5, అక్టోబర్ 2017, గురువారం

ప్రాంజలి ప్రభ - శృంగార సాహిత్యం

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:


ఓం శ్రీ రాం   ఓం శ్రీ మాత్రేనమ: - ఓం శ్రీ కృష్ణా నమ:
ప్రాంజలి ప్రభ - శృంగార సాహిత్యం 
 తరుణామృతం
మ. మ . త  (పెద్దలకు మాత్రమే )
మనసు మనసు తరుణామృతం - సాహిత్య వచన శృంగార  కావ్యం
(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) (1)

  పచ్చటి తోటయందు పసిడి రంగుతోడ, ఓరచూపు ఇంపుతోడ, అడుగులు దడా  దాడా అను చుండ, జారేడు కుచకుంభాలు కదులు చుండ, కాల్నడక పోవు చుండ, వదనాంచల మందున చిన్కుల చెమట, మడుగులా మారుచుండగా, వయ్యారంగా మల్లిక కన్పించే. 

పసిదానిమ్మ పండు  చాయ, కొసరు ఆ కుసుమ గంధి కోమలపు తోడల్ (లేలేత తామర స్వేత తూడులా లేక పాల లాంటి అరటి ఊచలా )  జారు చెమ్మ, నేలరారు ముత్యాల వరుస, సహజ సౌందర్యముతో వెలసిల్లు చుండా, పదహారో వసంతంలో అడుగుపెట్టి, వయసు వన్నెలతో, మాయని మెరుపు కాన వస్తున్నది, బాల్యము వెడలి, నవ యవ్వనపు మొలకులతో లేత సిగ్గుల దొంతరలతో, మధుర మంద హాసంగా ఉండి, నడుస్తుంటే, పురజనులు " ఆ .... ఆ " అని నోరు తెరచి, సొంగ కార్చు చుండే, ముందుకు నడుస్తున్నప్పుడు, ముందు వెనుక ఎవరున్నారు అనే జ్యాస అనేది లేదు, మరయు అమె కళ్ళకు ఎమీ కనిపించలేదు, కాని ఏదో తెలియని వయసు పొంగే మెరుపు ఆవహించినదని  మాత్రం అర్ధం అవుతున్నది. 

ఆమె ఏ శృంగార దేవత, " దేవతాస్త్రి అణుకువ కలిగియే ఔన్నత్యమును పొందుదురు. పరుల గుణములను పొగడుచుచు తమ సహృదయత్వమును కనబరుతురు. పరుల కార్య సాఫల్యమున కై ఎక్కువ ప్రయత్నించి వారి కార్యములను సానుకూలము చేయుచు, తమకార్యములను కూడా చేసికొను చుందురు . తమను పరుషముగా నిందించు దుర్జనుల యందు ఓర్పు కనపరిచి వారే దుఃఖ పడునట్లు చేయుదురు. ఇట్టి నడవడిక గలిగిన స్త్రీలు అందరికీ పూజ్యనీయులే.  అన్నారు  అక్కడ ఉన్న పెద్దలు ముఖ సౌందర్యానికి ముచ్చటబడి " కారణము ఏమగునో  అని పలువురు ముచ్చట్లు చెప్పుకొనసాగిరి, సౌందర్యదేవత నడచి వెళ్ళినట్లు తన్మయులై ఉన్నారు ఆసమయాన? 
--((**))--
ఇంకాఉంది 

యవ్వన నడకతో నడుస్తుంటే  "  
ఇసుక లో కాళ్ళు ఇరుక్కొని,  ఈడ్చు కుంటూ, తన్మయత్వపు  నడకతో, మేనుపై  వేడి కిరణాల సెగ ఆవహించిన నిట్టూర్పులతో, ఉన్న నడకను చూసిన వారికి కన్నులు  చెదిరినవి, వారి ఊహలు గాలిలో ఎలిపోతున్నవి. 

అమ్మాయి నవ్వి తే రాలు , పెదాల మధ్య  ముత్యాలు  

అమ్మాయి నవ్వే చాలు.  వెలలేని వరహాలు  
అమ్మాయి ఒడి నుంటె, నా గుండె, నెనలేని బలగాలు  
అనురక్తితో, ఆకర్షణతో సుందరి చూపులకే హా హా కారాలు 

పడచు జింక పిల్ల నడిచినట్లు మల్లిక నడుస్తుండగా, కాలి పాదాల చెమ్మ, అద్భుత మెరుపుగా కనిపించే., ఆవిధముగా  పొతూ ఉంటే  అక్కడ కొంత దూరములో మామిడి తోపులు కానవచ్చే, మామిడి పూవు నవ యవ్వన సౌందర్యానికి పరవశించి, 


ఏ ప్రేమ ఫలితమో భూమి - 

ఇరుసు లేకుండా తిరుగు చుండు 
ఏ ప్రేమ ఫలితమే నక్షత్రాలు 
మెరుస్తూ నింగినుండి రాలక ఉండు  

ఏ ప్రేమ ఫలితామో కడలి 

భూమిపై పొంగక ముడుచుకొని ఉండు  
ఈప్రేమ ఫలితమే పర్వతము 
పెనుగాలి విసురుకు కదలక ఉండు 

ఏ ప్రేమ ఫలితమే పురుషుడు 

స్త్రీ మాటకు కట్టు బడి ఉండు 
ఏ ప్రేమ ఫలితమే వనిత
పురుషుని చేష్టలకు కట్టుబడి ఉండు   

ఏ ప్రేమ ఫలితమే సంపద

నష్టపోయిన ధైర్యము తోడుగ ఉండు 
ఏ ప్రేమ ఫలితమే కష్టాలు 
వచ్చిన నేనున్నానని శక్తి తోడుగ ఉండు   

ఏ ప్రేమ ఫలితమే యవ్వనం 

సక్రమ మార్గాన సద్వినియోగం అగుచుండు 
ఏ ప్రేమ ఫలితమే సంసారం 
మూడుపువ్వులు ఆరుకాయలుగా ఉండు   

కొమ్మలపై రేమ్మలపై నిలువలేక, జల జల రాలి పాదాల ముందు చేరే, ఆమె పాదాలు స్పర్శకు పూలు  నలిగినా చెప్పుకోలేని సంతోషముతో ఉండగా, జిలుగు పూల కళంకారి చీర జాఱ, కాలి కడియాలు మలుపు కొనుచు, తనువంతా వంచి సరిదిద్దు కొనుచు, సందెడు చీర కుచ్చెళ్లు చెదరనీక గట్టిగా అదుము కొనుచు, పిల్ల గాలి సవ్వడికే ఎగసిపడుతున్న చీరను పట్టుకొనుచు ఉండగా, ఆ వనమంతయు చూసి పరవసంతో పూల వర్షం కురుపించే.   


ఇంకా ఉంది 


ఓ బాల బాల నిన్నే కోరి

 నీచెంతకు చేరి
నవ్వులు కురిపిస్తా రా దరి
సొగసుతో అలుగకు నారి

 పరువంలో ఉన్నా తుంటరి

 మనసును తపిస్తున్న చకోరి
 వయసులో చేయద్దు చాకిరి
 ఎందుకు ఉంటావు ఒంటరి

ఒంటరిగా తిరుగకు మయూరి

వస్తాడు పరువాన్ని దోచే పోకిరి
నేను వెంట పడ్డా సరి సరి
నీ ఆశ తీర్చనా ఈ సారి

కళ్ళలో భావం చూపే గడసరి

నేను సరిజోడు కానా మరి
తోడూ నీడవుతాడు ఈ బాటసారి
నీ చూపుకే నాకు వచ్చు శిరి

అంటూ తన్మయత్వంతో నారి మణి చూపుల  తప్పుకోలేక, ఒప్పించలేక మదన తాపముతో కదిలాడు ఆకాశ సంచార పవనుడు.


 ఆ మాటలకు కణతలు త్రిప్పి అనగా విచ్చుకున్న పువ్వులా చూసి కొంగ్రొత్త శోభతో చిరునవ్వు విసిరి, వెన్నెల చెండ్లు పట్టి చేతిలో ఉంచి నెమ్మదిగా ఊదే  కనులు నేలచూపులు చూస్తు, పాదాలు అలవోకగా కదిలిస్తూ చూసి చూడనట్లుగా ఓర చూపు చూస్తూ, చేతితో చీర కొసలు పైకి  ఎగదోస్తూ,  వన మద్య నిలిచే మల్లిక.


స్వాగత పక్షి కుహు కుహు అని పిలుస్తున్నట్లు, హ్రదయము బరువెక్కగా, ఎద పొంగులు కాన రాకుండా చీర చుట్టు కొనగా,  మోహనుడు కంచెను దాటి వచ్చినట్లుగా ఊహించె మోహనాంగి.



మిస మిస లాడు జవ్వనం, మేలిమి మైన పుత్తడి తనువును చేరి, ఓరగా సొగసు నంతా నలిపి నట్లుగా, మనసును పులకరింప చేసి నట్లుగా,  అతని చూపుల యందు ఆర్తి, హృదయాంతరము నందు తరింపక వేదన గురిచేసి వేళ్ళకు మోహనా, తొలకరి వానకు తడిసిన ముగ్ద మోహన లతాంగిని, నాలో ప్రవేశించి నన్ను ఇబ్బంది పెట్టకు ఓ చల్ల గాలి.

నేను చెప్పేది విను ఆదికవి వాల్మీకి వ్రాసిన రామాయణములో రాముని లక్షణాలను చాలా చక్కగా  వర్ణించారు. నేను ఒక్కసారి వినిపిస్తాను. శృంగారమంటే ఆకర్షణ ప్రేమ అని గుర్తుంచుకోవాలి అన్న మాటలు విన్నది  మల్లిక.      
ఇంకా ఉంది 

నేను చెప్పేది విను ఆదికవి వాల్మీకి వ్రాసిన రామాయణములో సీతా దేవికి ధైర్యం కల్గిన్చానికి హనుమంతుడు పల్కిన పలుకులు  రాముని లక్షణాలను చాలా చక్కగా  వర్ణించారు. నేను ఒక్కసారి వినిపిస్తాను. శృంగారమంటే ఆకర్షణ ప్రేమ అని గుర్తుంచుకోవాలి అన్న మాటలు విన్నది  మల్లిక.   

సీతా రాముని కళ్ళు  పద్మముల రేకులవలె విశాల మైనవియును, సమస్తమైన ప్రాణుల మనస్సును ఆకర్షించు సౌందర్యము కలవాడును, పుట్టుకతోనే మంచిరూపముతొను, దాక్షిన్యము తోను జనించిన వాడును, శ్రీ రామ చంద్రుని స్వరూపమును గూర్చి మారుతి యధాతధముగా చెప్పు చుండెను


తేజమును - సూర్యుని తో సమానుడును, ఓర్పును - భూమి తో సమానుడును, బుద్ధి యందు  - బృహస్పతి  తో సమానుడును, కీర్తి యందు - ఇంద్రునితో సమానుడును. 


సమస్త జీవలోక రక్షకుడును, తనవారి అందరికి రక్షకుడును,  ఉత్తమనడవడికతొ పాలించు వాడును, ధర్మం తొ శత్రు సంహారకుడును. 


ఓ భామిని రాముడు ఈ సమస్త ప్రపంచకమును, నాలుగు వర్ణాల వారినీ రక్షించు చుండెను, లోకములో అందరకి కట్టు బాట్లు ఏర్పరిచెను, అందరు కట్టుబాట్లుతో ఉండునట్లుగా చూచు చుండెను.  


రాముడు మిక్కిలి కాంతి మంతుడును, మిక్కిలి గౌరవింప దగిన వాడును, బ్రహ్మచర్య వ్రతములో ఉన్నవాడును, సత్పురషులకు  ఉపకారము ఎట్లుచేయవలెనో తెలిసిన వాడును. 


కర్మల ప్రయోజనము, ఫలితము తెలిసిన వాడును, ఏ పనికి ఎట్టి ఫలితము వచ్చునో  ఊహించ గలవాడును, రాజనీతి ధర్మమును చక్కగా  అమలుపరుచు వాడును, బ్రాహ్మణుల విషయమున గౌరమును చూపినవాడును.

**** 

రాముని భుజములు విశాలమైనవి గను, భాహువులు దీర్ఘమైనవి గను, కంఠం శంఖా కారము గను ముఖము మంగళ ప్రదమై య్యుండును.

సుందరమైన రాముని నేత్రములు ఎర్రగాను, ప్రక్క య్యముకలతో భాహు బలిగాను, రామ్ అనే పేరు లోకమంతా వ్యాపించు ఉండును, విద్యాశీల సంపన్నుడు, వినయ వంతుడును. 


రాముడు యజుర్వేదము చక్కగా అద్యయనము చేసిన వాడును, మహాత్మూలచేతను, వేదవేత్తల చేత గౌరవము పొందిన వాడును, ధనుర్వేదము నందు మిగిలిన మూడు వెదము లందును, ఉప వేదములందు  వేదవేదాన్గములందు పాండిత్యము కలవాడును. 


రాముని కంఠధ్వని దుందుభి వలే గమ్బీరముగా ఉండును, రంగు నిగనిగలాడుతూ నల్లని రూపములొ అందరిని ఆకర్షించు చుండును, రాముని అవయవములన్నీ  సమముగా విభక్తములై  ఉండును, గొప్ప ప్రతాపము  చూపి శత్రువులను పీడించు  వాడును. 


వక్షస్థలము,  ముంజేయి,  పిడికిలి స్థిరముగా ఉండే వాడును, కనుబొమ్మలు, ముష్కములు,  భాహువులు, దీర్ఘముగా ఉండును, కేశములు, మోకాళ్ళు, హేచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉండును,  నాభి,కడుపు క్రిందభాగము, వక్షస్థలము పొడవుగా ఉండును.  


నేత్రములు, గోళ్ళు, అరచేతులు, అరకాల్లు ఎర్రగా ఉండును, పాదరేఖలు,కేశములు, లింగము  నున్నగా ఉండును, కంఠధ్వని, నడక, గమ్భీరముగా ఉండు వాడును,  అవయవ సౌష్టమే అద్భుతం పూర్ణ చంద్రుని మోము గలవాడును.  


ఉదరము నందు మూడు ముడతలు గలవాడును, స్తనములు, స్తనాగ్రములు రేఖలు అను మూడింటి యిందు లోతైన వాడును, కంఠం,  లింగం, వీపు, పిక్క,  అను నాలుగు హ్రస్వములుగా ఉన్నవాడును, రాముని శిరస్సునందు మూడు  సుడులు కలవాడును. 


అంగుష్టము మోదట నాలుగు వేదములును సూచించు రేఖలు కల వాడును, అతని నుదుటిపైన, అరచేతులలోన,  అరకాళ్ళలోన,  నాలుగేసి రేఖలు ఉండును, మోకాళ్ళు ,తొడలు,పిక్కలు బాహువులు సమానముగా ఉన్న వాడును, శ్రీ రాముడు తొమ్భైఆరు అంగుళముల (8 అడుగులు) ఎత్తు కలవాడును. 

--------  
మల్లికా   రాముని లక్షణాలను ఇంకా విను 

రెండు కనుబొమ్మలను, రెండు నసాపుటములను,  రెండు నెత్రములను, రెండు కర్ణములను రెండు పెదవులను, రెండు స్తనానగ్రములను, రెండు చేతులను, రెండు ముంజేతులను. 

రెండు మోకాళ్లను, రెండు ముష్కములను,  రెండు పిరుదులను, రెండు చేతులను, రెండు పాదములను, పిరుడులపై కన్దరములను, జంటలుగా ఉన్న 14 అంగములు సమానముగా ఉన్న వాడును. 


సింహము, ఏనుగు, పెద్దపులి, వృషభము వలే నడుచు వాడును, ముక్కు, గడ్డము, పెదవులు, చెవులు చాలాఅందముగా ఉన్న వాడును, కళ్ళు, పండ్లు, చర్మము, పాదములు, కేశములు నిగానిగాలాడు చుండును, రెండు దంత పంక్తులలో స్నిగ్దములు, తెల్లని మెరుపు కలిగి ఉండును. 


ముఖము, కళ్ళు, నోరు,నాలుక, పెదవులు, దవడలు, స్తనములును, గోళ్ళు,  హస్తములు, పాదములు, ఈ పది పద్మము వలె ఉండును, శిరస్సు, లలాటము, చెవులు, కంఠము, వక్షము, హృదయమును, కడుపు, చేతులు, కాళ్ళు, వీపు ఈ  పది పెద్దవిగా ఉండును. 


తేజస్సు, కీర్తి, సంపద అను మూడింటి చేత లోకమంతా వ్యాపించి యుండును, చంకలు, కడుపు, వక్షము, ముక్కు, మూపు, లలాటము ఆరు ఉన్నతములై ఉండును, వ్రేళ్ళ కణువులు, తలవెంతుకలు, రోమములు, గోళ్ళు, లింగము, చర్మమును, మీసమును, దృష్టి, బుడ్డి అను తొమ్మిదింటి యందు సూక్షమములుగా ఉండును. 


ధర్మ అర్ధ అక్కమములను సమముగా అనుభవించు వాడును, శుద్దమగా మాతా-పితృ వంశములు  కలవాడును, సత్య, న్యాయ, ధర్మములందు ఆసక్తి కలవాడును, సర్వలోక ప్రియముకోరకు ప్రియముగా మాట్లడువాడును. 


శ్రీమంతుడు ప్రజలను దగ్గరకు తీయ్యుట యందును, వారిని అనుగ్రహించుట యందు ఆసక్తి కలవాడును, దేశకాలయుక్తా యుక్తములయందు జ్ఞానము కలవాడును, పరాజయము అనేది తెలియని మహానుభావుడును.  


మల్లికా పురుషుడు అంటే ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో వాణి లక్షణాలను నీకు తెలియపరిచా ఇప్పుడు వివాహము అని మనసులో పాడినప్పుడు ఆనాడు సీత రాములయందు ఎలాంటి ఆలోచనలు ఒక్కసారి నీవుకూడా తెలుసుకుందానివి . 


రేపు మళ్ళీ  మల్లిక  కలుద్దాం     
     

     నా జీవితములో కల నిజ సౌందర్య మైనది 
     ఎన్నాళ్ళ కైనా, ఎన్నేల్లకైన మనసే మారనిది 
     తొలిచూపులొ మనసు ప్రభవించి కలవ మన్నది 
     ముందు హుద్యాల కళా కండ అందించాలని ఉంది 
   
   మంచుకంటే చల్లగా ఉన్న హృదయం వేడెక్కింది 
    తలవని తలంపుగా ఒక్క లలితగీతమ్ వినబడింది 
    బ్రతుకులో జోడి ముడి పడే సమయం దగ్గరైనది  
    కలగా మేనుకు చందన పూత పరిమళ మైనది
  
   తప: ఫలముతో పున్నమిలో పంచుకొనే పంట 
    వద్దు  కావాలి కావాలి అని మురిపించుకొనే ఆట    
    పండువెన్నెలలో కోరికలను పంచుకొనే తొలి పంట 
    మధురాతి మధురస్మృతులను పంచుకొనే పెళ్ళంట
  
   నిన్ను చూసిన తొలి క్షణం అంకురించే  ప్రణయ భావం 
   ఒకరి నొకరు చూసు కొన్న క్షణం ఆత్మాను సందానం     
   మనస్సులో ఎన్నో ఊహలు అపోహలు వచ్చుట నిజం 
   కలసి మెలసి తిరిగితే ఏర్పడును అనుభూతి తరంగం 
  
    నీ వదనం లో చివురించిన లజ్జ దరహాసం 
    నీవు విరిసిన తెల్లటి నందివర్ధన కుసుమం 
    నీవు సిగ్గుతెరలతో వాలు చూపుల వదనం 
    నీ ముగ్దత్వం వళ్ళ హృదయములో పరవశం 

    నన్ను ఉద్ధరించుటకు దివినుండి భువికి వచ్చావు 
    నీవు జన్మ జన్మల భంధముగా  సాక్షాత్కరించావు 
    నా హృదయం క్షీరసాగరమ్ అవటానికి కారణం నీవు 
    నా గుండెలో పొంగు పంచుకోటానికి కారకుడవు నీవు 
                                                           
                                                     ఇంకావుంది 
*****

పెళ్లి అని సీతారామల మనసులోకి ప్రవేశిస్తే వారి ఆలోచనలు ఊహలు ఎలా ఉంటాయో సీతా రామ కళ్యాణ సందర్బముగా ఇందు ఉదహరిస్తున్నాను.(ఇవి నా ఆత్య ప్రాస భావాలు మాత్రమే)           

  మనసులో చెలరేగు అపురూప భావాలను పంచుకుందాం
  హ్రుదయ సీమలతో హత్తుకొని పరవశంతో ఆనందించుదాం
   తోడు నీడగా, ప్రాణాతి ప్రాణంగా కలసి మెలసి జీవిద్దా0
   గారాబంతో అను రాగంతో ఆడుతూ పాడుతూ ఉందాం 

   నీటి తరగలన్న, మంచు పొగలన్న, ఎంతో  ఇష్టం     
   అరవింద  నయనాలలో నీ రూపమ్ ఉంటే ఇష్టం
   కనురెప్పలు ఎత్తిచూసి చూడనట్లు ఉంటే ఇష్టం
   ఆలింగన బలంలో చిక్కి బ్రత కాలని మరీ ఇష్టం 

   నిన్ను కాసేపు ముద్దిచ్చి నవ్వించాలని ఉంది 
   మట్టెల సన్నని మోతతో ఉడికించాలని ఉంది 
   గాజులతో సంగీత స్వరము వినిపించాలని ఉంది  
   వదల కుండా మత్తుగా శయనించాలని ఉంది 

      ఉషోదయపు ఎర్రని బింబం నీ ముఖారవిందం 
      అరుణకిరణాలకు నీ మొము పుత్తడి మెరుపందం
      చెమ్పల మీద కెంపు రంగొచ్చి ముద్ద మందారం 
      శిరోజాలలో ఉన్న మల్లెపూల సౌరభానికి ఆహ్లాదం                                        

      కంటికింపుగా కనువిందు చేసిన వేళ 
     తరలి వచ్చి తపము పండించిన వేళ 
     కమ్ముకున్న మబ్బు తెర తొలగించిన వేళ
     తరుణి దయతో కరుణించి తరించిన వేళ 

 ఇంకా ఉంది 

     నును సిగ్గు దొమ్తరుల దొరసానివి నీవు 
      ఓరకంట చూపుతో మనసు  దోచినావు 
      అభ్యంతరాల ముసుగులో దాగివున్నావు  
      తనివి తీరగ చూసిన మరవ లేకున్నాను 

     లేత రెమ్మల మాటున పువ్వువు నీవు 
     కళ్ళు తెరచి చూసి పరిమలిస్తున్నావు
     రెమ్మ నుండి వీడి ఎరుగనిదేశం చేరావు  
     నాకొరకు విరహముతొ విధిగా ఉన్నావు

     నాకళ్ళను చూస్తె నీ వంటికి చలువపూత చల్లదనం  
      నా  మేనును చూస్తె చందన  సుగంధ  పరిమళం 
      నా వయస్సు చూస్తె నీకు మరువలేని  సుఘమ్ధం 
      నా రూపు దివ్యలోక సుఖాలనమిమ్చే యవ్వనఘమ్ధం 

     సాహిత్య రత్న రాశిని తెచ్చిన మల్లికవు 
      జన్మసమ్స్కారముతొ ఓర్పుగల దానవు
      మాటలలోను, నడకలలోను స్వర్ణరేఖవు
      నవరత్నాల మేళవింపు కాంతి గలదానావు 

       నీ రూపమును నా మదిలో ఉంచిన సృష్టి కర్తకు వందనం 
      నిద్రాహారాలు మాని  నీ గురించి  కలిగిన తన్మయత్వం 
      నేనొక్కదానినే పుత్తడి బొమ్మ అని బ్రామ్తికలిగిమ్చే సౌరభం 
      నీవు నా అంతరంగం దోచి అందుకో మధుర అధరామృతం  
.......

ఓం శ్రీ రాం   ఓం శ్రీ మాత్రేనమ: - ఓం శ్రీ కృష్ణా నమ:

ప్రాంజలి ప్రభ - శృంగార సాహిత్యం 
 తరుణామృతం
మ. మ . త  (పెద్దలకు మాత్రమే )
మనసు మనసు తరుణామృతం - సాహిత్య వచన శృంగార  కావ్యం

(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) (10 )

        నీకు నామీద నవ  నవోన్మెష రక్తి
      చెప్పకనే తెలుస్తుంది నీలొ యుక్తి
      నిన్ను కలవాలని నాలో కలిగిన ఆశక్తి 
      నీ వదనం వెలుగులు చిమ్ముతుంటే రక్తి

     నిన్ను చూస్తె ఒళ్లంతా స్వేదంతో నిండి పోతుంది 
      దాహం తీరక నా నాలుక పిడచ కట్టుకు పోతుంది        
      సిరోజాలువేడెక్కి తపన తగ్గే మార్గం చెప్పమంటుంది  
      అదేమి చిత్రమో,అదేమి ఆరాధనొ తెలియ నంటుంది  

       నా అనురాగాల ముద్దుల శాంతి దేవత  
     పారి జాతమ్ము ప్రేమ జీవన విభాత  
     భవ్య లోక సుఖా లందిమ్చే దివ్యలత 
     నా  సుఖ  సౌక్యాలందిమ్చే  ప్రదాత

     పువ్వుల మేఘమా నా భాద తెలుపు   
     నా కన్నీల్లను తుడిచి పొమ్మని తెలుపు 
     తన్మయత్వంతో ఉన్నాను రమ్మని తెలుపు 
     తపన తగ్గించి దప్పిక తీర్చుకొని పొమ్మని తెలుపు
                               
      ప్రచండ గ్రీష్మ తాపాన్ని ఉపశమిమ్ప చెస్తావు
     కరుణతో  పుడమి  తల్లిని  పులరింప చేస్తావు  
     మెరుపువల్లె మెరిసి నామనసు రంజిల్లపరుస్తావు
     గుండెలో ఉన్న దడను తగ్గించి సంతోశాపరుస్తావు 

     రాత్రి నిద్రపట్టక చంద్రునితో నీ గురించి ముచ్చటిస్తా  
      నవమి నాటి వెన్నెలను ముందుగా నీకు పంపిస్తా
      మాన నీయమైన గుణం అర్ధం చేసుకొని ప్రవర్తిస్తా
      కన్నుల్లొఉండే కారుణ్య రేఖతో పులకితున్ని చేస్తా 

      నా సృష్టి దైవ నిర్ణయం 
      నా జీవిత కరుణా మయం 
      నా ప్రేమ అనురాగ మయం
      నా హృదయ్యం చైతన్య భరితం 

      సంవత్చరానికి ఒక్కసారి వచ్చే వసంతానివి కావు  
      ఒక్క రోజు సువాసన అందించే గులాబివి కావు 
      ఒక్క క్షణం నింగిలో మెరిసే మెరుపువు కావు 
      నా ఊహలు సఫలం చేసే సౌమ్దర్యవు నీవు 

      నెల కొకసారి వచ్చే పున్నమి జాబిల్లివి కావు 
      వెలుగును కమ్మే నల్లని మేఘానివి  కావు 
      శబ్దాలు చెస్తూ సమయాన్ని తెలియపరచవు 
      రంజిమ్పచేసి రసడోలికలో ముంచేదానావు నీవు 
      
      తెరలు తెరలుగా పైరు గాలి వీచినట్లు రమ్మనకు   
      సొగసుచూడమని పరదాలు తొలగించి రమ్మనకు
      ప్రకృతిలో అందచందాలతో ఆటలకు నన్నురమ్మనకు
      రమ్మని పిలిచి ఆనవ్వు దొమ్తరలతో నన్ను వేదిమ్చకు 

      తొలి మబ్బు తెరచాటు చెమ్దమామవు 
      గగన పధ  విహార విహంగ  పతుడవు
      చీకటినితరిమే వెలుగును చూసి తప్పుకుంటావు   
      అందరికి చల్లదనము వెన్నెలను పంచుతావు              
.   
--((**))--               రేపు    బావా మరదళ్ల సమ్బాషణ  చదువు కుందాం 
  

ఓం శ్రీ రాం   ఓం శ్రీ మాత్రేనమ: - ఓం శ్రీ కృష్ణా నమ:

ప్రాంజలి ప్రభ - శృంగార సాహిత్యం 
 తరుణామృతం
మ. మ . త  (పెద్దలకు మాత్రమే )
మనసు మనసు తరుణామృతం - సాహిత్య వచన శృంగార  కావ్యం
(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) (11  )

1 వెన్నెలలో చిరునవ్వులు విరజిమ్మె మరదలా
కన్నులలో కలకాలం దాచుకోవా మరదలా
నామీద వయ్యారపు వగలు చూపకు బావా
మోసపూరిత ప్రేమను కుమ్మరించకు బావా

2 వయ్యారపు నడకలతో మదిని దొచకు మరదలా
పెదవులు చిమ్దిస్తు మందహాసముచేయకు మరదలా
మరులూరించే వేణు గాణము చేయకు బావా
పరవసమ్తొ పాడి నా మనసు భాధపెట్ట్‌కు బావా

3 చల్లగాలి భలే భలే మత్తెక్కిస్తు ఉంది మరదలా
నా మనసంతా నిన్నే కోరుతుంది మరదలా
మధురంగాఉంది అధరమ్ అందుకోవాలని ఉంది బావా
నీకౌగిలిలొచిక్కి మాధురాణుభూతి పొందాలని ఉంది బావా

4 చలిగాలిలో పరువాలు పమ్చుకుమ్దామ మరదలా
సొగసైనా నామెనుపై పవళించుము మరదలా
చలిగాలికి నా మేను పులకరిస్తుమ్ది బావా
నా సొగసైనా వయసు అంత నీదే కదా బావా

5 ఈ హాయి కలకాలం ఉండాలి మరదలా
నీ సుఖం కోసం ఏమైనా చేయాలా మరదలా
నా ద్యాస అంతా, ఆశలన్ని నీ పైనే బావా
ఏనాటి పుణ్యమో నీ ప్రేమకు చిక్కాను బావా

**********

6 బెలవు అనుకున్నా, కాదు గడసరివి మరదలా
ప్రేమ కతలు వ్యక్త పరుస్తున్నావు మరదలా
నిన్ను చూస్తుంటే వళ్ళంతా పులరిస్తుంది బావా
నా చెంగుకు దొరకకుండా ఉన్నావు బావా

7 కలవరపాటు లో నిను చూడలేదు మరదలా
కలవాలనుకున్న కలువలేకున్న మరదలా
నీ ప్రక్కన ఉన్నాను చుడలేదా బావా
నీలో నె ఉన్నాను దిగులు పడకు బావా

8 నీ నీడ సోకగానే నామనసునిలవనంటుంది మరదలా
హాయి హాయి గా మనం తిరుగాలి మరదలా
చల్లని వెన్నేలను పంచె నేలరాజువు బావా
విచ్చుకున్న కలువను ముద్దడవేమి బావా

9 నిను వీడను నీవే నా సుఖం మరదలా
ని చుపులలో చిక్కాను మరువలేను మరదలా
నీ చల్లని చరణంబుల నీడలో ఉంటాను బావా
నీ పాద సేవ చేస్తూ సుఖం పంచుతాను బావా

10 పిలిచిన పలుకవు నా ప్రియమైన మరదలా
పలకరింపుకు ఒక్కనవ్వు నవ్వవే మరదలా
పలికిన ముద్దు ముద్దు కావాలంటావు బావా
నీ అమాయకపు మాటలకు లొంగను బావా

11 మధుర శృంగార మందార మరదలా
మందహాసమ్తొ మధురిమలు పలుకవే మరదలా
నా మదిని దోచిన మన్మధుడవు బావా
నా మనసులోని మాటను చెప్పాలని ఉంది బావా

12 నీలి కళ్ళు చూపూలతో మురిపిస్తున్నావు మరదలా
ఈ కళ్ళు నీకోసం వేచి ఉంటాఈ మరదలా
నీ కళ్ళను చుస్తే నా వల్ళును మరీచాను బావా
నా మనసంతా నికే అర్పించాలని ఉంది బావా

13 దిబ్బరొట్టె మొహం, బుంగా మూతి పెట్టె మరదలా
రబ్బర బంతిలా ఎగిరెగిరి పడుతున్నా ఇమరదలా
గొట్టాం పాంటు వేసుకొని కాడిలాగున్నావు బావా
గాలికి కొట్టుకు పేయా గడ్డి పరకాలాగున్నావు బావా

14 ముద్ద బంతి పువ్వులా, ముద్డొస్తున్నావే మరదలా
కన్ను గీటి నన్ను ఉడికిస్తున్నవే ముద్దుల మరదలా
సొగసుకాడవు నీవు, కోరా మిసాలున్న ముద్దులబావా
వేడెక్కిస్తేగద నాలోవేడిని చల్లపరచవా ముద్దులబావా

15 నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు గడిపాను మరదలా
కనులు మూసినా తెరిచినా నీవే ఉన్నావు మరదలా
నీవువస్తావేమోననినాతలుపులుతెరిచిఉంచానుబావా
నాయద అంతా బరువేక్కి బటన్స్ తెగినా ఈ బావా

16 పన్నీటితో స్నానము చేఇస్తాను మరదలా
పవళించుటకు పూలపాన్పువేస్తాను మరదలా
జలకాలాడుటకు నీవుఉంటే చాలు బావా
నీ మేను నాదైనప్పుడు పూలతో పనియేంటి బావా

17 నీలి కన్నులతో నిగ నిగ లాడుతున్నావు మరదలా
నీజడకదలిక చూస్తె గుండెజల్లుమంటుందిమరదలా
చలికి చల్లగాలేస్తుందా మగసిరిగల ముద్దుల బావా
నీ ఆశను వమ్మూచేయను ఓర్పు వహించు బావా

18 నీ శిగలో పువ్వులు చూస్తెశివమెత్తుతుంది మరదలా
మనం తీగలా చుట్టుకొని ప్రవశించుదామా మరదలా
ఆడుతూ పాడుతూ హాయిగాఅల్లారిచేస్తూ ఉండుబావా
జాబిలీ చూపిస్తాను, వెన్నేలను అందిస్తాను బావా

19 గాలిలో తేలే పూలలా విహారిద్దామా మరదలా
ఆకాశంలో మేఘంలా విహారిద్దామా మరదలా
కన్నేమనసును అర్ధం చేసుకోవాలి బావా
ఆశల వలయంలో చిక్కి భాధపడకుబావా

20 నాకునీవు నీకునేను కలసిమెలసిఉందామా మరదలా
తీయనికలలుకంటుకోరికలుపంచుకుందామామరదలా
మురిపాల ముద్దులు ఇవ్వాలని ఉంది బావా
సొగసైనా వయసు పందిరి వేయాలని ఉంది బావా

21 హిమగిరి సొగసులు చూచుటకు పొదామా మరదలా
శీతల పవనాలలో కలసి తిరుగుదామా మరదలా
వెచ్చగా నీవు ప్రక్కన ఉంటేనేను వస్తాను బావా
నా ఆశలన్ని నీపైన నీసుఖమే నాకు కావాలి బావా

22 తోటలోకి వస్తావా నీతో మాట్లాడాలని ఉంది మరదలా
గూటిలొ ఉంటే గుసగుస లాడుట కష్టముమరదలా
తోటలోకి వస్తే ముద్దులు కావాలని అంటావు బావా
బయటకువస్తేబజారులు తిరుగుదామ్ అంటావు బావా

23 పొదచాటున ఉండి తొంగి తొంగి చూడకు మరదలా
నీ పొంగులు చూసి కోగిలిలోకి రావాలుమ్ది మరదలా
తొందర పడకు నీ ఆసలను తీరుస్తాను బావా
మూడు ముల్లు వేసి నీ దానిని చేసుకో బావా

24 ఉల్లిపొరచీరలొఅందంచూపుతూఉడికిస్తునావుమరదలా
గాలిసవ్వడికిచీరకదలికలువళ్ళుజల్లుజల్లుగామరదలా 
బలపం పట్టి పాటాలు నేర్పుతానులే ముద్దుల బావా
తాపములో ఉన్నావు దప్పిక తీర్చి సుఖమిస్తా బావా

25 ముద్దబంతిపువ్వులాఉండిముద్దివ్వనంటావుమరదలా
ముసిముసి నవ్వులతో మత్తెక్కిస్తున్నావు మరదలా
కసురుకున్న,వద్దన్న నాకు ఏదో కావాలంటావు బావా
నా సర్వస్వంనీకు ఆర్పిస్తాను తొండరేందుకు బావా

26 బావా మరదల మధ్య ఎడబాటు పెరిగింది
చిలిపికోరికలుమరువలేక భాధ మిగిలింది
నువ్వంటే నాకిష్టం,నేనంటే నీకీష్టంఏమైంది
వట్టి ఆకర్షణ అని ఒకరికొకరం తిరిగానంది

27 నన్నిలా ఉడికించావేందుకే, కవ్వించావేందుకే
నీ ప్రేమ పొందే అర్హత నాకు లేదన్నావెందుకే
అమ్మ నాన్నలను వప్పించే భాద్యత లేదనకే
నాప్రేమవద్దన్న,కన్నవాళ్లను మోసం చేయకే

28 నీమనసు నాదన్నావు, నామనసు నీదన్నావు
జీవితామ్తమ్ కలసి ఉంటాంఅని బాసలుచేశావు
ప్రేమే జఇస్తుందని నమ్మకంతో బ్రతకాలన్నావు
షరతులు పెట్టావు,ఆశలు రేపావు, తప్పుకున్నావు

29 రగులుతుంది మోగలిపోద, కావాలాంటుందికన్యయద
నీచుట్టూ తిరిగికావ్విస్తూ చేశాను తుమ్మెదలారొద
నామీద నీకు ప్రేమ ఉంటుందని ఆశించాను సదా
ప్రేమతోమంచంపైకి రమ్మంటావాని ఆశించాను కదా

