17, నవంబర్ 2014, సోమవారం

191. Family love story -94 (ప్రేమ ఎవరిపై ఉండాలి ?-1)

                           ఓం శ్రీ రాం                              ఓం శ్రీ రాం                   ఓం శ్రీ రాం                                      
                                                                      ఏమిటమ్మా  అలా ఆలోచిస్తున్నావు, దిగులుగా ఉన్నావు, నాగురించా అన్నాడు కన్న కొడుకు కరుణాకర్, నీ గురించి ఆలోచించటానికి ఏముంది, మరి నాన్న గురించా అట్లా వున్నావు,    నీవు పరద్యానముగా ఉంటె నాకు సంతోషముగా ఉండదమ్మ, నీవు ఆరొగ్యముగా ఉంటే కుటుంబమంతా  ఆరోగ్యముగా ఉంటుందని ఎక్కడో చదివానమ్మ, నీవు చెల్లెళ్ళ గురించి కాని, నాగురించి కాని, నాన్న గురించి కాని ఆలోచించ ఆవసరము  లేదు. కాలమే మన ఆర్ధిక పరిస్తితులను సక్రమముగా మారుస్తుంది.


అదికాదమ్మ చెల్లెళ్ళ పెళ్లి చేయకుండా నేను ప్రేమించి  పెళ్లి చేసుకున్నాను, అదే కదమ్మ నేను చేసిన తప్పు, నాప్రేమ నన్ను ఇల్లరికపు అల్లుడుగా మార్చింది. నా భార్య ఉద్యోగము చేస్తుందని భావించా, పెళ్ళికి ముందు చాలా వాగ్దానాలు చేసింది, పెల్లయిన తర్వాత ఉద్యోగము చేయనంది, నాకు బాబు కుడా పుట్టాడు నీకు తెలుసుకదమ్మ, నాకు ఖర్చులు పెరిగాయమ్మ, మావగారు అత్తగారు ఇంట్లోనే ఉంటారు, ఏదో కొద్దిగా ఆస్తి ఉన్నది, నాభార్య ఒక్కతె  కూతురు అందుకే వప్పుకున్నాను, మీకు ఏమి సహాయము చేయలేక పొయ్యాను, కుడితిలో పడ్డ ఎలికలా ఉన్నది అక్కడ నా పరిస్తితి.

చూడు బాబు పిల్లల సంపాదనపై ఎప్పుడు  ఆధార పడలేదుమేము.  ఇప్పుడు నీవు భాద పడ నవసరము లేదు, మీ నాన్నగారు ఇంకా కష్ట పడుతున్నారు మీ నాన్న గారి ఆరోగ్యం గురించే కొంచము భాధగా ఉన్నది. నాన్న గారికి ఎమయినదమ్మ   షుగర్ పెరిగింది, బి.పి. తగ్గింది డాక్టర్ మందులు వాడమన్నారు అవి కొనుక్కొని వస్తానని వెళ్ళారు అందకే ఎదురు చూస్తున్నాను.


లోపలకు అడుగు పెడుతూనె ప్రకాశరావు  కుమారా రత్నాన్ని లోపలకు ఎందుకు  రానిచ్చావు,  వాడు చేసిన పనికి నేను తల ఎత్తి తిరుగలేక పోతున్నాను,  ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంట్లోనుంచి వెళ్లిపోయి ఎ మొఖం పెట్టుకొని వచ్చాడే, చిన్నప్పుడు గుండెలమీద తన్నితే ఏంతో  హాయిగా ఉండేది, ఇప్పుడు గుండే నేప్పి తెప్పిస్తున్నాడు, నేను అబ్బాయిని బీ. టెక్, ఎం.  బి.  యె. చదివించాను,  దూరంగా ఉంటె ఎ భాద ఉండేదికాదు, దగ్గరగా ఉంటె  ఎక్కిరించినట్లు ఉన్నది      సుభద్ర ఈ రోజు రాత్రికి ఇంట్లో వంట వడ్డొద్దు,  హోటల్కు వెళ్లి భోంచేసి అలా ఒక సినమా చూసి వచ్చెద్దాము, అప్పుడే రెండో కూతురు కమల లోపలకు వస్తూ నాన్న హోటల్ అంటున్నాడు ఏమిటమ్మ, ఎవీవో మాట్లాడుతున్నారు, నన్ను ఆట పట్టించటానికి అట్లా అంటున్నారు, పెళ్ళైన ఈ ఇరవై ఎనిమిదేళ్ళకు, ఒక్క సినమా, మంచి హోటల్కు తీసికెల్లిన పాపానికి పోలేదు మీ నాన్న .   ఎప్పుడన్నా పోదామంటే  పిల్లల చదువు, పిల్లల్లు సంతోషము ఉంటె మనము సంతోషముగా ఉన్నట్లే కదా అని నన్ను ఊరడించే వారు.
అమ్మాయి పెళ్లి  ఎప్పుడండి, చెపుతా కూర్చొ, కమల నీకూడ కూర్చొ  ఈనెల 15వ తారీఖున లగ్నం నిర్ణయింమ్చారుబ్రాహ్మణులు, 5  వతారీఖు ఎంగేజ్మేంట్ తాజ్ మహల్ హోటల్లో ఏర్పాటు చేసాను, మనము ఏమి కష్ట పడ నక్కర లేదు ప్లేట్ పద్దతిలో అన్ని మాట్లాడినాను, కొద్దిగా బంగారము బట్టలు కొనుక్కోవటం మీ పని అట్లాగేనండి అన్నది సుభద్ర, అట్లాగేనాన్న అన్నది కమల.