ప్రాంజలిప్రభ - భగవద్గీత ( అంతర్గత) సూక్తులు
2వ అధ్యాయం (1/1)
1. కనులలో అశ్రువులు నిండియుండి, వ్యాకుల పాటుతో సోకముగా ఉన్న వానినీ ఓదార్పు మాటలు కొంత సాంత పర్చుటయే పెద్దల కర్తవ్యం.(గీత. 1 నండి 3 ).
2. మోహము వెంబడించి నప్పుడు మనసు మనసులో ఉండదు, ఆలోచనలు మారును. అప్పుడు ప్రవర్తన మారును.
3. అహంతో, బ్రమతో చేసే పనులు స్వర్గమును అందించవు , కీర్తిని పెంచవు. అది గమనించాలి.
4. పిరికి తనము యెవరి నైన నిలవ నీయదు, అది వేరొకరికి బలముగా మారును . అట్లు ఎవరూ ప్రవర్తించ కూడదు.
5. తుచ్ఛమైన హ్రుదయ దౌర్బల్యంను. వీడి నిజమును గ్రహించి ప్రతి ఒక్కరు విజయ లక్ష్యముగా ముందుకు సాగాలి. (గీత 4 మరియు 5 )
6. పూజ్యులైన వారిని యెదిరించుట తప్పు అని అనుకో వద్దు ? అణ్యాయాన్ని అనుచుట తప్పు కాదు అని గ్రహించాలి.
7 అహంకార మమకారములను పూర్తిగా వదలించు కొని నీలో ఉన్న అజ్ఞాన్నాన్ని పార ద్రోలి ధర్మమేదో గమనించాలి.
8 ఏ విషయము నందు కూడా జయాప జయాలు ఎవరూ చెప్పలేరు. అందరుకు కర్తవ్యము మాత్రేమే భోధించగలరు. 9గీత 6 & 7 శ్లోకాలు 0
9 కొందరికి కాల దోషం, కార్పణ్య దోషం ఆవరించి మనసు పరి పరి విదాల పోయి, ఏది చేయాలో ఏది చేయ కూడదో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది దానిని తట్టుకొని నిగ్రహించు కోవాలి.
10 .శోకము ఇంద్రియములను దహించి వేయును, శోక దాహము చల్లార్చు కొనుటకు ఉపాయము గాంచవలెను . (గీత్ - (8 వ శ్లోకం )
11 పండితుల వలె మాట్లాడేవారు ఎవరైనా ప్రాణములు పోయినవారి గురించి, ఉన్నవారి గురించి ఎట్టి పరిస్థితిలో శోకించరు.(గీత - 11 )
12 స్వధర్మమును విడిచిన వాడు, పాపము చేసిన వాడై నరకమున బడును .
13 .చంపువారు, చంప బడువారు వివేక దృష్టితో ఆలోచిస్తే ఎవరు కానరారు (గీత - ౧౨)
14 . ప్రతి ఒక్కరు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఆయా దశలలో ఉన్న సుఖాలు (దేహప్రాప్తి) అనుభవించాలి. ధీరుడైన వాడు వాటి విషయములో మోహము చెంది పతనము కాడు.
15 విష యేంద్రియ సంయోగము వలన సుఖ దుఃఖములు కలుగును, వాటి గురించి పదే పదే ఆలోచించుట అనవసరము (గీత - 14 )
16 . శీతోష్ణములు స్థిరముగా ఉన్న మీకు కానరావు, వాటివల్ల ఉత్పత్తి, వినాశము సంభవించిన విచారించుట అవసరము లేదు.
17 . ప్రతి ఒక్కరు ఉత్తమము, మద్యమము, ప్రధమము గా త్రికాలములలో జీవితమును అను భవించి తీరుతారని గమనించగలరు.
18 జనన మరణములు, మాత్రమూ జీవులు ఊహించినట్లు సంభవించవు, వారు చేసిన పుణ్య పాపములు బట్టి జరుగునని గమనించ గలరు (గీత -15 )
19 ధీరుడైనవాడు సుఖ దు:ఖములను సమానముగా చూడవలెను. అట్టి పురుషునిలో విషయేంద్రియ సంయోగములు చలింప చేయజాలవు, అతడే ధర్మపరుడుగా ఉండగలడు.
20 ప్రారబ్దము ననుసరించి వచ్చే కష్టాలు ఓరిమితో అనుభవించి, సహన శక్తిని పెంచుకొని, ఏ పరిస్థితిలో ఎవరికీ లొంగక, అధైర్యపడక, ధైర్యముతో సమబుద్ధిని ప్రవర్తించి నిజానిజాలు గ్రహించి జీవించటమే మానవుల లక్ష్యమని గ్రహించాలి.
21 లేని వస్తువుకు ఉనికి లేదు, ఉన్న వస్తువుకు ఉనికి లేకుండా పోదు.
22 ప్రతి మనిషిలో ఉంటుంది నిత్యమైన ఆత్మ, దేహము మాత్రము అనాత్మ.
23 . ఏ విషయాలైన వాస్తవ రూపములను గ్రహించటం కష్టమే, కొంతవరకు తత్వజ్ఞానము తెలిసినవానికి తెలియవచ్చును.
24 ధర్మాన్ని ఎవరు అడ్డు కోలేరు, నాశరహితమైన సత్యము ప్రపంచ మంతా ఆవహించి ఉన్నది అని గ్రహించగలరు (గీత -16 ).
25 ఆత్మ అనేది ఎవరిని చంపలేదు, ఎవరి చేత ఎవరిచేత చంప బడలేదు ఆ ఆలోచన వచ్చిన వారు అజ్ఞానులు
26 ఆత్మ అనేది పురాతనము, అజము, నిత్యమూ, శాశ్వతము, శరీరము చంపబడినను ఇది మాత్రము చంప బడదు. (గీత - 18 )
27 చిరిగిన వస్త్రము వదలి నూతన వస్త్రము ధరించినట్లే, ఆత్మ శిధిలమైన శరీరమునువదలి నూతన శరీరములో ప్రవేశించును. (గీత - 22 )
28 ఆత్మ ఉట్పట్టి, అస్తిత్వం, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అను భావ వికారములు లేనిది.
29 .ఆత్మ జనన మరణములు లేనిది, మార్పు లేనిది, దానిని చంపు తున్నాము అని అనుకుంటే అది ఒక మూర్ఖుని ఆలోచన అని అనుకోవచ్చును.
30 ఆత్మను శస్త్రములు చేధింపజాలవు. అగ్ని దహింప జాలదు. నీరుతో తడప జాలదు, వాయువు ఆరిపోవునట్లు చేయ జాలదు.(gita -23)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి