1, అక్టోబర్ 2017, ఆదివారం

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం


శ్రీ లైలితా సహస్రనామ స్తోత్రము 
ధ్యానమ్
సింధూరారుణ విగ్రహాం త్రినయణం మాణిక్య మౌళి స్ఫుర 
త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహాం     
పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీమ్
సౌమ్యాంరత్న ఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్పరా మంబికామ్ 
  
అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం, 
అణిమాదిభిరావృతాం మయూఖైః - అహమిత్యేవ విభావయే మహేశీమ్.

ధ్యాయేత్ పద్మాసనస్ధాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం,
హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసద్ధేమపద్మాం వరాంగీమ్,

సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం
శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీమ్.

సకుంకుమవిలేపనా మళికచుమ్బికస్తూరికాం
సమన్దహసితేక్షణాం సశరచాప పాశాంకుశామ్

అశేషజనమోహినీ మరుణమాల్యభూషోజ్జ్వలాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరే దమ్బికామ్!!

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేనమః

శ్రీమాతా శ్రీమహరాజ్ఞీ శ్రీమత్సిం హాసనేశ్వరీ  !
చిదగ్నికుండసమ్బూతా దేవకార్యసముద్యతా !! 1 !!    

ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహుసమన్వితా !
రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్జ్వలా !! 2  !!
  
మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా !
నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా !! 3 !! 

చమ్పకాశోకపున్నాగ సౌగన్ధికలసత్కచా !
కురువిందమణిశ్రేణీ కనత్కోటీర మండితా. !! 4  !!.

అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్ధల శోభితా, !
ముఖచన్ద్ర కళంకాభ మృగనాభివిశేషకా. !! 5  !!.

వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికా, ! 
వక్త్రలక్ష్మీపరీవాహ చలన్మీనాభలోచనా,  !! 6  !!  .

నవచంపకపుష్పాభ నాసాదండవిరాజితా, ! 
తారాకాంతి తిరస్కారినాసాభరణభాసురా.  !! 7 !! 

కదంబమంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా,
తాటంకయుగళీభూతతపనోడుప మణ్డలా.  !! 8  !!..

పద్మరాగ శిలాదర్శపరిభావి కపోలభూః, !
నవవిద్రుమ బింబశ్రీన్యక్కారి రదనచ్ఛదా. !! 9 !! 

శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తి ద్వయోజ్జ్వలా. !
కర్పూర వీటికామోద సమాకర్ష ద్దిగంతరా.* ....!! 10  !!

నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ, !
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా.. !! 11 !! .

అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా,  !
కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభితకంధరా.   .!! 12 !!.

కనకాంగదకేయూర కమనీయభుజాన్వితా,  !
రత్నగ్రై వేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా. !! 13 !! .

కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తనీ,  ! 
నాభ్యాలవాల రోమాళిలతాఫలకుచద్వయీ,  !! 14 !! .

లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమా, ! 
స్తనభారదళన్మద్య పట్టబంధవళి త్రయా.   .......!! 15 !! 

అరుణారుణ కౌసుంభవస్త్ర భాస్వత్కటీతటీ,  !
రత్నకింకిణికారమ్యరశనా దామభూషితా.  ...... !! 16 !! 

కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా, !
మాణిక్యమకుటాకార జానుద్వయవిరాజితా,  ... !! 17 !! .

ఇంద్ర గోపపరిక్షిప్త స్మరతూణాభజంఘికా,  ! 
గూఢగుల్ఫా కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా. ..!! 18 !! 

నఖదీధితిసంఛన్ననమజ్జన తమోగుణా,  ! 
పదద్వయ ప్రభాజాలపరాకృతసరోరుహ. .!! 19 !! .

శింజానమణిమంజీర మండిత శ్రీపదాంబుజా, !
మరాళీమందగమనా మహాలావణ్యశేవధిః ..... !! 20 !!  .

సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషితా. !
శివకామేశ్వరాంకస్ధా శివా స్వాధీనవల్లభా. ......!! 21 !! ..

సుమేరుశృంగమధ్యస్ధా శ్రీమన్నగర నాయికా, !
చింతామణిగృహాంతస్ధా పంచబ్రహ్మాసన స్ధితా !! 22 !! .

మహాపద్మాటవీసంస్ధా కదంబవనవాసినీ,   !
సుధాసాగర మధ్యస్ధా కామాక్షీ కామదాయినీ. !! 23  !!.

దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవైభవా, ! 
భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్వితా. ..!! 24 !! 

సంపత్కరీ సమారూఢ సింధురవ్రజసేవితా, !
అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతా. .... !! 25 !! 

చక్రరాజరధారూఢ సర్వాయుధపరిష్కృతా. !
గేయచక్రరధారూఢ మంత్రిణీ పరిసేవితా .... !! 26  !!.

కిరిచక్రరధారూఢ దండనాధపురస్కృతా,  !
జ్వాలా మాలినికాక్షిప్త వహ్నిప్రాకారమధ్యగా. !! 27 !! .

భండసైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షితా,  !
నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుకా. !! 28 !! ..

భండపుత్రవధోద్యుక్త బాలావిక్రమనందితా, !
మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితా. ..!! 29 !! 

విశుక్రప్రాణహరణా వారాహీవీర్యనందితా,   !
కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరా.  .... !! ౩౦ !!.

మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్ర ప్రహర్షితా, !
భండాసురేంద్ర నిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణీ. ...!! 31  !!

కరాంగుళినఖోత్పన్న నారాయణదశాకృతిః,  !
మహాపాశుపతాస్త్రాగ్నినిర్ధగ్ధాసురసైనికా. ........!! 32  !!

కామేశ్వరాస్త్రనిర్దగ్ధభండాసుర శూన్యకా.   !
బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవసంస్తుతవైభవా !! ౩౩ !!.

హరనేత్రాగ్ని సందగ్ధకామసంజీవనౌషధిః,   !
శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖపంకజా. !! 34 !! .

కంఠాధః కటిపర్యంతమధ్యకూటస్వరూపిణీ,  !
శక్తి కూటైక తాపన్న కట్యధోభాగ ధారిణీ     !! 35 !! .

మూలమంత్రాత్మికా మూలకూటత్రయ కళేబరా, 
కులామృతైక రసికా కులసంకేతపాలినీ.   !!! 36 !! 

కుళాంగనా కుళాంతస్థా కౌళినీ కులయోగినీ. 
అకుళా సమయాంతస్ధా సమయాచారతత్పరా. !! 37 !!

మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంధివిభేధినీ, .... 
మణిపూరాంతరుదితా విష్ణుగ్రంధివిభేదినీ.   !! 38  !!.

ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంధి విభేదినీ, ...
సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ. .!! 39  !!.

తటిల్లతాసమరుచి ష్షట్చక్రోపరిసంస్ధితా   .....
మహాశక్తిః కుండలినీ బిసతంతు తనీయసీ.  !! 40  !!.

భవానీ భావనాగమ్యా భవారణ్య కుఠారికా, .....
భద్రప్రియా భద్రమూర్తి ర్భక్తసౌభాగ్యదాయినీ.  !! 41  !!

భక్తప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా, .......
శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ.   !! 42 !! 

శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచ్చంద్రనిభాననా, .......
శాతోదరీ శాంతిమతీ నిరాధారా నిరంజనా.    !! 43 !!

నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా, ...  
నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామా నిరుపప్లవా.  !! 44 !!..

నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా, 
నిత్యశుద్ధా నిత్యబుద్దా నిరవద్యా నిరంతరా.     !! 45 !!

నిష్కారణా నిష్కళంకా నిరుపాధి ర్నిరీశ్వరా, .... 
నీరాగా రాగమధనీ నిర్మదా మదనాశినీ.      !! 46 !! ..

నిశ్చింతా నిరహంకారా నిర్మోహ మోహనాశినీ,  
నిర్మమా మమతాహంత్రీ నిష్పాపా పాపనాశినీ.  .!! 47  !!

నిష్క్రోధా క్రోధశమనీ నిర్లోభా లోభనాశినీ, .........
నిస్సంశయా సంశయఘ్నీ నిర్భవా భవనాశినీ. !! 48 !!

నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేధనాశినీ, ....... 
నిర్నాశా మృత్యుమధనీ నిష్క్రియా నిష్పరిగ్రహా. !! 49  !!

నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా, .......
దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా  !! 50 !!

దుష్టదూరా దురాచారశమనీ దోషవర్జితా .....         
సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధికవర్జితా     .!! 51 !!
  
సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా, ..
సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ. !! 52 !!.

సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మనీ, .
మహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీ ర్మృడప్రియా.   !! 53 !!

మహారూపా మహాపూజ్యా మహాపాతకనాశినీ, .........
మహమాయా మహాసత్వా మహాశక్తి ర్మహారతిః  .!! 54 !!..

మహాభోగా మహైశ్వర్యా మహావిర్యా మహాబలా, ......
మహాబుద్ధి ర్మహాసిద్ధి ర్మహాయోగీశ్వరేశ్వరీ.   !! 55 !!.

మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా మహాసనా, ...
మహాయాగక్రమారాధ్యా మహాభైరవపూజితా.  .!! 56 !!

మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణీ, ......
మహాకామేశమహిషీ మహాత్రిపురసుందరీ.      ..!! 57 !!

చతుష్షష్ట్యుపచారాఢ్యా చతుష్షష్టికళామయీ, ...
మహాచతుష్షష్టికోటియోగినీగణసేవితా.         !! 58 !!.

మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండలమధ్యగా, ...
చారురూపా చారుహాసా చారు చంద్రకళాధరా. !! 59 !!

చరాచర జగన్నాధ చక్రరాజనికేతనా, .......... 
పార్వతీ పద్మనయనా, పద్మరాగసమప్రభా. !! 60 !!

పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మ స్వరూపిణీ, ....
చిన్మయీ పరమానందా విజ్ఞానఘనరూపిణీ.  !! 61 !!

ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మ వివర్జితా, ....
విశ్వరూపా జాగరిణీ స్వపంతీ తైజసాత్మికా.  .!! 62 !!

సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జితా,.........
సృష్టికర్త్రీబ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ.  .!! 63 !!

సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ, ........
సదాశివానుగ్రహదా పంచకృత్యపరాయణా. !! 64 !!

భానుమండలమధ్యస్థా భైరవీ భగమాలినీ, ..........
పద్మాసనా భగవతీ పద్మనాభసహోదరీ.    !! 65 !!

ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః, ...... 
సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్.   ..!! 66 !!

ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమ విధాయినీ ..........
నిజాజ్ఞారూపనిగమా పుణ్యాపుణ్యఫలప్రదా     .!! 67 !!

శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా, .........
సకలాగమసందోహశుక్తి సంపుటమౌక్తికా.    !! 68 !!

పురుషార్ధప్రదా పూర్ణాభోగినీ భువనేశ్వరీ, .....  
అంబికానాదినిధనా హరిబ్రహ్మేంద్రసేవితా. !! 69 !!

నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా. ...
హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయవర్జితా.!! 70 !! 

రాజరజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా, .... 
రంజనీ రమణీ రస్యా రణత్కింకిణిమేఖలా !! 71 !!.

రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా, .....
రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణలంపటా. !! 72 !!.

కామ్యాకామకలారూపా కదంబకుసుమప్రియా, .....!
కల్యాణీ జగతీకందా కరుణారససాగరా.    .!! 73 !!

కళావతీ కలాలాపా కాంతా కాదంబరీ ప్రియా, .....
వరదా వామనయనా వారుణీమదవిహ్వలా.  . !! 74 !!

విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచలనివాసినీ, ....
విధాత్రీ వేదజననీ విష్ణుమాయావిలాసినీ.  !! 75 !!

క్షేత్రస్వరూపా క్షేత్రేశీ క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ, ......
క్షయవృద్ధి వినిర్ముక్తా క్షేత్రపాలసమర్చితా. ...!! 76 !!
  
విజయా విమలా విన్ద్యా వనదారుజనవత్సలా , .
వాగ్వాదినీ వామకేశీ వహ్నిమణ్డలవాసినీ.    .. !! 77 !!

భక్తిమత్కల్పలతికా పశుపాశవిమోచనీ, .......
సంహృతాశేషపాషణ్డ సదాచారప్రవర్తికా.    .!! 78 !!

తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదనచంద్రికా, .....
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోపహా.  !! 79 !!

చితి స్తత్పదలక్ష్యార్ధా చిదేకరసరూపిణీ,.........
స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానన్దసన్తతిః,  !! 80 !!

పరా ప్రత్యక్చితీరూపా పశ్యన్తీ పరదేవతా,.......
మధ్యమా వైఖరీరూపా భక్తమానసహంసికా.   !! 81 !!

కామేశ్వరప్రాణనాడీ కృతజ్ఞా కామపూజితా,.....
శృంగారససంపూర్ణా జయా జాలన్ధరస్థితా.    !! 82 !!

ఓడ్యాణపీఠనిలయా బిందుమణ్డలవాసినీ,.......
రహోయాగక్రమారాధ్యా రహస్తర్పణతర్పితా. !! 83 !!

సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా,.............
షడంగ దేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా.    .!! 84 !!

నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయినీ,....
నిత్యాషోడశికారూపా శ్రీకంఠార్ధశరీరిణీ.        .  !! 85 !!

ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ,.....
మూలప్రకృతి రవ్యక్తా వ్యక్తా వ్యక్తస్వరూపిణీ... .!! 86 !!

వ్యాపినీ వివిధాకార విద్యావిద్యా స్వరూపిణీ,....
మహాకామేశ నయన కుముదాహ్లాదకౌముదీ,    !! 87 !!
భక్తహార్ద తమోభేద భానుమద్భానుసంతతిః,....
శివదూతీ శివారాధ్యా శివమూర్తి శ్శివంకరీ.      !! 88 !!

శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా,.........
అప్రమేయా స్వప్రకాశా మనోవాచామగోచరా. . !! 89 !!

చిచ్ఛక్తి శ్చేతనారూపా జడశక్తిర్జడాత్మికా,.......
గాయత్రి వ్యాహృతి స్సంధ్యా ద్విజబృంద నిషేవితా.!! 90 !!

తత్వాసనా తత్త్వమయీ పంచకోశాంతరస్థితా......,
నిస్సీమ మహిమా నిత్యయౌవనా మదశాలినీ.     !! 91 !!

మదఘూర్ణితరక్తాక్షీ మదపాటలగండభూః,.........
చందనద్రవదిగ్ధాంగీ చాంపేయకుసుమప్రియా.  !! 92 !!

కుశలా కోమలాకారా కురుకుళ్ళా కుళేశ్వరీ,......
కుళకుండాలయా కౌళమార్గతత్పరసేవితా.    ..!! 93 !!

కుమార గణనాధాంబా తుష్టిః పుష్టిర్మతి ర్ధృతిః,....
శాంతి స్స్వస్తిమతీ కాంతిర్నందినీ విఘ్ననాశినీ.  ..!! 94 !!

తేజోవతీ త్రినయనా లోలాక్షీ కామరూపిణీ..........
మాలినీ హంసినీ మాతా మలయాచలవాసినీ  .....!! 95 !!

సుముఖీ నళినీ సుభ్రూశ్శోభనా సురనాయికా,......
కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ.    !! 96 !!

వజ్రేశ్వరీ వామదేవి వయోవస్థా వివర్జితా,......   
సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ.    !! 97 !!

విశుద్ధచక్ర నిలయా రక్తవర్ణా త్రిలోచనా,......   
ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమన్వితా. !! 98 !!

పాయసాన్నప్రియా త్వక్‌స్ధా పశులోకభయంకరీ,.....
అమృతాదిమహాశక్తి సంవృతా డాకినీశ్వరీ.      !! 99 !!

అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా,.....
దంష్ట్రోజ్జ్వలాక్షమాలాదిధరా రుధిరసంస్ధితా.   !! 100 !!

కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతా స్నిగ్ధౌదనప్రియా,.....
మహావీరేంద్రవరదా రాకిన్యంబా స్వరూపిణీ.  !! 101 !!

మణిపూరాబ్జనిలయా వదనత్రయ సంయుతా, .....
వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా.  !! 102 !!

రక్తవర్ణా మాంసనిష్ఠా గుడాన్నప్రీతమానసా,......
సమస్తభక్త సుఖదా లాకిన్యంబా స్వరూపిణీ.    !! 103 !!

స్వాధిష్ఠానాంబుజగతా చతుర్వక్త్ర మనోహరా,....
శూలాద్యాయుధసంపన్నా పీతవర్ణాతిగర్వితా. !! 104 !!

మేదోనిష్ఠా మధుప్రీతా బందిన్యాదిసమన్వితా,.....
దధ్యన్నాసక్త హృదయా డాకినీ రూపధారిణీ.   !! 105 !!

మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాస్ధిసంస్ధితా,....
అంకుశాదిప్రహరణా వరదాదినిషేవితా,      !! 106 !!

ముద్గౌదనాసక్తచిత్తా సాకిన్యంబాస్వరూపిణీ,...........
ఆజ్ఞాచక్రాబ్జనిలయా శుక్లవర్ణా షడాసనా.     !! 107 !!

మజ్జాసంస్ధా హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా,.....
హరిద్రాన్నైకరసికా హాకినీరూపధారిణీ.      !! 108 !!

సహస్రదళ పద్మస్ధా సర్వవర్ణోపశోభితా,.....
సర్వాయుధధరా శుక్ల సంస్ధితా సర్వతోముఖీ.  !! 109 !!

సర్వౌదనప్రీతచిత్తా యాకిన్యాంబా స్వరూపిణీ,.........
స్వాహా స్వధా మతిర్మేధా శ్రుతిఃస్మృతి రనుత్తమా. !! 110 !!

పుణ్యకీర్తిః పుణ్యలభ్యా పుణ్య శ్రవణకీర్తనా,........
పులోమజార్చితా బంధమోచనీ బంధురాలకా.    !! 111 !!

విమర్శరూపిణీ విద్యా వియదాదిజగత్ప్రసూః,.......
సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యునివారిణీ.   !! 112 !!

అగ్రగణ్యా చింత్యరూపా కలికల్మషనాశినీ,......
కాత్యాయనీ కాలహంత్రీ కమలాక్షనిషేవితా.   !! 113 !!

తాంబూలపూరితముఖీ దాడిమీకుసుమప్రభా,.........
మృగాక్షీమోహినీ ముఖ్యామృడానీ మిత్రరూపిణీ. !! 114 !!

నిత్యతృప్తా భక్తనిధిర్నియంత్రీ నిఖిలేశ్వరీ,.......
మైత్య్రాదివాసనాలభ్యా మహాప్రళయసాక్షిణీ.   !! 115 !!

పరాశక్తిః పరానిష్ఠా ప్రజ్ఞానఘనరూపిణీ,..........
మాధ్వీపానాలసా మత్తా మాతృకా వర్ణరూపిణీ.  !! 116 !!

మహాకైలాసనిలయా మృణాళమృదుదోర్లతా..........,
మహనీయా దయామూర్తి ర్మహాసామ్రాజ్యశాలినీ. !! 117 !!

ఆత్మవిద్యా మహావిద్యా శ్రీ విద్యా కామసేవితా,......
శ్రీ షోడశాక్షరీవిద్యా త్రికూటా కామకోటికా.     !! 118 !!

కటాక్షకింకరీభూతకమలా కోటిసేవితా........
శిరస్ధ్సితా చంద్రనిభా ఫాలస్ధేంద్ర ధనుఃప్రభా. !! 119 !!

హృదయస్ధా రవి ప్రఖ్యా త్రికోణాంతరదీపికా, ......
దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞ వినాశినీ.    !! 120 !!

దరాందోళిత దీర్ఘాక్షీ దరహాసోజ్జ్వలన్ముఖీ,........
గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా గుహజన్మభూః   !! 121 !!

దేవేశీ దండనీతిస్ధా దహరాకాశరూపిణీ,..........
ప్రతిపన్ముఖ్యరాకాంతతిధిమండలపూజితా.  !! 122 !!

కళాత్మికా కళానాధా కావ్యాలాపవినోదినీ,...........
సచామరరమావాణీసవ్యదక్షిణసేవితా.       !! 123 !!

ఆదిశక్తి రమేయాత్మా పరమా పావనకృతిః,.........
అనేకకోటి బ్రహ్మాండజననీ దివ్యవిగ్రహా.   !! 124 !!

క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్యపదదాయినీ,...........
త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తి స్త్రిదశేశ్వరీ. !! 125 !!

త్ర్యక్షరీ దివ్యగంధాడ్యా సింధూర తిలకాంచితా......, 
ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవితా.   !! 126 !!

విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరీ,.......
ధ్యానగమ్యా పరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞానవిగ్రహా.  !! 127 !!

సర్వవేదాంత సంవేద్యా సత్యానందస్వరూపిణీ,.........
లోపాముద్రార్చితా లీలా క్లుప్త బ్రహ్మాండ మండలా.!! 128 !!

అదృశ్యా దృశ్యరహితా విజ్ఞాత్రీ వేద్యవర్జితా,
యోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరా. !! 129 !!

ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ,
సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ.  !! 130 !!

అష్టమూర్తి రజాజైత్రీ లోక యాత్రా విధాయినీ,
ఏకాకినీ భూమరూపా నిర్ద్వైతా ద్వైతవర్జితా.   !! 131 !!

అన్నదా వసుధా వృద్ధా బ్రహ్మత్మైక్య స్వరూపిణీ,
బృహతీ బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియా !! 132 !!.

భాషారూపా బృహత్సేనా భావాభావవివర్జితా,
సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభాగతిః     !! 133 !!

రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా,
రాజత్కృపా రాజపీఠనివేశిత నిజాశ్రితా     !! 134 !!

రాజ్యలక్ష్మీః కోశనాధా చతురంగబలేశ్వరీ,
సామ్రాజ్యదాయినీ సత్యసంధా సాగరమేఖలా.  !! 135 !!

దీక్షితా దైత్యశమనీ సర్వలోకవశంకరీ,
సర్వార్ధదాత్రీ సావిత్రీ సచ్చిదానందరూపిణీ.   !! 136 !!

దేశకాలాపరిచ్ఛిన్నా సర్వగా సర్వమోహినీ,
సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్య రూపిణీ. !! 137 !!

సర్వోపాధివినిర్ముక్తా సదాశివపతివ్రతా,
సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండలరూపిణీ.  !! 138 !!

కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ,
గణాంబా గుహ్యకారాధ్యా కోమలాంగీ గురుప్రియా. !! 139 !!

స్వతంత్రా సర్వతంత్రేశీ దక్షిణామూర్తిరూపిణీ,
సనకాదిసమారధ్యా శివజ్ఞాన ప్రదాయినీ.     !! 140 !!

చిత్కాళానందకలికా ప్రేమరూపా ప్రియంకరీ,
నామపారాయణప్రీతా నందివిద్యా నటేశ్వరీ.   !! 141 !!

మిధ్యాజగదధిష్ఠానా ముక్తిదా ముక్తిరూపిణీ,
లాస్యప్రియా లయకరీ లజ్జా రంభాదివందితా.  !! 142 !!

భవదావసుధావృష్టిః పాపారణ్యదవానలా,
దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతరవిప్రభా.  !! 143 !!

భాగ్యాబ్ధిచంద్రికా భక్త చిత్తకేకిఘనాఘనా,
రోగపర్వతదంభోళి ర్తృత్యుదారుకుఠారికా.   !! 144 !!

మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా,
అపర్ణాచండికా చండముండాసురనిషూదినీ. !! 145 !!

క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ,
త్రివర్గదాత్రీ సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మికా !! 146 !!

స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్పనిభాకృతిః,
ఓజోవతీ ద్యుతిధారా యజ్ఞరూపా ప్రియవ్రతా.  !! 147 !!

దురారాధ్యాదురాధర్షా పాటలీకుసుమప్రియా,
మహతీ మేరునిలయా మందారకుసుమప్రియా. !! 148 !!

వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ,
ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ.  !! 149 !!

మార్తాండభైరవారాధ్యా మంత్రిణీన్యస్తరాజ్యధూః,
త్రిపురేశీ జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా.  !! 150 !!

సత్యజ్ఞానానందరూపా సామరస్యపరాయణా,
కపర్ధినీ కళామాలా కామధుక్కామరూపిణీ.    !! 151 !!

కళానిధిః కావ్యకళా రసజ్ఞా రససేవధిః,
పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా. !! 152 !!

పరంజ్యోతిః ప్రంధామ పరమాణుః పరాత్పరా,
పాశహస్తా పాశహంత్రీ పరమంత్రవిభేదినీ.    !! 153 !!

మూర్తామూర్తా నిత్యతృప్తా మునిమానసహంసికా,
సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామినీ సతీ.  !! 154 !!
 
బ్రహ్మాణీ బ్రహ్మజననీ బహురూపా బుధార్చితా,
ప్రసవిత్రీ ప్రచండాజ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతిః.   !! 155 !!

ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ,
విశృంఖలా వివిక్తస్ధా వీరమాతా వియత్ప్రసూః  !! 156 !!

ముకుందా ముక్తి నిలయా మూలవిగ్రహరూపిణీ,
భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్ర ప్రవర్తినీ.            !! 157 !! 

ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ,
ఉదారకీర్తి రుద్దామవైభవా వర్ణరూపిణీ.         !! 158 !!

జన్మమృత్యుజరాతప్త జనవిశ్రాంతిదాయినీ,
సర్వోపనిషదుద్ఘుష్టా శాంత్యతీతకళాత్మికా.   !! 159 !!

గంభీరా గగనాంతస్థా గర్వితా గానలోలుపా,
కల్పనారహితా కాష్ఠా కాంతా కాంతార్ధవిగ్రహా.  !! 160 !!

కార్యకారణనిర్ముక్తా కామకేళితరంగితా,
కనత్కనకతాటంకా లీలావిగ్రహధారిణీ.       !! 161 !!
  
అజా క్షయవినిర్ముక్తా ముగ్ధాక్షిప్ర ప్రసాదినీ,
అంతర్ముఖసమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా.  !! 162 !!

త్రయీ త్రివర్గనిలయా త్రిస్ధా త్రిపురమాలినీ,
నిరామయా నిరాలంబా స్వాత్మారామా సుధాసృతిః  !! 163 !!

సంసారపంకనిర్మగ్నసముద్ధరణపండితా,
యజ్ఞప్రియా యజ్ఞకర్తీ యజమానస్వరూపిణీ.     !! 164 !!

ధర్మాధారా ధనాధ్యక్షా ధనధాన్యవివర్ధినీ,
విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణీ.      !! 165 !!

శ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ,
అయోనిర్యోనినిలయా కూటస్ధా కులరూపిణీ.    !! 166 !!

వీరగోష్టీప్రియా వీరా నైష్కర్మ్యా నాదరూపిణీ,
విజ్ఞానకలనా కల్యా విదగ్ధా బైందవాసనా.          !! 167 !!  

తత్త్వాధికా తత్త్వమయీ తత్త్వమర్ధస్వరూపిణీ,
సామగానప్రియా సౌమ్యా సదా శివకుటుంబినీ.  !! 168 !!

సవ్యాపసవ్యమార్గస్ధా సర్వాపద్వినివారిణీ, 
స్వస్ధా స్వభావమధురా ధీరా ధీరసమర్చి తా.     !! 169 !!

చైతన్యార్ఘ్యసమారాధ్య చైతన్యకుసుమప్రియా,
సదోదితా సదాతుష్టా తరుణాదిత్యపాటలా,      !! 170 !!

దక్షిణా దక్షిణారాధ్యా దరస్మేరముఖాంబుజా,
కౌళినీ కేవలానర్ఘకైవల్య పదదాయినీ.        !! 171 !!

స్తోత్రప్రియా స్తుతిమతీ శ్రుతిసంస్తుతవైభావా,
మనస్వినీ మానవతీ మహేశీ మంగళాకృతిః  !! 172 !!

విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ,
ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ. !! 173 !!

వ్యోమకేశీ విమానస్ధా వజ్రిణీ వామకేశ్వరీ,
పంచయజ్ఞప్రియా పంచప్రేతమంచాధిశాయినీ.  !! 174 !!

పంచమీ పంచభూతేశీ పంచసంఖ్యోపచారిణీ,
శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహినీ.   !! 175 !!

ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ,
లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా.  !! 176 !!

బంధూకకుసుమప్రఖ్యా బాలా లీలావినోదినీ,
సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ.  !! 177 !!

సువాసిన్యర్చనప్రీతా శోభానా శుద్ధమానసా,
బిందుతర్పణసంతుష్టా పూర్వజా త్రిపురాంబికా. !! 178 !!

దశముద్రా సమారాధ్యా త్రిపురా శ్రీవశంకరీ,
జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణీ.   !! 179 !!

యోనిముద్రా త్రిఖండేశీ త్రిగుణాంబా త్రికోణగా,
అనఘాద్భుత చారిత్రా వంఛితార్ధప్రదాయినీ.  !! 180 !!

అభ్యాసాతిశయజ్ఞాతా షడద్వాతీతరూపిణీ,
అవ్యాజకరుణామూర్తి రజ్ఞానద్వాంతదీపికా.    !! 181 !!

ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్యుశాసనా,
శ్రీ చక్రరాజనిలయా శ్రీ మత్రిపురసుందరీ.   !! 182 !!

శ్రీశివా శివశక్యైక్య రూపిణీ లలితాంబికా,
ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః !! 183 !!

ఇతి శ్రీ బ్రహ్మండపురాణే, ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే
శ్రీ లలితా రహస్యనామ స్తోత్ర కధనం నామ ద్వితీయోధ్యాయః 

--((**))--




శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం

ఓం హ్రీమ్ శ్రీ౦ శ్రీమాత్రే నమ:

శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్ని కుండసంభూతా దేవకార్యసముద్యతా    .... 1

శ్రీమాతా :"శ్రీ శబ్దము వాక్పరము " కావున వాక్కులను కలుగ చేయుటకు ఈమెతోసమానమైన ఏదేవతలు లేరు కనుక శ్రీ మాతా అని పిలుస్తారు.

సృష్టికి మూలం స్త్రీ
శ్రీ మాత - లక్ష్మీదేవి కే తల్లి
మా - కొలుచుట
త్రేయం : తెలుసుకొనుట
పెదాలు కలిపి పిలిచేది "అమ్మా "
పుడమి పై జనమించినవారు ఎవరైనా ముందు పలికెడి అమ్మా
అమ్మని మించిన దైవం లేదు - ఆరాధించని బిడ్డ లేదు
ఆదుకొని తల్లి లేదు - సమస్తం త్యం చేసేది అమ్మే
అందుకే మాతృ దేవో భావ అన్నారు ముందుగా
శ్రీ మహారాజ్ఞి : సకల ప్రపంచ పాలనా సామర్ధ్యము కలది కావునా "శ్రీ మహారాజ్ఞి" అని పిలుస్తారు.
పరిపాలించింది: మహారాజ్ఞి ( ప్రకృతిని సాశిస్తు, సమస్త దేవతాగణాలను అజమాయి స్తూ సమస్త కష్టాలను తొలగించే మహారాణులకు రాణి)
హా అనగా ఒక గాలి తరంగం ( ఆకర్షణ, వికర్షణ తో కదిలేది )
మహా అనగా ఎవ్వరూ ఊహించనటువంటి, తరంగ రూపములో మనసులో ప్రవేశించి అంగాంగ వెలుగును అందించే రాజులకు రాణి మహారాణి
సమస్త సృష్టికి స్త్రీ యే మూలం, సృష్టి స్థితి, లయ కారులకు అధికారి స్త్రీ
అందుకే స్త్రీని గౌరవించే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది అక్కడ అమ్మవారు స్థిరంగా ఉండి సమస్త క్షోభలను తొలగిస్తారు


శ్రీమత్సింహాసనేశ్వరీ :బంధమోక్ష స్వరూపాది సకాలమును చూపింప నారభించు" సింహవాహనముగా గల ఈశ్వరీ "

చంద్రునిలో 16 కళలు ఉంటాయి, స్త్రీ మనస్సులో 16 కళలు ఉన్నాయి, సింహం లా జీవించాలనేది అమ్మవారి ధ్యేయం. సింహంలా బ్రతకండి అనగా సింహం 20 గంటలు నిద్ర పోతుంది 4 గంటలు మేలుకొని ఆహరం సంపాదిస్తుంది. అది ఆహారాన్ని కూడా ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి మరి సంపాయిస్తుంది తాను తినగలిగినది తిని వదిలే స్తుంది. స్త్రీ కూడా 20 గంటలు కష్టపడి జ్ఞానమనే కళలను తనకు తెలిసినవి బిడ్డలకు అందిస్తుంది అందుకే స్త్రీలు సింహం పై సవారి చేసే స్త్రీ లా ఉండాలనేదే భావం .

--((**))--

చిదగ్ని కుండసంభూతా: అగ్నిగుండములో పుట్టి, పూర్తి బ్రహ్మతేజస్సుతో, ఇచ్ఛా తేజస్సుతో శక్తి  రూపముగా ప్రత్యక్షమైన తల్లి
దేవకార్యసముద్యతా   : దేవకార్యార్థము కొరకు ఆవిర్భవించిన తల్లి, శ్రీ చక్రాకారముగా ఆవిర్భవించి  ప్రత్యక్షమైన తల్లి

    అగ్నిగుండములో పుట్టి, పూర్తి బ్రహ్మతేజస్సుతో, ఇచ్ఛా తేజస్సుతో శక్తి  రూపముగా ప్రత్యక్షమైన తల్లివి నీవమ్మా, దేవకార్యార్థము కొరకు ఆవిర్భవించిన తల్లివమ్మా, శ్రీ చక్రాకారముగా ఆవిర్భవించి ప్రజలకు ప్రత్యక్షమైన తల్లివమ్మా, "శ్రీ శబ్దము వాక్పరము " కావున వాక్కులను కలుగ చేయుటకు నీతో సమానమైన ఏదేవతలు లేరు కనుక నిన్ను శ్రీ మాతా అని పిలుస్తారమ్మా , బంధమోక్ష, స్వరూపాది, సకాలమును, చూపింప నారభించు" సింహ వాహనముగా స్థిరముగా ఉండి, సకల ప్రపంచ పాలనా సామర్ధ్యము కలిగి ఉన్నావు  కావునా "శ్రీ మహారాజ్ఞి" అని పిలుస్తారమ్మ, అమ్మా అమ్మా అమ్మా,  అమ్మలగన్న మాయమ్మకు మా శతకోటి దండములు.  

ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహు సమన్వితా
రాగస్వరూపపాశాడ్యా  క్రోథాకారాంకుశోజ్జ్వలా        .... 2

ఉద్యద్భానుసహస్రాభా : అనేక సూర్యకిరణములుగల రక్తకాంతితో ప్రకాశమంతముగా పరాశక్తిగా మారిన  తల్లి
చతుర్బాహు సమన్వితా : నాలుగు హస్తములు కలిగి ఉన్న "మీదుగా రెండు హస్తాలు క్రిందగా రెండు హస్తములు గల బడదేవతగా ప్రత్యక్షంగా కనబడుతున్న తల్లి
రాగస్వరూపపాశాడ్యా  : సత్యగుణ త్రయము కలిగి బ్రహ్మతేజస్సుతో పాశమున్న తల్లి  
క్రోథాకారాంకుశోజ్జ్వలా : అమ్మవారి క్రోధమే అంకుసాకారము పొందినది, అంకుశముచేత ప్రకాశించు  చున్న హస్తముగల తల్లి

అనేక సూర్య కిరణముల వెలుగులతో, రక్తకాంతి వర్ణముతో,  ప్రకాశమంతముగా, పరాశక్తిగా మారిన తల్లివమ్మా, నాలుగు హస్తములు కలిగి ఉన్న "మీదుగా రెండు హస్తములు, క్రిందగా రెండు హస్తములు గల బడదేవతగా ప్రత్యక్షంగా  కనబడుతున్న తల్లివమ్మా, సత్యగుణ త్రయము కలిగి బ్రహ్మతేజస్సుతో పాశమున్న తల్లివమ్మా,  అమ్మవారి క్రోధమే అంకుశాకారము పొందినది, అంకుశముచేత ప్రకాశించు చున్న హస్తముగల తల్లివమ్మా, అమ్మా అమ్మాఅమ్మా,  అమ్మలగన్న మాయమ్మకు మా శతకోటి దండములు   

మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్రసాయకా 
నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్ర హ్మాణ్డ మండలా  ....  3 

మనోరూపేక్షు కోదండా   : శ్రీదేవి క్రింది వామహస్తమునందు ఎఱ్ఱ చెఱకు విల్లు దనస్సుగా కలది  "మనస్సే చెఱకు విల్లుగా ఉండి సంకల్పమునకే మనస్సు సంజ్ఞ అందించే తల్లివి    

పంచతన్మాత్రసాయకా : శ్రీదేవి కుడిభాగము బాహువు యందు  పంచభూతాలనే (శబ్ద,స్పర్శ,రూప రస ఘాంధములు) అనే బాణములు ధరించి ప్రపంచ ప్రజలకు అందించిన తల్లివి.

నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్ర హ్మాణ్డ మండలా : శ్రీదేవి శరీరమునుండి ఎర్రని కాంతి పుంజముల సమూహము వెలుబడి ఆకాంతిలో బ్రహ్మాన్డ మండలాలు కాంతి వంతముగా మార్చిన తల్లివమ్మా 

       శ్రీదేవి క్రింది వామహస్తమునందు ఎఱ్ఱ చెఱకు విల్లు దనస్సుగా కలది  "మనస్సే చెఱకు విల్లుగా ఉండి సంకల్పమునకే మనస్సు సంజ్ఞ అందించే తల్లివి, శ్రీదేవి కుడిభాగము బాహువు యందు  పంచభూతాలనే (శబ్ద,స్పర్శ,రూప రస ఘాంధములు) అనే బాణములు ధరించి ప్రపంచ ప్రజలకు అందించిన తల్లివి.శ్రీదేవి శరీరమునుండి ఎర్రని కాంతి పుంజముల సమూహము వెలుబడి ఆకాంతిలో బ్రహ్మాన్డ మండలాలు కాంతి వంతముగా మార్చిన తల్లివమ్మా, శ్రీదేవి శరీరమునుండి ఎర్రని కాంతి పుంజముల సమూహము వెలుబడి ఆకాంతిలో బ్రహ్మాన్డ మండలాలు కాంతి వంతముగా మార్చిన తల్లివమ్మా. ఈ రూపములో అమ్మను ధ్యానించినవారికి సర్వజనావశ్యము, సర్వజగద్వశ్యము తప్పక జరుగునని ఋషులు తెలియ పరిచారు. పంచ భూతములతో ఎర్రని కాతవంతముగా వెలిగిపోతున్న అమ్మకు శత కోటి దండాలు          

చంపకా శోక పున్నాగ సౌగంధికల సత్కచా    
కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండితా        ....  4 

 చంపకా శోక పున్నాగ సౌగంధికల సత్కచా : చంపకము అశోకము పున్నాగము మొదలగువృక్షముల పుష్పములను కొప్పుగా ధరించి వాటియొక్క పరిమళాలు స్వత సిద్ధముగా అంతటా వ్యాపింప చేసిన తల్లివమ్మా, 

కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండితా: కురువింద శిలలా గర్భమునందు పుట్టిన పద్మరాగమణిగణఖచితమయి వెలుగుచున్నకిరీటముచేత ప్రకాశింప బడుచున్నతల్లివమ్మా       
   
చంపకము అశోకము పున్నాగము మొదలగువృక్షముల పుష్పములను కొప్పుగా ధరించి వాటియొక్క పరిమళాలు స్వత సిద్ధముగా అంతటా వ్యాపింప చేసిన తల్లివమ్మా, కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండితా: కురువింద శిలలా గర్భమునందు పుట్టిన పద్మరాగమణిగణఖచితమయి వెలుగుచున్నకిరీటముచేత ప్రకాశింప బడుచున్నతల్లివమ్మా, ఎర్రని కాతవంతముగా వెలిగిపోతున్న అమ్మకు శత కోటి దండాలు.
प्रांजलि प्रभ 

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం
అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితా
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా    ........ 5

అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితా :  అర్ధచంద్రాకారమైన ఫాలప్రదేశము కల శ్రీ దేవివమ్మా,  
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా : ముఖమనే చంద్ర బింబమునందు కళంకము వంటి కస్తూరీ   తిలకము గల శ్రీదేవివమ్మా 

అర్ధచంద్రాకారమైన ఫాల ప్రదేశము కల శ్రీ దేవివమ్మా, ముఖమనే చంద్ర బింబమునందు కలంకము వంటి కస్తూరీ తిలకము గల శ్రీదేవివమ్మా, ఫాలప్రదేశము అర్ధచంద్రాకారము, ముఖము చంద్రబింబము వలె వెలిగి పోచున్న అమ్మలు గన్న అమ్మకు మా శతకోటి దండములు. 


వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా
వక్త్రలక్ష్మీ పరీవాహ చలంన్మినాభాలోచనా     .........6 

వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా : అమ్మవారి ముఖమనే మన్మధుని మాంగళ్య గృహము యో క్క మొదటి ద్వారమున కనుబొమలు తోరణములుగా ఉన్న తల్లివమ్మా  

వక్త్రలక్ష్మీ పరీవాహ చలంన్మినాభాలోచనా  :ముఖ కాంతి యను ప్రవాహము నందు సంచలించు చున్న  మత్యముల వంటి నేత్రములు గలతల్లివమ్మా  

ముఖమనే మన్మధుని మాంగళ్య గృహము యో క్క మొదటి ద్వారమున కనుబొమలు తోరణములుగా ఉన్న తల్లివమ్మా, ముఖ కాంతి యను ప్రవాహము నందు సంచలించు చున్న  మత్యముల వంటి నేత్రములు గలతల్లివమ్మా, కనుబొమలు తోరణములు కలిగి, ముత్యములవంటి నేత్రములు కలిగి ఉన్న అమ్మలు గన్న అమ్మకు మా శతకోటి దండములు 

నవచంపక పుష్పాభనాసాదండవిరాజితా 
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా     ........ 7 

నవచంపక పుష్పాభనాసాదండవిరాజితా : అప్పుడే వికసించిన సంపెంగ మొగ్గతో సమానమైన నాసికా దండము చేత ప్రకాశింప బడుచున్న తల్లివమ్మా 


తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా : నక్షత్ర కాంతులను తిరస్కరించే మాణిక్య మౌక్తికముల చేత పొదగబడిన నాసాభరణము తరించిన తల్లివమ్మా,


అప్పుడే వికసించిన సంపెంగ మొగ్గతో సమానమైన నాసికాదండము చేత ప్రకాశింప బడుచున్న తల్లివమ్మా, నక్షత్ర కాంతులను తిరస్కరించే మాణిక్యమౌక్తికములచేత పొదగబడిన నాసాభరణము తరించిన తల్లివమ్మా, అందమైన నాసికా యందు సంపెంగ మొగ్గ తోనూ, నాసాభరణములతోను 
ప్రకాశిస్తున్న తల్లికి మా శతకోటి దండములు   

కదంబమంజరీకప్తకర్ణపూరమనోహరా     
తాటంక యుగళీ భూత తపనోడుపమండలా   ...... 8 

కదంబమంజరీకప్తకర్ణపూరమనోహరా  : కర్ణోపరిభాగమునందు చిన్న కడిమి పూగుత్తి చేత ప్రకాశించు చున్న తల్లివమ్మా . 

తాటంక యుగళీ భూత తపనోడుపమండలా : చెవి కమ్ములు యందు ఒకవైపు సూర్యుడ్ని, మరోవైపు  చంద్రడ్ని ఆభరణములుగా ధరించి న తల్లివమ్మా మరి ఏదేవతకు ఈవిధమైన సౌకర్యము లేదమ్మా    

కర్ణోపరిభాగమునందు చిన్న కడిమి పూగుత్తి చేత ప్రకాశించు చున్న తల్లివమ్మా,  చెవి కమ్ములు యందు ఒకవైపు సూర్యుడ్ని, మరోవైపు  చంద్రడ్ని ఆభరణములుగా ధరించిన తల్లివమ్మా,  మరి ఏ దేవతకు ఈవిధమైన సౌకర్యము లేదమ్మా, అట్టి నీకు మా శతకోటి దండములు 


प्रांजलि प्रभ 

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం
పద్మరాగ శిలా దర్శ పరిభావికపోలభూ :    
నవవిద్రుమబింబ శ్రీ న్యక్కారి దశ నచ్చ దా  .....  9 


పద్మరాగ శిలా దర్శ పరిభావికపోలభూ : శ్రీదేవి చెక్కిళ్ళు అద్దము కన్నా నునుపుగాను, పద్మరాగము కన్నా ఎరుపును కలిగి ప్రజలందరికి  ప్రకాశిస్తూ కనబడుతున్నావమ్మా.

నవవిద్రుమబింబ శ్రీ న్యక్కారి దశ నచ్చ దా: పెదవులు ఉన్నతముగాను, అధికమైన ఎర్రనిరంగు కలిగి ఉన్నందువలన అప్పుడే పుట్టిన పగడపు తీగయొక్క శోభను, బాగుగా పండిన దొండపండు రంగును గల పెదవులు గల తల్లివమ్మా. 

చెక్కిళ్ళు పద్మరాగము కన్నా ఎరుపుగాను, పెదవులు పగడపు తీగ కన్నా ఎరుపుగాను కనబడుతూ ప్రజలందరికి దర్శనమిస్తున్న అమ్మలగన్న అమ్మకు మా శతకోటి దండములు.  

శుద్ధవిద్యా0కురా ద్విజ పంక్తి ద్వయోజ్జ్వలా !
కర్పూర వీటి కామోద సమాకర్ష ద్దిగంతరా !!  ..... 10

 
శుద్ధవిద్యా0కురా ద్విజ పంక్తి ద్వయోజ్జ్వలా :  "ప్రాధమిక విద్య, షోడషా క్షరీవిద్య,శుద్ధవిద్య అను మూడింటిలో ఉన్న 16 బీజములు అంకురములు. శ్రీదేవి ఈ బీజములయందు శివభక్తి నిండి యున్నది ఇవి రేడుదశలుగా పైన క్రింద దంత  పంక్తులుగా ఏర్పడినవివీరితో నిత్యము మంత్రవర్ణములు గల తల్లివి.     

కర్పూర వీటి కామోద సమాకర్ష ద్దిగంతరా : శ్రీదేవియొక్క ముఖమునందు కరుపురాది సుఘంధ ద్రవ్య సంయుతమగు కర్పూర వీటిక గల తల్లివి. 

"ప్రాధమిక విద్య, షోడషాక్షరీవిద్య, శుద్ధవిద్య అను మూడింటిలో ఉన్న 16 బీజములు అంకురములు. శ్రీదేవి ఈ బీజములయందు శివభక్తి నిండి యున్నది ఇవి రెండు దశలుగా పైన క్రింద దంత  పంక్తులుగా ఏర్పడినవి వీటితో నిత్యము మంత్రవర్ణములు గల తల్లివి. ముఖము నందు కర్పూర రాది సుఘంధ ద్రవ్య సంయుతమగు కర్పూర వీటిక గల తల్లివి. 
నిత్యమూ శివభక్తి బీజాక్షరములతో జపిస్తూ సుఘంధ ద్రవ్య సంయుతమగు కర్పూర వీటిక గల తల్లికి మా శతకోటి దండములు 

నిజస్సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్ఛపీ !
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా!! ... 11

నిజస్సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్ఛపీ: అమ్మ వాక్యములందు వర్ణ విభాగము స్పష్టముగా నున్నందున మాధుర్యము అధికముగా నున్నాదనియు, దేవి వాక్కులు వీణానాదమును తిరస్కరించుచున్నమనసును హత్తుకొనేవి.    
 
 మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా: శ్రీదేవి యొక్క ముఖము సర్వదా చిరునవ్వుతో గూడి యున్నందున ఆ మందహాసము యొక్క కాంతి ప్రవాహమునందు శ్రీదేవి భర్త ఆయిన కామేశ్వరుని మనస్సు మునుగుచూ తేలుచు అస్వాధీనముగా నున్నది

అమ్మ వాక్యములందు వర్ణ విభాగము స్పష్టముగా నున్నందున మాధుర్యము అధికముగా, ముఖము సర్వదా చిరునవ్వుతో గూడి యున్నందున ఆ మందహాసము యొక్క కాంతి ప్రవాహమునందు శ్రీదేవి భర్త ఆయిన కామేశ్వరుని మనస్సు మునుగుచూ తేలుచు అస్వాధీనముగా నున్నదిగా ఉన్న తల్లికి శతకోటి దండములు
   
అనాకాలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితా !
కామేశ బద్ద మాంగళ్య సూత్ర శోభిత కంధరా !! ...... 12

అనాకాలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితా : శ్రీ దేవి చుబుకమునకు సమానమైన వస్తువులే దొరకనందున అద్దమునందు సౌమ్యముగా ఉన్నది ప్రకాశించు చున్న గడ్డము కలది.     

కామేశ బద్ద మాంగళ్య సూత్ర శోభిత కంధరా :   పరమశివునిచే కట్టబడిన మంగళసూత్రము చే ప్రకాశించు చున్న ఖంఠము కలది. 
శ్రీ దేవి అందమైన చుబుకం కలిగి మంగళ సూత్రంతో ఖంఠం ప్రకాశించు చున్న తల్లికి శత కోటి  దండాలు.  

కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా !
రత్న గ్రై వేయచింతా కల్లోల ముక్తా ఫలాన్వితా !! -13 

కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా: బంగారముతో నిర్మించబడిన నాలుగు భుజకీ ర్తులచే అలంకరించ బడిన బాహువులు గల అమ్మలుగన్న అమ్మ.  రత్న గ్రై వేయచింతా కల్లోల ముక్తా ఫలాన్వితా : నవరత్నములచే కూర్చబడిన మూడు ముత్యాల కంఠాభరణములు ధరించిన అమలుకన్నమ్మకు వందనములు 

బంగారముతో నిర్మించబడిన నాలుగు భుజ కీర్తులచే అలంకరించబడిన బాహువులు గల అమ్మలుగన్న అమ్మ, నవరత్నములచే కూర్చబడిన మూడు ముత్యాల కంఠాభరణములు ధరించిన అమ్మలుగన్న అ కు వందనములు.  

   

కామేశ్వరప్రేమరత్నమణి ప్రతిపణస్తనీ !

నాభ్యాలవాలరోమాలిలతా ఫాలకుచధ్వ ఈ !!  ...... 14  

కామేశ్వరప్రేమరత్నమణి ప్రతిపణస్తనీ : జగన్మాత తనభర్త అయిన కామేశ్వరుని ప్రేమ అనే రత్నమును పొందుటకు తన స్తనద్వయములనే ప్రతిపనముగా ఇచ్చునది. ఒక ప్రేమ రత్నమునకు రెండు స్దాన రత్నములను అందించుటయే స్త్రీ ఔదార్యాము చూపిం తల్లివి.   

నాభ్యాలవాలరోమాలిలతా ఫాలకుచధ్వ ఈ: నాభి పాదుగా తుమ్మెదలవంటి రోమరాజి  అనే లతకు ఆలవాలమై యున్న అమ్మకు శతకోటి వందనములు 
  
జగన్మాత తనభర్త అయిన కామేశ్వరుని ప్రేమ అనే రత్నమును పొందుటకు తన స్తనద్వయములనే ప్రతిపనముగా ఇచ్చునది. ఒక ప్రేమ రత్నమునకు రెండు స్దాన రత్నములను అందించుటయే శ్రీ ఔదార్యాము చూపించిన తల్లివి. నాభి పాదుగా తుమ్మెదలవంటి రోమరాజి  అనే లతకు ఆలవాలమై యున్న అమ్మకు శతకోటి వందనములు 

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం

లక్ష్యరోమలతా థారతాసమున్నే యమధ్యమా ! 
స్తనభార దళన్మధ్య పట్టబంధువళిత్రయా !!..... 15

లక్ష్యరోమలతా థారతాసమున్నే యమధ్యమా: శ్రీదేవికి మధ్య ప్రదేశము ఉన్నదా లేదా అనే సందేహము వచ్చినది, మధ్య అనేది ఉండటం వల్ల, మరియు స్త్రీలకు సన్నని నడుము ఉండుట శుభలక్షణమ్. 
స్తనభార దళన్మధ్య పట్టబంధువళిత్రయా :  శ్రీదేవి మధ్యభాగమునందు వళిత్రయము ఉన్నది.  ఈ వళిత్రయము మీది  శరీరమందున్న స్థన  భారము చేత, మధ్యప్రదేశము అల్ప  మైనందున వంగి పోవు నేమోనని సువర్ణ వస్త్రముచేత మధ్యప్రదేశము ముమ్మారు తిప్పి కట్టినట్లుగా తోచు చున్నది.   

స్త్రీలకు సన్నని నడుము ఉండుట శుభలక్షణమ్, సువర్ణ వస్త్రముచేత మధ్యప్రదేశము ముమ్మారు తిప్పి కట్టుకున్న అమ్మకు  వందనములు.  


అరుణారుణ కౌసుంభవస్త్ర  భాస్వత్కటీతటీ !
రత్నకింకిణికారమ్యరశనా ధామ భూషితా !!..... 16

అరుణారుణ కౌసుంభవస్త్ర  భాస్వత్కటీతటీ : శ్రీ దేవి అత్యంతము ఎర్రనైన కుసుంబారంగు చీరచే ప్రకాశించు చున్న కటిప్రదేశము గలది.   
  
రత్నకింకిణికారమ్యరశనా ధామ భూషితా:  శ్రీదేవి రత్నమయములైన చిరుగంటలు గల బంగారు మొలనూలు చే అలంకరించి బడియున్నది. .

 శ్రీ దేవి అత్యంతము ఎర్రనైన కుసుంబారంగు చీరచే ప్రకాశించు చున్న కటిప్రదేశము గలది.   శ్రీదేవి రత్నమయములైన చిరుగంటలు గల బంగారు మొలనూలుచే అలంకరించి బడియున్నది. కామేశ్వరునికి ప్రీతి కల్గించే విధముగా చీరధరించి, బంగారు మొలనూలుచే  ఉన్న అమ్మకు వందనాలు.   

కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వాయాన్వితా  
మాణిక్య మకుటాకారా జానుద్వయ విరాజితా  .... 17   

కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వాయాన్వితా:   కామేశ్వరుని చేత మాత్రమే తెలియపడుచున్న సౌభాగ్యమూర్ధవగుణములు గల ఊరుద్వయములు గల అమ్మకు వందనమ్ములు.  

మాణిక్య మకుటాకారా జానుద్వయ విరాజితా: మాణిక్యములచే నిర్మించబడిన కవచములు మోకాల్లపై ప్రకాశించుతున్నతల్లికి ప్రేమ  వందనమ్ములు. 

   కామేశ్వరుని చేత మాత్రమే తెలియపడుచున్న సౌభాగ్యమూర్ధవగుణములు గల ఊరుద్వయములు గల అమ్మకు వందనమ్ములు.  
 మాణిక్యములచే నిర్మించబడిన కవచములు మోకాల్లపై ప్రకాశించు తున్న తల్లికి ప్రేమ  వందనమ్ములు. 
     
ఇంద్ర గోపపరిక్షిప్త స్మరతూణాభజంఘికా,
గూఢగుల్ఫా కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా.  .... ...... 18

ఇంద్ర గోపపరిక్షిప్త స్మరతూణాభజంఘికాయై నమ: అమ్మవారి జంఘలు (పిక్కలు )    వర్షాకాలమందు ఆర్ద్ర పురువులు మిక్కిలి ఎఱ్ఱని ధాతువుగల క్రిమి జాతిచే నిర్మించబడిన మన్మధుని అమ్ములపొదువలె నున్నవని భావము. అధికమైన ఎర్రని రంగుగల పిక్కలుగల మహాతల్లికి వందనమ్ములు . 


గూఢగుల్ఫాయై నమ:
శ్రీదేవి చీలమండలు దట్టముగా మాంసపురిములుగా ఉన్న వి 

కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా యై నమ:


నఖదీధితిసంఛన్ననమజ్జన తమోగుణా,
పదద్వయ ప్రభాజాలపరాకృతసరోరుహ.

శింజానమణిమంజీర మండిత శ్రీపదాంబుజా,

మరాళీమందగమనా మహాలావణ్యశేవధిః


శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం

శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్ని కుండసంభూతా దేవకార్యసముద్యతా    .... 1

ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహు సమన్వితా
రాగస్వరూపపాశాడ్యా  క్రోథాకారాంకుశోజ్జ్వలా        .... 2

మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్రసాయకా 
నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్ర హ్మాణ్డ మండలా  ....  3 

చంపకా శోక పున్నాగ సౌగంధికల సత్కచా    
కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండితా        ....  4 

అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితా
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా    ........ 5

ఓం శ్రీ రామ్ प्रांजलि प्रभ 


శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం

వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా
వక్త్రలక్ష్మీ పరీవాహ చలంన్మినాభాలోచనా     .........6 

నవచంపక పుష్పాభనాసాదండవిరాజితా 
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా     ........ 7 

కదంబమంజరీకప్తకర్ణపూరమనోహరా     ...... 8  
తాటంక యుగళీ భూత తపనోడుపమండలా 

పద్మరాగ శిలా దర్శ పరిభావికపోలభూ :   .....  9  
నవవిద్రుమబింబ శ్రీ న్యక్కారి దశ నచ్చ దా  .....  9 

శుద్ధవిద్యా0కురా ద్విజ పంక్తి ద్వయోజ్జ్వలా !
కర్పూర వీటి కామోద సమాకర్ష ద్దిగంతరా !!  ..... 10

నిజస్సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్ఛపీ !
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా!! ... 11

అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితా !
కామేశ బద్ద మాంగళ్య సూత్ర శోభిత కంధరా !! ...... 12
 

కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా !
రత్న గ్రై వేయచింతా కల్లోల ముక్తా ఫలాన్వితా !!..... 13
   
కామేశ్వరప్రేమరత్నమణి ప్రతిపణస్తనీ !
నాభ్యాలవాలరోమాలిలతా ఫాలకుచధ్వ ఈ !!  ...... 14  

లక్ష్యరోమలతా థారతాసమున్నే యమధ్యమా ! 
స్తనభార దళన్మధ్య పట్టబంధువళిత్రయా !!..... 15

అరుణారుణ కాసుంభవస్త్ర  భాస్వత్కటీతటీ !
రత్నకింకిణికారమ్యరశనా ధామ భూషితా !!..... 16

కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వాయాన్వితా  
మాణిక్య మకుటాకారా జానుద్వయ విరాజితా  .... 17   

ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణా భజంఘికా 
ఘాఢగుల్ఫా  కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా ... 18

నఖధీధితిసంఛన్న నమజ్జనతా మోగుణా 
పదద్వయప్రభాజ్వాలపరాకృతసరోరుహా  .... 19 

శింజానమణిమంజీరమండితశ్రీ పదాంబుజా 
మరాళీ మందగమనా  మహాలావణ్య శేవధీ ..... 20 

సార్వారుణా నవద్యాంగీ సర్వాభరణభూషితా
శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీన వల్లభా ......... 21  


సుమేరు శృంగ మధ్య స్థా శ్రీ మన్న గరనాయికా 
చింతామణి గృహాంతస్థా పంచ బ్రహ్మ సన స్థితా .... 22

మహా పద్మాటవీసంస్థా కదంబ వనవాసినీ 
సుధాసాగరమధ్యస్థా కామాక్షి కామదాయినీ ..... 23

దేవర్షి ఘనసంఘాతస్తూయ మానాత్మవైభవ 
భండాసుర వధోద్యుక్త శక్తి సేన సమన్వితా ..... 24. 

సంపత్కరీ సమారూఢా సింధుర వజ్రసేవితా 
అశ్వారూడాధిష్టి తాశ్వకోటి కోటిభిరావృతా .... 25            

  



   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి