ఓం శ్రీ రామ్ : శ్రీ మాత్రే నమ: ఓం శ్రీ కృష్ణాయనమ:
ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము. (3/5)
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
51 . మనస్సు బుద్ధి ప్రాపంచిక విషయములపై పోకుండా పరమాత్మునిపై నిశ్చల స్థితిని ఉంచవలెను.
52 .పరమాత్మ ప్రాప్తికి మానవుడే అర్షుడు. స్వధర్మ పాలనద్వారా, సాధన ద్వారా, పొంద వచ్చును.
53 .ప్రలోభాలకు లొంగక, ఆకర్షణకు చిక్కక, సచ్చిదానంద ఘనపారమాత్మ యందే నిరంతరమూ సంతుష్టుడై ఉండుము.
54 . అట్టి వ్యక్తి శాశ్వితముగా నిత్యానందం నందు మగ్నుడై స్వయముగా ఆనంద రూపుడగును
55 . అట్టి స్థితిలో శరీర నిర్వాహణ ప్రారబ్ధాను సారము తనంతట తానే సాగి పోవును.
56 . ప్రారబ్దాను సారము లోకదృష్టిలో అతనిద్వారా లోక హితము కొరకు కర్మలు జరుగు చుండును.
57 .ఇంతవరకు భగవానుడు ఎవరయినా సరే అనాసక్త భావముతో కర్తవ్య కార్మలు ఆచరించ వలెను.
58 ప్రతి వ్యక్తియు వర్ణాశ్రమ ధర్మాలను, స్వభావమును, పరిస్థితులను, ప్రకృతిని అనుసరించి కర్తవ్య కార్మలు చేయవలెను.
59 జనకాదులను ఆదర్శముగా గొని, వారిని కనురెప్ప లాగా ఆదరించి ఫలాసక్తి లేకుండా సేవలు అందించటయే అందరి కర్తవ్యముగా భావించ వలెను.
60 . ఆసక్తి రహిత కర్మల ద్వారా అంత: కరణ సిద్ధి కలిగిన సాధకునకు భగవదనుగ్రహముచే తత్వజ్ఞానము తనంత తానే ఏర్పడును. . .
62. భగవంతుని దోష దృష్టి గలవారును, పరమాత్ముని సామాన్యునిగా భావించు వారును, విశ్వాసము లేని వారును, భగవంతుని శక్తి తెలుసు కోలేరు.
63. తామస స్వభావులు, వివేక రహితులు, విపరీత బుద్ధితో చిత్తం వశము కాక, వర్తమాన స్థితిలో బ్రష్టులుగా ఉందురు.
64. నదులు సముద్రమును చేరినట్లు, మనుష్యులు రాగద్వేషాలను త్వజించి, ఆ కర్మలను పరమాత్మ ప్రాప్తికి సాధనములుగా చేసు కొనవచ్చును.
65. బుద్ధి, మనస్సు, ఇంద్రియముల ద్వారా ప్రారబ్ధ ఫల రూపము జరుగును.
66. జ్ఞానియొక్క క్రియలు కార్తృత్వభావములుగాని, రాగ ద్వేషములు, అహంకార మమకారములుగాని, ఏమాత్రము దరి చేరవు.
67. రాగ ద్వేష అను ఇద్దరు దొంగలు, ధర్మమార్గమున పోయే మనుష్యుని కలసి మిత్రులువలే నటించి, అతని మనస్సు, ఇంద్రియమును, వివేక శక్తిని నష్టపరుచును.
68. దిలీప్ మహారాజు గోవును రక్షించుటకు సింహము చేతిలో శరీరము అర్పించుటకు సిద్ధమయ్యేను.
69. పావురము కొరకు సీబీఐ చక్రవర్తి శరీరము కోసి మరణించుటయు సిద్ధమయ్యెను .
70. ప్రహ్లాదుడు స్వధర్మము పాటిస్తూ పెక్కు సారులు మృత్యు ముఖమున చేరెను.
కనుక సుఖదు:ఖలు అనిత్యములు, అట్లే జీవుడు నిత్యుడు, జీవన హేతువు అనిత్యము కనుక ధర్మముతో నడుచుకొనవలెను .
ఓం శ్రీ రామ్ : శ్రీ మాత్రే నమ: ఓం శ్రీ కృష్ణాయనమ:
71.కోరికలను సాదించు కొనుటకు గాని, భయము నుండి బయట పడుటకు గాని, లోభములకు లోబడి గాని, కడకు జీతమును కాపాడుటకు గాని ఎట్టి పరిస్థితిలో ధర్మములు తప్పరాదు . అట్టి
72. ఇతర ధర్మములో సుఖమున్నప్పటికిని అది ప్రేరేపించిన, మనసుకు తృప్తి నివ్వదు, భయమును పెంచునని తెలుసుకొనవలెను.
72. ఇతర ధర్మములో సుఖమున్నప్పటికిని అది ప్రేరేపించిన, మనసుకు తృప్తి నివ్వదు, భయమును పెంచునని తెలుసుకొనవలెను.
73. ఎవరైనా సరే తమ కులధర్మాన్ని విస్మరించి ఇతర కులాలను తూలనాడిన, మనకన్నా అగ్రమైనదని భావించి దానిలో చేరిన , వారిచేత పూజలందు కొనుటవలనను వారి వృత్తులను భంగము కల్గించినను అట్టి వారు పాపములు పొందుదురు .
74. పర ధర్మము ఎంత గుణ సంపన్నముగా ఉన్నను అది భయావహమే, ఏమాత్రము శుభము కాదు , ఆచరించినచో జాతిలో వెంటనే పతితుడగును అని తెలుసు కొనవలెను .
75. కామము నశించిన తోడనే క్రోధము తనంతట తానే రూపు మాయను.
76. నెయ్య్, సమిధులు వేసిన కొద్దీ అగ్ని వృద్ధి అయినట్లు, భోగములనుభ వించిన కొద్దీ భోగోతుష్ట పెరుగుచునే యుండును .
77. పాపములకు మూలము, మనుజునికి అజేయు శత్రువు కామమే గాని మరి ఎవ్వరు కాదని తెలుసుకొనవలెను .
78. కామమే మల, విక్షేప, ఆవరణములు అను మూడు దోషములుగా పరిణత చెంది మనుష్యుని జ్ఞానము కప్పివేయును.
79. రాగము, సంగము భగవద్విషయుక్తమైన అనురాగమని చెప్పక కామోత్పాదక భోగాసక్తి యేనని గ్రహించ వలెను..
80. మనోబుద్ధిఇంద్రియములనుండి ఈ కామరూప శత్రువును (సంసారిగా చల్లపరుచు కొనవలెను) లేదా పారద్రోల వలెను, లేనిచో జీవితములో ఆరోగ్యమును, ధనమును నశింప చేయును .
ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము. (3/9)
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
81. రోగి అపధ్య పదార్ధములను సేయించినట్లు, కొన్ని పరిస్థితిలో బుద్ధిమంతునకు కూడా పాపకర్మల ప్రేరే పిన్చబడును .
82. ప్రయత్న శీలుడు, బుద్ధిమంతుని యొక్క మనస్సును కూడ ఇంద్రియములు బలాత్కరముగా చలింపచేయును.
83. కామము మనుష్యుని జ్ఞానము కప్పి వేసి అంధునిగా చేసి, పాపములనెడి శత్రువు ఆవహించును.
84. మనోబుద్ధి ఇంద్రియములద్వారా విషయ రూప లోభములచే జీవాత్మ యొక్క జ్ఞానమును కప్పివేయును.
85. అభ్యాసము, వైరాగ్యము అను రెండు ఉపాయముల ద్వారా ఇంద్రియములు వశమగును.
86. భగవంతుని నిర్గుణనిరాకార తత్వముల ప్రభావమహాత్య రహస్యములు యదార్ధ జ్ఞానమును జ్ఞానమ ని తెలుసు కొనవలెను .
87. సుగుణ నిరాకారా దివ్యసాకార తత్వముల లీలా రహస్య గుణ మహత్య ప్రభావముల యదార్ధ జ్ఞానమును వి జ్ఞానమని అందురు.

88. ఇంద్రియములకంటెను వాటి అర్ధములు (రూప,ఆస,గంధ,శబ్దస్పర్శ లనేది తన్మాత్రలు) పరములు.
89. (శ్రేష్ఠములు,సూక్ష్మములు, బలీయములు) అర్ధముల కంటే మనసు, మనసు కంటే బుద్ది శ్రేష్ఠమైనదిగా పరమాత్ముడు తెలిపెను .
90. సమిష్టి బుద్ధికంటే మూల ప్రకృతి శ్రేష్టము, ప్రక్రుతి కంటే పురుషుడు శ్రేష్టము. పురుషుని కంటే శ్రేష్టమైనది లేదు, ఆత్మ స్వయముగా అన్నింటి కంటెను బలీయ మైనప్పుడు అదే కామమనే శత్రువును జయించును.
మూడవ అధ్యాయము - అంతర్గత భగవద్గీత కర్మ యోగము సమాప్తము.
--((*))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి