సంసార..సుఖ..దుఃఖమ్ము.. స్వేచ్చా తేటగీతి మాల
రచన మల్లాప్రగడ రామకృష్ణ
బంధ మేదైన నిలబెట్టు బాధ వద్దు
ఉనికి కోల్పోయిన మది ఉంచి పలుకు
చులకనే మదీయ భవము చూప గలుగు
పట్టుదలతోను ప్రేమను పంచగలవు.001
మనకు నిస్వార్థ పదమాల మనుగడయగు
అభిమతము మనస్ఫూర్తిగా యడుగు వేయు
నమ్మకము నయనాలుగా నటన వద్దు
నచ్చననెడి మాటయనకు నమ్మి బ్రతుకు.002
కల్పిత మనెడి పాత్రలు కలలు యేను
కనికరముగాను కన్నీరు కథలు తీరు
వాస్తవిక జీవితానికి వాద నొద్దు
ముసుగులోననే ప్రేమలు ముఖ్యమవ్వు.003
మనుగడే ప్రశ్నల మయము మాయ మనసు
పలుకున ప్రమాదము లేక పలుక గలవు
నిత్య అవమాన హేళన నీడ యగుట
ధైర్యమే సంపదయగుటే దీన మహిళ.004
పదును లేని పొలమ్మని బాధ వలదు
పంట పండినా పలుకులొ పోటు కలుగు
బంధము నిలుపు బాధ్యత బలము యేను
నమ్మకముతోను మదిలోన మార్గ దర్శి.005
ఆకు రాలుట కొత్తేమి కాదు కాదు
బిడ్డ మారుట కొంతయు భీతి చెందు
ఋతువు మారేను ఆకులు పురుడు పోయు
బిడ్డలూ మారు కాల మే తీర్పు తెలుపు..006
ఇదియు మాయ లోకముతీరు ఇష్టమొగుట
కలుషితంమైన బతుకులో కథలు తీరు
లేడు లేడన్నవారికి లీలయిదియు
కళల కష్టాలకుంపటి కలియుగాన.007
ఆమె రమ్మంది కవ్వింపు అడుగు ముందు
చూడనట్టు సైగలతోను చూపు కలుపు
పక్కకు పిలిచే సొగసును పక్క చూపె
పరిమళంపరికించవా పదములేల. Oo8
పకపకానవ్వింది మనసుబలుపు చూప
చిలిపిపరిహాస మాడింది చెలిమిలాగ
నీవు ప్రవరాఖ్యుడగునేల నిజముతెలుపు
ప్రేమ వలకపోసియుప్రియ ప్రేమ తెలిప.009
కాలమేవిధి రూపము గాయమేను
సుఖమునైన దుఃఖమునైన పురులు విప్పు
విధివిలాసము వల్లనే వేరు చేయు
కాలమునకు మించినదేది కనుగొనవులె. Oo9
బానిసన్నది ఎక్కడ బంధమేను
శ్రమకు తగ్గఫలముపొంద కృషియు గతియు
ఎవరికెవరు తక్కువ యనయేల వలదు
బీదవాని అదృష్టము భీతి వలదు. 010
ప్రోద్బల మగుట కాదులే పోరుయిదియు
పౌరుల తెలివి పొందిన సౌఖ్యమేను
ప్రగతి దేశ వైభవముగా ప్రతిభగాను
పగలు సెగలు కమ్మినసేవ భరత భూమి..011
పేరనేది లేనిదగుట పీఠమైన
పెన్నిధి యగటయే మన పెద్దదిక్కు
భాగ్యమగు విధాత కళలు భరత భూమి
జనుల సంతసమ్ము సహన జగతి తీర్పు..012
స్ఫూర్తి పొందేందుకుకృషియు సూత్ర మగుట
ప్రకృతి సిద్ధము మూర్తులై ప్రతిభ చూపు
ఆర్తితో చూడ అలసట ఆట ఏల
రోజు రోజుకూ సంతసం కోప మేళ. .013
తొక్కినంత మళ్ళీ పుట్ట తోడు గరిక
దీప వెలుగు కావాలిలే ధరణి యందు
స్థిరము లేనట్టి పాదర సమ్ము ఏల
జరిగె నంతా జగముననే జాతరగుట.014
ఆశ మదిలోకి చేరితే ఆట మొదలు
ఆశ కనుబొమ్మలెత్తినా కాన రాదు
ఆశ అందరి లోనుండు ఆత్ర మేళ .
ఆశ తీరా సభలొ కూర్చు న్నాను కలలె.015
నన్ను బంధించ దలచియు నన్నుకోరు
మంది ఉన్నకాంత కనులు మనసు పెట్టు
కాంత ప్రేమ సంగమమంటు కనికరముయె
సర్వసంగపరిత్యాగి శాంతి కాంతి ..016
వృత్తి ధర్మం ప్రకాశించి వేళ్ళు విరియు
శక్తి గర్వప్రయోగించి శిక్ష చెందు
భంగపడ్డా భయము లేక బ్రతుకు నేర్పు
ధర్మ వ్యాధుడు పూజింప ధరణి యందు .017
శాంతి హేమంత మవ్వుట శాప మేళ
మొదలు చిరునవ్వులుకలియు మోక్షమగుట
మంచి పూబంతి తోడుగా మనుగడయ్యె
వెన్నెల తుషార పూలుగా విరిసి తోడు .018
విద్య విధ్వంసము యగుట వింత కాదు
చదువు కూడుపెట్టదనిఏ చెప్పుయేల
నీవు నేర్చిన విద్యఏ నిన్ను మార్చు
కాల యాపన మాటలు కామ్య మేల ..019
నీరు వేడిచేయుటతోను నీరు పొంగు
పాలు కాస్తెమీగడ పొర్లు పలక నందు
అహము కక్కాక నిజముఏ అథిది యగును
కాల నిర్ణయం నమ్మియు కలసి బ్రతుకు. 020
దేశ సేవలు చేసియు దేహ మలసి
అనుభవం తెలిపెను కళ అర్ధ ములను
ఒకరికొకరు చెలిమిగాను ఓర్పు సలిపి
ప్రాంజలి ఘటించి తెలిపిరి ప్రభలు గీత..021
వ్యాధి ఎక్కువ తక్కువ వ్యాపకమ్ము
వైద్య మనునది శాంతికి వైన మగుట
వైద్యు డాయుష్షు ఆపేటి వైద్య మేది
ప్రభువు కాలనిర్ణయమునే ప్రజకు తెలిపె. 022
స్వచ్ఛ మైన చెలిమిగాను సర్వులందు
కష్ట నష్టమైనను ఇష్ట కళలు పంచి
స్వచ్ఛతను తెల్పి సహకార సహన ముంచి
కాల కొలిమిలో నిష్ఠగా కలసి బ్రతుకు.. 023
నేను కానరాకున్న భయమేను కలిగి
ఆమెలో అపార్థాలుగా ఆద్రతగను
దూరము పెరిగిపోయాక ఉండ లేక
చెప్ప దలచిన వన్నియు చెప్పు చుండె .024
వీధుల విహరించెడివాడు వేంకటేశ
దీనభాందవులకు భక్తి దీక్ష నిచ్చి
రక్ష చేయగలవు రమ్య శ్రీనివాస
కలియుగాన కో ర్కలుతీర్చు కాల పురుష .025
వరమనుగ్రహించిన భగవానుడేను
అన్న మాటకు అవతారమెత్తి ఆదుకొనెను
గుణము తెలప చెలిమిగుడ్డ కూడు గూడు
కర్మయొక్కఫలము లన్ని కడవరకునె .026
చల్లలమ్ముకొని బ్రతికే చలువ పల్లె
నీళ్లు చన్నీళ్ళ అమ్మేటి నేటి బస్తి
కుండ నీరుమరిచెనులే పులుసు త్రాగు
వేడినీరు తాగమనట వైద్య మనుట .027
తప్పులన్నవి తృప్తి గా తాళ లేవు
రోగ మున్నను చాపల్య రుచిని కోరు
ఉప్పు తీపి వద్దన్నాను ఊపిరి కళ
దైవ బలముతోబ్రతికేను ధరణి యందు..028
చక్కనికనకమగునంచునక్కఁగలుఁగు
రవికనుపరికిణిఁదొడుఁగ లచ్చివోలె
యుంటివిఁగదఁటె ఖిన్నమౌయూహయేమి..
మాగృహఁపుసిరికళవళమందరాదె ..".029
అలలు అలసట లేకయే కదల కలుగు
కలలు అలసటతో వచ్ఛి కదల కలుగు
తీరు మారనట్టి అలలు తీరమందు
జారిపోవునట్టి కలలు జాలి గుండె..030
ఉజ్వల భవిష్యత్తు లన్ని ఉద్య మాలె
ఉత్తమ గుణాలు ఉత్సాహ ఉన్నతములె
ఉన్నత మనస్తత్వాలు తో ఊగు కళలె
ఉద్యమమున లక్ష్యము ఉన్నతాను భవములె. 031
తిన్న మేత చాలక బొక్కి తినుట ఏల
కుక్క పని గాడిద యు చేయు కూట మందు
గెలుపు ఓటు కోసము ధనం గాల మేయు
నిన్ను బలహీనులు తరిమే నిజము రోజు..032
ఏమి రూపము దాల్చి న ఏమి ధనము
దినము రంగుల మయమే ను దివ్య వెలుగు
హరిత వనము యే ఆశ్రిత హాలుని లయ
వింత వర్ణము కలిగిన విజయ వాంఛ.. 033
చెప్పు కష్టనష్టాలకు చరిత నంత
చెప్పు పగలు రాత్రి ఘటన చరిత నంత
చెప్పు సంసారి సుఖముల చరిత నంత
చెప్పు గుండె మంటల జపం చరిత నంత..034
కరువు కోతలతొ విద్యుత్తు కలలు కాదు
పయణ ఖర్చులు పెంచారు పగలు రాత్రి
ఉచిత మంటు పందారము ఉడత కాదు
ఇష్ట సచివులు మార్చుట ఇంటి కధలు..035
మంచి మనసుతో జగతి లో మాయ మార్చు
నిత్య సంస్కార ఔన్నత్య నియమ ముంచి
మనసు సంపదే గుణముగా మోద మగుటె
తెలివితో సాధనయె ధనం వెలికితీత.. 036
వర్షములు లేక పుడమి లో వేడి పెరిగె
మబ్బుల కలలు లాగనే మాయ మయెను
భూమి కోర్కెలు తీర్చక భోరున కళ
జనులకు గొడుగు ఉపయోగ జపము ఇదియె.. 037
నిత్యము ప్రలోభాలతో నీడ జేరి
ప్రజల నాడి పత్రికలకు ప్రతిభ జూపి
ప్రగతి అలోచనలతోను ప్రేమ జూపి
మంచులా కరగించేను మనసులోన .. 038
కళ్ళు వున్నా కపోతిగా కాల మేల
కళ్ళ కన్నీరు నమ్మేటి కాయ మేది
కళ్ళు వర్ణణా కర్షణ కామ్య మేగ
కళ్ళ కనికరం చూపులు కధల గాను ..039
కళ్ళు మూసియు ధ్యానము కామ్య సిద్ది
కళ్ళు తెరచిచూ చిన దృష్టి కామ బుద్ధి
కళ్ళ కలతలు జరిగినా కలలు సుద్ధి
కళ్ళ మాటలే మనిషిలో కచ్చ పెంచు ..040
కళ్ళ చూపుల కాపురం కళల పంట
కళ్ళ నీళ్ళుతుడుపుటేల కార్య మందు
కళ్ళు ప్రకృతిలో కలసేవి కాల మందు
కళ్ళ చూపునిర్ధారణ కన్న ప్రేమ ..041
కనులు కనులు కలిసెనులే కాంక్ష తీర
కనుల తీర్పులో శృంగార కళల తీరు
కనుల లోన పాప గనులే కనికరింపు
కనుల లోనున్న కనుపాప కలసి పిలుపు ..042
మిత్ర రాష్ట్ర దుర్గంమ్ముయు మేలు కోరు
వక్రుతులని పేరు విధిగాను వెల్లువిరియు
సైన్య మేరాజ్యపాలన సమయ మగుట
నిత్యము అమాత్య లధనమే నిజము తెలుపు.. 043
పెద్దల సహవాసం చేసి పేరు పొందె
వినయ విజ్ఞాన సంపద విశ్వ మందు
తానుచక్క బరుచు వాడు తనువు ఓర్పు
ఆత్మ సంపాదనం సృష్టి అందరిగను .. 044
గురువు తెల్పు విద్యల వలన ఉన్నత మగు
సేవ వల్లనే విజయము సేతు వగుట
ధర్మ మార్గము వినయము ధరణి యందు
వినయ వాక్కులు మనసున వినుట బ్రతుకు.. 045
విలువ లేని దుమ్ము, భయము, విధిగ చేరు
కళ్ళ లోపడి విలవిల లాడ గలుగు
విలువ లేనిపలుకులన్ని వదలివేయు
ఉత్తముల లక్షణం దూది ఉప్పు యనుట .. 046
భయమనేది మనిషి లోన భారమవదు
ఒక్కసారి భయము తీర్చ ఓర్పు ఉంచి
పారి పొయ్యేల భయముమే పాప బుద్ధి
కుప్పకూలిపో యు భయము కూర్మి వలన .. 047
ఏది ఏమైన పరిణామ జీవ మగుట
నిత్య తార్కాణ అవతార నియమ మగుట
బ్రహ్మ చారులకు ముదురు భావ మేల
బెదిరి పోయి వాడికెవరు పిల్ల ముదురు ..048
బయటి విషయములుగ ఇంద్రి యమ్ము జూపు
అహము సంసర్గ సంపర్క అంత మగుట
బ్రహ్మ నిష్టగల వివేక బంధ మగట
పురుష శక్తి సౌజన్యము పురులు విప్పు ..049
తాత తల్లి తండ్రి గురువు తర్లి పోవ
జాతి కులములనె చపల తేల మగుట
దాను దానయైన మనసు దలప యుండ
తత్త్వ వైరాగ్య ప్రాణియే తరము తెల్పు ..050
కల్పనాశక్తి కలియుగ కాల మాయ
నిత్యమూ అభూత కళలు నిన్ను చేరు
ముక్తియు విముక్తి కోరుట ముఖ్య మగుట
ధ్యాన మన్నదీ ప్రకృతియే ధ్యాస పెంచు ..051
నీతి అవినీతి మధ్యన నీడ తలుపు
మంచి చెడుల మధ్య మనిషి మనసు మాయ
అవసర అనవసర మైన ఆశ మెరుపు
పనులకొరకు ఓర్పుయు లేని ప్రగతి జీవి.. 052
గుక్క గుక్కకు తిక్కగా చుక్క నక్కి
పక్క ఎక్కక మెక్కుచు పీక్కు పిక్క
తొక్క తొక్కిమక్కువ కక్కి తోలు చెక్కి
కుక్క నక్కలా బొక్కెది కూడు గుక్క .. 053
ఎదుటివారి బలము తెల్సి ఎరుక పరచి
సులభ మవదు గెలుపులన్ని సూత్ర మౌను
గుణము గోప్యము మనసుకే గుర్తు చేసి
కష్టమైన గుణము వల్ల కార్య ఫలము .. 054
వైద్యులు మనసు రోగము పైరు పెరుగు
అర్ధమవని రోగి యగుట ఆకృతి గను
వ్రాత లేవైన సృష్టికి వరుస క్రమము
బ్రహ్మ వైద్యులు సామాన్య బంధ మగుట .. 055
పలక రింపులే రసరమ్య పాలు యగుట
చురక లవ్వు అల్లే తీగ చుముక మిచ్చి
తల్ల డిల్ల సవ్వడి వల్ల తరుణి తపన
పెదవులు పలుక రించియు పిలుపు లాయె .. 056
ముందు సంసారిగా మారి మునిగి తేలి
చపల బుద్దియు చూపక చరిత తెల్పి
కొంత తత్త్వము తెలిపియు కోర్క తీర్చి
చేర దూర జార బ్రతుకు చింత వలదు .. 057
ఆలికి విధేయత బ్రతుకు అలక అనక
పలుకు జవదాటని వినమ్ర భక్తి చూపు
సతుల సుఖానికి పతుల సమయ తృప్తి
స్పష్ట అప్రమత్తత ఆలి సహన మేను .. 058
ఆట లో గెల్చి ఓడుట నందరి కళ
హస్త గతము అగుటయును వాస్తవమ్ము
బ్రతుకు బదిమంది సుఖముగా బంధమౌను
సంభ వించు సహజ శక్తి సర్వ మాయ .. 059
ఎవరి లోకము వారిదే ఏమి చెప్ప
ఎవరి శోకము వారిదే ఏల చెప్ప
ఎవరి కామము వారిదే ఏల తీరు
ఎవరి రోగము వారిదే ఏల తగ్గు .. 060
ఉక్క బోత ఎక్కువ మన ఊపిరి గను
పెద్ద వాళ్ళకే తిక్కగా పిల్ల ఏడ్పు
వెన్ను నిమురుతూ అమ్మయూ వినయ చూపు
గుండెలో ఆర్డ్రతా పెర్గి బుజ్జ గింపు
మనిషి ముగ్గుర్ని మరచితే మనుగడేది
నిన్ను సహనంతొ కరుణించు నిజము మనిషి
నిన్ను మరచి వదలి వెల్లె నిప్పు మనిషి
నిన్ను కష్టాల్లొ దించియు నటన మనిషి
తామరాకుపై నీటిబొట్టు తాకనంది
అంత లోననే మాయమే అగుట చూడు
మానవుల జీవితమ్ముయు మడుగు లోన
ఇప్పు డుండుము తర్వాత ఇట వలదులె
జీవితమ్ము అల్పమగుట జీవ మాయ
పుట్ట గానేను ఏడ్పుయు పుడమి తీర్పు
తల్లితండ్రుల పలుకులు తృప్తి నిచ్చె
యవ్వనమ్ము కోరికలతో యేడ్పు పెంచె
మనిషి తీరు మారుట ఏను మనసు ఉన్న
దేవ గురుబోధ నమ్మిన ధరణి యందు
బంజరు ధరణి ఉడికియు బాధ చెందు
వర్షధారలు పడగానె వరుస గలుపు
విశ్వ భారతి స్ధాపన విశ్వమందు
ఆత్మ కధనువ్రాసిన ఘన ఆది యందు
శాంతి నిచ్చు విద్య కొరకు సాయమందు
రచనలన్ని రత్నములు గా క్రమమునందు
ఓ పగలు వెలుగులులేని ఓటమిదియు
రాత్రి నిదుర రానిసమయ రాజ్య మిదియు
సూన్య మైనట్టి మనసుకు సూత్ర మిదియు
తలపు బ్రతుక నీయని రోజు తనము ఇదియు
గమనమే అగాధపు అంచు గమ్య మవుట
ఓ భయమ్ము నడవనీక ఓడి పోవు
ఉనికి గమనించె లోకమే ఊయల గుట
గెలుపు ఓటమి లేనిదై నిజము బతుకు
ప్రేమకే కళ్ళు లేవని బీద పలుకు
వదల లేని బంధము ఇది వెగత పుట్టె
స్వప్న మైన కోరిక ఇది సమర మేను
ఓ నిజం జరా మరణము ఓర్పు లేక
మానవ వనరు లన్నియు మసక బారి
దోపిడీలకు దారిగా బోధ పెరిగె
మది అనారోగ్య యువతయే కలల తీరు
పాలనా పర ము కథలు పండు గాయె
బతుకు లో అంతర్జాలము భాద్యతయగు
మెదడు పనిలేని చదువులు మెలికలు ఇవి
పాఠశాలలు ధనముగా పాయ లగుట
దాహమును తీర్చ నేతల దయ కరువుయె
పిల్లికి ఎలుక లోకువ పిలిపు కరువు
పాలు రోగాన్కి లోకువ పలుక లేక
నీళ్లకే పాలు లోకువ చెలిమి చేరి
బ్రతుకు పిల్లికి ప్రేమయే బంధ మేను
అగ్నికన్ను లౌకిక తత్వ ఆట ఇదియు
మనువు వేదం సమన్యాయ మచ్చు లేదు
పదవి పిల్లి పంజరముగా పలుకు నేర్చె
ఈ ప్ర జాస్వామ్య కదలిక ఈల పాట
చెప్పినది చేయ కుండేటి చేష్ట లవియు
చేసి చెప్పలేని ఫలము చింత లవియు
ధనము దోచి దాచు నిజాయితీ యదనియు
రాజ నీతి అర్ధము కాదు రాజ్య మదియు
తొలకరి చినుకు పులకరించెను పుడమి న
తనివితీరా తపనలు తగ్గు తరుణ మందు
మట్టి పరిమళాలు కదిలే మరులు గొలుపు
బ్రతుకు బాటలోన సొగసు బంధ మగుటె
వాన లొచ్చెను వయసులో వరుస కలిపి
సరిగమల సంగతులు గల్పి సమయ మందు
సుఖము లెల్లరకు తెలిపి సేవ చేయు
జయము కోరునిత్యము శోభ జ్యోతి వలెను
ఏది ఎవరికి తెలుసులే యదలొ మాట
కాలమున కన్ను కుట్టే ను..కాని దేది
గ్రహములు నిగ్రహము లేక గదిలి పోవు
పృధ్వి బాధభరించకే పలుక లేదు
గాలి వడగాలిలా వచ్చె గాళ మగుటె
రుధిర ధారలు విరజిమ్మె రుద్ర భూమి
జీవ నవరంద్రములు ఘోష జైత్రయాత్ర
విశ్వ వ్యాప్తంగ వీరంగ వీధి వీధి
కాల మాయ యిదియు.. కావ్య జగతి గాను
గోల యేలమనలొ..గాధ లగుటె
తాళ లేక పలుకు.. తాపత్రయం మ్ముగా
ఏల అనుటయే దరి యేది కాదు
కాలమే నిన్ను నెట్టుచూ కళలు నేర్పు
తట్టుకొని నిలబడినా క తత్వ మగుటె
పట్టుదలతోనె పనులన్ని ప్రగతి జేర్చు
జ్వాల ప్రజ్వలన జరిగి జ్యోతి జూడు
మీరు ఎవరని అడగను మేలు కొరకు
తెలుగు వృద్ధి కొరకు సేవ తెలుప గలిగె
కలలు రూపము కధలను తెలపదలిచె
వినయ విధిరాత అనభవ వేద వాక్కు
ధన్యవాదాలు తెలుపుతూ ధరణి నందు
చెలిమి చరితము సహజమే చిరు కళలలె
ఒకరికొకరు గా కలసి యే ఓర్పు జూపి
తెలుగు వెలుగుకు సహకార తెలుపు లీల
జ్యోష్యుల కళలు వెలిగెను జ్యోతి వలెను
సంగీతం తోను విద్యల సామ గమన
పిల్లల చరిత భవిష్యత్తు పేరు కొరకు
అరుణ కిరణము వలెసాగు ఆత్రుయ గుటె
పాదము కడిగి కడలియే పలుకరింపు
పున్నమి పరవశించి కదిలే పుడమి తోడు
మేను తాకిన చిరుగాలి మేలి ముసుగు
ఊహకేమనసు కలసే ఊపి రగుటె
తొలకరి చినుకు పులకరించెను పుడమి న
తనివితీరా తపనలు తగ్గు తరుణ మందు
మట్టి పరిమళాలు కదిలే మరులు గొలుపు
బ్రతుకు బాటలోన సొగసు బంధ మగుటె
ఎక్కడున్నాడొ నావాడు ఎరుక లేదు
ఏల చెప్పేది నాబాధ ఏరకమున
ఎటున చూసిన చీకటి ఏల మారు
యదల గోల ఏల తెలుప ఏమి లేదు
జన్మ ఫలమును సాధించి జాతి పెంచి
అసలు నకిలీని గమనించు ఆశ వదులు
ఆట కాదులే అలసట అధిక మగుటె
చెప్ప లేనంత సంఘము చింత తగదు
విజయమా వీర స్వర్గమా వేకు వగుట
స్వీకరించుట వినయమే సేతు వగుటె
నవ్వుతూ మృత్యువును కోరు నటన వద్దు
నీ కళలు నీకే రక్ష నేడు రేపు
సుఖము శాంతి నిచ్చు కధలు శుభ ఘడియలు
మనము సంతృప్తి పడుటయే మనసు పలుకు
ఎంత సాధన శోధన ఏల అనకు
జీవితాన ఆనందమే జీవ వాంఛ
తెలుగు పాటల పందిరి తేట తనము
తెలుపు మనసుపాట కలలు తరుణ మందు
మలుపు జీవితం పాటగా మనసు తృప్తి
ఆశల నిరాశ సంగీత పాట యిదియె
కలలు గనుక కధలు కా నే రవు మదిలో
కళ్ళు మూసుకున్న కధలు చెప్పు
కల్ల పలుకు లన్ని కావ్యము కావులే
కల్ల యనక వలదు కాల తీర్పు
ఎవరు ఎవరు కు బంధము ఏల చెప్పి
బ్రతుకు తెరువు కోసం కధ బడయు చుండు
వివిధ వాంఛలు విషయమే వివరణలులె
వరుస ఏదైన ప్రేమయే వాక్కు తెలుపు
పుండు పొలుసులు రాలితే పూర్తి తగ్గు
పుండు పైపొర పీకితే రుధిర మగును
చెట్టు ఎదిగినా అవసరం చెంత చలువ
ధ్యాన సాధన చేయాలి ధర్మ మగుటె
చిరు నగవు లమోము మనది చిన్నదైన
కధలు తెలిపేటి వినయమ్ము కళలు మనవి
ఎన్ని తెలిపినా లోటుయే ఏల బ్రతు
గళము విప్పి పలుకు ఇది కాల మాయ
మనసు కుదుపులు విశ్రాంతి మచ్చలు గను
అనుభవం తెల్పి అభిమాన ఆట మదియె
వేదనతో వ్రాసినా కధ విజయ ముద్దు
వ్యసన మనుట కాదు భవిత వాక్కు దిద్దు
చినుకు చినుకు గా నదిలోన కిరణ మాయె
రాలిపడ్డ పువ్వు లావుండి రమ్య పరచి
నన్ను తాకొద్దని కడలి నయన చూపు
బ్రతుకు మార్గమే తెలిపేటి బ్రహ్మ సృష్టి
కాల చక్రాన్ని ఆపాలి ఆశ నాది
పలుకు తో నమ్మకం పంచె ప్రధమ బుధ్ధి
ధైర్యమే నన్ను నడిపించు దురిత నందు
మనసు పొంది పంచాలని మౌన దీక్ష
*నిన్న నేడును మరునాడు నిజము నేనె
ఆది అంత సంతోష మౌ అమృత నేనె
నారు నీరు సమస్తము నటన నేనె
ప్రణయ ఖ్యాతి ఖేదం సుఖ ప్రళయ నేనె
*కాల రంగులు ఋతువులు కలసి జూడు
లోక మాయ వెంటపడి యే కోలు కొనుచు
భాషలోనేమనసు మార్పు బంధ మాయ
భ్రష్ట రూపాల మనుషులు భ్రమలు జూపు .
*ఎవరినైన నిందించక ఏల బ్రతుకు
ఎవరినైన తప్పును పట్ట ఏల బ్రతుకు
కాలచక్రం ఇరుసువంచ కామ్య మేది
నిత్య విధిరాత మార్చుట నియమ మేది
*సూర్య కిరణాలు కదలిక సూత్ర మేది
వెన్నెలమ్మ చీర కదిలె విజయ మేది
పుడమితల్లి పచ్చ దనము పూర్తి ఏది
ఎందుకీ వికారాలుగా ఏల వచ్చు
*కాల మార్పు సహజమేను కథలు చెప్ప
మనిషి మార్పులు సహజమే మనుగడగుట
మానవత్వం పరిమళించ మహిమ ఏది
మనిషి వాసనను నిషేధ మార్గ మేది
........
*సత్యము తెలిసే వరకు అసత్య భ్రమలు
దైవ భిన్నరూపాలు గా ధరణి యందు
మనసు ఏకగ్రత యె లేక మచ్చ తెచ్చు
నిగ్రహం దైవ నిర్ణయం నిజము తెలుపు
* స్ఫురణ సులువైన స్థితికాదు సూత్రధారి
నటన ఎవ్వరి కర్ధమొ నయన తీర్పు
నిత్య ఆధ్యాత్మిక మనెడి నీడ బిక్ష
నమ్మ పలుకల మధ్యనే నలిగి పోవు
*బంగరు మెరుపు వన్నెలు భగలు సెగలు
దూకుచు మనజులమనసు దూకుడుగుట
సంగమకలలు పరిహాస స్వేచ్ఛ కదులు
పండుగ జరుగు తరుణాన పదనిస కథ
*ఏది మంచి యనెడి జీవి ఏల చెప్ప
దారి చూప మనిషి లేడు ధరణి యందు
జీవిత సమరం తప్పదు చీకటింట
కొత్త పోకడల బతుకు కొల్ల గొట్టు
* మేక పులి వేట చూసితి కేక కేక
రక్షక భటుల విన్యాస రంగు మారె
ఎవరికీ వారు తెలివితో ఎదను దోచె
చివర కథ కూర్పు అద్భుతం విలువ మెండు
మగువలు చదువేల మనసు గెలుపుచాలు
తెగువ చూప వయసు తెలివి చాలు
తిరగ బుద్ధి యున్న తీపి చేదగుటయే
తరుణ సుఖము పొంద తపము చాలు
అవనిలో ఆడ జన్మయు అద్భు తమ్ము
ఆత్మ విశ్వాసమును చూపు ఆడది యగు
ఇంటి ఇల్లాలు అమ్మగా ఇష్ట మగుట
ఈమె తత్వమే ప్రేమగా ఈద గలుగు
ఉగ్గు పాలతో ధైర్యము ఉజ్వలమగు
ఊహ ఊపిరి దైవత్వ ఊయ లామె
ఋణము తీర్చ సహనం రుజువు ఆమె
ఎగసి పడె కెరటం ఆమె ఎల్లరందు
ఏడు జన్మల స్నేహము ఎరుక గలిగి
ఐణ ఐశ్వర్య నిధి ఆమె అయిదొ తనము
ఓర్పు కునిలువెత్తునిదర్శ ఓడిపోని
ఔ షదవిధి ఔదార్యము ఔను ఆమె
బలము దర్ప అహంకార బంధ మొదలి
వస్తు సంగ్రహ క్రోధము వదలి వేసి
కామము మమకారంమ్మొద్దు కథలు వదలి
సర్వ మోక్ష సమర్ధుడు సమయ బోధ
అతను అమరలింగేశ్వరా ఆమె శక్తి
అతను మంగళ శక్తి శివ స్వ రూప
అతను గళము ఆమెయు అర్ధ నారి నీడ
అతను జాడ ఆమెయు పట్టు ఆట విడుపు
ఏది నిజము నిజాయితీ ఏల చెప్ప
అనుభవం వల్ల తెలియగల్గేటి విషయ
వాంఛలన్ని యు ఎవ్వరూ చెప్ప లేరు
కాలవిధి నిర్ణ నిర్ణయం కలసి వచ్చు
మనిషి ఉన్నతి మహిళయే మరువ కండి
సహన నిజసహాయము చేసి సమయ తృప్తి
ఒక్కటే ప్రేమ యనక ఓదార్పు నిచ్చు
జీవితంలో వెలుగు నింపు జీవి మహిళ..
కాల నిర్ణయం కదలికగాను సహన
కవిత సాహిత్య హృధ్యమ్ము గాను నిత్య
సత్య సంభాషణ పరము నీడ నందు
సమయ స్ఫూర్తిగా స్వేచ్ఛగా సమర తెలుగు..
మహిళ కనిపించని వేరు మనసు చేరు
వనితల దినోత్సవము నాడు వినయ విజయ
ఉత్సవమ్ముగా గౌరవ వేల్పుల నియు
తల్లి చెల్లి అక్క మహిళ తరము ఇదియు..
మాటకు పదును లేకున్న మనసు చేరి
అనువణువు అనుమానము దాని శక్తి
మౌనమునకు రూపం లేదు మనసు చేరి
అగ్ని వలెను దహించుటే దాని శక్తి..
తిండి లేక చావటమనే తీరు లేదు
తినను లేక చచ్చెడి వారు తీరు పెరుగు
తోడు లేని అనాదులు పోరు లేదు
అందరున్న అనాదులు ఆట పెరుగు
మనసు సకలమై సుఖసేవ మంగళమగు
యవరు యని యంచకే మది యాట యదియు
బ్రతుకు భవ రోగ హితము కోరి బంధ సుబ్ర
హ్మణ్య మంత్రరాజము నాకు హాయి గొలుపు
రాజకీయ అదును చూడు రాజ్య మేల
ఉచిత దారదత్తత మని ఊరు మారు
ఓటు ధనము చుట్టు తిరుగు ఓర్పు లేక
కోర్కె తీర్చ బిక్ష ముగను గొప్ప చెప్ప
నేల నీదని చులకన గీత మొద్దు
నేల కొరిగిన జీవితం గీత మౌను
త్యాగ గుణము సహనమేను దారి తెలుపు
నింగి నేల మధ్య బ్రతుకు నీది కాదు
ఒంపు సోంపుల వనజాక్షి ఒప్పు కొనక
వాలు చూపు వల విసిరే వాకిటయని
బిగువు కుచ కుంభలా రాట బేల చూపు
వయసు పొంగు పోరాటమే వెళ్ళు వాయె
*ఆ. మేత కొలువు తట్టె మేలుకొలుపు యిది
మెరుపు కాంతి వలయ మౌన బంతి
మెచ్చు కొనును మదిని మేళతాళముగను
ప్రాంజలి కళ ప్రకృతి ప్రభల తీరు
గండు తుమ్మెద గంతులు గడబిడయగు
ఉండ బట్టలేని మనసు ఉరక లేయ
బేల బ్రతుకు ఊయల యగు బిడియ పడక
మృధు మధుర రసమును జుర్ర ముంగిటయగు
చేయ గలిగిన సాయమే చింత మాపు
స్థిరము శాంతి ఆనందము స్థితి గతి మతి
వినయ ఉపకారము విధిగా విజయ మిచ్చు
విశ్వ విశ్వాస బంధము చెలిమి తృప్తి
నెమలినడకల కళలగు నీడ సినిమ
కన్నులు కలయు కథలన్ని కలుపు సినిమ
హృదయ తాపాన్ని తగ్గించి హాయి గొలుపు
మూడు గంటల సంతసం ముఖ్య సినిమ
నటన సామర్ద సంగీత నయన సినిమ
విజయ వినయ వినోదము విశ్వ సినిమ
గురువు భోదల చిత్రమై గుర్తు సినిమ
చిన్ననాటినుండి స్నేహ చిత్ర సినిమ
తెలుగు చిత్ర పరిశ్రమ తేట సినిమ
ఆత్మ గౌరవాన్ని పెంచు ఆశ సినిమ
శంకరాభరణం కథ సమయ సినిమ
స్వాతి ముత్యాల శుభలేఖ సరళ సినిమ
భారతీయ శృతిలయలు భాగ్య సినిమ
అన్ని నీవను అధ్యంత ఆది సినిమ
రాఘవామరుగేలరా రమ్య సినిమ
సప్తపది అపద్భాన్ధవ సరయు సినిమ
ఆమురళి జీవిత చక్రమ యమ్ము సినిమ
ఇదియు సాగర సంగమ ఇష్ట సినిమ
నిత్య సిరిసరి మువ్వలు నిజము సినిమ
కళల కాలనిర్ణయములే కథల సినిమ
దశదిశలు చాటి చెప్పిన ధరణి సినిమ
ఆత్మ గౌరవ నిలిపేటి ఆట సినిమ
ఆశయాల సాధన సంపద యగు సినిమ
స్వర్ణ కమళ శుభోదయం సత్య సినిమ
ఆత్మ పరమాత్మ లీలలు ఆది సినిమ
శివము సీతామహాలక్ష్మి గీత సినిమ
స్వాగతం జీవనజ్యోతి సమయ సినిమ
కాశి నాధుని సృష్టియే కాల సినిమ
జన్మత విధి స్వయంకృషి జన్మ సినిమ
ధ్యాన వేద మంత్రాలగా ధ్యాస సినిమ
అన్య వర్ణాలను కలుపు అలల సినిమ
మాధవ కళలు మహనీయమ్మగుట సినిమ
అమృత కళల స్వరాభిషేక కధ సినిమ
నేరమూ శిక్ష తెలిపేటి నిత్య సినిమ
విశ్వనాధ్ సృష్టి విశ్వమై విధిత సినిమ
మనసులో నున్న మహనీయ మధుర సినిమ
వెలుగు వైపుప్రయాణము విద్య సినిమ
ప్రతి మనిషి కధ వణికించు ప్రీతి సినిమ
పూల రాగాలు పులకించు పూజ్య సినిమ
ప్రణవ ప్రణతి శృతి ప్రభువు ప్రభల సినిమ
రాజ్య కీర్తి పదవి ధనం రంగు సినిమ
బంధమే వదలి నడక భాగ్య సినిమ
విషయ భోగము విదితమై విశ్వ సినిమ
స్వాతి కిరణాల శారద సహన సినిమ
కనికరము చూపెడి కళాత పశ్విని కళ
కాశి నాధుని చెంతనే చేర్చు వేళ
కాల గర్భాణ కళసేటి కాల మిదియు
జన్మ ఎత్తి జాతి సినిమా జీవి నీవు
జగతిపై హితమును జూపు జపము సినిమ
మనసు బ్రతికించు సెగలన్ని మనువు సినిమ
ఎవ్వ రెవ్వారి కళలతో యదన సినిమ
తెగి సకలము ఆత్మ పలుకు దివ్య సినిమ
నరుడి తలపు నటన ఈశ్వర కళ సినిమ
తలపు ఘటన నడుమ కళ తపన సినిమ
విధి విధాత జీవితము యే వినయ సినిమ
ప్రణవ నాధకనుల కళ ప్రభల సినిమ
ఒప్పు కోనిది సత్యమే ఓర్పు సినిమ
స్వేకరించ లేని నిజము స్వేచ్ఛ సినిమ
సుకృతి యే రస సిద్ధియే సుఖము సినిమ
పుట్టుక మరణం విధిగాను పుడమి సినిమ
నవగ్రహములుగా చెలియంచు నిజము సినిమ
మంచి చెడుల వివరములు మనసు సినిమ
పురష మహిళలు యత్నమే పూజ్య సినిమ
కర్మలు జమ చేసుకొనెడి కామ్య సినిమ
చివరికి మిగిలేది పలుకు చెలిమి సినిమ
కలలు తీర జీవి గమన కాల సినిమ
మలుపు మెరుపు కలలు జీవి మనసు సినిమ
మరణ మైన సహజ మౌను మార్గ సినిమ
వయసులో నున్నప్పుడు పొగ రగుట సినిమ
వయసు ఒదిగినప్పుడు ఓర్పు విమల సినిమ
వయసు పలుకు లన్ని బ్రతుకు వ్యాధి సినిమ
వయసు ఖండాతరము సాగు విద్య సినిమ
............
ఒకరి ఆలోచనలు ఏల ఓర్పు లేక
చెప్ప అద్భుత ధారగా చెలిమి తట్టి
నట్లు, మనసున ఆకాంక్ష నయన తీర్పు
మీ పదకవితా విశ్వాస మెప్పు సలుపు
లేవు వద్దన్న ఊర్కోదు లేత మనసు
ఉంది తినమన్న ఊర్కోదు ఉత్త వయసు
మాట అరదైన ఊర్కోదు మంత్ర సొగసు
ఇదియు మునుపెన్నడు వినలే ఇష్ట కాసు
నీవు బయట చూస్తావు లే నీడ కొరకు
నిన్ను నీవు బయట పడ లేవు నిజము
నీదు మార్గము జగతిలో నియమ ముంచి
బాహ్య జగతి మరచి ధ్యాన బంధ మేను
*ద్వి. మాటలాడే వెన్నెముక లేని జీవి
పాటపాడే సుషుమ్న కనని జీవి
నిన్నటి నన్నయ్య భట్టుగా లేని
మొన్నటి కవి సమ్రాట్టు కనని జీవి
మధ్య వయసులో ఖర్చులు మధన కోర్క
వృద్ధ డైనయనారోగ్య వ్యాధి నిచ్చె
జీవి తములోన రోగము చరిత మార్చు
దీర్ఘ రోగము లొచ్చియు ధరణి యందు
నాది నాది అనేటిది నమ్మి యేడ్పు
వ్యాధు లన్నితో బాధతో వాది యేడ్పు
చావ లేకయు బ్రతుకుతూ జాడ్య మేడ్పు
నిత్య బాధలు, భయాలు, నమ్మి యేడ్చు .
ఎవరు ఈలోక మందున యవరి కెరుక
ఎటుల అన్నను మాయనె యేలు చుండెఁ
మరక లేనట్టి మనుగడ మనుషి లేడు
గురక కలలకు తరగని. గుర్తు తెల్పు
ప్రకృతి ఆక్రమణలెవరి పరము కాదు
అవసరం అవకాశమ్ము ఆశ మనిషి
నీటిని కలుషితం చేయు నిర్ణయాలు
గాలిలో విష పూరిత గమ్ము చేరు
మ0డు టెండలు తగులుట మాడు దెబ్బ
వాన వరదల క్రిములతో వచ్చి జేరు
దుఃఖ సుఖములు వెను వెంట దురద లయ్యె
కరువు తోను మనిషి మారి కధలు తెల్పు
నేలను విచక్షణముచేయు నరుడి రీతి
మానవ అవస రా లతో మనసు కలలు
పుడమి తల్లి బాధ్యతలన్ని భగ్గు మనెను
ప్రకృతి మాతకు తలవంచి పాద మొత్తు
చూడ బడునవి అన్నియు పూలు కావు
చూడ లేనిది యంతయు చూపు కాదు
మానసిక మేను దర్శన మధుర చరిత
ద్రష్ట దృశ్యమంత జగతి ధరణి యందు ......
......
తాను తనలోకి చూడక దాచు దాన్ని
గొప్ప శకలంగ ఊహించి బోధ పల్కు
దైవ దర్శనము సులభం ధైర్య మున్న
వ్యక్తి గతపుణ్య మిగులుయె వ్యసన శక్తి.......
......
పరధనమును ఆశించేటి పాప బుద్ధి
పరుల మానము ప్రాణము పంచ బుధ్ధి
పరుల మాటను నమ్మియు పాడు బుధ్ధి
పరమ భక్తి యు నటనతో పంచ బుధ్ధి......
......
కలియుగ మనషి బతుకుకు కామ్య బుధ్ధి
చపల చిత్తుని మార్చిన చిత్ర బుధ్ధి
తెలివి తెల్లా రె సరికళ్ళ తెప్ప బుధ్ధి
తగిన రీతిలో భార్యతో తపన బుధ్ధి......
......
కుసుమ కోమల హృదయాన చూపు చేరి
వీణ నాదసంగీతము విద్య చేరి
పరిమళించియు ఆనంద పరిమళమ్ము
నిత్య మెరుపుల కదలిక నీడ మనసు ....
......
తాను ఉండియు ప్రత్యక్ష తత్వ శక్తి
తాను ఉండక యెపరోక్ష ధర్మ శక్తి
జ్ఞాన మన్నది మేలుగా జ్ఞప్తి శక్తి
జనన మరణాలు నమ్మేది జీవ శక్తి
.....
రెండు జీవ కణాలకలయిక శక్తి
జీవిలో రసాయనిక కణాల శక్తి
జీవి నవవిద్యు దయ కాంతి జపము శక్తి
జీవి చైతన్య బుద్ధితొ జన్య శక్తి
.....
కంటి పాపతో చూసిన కనుల శక్తి
భావ మాత్రము పొందేటి బంధ శక్తి
విశ్వ సాధన చైతన్య విద్య శక్తి
జీవి అంతర్గత కళల జపము శక్తి
.....
మూర్క మనిషిని స్నేహము ముడుచు శక్తి
విశ్వ మాయను ప్రేమమ్ము వింత శక్తి
మనసు నిజమును తెలుసుకొ మోక్ష శక్తి
చెలిమి విలువలు స్థిరము చెప్ప శక్తి
......
దేహ పరిణామ కణముల దీన శక్తి
కర్త అనునయ వినయము కామ్య శక్తి
కర్మ పరిపక్వ చైతన్య కాల శక్తి
తెలుసు కోలేని మేధస్సు తృప్తి శక్తి
.......
ఎన్ని శక్తులు ఉన్నను యేదొ శక్తి
ముందు ఆరోగ్య ఆకాంక్ష ముంపు శక్తి
కలియుగ బతుకు దీక్షతో కళల శక్తి
ముక్తి కొరకును ధర్మమ్ము ముఖ్య శక్తి
......
లేత పువ్వును చూడంగ లేమి బుద్ధి
కొర్కి చితిపియు నమిలియు తొక్కి తొక్కి
నీకు పరిమళ మివ్వగ నీవు బాధ
పెట్టి కోపస్వభావము పెంచ బుద్ధి
.......
మంత్ర శక్తులు అనుకోగ మాయ ఉండు
యోగ శక్తులు సాధన యోగ్య మేది
యంత్ర మన్నది నిలకడ యనియు త్రిప్పు
తంత్ర మన్నది లోకోక్తి తత్వ బుద్ధి
......
సుఖము వెనుకనే కష్టము శుభము నిచ్చు
గృహము లోనికి వెలుగులు గొప్ప గుండు
గ్రహము లన్నియు తిరుగుచు గోల యనకు
దైవ పూజలు కల్గించు ధైర్య బుద్ధి
.......
ముక్తి కలుగుట దారులు, పుడమి నందు
ప్రేమ పొందియు, కాలాను ప్రీతి జూపు
నిగ్రహమ్ముగా, జీవితపు నియమ కళలు
పరచి, ఉపచార లక్ష్యము ప్రముఖ మనెను
.......
ఆపదలురాగ బుద్ధికి యర్ధ మవదు
సీత కోరగా బంగారు జింక కొరకు
రాము నికల రాజ్యము యిది రమ్య చరిత
మనము ఆర్భాటమును చేసి మనసు మార్చు
.....
చంకలో బిడ్డ ఉన్నను వెతికి నట్లు
కంటి ముందున్న వస్తువు కాన నట్లు
మంచి మాటలు చెవులకు మక్కు వవవు
బుద్ది పెళ్ళాము ఆశకు బుద్ది చెప్పు
......
అద్దపు గదిలో కుక్కలా యదర బెదర
కంది రీగలా శబ్దము కరకరకర
తేనె టీగలా పొడిచియు తీగ లాగు
పందిలా పిల్లలను కని పొర్లు చుండు
......
వెకిలి వేషము ప్రాణాల్ని వెలితి చేయు
గుబిలి పుట్టంగ గుర్రమే గుక్కు చుండు
వావి వరుసలు లేకయు వాత పెట్టు
దొడ్డి దారిన దొంగలా దౌడు చేయు
......
విత్తము కొరకు చెయరాని వింత పనులు
మత్తు మగువకు చిక్కియు మాయ మొచ్చు
విత్తు నాటినా దేవుడే దిక్కు ననుచు
కత్తిలా బత్క లేకయు కదల గలుగు
......
స్త్రీని బేరము పెట్టియు సీగ్ర బుద్ది
స్త్రీల కోరిక తీర్చక వేచి ఉండు
స్త్రీల ఆశలు అడియాశ చేయు చుండు
స్త్రీల బతుకులు వేదన తీవ్రతగను
........
వ్యక్తి బానిస కాదురా వ్యాధి అదియు
ధైర్య సంపద కలిగియు దంచు చుండు
వ్యక్తి కోపము జలముపై వ్యాకరణము
దేనురా, కాల మాయకు ధిక్కి ఉండు
మబ్బౌ రక్త వర్ణములతో మసక వెలుగు
రెబ్బౌ రెక్క రెపరెపల రంగు మారు
దెబ్బౌ పిడుగులా గగనమ్ము దడలు పెరుగు
డబ్బౌ విలువయే లేనిది ఢమరకమ్ము
సవతి పలుకులే ములుకులై సరయు చుండు
అవని మనసును చూడని ఆట మలుపు
భవిత ఎరుగని బ్రతుకులు భయము చెందు
కవిత కనరాదు తిక్కన కవిత లోన
తెలిసి నాక పోరుసలుపు తెలప లేక
నిజము నిర్ధారణలుతెల్చె నియమ మందు
దైవ కృపవల్ల మనముగా దమన నీత
శివుని లీలలే మనలోన నిలిచి పోయె
గుండె లోని మాటలు పెదా లొలుకు పాట
అడుగులో ఆట కదిలే ను అధర మాయ
వెలికి తీయుబుధ్ధి కదిలే వేకువగను
జీవ నృత్యము జరుగుటే జపము తపము
పరచిత అపరిచితుడు గా పాఠ మగుటె
మాన అవమాన అనుమాన మధన మాటె
కాల చక్రం లో తిరిగేను కళల ఆటె
నిత్య సామాన్య మైనదే నియమ తోటె
నిద్ర కాని నిద్రయగుటే నిజము తీర్పు
గమనికయె యగు ధ్యానము గమన నేర్పు
శూన్య స్థితిగను ఆత్మయే సూక్ష్మ మగుటె
నిత్య ఆలోచనలుపోయె నిర్మలముయె
గగన గాలి ఉరవడి తో గలగలలుయె
గాలి తోమేఘముయె కుర్వగాను మేలు
వర్షముగనులే వృక్షాలు వరుస పెరుగు
మంచిహృదయమే తోడుగా మనసు కలయు
గడప గుండెపట్ట దలిచె గడుసు తనమె
చేసి నామంటు ధనమునే చేత పెట్టు
యాత్ర యె ప్రభుత్వ పరమేగ యేమి పలుకు
తిన్న జీర్ణమగుట ఇంక తినుట కేను
లొంగి ఓటువేయు జనులు లోలకమగు
గుండె పూల కుండీలోన గుట్టు విప్పి
నిత్య పుష్ప పరిమళమ్ము నీకు నాకు
సుందర సురభి శోభిత సుఖము శాంతి
కుసుమ మంత్రణం జీవితం కూడు గుడ్డ
తనువు మరుగెడు నీటిలో తరిగి నట్లు
మనసు కలతకు చిక్కియు మరిగి నాట్లు
చిత్త మేలేక నిష్క్రతి చెదిరి నట్లు
చిక్కులు ఎగిరే దూది లా చెదిరి నట్లు
చిత్త వృత్తినిరోధించె చేష్ట లుడికె
నిగ్రహమ్ముగా సాధన నెంచ నేల
సకల సంపదలు కలుగ సౌఖ్య మేది
విశ్వ మందునే జనులలో విజయ గోల
ఉన్న ఆ ఒక్కటే లేక ఉరికు పరుగు
ప్రేమ ఉన్నతిండికి అది పెనుగు లాట
ధనము నన్ను ఆశల వేట దుమ్ము లాట
సరస సంభాషణలు తెల్పె సరుయు మాట
రాత్రి చోరుని కార్యము రంగరించి
నిద్ర మేము జయించు నిర్మలమ్ము
రక్షగా విశ్వమంతయు రాత్రి యందు
నిద్రపోని శునకములా నీడగుండు
జాలి చూపుల జాబిల్లి జామురాత్రి
చల్ల చల్లగా వెచ్చగా చరిత చెప్పు
పంఖ తిరుగుతూ నన్నునూ పట్టలేరు
కీచురాళ్ళ శబ్దాలుగ కిటికి చెప్పు
అంధకారపు వేళలో అలుక తీర్చి
ఆదమర్చియు నిద్రలో ఆశ తీర్చి
భద్రతయు కుటుంబములలొ భర్త ఓర్పు
భయము లేదులే చెప్పిన భర్త తీర్పు
వ్యధ మాపియు హాయిగా వాయిదాను
వరుస మార్చియు సుఖమును వాక్కునిచ్చి
వాలు కన్నుల వరజాక్షి వరము తీర్చి
ఒడుపు పట్టుకు బిగింపు ఓర్పు చూపె
గుండెనేరాన్ని తలపక గంటు పడ్డ
రాత్రి రాకాశి అరుపులు రమ్యగున్న
రవ్వ వెలుగున రంజిల్లె రతిగ రాత్రి
నీరుకారి పోయేదిగా మంచు కరిగె
మగువ మనసున మక్కువ మగని చూపు
చూపు కనరాని మనసున చేష్ట లుడుకు
చెప్ప నలివికానికబుర్లు చెప్పు చుండి
బంతి చామంతి ఏకమ్ము భాగ్యమవ్వు
నిద్రపోనియ్యకుండగా నిజాము చెప్ప
భావ భవభంద విషయము బాధ తెల్పి
జన్మ పరిపక్వతను తెల్పి జాతరంత
సలిపి మనసు మనసునందు సలపరింత
రాత్రి మెల్ల మెల్లగను జారు రక్షకుండు
వెలుగు నీవంతు ఇంకను విలువ ముద్దు
ఒకరి తర్వాత పనులుగా ఒకరు వచ్చె
భార్య భర్తల ప్రేమలు భాగమయ్యె
నిత్య నవజీవితమ్ముగా నిజము మలుపు
ఉభయ హృదయాల సరిహద్దు ఉవ్వి లూరి
వయసు వలపుల వర్ణాలు వన్నె తెచ్చె
వధువు వరుల విరహ జోల వాసి కెక్కె
తేటగీత పద్యాలు
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
కదన రంగము స్వర్గమై కదల వెలుగు
చెదలు పట్టిన తరువుయే నేల కొరుగు
అదును తప్పిన గుణముయే ఆట మెరుగు
చదును చేయు బుద్ధి నిజము చెప్ప గలుగు ... 1
.....
వదలి వెళ్లిన మనసేను వలపు ధనము
కదిలె కాలాల అనుభూతి కథల ముదము
చెదిరె బుద్ధి కుశలతలు చితక తనము
ముదిరె వయసుకు సుఖములు మఖ్య గుణము ... 2
.....
అదుపు తప్పిన వసుధనం ఆటపట్టు
పొదుపు చేయు మూలధనము పోరు పెట్టు
చదువు లున్న ఆశధనము జాడ్జ్య మెట్టు
కుదుపు లున్న మనసుధనం కూడు పెట్టు ... 3
.....
పొదల మాటున మృగములు తొంగి చూడు
వదల బుద్దియు మార్చియు వెతికి చూడు
కదిరి లాగతిరిగి లోక కలలు చూడు
ముదిరి బెదరక భాధలు ముందు చూడు ... 4
.....
పదవి యందు కోరిక చేర పగటి కలలు
పెదవి మధురాను భవముయే పెర్చు వెతలు
పిదప బంధుననిపలికె పేరు కథలు
మదము చే మనుగడ ముప్పు మాయ సొదలు ... 5
......
వరము కోరి నీతొ వాక్కుగా తెల్పితి
కరుణజూపుమమ్మ శారదాంబ
కరము జొచ్చి కోరె కామితార్ధినియమ్మ
శరణు ఘోష నీకు శాంతి నిమ్ము
.....
చినుకు లేని రాజ్యమున నే చింత లేల
మతము పెట్టని కూడుకు మానమేల
కమిలిన శవాలు కంపుయే కధలు యేల
తల్లి నేలను చీల్చేటి తురుము నందు
......
నీకు సూర్యోదయాన్నిలె నిమ్మకుండు
నీవు సూర్యాస్తమనకులే నిన్ను మార్చు
నీకు శిశిరంలొ వాసంత నీదు వాక్కు
నీవు హేమంతము చదువు నీకు రక్ష
.....
విద్యలలొ అవిద్య యనుట విధము ఏల
పొందినది లోక కల్యాణ పద్ధతి యగు
అనుభవంతో ను తెల్పిన ఆశ అనకు
జ్ణాన మెప్పుడూ గొడ్డలి గాటు కాదు
.....
ఉద్దెరసలహా భవితకు ఊత మవదు
తాతకు అనవసరము గా సాగు కధలు
రైతు దేశము మనదియే రకము లేల
పంటకుయె గిట్టు బాటే ది ఫలము ఏది
........
మగువ నిద్ర మధువు తోను మనసు కూర్చి
పాత్ర లింకయు కలలుగా పడక మార్చి
గాజు రెప్పల బ్రతుకును గడప నుంచి
వచ్చి పోవు వారికి వేడి వరుస మార్చె
......
కళ్ళు చెమ్మగిళ్ళె నటన కాల మగుట
పట్టుదలతో ను కధలకు ప్రాణ మిచ్చె
తాత వారస నటనతో తెలుగు భాష
నందమూరి తారక రామ నాట్య రుద్ర
---
ప్రేమ చూపిన మాత్రాన పేరు రాదు
సమయ సద్విని యోగమే సహన మవదు
ఓర్పు ఓదార్పు వినయమ్ము ఓడిపోదు
అందుకే ప్రేమ ఓర్పు యే ఆదు కొనుట
...
మాతలకు మాత ద్రౌపతి మాన మిచ్చె
గౌతముని పత్ని అహల్య గౌరు జూపె
సుమతి సుఖము స్వేచ్ఛ కు నాంది సూత్ర మాయ
మాతలకు మాత విటులకు మాత వేశ్య
....
ధ్యానమే పరధ్యానమై దారి మార్చె
మనసు కల్లోల పరుచేను మాయ జేరి
నేను ఘటములా నుండినా నియమ మేది
కరువు వరదలు భయముగా కమ్ము చుండె
.....
*..వెన్ను తట్టెను హృదయము వేకువగుటె
విన్నపమ్ములు వివరాలు విజయమగుటె
విశ్వ సందేశ మైనది విదియ యనుటె
మాతరంఅను శ్రీ రామ మహిమ యనుటె
....
జన్మ జన్మల బంధము జపము రామ
రామ రామయనుచు కార్య రక్ష ధీర
విద్య సాహసం సంపద కల్గి వినయ మూర్తి
కార్య దీక్ష దక్షత కల్గి కావ్య వీర
......
ఏది నీది వేడి చురక ఏత మగుట
ఆది నున్నది అదియేను ఆశ తలపు
వాది యై ప్రతి వాదిగా వాద మేల
.......
మనిషికి సుఖము లేదులే మనసు గతియు
స్థితికి మనిషి వెతలు పొందు సిరుల గతియు
సిరులు పొంద ఇంతి కలలు స్థిరము గతియు
మర్చి పోవడానికి మత్తు మందు గతియు
.......
చెప్ప నెట్టివాడను నేను చెలిమి బ్రతుకు
తప్పు ఒప్పులు పైవాడు తట్ట గలుగు
తరతమ యనక ఒక్కడై తడుము కొనుట
మేలు చేయ మనసు శాంతి మీకు నాకు
.......
నిజము గుండె తట్టు పలుకు నీడ యగుట
వైద్య వృత్తి నిజము తృప్తి వేడకగుట
నీ అబద్ధము తక్షణం నిజము యగుట
అర్ధ మగుటేను విలపించు ఆత్మ ఘోష
......
చెత్త పోతె దుర్వాసన చింత ఏల
ధనము లేదు బంధువు దుర దేది నీకు
కీర్తి పోతె కుక్క అరుపు కిచకిచలగు
నీదు ఆరోగ్య మే పోతె నీడ కరువు
.......
నాలొ నీవు నీలో నేను నటన యగుట
గోల లేని బ్రతుకు నేడు గొప్ప యగుట
బేల పలుకుల ప్రేమయే బోధ యగుట
గాయమైన తేరుకొను గమ్య మగుట
ఉరకల పరుగులు వేయ ఉద్య మగుట
పారుతున్న ఆలోచన కాల మగుట
అంతరంగాన్ని ఆడిస్తుఆశ యగుట
తలపులు తడుతూ తడిపొడి తపన యగుట
తందనాలాడుతున్నాయి తపన లగుట
యోచనలు వెంటబడుతున్న ఎల్ల లగుట
హృదయమే ఊగిసలగుటే హాయి గనుట
చింతనలు చాల పుడుతున్న చేష్ట లగుట
చలిత చిత్తము చంచలం చేయ ననుట
వంటిలోకొస్తున్న మనసు వర్ణ మగుట
విరివిగాచేయమంటున్న వినయ మగుట
భావము బయటకొస్తున్నను బంధ మగుట
కల్పనలు కడుతోస్తున్న కలలు కనుట
కమ్మనికవితలగుటయే కథలు యగుట
కలలు కోకొల్లలుగనులే కలసు కొనుట
వ్యక్తపరచమంటున్నాయి వయసు యగుట
అనుభవాలు కలుగుతున్న ఆశ లగుట
చక్కనికవితలు సృష్టియె చిత్తమగుట
మనసు మారముచేస్తున్న మనుగడ గుట
మది బయటకొస్తానంటు మేలు యగుట
మనసు మురిపించు నంటుంది మార్గ మనుట
కాలమే మనిషికి విధి కర్త యగుట
దేశమే సుఖ ప్రాప్తికి దివ్వె యగుట
తే.గీ పుట్టుకకు మూల మేబేల పుడమి నందు
నిత్య వెలుగును అందించె నీడ తోడు
జాతి దాసోహ మనుటయే జగతి వెలుగు
ఆరని వెలుగై అమ్మగా ఆశ్రిత మది
తే.గీ సృష్టి వలయం వనిత బంధ శృతులు గతులు
ప్రతిఘటన నారికే గతి ప్రగతి రీతి
బందనా ప్రతి బంధాలు బాధ్యతగుట
కనబడు మనుష్య జాతికి కళలు నేర్పు
తే.గీ తిరుగులేని వేదన తోను తీవ్ర బాధ
మాతృ ప్రసవ సృష్టి జగతి మార్గ బోధ
వికృత చేష్టలున్నను ఓర్పు వినయ వనిత
ఎదురు తిరుగు హృదయ బాధ ఏమి చెప్ప
తే.గీ ధనమదాందులు పెరిగిరి ధరణి యందు
వావి వరుసలు చూడని వాద పురుష
తల్లి తండ్రుల పంచెడి తనయులగుట
గర్భ శోకమే ఆతల్లి గడవ లేక
***
నిన్ను పిల్వ లేను తల్లి నీదు చలిమి చాలులే
కన్ను మార్చి నేను పోను కనుల విందు చేసేదా
వెన్ను చూపె బుద్ధి లేదు వేచి సేవ నీకులే
నన్ను నమ్మి నావు నీవు నాదు భక్తి నీకులే
కడలి లో యెడతెగనిసిరి కాల మార్పు సంద్రమై
విడమరచని గుప్తమౌను విశ్వవాకి టేయిదీ
తడబడు అలలసుడు లేను తట్టలేని గమ్యమై
విడిపడకయు లవణ మేను విశ్వమందునే విధీ
ఆశ అన్నదేను కోరి పాశ మెనూ జీవితం
నాశనమ్ము కాని బుద్ధి నటన తోను పాశమై
శ్వాస కోరి జీవనమ్ము సాధ్య కళల బంధమై
ధ్యాస సంగ మౌట నిజము ధ్యాన మార్గ విశ్వమై
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి