10, నవంబర్ 2014, సోమవారం

Pranjali Prabha- Divotional Story (Sri Siva Panchaaksharii strotram)

ఓం శ్రీ రాం             ఓం శ్రీ రాం       ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ
 
                                                          
పంచాక్షరి మంత్రం : 'ఓం నమఃశివాయ'
                                      1.

           నాగేంద్రహారాయ త్రిలోచనాయ                       భస్మాంగరాగాయ మహేశ్వరాయ          
   నిత్యాయశుద్ధాయదిగంబరాయ   
     తస్మై 'న' కారాయ నమఃశ్శివాయ
                                                                                                              
సర్ప రాజములు హారములుగా గలవాడును 
మూడునెత్రములు గలవాడును, మహాప్రభువును 
విభూతిని శరీరము నందు పూసికొనిన వాడును
 శాశ్వతమైన వాడును, పరిశుద్ధుడును, దిక్కులే వస్త్రములు కలవాడును 
సాకార రూపుడును అగు ఆ శివునకు నమస్కారము
     
 2              
                మందాకినీసలిలచందనచర్చితాయ                             నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ
            మందారముఖ్యబహుపుష్పసుపూజితాయ                 తస్మై 'మ' కారాయ నమఃశ్శివాయ

ఆకాశగంగా జలమనెడి  మంచి గంధముచే పూయ వాడును
నన్దీశ్వరుడు మున్నగు ప్రమధగణాలకు  నాధుడును
మందారపుష్పము మున్నగు అనేక పుష్పములచే పూజిమ్పబడినవాడును
మకార రూపముతొ నొప్పు  నమస్కారము

3.

   శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ
 దక్షాధ్వరనాశకాయ
   శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ                         తస్మై 'శి' కారాయ నమఃశ్శివాయ


  మంగళ రూపుదును, పార్వతి యొక్క ముఖమనేడి  పద్మ సముదాయమునకు 
సూర్యునివలె వికస  హేతుఫైన వాడును
దక్షప్రజాపతి యొక్క యాగమును ధ్వంసము చేసిన  వాడును
గరళముచె నల్లనగు కన్థము గలవాడును 
 వృషభము ధ్వజముగా (వాహనముగ) గలవాడును
శికారరూపడును నగు ఆ శివునకు నమస్కారము

                                   4. 

        వశిష్ట కుంభోద్భవ గౌతమాయ                              మునీంద్ర దేవార్చిత శేఖరాయ
           చంద్రార్క వైశ్వానర లోచనాయ                     తస్మై 'వ' కారాయ నమఃశ్శివాయ


వసిష్టుడు అగస్యుడు గౌతముడు మున్నగు మునీశ్వరుల చేతను 
దేవతలా చేతను వూజింపబడిన శిరస్సు కలవాడును 
చంద్రుడు, సూర్యుడు  నెత్రములుగా కలవాడును 
 రూపుడు అగు ఆ శివునకు నమస్కరము.
5.        
       
                           యక్షస్వరూపాయజటాధరాయ                           పినాకహస్తాయ సనాతనాయ
           దివ్యాయ దేవాయ దిగంబరాయ                      తస్మై 'య' కారాయ నమఃశ్శివా

యక్షస్వరూపుడును, జడలను ధరించిన వాడును
పినాక మను ధనుస్సు హస్తము నందు కలవాడును 
పరమ ప్రాచీనుడును, దివ్యరూపుడును,ప్రకాశమానుడును
 దిక్కులు వస్త్రముగా కలవాడును, యకార రూపుడును 
అగు ఆ పరమ శివునకు నమస్కారము  

శివ పంచాక్షరీ  స్త్రోత్రము సన్పూ ర్ణ ము


పంచాక్షరిం మీదం పుణ్యం య పఠే శివ సన్నిధౌ
శివ లోక మహోభ్నోతి శివేన సహ మోధతే !!!
 శివ భక్తులకు,  శివ పంచాక్షరీ  స్త్రోత్రమును  సహకరించిన ప్రతిఒక్కరికి ఆ దేవదేవుని కృపా కటాక్షములు కలగాలని ప్రార్దిమ్చుతున్నాను 

                                                                        పంచాక్షరి మంత్రం :  'ఓం నమఃశివాయ'

నాగేంద్రహారాయ త్రిలోచనాయ, భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, తస్మై 'న' కారాయ నమఃశివాయ
మందాకినీ సలిల చందనచర్చితాయ, నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ
మందారపుష్ప బహుపుష్ప సుపూజితాయ, తస్మై 'మ' కారాయ నమఃశివాయ
శివాయ గౌరీ వదనారవింద, సూర్యాయ దక్షాధ్వరనాశకాయ
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ, తస్మై 'శి' కారాయ నమఃశివాయ
వశిష్ట కుంభోద్భవ గౌతమాయ, మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ, తస్మై 'వ' కారాయ నమఃశివాయ
యక్షస్వరూపాయ జటాధరాయ, పినాకహస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ, తస్మై 'య' కారాయ నమఃశివయ

        పంచాక్షరిం మీదం పుణ్యం య పఠే శివ సన్నిధౌ
        శివ లోక మహోభ్నోతి శివేన సహ మోధతే !!!

వేదాలలో యజుర్వేదం గొప్పది. యజుర్వేదంలో నాలుగవ కాండలో ఉన్న రుద్రం ఇంకా గొప్పది. రుద్రం మధ్యలో ఉన్న పంచాక్షరి అంతకంటే గొప్పది. పంచాక్షరిలో గల “శివ” అనే రెండు అక్షరాలూ మరీ మరీ గొప్పవి. 

'నమఃశివాయ'అనేది స్థూల పంచాక్షరి అనీ ... 'శివాయ నమః' అనేది సూక్ష్మ పంచాక్షరిగా శాస్త్రం పేర్కొంటోంది. 'ఓం నమఃశివాయ' అనే ఈ పంచాక్షరి మంత్రం మహా శక్తిమంతమైనది. ఇది ఆపదలో అభయాన్నిస్తుంది ... కష్టాల్లో కరుణిస్తుంది ... మనస్పూర్తిగా స్మరించిన వారి కోసం కాలాన్ని సైతం ఎదిరిస్తుంది. ఈ మం త్రంలోని పంచ అనగా అయిదు అక్షరాలు న మ శి వా య (ఓం నమశ్శివాయ) నిరంతరం భక్తితో పఠిస్తే శివసాయుజ్యం ప్రాప్తిస్తుంది. పంచాక్షరి అనేది పంచభూతముల కారణంగా ఏర్పడిన ఈ సకల చరాచర సృష్టిని సూచిస్తుంది. అంతే కాకుండా 'సృష్టి' ... 'స్థితి' ... 'లయము' ... 'తిరోధానం' ... 'అనుగ్రహం' అనే పంచకృత్యములను ఇది తెలియజేస్తుంది. 

“ ఆ పరమేశ్వరుని భక్తీ శ్రద్ధ లతో సేవించి తరిద్దాం. “
వేదాలలో యజుర్వేదం గొప్పది. యజుర్వేదంలో నాలుగవ కాండలో ఉన్న రుద్రం ఇంకా గొప్పదరుద్రం మధ్యలో ఉన్న పంచాక్షరి అంతకంటే గొప్పది. పంచాక్షరిలో గల “శివ” అనే రెండు అక్షరాలూ మరీ మరీ గొప్పవి.
'నమఃశివాయ'అనేది స్థూల పంచాక్షరి అనీ ... 'శివాయ నమః' అనేది సూక్ష్మ పంచాక్షరిగా శాస్త్రం పేర్కొంటోంది.            'ఓం నమఃశివాయ' అనే ఈ పంచాక్షరి మంత్రం మహా శక్తిమంతమైనది. ఇది ఆపదలో అభయాన్నిస్తుంది ... కష్టాల్లో కరుణిస్తుంది ... మనస్పూర్తిగా స్మరించిన వారి కోసం కాలాన్ని సైతం ఎదిరిస్తుంది. ఈ మం త్రంలోని పంచ అనగా అయిదు అక్షరాలు న మ శి వా య (ఓం నమశ్శివాయ) నిరంతరం భక్తితో పఠిస్తే శివసాయుజ్యం ప్రాప్తిస్తుంది. పంచాక్షరి అనేది పంచభూతముల కారణంగా ఏర్పడిన ఈ సకల చరాచర సృష్టిని సూచిస్తుంది. అంతే కాకుండా 'సృష్టి' ... 'స్థితి' ... 'లయము' ... 'తిరోధానం' ... 'అనుగ్రహం' అనే పంచకృత్యములను ఇది తెలియజేస్తుంది.

“ ఆ పరమేశ్వరుని భక్తీ శ్రద్ధ లతో సేవించి తరిద్దాం. “
                                                                          

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి