9, నవంబర్ 2017, గురువారం

ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము.

Om sri raam - sri matrenama: 
ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము. (3/4)
जय श्रीराधेकृष्ण जय श्रीराम  जय श्री कृष्ण जय श्रीहरि  जय श्रीरणछोड़राय जय श्रीद्वारकाधीश हरे रामा हरे कृष्ण



రచయత: మల్లాపగడ రామకృష్ణ  

31.స్వధర్మ రూపాయజ్ఞములను (ప్రజాపాలన, వ్యవసాయ ము,  వాణిజ్యము, అధ్యయన అధ్యాపనములు సేవలు) తప్పక నిర్వహించవలెను 

32. యజ్ఞముల వలన దేవతలకు  హవిస్సులను అందించి దేవతలను తృప్తి పరిస్తే ప్రాణులన్నింటికీ సుఖము కలుగును. 

33. నిస్వార్ధ భావముతో దేవతలు ప్రాణులు పరస్పరము మేలు చేకూర్చుకొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు. 

34. దేవతులు ప్రసాదించిన భోగములు అనుభవిస్తూ దేవతను మరచిపోతే నిజముగా చోరుడే . 

35. పుత్రులు తల్లి తండ్రులను పోషించక పోయినను, తల్లి తండ్రుల మరణానంతరము శ్రాద్ధతర్పణాలు ఆచ రించకున్నను,  ఉపకారము పొంది పత్యుపకారము చేయకున్నను, దత్తపుత్రుడైన సంపద పొంది తల్లితండ్రులను సేవింపకున్నను వీరందరూ క్రుతఘ్ను లు, చోరులు. 

36.*దేవతలు సమస్త జగత్తునకు ఇష్టభోగములను అందించుదురు. 

37.* ఋషులు మహాత్ములు అందరికిని జ్ఞానప్రదానము చేయుదురు.    
  
38.* పితురులు తమ సంతానమును పోషించుచు వారికి హితమును గూర్చు చుందురు. 

39.* పశుపక్షి వృక్షాదులు అందరికి సుఖ సాధనములుగా తమను తాము అర్పించు కొనెదరు. 

40.* యోగ్యత, అధికారము, సాధన సంపదతోఁఅందరికి పుష్టిగా ఆహారము అందిచుటయే మనుష్య ధర్మముగా తెలిపెదరు.      
*వీటినే పంచ మహా యజ్ఞాలు అంటారు. వీటిని సక్రమముగా అనుకరించిన వారికి మన:శాంతి, ఆరోగ్యము కలిగి ఉండును   
   
   Om sri raam - sri matrenama: 
ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము. (3/5)

41 .న్యాయోపార్జిత ధనముతో సేవా రూప యజ్ఞములను చేయువాడుము కేవలము అందు మిగిలే అన్నము లోక సేవార్ధము జీవిన్చుటకై ప్రసాద రూపమున భుజించువాడుగా ఉండవలెను.

42 . సుఖ భోగముల కొరకై శాస్త్ర విధిని అనుకరించేవాడు పాపములనుండి ముక్తుడగును.

43 . ప్రాయశ్చిత రూపమున నిత్యమూ హోమ బలివైశ్వదేవాది కర్మలను ఆచరిస్తూ ఎవరి భాగము వారికీ పంచుతూ ఉన్నాదాన్ని భోజనము చేవాడు పాపములనుండి విముక్తుడగును.

44 . బియ్యము, గోధుమలు శరీర పుష్టికి ఉపయోగపడును, వీటివలన రజస్సు వీర్యము ఏర్పడును,
రజో వీర్యాదల సంయోగమువలన ప్రాణులు ఉద్బహ్వించును.

45 ప్రాణులన్నియును అన్నము నుండి జన్మించును. అన్నోత్పతి వర్షము వలన ఏర్పడును. యజ్ఞమువలన వర్షములు కురియును.

46 .విహిత కర్మలు యజ్ఞములకు మూలములు. వేదాలు విహిత కర్మలకు మూలములు. వేదములు పరమాత్ముని నుండి ఉద్భవించినవని తెలుసుకొనలేను.

47 .ప్రతి ఒక్కరు భగవత్ప్రాప్తికై భగవదాజ్ఞానుసారము తన కర్తవ్య పాలన చేయవలెను.

48 సృష్టి చక్రము యజ్ఞములపై ఆధార పడి యుండును .పరమాత్ముడు యజ్ఞముల యందు ప్రతిష్టుతుడై యుండును. 

49 సృష్టి చక్రమును పాటించక ఇంద్రియ సుఖలోలుడైన వాడు ఖశ్చితముగా పాపి యగును.

50 కర్తవ్యమును త్యజించి, స్వార్ధ చింతనయందే నిమగ్నుడై, హితాహితముల గురించి ఏమాత్రము ఆలోచించక ఉండువారు దోషిగా పిలవ బడును.    . 
  .                   .               

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి