1, డిసెంబర్ 2014, సోమవారం

196. Daily spl. kavitalu -99 (చిరు దివ్వె వెలుగులు -2)

ఓం శ్రీ రామ్                                                    ఓం శ్రీ రామ్                                    ఓం శ్రీ రామ్
                                                                       

నా మనసుకు తోచినవి ఫోటోలను బట్టి ఒక నెలలో ( 11/2014) వ్రాసిన అంత్యాను ప్రాస కవితలు
మాతాసమం నాస్తి శరీరపోషణం!
చింతాసమం నాస్తి శరీరశోషణం!
భార్యాసమం నాస్తి శరీరతోషణం!
విద్యాసమం నాస్తి శరీరభూషణం!!

తల్లి వలె శరీరమును పోషించు వారెవ్వరూ ఉండరు.అట్లే శరీరమును శుష్కింపజేయుటలో చింతవంటి దింకొకటిన్నీ లేదు.శరీరమునకు సుఖసంతుష్టుల నొసగుటలో భార్యకు మరెవ్వరూ దీటు గాజాలరు.శరీరమునకు యింక ఏ అలంకారమున్నూ విద్యవంటి మేల్తొడవు కానేరదు.

శ్రీ మహా లక్ష్మి అమ్మ వారి బీజాక్షర మంత్రం

శ్రీ మహా లక్ష్మి అమ్మ వారి బీజాక్షర మంత్రం!

ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్!

రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః స్వాహా!

.
మహా లక్ష్మి కరుణా - రాగం మాధవ మనోహరి - తాళం ఆది , ముత్తుస్వామి దీక్షితార్!

పల్లవి
మహా లక్ష్మి కరుణా రస లహరి
మామవ మాధవ మనోహరి శ్రీ

అనుపల్లవి
మహా విష్ణు వక్ష స్థల వాసిని
మహా దేవ గురు గుహ విశ్వాసిని
(మధ్యమ కాల సాహిత్యమ్)
మహా పాప ప్రశమని మనోన్మని
మార జనని మంగళ ప్రదాయిని

చరణమ్
క్షీర సాగర సుతే వేద నుతే
క్షితీశాది మహితే శివ సహితే
భారతీ రతి శచీ పూజితే
భక్తి యుత మానస విరాజితే
(మధ్యమ కాల సాహిత్యమ్)
వారిజాసనాద్యమర వందితే
నారదాది ముని బృంద నందితే
నీరజాసనస్థే సుమనస్థే
సారస హస్తే సదా నమస్తే

 
1. చిరుదివ్వె వెలుగులు
చిగురు  టాకుల  చిగుర్లు  రెపరెపలు
చిన్నదాని సొగసు ఘుమ ఘుమలు
చిమ్మ చీకటిలొ చిరుదివ్వె వెలుగులు
నేనున్నానని అర్ధ చంద్రుని పకపకలు     

హద్దులు

అనుభవించే వయస్సు మార్పులు
ఆకర్షించే అందాల నయనాలు
అణువణువులో పొంగే  అందాలు
తేనెలొలికే అందాల సొగసులు

ఆవేశం వస్తే ఉండవు పగ్గాలు
ఆనందం వస్తే ఆగవు ఆలోచనలు
ఆరాటం పెరిగితే ఆగవు ఆధారాలు
ఆనందానికి ఉండవు హద్దులు 

కాల చక్రంలా మనస్సు పరుగులు
మనసుకు తగ్గ జోడి తోరికితే గుస గుసలు
ప్రకృతిలో కలిస్తే చిలిపి కోరికలు
సూర్యుడు చూస్తు ఉంటాడు ప్రేమికుల్ని 


2. ప్రకృతి
ప్రకృతిని బట్టి  ప్రవరిమ్చటం మానవుని  ధర్మం
మరువ  లేని అను  భవాలు చూసి నది బాల్యం
వర్ధమానంలో వెలుగు పంచుట అందరి  కర్తవ్యం
ఉషోదయ వెలుగులతో  అందరికి   శుభోదయం       

3. చందమామ
చందమామ  అందాలు  వికసించిన  పువ్వులాగున్నాయి 
రాత్రిళ్ళు  వెన్నెల  విరజిమ్మగా  సూర్యుడు లాగున్నాయి
మబ్బులు నందివర్ధన పువ్వులా తెల్లగా మెరుస్తున్నాయి
మనసుకు నచ్చిన దాని  నవ్వు నవరత్నాల్లాగున్నా యి

 4. గాన  గంధర్వ

             గాన  గంధర్వ సంగీత స్వర కర్తకు మా  సుస్వాగతం ,                         సర్వ భాషా సంగీత స్వర కర్తకునా అభినన్దనీయం  ,                       విశ్వ స్వవిఖ్యాత విశ్వేస్వరునకు నా  వందనం ,                  పురస్కారాన్ని అందుకున్న బాలసుబ్రమణ్యునకు నమస్కారం

5. దానం
అన్ని దానముల కన్నా  అమ్మ  పంచె క్షిరామృతం గొప్ప
అన్నిదానములలో హృదయామ్రుతము పంచెగుణం గొప్ప
భాధలో ఉన్నరోగస్తులను కన్న బిడ్డలా ఆదుకోవటం గొప్ప
తల్లి రక్తం పంచు కున్న బిడ్డకు అవయవదానం మరీగొప్ప 

                                       6. దేవాలయము                                                  దేవాలయమునకు  వెళ్ళేది   మనస్సాంతి కొరకు
మనం చేసిన తప్పులేమి   ఉన్న  ప్రక్షాళన కొరకు
అందరు సుఖ జీవితము  గడపాలని  ప్రార్ధన కొరకు

          తీర్ధప్రసాదాలు తీసుకొని భక్తులను కలియుట కొరకు           

7.రామాయణము
  మేమురామ దూతలము  మీరుచెప్పె రామాయణము వినాల  వున్నది
మీరుచెప్పేరామాయణమువింటుంటేఇంకాఇంకావినాలనిఉన్నాది                                                                         రామాయణము వింటుంటే మనసు  రామచంద్రున్ని   చూస్తున్నట్టున్నది
రామాయణము తరగనిది, చెరగనిది,  మారుతిహృదయంలో   ఉన్నది     


8.చిన్నారులు
చిన్నారులు   దేశ పురోగతికి  పునాదులు
ఎవరి  ఉహల  కందని అనురాగ  దేవతలు
ఆత్మీయులనుకలుపుకొనే ఆదర్శమూర్తులు  
ఏదడిగినా  చెప్పలేని  తల్లి  చాటు  బిడ్డలు  

9.శ్వేతవర్ణం

కీర్తనతొ  పాషాణ   హృదయాన్ని  కరిగించవచ్చు
స్వేతవర్ణముగా ఉన్న  మంచును కరగించవచ్చు
పాల మీగడను   పాల  నుండి  వేరు చేయవచ్చు
గుణాన్ని బట్టి మనిషి తెల్లదానాన్ని బయటపడవచ్చు


10.సత్యము
సత్యము పలుకుము,ధర్మము ననుష్ఠించుము.  స్వాధ్యాయము నేమరకుము.గురువునకు ప్రియమగునట్లు ధనమార్జించి యిచ్చిన పిమ్మట వంశము నిలుపుటకై సత్సంతానమును బడయుము.సత్యము నేమరకుము.ధర్మమార్గమునుండి వైదొలగుకుము;కుశలము నుండి,కల్యాణకర్మలనుండి,సమృద్ధినుండి,స్వాధ్యాయప్రవచనములనుండి ప్రమాదము నొందకుము.దేవ పితృకర్మలను విడువకుము. తల్లియే దైవము.తండ్రియే దైవము.ఆచార్యుడే దైవము.అతిథియే దైవము అని వర్తింపుము.అనింద్యకర్మ లేవిగలవో వానినే గావింపుము. నింద్య కర్మలను చేయకుము.మాయందు ఏవి సుకర్మములో అవియే నీకు ఉపాస్యములు.ఇతరములు నీకు వర్జ్యములు. సత్పురుషులు ఎవరు మనకు శ్రేయస్కాములో వారిని సుఖాసీనులను చేసి సేదదీర్చి వారి బోధనల సారమును గ్రహింపుము.వారికి శ్రద్ధతో నీయదగును.అశ్రద్ధతో నీయకుము.హెచ్చుగా నియ్యలేదను సిగ్గుతో నిమ్ము.భయపడుతూ ఇమ్ము. సంపదకు తగినట్లు ఇమ్ము.నీకు ధర్మకర్మ సంశయము కలిగినచో పిలువబడినవారిలో ధర్మాధర్మ నిర్ణయసమర్ధులు,ఆచార్య పురుషులు, కర్మ స్వతంత్రులు, పరమసౌమ్యులు, ధర్మకాములు అగు బ్రాహ్మణు లెట్లాచరించిరో ఆ సందర్భములలో అట్లే ఆచరించదగినది సుమా. ఇది నీకు ఆదేశము,ఉపదేశము, ఇదే వేదరహస్యము. ఈశ్వరానుశాసనము.దీనిని ఆచరింపుము. ఇదియే ఆచరణీయము. 


11.సమ్మేళనం
స్వర సంగీత సమ్మేళనం అందరికి ఆనందనిలయం
శారదా కృపా  కాటాక్షము అందరికి ఆనందపరవశం
శ్రీ గణపతిసచ్చిదానంద స్వరం మధురాతి మధురం
అందరికి ఒక్కటే మార్గం కలసి ఉంటే కలదు సుఖం      
                                            
12. నందనవనమ్
                    
పిల్లల  ఆరోగ్యానికి ఉత్చాహం కల్పించాలి
పెద్దల    ఆరోగ్యానికి   భరోసా  కల్పించాలి
పేదల  ఆరోగాన్ని గమనిస్తూ ఆదుకోవాలి
జీవితమె  నందనవనమని  గమనించాలి  

13. శ్రీ కారం
శ్రీ కారం చుట్టితే మనసు ఎప్పుడు శుభకరం
ఓంకారం జపిస్తే పోతుంది మనిషిలోని అహంకారం
మమకారం చూపితె మనిషికి ఏర్పడుతుంది మానవత్వం 
వ్యవహారం మనసుకు తట్టితే మనసు ఉంటుంది  అల్ల కల్లోలం 


14. వసంతాల పంట
నవ్వుల పాపకు నవవసంతాల పంట
మనస్సుకు చేరువలో అందరుఉంటారంట
అందరితో మమతల మల్లెలతో మాలనంట
అందరు కొంగ్రొత్త ఆశలతో జీవించాలంట   


15.వేణి
వేణి  కవితామృతం  ఆనంద  పరవశం
వయ్యారాల వేణి వలపుల రాణికి అందం 
సొగసుచూడ తరమా అని వేణి త్రిప్పే నమనోహారం
స్త్రీ  ఉల్లాసం,  జడమాలిక  కదలికలో ఉంది మకరందం 


   ఈ నెల 16-11-14  వ తారీఖున డాక్టర్ సి.యస్ రావ్ గారి
స్టాంప్ కవర్ విడుదల చేస్తున్నందుకు మా అందరి తరుఫున నివాళి
కేంద్ర  మంత్రులు దత్తాత్రేయగారు, వెంకయ్యనాయుడు
గారు రావటం ఒక డాక్టర్  గారిని మరల తలుచుకోవటం
గొప్ప విశేషం 

డాక్టర్ సి.యస్ రావ్ గారు చేసిన మంచి పనికి ఇది సత్కారం
అందరి హృదయాలలో ఉన్న వ్యక్తికి  చేస్తున్నారు పురస్కారం 
వారుచేసిన ఎనలేనికృషికి మా అందరి తరుఫున నమస్కారం 
ప్రభుత్వం వారు గుర్తించి స్టాంప్ విడుదల చేయటం ఆనందదాయకం 


16. మార్పు
ప్రతిఒక్కరు ఒక చెట్టు నాటితే నందన వనం గా  మారవచ్చు
ఒక నవ్వు ప్రతిఒక్కరిలొ ఒక స్నేహభావం పెంచవచ్చు
శ్రద్ధ తో చేసిన స్పర్స ప్రతి ఒక్కరి జీవితమ్లొ మార్పు రావచ్చు  
ఈ దేశం కోసం ప్రతిఒక్కరు స్నేహాన్ని పెంచుకుంటూ బ్రతకవచ్చు 


17.తెలుసుకుంటే చాలు
చీకటి తత్వాన్ని తొలగించటానికి ఒకే నేతి తీపమ్ వెలుగు చాలు
బాధల తత్వాన్ని ఒక చిరునవ్వుతో  అందరు  పలక రిస్తే  చాలు
ప్రతికూల  తత్వాన్ని   అందరు  ఒకే  దేవున్ని  ప్రార్ధన చేస్తే చాలు
ఉషోదయవెలుగులు ఇంట్లో ప్రవేశిస్తే అంతా శుభమ్ అనుకుంటేచాలు    

18. దీపోస్చవం
స్వర్గ  లోకాన్ని  మరిపించే  కార్తీక  దీపోస్చవం
ఆనంద పరవశంలో ఉంచిన చిన్నారుల నృత్యం
భక్తి టి.వి వారు ఏర్పాటు చేసిన దీప  మండపం
భారతదేశ సంస్కృతిని తెలిపిన వారికి వందనం  


19.గీత
ప్రపంచ  దేశాల వారు  మెచ్చుకున్నారు  భగవత్   గీత
ధర్మమను తెలుసుకోలేనివారు ఎప్పటికి అర్ధంగాదు గీత
సత్య ధర్మాన్ని వివరించే పండితుల భోధ కుడా  గీత
మూర్ఖుల మాటలకు చర్చించటం సభకు వస్తుంది రోత    


20.కాలభైరవుడు     

కాలభైరవాష్టకం పటంతి యై మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్ర పున్య  వర్ధనం
శోక మొహ దైన్య లోభ కోపతాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం దృవం    


21.మనుష్యులు
మనుష్యులు ఇది కష్టార్జితామని భవనం నిర్మిమ్చు కుంటారు
ప్రక్కనే ప్రభుత్వమువారు కళ్ళు దుకాణానికి  అనుమ తిస్తారు
కొన్తదూరములొ చెత్త కుప్ప, ప్రక్కనేబస్సుస్టేషన్ ఏర్పడుస్తారు
భవనం బాగున్నా ప్రక్కవారు బాగో లేక  పోతే ఎలా  జీవిస్తారు 


ప్రేమ,  ఆర్తి, ఆత్మీయత, ఆప్యాయత, సుసీల పాటలో కనబడుతుంది
సుసీల పాటలు వింటుంటే నిజంగా కష్టాలు, కన్నీళ్ళు, కానరావన్నది 
సుసీల మధురగానం వింటుంటే మనస్సు ప్రశాంతముగా మారుతుంది      
గానంతో మైమరిపించే సుసీలకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపాలని ఉన్నది  


22.(14-11-2014 ) నాడు  బాలల దినోత్చవం సందర్బముగా
బాల బాలిక   లందరికి ఇవే నా శుభాకాంక్షలు

అ చిరకాలంలో బాల  కార్మిక  వ్యవస్తను రూపు మాపాలి
సంపదన  కోసం పంపే  తల్లి తండ్రులలో మార్పు  రావాలి
తల్లితండ్రులే కన్నపిల్లలను ఉత్తమ పౌరులుగా  మార్చాలి 
ప్రభుత్వపు స్కూలల్లొ తెలుగు భాషను విధిగా భోదించాలి

బాల్యాన్ని బంగారు భవిషత్తుగా మార్చుటకు కృషి చేయాలి
పిల్లల భవిషత్తుకు  తల్లి తండ్రులే  మార్గదర్సకు    లవ్వాలి 
బాలకార్మికులను బడికి పంపించి చదువుల పండగ చేయాలి
బాలల దినోత్చవం సందర్బముగా పిల్ల లందరు ఎకంకావాలి
   

23.బాలల దినోత్చవం
ఈ ఉత్చవం, మన ఉత్చవం, అందుకే బాలల దినోత్చవం 
మొదటి ప్రధాన మంత్రి చాచ నెహ్రూజీ పుట్టినదినోత్చవం
భాగ్యనగర్లో ఏర్పాటు చేస్తారు అన్నిదేశాల బాలచిత్రోత్చవం
నవ భారత నిర్మాతలైన  బాలలు  జరుపు  కొనే ఉత్చవం 


24.బాలలకు శుభా కాంక్షలు

మీరు నిజాయితీ ట్రస్ట్ నడుపు  తుంటే,  మీరు  ట్రస్ట్  ఫలితాన్ని  పొందుతారు
మీరు మంచితనం స్నేహితులపై చూపిస్తె ,స్నేహితులు ఫలితాన్ని పొందుతారు
మీరు వినయంగాఅన్నిచోట్ల  ఉంటే, మీరు గొప్పతనాన్ని ఫలితాన్ని పొందుతారు
మీరు పిల్లలను చక్కగా పెంచితే, పిల్లలు వృద్దిలోకి రావటానికి కారకులవుతారు 


25.తల్లితండ్రులు
సూర్య  బింబంలా అనుక్షణం సత్యం వెలుగుతూ ఉండాలి
కడిగిన ముత్యం లా  ఎప్పుడు  నీతి    ప్రకాశిస్తూ ఉండాలి
చీకటి  రాత్రిలో మెరిసే వజ్రంలా న్యాయం మెరుస్తు ఉండాలి
తల్లితండ్రులు పిల్లలందర్ని సమానంగా ప్రేమతో పోషించాలి  


26. దంపతుల మద్య
దంపతుల మద్య పూల తీగ అల్లుకొన్న మానులా ఉండాలి వలపు
ఆత్మీయులతొ,  అనురాగమ్తో, అందరితో ఎప్పుడు ఉండాలి  తలపు
సాఫీగా జరిగిపోతున్న  జీవితమ్లొ ఇది ఒక తెలిసి  కోలేని మలుపు 
నిగ్రహించుకొని పరిష్కారంచేసుకోపోతే కుటుంబలోవస్తుంది కుదుపు        27.  యవ్వనం
బాల్యానికి యవ్వనం ఒక రంగుల కలవ రింత
యవ్వనానికి బాల్యం ఓ గడచి పోయిన వింత 
యవ్వనంలో కలవరిస్తూ కలలుకంటారు అంత
సంబరంలో కలుస్తారు యువతీ యువకులంత 


28. కోవెల
మనసు మత్తెక్కించే మమతల కోవెల
ఊహల కందని మనోహర  మైన  లీల
వచ్చిన వారు పొందారు ఆనంద హెల
అందుకే అక్కడఉంటుంది ఫోటోలగోల


29.సలహా

కార్యకర్తలు ఉత్తేజ పరిచే విధముగా తెలుగుదేశం ముందుకు రావాలి
తెలంగాణాలో తెలుగుదేశం పార్టి ప్రజలకు భాధలను తొలగించాలి   
సర్వే అని, పెన్షన్ కార్డుస్ అని, ప్రజల్లో కలిగే భయందోలననువినాలి
తెలుగు  దేశం పార్టి బలం పెంచు కోవటానికి సర్వం కృషి చేయాలి    
 

30.నా రూపు
నా రూపు  సుందర స్వరూపం
నా పెదవులు  మధురామృతం
నా పొందు స్వర్గ  సుఖమయం
నా ఆనందమే నీకుతృప్తిమయం   


నా మాట కాదన్నావో నీకు ఎప్పుడు చాపే గతి
నా మాట అవునన్న వో  సీకు సుఖమైన రతి
నీ మాట కాదనను,  నిన్ను  మరువను  సతి
నిన్ను సుఖపెట్టి సు ఖ ప డు ట మే నా మతి  


31.నూరుగురువారు
లో లోపల విషం తో ఉండి  పైన తేన పలుకులు పలికేవారు
మేకలను, జింకలను పోషించేవారు, ఆకలికి నరకమనేవారు
నీరు అడిగిగితే నెత్తురు తీసుకొని  నీరు అందరికి ఇచ్చేవారు
రాజ్యాదికారము కొరకు ప్రయత్నముచేసిన నూరుగురువారు 


32.అందం
ఇల్లు అందం, ఇల్లాలు అందం, ఇల్లలు  వడిలో ఉన్న హంసలు అందం
గాజు గిన్నె అందం, గిన్నెలో విచ్చుకున్నా పూలు చిమ్మెను మకరందం
పూలమకరందం కోసం తిరిగే తుమ్మెదలు జుమ్కారం మరి మరీ అందం
నింగిఅందం,నెలఅందం, పిల్లల నవ్వులందం,ఉదయ భానుడు మరీ అందం   


33.హోరు
సముద్రాల తరంగాల హోరు,  మానవుల మమతల జోరు
సంగీత సప్త స్వరాల హోరు , మనస్సుకు ఉల్లాసాల  జోరు
మధురాతి  స్ర్ముతుల హోరు, ఆనంద      పరవంతో  జోరు
గాజులో ప్రతిబింబాల  హోరు, గాజు నవరత్నరంగుల జోరు


34.బహుమతి
సంగీత స్వరాల మధ్య నయన మనోహర నృతం
నవ  బాలికల ఆనంద  పారవశ్య    అభినయం
ప్రేక్షకులు కరతల  ధ్వనులతో చేసే  పోస్చాహం  
ప్రోసచ్చాహ కమిటి  చేసే బహుమతి  ప్రధానం 


35.జీవిస్తావు
ప్రకృతిని చూసి ఆనందిమ్చాలే తప్ప,  నీ  ఇష్టం వచ్చినట్లు మార్చ లేవు
స్నేహితుడు అవసరానికి ఆడుకోనేవాడే తప్ప, ఎప్పుడు నీవు అడగ లేవు
ప్రేమ అనేది హ్రుదయం లోంచి వచ్చేదే తప్ప, కాసులుకు అమ్మడు పోవు
మానవులగా  ప్రకృతి సహకరించి, ప్రేమ, స్నేహాన్ని గౌరవిస్తేనే  జీవిస్తావు   


36.సముద్రం
సముద్ర   కెరటాలు  గట్టు  దాటాలని  ప్రయత్నం  మానవు
తనలొఉన్న కలేబరాలన్ని బయటకు నేడితె  గాని నిద్రపోవు
నదులు, కాలవలు నుండివచ్చే నీటిని నీలొకలుపు కుంటావు
నీలొ అగ్ని పుట్టి తుఫాన్ గా మారినా మంచినీల్లగా పనికిరావు


37.అందాలు
ప్రక్రుతి  అందాలు  నీలొ కని   పిస్తూ ఉన్నాయి
వయస్సుకు తగ్గ అందాలు పెరుగు తున్నా యి
కుందేలు చెవుల్లా కురులు అందమొస్తున్నా యి
తెల్లని వస్త్రము ఆడతనానికి వన్నె తెస్తున్నాయి 



38.రూపం
చిరు నవ్వుల చిన్మయ చిన్న రూపం
చిరుదివ్వె వెలుగుతో చీకటి  మాయం 
ఇప్పుడు కష్టాలు జయించటం ఖాయం
చిరునవ్వే కష్టాల కడతేర్చే  ఆయుధం  


39.గోమాత
గోమాతను పూజిస్తామని సంకల్పం
గో మాత ముఖం  పై  దివ్య   తేజం
ముఖ వర్చస్సు అంతా బ్రహ్మతేజం
ప్రదక్షణలు చేస్తే కలుగును మోక్షం
                                  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి