24, నవంబర్ 2017, శుక్రవారం

ప్రాంజలిప్రభ - భగవద్గీత (అంతర్గత ) సూక్తులు 4 వ అధ్యాయం


ప్రాంజలిప్రభ - భగవద్గీత (అంతర్గత ) సూక్తులు 
రచయత. మల్లాప్రగడ రామక్రృష్ణ
Jai Shree Krishna.. May Lord Krishna's flute invite the melody of love into your life.. #eternallove #LordKrishna #haribol #Krishna #Kanhaiya #kahna #art #beautiful #lovethis #stunning #instalike #instadaily #instagood #instamood #instacool #instalove #fab #bansuri #flute #peacock #Hinduism #spiritual #spirituality #Indian #desi

1. ప్రకృతిని ఆధీనంలో ఉంచుకొని యోగమాయ లోక మంత విస్తరించును.

2. జన్మరహితుడు. నిత్యడు. సమస్త ప్రాణులకు ఈశ్వరుడు ఒకరున్నట్లు గమనించ వలెను.

3. సాకార రూపములో సమస్త ప్రజలను రక్షించును.

4. సత్పురుషులను రక్షించుటకు దుర్మార్గలను శిక్షించుటకు అవతరించును.

5. ధర్మమునకు హాని కలిగినప్పుడు , అధర్మము పెచ్చు పెరిగి నప్పుడు పరమాత్ముడు అవతరిస్తాడని తెలుసుకొనవలెను .

6. ప్రతి ఒక్కరు కర్మలు కర్త్వభావముగా ఆచరించాలి.

7. జన్మ తత్వ రహస్యాలను గమనించి ఆచరించ వలెను .

8. ప్రతి ఒక్కరు ద్రృడమైన భక్తి తాత్పర్యములతో, భగవంతుని ప్రార్ధించిన
జన్మలేకుండా చేయును. 

9. ప్రతి ఒక్కరు తగు విధముగా సేవలు చేయుచు జ్ఞాణాన్ని పొంది అందరికి సహకరించుచూ జీవించ వలెను .

10 . కర్మఫలములు ఆసించువారు ఇతర దేవతలను పూజించరు. అట్టి వారికి సిధ్ధి సీఘ్రముగా లభించును. 

11. పరమాత్ముడు తన దివ్యలీలల ద్వారా మనుష్యుల మనస్సును తన వైపు లాగు కొనును .

12. భక్తి నౌకను ఆశ్రయించిన వారికి సంసార సముద్రమునుండి తరింప చేయుపకు తానే చుక్కాని పట్టువాడై వారిని ఉధ్ధరించును.

13. భగవంతుని జన్మ కర్మల దివ్యత్వం నెరింగిన వానికి తనువు చాలించిన పిమ్మట భగవత్ప్రాప్తి కలుగును.

14. ధర్మ శాస్త్రాలలో నుడివిన రీతిగా  స్వయముగా ప్రవర్తించి ధర్మప్రభావమును చాటాలి. 


15. సాదు పరిరక్షణము, దుష్టశిక్షణము, ధర్మసంస్థాపనము నెరవేర్చుటకు భగవంతుడు అవతరించును . 


16. రూప, గుణ, ప్రభావ, నామ, మహిమా, దివ్యకర్మలు వినుచు, కీర్తించుచు, స్మరించుచుఁ, ఉన్నచో సంసా సాగరమును దాటగలరని భగవంతుడు బోధించెను. 

17.  ప్రకృతి తన ఆధీనములో ఉంచుకొని యోగ శక్తితో జనులపై గల వాత్సల్యముతో మనుష్యాది రూపములో జన్మించును . 

18. దయ, సమత్వము, ధర్మము, నీతి , వినయము, కలిగి ఉండిన వానికి భగవంతుడు ప్రత్యక్షమగును. 
  
19. రాగ, భయ, క్రోధ, అనేక దుర్గుణములు తొలగించి మనస్సును శాంతి మార్గమున ఉంచును. 

20. ప్రతిఒక్కరు సమస్తకర్మలు తమకొరకై గాక భగవద్ సేవలో భాగమని భావించి, అందులోనే సంతుష్టి చెంది,    
భారమును భగవంతునిపై ఉంచి, నడుచు కొనవలెను.               
21. భగవంతుని యేయే భావాలతో పూజించిన ఆయా భావాలతో ఆదుకొనును.

22. తనకోసం వ్యాకులచెందేవాని విషయమున వ్యాకులచెఞది ఆదు కోనును .

23. వియోగము సహింప లేక బాధతో వేడుకున్న తాను వియోగ బాధ అను భవించి ఆదు కోనును.

24. తనకు సర్వస్వము ధారపోయు వానీకి తిను సర్వాత్మనా ఆదుకొనును.

25. గోపాలుని వలే మిత్రుడుగా భావించిన వానికి మిత్రుడగును.

26. యశోదా నందుల వలే పుత్రునిగా భావించిన వానికి పుత్రుడగును.

27. రుక్మిణి వలే భర్తగా సేవించిన వారికి భర్తగా ఉండును .

28. హనుమంతునిళలే స్వామిగా సేవించిన వానికి స్వామిగా కనబడును్

29. గౌపికల వలే మధుర భక్తీతో భజించిన వారి విషరమున ప్రియతముగా ఉండూను .

30. ధర్మనీతి లోక మంతా వ్యాపింప చేసి శుభములు ప్రసాదించంటయే కాక దివ్య లీలా రసానందము కలుగ చేయును.

31 . భగవంతుడు తన సృష్టి రచనాది కర్మల యందు కర్తృత్వము గాని, పక్షపాత దృష్టి గాని, ఆసక్తి గాని చూపక  కర్మలయొక్క దివ్యత్వమును ప్రకటించును.

32 . బుద్ధి, జ్ఞానముల, విషయ సుఖాది వాసనలతో మాయకు చిక్కి కామ్య ఫల ప్రాప్తికై  ఉపాసకులను ఆశ్రయిస్తారు. ఇది అవసరమా ?

33 .మందబుద్ధులు సద్య:ఫలములకై ఆరాట పడుచు, ధనము శరీరము ఆర్పించుట అవసరమా, నవవిధాలలో ఏదో ఒక విధముగా ప్రార్ధించిన మనసు ప్రశాంత పరచగలనని భగవంతుడు తెలిపెను.

34 .  బ్రాహ్మణులు శమ దమాది కర్మలు ఆచరించి, ప్రజలకు ధర్మ ప్రవర్తనతో ధర్మబోధ చేయవలెనని తెలిపెను.

35.క్షత్రియులు సౌర్యము, తేజస్సులతో కూడిన కర్మలను ఆచరిస్తూ ప్రజల కష్టాలను ఆదు కొనుటకు ప్రాణాలను అర్పించుటకైనా సిద్దిముగా ఉండవలను.

36 .వైస్యులు కృషి, గోరక్షణాది కార్యములందును, వాణిజ్య వ్యాపారములందును సహాయ సహకారములు అందిస్తూ ధర్మంతో నడుచుకొనవలెను.

37 .  సూద్రులు  తదితర సామాజిక సేవలయందును, తగువిధముగా దేశసేవకు సహకరిస్తూ జీవన గమనాన్ని సాగించాలం తెలిపెను.

38  సత్వగుణ ప్రధానులైనవారు మరణా నంతరము ఊర్ధ్వలోకములకు చేరుదురని, తమో గుణము కావారు పశుపక్షాదులుగా జన్మింతురని, రజోగుణము కలవారు మనుజులుగా పుడతారని తెలిపెను . 

39. జ్ఞానిఆయన వాడు ఫలాపేక్ష లేకుండా, మర్మాలను ఆచరించి కర్తృత్వ బుధ్దిగాని వానికి ఉండవు. 

40. భగవంతుని కర్మల దివ్యత్వమును, తత్వరహస్యమును తెలుసుకొన్న మహాపురుషులు లోకములో ఉండునని తెలియ పరిచెను.             

41  కర్తవ్య కర్మలన్నీ " మమత, ఆసక్తి , ఫలేచ్చ, అహంకారం" అనే  భంధముల నుండి ముక్తులవ్వాలి . 

42. ఏది అసలు, ఏది నకిలీ, ఏది బ్రాంతి, ఏది మాయ, ఏది నిత్యం , ఏది త్యాగం, ఏది మర్మం, తెలుసు కోవాలనుంటే భక్తి, మౌన మార్గం ఒక్కటే.

43. మహాపురుషుల ప్రే రణ, ఆజ్ఞా అనుకరించి నడుచు కుంటే మనసు ప్రశాంతముగా వుండును .

44. శాస్త్రజ్ఞానము లేనివారు పుణ్యమును పాపముగాను, పాపమును పుణ్యముగాను భావించవలసి వచ్చును. 

45. దానము స్వీకరించి, వేదములను నేర్పుచు, యజ్ఞములను చేయిన్చుచుచు, ధర్మబోధ చేయుచు జయమును గడుపుతే బ్రాహ్మణునకు కార్త్య కర్మ అని తె లుసు కొనవలెను. 

46. కర్మయను అకర్మ, అకర్మ యందు కర్మ దర్శించువాడు బుద్ధిశాలి, అతడే యోగి. అని ఎలుసుకొనవలెను. 

47. కర్మ తత్వము తెలుసుకొని, అకర్మ స్వరూపమును ఎరిగి, వికర్మ లక్షణము తెలిసి నిగూడత్వముతో జీవితం గడపాలి. 

48. శాస్త్రసమ్మతములై, కామసంకల్పవర్జితములై, జరుగునో ఆటలే కర్మలన్నియు జ్ఞానాగ్నిచే భస్మము చేసి పండితునిగా మారాలి.

49. అగ్నిచే వేగింప బడిన విత్తనములు మొలకెత్తే లక్షణములు కోల్పోవును. 

50. స్త్రీ, పుత్రులు, ధనము, కీర్తి ప్రతిష్టలు, గృహము, గౌరవము, స్వర్గ్ సుఖమును ఆశించేదానినే ఇచ్ఛ కామము అని అందురు.         
   
51.మమతా, ఆసక్తి, ఫ్లేచ్చా,ఆహాహ్మ్క్రం లేకుండా కేవలము లోకహితముకొరకు శాస్త్రసమ్మతమైన యజ్ఞము, దానము తపస్సు చేయవలెను . 

52.   అంత:కరణమును, శరీరేంద్రియములను జయించిన వాడు, భోగసామాగ్రీ త్వజించినవాడు, ఆసారహితుడై శారీరక కర్మలు చేయును. 

53. కోరకుండానే లభించిన పదార్ధాలను సంతుష్టి పొందిన వానికి సమదృష్టి కలిగి యుండును. 

54. సుఖదుఃఖాలకు అతీతుడైన వాడు, అసూయ లేకుండా ఉంటే ఎటువంటి భంధములకు చిక్కకుండా ఉండ గలడు.         

55. వర్ణాశ్రమధర్మాలను, ప్రకృతి, కుటుంబ  పరిస్థితులను గమనించి చేయుకర్మలన్ని యజ్ఞములుగా గమనించవలెను . 

56. యజ్ఞ సృవాద సాధనములు బ్రహ్మము, హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము, అగ్నియు బ్రహ్మము కర్త  బ్రహ్మము, హవనక్రియము బ్రహ్మము, యోగి ద్వారా పొందిన యజ్ఞఫలము బ్రహ్మము. 

57.  విషయభోగములు సనాధకునిపై ఎట్టి ప్రభావము చూపలేవు. అగ్నిలో గడ్దవలె అవిశ్వయముగా భస్మమగును . 
58. సుఖముపై ఆసక్తి, రామణీయ బుద్ధిలేని కారణమున, ప్రేమ భావాలకు చిక్కక ఇంద్రియాలను జాయించుకు ప్రయత్నిమ్చవలెను. 

59. ఇతర ప్రాణుల సుఖముగూర్చు లక్ష్యముతో యధాశక్తి ద్రవ్యమును ఉపయోగించుట మనుష్యుల ధర్మము.

60. మౌనమువహఞ్చి, అన్నముమాని  వస్త్రము ఉంచుకొని వాన చలి ఎండకు ఓర్చుకొని, పండ్లు పాలను తీసుకోని వన వాసము నందు చేయు తపస్సే తపో యజ్ఞము అన్నారు.   
--((*))--
     

             

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి