12, అక్టోబర్ 2017, గురువారం

neti kavialu -4

om sri ram - sri maatrenama:
Wedding stage decorations
ప్రాంజలి  ప్రభ - నేటి కవిత

భర్తకు దూరంగా ఉన్న భార్య
వ్రాసిన గుండెల్లో దాగిన ప్రేమ లేఖ

కళ్ళుంటే చూసి వాక్కుంటే మాట్లాడి
మనసుంటే అందించి ప్రేమను పొంద లేవా
ప్రతి రాత్రి వసంత రాత్రి మనసును పంచె రాత్రి
మమతను పంచి ప్రేమను పొంద లేవా

ప్రతి గాలి పైర గాలి మల్లె పూల గాలి
వయసుని పంచి శాంతి పొంద లేవా
లేలేత చెక్కిళ్ళు, గులాబీ పువ్వుళ్లు
ముద్దు నందించి ఆనందం పొంద లేవా

మొక్కజొన్న తోటలో మురిసిన చీకట్లలో
మంచెకాడ కావల్సినది పొంద లేవా
కొండమీద సుక్కలన్ని సోకు చేసుకొనే వేళ
అవేళ వచ్చి నీక్కావల్సింది పొంద లేవా

గాలి వరవడికి పకపకా నవ్వుకునే వేళ
చక్కిలి గిలి పెట్టి కావాల్సింది పొంద లేవా
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
నవ్వులో నవ్వునై ఉన్న నన్ను పొంద లేవా

చలిగాలిలో నీకోసం ఎదురు చూసేవేళ  
వెచ్చని కౌగిళ్లు నాకు పంచి సుఖపడలేవా
నీ నీడలో తోడునై కలిసి మురిసే వేళ
మనసు అర్పించి మమత పొంద లేవా

వెన్నెలంతా మేసి ఏరు నెమరెసినా వేళ
సొగసంతా ఏటి పాలుకాకుండా ఆప లేవా
గాలి నన్ను ఆవరించి కమ్ముకొనేవేళ
గాలిగా ఆలింగనం చేసుకొని తృప్తి పడలేవా
--((*))--



జయతు సంస్కృత మాతరం 
జయతు సంస్కృత భాషణం 
జయతు సంస్కృత శిక్షణం 
జయతు సంస్కృత భావనం 

-- 

కలుగనీయకు ... 
**************** 

-- 
రాజమరాళ వృత్తము 
-- 
గణములు - న,భ,ర 
యతి లేదు 
-- 
జయము నీకగు శారదా 
జయము నీకగు భాగ్యదా 
జయము నీకగు జ్ఞానదా 
జయము నీకగు సర్వదా 
-- 
కరుణ నుంచుము సీమపై 
నొరుగకుండను మత్తులో 
నెఱుకఁ గూర్చుచు జాతిలో 
విరియఁజేయుము ప్రీతిగా 
-- 
మరువనీయక సంస్కృతిన్ 
వరలి నిత్యము తెల్వితో 
శిరము నెత్తుక నిల్వఁగా 
త్వరగఁ గూర్చుము జాగృతిన్ 
-- 
తెలిసి సంస్కృతి యున్నతిన్ 
నిలిపి నిచ్చలు ధర్మమున్ 
వెలుఁగ పూర్వపు రీతినే 
తొలఁగఁ జేయుము మాంద్యమున్ 
-- 
తెలిసి జర్గెడి దంతయున్ 
దెలివి నీయక నున్నచోఁ 
వెలుగుటెట్టుల జీవితాల్ 
కలుగు టెట్లిక శ్రేయముల్ 
-- 
కలికి పల్కుల కాంతగా 
వెలుఁగుఁ జూపెడి తల్లిగా 
కొలుచుకొందుము భక్తితో 
సలిపి జోతలు మెండుగా 
-- 
కలుగనీయకు భారతీ 
కలను సైతము నాపదన్ 
లలిత సుందర భాషకై 
వెలుఁగు గోరెడి భూమికై 
-- 
సుప్రభ 
5:17 ఫం 
08-29-2018 
ప్రతిదినమ్ము ... 
----------------------- 
-- 
సీ. 
-- 
తెలుఁగునాఁడునఁ బుట్టి వెలుఁగు పేరునఁ గల్గి 
పలుకు తల్లినిఁ గొల్చు వెలఁది నగుదు 
నిలిచియుండియు నిప్పు డిలను వేరొక చోటఁ 
దలఁపునుంచుదుఁ గన్నతల్లి భాష 
కలుగకుండినఁగాని ఘనమైన విద్వత్తు 
పలుకుచుందును మెచ్చి పద్యమందు 
పలుకుచున్నను వేరుభాష యవసరమై 
తెలుఁగు మర్వఁగఁ జాలఁ గలను నైన 
-- 
తెలుఁగు పండితునింటఁ గలిగినట్టిది జన్మ 
ఫలము నీయక యుండె పలువిధాల 
తెలుఁగు పాఠము నేర్పి తీయఁగా బడిలోనఁ 
గలుగఁ జేసెను బ్రీతి తెలుఁగునతఁడె 
కలముఁ దీసితినంచుఁ గవితలల్లఁగనేఁడు 
తెలియఁజెప్పఁగ లేని స్థితియె యైన 
నలరునాతని యాత్మ యాశీర్వదించఁగా 
వెలుఁగుచుండుమటంచు వృద్ధిఁ గలిగి 
-- 
ఆ.వె 
-- 
తలఁచుకొందునతనిఁ దెలుఁగు భాషకుఁ దోడు 
నిలిపినిత్యమెదను బలికి జేలు 
కలుగకుండుఁగాక విలపింపఁ జేయనీ 
తెలుఁగు వెలుఁగు మరచు తెగులు నాకు 
-- 
తీయనగుచు వినఁగ హాయి గూర్చెడి మాట 
తాయి పలుకు భాష తనివినిడును 
శ్రేయమిడెడు నాకుఁ జెప్పలేనంతగా 
వ్రాయఁ జేసి యందె భాష నుతియు 
-- 
చండి కృపను నేర్చి సరసమౌ యీ భాష 
పండుగవఁగ , రుచియు మెండు గాఁగఁ 
బండితులకునైనఁ బామరులకయిన 
గుండెపొంగఁ బదము గూర్చనగును 
-- 
ఒక్క దినమె కాదు చక్కఁగాఁ బొగడుట 
నిక్కువముగఁ దలఁతు నిత్యమిటుల 
మక్కువమెయి నేర్పు మాత శ్రీవాణియుఁ 
బ్రక్కనుండి భాష పెక్కు గతుల 
-- 
ప్రతిదినమ్ము నాకు భాషోత్సవంబగు 
ప్రతిదినమ్ము నాకు వరమె, నిజము 
ప్రతిదినమ్ము శ్రీకరమ్ముగఁ గొలుచుటే 
ప్రస్తుతించుచుండి భాష పదము/కృపను. 
-- 
తెలుఁగు వెలుఁగుఁ బంచి దేశదేశమ్ములఁ 
దలిఋణమ్ము దీర్చి ధన్యనవఁగ 
కలుగఁ జేయుఁ గాత కరుణతో శ్రీమాత 
వలయునట్టి శక్తి కలముకొసఁగి 
-- 
వందనమ్ములిడుదు భాషామ తల్లికి 
వందనమ్ములిడుదు బంధురముగ 
నందమైన యట్టి యాంధ్రభాషకుఁ గూడ 
సుందరముగనొప్పు ఛందమందు 

-- 

సుప్రభ 
11:05 
08-29-2018


ప్రాంజలి ప్రభ - నేటి కవితలు 
*సుప్రభాతం నీకు శుభోదయం

అరుణారుణ వర్ణాలతో
అనంతకోటి విశ్వాన్ని
ఆత్మీయతాభావంతో
ఉత్తేజపరిచే ఉదయభానుని
ప్రభాతవేళలో మెలుకో
ఓ మిత్రమా  
యుగధర్మం తెలుసుకో
ఓ మిత్రమా     

పృథ్వి ఒక్కసారిగా
చీకట్లను కమ్ముకున్న ముసుగును
తొలగించగా ఆదిత్యుని
అత్యోన్నతి భగ భగ
కిరణాలను ఆహ్వానం పలికింది

సరస్సులోని  కమలం
తన్మయత్వంతో వికసించింది
గూటిలోని చిలకా గోరింకలు
గుసగుసలాట మొదలైనది
చిగురాకు కదలిక మొదలైంది

 గంగమ్మ తల్లి కిరణవెలుగుతో
 నూతనోత్సాహముతో పరవళ్లు
తొక్కుతూ కదలిక ప్రారంభిస్తుంది
సకలజీవకోటికి ప్రాణా ధారమవుతుంది

జీవకోటి కనులు విప్పి
ప్రకృతినిచూసి ఆనంద
పారవశ్యంలో కర్తవ్య
నిర్ధారణకు వేళైనది

మేలుకో మిత్రమా మేలుకో
ప్రాంజలి ప్రభాస గీతమ్ తో
ప్రాపంచిక విషయాలను
అర్ధం చేసుకొని మేలుకో     

సుప్రభాతం నీకు శుభోదయం 
--((*))--

ప్రాంజలి ప్రభ 

అర్ధం కొరకు ప్రపంచ మంతా
వెంపర్లాడుతు ఉండు
వెంపర్లాడే గుణం ప్రపంచమంతా
జీవించుతూనే ఉండు

జీవితం తప్పదు ప్రపంచమంతా
ప్రశ్నార్ధకముగానే ఉండు
ప్రశ్నలపై ప్రశ్నలు ప్రపంచమంతా
నిగురుకప్పిన నిప్పులాగుండు

నిగురుకప్పిన ప్రపంచ మంతా
ప్రశాంతత కు వెతుకుచుండు

లేకుండా ప్రపంచమంతా
బంధానికి చిక్కి తిరుగుచుండు

బంధపు ప్రేమలు ప్రపంచమంతా
ప్రశ్నల మనసుతో నలుగచుండు
మనసులేని ప్రపంచమంతా
సమయాన్ని వ్యర్ధము చేయుచుండు

సమయ విజ్ఞానము ప్రపంచమంతా 
విశ్వశాంతి కి తోడ్పడు చుండు 
విశ్వశాంతికోసం ప్రపంచ మంతా 
 దైవాన్ని ప్రార్ధించుతూ ఉండు 


* వేంకటేశా  * వేంకటేశా  * వేంకటేశా
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 


కవితను వ్రాద్దామనుకున్నాను వేంకటేశా
నా ప్రేరణ నీవేకదా, నీ రుచులు అభిరుచులు తెలుపవా
గాత్రం తో పాడుదామకున్నాను వెంకటేశా
నీ నిద్ర భంగం చేయలేను, అయిన ఏ రాగంలో పాడాలో తెలుపవా

విరహం నన్ను ఆవరిస్తున్నది వేంకటేశా
కోరిక ఇదని చెప్పలేను, అయిన అనుభవశాలివి తెలుపవా
దాహంతో తపిస్తున్నాను వేంకటేశా
దాహం తీర్చుకోలేను, అయిన దాహం తీర్చే దారి తెలుపవా

దూరం నన్ను భయపెడుతున్నది వేంకటేశా
అది నీపై అలకని చెప్పలేను, అయిన దగ్గిర మార్గం తెలుపవా
నీ స్నేహం కోసం అర్ధిస్తున్నాను వేంకటేశా
సరస్వం నీకే అర్పిస్తున్నాను, అయిన మనస్సుకు శాంతి తెలుపవా

ఆశలు నన్ను తరుముతున్నాయి వేంకటేశా
కావ్యాన్ని వ్రాయలనుకున్నాను,  అయిన ఎలా వ్రాయాలో తెలుపవా
ద్యాస అంతా నీ దగ్గరే ఉంది వేంకటేశా
ధ్యానం చేస్తున్నాను, అయిన నీపై ఏకాగ్ర దృష్టి ఎలాగో తెలుపవా

శ్రావ్యంగా గానం చేయాలనుకున్నాను వేంకటేశా
లక్ష్యాలను అధికమిస్తున్నాను, అయిన లక్ష్యానికి దారి చూపలేవా
దాన, ధర్మాలు చేస్తున్నాను వేంకటేశా
అనురాగభంధలో ఉన్నాను, అయిన భందాలకు విముక్తి తెలుపవా

చీకటిలో ఏమిచేయాలో తెలియకున్నాను వెంకటేశా
వెలుగు చూడలేకున్నాను అయిన నా మస్తకమునందు వెలుగు నింపలేవా
బంధానికి అతీతుడనై ఉండలేకున్నాను వేంకటేశా
భక్తి  భావనలో ఉన్నాను,అయిన భాగ్యం కలిగించే మనస్సు అందించవా

జగత్తు కోసం ఏమిచేయాలో తెలపాలి వేంకటేశా
అభినయించ గలను, అయిన నటనా సూత్రధారివి కదా ఎలాగో తెలుపవా
భంగిమలా బ్రతకాలనుకున్నాను వెంకటేశా
నాట్యం చేయాలనుకున్నాను, అయిన వశీకరణం  ఎలాగో తెలుపవా


ఉచ్వాస వద్దన్నా వెంబడిస్తున్నది వేంకటేశా
నిశ్వాస ఎలా చేయగలను, అయిన ప్రకృతిలో ఎలా బ్రతకాలో తెలుపవా
తనువంతా నీకే అర్పిస్తున్నాను వేంకటేశా
ప్రాణాలను నీదగ్గరే ఉంచుతున్నాను, అయిన నీలో ఇక్యమార్గం తెలుపవా  
ఓం శ్రీ రామ వేంకటేశా
ఓం శ్రీ కృష్ణ వేంకటేశా
ఓం కార వేంకటేశా
నమో నమ: నమోనమ: నమోనమ:


--((*))--


ఓం శ్రీ రామ్ = శ్రీ మాత్రేనమ: 

రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

ప్రాంజలి ప్రభ - ఓం నమ:శివాయ  


సముద్రంలో కలిసే నదిలా

సాగి పోతున్నా శివా
వేషాలు వేసే నటుడిలా 
వేస్తూ బ్రతుకు తున్నా శివా  

భూమిపై ఎందుకున్నానో తెలవలా

భూమికి భారంగా ఉండలేను శివా   
పాత్ర ఔచిత్యంలో బ్రతికే దెలా 
బ్రతుకే ఒక నాటక మైనది శివా 

వయసుకు న్యాయం చేయలా 

ప్రేమను పంచ లేకపోతున్న శివా 
ఏమి పొందానో ఏమి కోల్పోయానో ఎలా 
ఏమి జ్ఞప్తికి రాని జీవి నైనాను శివా 

ఆశయం వదలి ఆశకు చిక్కాను ఎలా 

ప్రకృతికి భార మైనాను శివా 
జీవన పోరాటంలో నీవు గుర్తుకు రాలా
నిన్ను పూజించక నిర్లక్ష్యం చేశా శివా 

నా అజ్ఞానాన్నీ మన్నించేది ఎలా  

నన్ను కరుణించి కాపాడవా శివా 
కుటుంబం కోసం ఆరాటపడి బ్రతికేదెలా
నీ శాన్నిత్యాన్ని పొందాలని ఉంది శివా  

తెలియదు నీ అనుగ్రహము పొందేదెలా 

కార్తీక మాసం పూజ చేస్తున్నా శివా 
మూర్ఖత్వ వాత్లల్యంతో బ్రతికేదేలా
నాతండ్రిగా నాకు మోక్షము ఇవ్వవా శివా   


--((*))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి