12, అక్టోబర్ 2017, గురువారం

సుమతీ శతకం.సుమతీ శతకం.

తల్లిదండ్రులు తమ బిడ్డలను సన్మార్గ గాములను చేసే ప్రథమ ప్రయత్నమే
ఈ సుమతి శతక సాథన . ఇది కంద పద్య శతకం.
శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకలజనులు నౌరా యనగ
ధారాళమైన నీతులు
నోరూరగఁ జవులు పుట్ట నుడివెద సుమతీ !

ఓ సుమతీ .! ఆ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వలన ప్రాప్తించిన కవితాగుణం తో సమస్త ప్రజానీకము భళీ యని మెచ్చుకొనేటట్లు , ధారాశుధ్ధి కల్గి , ప్రసిద్ధములై ,అపవాదము లేని నీతులను మళ్ళీ మళ్ళీ వినాలనే కోరిక కలిగేటట్లు గా చెపుతాను.

......... ----- అని ప్రతిజ్ఞ చేసి , కవి ఈ శతకాన్ని ప్రారంభిస్తున్నాడు. ఇది కవికి తన కవిత్వం పై తన కున్న అపారమైన నమ్మకానికి ఉదాహరణ. ఆ నమ్మకం వమ్ము కాలేదు . ఎనిమిదివందల సంవత్సరాలుగా నోరూరి ,చవులు కలిగించి తెలుగు వారి నాలుకలపై సుమతీ పద్యాలు నాట్యమాడుతూనే ఉన్నాయి. ఇదే కదా ఒక మహాకవికి జాతి అందించే మహా నీరాజనం..

తెలుగు నాట పూర్వకాలం లో ఏదైనా వ్రాయడానికి మొదలుపెట్టే ముందు “శ్రీరామ జయం” అనో , “శ్రీరామ “ అనో “శ్రీరామ రక్ష” అనో ,వ్రాసి , కన్నుల కద్దుకొని తరువాత ,వ్రాయడం ప్రారంభించడం మన పూర్వీకుల అలవాటు. ఇది తెలుగు జాతి నడచిన బాట. ఆ శ్రీరాముడు తెలుగు వారి ఆరాథ్యదైవం కదా. అదే ఈ కవి చేత శ్రీరామ అనిపించింది . కావ్యాన్ని "శ్రీ " తో ప్రారంభించడం శుభకరమని మన పూర్వ కవులు ఒక సంప్రదాయం ప్రవేశపెట్టారు. " మంగళాదీని మంగళ మథ్యాని ."..... అనేది ఆర్యోక్తి...

neti kavialu -4

om sri ram - sri maatrenama:

ప్రాఞ్జలి ప్రభ - నేటి కవిత

కాలం ఆగదు - కావ్యం దాగదు
క్షణం ఆగదు - వీక్షణం దాగదు
నిర్ణయం మారదు - స్వేశ్చ దాగదు
దక్షత మారదు -  దీక్ష దాగదు

ప్రేమ ఆగదు  - ఫలం దాగదు
పకృతి మారదు - ఆకృతి దాగదు
స్థితి మారదు - ప్రజ్ఞ దాగదు
శిక్షణ మారదు - సంస్కారం దాగదు

లక్ష్యం మారదు - ధైర్యం వీడదు
సమయం చాలదు - సౌఖ్యం మారదు
బద్ధకం చేరదు -  అతి నిద్రా చేరదు
నిర్మలం చెదరదు - మౌనం వీడదు

చైతన్యం కోసం సాగిపో
దీపావళి వెలుగుతో పంచుకో
నిన్ను నువ్వు ప్రశ్నించుకో
నీలో ఉన్న పరమాత్ముని తలుచుకో

         


ప్రాంజలి ప్రభ - నేటి కవితలు 
*సుప్రభాతం నీకు శుభోదయం

అరుణారుణ వర్ణాలతో
అనంతకోటి విశ్వాన్ని
ఆత్మీయతాభావంతో
ఉత్తేజపరిచే ఉదయభానుని
ప్రభాతవేళలో మెలుకో
ఓ మిత్రమా  
యుగధర్మం తెలుసుకో
ఓ మిత్రమా     

పృథ్వి ఒక్కసారిగా
చీకట్లను కమ్ముకున్న ముసుగును
తొలగించగా ఆదిత్యుని
అత్యోన్నతి భగ భగ
కిరణాలను ఆహ్వానం పలికింది

సరస్సులోని  కమలం
తన్మయత్వంతో వికసించింది
గూటిలోని చిలకా గోరింకలు
గుసగుసలాట మొదలైనది
చిగురాకు కదలిక మొదలైంది

 గంగమ్మ తల్లి కిరణవెలుగుతో
 నూతనోత్సాహముతో పరవళ్లు
తొక్కుతూ కదలిక ప్రారంభిస్తుంది
సకలజీవకోటికి ప్రాణా ధారమవుతుంది

జీవకోటి కనులు విప్పి
ప్రకృతినిచూసి ఆనంద
పారవశ్యంలో కర్తవ్య
నిర్ధారణకు వేళైనది

మేలుకో మిత్రమా మేలుకో
ప్రాంజలి ప్రభాస గీతమ్ తో
ప్రాపంచిక విషయాలను
అర్ధం చేసుకొని మేలుకో     

సుప్రభాతం నీకు శుభోదయం 
--((*))--Pranjali Prabha -  నేటి కవితలు 

విజ్ఞానాన్ని దాచకుండా
విజ్ఞతను ప్రదర్శించి, వినయంతో
అజ్ఞానాన్ని తొలగిం
చే జ్ఞానాన్ని భోదిన్చుటే గురు ధర్మం

భయం చెందక ని
ర్భయం గా గురుసేవ చేసి, విద్యే అ
భయం గా మారాలంటే
స్వయంగా విద్య నేర్చుకోవడం శిష్య ధర్మం     

మాత, పితలకు దూరంగా  
శతృవులు దేశంలో చొరబడ కుండా
పతాకమును,ఆయుధమును
చేత పట్టి మాతృ దేశరక్షణే సైనిక ధర్మం

వృద్ధ తల్లి తండ్రులను
శ్రద్ధ గా ఆదరించటం, పోషించడం, అ
శ్రద్ధ చూపక మందు లిచ్చి
యుద్ధ ప్రాతిపతికగా రక్షించుటే పుత్ర ధర్మం

బిడ్డలకు మంచి చెప్పి
బిడ్డల విద్యాభివృద్దికి సహకరించి
అడ్డగోలుగా తిరుగ కుండా
బిడ్డలకు అండగా ఉండుటే తండ్రి ధర్మం

భర్త సంపాదన, ఖర్చుకు
కర్తగా ఉండి, సమర్దవంతంగా, సత్ ప్ర
వర్తనగా, పిల్లల కండగా      
భర్తని గౌరవిస్తూ కష్టపడుటే ఇల్లాలి ధర్మం

సోమరి తనం లేకుండా
విమర్సించక ధర్మాన్ని తెలుసుకొని
మమకారం, మనోధైర్యం
సమపాల్లలో నడుచుటే పురుష ధర్మం

నమ్ముకున్న మితృనికి
కమ్ముకున్న చీకట్లును తొలగించి,   
 సొమ్ములతో, ఆదరించి,
వమ్ము కాకుండా నిలిపేదే మిత్ర ధర్మం

ధర్మ సాక్షిగా పెళ్ళాడి
కర్మల విధిగా, సంసారం నిర్వహించి,
మర్మము తెలిసిన భర్త   
కూర్మం లా భార్యకు రక్షే వివాహ ధర్మం    
* వేంకటేశా  * వేంకటేశా  * వేంకటేశా

కవితను వ్రాద్దామనుకున్నాను వేంకటేశా
నా ప్రేరణ నీవేకదా, నీ రుచులు అభిరుచులు తెలుపవా
గాత్రం తో పాడుదామకున్నాను వెంకటేశా
నీ నిద్ర భంగం చేయలేను, అయిన ఏ రాగంలో పాడాలో తెలుపవా

విరహం నన్ను ఆవరిస్తున్నది వేంకటేశా
కోరిక ఇదని చెప్పలేను, అయిన అనుభవశాలివి తెలుపవా
దాహంతో తపిస్తున్నాను వేంకటేశా
దాహం తీర్చుకోలేను, అయిన దాహం తీర్చే దారి తెలుపవా

దూరం నన్ను భయపెడుతున్నది వేంకటేశా
అది నీపై అలకని చెప్పలేను, అయిన దగ్గిర మార్గం తెలుపవా
నీ స్నేహం కోసం అర్ధిస్తున్నాను వేంకటేశా  
సరస్వం నీకే అర్పిస్తున్నాను, అయిన మనస్సుకు శాంతి తెలుపవా

ఆశలు నన్ను తరుముతున్నాయి వేంకటేశా
కావ్యాన్ని వ్రాయలనుకున్నాను,  అయిన ఎలా వ్రాయాలో తెలుపవా
ద్యాస అంతా నీ దగ్గరే ఉంది వేంకటేశా
ధ్యానం చేస్తున్నాను, అయిన నీపై ఏకాగ్ర దృష్టి ఎలాగో తెలుపవా

శ్రావ్యంగా గానం చేయాలనుకున్నాను వేంకటేశా
లక్ష్యాలను అధికమిస్తున్నాను, అయిన లక్ష్యానికి దారి చూపలేవా
దాన, ధర్మాలు చేస్తున్నాను వేంకటేశా
అనురాగభంధలో ఉన్నాను, అయిన భందాలకు విముక్తి తెలుపవా

చీకటిలో ఏమిచేయాలో తెలియకున్నాను వెంకటేశా
వెలుగు చూడలేకున్నాను అయిన నా మస్తకమునందు వెలుగు నింపలేవా
బంధానికి అతీతుడనై ఉండలేకున్నాను వేంకటేశా
భక్తి  భావనలో ఉన్నాను,అయిన భాగ్యం కలిగించే మనస్సు అందించవా

జగత్తు కోసం ఏమిచేయాలో తెలపాలి వేంకటేశా
అభినయించ గలను, అయిన నటనా సూత్రధారివి కదా ఎలాగో తెలుపవా
భంగిమలా బ్రతకాలనుకున్నాను వెంకటేశా
నాట్యం చేయాలనుకున్నాను, అయిన వశీకరణం  ఎలాగో తెలుపవా


ఉచ్వాస వద్దన్నా వెంబడిస్తున్నది వేంకటేశా
నిశ్వాస ఎలా చేయగలను, అయిన ప్రకృతిలో ఎలా బ్రతకాలో తెలుపవా
తనువంతా నీకే అర్పిస్తున్నాను వేంకటేశా
ప్రాణాలను నీదగ్గరే ఉంచుతున్నాను, అయిన నీలో ఇక్యమార్గం తెలుపవా  
ఓం శ్రీ రామ వేంకటేశా
ఓం శ్రీ కృష్ణ వేంకటేశా
ఓం కార వేంకటేశా   
నమో నమ: నమోనమ: నమోనమ:


--((*))--

9, అక్టోబర్ 2017, సోమవారం

నేటి కవితలు -3ప్రాంజలి ప్రభ - నేటి కవితలు

నేను దుర్మార్గుడనే - నా చేతలు దుర్మార్గాలే
నేను పంచిన అన్నాన్నే - మీరు తింటున్నారులే

ఉదయ భాను శక్తితో - వృక్ష సంపద శక్తితో
గాలి సహకారంతో - ఉప్పొంగే జలా ల శక్తితో
మనుష్యల కష్టం తో - స్త్రీ,  పురుష, జంతు బలంతో
పంట పండించి మీకు అందించా - దానిలో దుర్మార్గం లేదే

పుణ్యం పొందిన భూమితో - పాపం తో చేసిన విత్తులతో
స్వార్థము తో వేసిన ఎరువులతో - మద్యాన్ని పోయుటతో
కాలం కాపుగా ఉండటంతో - అమాయక జీవాల సహాయమంతో
అబద్ధమనే మాటలతో - నిజమనే పంటను ఇచ్ఛా దానిలో దుర్మార్గం లేదే

ఆకాశం సాక్షితో - పంటను ఇంటికి చేర్చి పంచటంతో
ఎగబడి అందు కోవటంతో - అద్భుతమని అమోఘమని అనటంతో
పనిలో దుర్మార్గం లేదు, అటు వంటి వాడు దుర్మార్గుడెలా అవుతాడు
మా వరకు మా ఆకలి తీర్చిన అన్నపూర్ణ వల్లభుడు

ఇది కలియుగం బ్రతుకుని సద్వినియోగం చేసుకోక తప్పదు
మనిషి మనిషిగా బ్రతుకుటకు అందరి సహకారం కోరటం  తప్పా       

__((*))--

ప్రాంజలి ప్రభ - నేటి కవితలు -

నడకకు దూరం తెలియదు
పిడుగుకు మౌనం తెలియదు
వరుసకు వైనం తెలియదు
తరువుకు వైరం తెలియదు

మరుపుకు మోసం తెలియదు
చెరువుకు మీనం తెలియదు
వయసుకు కామం తెలియదు
తనువుకు తాపం తెలియదు

చినుకుకు శబ్ధం తెలియదు
మగువకు మర్మం తెలియదు
మగనికి భిన్నం తెలియదు
వలపుకి వాటం తెలియదు

మాటలకి భావం తెలియదు
చేష్టలకి లౌక్యం తెలియదు
కడలికి కెరటం తెలియదు
కలలకి నిద్ర తెలియదు

నాకు ఏమీ తెలియదు
మనసు నిద్ర పోనీయదు
మమత కలవ నీయదు
కవితలు వ్రాయకతప్పదు

చదివి భాధపడవద్దు
చదవమని చెప్పొద్దు
షేర్ చయ్య వద్దు
లైక్ అసలివ్వ వద్దు
తెలియక వ్రాసాను
నన్ను అర్ధం చేసుకుంటేచాలు
మీ "మ. రామక్రృష్ణ
అందరికీ ధన్యవాదాలు

ప్రాంజలి ప్రభ - నేటి కవితలు -3  వేళా పాళా అనకే
ఆకలి గీకలి అనవద్దు
గడ బిడ చేయకే
దీక్ష గీక్ష అనవద్దు

తక మక పెట్టకే
తరుణం దాటనీయవద్దు
బేరసారాలు ఏందుకే
యెక్కాక దిగు అనవద్దు

తళుకు బెళుకు చూపకే
వద్దు ఇప్పటొద్దు అనవద్ద
ఉక్కిరిబిక్కిరి చేయకే
రేపు మాపు అనవద్దు

ఎక్కువతక్కువ చూడకే
లాభం ఏమిటనవద్దు
కళ్ళు వళ్ళు తిప్పకే
వళ్ళు గుళ్ళ చేయవద్దు

నీ నవ్వే నాకు పడకే
నీ నడకే నాకు చురకే
నీ మోనం నాకు ఓకే
నా వైనం నీకు ఓకే
ఇద్దరి ఏకం ప్రపంచానికి ఓకే

ప్రాంజలి ప్రభ - నేటి కవితలు -3  


మనసు ఉంటే నే ప్రేమకలదు
ప్రేమ ఉంటేనే.చెలిమి కలదు
చెలిమి ఉంటేనే బలము కలదు
బలము ఉంటేనే మమత కలదు

మమత ఉంటేనే అప్పు కలదు
అప్పు ఉంటేనే మెతుకు కలదు
మెతుకు ఉంటేనే నడక కలదు
నడక ఉంటేనే బతుకు కలదు

బతుకు ఉంటేనే గుర్తింపు కలదు
గుర్తింపు ఉంటేనే విలువ కలదు
విలువ ఉంటేనే ప్రేమ కలదు
ప్రేమ లేనిదే మనిషికి బ్రతుకే లేదు

ప్రాంజలి ప్రభ - నేటి కవితలు -3  

ఎందరున్నా గాని ఎవ్వరు లేనట్టు
ఎవ్వరు లేకున్న అందరున్నట్టు
ఉండి లేకున్నా బ్రమణ మన్నట్టు
భ్రమణం చుట్టూ మనసు ఉన్నట్టు

మనసు మనుగడలో ఉండు గుట్టు
అది ఎప్పుడు చేయ కూడదు రట్టు
గుట్టురట్టు చేయనని చేయాలి ఒట్టు
ఒట్టుకు కట్టుబడి ఉండుటే జీవమన్నట్టు

ప్రకృతిని బట్టి వాక్కు ఉండాలన్నట్టు
వాక్కుబట్టి గౌరవము పెరుగుతున్నట్టు
మనిషి మనుగడకు ఇది ఒక మెట్టు
మెట్టు మెట్టుకి కొత్త ఆలోచన రాబట్టు

కాలము ఎప్పుడు తిరుగు తున్నట్టు
మనిషి ఆయువు తరగి పోతున్నట్టు
దాన ధర్మాలు మన: శాంతికి మెట్టు
ధర్మం తప్పితే భాధపడక తప్పదు ఓట్టు

--((*))--

8, అక్టోబర్ 2017, ఆదివారం

నేటి కవితలు -2


ప్రాఞ్జలి ప్రభ - నేటి కవితలు


ప్రాంజలి పభ -నేటి కవితాలు


Pranjali Prabha
(ఇది నా పాట)
పున్నమి తళుకుల చిన్నది
వెన్నెల జిలుగుల్లో ఉన్నది
చరణం -1
నకసక పర్యంతము దోచుకో మన్నది
చక చక నడిచి దరిచేరి సుఖపడ మన్నది
భువిలోని స్వర్గ సుఖాలు పొంద మన్నది
తనువు తపనలను  తగ్గించు కోమన్నది  

పున్నమి తళుకుల చిన్నది
వెన్నెల జిలుగుల్లో ఉన్నది
చరణం -2
 వేడికి నవనీతంలా కరుగుతా నన్నది
 వేడికి కర్పూరం వెలుగు నందిస్తానన్నది
 తపనకు తరుణోపాయము చేపుతానన్నది
 వయసుకు తగ్గ సరి జోడై సై సై అంటున్నది   
పున్నమి తళుకుల చిన్నది
వెన్నెల జిలుగుల్లో ఉన్నది
చరణం -3
చల్లని మనసును పంచి సుఖపడ మన్నది
తల్ల డిల్లకు తరుణము ఇదే రా రమ్మన్నది
కళ్ళ బొల్లి మాటలకు నమ్మక రా రమ్మన్నది
కళ్ళు కళ్ళు కలిపి తన్మయం చెంద మన్నది 
పున్నమి తళుకుల చిన్నది
వెన్నెల జిలుగుల్లో ఉన్నది

 అనుగ్రహించు

ఓం శ్రీ రామా -
మా మాదిలో లోపభూయిష్టమైన ఆలోచన నుండి 
మమ్ము ఉద్ధరించగ రావా రామా
ఓం శ్రీరామా -
మాయకు చిక్కాము ముంచుతావో తెల్చుతావో భారమంతా
 నీ మీదే వేసి తప్పు చేస్తున్నాము సరిదిద్ద లేవా రామా
ఓం శ్రీరామా -
మా మానసంతా మీ ముంగిట ఉంచాము, సక్రమముగాను 
 అక్రమముగాను ఉంచినా హెస్చరించక ఊరుకున్నావా రామా
ఓం శ్రీ రామా -
మాలో మాకు మమతలు పెంచి, తుంచి ఆడుకుంటూ 
ఆవేదనకు గురిచేసి వింతగా చూస్తు ఊరుకుంటు
 ఉండి తెలియనట్టు ఉంటావరామా
ఓం శ్రీ రామా-
మార్పుకోరము మాలో ఉన్న మాయామర్మాన్ని తొలగించి 
మది తలపులు నీపై ఉండేటట్లు అనుగ్రహము అందించుటకు రావారమా
ఓంశ్రీరామా -
మా ఆలోచన, మా నడక, మా ప్రార్ధన మీపై ఉంచాము,
 నీవు పాలముంచినా నీట ముంచినా మొత్తము భారము
 నీపై ఉంచుతున్నాము మమ్ము రక్షించగ రావారామా, 
లేదా హనుమంతుని అండగా ఉండమని ఆజ్ఞ ఇవ్వగలవు రామా
--((*))--

ప్రస్థానం ( భగవానుడు)

పట్టు పీతాంబరముల.. చుట్టుకొనువాడు..
పసిడి కట్ల పిల్లoగ్రోవి ధరియించువాడు ..
కాటుక తో అందగించుకనులవాడు
శిఖిని పింఛమమరిన. చిన్నవాడు.
వెలుగు విరజిమ్ము మోమువాడు
నీలి జలదంపు మేని వన్నె వాడు
సాధు జనులను రక్షించు వాడు
ప్రేమతో పిలిస్తే ప్రత్యక్షమయ్యె వాడు

ఆకాశం లో శాంతి నెలకొను వాడు
భూమండలం లో శాంతి నెలకొనువాడు
సముద్రజలం లో శాంతి నెలకొనువాడు
సమస్త ప్రాణులలో శాంతి నెలకొనువాడు

పాడ మంజీరా రవళుల పడుచువాడు
కరుణ సారించు దృక్కుల కన్నయ్యవాడు
వేణు నాదమ్ము జగము లూగించువాడు
సకల జీవుల ఉల్ల మలరించువాడు.

భక్తి, రక్తిని బోధించ అవతారమొందినాడు
భక్త కో టిని బ్రోచిన భాగవతుడు.. వాడు.
ఇహమునకు .పరమునకు ఈప్సితమునకు
ముక్తి.. మార్గమ్ము జూపెడి.గీతాచార్యుడతడు.

ప్రకృతి పరిధిని, మించి రక్షించు వాడు
పరిమితులను దాటి ధర్మాని కాపాడేవాడు
ఏదో దేహంలో మనుష్యు ల్లో దేవుడై ఉంటాడు
లీలలను ప్రదర్శిస్తూ ఆగమ లక్ష్యాన్ని పూర్తి చేస్తాడు
--((*))__ప్రాంజలి ప్రభ - నేటి కవితలు

తలచితి నిను నయనములతొ
వలచితి నిను తనువు తపనతొ
కలయని తహ తహ తలపుతొ
వలదనిన కనుట చిరు నగవు

మలయ పవనములు సెగ తొ
పలు రకముల పిలుపులతొ
వల వలపులు వగచుట తొ
విల విల మని తలచుట

బలము మదిని తొలచుటతొ
కలిమి మనసును పిలుపులతొ
వలచి వలదనుట కలల తొ
చెలి చెలి అని పిలిచిన తడబడు

తలపుల తడబడు తపనలతొ
కలువలు కలియుట కలవరముతొ
తలుపులు తెరచి తహ తహ కురులతొ
పిలుపులు తలచి మరులు గొలుపు
--((*))--ప్రాంజలి ప్రభ - నేటికవితలుమస్తిష్కం లో శక్తి దాగి ఉందిలే
జాతికి ఆధునిక ప్రగతికి కావాలిలే 

అవనిలో సాధ్యము కానిది లోదులే అద్భుతములు సృష్టించేది మనుష్యులే 

మెదడన్నది మనకున్నదిలే
మమతన్నది మన భందువులే
మానవత్వాన్ని నిద్ర లేపాలిలే
మనుగడకే అది ప్రశాంతి నిచ్చునులే

కాలమనేది కాగితములే
కాగితము మీద నా ఆలోచనలే
కవితా స్వప్నాల నా ఊపిరిలే
భావనా శక్తికి అవధి ఏదియు లేదులే

జ్వలించే ఆలోచనలు సృజనాత్మకములే
మనసంతా కవి కల్పనా చాతుర్యములే
సమ్మోహం కల్పించే మస్తిష్క భావములే
మెదడు కణితను సృష్టించింది భగవానుడులే

పని మీద మనసు పెట్టి ఆలోచించితే
పూర్తి సామర్ధ్యాన్ని ఉపయోగించ గలిగితే
సత్యాన్ని గ్రహించి తీవ్రంగా శ్రమించగలిగితే
భవిషత్ కాలం పూర్తి విషయాలు తెలియునులే

పెళ పెళ మరిగే మనసుంటేనే
తళ తళ ఊహలు వెంబడిస్తుంటేనే
సలసల కాగిన పిదప అనుభవం వస్తేనే
కమ్మని కవిత్వము సజీవులకు అందించునులే  

స్త్రీ పురుష చిన్న పెద్ద కాదులే
ప్రకృతి కళాత్మక శక్తికి అడ్డు రాదులే
మిన్నైనా మన్నైనా వెలుగు పరచగలదులే
మనిషి ప్రజ్ఞకు దేవతలు సైతం ఈర్శ్య పడతారులే
--((*))--


   ఆలోచించండి

ఒక విదేశీ విధానంలో ఉన్న ధర్మాన్ని గమనించండి
మంచిని గ్రహించి నలుగురికి తెలపండి .
దేశీయ విధానాన్నిసహకరిస్తూ ప్రోత్సహించండి
సమృద్ధిగా దేశాభివృద్ధికి సహకరించండి
 .
ఒక వాణిజ్య విధానంలో నాణ్యత చూపించండి
పోటీయుగంలో నాణ్యతతో నిజాయితిని చూపండి .
విద్యా విధానాన్ని అభివృద్ధికి సహకరించండి
బ్రతికి, బ్రతికించే మార్గం ప్రతి ఒక్కరూ చూడాలండి
.
ఒక ద్రవ్య విధానం ఆలోచించండి
భవిషత్తును గమనించి పిల్లలకు పంచండి .
ఒక కుటుంబం విధానం మరువకండి
ఉన్న మార్గంలో కొత్త దనం నేర్పండి
.
వ్యవసాయ విధానాన్ని ఊహించండి
నేలకు హాని కలుగ కుండా జాగర్త పడండి
ఒక ఆరోగ్య విధానంలో మార్పులు తెలుసుకోండి
హృదయానికి హాని కలగని మాటలు పంచండినేను నాది అనకురా 
జీవితమే ఒక వేదమురా 

సుఖదు:ఖాలకు నిలయమురా 
బందనాలనుండి విముక్తి పొందాలిరా 
సహనంతో కర్మ విముక్తి పొందాలిరా 
ప్రాపంచిక సుఖాలు వదిలితే శాంతిరా 

నేను నాది అనకురా 
జీవితమే ఒక వేదమురా 

గురుబోధలో సత్యాన్ని తెలుసు కోవాలిరా 
జ్ఞానంతో నిర్వి కల్ప సమాధిని చేరాలిరా 
నిర్వాణ స్థితి యొక్క ఆనందాన్ని పొందాలిరా 
భేదము చూడక అంతా ఒకటేనని భావించాలిరా

నేను నాది అనకురా 
జీవితమే ఒక వేదమురా 

అత్యుత్తమ సేవలలో జీవితము గడపాలిరా
ఇతర సంభందాల మాటలకు లొంగక ఉండాలిరా  
ధర్మ పలుకులతో అవ్యక్తమైన ఆనంద స్థితి పొందాలిరా 
స్వత్సమైన ఎరుక స్థితిలో ఉండి కార్యం నిర్వహించురా  

నేను నాది అనకురా 
జీవితమే ఒక వేదమురా 

నిన్ను నీవు తెలుసుకోవటానికి ప్రయత్నించుమురా  
సప్త ధాతువులతో కూడిన శరీరము మనదిరా 
కామ క్రోధ,మోహ,మద,మాశ్చర్యములను గెలవాలిరా 
పంచ భూతాలకు లొంగి జీవితము సాగించాలిరా 

నేను నాది అనకురా 
జీవితమే ఒక వేదమురా 

స్త్రీ లోలునిగా మారక స్త్రీని గౌర వించుమురా 
స్త్రీ శక్తిని తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడుకురా 
స్త్రీ సుఖ సౌఖ్యములను అందించే కలియుగమురా
మాత, పిత, గురు, దేశ, సేవే నిత్యమని గమనించాలిరా 

నేను నాది అనకురా 
జీవితమే ఒక వేదమురా 
  

5, అక్టోబర్ 2017, గురువారం

నేటి కవితలు

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:


ప్రాంజలి ప్రభ - నేటి కవితలు 

నల్లని మేఘముల్
కమ్ముకొనే ఆకాశంబునన్ 
ఫెల్లని ఘర్జనల్
మ్రోగు చుండేనే ఆకాశంబున 
చల్లని గాలుల్
వర్షపు జల్లులతోనే పుడమినన్ 
పల్లవ శోభలం పుడమి
 పచ్చని చీర దాఁల్చెన్

నింగి మరుడు వరుసగా
 నీటి బాణాలు కురిపించెన్
పృథ్వి భామిని కేమే
 బాణాలకే నెలలు నిండెన్
కడుపు పండి పండి తానూ
 కంకులం ప్రసవించెన్
వర్షపు ఋతువు యందు
 వసుధ సంతసం పంచెన్

--((*))--


ప్రాంజలి ప్రభ - నేటి కవితాలు -8

ఏ ప్రేమ ఫలితమో భూమి 
ఇరుసు లేకుండా తిరుగు చుండు 
ఏ ప్రేమ ఫలితమే నక్షత్రాలు 
మెరుస్తూ నింగినుండి రాలక ఉండు  

ఏ ప్రేమ ఫలితామో కడలి 
భూమిపై పొంగక ముడుచుకొని ఉండు  
ఈప్రేమ ఫలితమే పర్వతము 
పెనుగాలి విసురుకు కదలక ఉండు 

ఏ ప్రేమ ఫలితమే పురుషుడు 
స్త్రీ మాటకు కట్టు బడి ఉండు 
ఏ ప్రేమ ఫలితమే వనిత
పురుషుని చేష్టలకు కట్టుబడి ఉండు   

ఏ ప్రేమ ఫలితమే సంపద
నష్టపోయిన ధైర్యము తోడుగ ఉండు 
ఏ ప్రేమ ఫలితమే కష్టాలు 
వచ్చిన నేనున్నానని శక్తి తోడుగ ఉండు   

ఏ ప్రేమ ఫలితమే యవ్వనం 
సక్రమ మార్గాన సద్వినియోగం అగుచుండు 
ఏ ప్రేమ ఫలితమే సంసారం 
మూడుపువ్వులు ఆరుకాయలుగా ఉండు   
--((*))--

ప్రాంజలి ప్రభ - (నేటి కవితలు -8 ) 
మాహాత్ములుగా ఎదిగేవారికి
ఎంత మంది కృషి ఉంటుందో 
ప్రాస కవితగా తెలుపుతున్నాను  

స్వత సిద్ధం కొంత 
ప్రకృతి సిద్ధిం కొంత 
వంశాకురం కొంత 
తల్లితండ్రుల దీవెన కొంత  
గురువులు పెద్దలు దీవెన కొంత 
చదువనే తెలివిని సంపాదిస్తారు అంతా 

క్రమపద్ధతిలో ఎదుగుదల కొంత 
పరిపూర్ణ విధ్య  సాధన కొంత   
భావోద్వేగాల భావాలు కొంత 
దేశ విధ్యా స్వభావాలు కొంత 
మనిషి వృద్ధి చెందుటకు సహకారం అంతా 

స్పర్శతో భుజం తట్టి ధైర్యం చెప్పేవారు కొంత 
చిరునవ్వుతో చదివించే తల్లితండ్రులు కొంత 
పట్టుదలతో ప్రోత్సాహంతో క్రమశిక్షణ కొంత 
శ్రద్ధగా వింటూ, సహనం వహిస్తూ, నేర్పు కొంత 
ప్రతిచర్యకు పోకుండా శ్రద్ధతో అభ్యసించేదే నిజమైన విద్య   

ధర్మం తప్పక చదివిన చదువును 
అందరికి పంచె విధానమును 
ఫలితము ఆశించక బోధనను 
దేశాభివృద్ధికి సాహకరించే వారే 

మనుషుల్లో ఉన్న మహాత్ములు 
--((*))--

ప్రాంజలి ప్రభ - నేటి కవిత (షట్సంపత్తి )  -7

విషయంలో ఉన్న మిధ్యత్వాన్ని గురించి
అనిత్యతను మల్లి మల్లి గమనించి గుర్తించి
విరక్తమైన మనస్సును లక్ష్యమంవైపు మళ్లించి
సమస్తము మార్పును చేయునదే శమము

కర్మేంద్రియాల వళ్ళ వచ్చే ఆకర్షణ    
జ్ఞానేంద్రియాల వళ్ళ వచ్చే ఆకర్షణ
భోగవస్తువల వళ్ళ వచ్చే ఆకర్షణ
మళ్లించి మనస్సును మార్చేదే దమము

దు:క్ఖాల భావాలను మనసుకు రానీక
భాదలు, కష్టాలను మనసుకు రానీక
ప్రతీకార వాంఛ మనసుకు రానీక
శాంతంగా, సహనంగా ఉండుటే తితిక్ష

బాహ్య వస్తువులకు ఆకర్షణ చెందక
ఇతరుల మాటలకు ఉత్తేజ పడక
ఇంద్రియాలకు సంచలనం చెందక
మనస్సును ఆరోగ్యముగా ఉంచుటే ఉపరతి

శాస్త్రపు వాచ్య లక్ష్యార్ధాలను
పెద్దల గురువుల వాక్యాలను
వివేక విజ్ఞాన విషయాలను
మనస్సు సత్య దర్శనంగా మారేది శ్రద్ధ

సునిశితమూ, తీక్షణమూ
వివేక విజ్ఞాన పూరితమూ
బుద్ధి సత్య మార్గ సమగ్రంగా,
ఏకాగ్రంగా ధ్యానిస్తు ఉండే మనసే సమాధానము

--((*))--ప్రాంజలి ప్రభ - నేటి కవితలు -6
lave is home                 = ప్రేమే మనకు గృహము
Love is boring             =  ప్రేమే మనకు నిష్ఠత
love is exciting             =  ప్రేమే మనకు అద్భుతం
love is listening            =  ప్రేమే  మనకు శ్రవణం

love is forgiving           = ప్రేమే మనకు క్షమాపణ
love is imperfect         = ప్రేమే మనకు అసంపూర్ణం 
love is chemistry         = ప్రేమే మనకు రసాయణం 
love is selfless             = పెమే మనకు నిస్వార్ధం 

love is being partners  = ప్రేమే మనకు భాగస్వామ్యం
love is corny as hell    = ప్రేమే మనకు హెల్
love is finding a balance = ప్రేమే మనకు తెలిపే పద్దు
love is compromise     = ప్రేమే మనకు సహకారం

love is kiss on the fore head  = ప్రేమే మనకు తలపై ముద్దు
love is sharing the covers      = ప్రేమే మనకు సహచరితం
love is just talk but not action = ప్రేమే మనకు సంతులనం
love is laughing  at stupid things together = ప్రేమే మనకు నవ్వులమయం

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో

ప్రాంజలి ప్రభ - నేటికవితlu 6

ఓ మనిషి నిజ స్థితి
గమనించటం ఎవరికైనా కష్టం
ప్రస్తుతమున్న స్థితి
బ్రతుకు మార్గం చూపుట నిజం

కొరికే లేకున్న స్థితి
బంధాలను తెంచుకొని ఉండటం 
వ్యక్తిగమనించే స్థితి
ఎదిరించలేని పరిస్థితి ఏర్పడటం

వినవల్సిన పరిస్థితి  
గత్యంతరం లేక చెవులప్పచెప్పడం 
కనవల్సిన పరిస్థితి
ప్రకృతి భాధను తప్పక భరించటం

పల్కవల్సిన పరిస్థితి
మధవర్తిగా న్యాయాన్ని చెప్పడం
నిర్వికల్ప ఉపాధిస్థితి
ఉపాధి పొంది జీవనం గడపడం

నిత్యనిర్మలమైన స్థితి
ఎప్పటిపని అప్పుడు చేసి ఉండటం
సందేహ నివృత్త్త స్థితి
సమయం వ్యర్థంకాక పరిష్కరించటం

మాలిన్య ధ్వంస స్థితి
ఆరోగ్య రక్షణ కోసం ఇదొక పోరాటం
స్వేశ్చతో యోగ స్థితి
పక్షిలాగా బ్రతకాలని ప్రయత్నిచటం

శాశ్వతమేదో తెల్పె స్థితి
నమ్మకమే ఆరోగ్యానికి నిదర్శనం
మనస్సు స్వభావ స్థితి
అందరిని ప్రేమించి ఆదరించటం

ఇంద్రియాల నిగ్రహ స్థితి
చాతకానిదాన్ని ప్రయత్నం చేయటం
సత్య మైన ఆత్మ స్థితి 
కొత్త ప్రయోగాలతో నిత్యా నూతనం

వయస్సును గుర్తించే స్థితి
మనిషి ప్రవర్తన బట్టి తెలపటం
మనస్సును భ్రమించే స్థితి
అతివేగం ఆయాసం కల్పించటం

కాలమును జయించే స్థితి
కానీ వాటికి ప్రయత్నిమ్చాటమే నాటకం 
ప్రకృతిని కల్సి భరించే  స్థితి
చీకటి వెలుగుల్ని భరించి జీవించటం

 --((*))--

ప్రాంజలి ప్రభ - నేటి కవితలు - 5

తోలి తొలకరి చినుకులు
మది తలపుల ఉడుకులు
కలువ కలయిక వలపులు
మమత మలుపుల తలుపులు 

విలువల సెలవుల ఉరకలు
ఒకరికొకరు సరిగమపదనిసలు
అవధి ఉరకల కమతములు   
కుశల శుభ విరిసిన వనములు 

పవన వలయపు తపనలు
తరువు కదలిక చిటికెలు
తరుణములొ మరలె కురులు
కతల కలయిక మనసులు 

సిరిపలుకుల కులుకులు
నవవిధముల మలుపులు
ఎవరికి తెలుపని తెనియలు
మనసు మనసు కలిసె కళలు  
--((*))--


నేటి కవిత  -3

ఊపిరున్నంతవరకు
ఉనికిని చాటుకోవలసిందే
ఎండిపోనంతవరకు
ఏరు పారుతూ ఉండవలసిందే 

ప్రాణమున్నంత వరకు
తల్లితండ్రులు ప్రేమను పంచాల్సిందే
ఓర్పు ఉన్నంత వరకు
ప్రతి ఒక్కరు శ్రమించాల్సిందే 

నీరు పడేంత వరకు
బావిని పట్టుదలతో తవ్వవలసిందే
మూర్ఖుడు మారేంతవరకు
భయంతో వేచి చూడ వలసిందే 

బద్ధకం వదిలే వరకు
మెదడుకు పని చెప్పవల్సిందే
క్రమశిక్షణ ఉండేంత వరకు
ఓర్పు పట్టుదల ఉండవలసిందే


కష్టాలు వచ్చేంత వరకు
సుఖాల జీవితమ్ గడపవల్సిందే  
ప్రాణాలున్నంత వరకు
దీపారాధన, దైవప్రార్ధన చేయ వల్సిందే
  
ధర్మబుద్ధి ఉన్నంత వరకు
యమధర్మరాజూ వెనక్కు పోవాల్సిందే
కర్మ శుద్ధి అయ్యేంత వరకు
జన్మజన్మల జీవితం గడపాల్సిందే
 --((*))--


నేటి కవితలు  -2   
నవ్వలతో నడిరేయి.
నవ్వల్లో ఉంటుందీ మరో హయి.
నవ్వల్లో సరస సంభాషనోయి.
అదే వికటకవిలో ఉండే తెలివాయి

లలిత లావన్య లాస్యికా

సహజ సౌందర్య శ్రావికా
చరిత చమత్కార చంద్రకా
కవిలో తెలివితో శ్రృంగారమికా

అంతు చూడాలని నీకోరికా
నవ్వలు ఈసమయంలో చాలికా
సౌందర్యము దోచుకో ఇకా
నేను నీ సొంత అభిసారికా

ఈ వెన్నల సొంతం నీ కికా
కన్నల విందు చేసుకో ఇకా
కాల సద్వినియౌగం నీ కికా
వేడికి చల్లదనం చక చకా

అమ్మో నీవు వికటకవి మరోకోణం
శృంగార కవి యెన్నో కళలు చూపావు చక చకా
 
నేటి కవితలు  -1   

చేయి చేయి కలిస్తే చెప్పఁట్లు 
మనసు మనసు కలిస్తే ముచ్చట్లు  
పువ్వు పువ్వు కలిస్తే పూదోట 
మనిషి మనిషి కలిస్తేనే సృష్టి 

సప్త స్వవరాలు కలిస్తేనే సంగీతం 
సప్త సముద్రాలు కలిస్తేనే ప్రపంచం  
సూర్యుడు సంచరిస్తేనే వేడి వెలుగుల మయం 
చంద్రుడు సంచరిస్తేనే వెన్నెల చల్ల దనం 

మేఘాలు పక్షులు విహరిస్తేనే ఆకాశం 
సర్వం భరిస్తూ వృక్షాలు వికసిస్తేనే భూమి 
సర్వప్రాణుల ఆహారంకు సహకరించేదే అగ్ని 
ప్రతిప్రాణి జీవించుకు ముఖ్యమైనది  గాలి

మేఘాలు పక్షులు లేకపోతే ఆకాశాన్ని చూసేదెవరు  
ప్రేమతో ఉండే జీవులు, వృక్షాలు ఉంటేనే పుడమి 
ప్రాతినిముషం అగ్ని గాలి వ్యర్థం కాకుండా ఉంటేనే 
ప్రపంచం దేదీప్యమానంగా వెలుగుతా ఖాయం       

--((*))-- 

ప్రాంజలి ప్రభ - నేటి సూక్తులుప్రాంజలి ప్రభ - సూక్తులు (త్రీ)
ప్రాంజలి ప్రభ - నేటి సూక్తులు 

ఏనికమోముతా ల్పెలుక నెక్కిన రావుతురాజు సౌరసే 
నానియనుంగుఁబెద్దన వినాయకదేవుఁడు కర్ణతాళఝం 
ఝూనిలతాడనంబున నిరంతరమున్ బ్రబలాంతరాయసం 
తానమహాఘనాఘన కదంబములన్ విదళించుఁ గావుతన్ 

ఏనికమోముతాల్పు= గజముఖుడు, ఎలిక... రాజు= మూషికవాహనుడు, సౌర..అన్న=దేవతల సైన్యాధిపతి కుమారస్వామి అన్నగారు అయిన వినాయకుడు, కర్ణ .. తాడనంబునన్= చెవులగాలితో, ప్రబల .. కదంబములన్=విఘ్నములను కారుమబ్బులను, విదలించుగావుతన్=పోఁగొట్టుఁగాక 

గజముఖుడు,  మూషికవాహనుడు, దేవతల సైన్యాధిపతి కుమారస్వామి అన్నగారు అయిన వినాయకుడు,  చెవులగాలితో, విఘ్నములను కారుమబ్బులను, పోఁగొట్టుఁగాక 


శ్రీనాథ కవిసార్వభౌముని "శ్రీభీమేశ్వర పురాణము (భీమఖండము)" నుండి గజానన ప్రార్ధన


ప్రాంజలి ప్రభ - నేటి సూక్తులు 
అపూర్యమాణ మచల ప్రతిష్ఠం,
సముద్ర మాపః ప్రవిశన్తి యద్వద్.

ఆపూర్వమాణ మంటే అంతటా నిండినది. అచల ప్రతిష్ఠర్సకదలక మెదలక ఉండేది. అది రాలేదే, ఇది రాలేదే, ఇంకా నీరు చాలదే అని సముద్రం దుఃఖించదు. కొంచెమయినా చలనం లేనిది సముద్రం.
అంతటా ఆవరించి ఉండేది  " గాలి " ఇదే జీవకోటి ప్రాణాధారం, సముద్రంలో ఎంత నీరు చేరిన తన గుణం మార్చుకోదు, అట్లే అహంతో ఉన్నదా మగవాడికి ఎన్ని మంచి  చెప్పిన యాలకు ఎక్కవు కదా ? ప్రాంజలి ప్రభ - నేటి సూక్తులు 

"కవితా కన్య రసజ్ఞత కవి కన్నా
రసజ్ఞుడెరుంగు గాని కవి కేమి ఎరుగు;
నవ కోమలాంగి సురతము
భర్త ఎరుంగును కాని తండ్రికేమి తెలియును"
,
భావము:
కవిత యొక్క భావంలోని అందం అది వ్రాసిన కవికంటే దాన్ని ఆస్వాదించే రసజ్ఞులకే బాగా తెలుస్తుంది. అలాగే యవ్వన స్త్రీ యొక్క సొగసులు తండ్రి కంటే కూడా భర్తకే బాగా తెలుస్తుందిప్రాంజలి ప్రభ - నేటి సూక్తులు - 6 


శరచ్చంద్రప్రకాశేన వపుషా శీతలద్యుతిమ్,
ధ్యాయేత్సింహాసనాసీనముమయా సహితం శివమ్.

శరత్కాలమునందలి చంద్రునివంటి కాంతిగల దేహముతో గూడినవాడును, చల్లనికాంతిగలవాడును, సింహాసనమున గూర్చుండినవాడును, ఉమతో గూడిన శివుని ధ్యానించుచున్నాను.

దేవత: శంభువు
ఋషి: శంభువు

--((*))--

ప్రాంజలి ప్రభ - నేటి సూక్తులు - 5 

అదిపర్వం 1-6 -175 
క// ధరణీ దిశ ప్రసారిత ;గురుకర నికరంబు లుడిచికొని దీర్ఘనిరం ;// 
తరగతి ఖిన్నుడ పోలెను;హరిదశ్వుడు విశ్రమించె నస్తాద్రిదరిన్ 

దీర్ఘనిరం తరగతిన్= ఎడతెగని నడక చేత // 
ఖిన్నము =భేదము నొందినది //ఖిన్నుడ పోలెను= అలసెనో అనునట్లు//కరము =కిరణము ,చెయి 

విరామము లేని సుదీర్ఘ గతిచేత అలిసెనో యనునట్లు ; సూర్యుడు భూమిపై చాపిన స్వీయ కిరణములనే చేతులను అస్తగిరిగుహ లోకి ముడుచుకొని విశ్రమించాడు . 

ఈ పద్యములో ప్రతిఒక్కరు పగలు శ్రమించిన రాత్రి యందు నిద్రలో విశ్రాంతి సుఖము కలుగునని నీతి ణాని తీసుకోక తప్పదు 


--((*))__

ప్రాంజలి ప్రభ - సూక్తులు (4 )

అహు: సత్యంహి పరమం !
ధర్మం ధర్మవిధో జనా:
(రామాయణంలో అయోధ్యకాండ, 14 వ సరిగా, ౩వ శ్లోకం) 

ధర్మం తెలిసిన సజ్జనులు సత్యపాలననే పరమధర్మమని చెపుతూ ఉంటారు

రామాయణంలో దశరధుని భార్య కైకేయి "వరాలిస్తావని ప్రతిజ్ఞ చేసావు"  తీర్చమని అడుగగా "ఎదో తప్పు చేసినట్లు తెగ భాద పడతావేమి " ధర్మం తెలిసిన సజ్జనులు సత్యపాలననే పరమధర్మమని చెపుతూ ఉంటారు " నీ మాటను నిలబెట్టుకొని ఉత్తమగతిని పొందవయ్య అని పలికిన సందర్భం. 

"ప్రతిఒక్కరు వాగ్దానాలు చేసేటప్పుడు చాలా జాగర్త పడాలి లేదా దశరధుని గతి పట్టవచ్చు అనే హెచ్చరిక".  

ఒక స్త్రీకి సహాయం చేద్దామను కోవటం తప్పుకాదు నెరవేర్చ గలమో లేదో ఆలోచించాలి అనేదే ఇందు నీతి 
శ్రీ మాత్రే నమః 

అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె 
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో 
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా 
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్. 

భావము: 
దుర్గాదేవి తల్లు లందరికి తల్లి; సప్తమాతృకలను కన్నతల్లి; ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి; అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి; రక్కసి మూకలను అణచిన యమ్మ; నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి; అయిన మా అమ్మ దయాసముద్రి అయ్యి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక. 
--((*))--
తల్లి హృదయంలో నిండు మనసుతో బిడ్డ లందరు సేవచేస్తూ ఆరాధించాలనేదే ఇందు నీతి  

ప్రాంజలి ప్రభ - సూక్తులు -1

ధర్మోహి పరమోలోకే
ధర్మే సత్యం ప్రతిష్ఠితమ్
(అయోధ్యకాండము -21వసర్గ - 40 వ శ్లోకం)
సత్యమనే గుణం సక్రమంగా నిలబడాలంటే ధర్మమార్గమే ప్రధానమైనది.

రామాయణంలో అరణ్యమునకు పోయిన రాముడ్ని కలసిన భరతుడు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకము చేయిన్చుకొని మా కందరికి సంతోషాన్ని కలిగించమని వేడుకొనెను. వారిమాటలకు సంతోషం వక్తపరుస్తూ  రామచంద్రుడు పలికిన మాటలు.

"తండ్రి మాటను జవ దాట రాదు అనేది ధర్మము, సత్య గుణం రక్షించ బడాలంటే ధర్మాన్ని అను సరించి తీరాల్సిందే "  
 "తండ్రి మాట " ఎట్టి పరిస్థితిలో తృణీకరించ కూడదనేది రాయణంలోని సూక్తి
--((*))--

ప్రాంజలి ప్రభ - సూక్తులు -2

పితుర్హి వచనం కుర్వన్ !
నకశ్చిన్నామ హీయతే !!
(అయోధ్యకాండము -21వసర్గ - 36 వ శ్లోకం)

"తండ్రిమాటను పాటించు వాడు ఎన్నటికీ నాశనం పొందడు"

రామాయణంలో అరణ్యమునకు పోయిన రాముడ్ని కలసిన  "తల్లి కౌసల్య "  అయోధ్యకు వచ్చి పట్టాభిషేకము చేయిన్చుకొని మా కందరికి సంతోషాన్ని కలిగించమని వేడుకొనెను. తల్లికి దు:ఖం  కలిగించరాదు నాయనా  అన్నమాటలకు సంతోషం వక్తపరుస్తూ  రామచంద్రుడు పలికిన మాటలు.

"తండ్రి మాటను జవ దాట రాదు అనేది ధర్మము, తండ్రి మాటకు కట్టుబడి ఉన్నవాడు మంచి ఫలితము పొందుతాడు,  ధిక్కరించిన వాడు నాశనము పొందుతాడు అది మీకు తేలుసు కదమ్మా,  సత్య గుణం రక్షించ బడాలంటే తండ్రి మాటను ధర్మాన్ని అను సరించి తీరాల్సిందే "  
 "తండ్రి మాట " పాటించేవాడు సుఖ సంతోషాలతో ఉండగలడనేదే రాయణంలోని సూక్తి
--((*))--

2, అక్టోబర్ 2017, సోమవారం

చదవండి విజ్ఞాణ వంతులు కండి


లోకంలో శ్రీ పురుషులకు ప్రేమను పుట్టించేవాడు మన్మధుడు, అతని అల్లి తండ్రులు  లక్ష్మీ నారాయణులు అసామాన్య ప్రేమ స్వరూపులు, పుణ్య దంపతులు.

లక్ష్మీనారాయణులే రుక్మిణి కృష్ణులుగా జన్మించారు.  కృష్ణుడు (విష్ణువు)  లౌకిక పారలౌకిక సుఖాలను ప్రసాదించే  మహానుభావుడు, రుక్మిణి (లక్ష్మీ) సంపదలకు ఆది దేవత, లౌకికమైన సంసారసుఖాన్ని సంపదను, మోక్షాన్ని ప్రసాదించగల తల్లి, వీరి కుమారుడే ప్రద్యుమ్ముడు (మన్మధుడు), మనకధలో మన్మధుడు ప్రవేశించుటవల్ల  కొంత శృంగార రస ప్రభావము గల కధగా మారే సూచన కనబడుతున్నది

రచయత ముందు మాట

 పింగళి సూరన రచించిన ప్రభావతి ప్రద్యుమ్నము ను స్వకరించి కధారూపముగా వ్రాయదలిచాను ముందుగా గురువుగారు " పింగళి వేంకటకృష్ణారావుగారికి " సాష్టాంగ నమస్కారాలు అందిస్తూ,  సాహిత్య పరిమళాలను  లను అందిస్తున్న సాహితీ కిరణం యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియ పరుస్తూ సరళ పదాలతో కదా రూపంగా వ్రాసెదమని సంకల్పించాను, మీ అందరి ఆశీర్వాద బలంతో ధైర్యం చేస్తున్నాను.

                                                                                              ఇట్లు మల్లాప్రగడ రామకృష్ణ
     

త్రిమూర్తులు
చదవగానే అర్ధమయ్యేది ద్రాక్ష పాకం, కొద్దీ ప్రయత్నంతో అర్ధమయ్యేది కదళి (అరటి పండు) పాకం, చాలాకష్టపెట్టేది నారికేళ (కొబ్బరికాయ) పాకం , ఏవి ఏమైనా ప్రతిఒక్కరు చదవాలని అర్ధం చేసుకోవాలని ప్రాంజలి ప్రభ ముఖ పుస్తకము మీముందు కొస్తున్నది, చదవండి విజ్ఞాణ వంతులు కండి, చదివింది  తెలియ పరుస్తూ దేశపురోభివృద్ధికి సహకరించిండి      

1, అక్టోబర్ 2017, ఆదివారం

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యంశ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం

ఓం హ్రీమ్ శ్రీ౦ శ్రీమాత్రే నమ:

శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్ని కుండసంభూతా దేవకార్యసముద్యతా    .... 1

శ్రీమాతా                   :"శ్రీ శబ్దము వాక్పరము " కావున వాక్కులను కలుగ చేయుటకు ఈమెతోసమానమైన ఏదేవతలు లేరు కనుక శ్రీ మాతా అని పిలుస్తారు    
శ్రీ మహారాజ్ఞి             : సకల ప్రపంచ పాలనా సామర్ధ్యము కలది కావునా "శ్రీ మహారాజ్ఞి" అని  పిలుస్తారు
శ్రీమత్సింహాసనేశ్వరీ    :బంధమోక్ష స్వరూపాది సకాలమును చూపింప నారభించు" సింహవాహనముగా  గల ఈశ్వరీ "
చిదగ్ని కుండసంభూతా:అగ్నిగుండములో పుట్టి, పూర్తి బ్రహ్మతేజస్సుతో, ఇచ్ఛా తేజస్సుతో శక్తి  రూపముగా ప్రత్యక్షమైన తల్లి
దేవకార్యసముద్యతా   : దేవకార్యార్థము కొరకు ఆవిర్భవించిన తల్లి, శ్రీ చక్రాకారముగా ఆవిర్భవించి  ప్రత్యక్షమైన తల్లి

    అగ్నిగుండములో పుట్టి, పూర్తి బ్రహ్మతేజస్సుతో, ఇచ్ఛా తేజస్సుతో శక్తి  రూపముగా ప్రత్యక్షమైన తల్లివి నీవమ్మా, దేవకార్యార్థము కొరకు ఆవిర్భవించిన తల్లివమ్మా, శ్రీ చక్రాకారముగా ఆవిర్భవించి ప్రజలకు ప్రత్యక్షమైన తల్లివమ్మా, "శ్రీ శబ్దము వాక్పరము " కావున వాక్కులను కలుగ చేయుటకు నీతో సమానమైన ఏదేవతలు లేరు కనుక నిన్ను శ్రీ మాతా అని పిలుస్తారమ్మా , బంధమోక్ష, స్వరూపాది, సకాలమును, చూపింప నారభించు" సింహ వాహనముగా స్థిరముగా ఉండి, సకల ప్రపంచ పాలనా సామర్ధ్యము కలిగి ఉన్నావు  కావునా "శ్రీ మహారాజ్ఞి" అని పిలుస్తారమ్మ, అమ్మా అమ్మా అమ్మా,  అమ్మలగన్న మాయమ్మకు మా శతకోటి దండములు.  

ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహు సమన్వితా
రాగస్వరూపపాశాడ్యా  క్రోథాకారాంకుశోజ్జ్వలా        .... 2

ఉద్యద్భానుసహస్రాభా : అనేక సూర్యకిరణములుగల రక్తకాంతితో ప్రకాశమంతముగా పరాశక్తిగా మారిన  తల్లి
చతుర్బాహు సమన్వితా : నాలుగు హస్తములు కలిగి ఉన్న "మీదుగా రెండు హస్తాలు క్రిందగా రెండు హస్తములు గల బడదేవతగా ప్రత్యక్షంగా కనబడుతున్న తల్లి
రాగస్వరూపపాశాడ్యా  : సత్యగుణ త్రయము కలిగి బ్రహ్మతేజస్సుతో పాశమున్న తల్లి  
క్రోథాకారాంకుశోజ్జ్వలా : అమ్మవారి క్రోధమే అంకుసాకారము పొందినది, అంకుశముచేత ప్రకాశించు  చున్న హస్తముగల తల్లి

అనేక సూర్య కిరణముల వెలుగులతో, రక్తకాంతి వర్ణముతో,  ప్రకాశమంతముగా, పరాశక్తిగా మారిన తల్లివమ్మా, నాలుగు హస్తములు కలిగి ఉన్న "మీదుగా రెండు హస్తములు, క్రిందగా రెండు హస్తములు గల బడదేవతగా ప్రత్యక్షంగా  కనబడుతున్న తల్లివమ్మా, సత్యగుణ త్రయము కలిగి బ్రహ్మతేజస్సుతో పాశమున్న తల్లివమ్మా,  అమ్మవారి క్రోధమే అంకుశాకారము పొందినది, అంకుశముచేత ప్రకాశించు చున్న హస్తముగల తల్లివమ్మా, అమ్మా అమ్మాఅమ్మా,  అమ్మలగన్న మాయమ్మకు మా శతకోటి దండములు   

మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్రసాయకా 
నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్ర హ్మాణ్డ మండలా  ....  3 

మనోరూపేక్షు కోదండా   : శ్రీదేవి క్రింది వామహస్తమునందు ఎఱ్ఱ చెఱకు విల్లు దనస్సుగా కలది  "మనస్సే చెఱకు విల్లుగా ఉండి సంకల్పమునకే మనస్సు సంజ్ఞ అందించే తల్లివి    

పంచతన్మాత్రసాయకా : శ్రీదేవి కుడిభాగము బాహువు యందు  పంచభూతాలనే (శబ్ద,స్పర్శ,రూప రస ఘాంధములు) అనే బాణములు ధరించి ప్రపంచ ప్రజలకు అందించిన తల్లివి.

నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్ర హ్మాణ్డ మండలా : శ్రీదేవి శరీరమునుండి ఎర్రని కాంతి పుంజముల సమూహము వెలుబడి ఆకాంతిలో బ్రహ్మాన్డ మండలాలు కాంతి వంతముగా మార్చిన తల్లివమ్మా 

       శ్రీదేవి క్రింది వామహస్తమునందు ఎఱ్ఱ చెఱకు విల్లు దనస్సుగా కలది  "మనస్సే చెఱకు విల్లుగా ఉండి సంకల్పమునకే మనస్సు సంజ్ఞ అందించే తల్లివి, శ్రీదేవి కుడిభాగము బాహువు యందు  పంచభూతాలనే (శబ్ద,స్పర్శ,రూప రస ఘాంధములు) అనే బాణములు ధరించి ప్రపంచ ప్రజలకు అందించిన తల్లివి.శ్రీదేవి శరీరమునుండి ఎర్రని కాంతి పుంజముల సమూహము వెలుబడి ఆకాంతిలో బ్రహ్మాన్డ మండలాలు కాంతి వంతముగా మార్చిన తల్లివమ్మా, శ్రీదేవి శరీరమునుండి ఎర్రని కాంతి పుంజముల సమూహము వెలుబడి ఆకాంతిలో బ్రహ్మాన్డ మండలాలు కాంతి వంతముగా మార్చిన తల్లివమ్మా. ఈ రూపములో అమ్మను ధ్యానించినవారికి సర్వజనావశ్యము, సర్వజగద్వశ్యము తప్పక జరుగునని ఋషులు తెలియ పరిచారు. పంచ భూతములతో ఎర్రని కాతవంతముగా వెలిగిపోతున్న అమ్మకు శత కోటి దండాలు          

చంపకా శోక పున్నాగ సౌగంధికల సత్కచా    
కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండితా        ....  4 

 చంపకా శోక పున్నాగ సౌగంధికల సత్కచా : చంపకము అశోకము పున్నాగము మొదలగువృక్షముల పుష్పములను కొప్పుగా ధరించి వాటియొక్క పరిమళాలు స్వత సిద్ధముగా అంతటా వ్యాపింప చేసిన తల్లివమ్మా, 

కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండితా: కురువింద శిలలా గర్భమునందు పుట్టిన పద్మరాగమణిగణఖచితమయి వెలుగుచున్నకిరీటముచేత ప్రకాశింప బడుచున్నతల్లివమ్మా       
   
చంపకము అశోకము పున్నాగము మొదలగువృక్షముల పుష్పములను కొప్పుగా ధరించి వాటియొక్క పరిమళాలు స్వత సిద్ధముగా అంతటా వ్యాపింప చేసిన తల్లివమ్మా, కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండితా: కురువింద శిలలా గర్భమునందు పుట్టిన పద్మరాగమణిగణఖచితమయి వెలుగుచున్నకిరీటముచేత ప్రకాశింప బడుచున్నతల్లివమ్మా, ఎర్రని కాతవంతముగా వెలిగిపోతున్న అమ్మకు శత కోటి దండాలు.
प्रांजलि प्रभ 

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం
అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితా
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా    ........ 5

అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితా :  అర్ధచంద్రాకారమైన ఫాలప్రదేశము కల శ్రీ దేవివమ్మా,  
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా : ముఖమనే చంద్ర బింబమునందు కళంకము వంటి కస్తూరీ   తిలకము గల శ్రీదేవివమ్మా 

అర్ధచంద్రాకారమైన ఫాల ప్రదేశము కల శ్రీ దేవివమ్మా, ముఖమనే చంద్ర బింబమునందు కలంకము వంటి కస్తూరీ తిలకము గల శ్రీదేవివమ్మా, ఫాలప్రదేశము అర్ధచంద్రాకారము, ముఖము చంద్రబింబము వలె వెలిగి పోచున్న అమ్మలు గన్న అమ్మకు మా శతకోటి దండములు. 


వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా
వక్త్రలక్ష్మీ పరీవాహ చలంన్మినాభాలోచనా     .........6 

వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా : అమ్మవారి ముఖమనే మన్మధుని మాంగళ్య గృహము యో క్క మొదటి ద్వారమున కనుబొమలు తోరణములుగా ఉన్న తల్లివమ్మా  

వక్త్రలక్ష్మీ పరీవాహ చలంన్మినాభాలోచనా  :ముఖ కాంతి యను ప్రవాహము నందు సంచలించు చున్న  మత్యముల వంటి నేత్రములు గలతల్లివమ్మా  

ముఖమనే మన్మధుని మాంగళ్య గృహము యో క్క మొదటి ద్వారమున కనుబొమలు తోరణములుగా ఉన్న తల్లివమ్మా, ముఖ కాంతి యను ప్రవాహము నందు సంచలించు చున్న  మత్యముల వంటి నేత్రములు గలతల్లివమ్మా, కనుబొమలు తోరణములు కలిగి, ముత్యములవంటి నేత్రములు కలిగి ఉన్న అమ్మలు గన్న అమ్మకు మా శతకోటి దండములు 
प्रांजलि प्रभ 

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం

నవచంపక పుష్పాభనాసాదండవిరాజితా 
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా     ........ 7 

నవచంపక పుష్పాభనాసాదండవిరాజితా : అప్పుడే వికసించిన సంపెంగ మొగ్గతో సమానమైన నాసికా దండము చేత ప్రకాశింప బడుచున్న తల్లివమ్మా 


తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా : నక్షత్ర కాంతులను తిరస్కరించే మాణిక్య మౌక్తికముల చేత పొదగబడిన నాసాభరణము తరించిన తల్లివమ్మా,


అప్పుడే వికసించిన సంపెంగ మొగ్గతో సమానమైన నాసికాదండము చేత ప్రకాశింప బడుచున్న తల్లివమ్మా, నక్షత్ర కాంతులను తిరస్కరించే మాణిక్యమౌక్తికములచేత పొదగబడిన నాసాభరణము తరించిన తల్లివమ్మా, అందమైన నాసికా యందు సంపెంగ మొగ్గ తోనూ, నాసాభరణములతోను 
ప్రకాశిస్తున్న తల్లికి మా శతకోటి దండములు   

కదంబమంజరీకప్తకర్ణపూరమనోహరా     
తాటంక యుగళీ భూత తపనోడుపమండలా   ...... 8 

కదంబమంజరీకప్తకర్ణపూరమనోహరా  : కర్ణోపరిభాగమునందు చిన్న కడిమి పూగుత్తి చేత ప్రకాశించు చున్న తల్లివమ్మా . 

తాటంక యుగళీ భూత తపనోడుపమండలా : చెవి కమ్ములు యందు ఒకవైపు సూర్యుడ్ని, మరోవైపు  చంద్రడ్ని ఆభరణములుగా ధరించి న తల్లివమ్మా మరి ఏదేవతకు ఈవిధమైన సౌకర్యము లేదమ్మా    

కర్ణోపరిభాగమునందు చిన్న కడిమి పూగుత్తి చేత ప్రకాశించు చున్న తల్లివమ్మా,  చెవి కమ్ములు యందు ఒకవైపు సూర్యుడ్ని, మరోవైపు  చంద్రడ్ని ఆభరణములుగా ధరించిన తల్లివమ్మా,  మరి ఏ దేవతకు ఈవిధమైన సౌకర్యము లేదమ్మా, అట్టి నీకు మా శతకోటి దండములు 


प्रांजलि प्रभ 

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం
పద్మరాగ శిలా దర్శ పరిభావికపోలభూ :    
నవవిద్రుమబింబ శ్రీ న్యక్కారి దశ నచ్చ దా  .....  9 


పద్మరాగ శిలా దర్శ పరిభావికపోలభూ : శ్రీదేవి చెక్కిళ్ళు అద్దము కన్నా నునుపుగాను, పద్మరాగము కన్నా ఎరుపును కలిగి ప్రజలందరికి  ప్రకాశిస్తూ కనబడుతున్నావమ్మా.

నవవిద్రుమబింబ శ్రీ న్యక్కారి దశ నచ్చ దా: పెదవులు ఉన్నతముగాను, అధికమైన ఎర్రనిరంగు కలిగి ఉన్నందువలన అప్పుడే పుట్టిన పగడపు తీగయొక్క శోభను, బాగుగా పండిన దొండపండు రంగును గల పెదవులు గల తల్లివమ్మా. 

చెక్కిళ్ళు పద్మరాగము కన్నా ఎరుపుగాను, పెదవులు పగడపు తీగ కన్నా ఎరుపుగాను కనబడుతూ ప్రజలందరికి దర్శనమిస్తున్న అమ్మలగన్న అమ్మకు మా శతకోటి దండములు.  
प्रांजलि प्रभ 


శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం

శుద్ధవిద్యా0కురా ద్విజ పంక్తి ద్వయోజ్జ్వలా !
కర్పూర వీటి కామోద సమాకర్ష ద్దిగంతరా !!  ..... 10

 
శుద్ధవిద్యా0కురా ద్విజ పంక్తి ద్వయోజ్జ్వలా :  "ప్రాధమిక విద్య, షోడషా క్షరీవిద్య,శుద్ధవిద్య అను మూడింటిలో ఉన్న 16 బీజములు అంకురములు. శ్రీదేవి ఈ బీజములయందు శివభక్తి నిండి యున్నది ఇవి రేడుదశలుగా పైన క్రింద దంత  పంక్తులుగా ఏర్పడినవివీరితో నిత్యము మంత్రవర్ణములు గల తల్లివి.     

కర్పూర వీటి కామోద సమాకర్ష ద్దిగంతరా : శ్రీదేవియొక్క ముఖమునందు కరుపురాది సుఘంధ ద్రవ్య సంయుతమగు కర్పూర వీటిక గల తల్లివి. 

"ప్రాధమిక విద్య, షోడషాక్షరీవిద్య, శుద్ధవిద్య అను మూడింటిలో ఉన్న 16 బీజములు అంకురములు. శ్రీదేవి ఈ బీజములయందు శివభక్తి నిండి యున్నది ఇవి రెండు దశలుగా పైన క్రింద దంత  పంక్తులుగా ఏర్పడినవి వీటితో నిత్యము మంత్రవర్ణములు గల తల్లివి. ముఖము నందు కర్పూర రాది సుఘంధ ద్రవ్య సంయుతమగు కర్పూర వీటిక గల తల్లివి. 
నిత్యమూ శివభక్తి బీజాక్షరములతో జపిస్తూ సుఘంధ ద్రవ్య సంయుతమగు కర్పూర వీటిక గల తల్లికి మా శతకోటి దండములు 
  
శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్ని కుండసంభూతా దేవకార్యసముద్యతా    .... 1

ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహు సమన్వితా


రాగస్వరూపపాశాడ్యా  క్రోథాకారాంకుశోజ్జ్వలా        .... 2

మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్రసాయకా 
నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్ర హ్మాణ్డ మండలా  ....  3 

చంపకా శోక పున్నాగ సౌగంధికల సత్కచా    

కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండితా        ....  4 

అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితా

ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా    ........ 5

వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా

వక్త్రలక్ష్మీ పరీవాహ చలంన్మినాభాలోచనా     .........6 

నవచంపక పుష్పాభనాసాదండవిరాజితా 

తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా     ........ 7 

తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా
కదంబమంజరీకప్తకర్ణపూరమనోహరా     ...... 8  

తాటంక యుగళీ భూత తపనోడుపమండలా 
పద్మరాగ శిలా దర్శ పరిభావికపోలభూ :   .....  9  

శుద్ధవిద్యా0కురా ద్విజ పంక్తి ద్వయోజ్జ్వలా !
కర్పూర వీటి కామోద సమాకర్ష ద్దిగంతరా !!  ..... 10

నిజస్సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్ఛపీ !
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా!! ... 11

అనాకాలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితా !
కామేశ బద్ద మాంగళ్య సూత్ర శోభిత కంధరా !! ...... 12