23, నవంబర్ 2014, ఆదివారం

195.Family love story 98-ప్రేమ ఎవరిపై ఉండాలి ?-5

 ఓం రామ్                                           ఓం రామ్                                         ఓం రామ్
                                                         
      

అన్నయగారు యక్ష ప్రశ్నలు గురించి నాకు తెలుపగలరా? అని అడిగింది సుభద్ర , కొత్తగా వచ్చిన స్నేహితుడైన రామకృష్ణతో నాకు గుర్తున్నవి తెలిసినవి తెలియపరుస్తాను 

ఇదిగో వాడిని నీవు యక్ష ప్రశ్నలు వేసి వేదిమ్చకు 
నేను ఎందుకు వేదిస్తానండి , ఆయన కవి కదా ఏదో కొంత తెలుసు కదా అందుకనే అడిగాను 
జ్యోతిర్లింగాలను  తలచుకొని మీరడి గిన ప్రశ్నకు ఆ శివ స్వరూపము నాలో పలికించిన పదాలను అక్షరూపంలో ఇందు  ఉదహరిస్తాను
సోమవారం శివదర్శనం సర్వ పాప హరణం ...
 

ఓం సౌరాష్ర్టే సోమ నాథం చ శ్రీ శైలే మల్లిఖార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళ మోంకార మమరేశ్వరమ్
ప్రజ్జ్వల్యాం వైద్యనాధం చ ఢాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే
వారాణస్యాంతు విశ్వేశం త్య్రంబకం గౌతీమీ తటే
హిమాలయేతు కేదారం ఘృశ్మేశంచ విశాలకే
ఏతాని జ్యోతిర్లింగాని సాయంప్రాతః పఠేన్నర
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి..


వ్యక్తిగతంగా ఎదగటానికి 10 సూత్రములుఅందరు గమనించండి
1.అందరినీ మనసుతో స్వీకరించండి
2.నిరాశావాదులకు,మోసకారులకు దూరంగా ఉండండి
3.మీపై మీరూ నమ్మకంతో ఉండండి
4.'అవును/కాదు' అని చెప్పేందుకు భయపడకూడదు
5.మీ కలను సాధించేంతవరకు వదలకూడదు
6.మీ గురించి మీరూ తక్కువ చేసుకోకండి
7.ఏమి చెప్పాలనుకున్నా సూటిగా చెప్పండి
8.ఏదైనా మీ మనసుకు తప్పు అనిపిస్తే అది చెయ్యకండి
9.మీ మనసును గట్టిగా నమ్మండి
10.నలుగురిలో మిమ్మల్ని మీరూ తక్కువ చేసుకోకండి
 

యక్ష ప్రశ్నలు

మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తర ఆరణి లేడికొమ్ములలో యిరుకుకొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నల్గురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడీ మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదౄష్యవాణి పలికినది ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆదీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకనే నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు క్రింది విధంగా ఉన్నాయి.
నాకు దొరకినవి తెలిసినవి ఇందు పొందు పరిచాను
   
1.సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు?
   బ్రహ్మం

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు?
   దేవతలు

3.సూర్యుని అస్తమింపచేయునది ఏది?
   ధర్మం

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు?
   సత్యం

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును?
     వేదం

6. దేనివలన మహత్తును పొందును?
   తపస్సు

7. మానవునికి సహయపడునది ఏది?
    ధైర్యం

8.మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును?
  పెద్దలను సేవించుటవలన

9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?
    అధ్యయనము వలన

10 మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి?
     తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును.

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
      మౄత్యు భయమువలన

12. జీవన్మౄతుడెవరు?
     దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు

13. భూమికంటె భారమైనది ఏది?
      జనని

14. ఆకాశంకంటే పొడవైనది ఏది?
      తండ్రి

15 గాలికంటె వేగమైనది ఏది?
     మనస్సు

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది?
      ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ
      మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది

17. తౄణం కంటె దట్టమైనది ఏది?
      చింత

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది?
      చేప

19.రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?
     అస్త్రవిద్యచే

20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
      యజ్ణ్జం చేయుటవలన

21. జన్మించియు ప్రాణంలేనిది
      గుడ్డు

22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది?
      రాయి

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది?
      శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన

24.ఎల్లప్పుడూ వేగం గలదేది?
     నది

25. రైతుకు ఏది ముఖ్యం?
     వాన

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు?
      సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు

   
27. ధర్మానికి ఆధారమేది?
      దయ దాక్షిణ్యం

28. కీర్తికి ఆశ్రయమేది?
      దానం

29. దేవలోకానికి దారి ఏది?
      సత్యం

30. సుఖానికి ఆధారం ఏది?
      శీలం

31. మనిషికి దైవిక బంధువులెవరు?
      భార్య/భర్త

32.మనిషికి ఆత్మ ఎవరు?
     కూమారుడు

33. మానవునకు జీవనాధారమేది?
      మేఘం

34. మనిషికి దేనివల్ల సంతసించును?
    దానం

35. లాభాల్లో గొప్పది ఏది?
      ఆరోగ్యం
 యక్షుడి ప్రశ్నలకు ధర్మరాజు సమాధానాలు తెలియ పరచగా  యక్షుడు ధర్మరాజుతో చనిపోయిన నీతమ్ములలొ ఎవరిని బ్రతికించ మంటావు అని అడిగాడు, పినతల్లి మాద్రి కొడుకైన నకులిడి  ప్రాణాలు కొరుకున్నాడు. నీ ధర్మ నిరతిని మెచ్చుకొని అందరిని నేను బ్రతికిస్తున్నాను, నీకు ఒక వరము కుడా ఇస్తున్నాను అజ్ఞాత వాసములో మిమ్ములను ఎవ్వరు గుర్తు పట్టకుండా మీకు వరమిస్తున్నాను అని అన్నాడు యక్షుడు. 
ధర్మ రాజు ధర్మం గురించి తెలియా పరిచాడు 
"మమ  ప్రతిజ్ఞాం చ నిబోధ సత్యా0, వృణే ధర్మమృతాజ్జీవితాచ్చ!
రాజ్యం చ పుత్రాశ్చ యశో ధనం చ సర్వం న సత్యస్య కలాముపైతి!!"  

ప్రతిజ్ఞ సత్య మైనదని  తెలుసుకో! అమృతం కంటే, జీవితం కంటే  ధర్మాన్నే నేను అధికంగా కోరుకుంటాను.   రాజ్యం గాని, పుత్రులు గాని, యశస్సు గాని, నం గాని సత్యంలో పదహారోవంతుకు కూడా  సరితూగవని స్పష్టం చెశాడు.అందుకే  ఆ ధర్మాత్ముడు ధన్యాత్ముడయ్యాడు  

                                ఇంకా ఉంది  

1 కామెంట్‌: