2, నవంబర్ 2017, గురువారం

ప్రాంజలిప్రభ - భగవద్గీత ( అంతర్గత) సూక్తులు 2వ అధ్యాయం (31 to70)



Om Sri Ram - Sri matrenama:


ప్రాంజలిప్రభ - భగవద్గీత ( అంతర్గత) సూక్తులు
2వ అధ్యాయం (31 to70)(రచయత మల్లాప్రగడ రామకృష్ణ 

31 ఆత్మ ఇంద్రియ గోచరము కానిది, మనస్సునకు అందనిది, వికారము లేనిది అని తెలుసుకొనెను. (గీత 25 ) 

32 .పుట్టినవానికి మరణించగా తప్పదు, మరణించని వాడు పుట్టక తప్పదు విషవలయములోకి చిక్కి సోకింప వలదు. (గాడిద 26 ) 


33 .ఆత్మ వధించుటకు విలుకానిది కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను శోకింపదు.


34 స్వధర్మము మరచి ప్రవర్తించవలదు, కుల లక్షణం మరచి ప్రవర్తించ వలదు (గీత 27 ) 


35  మరణమునునది వస్తునాశముకాకుండా రూపాంతరము చెందుటగా భావించవచ్చును 



36 మంచుగడ్డ కరిగినప్పుడు, నీరు ఆవిరైనప్పుడు నాశనమైనట్లు గా గోచారించును. (గీత 29 ) 


37  ధైర్యమున్నవాడు ఏపని చేయకుండా కూర్చొన కూడదు, అతడట్లు కూర్చున్నచో నీ దైర్యమును చులకన చేసి మాటలాడుదురు, అది అవసరము కాదు .  

38. లోకులెల్లరు చేతకానివాడు అని నీ కీర్తిని  అపకీర్తిగా వర్ణించి  చిలువలు పలువలుగా చెప్పుకొందురు, అది నీకవసరమా, (గీత 30 ) 


39. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణముకంటె భాధాకర మైనదని భావించాలి. కారణం తెలుసుకొని మెలగాలి.   

40. నీకు తెలిసిన విషయమును చెప్పక పోయినా, ఆవరమైనప్పుడు ధైర్యమును ప్రకటించక పోయినా, పెక్కు అన రాని మాటలు అని, అవహేళన చేయుదురు ,అది నీకు అవసరమా ఓ మనిషీ (గీత 35 )


41. అవసరానికి సహాయ పడనప్పుడు నీ సఖులు, నీ శత్రువులు, నీ సామర్ధ్యమును నిందించి నిన్ను గూర్చి అనరాని మాటలు అందురు. అది నీకు అవసరమా? 

43. ప్రతి ఒక్కరు జయాపజయాలు, లాభ నష్టాలు , సుఖదుఃఖాలు సమానమని భావించి ప్రకృతి అనుసరించి బ్రతకాలి. 

44. బుద్ధిని జ్ఞానయోగములో ఉండి ప్రతి ఒక్కరు ప్రవర్తించ వలెను,  కర్మయోగమును బట్టి నడుచు కొనవలెను.  


45. భోగా సక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒకదారి తెన్నూ లేక కోరికలవెంట తిరుగుతారు, ఎవరూ  వివేక హీనులు కారు స్నేహ, ప్రేమ ప్రభావము కొంత పనిచేయను, బుద్ధి వక్రబుద్ధిగా మారకుండా ఉండాలి.. 


46. ఫలాశక్తి తో కర్మలు చేయువారు అత్యంత ధీనులుగా మారుతారు. 


47. మంత్రానుష్టానము లందును, యజ్ఞ యాగాది కృతు లందును, అనుష్టానములు సకర్మముగా ఉండవలెను, అట్లు కానిచో అనారోగ్యము, ప్రాణహాని కలగవచ్చును. 


48. పూజా పునస్కారములు వీలున్నంత వరకు చేయవలెను, లేనిచో మానవలెను, చేసిన ఫలితము లభించును. 

49. దైవ ప్రార్ధన సంసార దుఃఖమునుండి ఉద్దరించునని ఖశ్చితముగా తెలుపు చున్నాను.                     

50. ప్రయత్న పూర్వముగా నిశ్చయాత్మకముగా బుద్ధినేకాగ్ర మొనర్చి జీవిత లక్ష్యమేదో నిర్నయిన్చు కొనవలెను .  


  51. ఎవరయినా ధర్మముగా నడుచు కోవాలంటే ముందుగా ద్వందములనుఁ అతిక్రమించాలి. 

52. సత్వగుణ విశిష్టుడవై, యోగక్షేమముల  నావల త్రోసి ఆత్మా యందె మనసు లగ్నము చేయవలెను. 


53. యోగమనగా వస్తుప్రాప్తికి ప్రయత్నము, క్షేమమనగా ఉన్నదానిని సంరక్షణకై యత్నము అవి వదలినప్పుడే మనసు ఏకాగ్రత పెరుగుతుంది. 


54. జీవిత లక్ష్యం తెలుసు కొనలేక పలు రోగములకు మూల మగుదురు. దృఢ బుద్ధితో మనసు ఏకాగ్రత లో ఉంచు కొనిన లక్ష్యము తప్పక సాధించ గలరు.


55. ఒక లక్ష్యము లేకుండా మనస్సు సంపాదన చుట్టూ తిరిగి హృదయము ఆవేదన చెందుట  అవసరమా ?  ప్రేమించే వారిని వదలి సంపాదనే ధ్యేయముగా తిరుగుట అవసరమా, అట్టివారికిబుద్ధి నీలాలేదని గమనించాలి .   


56. సమత్వ బుద్ధి ఉన్న వాడు పుణ్య పాపములను రెండింటిని ఈ  లోకములోని జయించగల్గుతారు. 


57. జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణ భంధములనుండి ముక్తులయ్యెదురు. 


58. ప్రతి ఒక్కరు ముఖ్యముగా మోహమనెడి ఊబి నుండి ముందుగా బయట పడవలెను. భక్తి భావం పెంచు కొనవలెను. 


59. దు:ఖ ప్రసంగములు తటస్థించినపుడు చిత్తక్షోభ నొందక, సుఖములు ప్రాప్తించి నప్పుడు ఉప్పొంగక సమబుద్ధి కలిగి యుండవలెను.            


60. ఎవరు దేనియందు అనురాగములేక, సుఖదుఃఖములను భరిస్తూ, ఇంద్రియములను  విషయ సుఖముల నుండి మార్చుకొన్నచో అతని బుద్ధి స్థిరముగా ఉండును. 

61. అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములు లోను కాకుండా ఉండుట ప్రయత్నిమ్చ వలెను. 

62. ఇంద్రియములను, ఇంద్రియార్ధముల నుండి అన్నివిధముల ఉప సంహరించు కొనిన వారి బుద్ధి స్థిరముగా ఉండును.            

63. అన్ని విషయములపై ఆసక్తి తొలగి పోనంత వరకు అతని మనసు జిహ్వ చాపల్యముగా మారుచునే ఉండును . 

64. చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసినప్పుడే  మనస్సు, బుద్ధి,  స్థిరముగా ఉండును.


65. విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయములందు ఆసక్తి పెరుగును, మనసు ఆలోచనలకు మూలమగును. 


66. విషయములను పొందుటకై కోరికలు పెరుగును, కోరికలు తీర నప్పుడు క్రోధము పెరుగును, ఆక్రోధము వలన మనిషి  ప్రవర్తన మారును. 


67. క్రోధము వలన వ్యామోహము కలుగును, దాని వలన బుద్ధి మారును, జ్ఞానము నశించును. 


68. బుద్ధి మనస్సు లేనివాడు స్థిరముగా ఉండలేక చపల చిత్తుడై, వివేకము కోల్పయి, పతన స్థితికి చేరుకోనును . 


69.రాగద్వేష రహితుడై, ఇంద్రియముల ద్వారా మన:శాంతి ని పొందును. 


70. మన:ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నియు నశించును. పరమాత్మ యందు మనసు లగ్న మగును. 

శ్రీ మద్భగవద్గీత - సాంఖ్యాయోగం

71. మానవ శరీరం ఒక రధం , ఇంద్రియాలు గుర్రాలు , కనుకనే కోరికలే గుర్రాలు గా పరిగెటుతాయని తెలుసు కోవాలి. 

72. బుద్ధికి ఆర్ఝ్యం పోసేది మనస్సు , మనస్సు కామక్రోదాల చుట్టు తిరగకుండా జాగర్త పడాలి.

73. స్వధర్మం శ్రేయోదాయకం , పరధర్మం ప్రమాద కరం అని భావించాలి. 

74. జన్మ కర్మల భంధం నుండి యెవరూ తప్పించు కోలేరని గమనించాలి.

75. మనః ప్రసన్నత ఉంచు కుంటే అన్ని శుభ శకునాలు వెంబడిస్తాయి అని గమనించాలి .

76. నీటిపైతేలుతున్న నావ గాలి నెట్టి వేసి నట్లు. ఇంద్రియాలు మనసను చేరి బుధ్ధిని మార్చివేయును. 

77. ఇంద్రియార్ధములనుండి ఇంద్రియములను నిగ్రహించు కొనుటవల్ల పురుషుని బుద్ధి స్తిరముగా ఉండును. 

78. యోగి మేల్కొని యుండును, అది ఇతర ప్రాణులన్నింటికి రాత్రితో సమానము.

79. ప్రాపంచిక సుఖాకలకు ప్రాకులాడిన వాని మనస్సు స్తిరముగా ఉండదనీ గమనించ వలెను. 

80. కోరికలన్నీ త్యజించి మమతా అహంకార ,స్ప్రహ రహితుడై చరించునట్టి పురుఫుడే శాంతిని పొందును. 


----------//తదుపరి కర్మయోగం చదవగలరు//------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి