు ఉన్నదని నాకు ఇంతవరుకు తెలియలేదే. నాకు మాత్రమేమి తెలుసు నామీద కూడా  కవిత లల్లినట్లు ఇప్పుడే కదా తెలిసింది. 
రామకృష్ణ నీవు కొన్ని పదాలు తెలియపరుస్తాను ఆవి ఇంగ్లిషు లోవి వాటి అర్ధాన్ని ఆధారంగా, లక్షణాలను వివరిస్తూ స్పెలింగ్ అక్షర ప్రాతి పదికగా అంత్యాను ప్రాస తెలికపదలు కవితా రూపమ్లొ తెలియపరచాలి అని అన్నాడు ప్రకాశరావు, మీరు అడగండి తరువాత నేను తెలియపరచగలనో, లేదో ఆలోచించి  తెలియ పరుస్తా. చాలా తేలిక నీవు ఆలోచించకుండా చెప్పగలవు ఆశుకవిత్వం. 
 ప్రకాశరావుగారు " Master " గురించి తెలియపరుచు అన్నారు. 


M  for  - మనస్సు ఉల్లసపరిచి విద్యను భోధించేవారు 
A   for  - ఏనుగులా అరుస్తూ క్రమ శిక్షణలో పెట్టవారు
S    for - సందేహాలు ఉన్న సమాధానాలు  చెప్పేవారు 
T    for - తృప్తిగా భోజనం పెట్టి విద్యను   భోధించేవారు
E    for - ఈశ్వరునిలా విద్యార్ధుల మేధస్సును పెంచేవారు  
R    for - రత్నం మెరిసే విధముగా తెలివిని పెంచేవారు 

బాగుంది అన్నయ్యగారు అయితే  " Teacher " గురించి తెలియ పరచండి 


T    for - తిరస్కరించకుండా సంస్కారంతో విద్యా బుద్దులు నేర్పేవారు 
E    for - ఇల్లాలుగా ఉంటు  విద్యార్ధులను కన్న  బిడ్డలుగా  చేసేవారు
A   for -  ఎప్పటికప్పుడు జరుగుతున్న కొత్త విషయాలను చెప్పేవారు 
C   for -  సిరికోసం విద్యార్ధులకు ఆధునిక పద్ధతులలో విద్యనేర్పేవారు
H   for -  హెచ్చు తగ్గులు  లేకుండా విద్యను   సమానంగా  చెప్పేవారు
E   for -  ఇంజన్ లాకష్టపడుతూ స్కూలును అభివృద్ధిలోకి తెచ్చేవారు
R   for - రమ్యంగా,  రస వత్తరంగా,  రంగరించి  విద్యను  భోదించే వారు

అప్పుడే భార్య శ్రీ దేవి అయితే మీరు ఇంటర్నెట్ గురించి గూగుల్ గురించి తెలియ పరచండి అన్నాది.


I    for -  ఐశ్వర్యంపెంచేది,ఆశయాలు తీర్చెది
N   for -  ఎన్నో విధాలుగా  ఉపయోగ  పడేది 
T   for -   టికానా  లేని వాడికి కూడా ఉండేది
E   for -   ఇంటిలోఅందరికి  ఉపయోగ పడేది
R   for -  ఆరుస్తా తీరుస్తా  అంటు  అనుకొనేది
N   for -  ఎందరికో   ఉద్యోగములు  కల్పించేది 
E   for -  ఇప్పుడేఅందరు ఆదరిస్తూ మెచ్చినది 
T   for -   తిరుగుతూ ప్రపంచ వింతలుచూపేది
Google 

G   for -  గురుతర భాద్యత వహిస్తూ 
O   for -  ఓంకారం లా  విస్తరిస్తూ 
O   for -  ఓనామాలను నేర్పిస్తూ
for  - గురుత్వాకర్షణతో చలిస్తూ 
l     for -  లావన్యంగా రంగరిస్తూ 
E   for -  ఇలలో అందరి మెప్పు పొందుతూ ఉన్నది 


Treasury

T    for - తప్పుడు లెక్కలు సరి దిద్దేది
R   for -  రికవరీలు ఖచ్చితంగా వ్రాసేది 
E   for -  ఎటువంటి తప్పులు చేయనిది 
A   for -  ఎందరో మహానుభావులు మెచ్చినది
S   for -  సకాలంలో జీతాలు అందించునది 
U  for -  యున్నడబ్బును సమానంగా పంచేది
R  for -  రకరకాల పద్దులకు డబ్బునిచ్చేది
Y  for -  ఎల్లప్పుడు ప్రభుత్వాన్ని నడిపేది
Twitter 

T for - తలలో నాలుకలా ఉండేది 
w for - ఒరల్డు  మొత్తం అందుబాటులో ఉన్నది
i for - ఇంట్లో ఉన్నవారందర్నీఆశ్చర్యంలో ముంచేది  
for - తిరునాళ్ళు తీరు చూపించెది
for - తస్మాత్ జాగర్తలు తెలియ పరిచేది
e for - ఇందు అందు భేదము లేనిది
r for - రంగు రంగుల మేలి చిత్ర మాలిక ఇది

Facebook 

F for - "యఫ్ఫారే " ఇది ఒక అద్బుత ప్రపంచం 
a for - ఏలినాటి శనిని కుడా తపించే ప్రపంచం 
 c for - సినమాలు, శ్రుంగరాలు,  ప్రపంచం 
e ఫర్ - ఇప్పుడు ఇల్లాళ్ళు కూడా చూస్తున్న ప్రపంచం 
        b for - బీమావివరాలుకూడా చూపుతున్న ప్రపంచం 
 o ఫర్ -  ఒకటి కాదు మరెన్నో వింతలు చూపె ప్రపంచం
o for - ఒళ్ళు గగుర్పాటు చెందే చిత్రాలు చూపె ప్రపంచం
k ఫర్ - కెవ్వు మని కేక పెట్టె అద్భుతాలు చూపె ప్రపంచం 

చివరిగా student గురించి  ముగిస్తా 
S  for - సుతి మెత్తగా సుత్తి కొట్టేవాడు 
t ఫర్ - తిని తిరుగుతూ ఉండే వాడు 
u for - ఉన్నది ఉన్నట్టుగా చెప్పు వాడు 
d for - దగా చేయలేని వాడు 
e for - ఇంట్లో మాట వినని వాడు 
n for - నటనలో ఆరి తేరినవాడు
t for - తపించుకొని తిరుగు వాడు 
  
అన్నయ్యగారు మీరుచెప్పినవి చాలా బాగున్నాయి, నవ్వు కొనే విధముగా   ఆలొచించెవిదముగా ఉన్నాయి, ఇవి నేను కెవలము ఎవ్వరిని ఉద్దేశించినవి కావు లక్షణాల బట్టి వివరించాను   ఈరొజుకు ఇవి చాలు రేపు మరలా కొన్ని ప్రశ్నలు అడిగుతాను అప్పుడు చెప్పండి, ఇదిగో కాఫీ త్రాగండి, అన్నయ్యగారు మీరు కలసి సూపర్ మార్కెట్ కు పోయి కొన్ని నిత్య అవసర వస్తువులు తీసుకు రండి , అప్పటి కాల్ వంట చేస్తాను,  సుభద్ర. 

అట్లాగే అని సంచి తీసుకొని  ప్రకశరావుగరు, మరియు రామకృష్ణ గారు మాట్లాడు కుంటూ ........... 
"  హృదయంలో ఉంటుంది విద్యుత్తు - పేరులో ఉంటుంది మహత్తు "
                                                                        ఇంకా ఉంది