20, డిసెంబర్ 2014, శనివారం

201.Daily spl. kavitalu - (చిరు దివ్వె వెలుగులు -4)

.......  ఓం శ్రీ రాం      .....  ఓం శ్రీ  రాం      .....  ఓం శ్రీ రాం
                                                   
                                                         

నా మనసుకు తోచినవి, ఫోటోలను బట్టి ఒక నెలలో (11- 12-2014 to 31-12-2014) వ్రాసిన అంత్యాను ప్రాస కవితలు

                                                                            
1. పరిమళం
స్పర్శవేది తాకగానే   అవుతుంది ఇనుము బంగారం
గంగనీరు తాకగానే   అవుతాయి మురికినీరు పవిత్రం
బుద్ధికినిజం తెలియగానే ఉంటుంది మనస్సు నిర్మలం
మాయకు చిక్కి మనస్సు ఉంటుంది ప్రార్ధనతో పరిమళం  


2. ఔదార్యం
జిహ్వకు మాత్రమె తెలుసు తేనే మాధుర్యం
పతికి  మాత్రమె  తెలుసు  సతి   సౌందర్యం
శివునికి మాత్రమే తెలుసు పార్వతి ఔదార్యం
మనిషికి మాత్రమె తెలుసు మనసు జాడ్యం

చాతక   పక్షి   నోటిలో మేఘడు   జలాలు   కురిపించే
భూదేవి పరిధిలో మేఘుడు వర్షపు జల్లులు కురిపించే
ధర్మాత్ముడు  ధర్మ పరులపై  దయా  వర్షం  కురిపించే  
మనుష్యులు వత్తిడికి అభాద్ధాలు వర్షం ప్రజలపై కురిపించే   


3. కన్నెవయస్సు
కన్నెవయస్సుకు సొగసు తగ్గడంఉండదు
కల్లల్లో  ఉండే  కాంక్షలు    తగ్గడంఉండదు
కళలు పండించుకోవటానికి తీరక ఉండదు
కడలిఅలలకు నదులు చేరిన అలుపె ఉండదు

నీలొ తప్పున్నప్పుడు సుఖ మనేది ఉండదు
నీతి లేనపుడు గెలుపనేది ఎప్పుడు ఉండదు
నీది కానిదానిపై ఎప్పుడు మనస్సు  ఉండదు
నీ తల రాతకు  ఎప్పుడు   మార్పు   ఉండదు

స్త్రీ  వలపులకు   దాహం  తీరదు
తండ్రి మాటల్లో  తప్పు  కనబడదు          
తల్లి ప్రేమను గుర్తించటం జరుగదు
కవి తలపులకు మరుపు ఉండదు   


3. బాల్యం
ప్రాణానానికి  ప్రాణం పసి ప్రాణం
ప్రేమకు ప్రేమ పసి హృదయం
స్నేహానికి   స్నేహం  బాల్యం
ప్రేమను మరువలేము మనం    


4. తలచు
పిల్లను చూసి తన్ను తాను మరచు
ముద్దు  లలో మనసు   మై మరచు
కన్న బిడ్డ ముందు అందర్నీమరచు
తల్లి ప్రేమ ఆ బ్రహ్మ కూడా    తలచు   


5. సామెతల
సామెతల సామ్రాట్ కు ధన్యవాదాలు
తెలుగు భాషాభి వృద్ధికి నీరాజనాలు
మీ పట్టుదల,కృషి మాకు దీవెవెనలు
మనసుకు సంతోషం కలిగించేసామెతల


6. పునాది
దేనికైనఎప్పుడు ఉండాలిపునాది
ఓటమి ఒక  గెలుపుకు పునాది
అనుభవం   పురోగతికి పునాది 
స్తిర నిర్ణ  యానికి  ఒక పునాది
  17-12-2014
ముష్కర ఘాతకులు పెషావర్లో మారణ హోమం
బడి పిల్లల పై బన్దూకులు  కాల్పుల  విజుమ్భనం
132మంది విద్యార్ధులు,9మంది సిబ్బంది మరణం
ఖండించిన ఇండియా మరియు అన్తర్జాతీయ సమాజం    
 

7 మార్గం
నే నొక  పౌరున్ని  నాకు సమాజమే దేవాలయం
నేనొక వర్గాన్ని కాదు నేను  బతికిస్తా మానవత్వం
నేనొక ప్రపంచాన్ని హితాన్నిభోదిమ్చటమే కర్తవ్యం
నేనొక దూతను, ఎప్పుడు ధర్మామార్గమే నా మార్గం   


8. అమ్మ
అమ్మ  ప్రేమ  అనంతం, అద్భుతం
అమ్మను తలుస్తే  మనస్సు ప్రశాంతం
అమ్మ ఆత్రుతే నా  హృదయ స్పదనం
అమ్మను మరువలేము ఎప్పుడు మనం  


9. సొంతం
కళ్ళు చూస్తె కలవర  పెట్టి కన్ను  గీటె
వళ్ళు చూస్తె వయ్యరంతో వలపు చాటె  
ఏళ్ళు చూస్తె సలపరింతలు  మరిగినటె
చేళ్ళు చూస్తె ఇక నీ  సొంతం ఆయినటె 


10. పాట
తెలుగు పాటల మాధుర్యం ఖండాన్తరములు తాకింది
బాలికలు మాదుర్యముతో పాడి తెలుగు విస్తరించింది
జ్ఞాపకాల మాధుర్యాన్ని అక్కడ పరవసిమ్ప  చేసింది
సంగీత మాదుర్యముతో మంత్రం ముగ్ధులను  చేసింది  


11. మనమే
మనకు  ఎవ్వరు రారు పోటి మనకు మనమే
మనం నలుగురం కాదు మనసుతో ఒక్కరమే
మనలో ఉండాలి ప్రక్రుతి పరవ శించే ప్రేమయే
బాల్య ప్రశాంత జీవనమ్ మరచి  పోనీ వారమే 


12. మారదు
నాఅడుగు ముందుకి వేస్తే నా  గమ్యం మారదు
అడుగు ముందు వేసి ధర్మంభోధించిన మారదు
నా పట్టుదల, కృషి, నిగ్రహశక్తి ఎప్పటికి మారదు
పొగ త్రాగటం మానేదాక   నా ప్రయాణం మారదు   

  
13. మార్పు ఎక్కడ
దుష్టుల హస్తాలలో నలిగి కనుమరుగవుతున్న బాల్యం
               సిరికోసం అమాయక బాలికలను అమ్ముడవుతున్న వైనం           
రాక్షస బల్లుల చేతికిచిక్కి విలవిల లాడిన యవ్వనం
అమ్మతనం మరచి స్త్రీలు అమ్మ బడుతున్న ఆడమాంసం

ఆటవిక క్రీడలకు తలవంచుతున్న సమాజం 
కడలి తరంగంలా స్త్రీలపై పడుతున్న మృగాల మయం
బ్రతికిఉన్న చావుకోసం బ్రతుకుతున్న స్త్రీ యవ్వనం 
ప్రతిఒక్కరిలొ ఉండాలి స్త్రీ జాతి రక్షణ కర్తవ్యం

14. ప్రకాశాన్ని
  ఎ  ప్రకాశాన్ని  ఎ  చీకట్లు అడ్డుకో   గలవు
ఎ ప్రయాణాన్నిఎ దు:ఖాలు అడ్డుకో గలవు 
ఎ ఆవేశాన్ని   ఎ  ప్రేమలు అడ్డుకో   గలవు
ఎ ఆలోచనల్ని ఎ బ్రమలు తొలగించగలవు 


15. సౌందర్యం
ఎ సౌందర్యం ఎ మనిషికి  సొంత   మవుతున్న దో ?
ఎ సౌందర్యం ఎ మనిషిని పిచ్చి వాడిని  చేస్తున్న దో ?
ఎ సౌందర్యం ఎ మనిషి మరణానికి కారణమవుతుందో ?
ఎ సౌందర్యం ఎన్ని కుటుంబాలను  నాశనం చేసిందో ?    





 
16 . నిర్మలుడవు నీవె 
ప్రవర్తన గురించి చాల చక్కగా విశదపరిచారు, మాకు తెలియా పరిచిన వారికి ధన్యవాదములు  నాకు తోచిన ఒక కవితను ఇందు పొందు పరుచు చున్నాను మీరు పంపిన దాని అనుకరించి
ప్రవర్తన నిర్మలంగా ఉండాలంటే
 

కాల నియమాది సంగుడవై
తత్వమును తెలిసిన వాడవై
తామసం తగ్గించుకొన్న వాడవై
నిద్రమత్తును వదిలించుకొన్న వాడవై

మనసు ఆనంద పరుచుకున్న వాడవై
విశాల హృదయం కల్పించుకున్న వాడవై
ధైర్యముతొ భయమును తరిమిన వాడవై
తెజరిల్లితే జీవితములొ నిర్మలుడవు నీవె   


17. యోగి
నవ  శిసువు  నోరు  లేని  యోగి
నవ  వధువు నోరు   లేని    భోగి
నవ జనులను మోస్తున్నది  బోగి
నవ విధాల విద్యు త్తుతో ఉన్నరాగి 

నవ  సంగీతం వినలేని సోది
నవ రోగాలతో జీవించలేని రోగి
నవ ఆశలతొ సుఖపెట్టలేని భోగి
నవ ప్రార్ధనలతో జీవిస్తున్న యోగి       


18. ప్రవర్తన
ఎన్ని సత్కారాలు, భాహుమతులు పొందినా 
ఎన్ని ఆరాధనలు ఆచరించినా 
ధార్మిక వస్త్రధారణ ధరించినా 
ప్రవర్తన బాగుంటేనే మనిషికి విలువ 

వాక్కు మంచిగా లేక పోయినా
సాటి వారి పట్ల సానుభూతిలేక పోయినా
    సమాజం పట్ల అవగాహన లేక పోయినా
ప్రవర్తన సరిగా లేక పోయినా 
మనిషిగా ఉన్నా లేనట్టే 

19. వేశ్య 
ఎవరేమనిన తనని కాదని నవ్వుచుండు 
సిరికోసం తనదికాదని తనువు అర్పిమ్చుచుండు 
బ్రతుకుతెరువుకోసం సిగ్గును పందెంలో పెట్టుచుడు 
మగవాడికి క్షణ సుఖం ఇచ్చి, క్షణం కష్టం పడి నవ్వుచుండు

20. బ్లాక్ డె
బ్లాక్ డె అనేది ఎదీ ఉండదు, సుఖాన్ని ఇచ్చే చీకటి ఉంటుంది
మనసులో చీకటి ఉంటుంది, ఇకవెలుగు కోసం పరిగెడుతుంది   
కష్టాల్లోకళ్ళకు చీకటి కమ్ముకున్నా, ధైర్యమనే వేలుగుంటుంది
ప్రభుత్వము నిరుద్యోగులకు ఉద్యోగములు కల్పించలేక నిద్ర పోతుంది 


21. కష్ట పడే
కష్ట పడే వాడు కడుపు  నిండా తినలేడు
సుఖపడే వాడు కడుపునిండా నిద్రపోలేడు
100 కెజీలు దాణ్యం మోసేవాడు కొనలేడు     
కొన్నవాడు దాన్యాన్ని మోయ లేడు
దేవునికి వెతరేకమగా ఏమనిషి ఎమీ చేయలేడు  

22సుఖం
ఎ సుఖం అమలినంగా ఉండదు
ఎ క్షణం   స్వచ్చంగా    ఉండదు
ఎ లాభం  స్పష్టంగా      ఉండదు
ఎ నష్టం    భయంగా    ఉండదు

ఎ సందేహం  నిజంగా   ఉండదు
ఎ ఉపదేశం ఆచరణంగా ఉండదు
ఎ వ్యవహారం సమంజసంగా ఉండదు
ఎ సమయం సద్వినియోగం ఉండదు
 అందుకే
మనసు తెలుసు కున్నవాడు మర్మజ్ఞుడు
తనను తెలుసు కున్నవాడు   తత్వజ్ఞుడు
ప్రేమను తెలుసు కున్నవాడు  ప్రేమికుడు
దైవాన్ని తెలుసుకున్నవాడు    దైవజ్ఞుడు 



www.ramakrishnamallapragada.com

24ఇది ఒక సౌందర్య లహరి
మేఘాలు నింగిలో గాలికి  కదులు తున్నాయి
మనసులోని ఊహలు ఆనందలో  మునిగాయి
ప్రకృతి ద్రుస్యాలు మనస్సుకు శాంతికలిగించాయి
ప్రేమలో ఉరకలు వేస్తున్న ప్రేమికులాగున్నాయి

నింగిలో మేఘ ఘర్జనలు అద్భుతముగా ఉన్నాయి
జాలువారు జలపుస్పాలు మరీ అందంగా ఉన్నాయి
నింగినేల కలసి అద్భుతముగా కనబడుతున్నాయి         
ప్రకృతినిచిత్రంగా తీసినవారి కృషి అనుభవాలయ్యాయి 


25. బరువు
మనిషిని ప్రేమ ప్రేమగా గుర్తింపు తెచ్చుకోవటం పెద్ద బరువు 
మనిషి  సమస్త  ఆలోచనలతో   మెదడు  వేడెక్కి  బరువు
గడ్డి పరాకే కదా అనకు ఇరువురి మద్య ఉండే పెద్ద బరువు
మనిషి చేసిన లారియంత్రం గడ్డి మోపుకు మించిన బరువు 
కళల పరిపక్వతకు  కొత్త ప్రభుత్వాలు
కలల సాఫల్యంకు కొత్త సంవస్చరాలు
సంతోషముతో ఉండాలి తల్లి తండ్రులు
ఆకలి దప్పులు తీర్చె కొత్త సంవస్చరం వస్తుంది
ప్రతి ఒక్కరికి నూతన సంవస్చర శుభాకాంక్షలు    
Good by 2014, happy new year 2015      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి