ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్
ప్రేమ ఎవరిపై ఉండాలి ?-4
నేను కూడా పుస్తకాల షాపుకు వెళ్లి కాసేపు కూర్చొని వస్తాను.
రాత్రికి ఇంటికి చేరారు ఇద్దరు స్నేహితులు, మాటలతో ఒకరికొకరు అర్ధం చేసుకున్నారు
అన్నయ గారు నాకు కొన్ని ప్రశ్నలకు సమాధానము చెపుతారా, నాకు తలుస్తే చెపుతాను అన్నడు రామకృష్ణ
1.ఈ మద్య కాలంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకో చెప్పగలరా కవితా దృష్టితో?
మనుష్యులు (రైతులు ) చనిపోవటానికి ఒక కారణమని చెప్పటం కష్టం, అనేక కారణాలు ఉండవచ్చు
ప్రభుత్వము
వారు పొలమునకు అప్పు ఇస్తున్నారు కదా అని డబ్బు తీసుకుంటున్నారు,
తీర్చగలమని నమ్మకముతో తీసుకుంటున్నారు, ఒక సంవస్చరం పంట పండక పోయిన, మరల
దున్ని కొండంత ఆశతో పంట పండుతుందని పంట వేస్తాడు, వర్షములు పడక పోయిన,
కరంటు లేక పోయిన, మన అదృష్టం లేక పోయిన రైతులలో నిరుస్చాహము కలుగు
తున్నది. తన కష్టాలు వేరొకరి చెప్పుకుంటే కష్టాలు తీర్చెవారా ఆర్చేవారా అని
భావించి కుటుంబ సమేతముగా పురుగులు మందు త్రాగి మరణిస్తున్నారు,
దయ
చేసి రైతులారా మీరు ఎవరు చావకండి, కష్టాలు వచ్చి నన్తమాత్రమునా చావే కారణమని
భావించకండి, ఆదికవి వ్రాసిన సుందరా కాండలో తెలియ పరిచారు కష్టాలు వచ్చినంత
మాత్రమున చావకూడదు, ఓపిక వహించి ఉన్నట్లయితే ఖచ్చితముగా కష్టాలు తొలగి
పోతాయని తెలియ పరిచారు, కొత్త ప్రభుత్వమును ఎన్నుకుంటే బాకీలు మాఫీ
చేస్తారని నమ్ము కోవటం కూడా తప్పే, మన మనసును నమ్ముకోవాలి, కొండంత అండగా
ఉన్న కుటుంబాన్ని నమ్ముకోవాలి , ప్రక్క వాడి పంట పండినదని, నా పంట పండలేదని
అని భాద మనసుకు రాకూడదు .
దయచేసి ఎవ్వరు ఆత్మ చేసుకోకండి,
జీవించటానికి ప్రయత్నించండి, అప్పులు తీర్చలేదని భాద పడకండి, పంటను
మారుస్తూ, సరిఐన సమయానా ఎరువులు వాడుతూ , నీరు అన్దిస్తూ, కలుపు మొక్కలు
పీకుతు జీవితమ్ గడప గలరని ఇందు మూలముగా ఒక వక్తిగా, రచయతగా తెలియ
పరుస్తున్నాను..
అందరు గుర్తుంచుకోవాలి
మహోన్నత వ్యక్తిత్వానికి కారణం వినయమే
మానసిక అభ్యుదయానికి కారణం మనసే
సహచరులు సహకారానికి కారణం వినమ్రతే
అందరు సమాన మవటానికి కారణం మానవత్వమే
కర్షకులారా నిగ్రహిమ్చుకోండి, బ్రతికి బ్రతికించటానికి ప్రయత్నించండి
లక్ష్యం కోసం ఎప్పుడు తాపత్రయ పడతా వోయి
మండు టెండలో పొలంలో చమట చిమ్ముతావోయి
ఎవరే మన్నా నీవు పొలం పని చేసే తాపసి వోయి
నలుగురి కోసం పొలంలో కష్ట పడే కర్షకుడ వోయి
భూమాతను ప్రార్ధింమ్చి దున్నే రైతువోయి
పొలంలో ఉంటె పనికి బానిస వోయి
బయట ఉంటె అందరికి రక్షకుడ వోయి
కంటికి, చేతికి, వంటికి విశ్రాంతి లేదోయి
విత్తనాలు నాటి వరుని దేవునికోసం వేచి ఉంటా వోయి
చిన్న గాయానికి మట్టి కప్పి మట్టిలో బ్రతుకుతా వోయి
పంట పండేదాక కుటుంబానికి కంటి నిండా నిద్రలేదోయి
పవిత్ర హృదయాన్ని పొలానికి అంకిత పరుస్తా వోయి
ఎ జంతువు రాకుండా పొలానికి కాపలాగా ఉంటా వోయి
పొలానికి పురుగు పట్టకుండా మందులు కొడతా వోయి
మంచపై ఉండి అరుస్తూ పక్షులను తరుముతా వోయి
పంట ఇంటికి చేరితే ఆనందానికి అవధులు లే వోయి
బ్యాంకు అప్పు తీర లేదని భాద పడ కోయి
పంట పండలేదని ఆత్మహత్య చేసుకో కోయి
భార్యపిల్లల బ్రతుకుకోసం నీవు బ్రతకాలోయి
అందరికి ఆకలి తీర్చె అన్నదాతవు నీవెనొయి
కన్నీరు కల కాలం కల్లల్లో ఉండ లేవోయి
కనికరం చూపెవారు లేరను అను కోకోయి
ఈ కలి యుగంలో మానవత్వం ఉన్నదోయి
ఆశకు పోయి నమ్మి అభాసుపాలు కాకోయి
"
నీ జాతివారాలు రాజులై యుండియు కనజాలరైరి నీకష్టమెల్ల
నీ కొలమందు జన్మించిన యా జమిందారులు గనరు నీ తపమెల్ల
నీ శాఖలో ధన నిలయులౌ కొందరు పరికింప లేరు నీ భాధలెల్ల
నీ తెగలో విద్య నేర్చిన బియ్యేలు లిఖించరైరి నీ లెములెల్ల
గీ !! న్యాయ వాదులు నీవార లడుగ రైరి
న్యాయ మూర్తులు నీవార లరయరైరి
ఇంక పెరవారి ముచ్చట లెందుకయ్య
కర్షకా! నీదు కష్టముల్ గాంతురెవారు ?
రైతు కులానికి చెందిన వారు పెద్ద పెద్ద జమిందారులుగా ఉంటారు రైతాంగం ఇబ్బందుల్ని వారు సరిగణనలోకి తీసుకోని వారైనారు
రైతాంగం లో ధనికులైన వారున్నారు, సాటి రైతుని ఆదుకో లెకున్నారు
రైతుకుటుంబములో బాగుగా చదువుకున్న వారున్నారు,పట్టించుకోరు
నీ వారైన న్యాయవాదులు అడుగరు
నీ వారైన న్యాయ మూర్తులు తెలుసు కోరు
ఆయినవాల్లె ఇలా ఉంటె పరాయి వాల్లెల ఉంటారు
మరి రైతు కష్టం పట్టిమ్చుకొనేవారెవరు " ప్రభుత్వమా ప్రజలా"
అలనాటి
"గోలకొండ కవుల సంచిక" లో కర్షకా అన్న శీర్షికన ప్రచురితమైన పద్యాన్ని
గుర్తుకు వచ్చి ఇందు పొందు పరుస్తున్నాను, దీనిని రచించినది గంగుల సాయి
రెడ్డి, జీడి కల్లు గ్రామం, నల్గొండ జిల్లా.
మానవజాతి మనుగడకు జీవమ్
పోసే రైతు అకాల మరణాలు ఎ ప్రమాణాల తొనూ క్షంతవ్యం కాదు, కర్షకుని చెమట
బిందువులకు కన్నీటి చుక్కలు తోడై నిరంతరం మట్టిని తడుపుతూ ఉండటం ఎ జాతికి
శ్రేయస్కరం కాదు "
మీరు రైతుల చాలా చెప్పారు చివరగా మీ సందేసమేమిటి అని అడిగింది ప్రకాశరావు గారి భార్య సుభద్ర
ఏమిటో మీరు అడిగినదానికి నాకు తెలిసినవి తెలియ పరుచు తున్నాను.
ప్రకృతి ననుసరించి కష్టాన్ని నమ్ముకొని రైతుగా జీవించడం
రైతు పొలంకు మందు కొట్టి, కలుపు మెక్కలు ఏరివేయటం
రైతు విధిగా దున్ని నీరు పెట్టి,కాపు కాస్తే పంట పండటం ఖాయం
రైతుకు అప్పులుతీరి, కష్టాలుపోయి సుఖాలురావటం ఖాయం
2. కుదరనివి ఏవి ?
పట్టు పరుపులున్న , ఆకలి తీరక పొతే ఎప్పటికి నిద్ర రాదు
ఎన్ని పుస్తకాలున్న, మనసు పెట్టి చదవకపోతే జ్ఞానం రాదు
ఎన్నినగలున్న, అవసరానికి ఉపయోగించకపోతే విలువలేదు
ఎన్ని మందులున్న, మనసుతో మందువాడకపోతే రోగం తగ్గదు
ఆహార పదార్ధాలు ఉన్న, ఎప్పటికి ఆకలిని కొనటం కుదరదు
సుఖాలు ఎన్ని ఉన్న , మనిషికి శాంతిని కల్పించటం కుదరదు
సౌకర్యాలు ఎన్ని ఉన్న, ఆనందాన్ని కల్పించటం కుదరదు
ధనం ఎంత ఉన్న, అడవిలో, ఎడారిలో, దానికి విలువలేదు
చెడులో మంచిని చూడక పొతే, మనిషిగా బ్రతకటం కుదరదు
విషాదంలో సంతోషాన్ని చూదక పొతే, మనుగడ కుదరదు
నష్టంలో లాభం చూడక పొతే, వ్యాపార మనేది కుదరదు
హ్రుదయం లో ప్రేమ లేక పోతే, సుఖ సంసారము సాగదు
3. తేడా అంటే ఒక్క వాక్యము లో చెప్పండి ?
నాలుగుపంతులలో చెపుతాను
మనిషి మనిషికి మద్య ఉన్న తేడ శ్రద్దలో వ్యత్యాసమే
పెద్దలకు, పిల్లలకు మద్య ఉన్న తేడ ఆత్మ విశ్వాసమే
భార్య భర్తల మద్య ఉన్న తేడ సంసార సుఖం లోపించుటయే
గురు శిష్యుల మద్య ఉన్న తేడ నమ్మకం వమ్ము చేయడమే
నన్ను స్పందింప జేసిన, నాలో ఆలోచనలను రేకెత్తించిన , నన్ను ప్రభావితం
చేసి కొన్ని ముఖ్యమైన అంశాలను పదిమందికి అందించటం ఒక మంచి పనిగా భావించి,
ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ఒకనాటి లెక్కల అద్యాపకుడిగా నేను నేర్చుకున్న
విషయాలు, తల్లితండ్రులు గురువులు, స్నేహితులు , ఎందరో మహానుభావులు చెప్పిన
విషయాలను
ఇందు పొందు పరుస్తున్నాను, చదివి మీ అభిప్రాయాలు కామెంట్స్ వ్రాయటం ద్వారా షేర్ చేయటం ద్వారా తెలుపగలరు .
ఇంకాఉంది
adirindi.TEDA adirindi.KUDARANIVIVI kuda adrindi.ANDARU GURTUNCHUKOVALI kuda adirindi.simply SUPERB
రిప్లయితొలగించండి