11, డిసెంబర్ 2014, గురువారం

199.Family comedy story -102(ప్రేమ ఎవరిపై ఉండాలి ?-7)

ఓం శ్రీ రామ్                                 ఓం శ్రీ రామ్                            ఓం శ్రీ రామ్
                                                         
ప్రకాశరావుగారు, సుభద్రగారు మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకు నాకు తెలిసినవి మీకు తెలియపరిచినాను ఇంకా ఎమన్నా సందేహాలు ఉంటె నన్ను అడుగ గలరు అన్నాడు రామకృష్ణ. సందేహాలు చాలా ఉన్నాయి. 
ప్రేమ గురించి నాలుగు అంత్యాను ప్రాస పదకవితలు చెప్పండి అవి వింటాము మేము అన్నారు సుభద్ర గారు.నేను చెప్పినవి నీ మనసు నొప్పించిన మీరు భాదపడ కూడదు, ఎందుకంటే ఇది ప్రేమ విషయం "నీ ప్రేమను నేను , నా ప్రేమవు నీవు అనవలసి వస్తుంది ", మీరు అన్యధా భావించవద్దు ఇది కవితగా భావించండి. మీరు కవితా దృష్టిలో చెపుతున్నారు మేము ఎందుకు భాద పడుతము అని అన్నది సుభద్రగారు. 

నీ చూపుల చినుకుల్లో తడిచాను నేను
నీ పెదాల కదలికల్లో చిక్కాను నేను
నీ హృదయంల్లో జ్ఞాపకాన్ని నేను
నీ తలపుల్లో ఒక మెరుపై ఉన్నాను

నీ శ్వాస మలయ సమీరాన్ని నేను
నీ యద పొంగు  బీజాన్ని నేను
నీ రెప్పల కదలికలమూలం నేను
నీ అడుగుల్లో అడుగునై ఉన్నాను 

నీ వీక్షనా తరంగాలలో ఉన్నా నేను 
నీ నర్తన భావాలల్లో ఉన్నా నేను 
నీ బిడియ సౌందర్యంలో ఉన్నా నేను
నీ ఆనందం పంచె తుమ్మెదనై ఉన్నాను 

నీ ఆరోగ్య రహస్య  మూలం  నేను
నీ కొరిక తీర్చటానికి మూలం నేను
నీ అలుపెరుగని ప్రయాణానికి మూలం నేను
నీ రూపురెఖలు అందంగా వర్నిస్తూ ఉన్నాను

నీ ఆణువణువూ చలించే రక్తాన్నినేను 
నీ చల్లని మేనులో వెచ్చదనాన్ని నేను
నీ సమస్యకు పరిష్కారాన్ని నేను 
నీ వత్తిల్లకు లొంగి బ్రతుకుతూ ఉన్నాను

నీ నమ్మకానికి భద్రతను నేను 
నీ ఆవేశానికి శిలను నేను 
నీ ఓర్పుకు  ఒదా ర్పును నేను
నీ తీర్పుకు లొంగుతూ బ్రతుకుతూ ఉన్నాను

నీ పల్లవి లో రాగాన్ని నేను
నీ ఊహలలొ దీపాన్ని నేను
నీ తేజంలో ఉత్తేజాన్ని నేను 
నీ ప్రేమ లో మునిగి తేలుతూ ఉన్నాను
అందుకే
"నీ ప్రేమను నేను , నా ప్రేమకు  నీవు"
కలసి మెలసి బ్రతికి నలుగుర్ని బ్రతికిద్దాం

అన్నయ్య గారు చాలా చక్కగా వర్ణించారు ప్రేమ గురించి, ఏం  శ్రీదేవి మీ వారిలో ఇంత  టాలెంటు ఉన్నదని నాకు ఇంతవరుకు తెలియలేదే. నాకు మాత్రమేమి తెలుసు నామీద కూడా  కవిత లల్లినట్లు ఇప్పుడే కదా తెలిసింది. 
రామకృష్ణ నీవు కొన్ని పదాలు తెలియపరుస్తాను ఆవి ఇంగ్లిషు లోవి వాటి అర్ధాన్ని ఆధారంగా, లక్షణాలను వివరిస్తూ స్పెలింగ్ అక్షర ప్రాతి పదికగా అంత్యాను ప్రాస తెలికపదలు కవితా రూపమ్లొ తెలియపరచాలి అని అన్నాడు ప్రకాశరావు, మీరు అడగండి తరువాత నేను తెలియపరచగలనో, లేదో ఆలోచించి  తెలియ పరుస్తా. చాలా తేలిక నీవు ఆలోచించకుండా చెప్పగలవు ఆశుకవిత్వం. 
 ప్రకాశరావుగారు " Master " గురించి తెలియపరుచు అన్నారు. 


M  for  - మనస్సు ఉల్లసపరిచి విద్యను భోధించేవారు 
A   for  - ఏనుగులా అరుస్తూ క్రమ శిక్షణలో పెట్టవారు
S    for - సందేహాలు ఉన్న సమాధానాలు  చెప్పేవారు 
T    for - తృప్తిగా భోజనం పెట్టి విద్యను   భోధించేవారు
E    for - ఈశ్వరునిలా విద్యార్ధుల మేధస్సును పెంచేవారు  
R    for - రత్నం మెరిసే విధముగా తెలివిని పెంచేవారు 

బాగుంది అన్నయ్యగారు అయితే  " Teacher " గురించి తెలియ పరచండి 


T    for - తిరస్కరించకుండా సంస్కారంతో విద్యా బుద్దులు నేర్పేవారు 
E    for - ఇల్లాలుగా ఉంటు  విద్యార్ధులను కన్న  బిడ్డలుగా  చేసేవారు
A   for -  ఎప్పటికప్పుడు జరుగుతున్న కొత్త విషయాలను చెప్పేవారు 
C   for -  సిరికోసం విద్యార్ధులకు ఆధునిక పద్ధతులలో విద్యనేర్పేవారు
H   for -  హెచ్చు తగ్గులు  లేకుండా విద్యను   సమానంగా  చెప్పేవారు
E   for -  ఇంజన్ లాకష్టపడుతూ స్కూలును అభివృద్ధిలోకి తెచ్చేవారు
R   for - రమ్యంగా,  రస వత్తరంగా,  రంగరించి  విద్యను  భోదించే వారు

అప్పుడే భార్య శ్రీ దేవి అయితే మీరు ఇంటర్నెట్ గురించి గూగుల్ గురించి తెలియ పరచండి అన్నాది.


I    for -  ఐశ్వర్యంపెంచేది,ఆశయాలు తీర్చెది
N   for -  ఎన్నో విధాలుగా  ఉపయోగ  పడేది 
T   for -   టికానా  లేని వాడికి కూడా ఉండేది
E   for -   ఇంటిలోఅందరికి  ఉపయోగ పడేది
R   for -  ఆరుస్తా తీరుస్తా  అంటు  అనుకొనేది
N   for -  ఎందరికో   ఉద్యోగములు  కల్పించేది 
E   for -  ఇప్పుడేఅందరు ఆదరిస్తూ మెచ్చినది 
T   for -   తిరుగుతూ ప్రపంచ వింతలుచూపేది
Google 

G   for -  గురుతర భాద్యత వహిస్తూ 
O   for -  ఓంకారం లా  విస్తరిస్తూ 
O   for -  ఓనామాలను నేర్పిస్తూ
for  - గురుత్వాకర్షణతో చలిస్తూ 
l     for -  లావన్యంగా రంగరిస్తూ 
E   for -  ఇలలో అందరి మెప్పు పొందుతూ ఉన్నది 


Treasury

T    for - తప్పుడు లెక్కలు సరి దిద్దేది
R   for -  రికవరీలు ఖచ్చితంగా వ్రాసేది 
E   for -  ఎటువంటి తప్పులు చేయనిది 
A   for -  ఎందరో మహానుభావులు మెచ్చినది
S   for -  సకాలంలో జీతాలు అందించునది 
U  for -  యున్నడబ్బును సమానంగా పంచేది
R  for -  రకరకాల పద్దులకు డబ్బునిచ్చేది
Y  for -  ఎల్లప్పుడు ప్రభుత్వాన్ని నడిపేది
Twitter 

T for - తలలో నాలుకలా ఉండేది 
w for - ఒరల్డు  మొత్తం అందుబాటులో ఉన్నది
i for - ఇంట్లో ఉన్నవారందర్నీఆశ్చర్యంలో ముంచేది  
for - తిరునాళ్ళు తీరు చూపించెది
for - తస్మాత్ జాగర్తలు తెలియ పరిచేది
e for - ఇందు అందు భేదము లేనిది
r for - రంగు రంగుల మేలి చిత్ర మాలిక ఇది

Facebook 

F for - "యఫ్ఫారే " ఇది ఒక అద్బుత ప్రపంచం 
a for - ఏలినాటి శనిని కుడా తపించే ప్రపంచం 
 c for - సినమాలు, శ్రుంగరాలు,  ప్రపంచం 
e ఫర్ - ఇప్పుడు ఇల్లాళ్ళు కూడా చూస్తున్న ప్రపంచం 
        b for - బీమావివరాలుకూడా చూపుతున్న ప్రపంచం 
 o ఫర్ -  ఒకటి కాదు మరెన్నో వింతలు చూపె ప్రపంచం
o for - ఒళ్ళు గగుర్పాటు చెందే చిత్రాలు చూపె ప్రపంచం
k ఫర్ - కెవ్వు మని కేక పెట్టె అద్భుతాలు చూపె ప్రపంచం 

చివరిగా student గురించి  ముగిస్తా 
S  for - సుతి మెత్తగా సుత్తి కొట్టేవాడు 
t ఫర్ - తిని తిరుగుతూ ఉండే వాడు 
u for - ఉన్నది ఉన్నట్టుగా చెప్పు వాడు 
d for - దగా చేయలేని వాడు 
e for - ఇంట్లో మాట వినని వాడు 
n for - నటనలో ఆరి తేరినవాడు
t for - తపించుకొని తిరుగు వాడు 
  
అన్నయ్యగారు మీరుచెప్పినవి చాలా బాగున్నాయి, నవ్వు కొనే విధముగా   ఆలొచించెవిదముగా ఉన్నాయి, ఇవి నేను కెవలము ఎవ్వరిని ఉద్దేశించినవి కావు లక్షణాల బట్టి వివరించాను   ఈరొజుకు ఇవి చాలు రేపు మరలా కొన్ని ప్రశ్నలు అడిగుతాను అప్పుడు చెప్పండి, ఇదిగో కాఫీ త్రాగండి, అన్నయ్యగారు మీరు కలసి సూపర్ మార్కెట్ కు పోయి కొన్ని నిత్య అవసర వస్తువులు తీసుకు రండి , అప్పటి కాల్ వంట చేస్తాను,  సుభద్ర. 

అట్లాగే అని సంచి తీసుకొని  ప్రకశరావుగరు, మరియు రామకృష్ణ గారు మాట్లాడు కుంటూ ........... 
"  హృదయంలో ఉంటుంది విద్యుత్తు - పేరులో ఉంటుంది మహత్తు "
                                                                        ఇంకా ఉంది      



 

1 కామెంట్‌: