Om sri raam - sri matrenama:
ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు - మూడవ అధ్యాయము
రచయత: మల్లాపగడ రామకృష్ణ
1 . ఫలమును కాంక్షించు వారిని " కృపణా: ఫలహేవ:" అని తెలిపిన వారిని ఆత్యంత ధీనులుగా గుర్తించ వలసిన పరిస్థితి ఉన్నది.
2 . ఉత్పత్తిని అనుసరించి జనులందరు తమ మనో సిద్ధి కొఱకై అర్ధించ వలెను.
3 . నేను మీకు శరణాగతుడను, నా కర్తవ్యమును తెలుపమని అర్ధించవలెను.
4 . నీలో ఎంత శక్తి ఉన్నా ఎదుటి వాని శక్తిని బట్టి మాత్రమే ప్రవర్తించవలెను
6 . మనసు మనసులో లేనప్పుడు చెప్పెడి మాటాలు కలగాపులగపు మాటలుగా బ్రమలుగా మనుషులను తాకును. అవి ఎవరకు అవసరము?
7 . పుణ్య పాపరరూప సమస్త కర్మాచరణములను త్యజించిన వాడే బుద్ధి యుక్తుడని కొందరూహించెదరు.
8 . బుద్ధి మోహ పంకిలము నుండి బయట పడి పరమాత్మను ధ్యానించుటయే అందరి లక్ష్యంగా మారాలి
9 . రాజ్యాధి పత్యము కానీ, లోకాధి పత్యము కానీ పొందిన శోకము మాత్రమూ పోదు.
10 . ప్రకృతి నుండి ఉత్పన్నమైన గుణములన్నియు మనుషులపై వత్తిడి చేయును, వాటిని ఎవ రూ గమినించలేరు. శరీరేంద్రియముల మనస్సు ద్వారా జరుగు క్రియలకు అభిమాన పాత్రు లగుదురు.
12. మనము చేసే ప్రతి పని అంతర్గతములే ప్రకృతి ననుసరించి కర్మలు చేయు యుండును.
13. మమతా శక్తులను, ఫలేచ్చలను, త్వజించినవాని ప్రశాంతముగా ఉండును.
14. గుణాతీతుడైన జ్ఞానికి గుణములతోగాని వాటి కార్యములతో గాని ఎటువంటి సంభంధము ఉండదని గమనించవలెను.
15. పూర్వజన్మల కర్మ సంస్కారము మనుష్యులను వెంబడించును, దాని ద్వారానే మనుష్యులు జీవించ గలుగుతారు.
16. సత్వ రజస్తమోగుణాలు ప్రకృతిని బట్టి, తోడుని బట్టి, సాటివారిని బట్టి, పిల్లలను బట్టి మనుష్యుల్లో మారుతూ ఉండును .
17. ప్రతి ఒక్కరు దృశ్యాఅదృశ్య ల మధ్య జీవితకాలం జరిగి పోతున్నది అని తెలుసుకోవాలి.
18. పట్టు బట్టి వినుట, పట్టు బట్టి చూచుట మొదలగు క్రియలు మనుష్యులను వెంబడించిన నిగ్రహించు కొనవలెను.
19. మనస్సును నిగ్రహించుకొనుటకు ప్రయత్నిమ్చ వలెను.
20. అలవాటు, ఆసక్తి, సంస్కారము వలన మనస్సు అప్రయత్నముగానే వాటి ప్రభావమునకు లోనగును, అది దోషము కాదు, మనస్సుని కట్టడి చేసుకొని నిత్యకృత్యాలు చేయవలెను.
21. ఎవరైనా సరే ఇహపర భోగములను, రాగద్వేషములను త్యజింపవలెను .
22. ఇంద్రియ కార్మలను శాస్త్ర విధి ప్రకారముగా చేస్తూ ఉండవలెను .
23. ఇంద్రియములను వశపరుచుకొని శబ్దాది విషయము లను గ్రహిస్తూ, యజ్ఞదాన తపశ్చర్యలు, వాణిజ్య వ్యాపారములు, సేవలు అదేవిధముగా సమస్త కర్మలు చేయవలెను
24. అసురీ సంపదతో ఉన్నవాడు మిధ్యాచారి అంటారు, మిధ్యాచారి కన్నా దైవీ సంపదలతో ఉన్నవాడు కర్మయోగి శ్రేష్ఠుడు .
25. స్వధర్మమును నిష్కామభావముతో చేయుటవలన మనసు ప్రశాంతముగాను, తెలియని ధైర్యము వెంబ డించును .
26. కర్తవ్య కర్మలు చేయుట వలన మనుష్యుని అంత: కరణము శుద్ధమై అతని పాపములకు ప్రాయశ్చతము కలుగును.
27. శరీర నిర్వహణకు ప్రతిఒక్కరు ఎదో ఒక పనిచేయ వలెను అట్లు చేయని యడల మనిషి మనిషిగా బ్రతుకుట కస్టము.
28. మనుష్యుడు స్వార్ధ బుద్ధితో శుభాశుభకర్మలలో దేనిని దేనిని ఆచరించినను నానా యోనిలో జన్మించ వలసి వచ్చును .
29. మానవ జన్మలో చేసిన కర్మలే బంధ హేతువులు అని గమనించవలెను.
30. మమతా శక్తులతో, ధర్మ, అర్ధ, కామ, లోభి. మోక్షాలను ఇంద్రియ నిగ్రహముతో జయించి నవారికి పునర్వజన్మలు ఉండవు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి