11, నవంబర్ 2017, శనివారం

ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము.

ఓం శ్రీ రామ్ : శ్రీ మాత్రే నమ: ఓం శ్రీ కృష్ణాయనమ: 
ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము. (3/5)
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 


51 . మనస్సు బుద్ధి ప్రాపంచిక విషయములపై పోకుండా పరమాత్మునిపై నిశ్చల స్థితిని ఉంచవలెను.

52 .పరమాత్మ ప్రాప్తికి మానవుడే అర్షుడు. స్వధర్మ పాలనద్వారా, సాధన ద్వారా,  పొంద వచ్చును.

53 .ప్రలోభాలకు లొంగక, ఆకర్షణకు చిక్కక, సచ్చిదానంద ఘనపారమాత్మ యందే నిరంతరమూ సంతుష్టుడై ఉండుము. 

54 . అట్టి వ్యక్తి శాశ్వితముగా నిత్యానందం నందు  మగ్నుడై స్వయముగా ఆనంద రూపుడగును    

55 . అట్టి స్థితిలో శరీర నిర్వాహణ ప్రారబ్ధాను సారము తనంతట తానే సాగి పోవును. 

56 .  ప్రారబ్దాను సారము లోకదృష్టిలో అతనిద్వారా లోక హితము కొరకు కర్మలు జరుగు చుండును. 

57 .ఇంతవరకు భగవానుడు ఎవరయినా సరే అనాసక్త భావముతో కర్తవ్య కార్మలు ఆచరించ వలెను. 

58 ప్రతి వ్యక్తియు వర్ణాశ్రమ ధర్మాలను, స్వభావమును, పరిస్థితులను, ప్రకృతిని అనుసరించి కర్తవ్య కార్మలు చేయవలెను. 

59 జనకాదులను ఆదర్శముగా గొని, వారిని కనురెప్ప లాగా ఆదరించి ఫలాసక్తి లేకుండా సేవలు అందించటయే అందరి కర్తవ్యముగా భావించ వలెను. 

60 . ఆసక్తి రహిత కర్మల ద్వారా అంత: కరణ సిద్ధి కలిగిన సాధకునకు భగవదనుగ్రహముచే తత్వజ్ఞానము తనంత తానే ఏర్పడును.     .    .       

61. వివిధ జాతులవారును, వివిధ సమాజముల వారును, వివిధ వర్ణాశ్రమముల వారును, కర్తవ్య కర్మలు భగవంతునికిసమర్పించి నప్పుడే ఫలితము  తెలియును.   
      
62. భగవంతుని దోష దృష్టి గలవారును, పరమాత్ముని సామాన్యునిగా భావించు వారును, విశ్వాసము లేని వారును, భగవంతుని శక్తి తెలుసు కోలేరు.

63. తామస స్వభావులు, వివేక రహితులు, విపరీత బుద్ధితో చిత్తం వశము కాక, వర్తమాన స్థితిలో బ్రష్టులుగా  ఉందురు. 

64. నదులు సముద్రమును చేరినట్లు, మనుష్యులు రాగద్వేషాలను త్వజించి, ఆ కర్మలను పరమాత్మ ప్రాప్తికి సాధనములుగా చేసు కొనవచ్చును. 

65. బుద్ధి, మనస్సు, ఇంద్రియముల ద్వారా ప్రారబ్ధ ఫల రూపము జరుగును.           

66. జ్ఞానియొక్క క్రియలు కార్తృత్వభావములుగాని, రాగ ద్వేషములు, అహంకార మమకారములుగాని, ఏమాత్రము దరి చేరవు. 

67. రాగ ద్వేష అను ఇద్దరు దొంగలు, ధర్మమార్గమున పోయే మనుష్యుని కలసి మిత్రులువలే నటించి, అతని మనస్సు, ఇంద్రియమును, వివేక శక్తిని నష్టపరుచును. 

68. దిలీప్ మహారాజు గోవును రక్షించుటకు సింహము చేతిలో శరీరము అర్పించుటకు సిద్ధమయ్యేను. 

69. పావురము కొరకు సీబీఐ చక్రవర్తి శరీరము కోసి మరణించుటయు సిద్ధమయ్యెను . 

70. ప్రహ్లాదుడు స్వధర్మము పాటిస్తూ పెక్కు సారులు మృత్యు ముఖమున చేరెను. 

కనుక సుఖదు:ఖలు అనిత్యములు, అట్లే జీవుడు నిత్యుడు, జీవన హేతువు అనిత్యము కనుక ధర్మముతో నడుచుకొనవలెను .  
      


ఓం శ్రీ రామ్ : శ్రీ మాత్రే నమ: ఓం శ్రీ కృష్ణాయనమ: 

71.కోరికలను సాదించు కొనుటకు గాని, భయము నుండి బయట పడుటకు గాని, లోభములకు లోబడి గాని, కడకు జీతమును కాపాడుటకు గాని ఎట్టి పరిస్థితిలో ధర్మములు తప్పరాదు . అట్టి 

72. ఇతర ధర్మములో సుఖమున్నప్పటికిని అది ప్రేరేపించిన, మనసుకు తృప్తి నివ్వదు, భయమును పెంచునని తెలుసుకొనవలెను.     

73.  ఎవరైనా సరే తమ కులధర్మాన్ని విస్మరించి ఇతర కులాలను తూలనాడిన, మనకన్నా అగ్రమైనదని భావించి దానిలో చేరిన , వారిచేత  పూజలందు కొనుటవలనను వారి వృత్తులను భంగము కల్గించినను అట్టి  వారు పాపములు పొందుదురు . 

74. పర ధర్మము ఎంత గుణ సంపన్నముగా ఉన్నను అది భయావహమే, ఏమాత్రము శుభము కాదు ,  ఆచరించినచో జాతిలో వెంటనే పతితుడగును అని తెలుసు కొనవలెను . 

75. కామము నశించిన తోడనే క్రోధము తనంతట తానే  రూపు మాయను. 

76. నెయ్య్, సమిధులు వేసిన కొద్దీ అగ్ని వృద్ధి అయినట్లు,  భోగములనుభ వించిన కొద్దీ భోగోతుష్ట పెరుగుచునే యుండును .      

77. పాపములకు మూలము, మనుజునికి అజేయు శత్రువు కామమే గాని మరి ఎవ్వరు కాదని తెలుసుకొనవలెను . 

78. కామమే మల, విక్షేప, ఆవరణములు అను మూడు దోషములుగా పరిణత చెంది మనుష్యుని జ్ఞానము కప్పివేయును. 

79. రాగము, సంగము భగవద్విషయుక్తమైన అనురాగమని చెప్పక  కామోత్పాదక భోగాసక్తి యేనని గ్రహించ వలెను..   

80. మనోబుద్ధిఇంద్రియములనుండి ఈ కామరూప శత్రువును (సంసారిగా చల్లపరుచు కొనవలెను) లేదా పారద్రోల వలెను, లేనిచో జీవితములో ఆరోగ్యమును, ధనమును నశింప చేయును .  

ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము. (3/9)

రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

81. రోగి అపధ్య పదార్ధములను సేయించినట్లు, కొన్ని పరిస్థితిలో బుద్ధిమంతునకు కూడా పాపకర్మల ప్రేరే పిన్చబడును . 

82. ప్రయత్న శీలుడు, బుద్ధిమంతుని యొక్క మనస్సును కూడ ఇంద్రియములు బలాత్కరముగా చలింపచేయును.     
83. కామము మనుష్యుని జ్ఞానము కప్పి వేసి అంధునిగా చేసి, పాపములనెడి శత్రువు ఆవహించును. 

84. మనోబుద్ధి ఇంద్రియములద్వారా విషయ రూప లోభములచే జీవాత్మ యొక్క జ్ఞానమును కప్పివేయును. 

85. అభ్యాసము, వైరాగ్యము అను రెండు ఉపాయముల ద్వారా ఇంద్రియములు వశమగును. 

86. భగవంతుని నిర్గుణనిరాకార తత్వముల ప్రభావమహాత్య రహస్యములు యదార్ధ జ్ఞానమును జ్ఞానమ ని తెలుసు కొనవలెను . 

87.  సుగుణ నిరాకారా దివ్యసాకార తత్వముల లీలా రహస్య గుణ మహత్య ప్రభావముల యదార్ధ జ్ఞానమును వి జ్ఞానమని అందురు.             

88. ఇంద్రియములకంటెను వాటి అర్ధములు (రూప,ఆస,గంధ,శబ్దస్పర్శ లనేది తన్మాత్రలు) పరములు. 

89. (శ్రేష్ఠములు,సూక్ష్మములు, బలీయములు) అర్ధముల కంటే మనసు, మనసు కంటే బుద్ది శ్రేష్ఠమైనదిగా పరమాత్ముడు తెలిపెను . 

90.    సమిష్టి బుద్ధికంటే మూల ప్రకృతి శ్రేష్టము, ప్రక్రుతి కంటే పురుషుడు శ్రేష్టము. పురుషుని కంటే శ్రేష్టమైనది లేదు, ఆత్మ స్వయముగా అన్నింటి కంటెను బలీయ మైనప్పుడు అదే కామమనే శత్రువును జయించును. 

మూడవ అధ్యాయము - అంతర్గత భగవద్గీత కర్మ యోగము సమాప్తము. 
    
     --((*))--

9, నవంబర్ 2017, గురువారం

ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము.

Om sri raam - sri matrenama: 
ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము. (3/4)
जय श्रीराधेकृष्ण जय श्रीराम  जय श्री कृष्ण जय श्रीहरि  जय श्रीरणछोड़राय जय श्रीद्वारकाधीश हरे रामा हरे कृष्णరచయత: మల్లాపగడ రామకృష్ణ  

31.స్వధర్మ రూపాయజ్ఞములను (ప్రజాపాలన, వ్యవసాయ ము,  వాణిజ్యము, అధ్యయన అధ్యాపనములు సేవలు) తప్పక నిర్వహించవలెను 

32. యజ్ఞముల వలన దేవతలకు  హవిస్సులను అందించి దేవతలను తృప్తి పరిస్తే ప్రాణులన్నింటికీ సుఖము కలుగును. 

33. నిస్వార్ధ భావముతో దేవతలు ప్రాణులు పరస్పరము మేలు చేకూర్చుకొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు. 

34. దేవతులు ప్రసాదించిన భోగములు అనుభవిస్తూ దేవతను మరచిపోతే నిజముగా చోరుడే . 

35. పుత్రులు తల్లి తండ్రులను పోషించక పోయినను, తల్లి తండ్రుల మరణానంతరము శ్రాద్ధతర్పణాలు ఆచ రించకున్నను,  ఉపకారము పొంది పత్యుపకారము చేయకున్నను, దత్తపుత్రుడైన సంపద పొంది తల్లితండ్రులను సేవింపకున్నను వీరందరూ క్రుతఘ్ను లు, చోరులు. 

36.*దేవతలు సమస్త జగత్తునకు ఇష్టభోగములను అందించుదురు. 

37.* ఋషులు మహాత్ములు అందరికిని జ్ఞానప్రదానము చేయుదురు.    
  
38.* పితురులు తమ సంతానమును పోషించుచు వారికి హితమును గూర్చు చుందురు. 

39.* పశుపక్షి వృక్షాదులు అందరికి సుఖ సాధనములుగా తమను తాము అర్పించు కొనెదరు. 

40.* యోగ్యత, అధికారము, సాధన సంపదతోఁఅందరికి పుష్టిగా ఆహారము అందిచుటయే మనుష్య ధర్మముగా తెలిపెదరు.      
*వీటినే పంచ మహా యజ్ఞాలు అంటారు. వీటిని సక్రమముగా అనుకరించిన వారికి మన:శాంతి, ఆరోగ్యము కలిగి ఉండును   
   
   Om sri raam - sri matrenama: 
ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము. (3/5)

41 .న్యాయోపార్జిత ధనముతో సేవా రూప యజ్ఞములను చేయువాడుము కేవలము అందు మిగిలే అన్నము లోక సేవార్ధము జీవిన్చుటకై ప్రసాద రూపమున భుజించువాడుగా ఉండవలెను.

42 . సుఖ భోగముల కొరకై శాస్త్ర విధిని అనుకరించేవాడు పాపములనుండి ముక్తుడగును.

43 . ప్రాయశ్చిత రూపమున నిత్యమూ హోమ బలివైశ్వదేవాది కర్మలను ఆచరిస్తూ ఎవరి భాగము వారికీ పంచుతూ ఉన్నాదాన్ని భోజనము చేవాడు పాపములనుండి విముక్తుడగును.

44 . బియ్యము, గోధుమలు శరీర పుష్టికి ఉపయోగపడును, వీటివలన రజస్సు వీర్యము ఏర్పడును,
రజో వీర్యాదల సంయోగమువలన ప్రాణులు ఉద్బహ్వించును.

45 ప్రాణులన్నియును అన్నము నుండి జన్మించును. అన్నోత్పతి వర్షము వలన ఏర్పడును. యజ్ఞమువలన వర్షములు కురియును.

46 .విహిత కర్మలు యజ్ఞములకు మూలములు. వేదాలు విహిత కర్మలకు మూలములు. వేదములు పరమాత్ముని నుండి ఉద్భవించినవని తెలుసుకొనలేను.

47 .ప్రతి ఒక్కరు భగవత్ప్రాప్తికై భగవదాజ్ఞానుసారము తన కర్తవ్య పాలన చేయవలెను.

48 సృష్టి చక్రము యజ్ఞములపై ఆధార పడి యుండును .పరమాత్ముడు యజ్ఞముల యందు ప్రతిష్టుతుడై యుండును. 

49 సృష్టి చక్రమును పాటించక ఇంద్రియ సుఖలోలుడైన వాడు ఖశ్చితముగా పాపి యగును.

50 కర్తవ్యమును త్యజించి, స్వార్ధ చింతనయందే నిమగ్నుడై, హితాహితముల గురించి ఏమాత్రము ఆలోచించక ఉండువారు దోషిగా పిలవ బడును.    . 
  .                   .               

6, నవంబర్ 2017, సోమవారం

ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము


Om sri raam - sri matrenama: 

ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము 
రచయత: మల్లాపగడ రామకృష్ణ  


 1 . ఫలమును కాంక్షించు వారిని " కృపణా: ఫలహేవ:" అని తెలిపిన వారిని ఆత్యంత ధీనులుగా గుర్తించ వలసిన పరిస్థితి ఉన్నది. 

2 . ఉత్పత్తిని అనుసరించి జనులందరు తమ మనో సిద్ధి కొఱకై అర్ధించ వలెను. 

3 . నేను మీకు శరణాగతుడను, నా కర్తవ్యమును తెలుపమని అర్ధించవలెను. 

4 . నీలో ఎంత శక్తి ఉన్నా ఎదుటి వాని శక్తిని బట్టి మాత్రమే ప్రవర్తించవలెను

5 .  కర్మ కంటే జ్ఞానము శ్రేష్టము అని తెలుసు కొన వలెను, జ్ఞాన విస్తరణ కొరకు కర్మలు చేయవలెను. 

6 .  మనసు మనసులో లేనప్పుడు చెప్పెడి మాటాలు కలగాపులగపు మాటలుగా బ్రమలుగా మనుషులను తాకును. అవి ఎవరకు అవసరము? 

7 . పుణ్య పాపరరూప సమస్త కర్మాచరణములను త్యజించిన వాడే బుద్ధి యుక్తుడని కొందరూహించెదరు. 

8 . బుద్ధి మోహ పంకిలము నుండి బయట పడి పరమాత్మను ధ్యానించుటయే అందరి లక్ష్యంగా మారాలి 

9 . రాజ్యాధి పత్యము కానీ, లోకాధి పత్యము కానీ పొందిన శోకము మాత్రమూ పోదు. 

10 .  ప్రకృతి నుండి ఉత్పన్నమైన గుణములన్నియు మనుషులపై వత్తిడి చేయును, వాటిని ఎవ రూ గమినించలేరు. శరీరేంద్రియముల మనస్సు ద్వారా జరుగు క్రియలకు అభిమాన పాత్రు లగుదురు. 

11. ఏ కాలము నందైనను, ఏ మనుష్యుడైనను  క్షణకాలము కుడా కర్మచేయకుండా ఉండలేడు. 

12. మనము చేసే ప్రతి పని అంతర్గతములే ప్రకృతి ననుసరించి కర్మలు  చేయు యుండును. 

13. మమతా శక్తులను, ఫలేచ్చలను, త్వజించినవాని  ప్రశాంతముగా  ఉండును. 

14. గుణాతీతుడైన జ్ఞానికి గుణములతోగాని వాటి కార్యములతో గాని ఎటువంటి సంభంధము ఉండదని గమనించవలెను. 

15. పూర్వజన్మల కర్మ సంస్కారము మనుష్యులను వెంబడించును, దాని ద్వారానే మనుష్యులు జీవించ గలుగుతారు. 

16. సత్వ రజస్తమోగుణాలు ప్రకృతిని బట్టి, తోడుని బట్టి, సాటివారిని బట్టి, పిల్లలను బట్టి మనుష్యుల్లో మారుతూ ఉండును . 

17. ప్రతి ఒక్కరు దృశ్యాఅదృశ్య ల మధ్య జీవితకాలం జరిగి పోతున్నది అని తెలుసుకోవాలి. 

18. పట్టు బట్టి వినుట, పట్టు బట్టి చూచుట మొదలగు క్రియలు మనుష్యులను వెంబడించిన నిగ్రహించు కొనవలెను. 

19. మనస్సును నిగ్రహించుకొనుటకు ప్రయత్నిమ్చ వలెను. 

20. అలవాటు, ఆసక్తి, సంస్కారము వలన మనస్సు అప్రయత్నముగానే వాటి ప్రభావమునకు లోనగును, అది దోషము కాదు, మనస్సుని కట్టడి చేసుకొని నిత్యకృత్యాలు చేయవలెను.           
      
21. ఎవరైనా సరే ఇహపర భోగములను, రాగద్వేషములను త్యజింపవలెను . 

22. ఇంద్రియ కార్మలను శాస్త్ర విధి ప్రకారముగా చేస్తూ ఉండవలెను . 

23. ఇంద్రియములను వశపరుచుకొని శబ్దాది విషయము లను గ్రహిస్తూ, యజ్ఞదాన తపశ్చర్యలు, వాణిజ్య వ్యాపారములు, సేవలు అదేవిధముగా సమస్త కర్మలు చేయవలెను 

24. అసురీ సంపదతో ఉన్నవాడు మిధ్యాచారి అంటారు, మిధ్యాచారి కన్నా దైవీ సంపదలతో ఉన్నవాడు కర్మయోగి శ్రేష్ఠుడు .                    

25. స్వధర్మమును నిష్కామభావముతో చేయుటవలన మనసు ప్రశాంతముగాను, తెలియని ధైర్యము వెంబ డించును . 

26. కర్తవ్య కర్మలు చేయుట వలన  మనుష్యుని   అంత: కరణము శుద్ధమై అతని పాపములకు ప్రాయశ్చతము కలుగును. 

27. శరీర నిర్వహణకు ప్రతిఒక్కరు ఎదో ఒక పనిచేయ వలెను  అట్లు చేయని యడల మనిషి మనిషిగా బ్రతుకుట కస్టము.

28. మనుష్యుడు స్వార్ధ బుద్ధితో శుభాశుభకర్మలలో దేనిని దేనిని ఆచరించినను నానా యోనిలో జన్మించ వలసి వచ్చును . 

29. మానవ జన్మలో చేసిన కర్మలే బంధ హేతువులు అని గమనించవలెను. 

30. మమతా శక్తులతో, ధర్మ, అర్ధ, కామ, లోభి.  మోక్షాలను ఇంద్రియ నిగ్రహముతో  జయించి నవారికి పునర్వజన్మలు ఉండవు 

     

2, నవంబర్ 2017, గురువారం

ప్రాంజలిప్రభ - భగవద్గీత ( అంతర్గత) సూక్తులు 2వ అధ్యాయం (31 to70)Om Sri Ram - Sri matrenama:


ప్రాంజలిప్రభ - భగవద్గీత ( అంతర్గత) సూక్తులు
2వ అధ్యాయం (31 to70)(రచయత మల్లాప్రగడ రామకృష్ణ 

31 ఆత్మ ఇంద్రియ గోచరము కానిది, మనస్సునకు అందనిది, వికారము లేనిది అని తెలుసుకొనెను. (గీత 25 ) 

32 .పుట్టినవానికి మరణించగా తప్పదు, మరణించని వాడు పుట్టక తప్పదు విషవలయములోకి చిక్కి సోకింప వలదు. (గాడిద 26 ) 


33 .ఆత్మ వధించుటకు విలుకానిది కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను శోకింప ఆగదు.


34 స్వధర్మము మరచి ప్రవర్తించవలదు, కుల లక్షణం మరచి ప్రవర్తించ వలదు (గీత 27 ) 


35  మరణమునునది వస్తునాశముకాకుండా రూపాంతరము చెందుటగా భావించవచ్చును 36 మంచుగడ్డ కరిగినప్పుడు, నీరు ఆవిరైనప్పుడు నాశనమైనట్లు గా గోచారించును. (గీత 29 ) 


37  ధైర్యమున్నవాడు ఏపని చేయకుండా కూర్చొన కూడదు, అతడట్లు కూర్చున్నచో నీ దైర్యమును చులకన చేసి మాటలాడుదురు, అది నికవారమా.  

38. లోకులెల్లరు చేతకానివాడు అని నీ కీర్తిని  అపకీర్తిగా వర్ణించి  చిలువలు పలువలుగా చెప్పుకొందురు, అది నీకవసరమా, (గీత 30 ) 


39. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణముకంటె భాధాకరమైనదని భావించాలి. అది ఇకు తెలుసుకదా 


40. నీకు తెలిసిన విషయమును చెప్పక పోయినా, ఆవరమైనప్పుడు ధైర్యమును ప్రకటించక పోయినా, పెక్కు అన రాని మాటలు అని, అవహేళన చేయుదురు ,అది నీకు అవసరమా ఓ మనిషీ (గీత 35 )


41. అవసరానికి సహాయ పడనప్పుడు నీ సఖులు, నీ శత్రువులు, నీ సామర్ధ్యమును నిందించి నిన్ను గూర్చి అనరాని మాటలు అందురు. అది నీకు అవసరమా? 

43. ప్రతి ఒక్కరు జయాపజయాలు, లాభ నష్టాలు , సుఖదుఃఖాలు సమానమని భావించి ప్రకృతి అనుసరించి బ్రతకాలి. 

44. బుద్ధిని జ్ఞానయోగములో ఉండి ప్రతి ఒక్కరు ప్రవర్తించ వలెను,  కర్మయోగమును బట్టి నడుచు కొనవలెను.  


45. భోగా సక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒకదారి తెన్నూ లేక కోరికలవెంట తిరుగుతారు, ఎవరూ రు వివేక హీనులు కారు స్నేహ, ప్రేమ ప్రభావము కొంత పనిచేయను, బుద్ధి వక్రబుద్ధిగా మారకుండా ఉండాలి.. 


46. ఫలాశక్తి తో కర్మలు చేయువారు అత్యంత ధీనులుగా మారుతారు. 


47. మంత్రానుష్టానము లందును, యజ్ఞ యాగాది కృతు లందును, అనుష్టానములు సకర్మముగా ఉండవలెను, అట్లు కానిచో అనారోగ్యము, ప్రాణహాని కలగవచ్చును. 


48. పూజా పునస్కారములు వీలున్నంత వరకు చేయవలెను, లేనిచో మానవలెను, చేసిన ఫలితము లభించును. 

49. దైవ ప్రార్ధన సంసార దుఃఖమునుండి ఉద్దరించునని ఖశ్చితముగా తెలుపు చున్నాను.                     

50. ప్రయత్న పూర్వముగా నిశ్చయాత్మకముగా బుద్ధినేకాగ్ర మొనర్చి జీవిత లక్ష్యమేదో నిర్నయిన్చు కొనవలెను .  


  51. ఎవరయినా ధర్మముగా నడుచు కోవాలంటే ముందుగా ద్వందములనుఁ అతిక్రమించాలి. 

52. సత్వగుణ విశిష్టుడవై, యోగక్షేమముల  నావల త్రోసి ఆత్మా యందె మనసు లగ్నము చేయవలెను. 

53. యోగమనగా వస్తుప్రాప్తికి ప్రయత్నము, క్షేమమనగా ఉన్నదానిని సంరక్షణకై యత్నము అవి వదలినప్పుడే మనసు ఏకాగ్రత పెరుగుతుంది. 

54. జీవిత లక్ష్యం తెలుసు కొనలేక పలు రోగములకు మూల మగుదురు. దృఢ బుద్ధితో మనసు ఏకాగ్రత లో ఉంచు కొనిన లక్ష్యము తప్పక సాధించ గలరు.

55. ఒక లక్ష్యము లేకుండా మనస్సు సంపాదన చుట్టూ తిరిగి హృదయము ఆవేదన చెందుట  అవసరమా ?  ప్రేమించే వారిని వదలి సంపాదనే ధ్యేయముగా తిరుగుట అవసరమా, అట్టివారికిబుద్ధి నీలాలేదని గమనించాలి .   

56. సమత్వ బుద్ధి ఉన్న వాడు పుణ్య పాపములను రెండింటిని ఈ  లోకములోని జయించగల్గుతారు. 

57. జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణ భంధములనుండి ముక్తులయ్యెదురు. 

58. ప్రతి ఒక్కరు ముఖ్యముగా మోహమనెడి ఊబి నుండి ముందుగా బయట పడవలెను. భక్తి భావం పెంచు కొనవలెను. 

59. దు:ఖ ప్రసంగములు తటస్థించినపుడు చిత్తక్షోభ నొందక, సుఖములు ప్రాప్తించి నప్పుడు ఉప్పొంగక సమబుద్ధి కలిగి యుండవలెను.            

60. ఎవరు దేనియందు అనురాగములేక, సుఖదుఃఖములను భరిస్తూ, ఇంద్రియములను  విషయ సుఖముల నుండి మార్చుకొన్నచో అతని బుద్ధి స్థిరముగా ఉండును. 
61. అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములు లోను కాకుండా ఉండుట ప్రయత్నిమ్చ వలెను. 

62. ఇంద్రియములను, ఇంద్రియార్ధముల నుండి అన్నివిధముల ఉప సంహరించు కొనిన వారి బుద్ధి స్థిరముగా ఉండును.            

63. అన్ని విషయములపై ఆసక్తి తొలగి పోనంత వరకు అతని మనసు జిహ్వ చాపల్యముగా మారుచునే ఉండును . 

64. చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసినప్పుడే  మనస్సు, బుద్ధి,  స్థిరముగా ఉండును.

65. విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయములందు ఆసక్తి పెరుగును, మనసు ఆలోచనలకు మూలమగును. 

66. విషయములను పొందుటకై కోరికలు పెరుగును, కోరికలు తీర నప్పుడు క్రోధము పెరుగును, ఆక్రోధము వలన మనిషి  ప్రవర్తన మారును. 

67. క్రోధము వలన వ్యామోహము కలుగును, దాని వలన బుద్ధి మారును, జ్ఞానము నశించును. 

68. బుద్ధి మనస్సు లేనివాడు స్థిరముగా ఉండలేక చపల చిత్తుడై, వివేకము కోల్పయి, పతన స్థితికి చేరుకోనును . 

69.రాగద్వేష రహితుడై, ఇంద్రియముల ద్వారా మన:శాంతి ని పొందును. 

70. మన:ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నియు నశించును. పరమాత్మ యందు మనసు లగ్న మగును. 
శ్రీ మద్భగవద్గీత - సాంఖ్యాయోగం

71. మానవ శరీరం ఒక రధం , ఇంద్రియాలు గుర్రాలు , కనుకనే కోరికలే గుర్రాలు గా పరిగెటుతాయని తెలుసు కోవాలి. 

72. బుద్ధికి ఆర్ఝ్యం పోసేది మనస్సు , మనస్సు కామక్రోదాల చుట్టు తిరగకుండా జాగర్త పడాలి.

73. స్వధర్మం శ్రేయోదాయకం , పరధర్మం ప్రమాద కరం అని భావించాలి. 

74. జన్మ కర్మల భంధం నుండి యెవరూ
తప్పించు కోలేరని గమనించాలి.

75. మనః ప్రసన్నత ఉంచు కుంటే అన్ని శుభ శకునాలు వెంబడిస్తాయి అని గమనించాలి .

76. నీటిపైతేలుతున్న నావ గాలి నెట్టి వేసి నట్లు. ఇంద్రియాలు మనసను చేరి బుధ్ధిని మార్చివేయును. 

77. ఇంద్రియార్ధములనుండి ఇంద్రియములను నిగ్రహించు కొనుటవల్ల పురుషుని బుద్ధి స్తిరముగా ఉండును. 

78. యోగి మేల్కొని యుండును, అది ఇతర ప్రాణులన్నింటికి రాత్రితో సమానము.

79. ప్రాపంచిక సుఖాకలకు ప్రాకులాడిన వాని మనస్సు స్తిరముగా ఉండదనీ గమనించ వలెను. 

80. కోరికలన్నీ త్యజించి మమతా అహంకార ,స్ప్రహ రహితుడై చరించునట్టి పురుఫుడే శాంతిని పొందును. 


----------//తదుపరి కర్మయోగం చదవగలరు//------

31, అక్టోబర్ 2017, మంగళవారం

ప్రాంజలిప్రభ - భగవద్గీత ( అంతర్గత) సూక్తులు 2వ అధ్యాయం


ప్రాంజలిప్రభ - భగవద్గీత ( అంతర్గత) సూక్తులు
2వ అధ్యాయం (1/1)

1. కనులలో అశ్రువులు నిండియుండి , వ్యాకులపాటుతో సోకముగా ఉన్న వానినీ ఓదార్పు మాటలు కొంత సాంతపర్చుటయే పెద్దల కర్తవ్యం.(గీత. 1 నండి 3 ).

2. మోహము వెంబడించినప్పుడు మనసు మనసులో ఉండదు, ఆలోచనలు మారును.అప్పుడు ప్రవర్తన మారును.

3. అహంతో , బ్రమతో చేసేపనులు స్వర్గమును అందించవు , కీర్తిని పెంచవు. అది గమనించాలి.

4. పిరికి తనము యెవరినైన నిలవనీయదు , అది వేరొకరికి బలముగా మారును . అట్లు ఎవరూ ప్రవర్తించకూడదు.

5. తుచ్ఛమైన హ్రుదయ దౌర్బల్యం ను. వీడి నిజమును గ్రహించి ప్రతి ఒక్కరు విజయలక్షముగా ముందుకు సాగాలి. (గీత 4 మరియు 5 )

6. పూజ్యులైన వారిని యెదిరించుట తప్పు అని అనుకోవద్దు ? అణ్యాయాన్ని అనుచుట తప్పు కాదు అని గ్రహించాలి.

7 అహంకార మమకారములను పూర్తిగా వదలించుకొని నీలో ఉన్న అజ్ఞాన్నాన్ని పారద్రోలి ధర్మమేదో గమనించాలి

8 ఏవిషయము నందు కూడా జయాప జయాలు ఎవరూ చెప్పలేరు. ఆంధ్రకు కర్తవ్యము మాత్రేమే భోధించగలరు. 9గీత 6 & 7 శ్లోకాలు 0

9 కొందరికి కాలదోషం, కార్పణ్యదోషం ఆవరించి మనసు పరి పరి విదాలపోయి, ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది దానిని తట్టుకొని నిగ్రహించుకోవాలి.

10 .శోకము ఇంద్రియములను దహించివేయును, శోకదాహము చల్లార్చుకొనుటకు ఉపాయము గాంచవలెను (గీత్ - (8 వ శ్లోకం )       .   .

11 పండితులవలె మాట్లాడేవారు ఎవరైనా ప్రాణములు పోయినవారి గురించి, ఉన్నవారి గురించి  ఎట్టి పరిస్థితిలో శోకించరు.(గీత - 11 )

12 స్వధర్మమును విడిచినవాడు, పాపము చేసిన వాడై నరకమున బడును .

13 .చంపువారు, చంప బడువారు వివేక దృష్టితో ఆలోచిస్తే ఎవరు కానరారు (గీత - ౧౨)

14 . ప్రతి ఒక్కరు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఆయా దశలలో ఉన్న సుఖాలు (దేహప్రాప్తి)  అనుభవించాలి. ధీరుడైనవాడు వాటి విషయములో మోహము చెంది పతనము కాడు.

15 విష యేంద్రియ సంయోగమువలన సుఖదుఃఖములు కలుగును, వాటి గురించి పదే పదే ఆలోచించుట అనవసరము (గీత - 14 )

16 . శీతోష్ణములు స్థిరముగా ఉన్న మీకు కానరావు, వాటివల్ల ఉత్పత్తి, వినాశము సంభవించిన   
.    విచారించ నసరము లేదు.

17 . ప్రతిఒక్కరు ఉత్తమము, మద్యమము, ప్రధమము గా  త్రికాలములలో జీవితమును అను భవించి తీరుతారని గమనించగలరు.

18 జనన మరణములు, మాత్రమూ జీవులు ఊహించినట్లు  సంభవించవు , వారు చేసిన పుణ్య పాపములు బట్టి జరుగునని గమనించగలరు (గీత -15 )

19 .ధీరుడైనవాడు సుఖదు:ఖములను సమానముగా చూడవలెను. అట్టి పురుషునిలో విషయేంద్రియ సంయోగములు చలింప చేయజాలవు, అతడే ధర్మపరుడుగా ఉండగలడు.     .          ,
20 ప్రారబ్దము ననుసరించి వచ్చే కష్టాలు ఓరిమితో అనుభవించి, సహన శక్తిని పెంచుకొని, ఏ పరిస్థితిలో ఎవరికీ లొంగక, అధైర్యపడక, ధైర్యముతో సమబుద్ధిని ప్రవర్తించి నిజానిజాలు గ్రహించి      .జీవించటమే మానవుల లక్ష్యమని గ్రహించాలి

21 లేని వస్తువుకు ఉనికి లేదు, ఉన్న వస్తువుకు ఉనికి లేకుండా పోదు

22 ప్రతి మనిషిలో ఉంటుంది నిత్యమైన ఆత్మ, దేహము మాత్రము అనాత్మ 

23 . ఏ విషయాలైన వాస్తవ రూపములను గ్రహించటం కష్టమే, కొంతవరకు తత్వజ్ఞానము తెలిసినవానికి తెలియవచ్చును ,,  .    . 

24 ధర్మాన్ని ఎవరు అడ్డు కోలేరు, నాశరహితమైన సత్యము ప్రపంచమంతా ఆవహించి ఉన్నది అని గ్రహించగలరు (గీత -16 ).

25 ఆత్మ  అనేది ఎవరిని చంపలేదు, ఎవరి చేత ఎవరిచేత చంప బడలేదు ఆ ఆలోచన వచ్చిన వారు అజ్ఞానులు  

26 ఆత్మ అనేది పురాతనము, అజము, నిత్యమూ, శాశ్వతము, శరీరము చంపబడినను ఇది మాత్రము చంప బడదు. (గీత - 18 ) 

27  చిరిగిన వస్త్రము వదలి నూతన వస్త్రము ధరించినట్లే, ఆత్మ శిధిలమైన శరీరమునువదలి నూతన శరీరములో ప్రవేశించును  ,   (గీత - 22 ) .   . 

28 ఆత్మ ఉట్పట్టి, అస్తిత్వం, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అను భావవికార ములు లేనిది.

29 .ఆత్మ జననమరణములు లేనిది, మార్పు లేనిది, దానిని  చంపు తున్నాము అని అనుకుంటే  
అది ఒక మూర్ఖుని ఆలోచన అని అనుకోవచ్చును.

30 ఆత్మను శస్త్రములు చేధింపజాలవు. అగ్ని దహింప జాలదు. నీరుతో తడప జాలదు, వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు.(gita -23)


  . 

28, అక్టోబర్ 2017, శనివారం

భగవద్గీతలో (అంతర్గత) సూక్తులు -1/2(మొదటి అధ్యాయము )

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:- శ్రీ కృష్ణాయనమ:

భగవద్గీతలో  (అంతర్గత)  సూక్తులు  -1/4(మొదటి అధ్యాయము )

31 .అధర్మ ప్రాభల్యము వలన కుల స్త్రీలు చెడుదురు, అందువలన వర్ణ సంకరము ఏర్పడును.

32. కామాన్ని జయించలేక స్త్రీ పురుషులు కొందరు వక్రమార్గమున అనుసరించి కొందరి అనాథలను సృష్టింస్తున్నారు, ఇది అవసరమా?

33. వర్ణ సాంకర్యము వలన మృతులై పితృలోకమందున్న వంశీయులు కుడా తిలోదకములు, పిండ ప్రదానాలు లేక అధోగతి పాలగుదురు.అది గమనించాలి

34. కామాన్ని జయించి నిగ్రహించు కోవటానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి, అది వర్ణ సంకరము కాకుండా జాగర్త పడాలి, అట్లు అయినచో తల్లి తండ్రులు తృప్తి పడరు, వారి మరణించిన పుత్రులు "శ్రద్ధలేక అర్చనలు " చేసిన " ఖర్మలు"  చేసిన ఫలితము ఉండదు .

35 మహాపాపముల వలన కుల ధర్మములు, జాతి ధర్మములు అడుగంటును, అందుకనే ఏ స్త్రీ అయిన పురుషుడు అయిన సక్రమ మార్గమున నడుచు తీరాలి.

36.సాంకర్యమునకు కామ వాసనా ప్రాబల్యమే మూలము. జ్ఞానమునకు ప్రబల శత్రువుగా మారును, అట్టి పరిస్తుతులలో నిగ్రహించుటకు ఆధ్యాత్మిక పద్ధతిలో మౌనం వహించి నిగ్రహించుకోవాలి అప్పుడే   నీలో ఉన్న శత్రువుని జయించ గలగుతావు. తాత్కాలికంగా కామాన్ని జయించ గలుగు తావు.

37  మానవ జాతికి అశ్వ శునకము లాంటి పారిశుద్ధ్యం పనికి రాదేమో.

38 శారీరక దృష్ట్యా వర్ణసాంకర్యము ఉత్త మోత్తమని వాదించేవారు కలియుగములో పుడతారు చిత్రమేమో గాని అది ముప్పు అని తెలిసినా ఒప్పుకుంటారు, నిప్పు అని తెలిసిన పట్టుకుంటారు అటు వంటి వారికి కాలమే సమాధానము చెపుతుందని గమనింఛాలి. (గీత - 43  & 44 )

39.  దుర్మార్గులను చంపుట మహా పాపము కాదు, వారిలో ఉన్న దుర్మార్గాన్ని తొలగించుటకు ప్రయత్నం చేయాలి.

40. బలమైనవాడు బలహీనునకు అవకాశము ఇచ్చిన "పిల్లి పులిగా మారినట్లు "  బలహీనుడు బలవంతుని ఎదుర్కొనే శక్తిగా మారుతారని గమనించాలి.

41. 10 సార్లు ఓడిన దిగులు పడ నవసరము లేదు, ఎందుకనగా నీవు ప్రతిసారి కొత్తదనం కోసం ప్రయత్నిమ్చావు, ఎప్పటికైనా గెలుస్తానాని నమ్మకంతో కనుక విజయం తప్పక నిన్నే ఆవరిస్తుంది.

42  మానవులు ప్రతి విషయములోను తృప్తిని గ్రహించవలెను, ఏ పరిస్థిలోను అసంతృప్తిలో ప్రకటించిన అది మన శరీరమునే తిని వేయును, ఫలితము లేదని తెలిసిన ప్రయత్నాన్ని కాలానికి వదిలి వేయ వలెను కానీ అనుమానము పెట్టుకొని బాధ పెట్టుట ఎవరినీ బ్రతికించదు.

43 . అసంతృప్తిగా ఉన్నచో ఉన్నతాశయములే దరిచేరవు, ఆధ్యాత్మిక జీవిత్తమే గుర్తుకు రాదు, భయము ఆవహించి మనసుని వేదన గురి చేస్తుంది అది అవసరమా ?

44. విషాదము నుండి విచారము పుట్టును, విచారము నుండి వివేకమైన ఆలోచనలు వెంబడించును, వాటిని సద్విని యోగము చేసు కొనుటయే మానవుని లక్షణంగా భావించాలి

45 దు:ఖమువలన మానవునకు లోక పరిస్థితులు స్పష్టముగా భోదపడి వివేకము కలుగును.

46 .దు:ఖమువలన హృదయము మృధువై పరుల కష్టమునందు సానుభూతి, సహకారము అనే గుణము ఉద్భవించును

47. నరులకు తమ దు:ఖములే గురువులని తెలుసుకొని ప్రకృతి ననుసరించాలి.

48.  ధర్మసందేహములను తీర్చి ఆధ్యాత్మికోన్నతికి మారుటకు విషాదయోగమే మూలము.

49. ధర్మము అతి సూక్షమైన దనియు, అనంత మైనదనియు దాని ననుసరించు వ్యక్తులను బట్టియు, సమాజమును బట్టియు అది వివివిధ రీతులలో ఉండును.

50. వ్యక్తి పరముగ నియమము లకును, సమాజము యొక్క నియమము లకును వ్యత్యాసము ఉండును. వ్యత్యాసములను గమనించి నడుచుకోవటమే మానవుల లక్షణం అని తెలుసుకోవాలి.  
                       
51 కురుక్షేత్రం భారత దేశంలో ఉన్నది . ఆ ప్రాంత విశేషము కుడా తెలుసుకోవాలి ఎందుకనగా ఇక్కడ అగ్ని ఇంద్రుడు, బ్రహ్మ మొదలగు దేవతలు తపస్సు చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయి. అందువల్ల ధర్మ క్షేత్రం, పుణ్యక్షేత్రం కురుక్షేత్రం అని భగవానుడు తెలియ పరిచారు.

52 మనమున్న ప్రాంతము ఒక్క సారి పరిశీలించుకొని అడుగు పెట్టమని, మనచుట్టు ఉన్నవారిని గమనించి ప్రవర్తించమని, మనమున్న ప్రాంతము అందర్ని కలుపుకొని పుణ్యక్షేత్రముగా మార్చుకొనుటకు ప్రయత్నం చేయాలి.

53  మన చేతివేళ్ళు 5 వేరుగా ఉన్న వాటి ఉపయోగము సమానము అని గమనించాలి, అట్లాగే అన్నదమ్ములు గుణములు వేరైనా శుభ కార్యమునకు అశుభ కార్యమునకు తప్పక ఏకం అవ్వాలి అని గమనించలి.

54. అన్నాదమ్ములలో, అక్కా చెల్లళ్ళల్లో పెద్దవారి మాటలకు విలువ ఇచ్చి ప్రవర్తించాలి, వారు చెప్పే విషయాలలో ఉన్న సత్యాన్ని గ్రహించాలి

55. ఏవిషయములో నైనా ఎత్తుకు పై ఎత్తు వేసి బ్రతుకును సార్ధకము చేసుకోవాలి,  ధర్మ భద్దముగా నడుచు కోవాలి.   

56. పెద్దవారు ఎవరైనా సరే తను అనుకరించే విధానాలు అందరిని సంప్రదించుకొని నడుస్తూ ఉంటే అందరికి మంచిది. మూర్ఖముగా ఒక్కరినే నమ్ముకొని ప్రవర్తించినా మంచిది కాదు అని గమనించాలి

57. అవసరమునకు సంఖ్యా బలము కన్నా, గుణబలం ఉన్న చోట తప్పక విజయము జరుగు నని గమనించాలి.

58 . అధికారంలో ఉన్న వాడు బలమైన అసమర్థుడుంటే వానికి ఎంతటిసమర్ధుడైన, గొప్పవారైనా తలవంచక తప్పదు, అది అధికారానికి గౌరవించక తప్పదు. 

59. ప్రాణానికి ప్రాణం దూరంగా ఉన్నా మనసు మాత్రం దగ్గరగా ఉంటుంది. భావాలన్నీ శుభ సూచకాలు అందిస్తాయి. అది  ఆధారపడి ఉంటుంది . 

60. అధి కారుని కొరకు,  ప్రాణాలనైనా ఆర్పించుటకు సిద్దీముగా  ఉంటారు కొందరు, అంతిమ శ్వాసవిడుచు వరకు విజయమునకై విరోచితముగా సమస్యను పరిష్కారిస్తారు మరికొందరు. ఏది ఏమైనా అది అధికారము ఉన్నంతవరకే.  
               
                  . 

25, అక్టోబర్ 2017, బుధవారం

భగవద్గీతలో (అంతర్గత) సూక్తులు -1(మొదటి అధ్యాయము )

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:- శ్రీ కృష్ణాయనమ:

భగవద్గీతలో  (అంతర్గత)  సూక్తులు  -1(మొదటి అధ్యాయము )

1.  గ్రుడ్డివారైన, వయసు మీదపడిన వారైన కన్నప్రేమ తగ్గదు,  మనవారు పరాయివారు మధ్య సంఘటనలు తెలుసుకోవాలని ఆరాటం తగ్గదు  (గీత 1/1)

2. ఎంతటి బలవంతుడైన సరే గురువుని ప్రార్ధించి ఏపని ఐన  చేస్తే దానికి తగ్గ ఫలితము రాగలదు (గీత 1/2)


3. ఎంతటి వారైనా గురుపుత్రులను తక్కువ చేయకూడదు, శిష్యులను తక్కువ చేయకూడదు  అందరిలో ఉన్న   గొప్పతనమును గ్రహించాలి (గీత 1/3).

4. ఎంతటి వారైన సరే ఎదుటి వారి తెలివి, వారి వంశములో ఉన్న తెలివి, వారి నడవడిక ముందు కొంత తెలుసుకుంటే మనకు ఎంత వరకు ఉపయోగ పడునో తెలుసుకోగలరు ( గీత 1/4 to 9)

5. మన స్నేహితులు పరిమితము అని బలహీన పడవద్దు, వారి స్నేహితులు అపరిమితము అని  దిగులు చెందకు,  ధైర్యవంతుడు ఒక్కడున్నా ఆవర్గము విజయము ఖాయము (గీత 1/10)

6. మనకు ఒకని వల్ల ఇబ్బంది అని తెలుసుకున్నప్పుడు తప్పించు కొనుటకు, సింహనాదం చేసిన ముప్పు వచ్చేది రాక మానదు    (గీత 1/11to 13)

7. ఎన్నో రకాల వాయిద్యాలు మ్రోగించిన భయస్తుల గుండెలు భీతిల్లక మానదు, భయము లేనివారికి ఉత్తేజము పెరుగక మానదు (గీత 1/ 14 తో 20)

8. ఎంతటి వారైన తనతో ఉన్న వారిని గొప్పతనం తెలుసుకోవాలి ముందు, గొప్పలకు పోయి నేనే ధైర్యవంతుణ్ణి ఈ పని నేను సాధిస్తా అందరి ముందుకు తీసుకు వెళ్ళు అని ఆలోచించక గొప్పలు  చెప్పకూడదు (గీత 1/21)

9. మనము ఏ విషయమైన ప్రత్యక్షముగా చూడవలెను, చారులు చెప్పిన విషయాలు గమనించక వారికి మనకు వ్యత్యాసము గమనించి దేశకాల పరిస్థితులను బట్టి ప్రవర్తించవలెను. (గీత 1/22&23)

10. నడి రోడ్డులో మనిషిని నిలబెట్టి నీవు అన్నీ వైపుల గమనించు ఎం తెలుసు కుంటావో తెలుసుకో అంటే అతని చూపు ఎటు ఉంటుందో ఎవరు చెప్పలేరు, ఆలోచించటం తప్ప (గీత -1/24/25)


11. ఒక పని చేయ దలుచు కున్నప్పుడు బంధువర్గము చూచి అపారమగు జాలిచే గుండె కరిగి బ్రతకటం  ఎవరికి  అవసరము ? (గీత -1/26&27)


12. ఆత్మబంధువులను చూచి, మనసు తల్లడిల్లి, వణుకు ఏర్పడుట, చేతిలో ఉన్న చేయు పనిని వదులుట, ఎంతవరకు, సమంజసము ? ఎవరైన సమయానికి ఆదుకుంటారని అనుకోవటం తప్పు, చేస్తున్న పని ఆపుట తప్పు అసలు విషయం గమనించాలి.


13.  ధర్మం అని తెలిసినప్పుడు అది అనుకరించుటలో తన మన అని మనసులోకి వచ్చుట అంత మంచిది కాదు, ధర్మానాన్ని ఆచరించగలగటమే ఉత్తమ లక్ష్యం .

14. అనుకోని విధముగా మన శరీరము గగుర్పాటుకు గురి అయిన ఇంద్రియాలను నిగ్రహించుకొన్న వాడే నిజమైన స్త్రీ పురుషులని గమనించాలి.(ఇది కలియుగంలో కష్ట సాధ్యమే ఆయన సాధనమున సాధించలేనిది లేదుకనుక ప్రయత్నిమ్చ గలరు)


15. ఎవరికైనా అనుకోని విధముగా దేహములో కనబడని మంటలు ఆవహించి మనస్సును అల్లకల్లోలము చేసిన మంటలకు కారణమును గ్రహించి తగు మందు వేసుకోనుటే నిజమైన లక్ష్యము అని గ్రహించాలి


16. గ్రహించిన విద్యను మరచిన, పరులకు ఉపయోగించక పోయిన అటువంటి వారు ఎవరైనా ఉన్నా లేనట్లే.

17. శరీర శుభ్రత చాలా అవసరము ఎందుకనగా నిద్రలో కళ్ళకు కనురెప్పలు ఎంత సహకరిస్థాయో, అట్లే మనలో ఉన్న మలినాన్ని తొలగించు కోవటం ప్రతిరోజూ చేయాలి, అది మన మనస్సుకు ఎంతో ప్రశాంతత కల్గిస్తుంది అని గ్రహించాలి

18. ఈరోజు మంచిది కాదు అని తలచి రేపు చేద్దామని అనుకోవటం ఎప్పటికి మంచిది కాదు. మంచి చెడులు చూడటంకన్నా లక్ష్య సాధనకు కృషిలో మంచి కనబడుతుంది అని గ్రహించాలి.

19. అవసర మనుకున్నప్పుడు ఆత్మబంధువులు, కన్నబిడ్డలు, ధర్మము తప్పారని తెలిసినప్పుడు తనవారినైనా సరే యెరులైన సరే భాధ పెట్టక తప్పదు. సక్రమ మార్గమును తెచ్చుటకు చేయాలి కృషి .

20. నిజాయితి బ్రతుకులో ఉన్న తృప్తి మరి ఎక్కడ కనబడదని గ్రహించాలి (గీత  - 28 నుండి 35)  

21.ఎవరైనా సరే, అవసర మైనప్పుడు ధన ప్రాణములపై ఆశలు వదలి, ధైర్యముతో ముందుకు నడచినవారే ఎన్ని కష్టాలనైనా జయించ గలరు.

22. సుఖమనేది, కష్టమనేది,  శాస్వతము మాత్రము కాదు. సంతృప్తిలోనే అసలు విజయమున్నది.

23. ఎదుటి వారు దాడికి సిద్దమైనప్పుడు, మరణమే వీర స్వర్గమని తలచి ఎదురుగా ఎదిరించుటలోనే ఉన్నది నిజమైన ధైర్యము. (గీత 31 నుండి 35  వరకు )


24 నామీద దాడి చేసినా,  నేను మాత్రము దాడి చేయను అని కూర్చుంటే,  చేతకాని వాడిలాగా లెక్క గడతారు, ఉన్న గుర్తింపు కుడా పోతుంది అని గమనించాలి.

25 విషము పెట్టువాడు, కొంపలు కాల్చువాడు, భార్యను ఆవమానించువాడు, నీట ముంచువాడు సర్వస్వము అపహరించువాడు,  ఆయుధము పట్టి నిరాయుధుడిపై దాడి చేసేవాడు, అటువంటి వారిని బ్రతికించుట వలన ఎవరికి ఉపయోగము?  (గీత - 36  నుండి 40 వరకు )

26. మూర్ఖుడు అని తెలిసి నప్పడు వానిని దూరముగా ఉంచుటయేగాని, లేదా మనమే దూరముగా ఉండుటగాని చేయవలెను, అతడు మృగమని తెలిసి నప్పుడు చంపుటయే వేట ధర్మమ్ అని అందరు తెలుసుకోవాలి. 

27. యద్దము చేసేటప్పుడు మనవారు పరాయి వారు అని చూడకూడదు, పాపము అంటుతుంది అనుకుంటే యుద్ధము గురించి కుడా మాట్లాడ కూడదు.         .   .          

28 దురాశపరులు, యుక్త , యుక్త వీక్షణక్షణ నేరగని వారని తెలిసి వారిపై మనము మూర్ఖులుగా మారుట సమంజసమా ? వారిని మార్చలేనప్పుడు మనమే దూరముగా ఉండుట నేర్చుకోవాలి.  

29 కులము నశించిన, కులధర్మము నశించును. ధర్మము నశించగా అధర్మము పెచ్చు పెరుగును. (Gita- 41 )

30 వర్ణసాంకర్యమువలన కులము వారికిని, కులఘాతకులకు కుడా నరకప్రాప్తి తప్పదు (గీత -42).   .