30 నిన్ను చూడకుండా ఉండలేను, వదిలి ఉండలేను
కరిగిపోయే కలని, వెలసిపోయే చిత్రమనిఅనుకోను
నాహ్రుదిలొ నీవున్నావు, నీ మదిలో నేనుంటాను
వంటిపై పచ్చబొట్టుగా,విడిపోని బంధంలాఉంటాను

31 తీయని మాటలు విని గోతిలో పడ్డాను
చేతకానివాడిలా మూల పడి ఉన్నాను
విడిపోయామని మరచి వెతుకుతున్నాను
నీప్రేమకొరకు కన్నవాళ్లనుమోసం చేశాను

32 వెలిగుచూపే వలపుదీపమ్ఎందుకేనామీదకోపం
మనసులో నిను మరువలేక వెలుగుకలతదీపం
నీ మోముపై కుంకుమ పెట్టాలని ఆసాదీపమ్
నీవు నాకోరకు వెలిగించవే వలపు దీపం

33 నన్నేల విడనాడి పొతావని నేను అనుకోలేదు
కన్ను కన్ను కలిసాఈ కానీ ఒకటవ లేదు
నిన్నునేను మరువలేను అందుకే వదలలేదు
నీపెదవి నాపెదవి కలవండే నాకు నిద్ర రాదు

34 నిను వదలి నేను వెళుతున్నా నా మరదలా
నీతో కలిసిన జీవితము ఒక కలేగా మరదలా
నీ జ్ఞాపకాలతో జీవించాలని ఉంది మరదలా
నీవు దూరమైన మనసుదూరముకాదుమరదలా

35 గుండెలోని కోరికలన్ని గాలిలో కలసి పోవాలా
మనసులోని మమతలన్నీ మరచి పోవాలా
ఆశల రెక్కలతొ ఆరాధకుడిగా మారిపోవాలా
ప్రేమ సద్వినియోగం చేసుకొనే శక్తి రావాలా

36 ప్రియుడి సన్నిధిని చేరాలని తహతహ లాడవా
ని కోసం పారిజాత వృక్షం తెమ్మన్నా తానా
గగన సీమలొవిహరించాలని ఎప్పుడైనా అనుకోవా
నన్ను అవహేళన చేశావు పనికిరాని వాడినా

37 కొత్త దారి చూపావే చిలకా, నా అందాల పలకా
తుల్లి పాటలు పాడవే చిలకా, నా ముద్దుల గిలకా
గుండె సవ్వడి వినవే చిలకా, నామువ్వల మొలకా
హృదయ లోగిలిలోకి రావా చిలకా, నా పై అలకా

38 విరహముతో నీవు కుంగి పోవటం సమంజసమా
జడివానలో తడిసి తపనలు తగ్గించు కొందామా
వలపువరదలో వళ్ళుమరచిసుఖంగా విహారిద్దామా
మంచు తెరలలో, పూలపవలింపుపై నిద్ర పోదామా
చింత చిగురు చిన్న దాన, లేత వగరు వయసుదానా
చిగురురసంపిండి ఇవ్వనా,వయసుతగ్గ వలపందించనా
పనిపాటలుమానేసి నీచుట్టూతిరగనా, వలపుల జానా
చిలక పలుకులు పలికినా, కోఇలలా కూస్తూ ఉండనా

--((**))--



అప్పుడే పవనుడు (నిత్య  సంచారి) ఈవిధముగా పాడుచున్నాడు



అక్కడ నడుస్తున్న ఓక స్త్రీ ని చూసి (మరొకడు  )



1) భగవానుడు చెప్పాడు, దేనిని తెలుసుకుంటే అశుభం(సంసారబంధం) నుండి విముక్తి చెందుతావో, అలాంటి అతిరహస్యమైన,అనుభవ జ్ఞానంతోకూడిన బ్రహ్మజ్ఞానాన్ని, అసూయ లేని నీకు బోధిస్తున్నాను.

2) ఈ బ్రహ్మజ్ఞానం, అన్ని విద్యలలోకి శ్రేష్టమైనది, అతి రహస్యమైనది, సర్వోత్కృష్టమైనది, పవిత్రమైనది, ప్రత్యేకంగా తెలుసుకోతగ్గది, ధర్మమైనది, ఆచరించడానికి మిక్కిలి సులభమైనది, నాశనం లేనిది.

3) ఓ యువతి ! ఈ ధర్మం(ఆత్మజ్ఞానం) మీద శ్రద్ధ లేని మానవులు, నన్ను పొందక, మృత్యు రూపమైన సంసార మార్గం లో పడి తిరుగుతున్నారు.

జీవితాన్ని చూడడానికి ఒక సకారాత్మక దృష్టి, ఒక నకారాత్మక దృష్టి, రెండూ ఉన్నాయి. జీవనము పదార్ధం అంటే నకారాత్మకం, పరమాత్మ అంటే సకారాత్మకం. ఎందుకంటే మన దృష్టి ఎలా వుంటుందో ప్రపంచం మనకి అలా కనబడుతుంది.

మనిషి యొక్క ఎటువంటి జ్ఞానమైనా మనిషితో కలవకుండా ఉండలేదు. ఒకవేళ ఇది సత్యమైతే, మనకి నాస్తికునితో విరోధం పెట్టుకోడానికి ఎలాంటి కారణం లేదు. ఎందుకంటే, ఒక నాస్తికుడు, నా దృష్టి ఏదైతే వుందో, దానితో నాకు ఈ జగత్తులో ఈశ్వరుడు కనబడడం లేదు అంటాడు.

4) ఇంద్రియాలకి అందని నాచే ఈ ప్రపంచం మొత్తం ఆవరించబడి ఉంది. సమస్త ప్రాణులు నాలో ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను.

5) ఈ ప్రాణులన్నింటినీ సృష్టించి, పోషించేది నేనే. కానీ నేను వాటిలో లేను.

6) గొప్పదైన గాలి ఎప్పుడూ ఎలా అంతటా నిండి ఉంటుందో, అలా నాలో సమస్త ప్రాణులు నాలో నిండివున్నాయి.

శ్రద్ధకి సంబంధించిన విషయాన్ని చెప్పిన తర్వాత కృష్ణుడు మరో విషయం ప్రారంభిస్తున్నాడు. ఎవరు తార్కాన్ని నమ్మడానికి సిద్ధంగా లేడో, అతను దానిని ఆలోచించగలడు. ఈ సూత్రం ఆతార్కికమైనది, రహస్యమైనది, చిక్కుప్రశ్న లాంటిది.

రెండు శరీరాలు ఒకదాన్ని ఒకటి ఆకర్షించు కుంటే శృంగార భావన కలుగుతుంది. రెండు మనసులు ఆకర్షించుకుంటే ప్రేమ ఏర్పడుతుంది. కానీ ఎప్పుడు రెండు ఆత్మలు ఒకదానినొకటి ఆకర్షించుకుంటాయో అప్పుడు శ్రద్ధ ఏర్పడుతుంది. మనము శ్రద్ధ యొక్క పరిణామం చూడగలుగుతాము. ఈ జగత్తులో ఏ ఏ శక్తులు ఉన్నాయో, అవేవీ కనబడవు. వాటి పరిణామాలని చూడగలుగుతాము.

శ్రద్దని పొందిన తరువాత జరిగేది ఆత్మకు సంబంధించిన మార్పు. శ్రద్ధ వలన పాతది మరణిస్తుంది. క్రొత్తది ఆవిర్భవిస్తుంది. ప్రేమలో పాతది మార్పు చెందడం జరుగుతుంది.

ఎవరు కష్టాలు అంటే భయపడతారో, వారు పరమాత్మని ఎన్నటికీ చేరుకోలేరు. ఎందుకంటే అది పరమకష్టం. అక్కడ మిమ్మల్ని మీరు కోల్పోవడానికి, మీరు లేకుండా పోవడానికి ధైర్యం కావాలి.

ఈ జ్ఞానం సరళము అంటే అర్థం మీరు ఏదీ చేయనక్కర లేదు అని కాదు. మీకు పాత్రత ఉండాలి. అది పొందడానికి చాలా చేయాలి. భక్తుడు అవడానికి చాలా సేపు పడుతుంది. భక్తుడు అయ్యాక లభించడానికి ఎంతో సేపు పట్టదు. భక్తుడు అంటే వ్యక్తిత్వం అనే నీరు మరిగి నూరు డిగ్రీలకి చేరుకోవడం. దీనికి దగ్గర దారి లేదు. యాత్ర అంతా పూర్తి చేయవలసినదే. ఇది జీవనం యొక్క శాశ్వత నియమం.

కృష్ణుడు అంటాడు....సాధన చాలా సరళము

శ్రద్ధారహితుడైన వాడు, విన్నా, అర్ధం చేసుకున్నా, ముందుకు వెళ్లాలని ప్రయత్నం చేసినా పరమాత్మని చేరుకోలేడు. ఎందుకంటే పరమాత్మ దగ్గరకు హృదయం అనే ద్వారం ద్వారా చేరుకోవాలి. ఆయన దగ్గరకు చేరుకునే భావం ప్రేమ. శ్రద్ధ అంటే అర్థం ఒక లోతైన నాది అనే భావన, ఒక భరోసా, ఒక ఆత్మీయత, తెలియని దాని మీద, దాగివున్న దాని మీద ఉండే భరోసా. శ్రద్ధ అనేది ఒక పెద్ద అసంభవమైన ఘటన. అది వేలలో ఒకటిగా విచ్చుకునే పుష్పం. కానీ ఒక్కసారి విచ్చుకుంటే అనంత ద్వారాలు తెరచుకుంటాయి.




ప్రాంజలి ప్రభ - నేటి కవితలు 

నల్లని మేఘముల్
కమ్ముకొనే ఆకాశంబునన్ 
ఫెల్లని ఘర్జనల్
మ్రోగు చుండేనే ఆకాశంబున 
చల్లని గాలుల్
వర్షపు జల్లులతోనే పుడమినన్ 
పల్లవ శోభలం పుడమి
 పచ్చని చీర దాఁల్చెన్

నింగి మరుడు వరుసగా
 నీటి బాణాలు కురిపించెన్
పృథ్వి భామిని కేమే
 బాణాలకే నెలలు నిండెన్
కడుపు పండి పండి తానూ
 కంకులం ప్రసవించెన్
వర్షపు ఋతువు యందు
 వసుధ సంతసం పంచెన్

--((*))--


ప్రాంజలి ప్రభ - నేటి కవితాలు -8
ప్రాంజలి ప్రభ - (నేటి కవితలు -8 ) 
మాహాత్ములుగా ఎదిగేవారికి
ఎంత మంది కృషి ఉంటుందో 
ప్రాస కవితగా తెలుపుతున్నాను  

స్వత సిద్ధం కొంత 
ప్రకృతి సిద్ధిం కొంత 
వంశాకురం కొంత 
తల్లితండ్రుల దీవెన కొంత  
గురువులు పెద్దలు దీవెన కొంత 
చదువనే తెలివిని సంపాదిస్తారు అంతా 

క్రమపద్ధతిలో ఎదుగుదల కొంత 
పరిపూర్ణ విధ్య  సాధన కొంత   
భావోద్వేగాల భావాలు కొంత 
దేశ విధ్యా స్వభావాలు కొంత 
మనిషి వృద్ధి చెందుటకు సహకారం అంతా 

స్పర్శతో భుజం తట్టి ధైర్యం చెప్పేవారు కొంత 
చిరునవ్వుతో చదివించే తల్లితండ్రులు కొంత 
పట్టుదలతో ప్రోత్సాహంతో క్రమశిక్షణ కొంత 
శ్రద్ధగా వింటూ, సహనం వహిస్తూ, నేర్పు కొంత 
ప్రతిచర్యకు పోకుండా శ్రద్ధతో అభ్యసించేదే నిజమైన విద్య   

ధర్మం తప్పక చదివిన చదువును 
అందరికి పంచె విధానమును 
ఫలితము ఆశించక బోధనను 
దేశాభివృద్ధికి సాహకరించే వారే 

మనుషుల్లో ఉన్న మహాత్ములు 
--((*))--

ప్రాంజలి ప్రభ - నేటి కవిత (షట్సంపత్తి )  -7

విషయంలో ఉన్న మిధ్యత్వాన్ని గురించి
అనిత్యతను మల్లి మల్లి గమనించి గుర్తించి
విరక్తమైన మనస్సును లక్ష్యమంవైపు మళ్లించి
సమస్తము మార్పును చేయునదే శమము

కర్మేంద్రియాల వళ్ళ వచ్చే ఆకర్షణ    
జ్ఞానేంద్రియాల వళ్ళ వచ్చే ఆకర్షణ
భోగవస్తువల వళ్ళ వచ్చే ఆకర్షణ
మళ్లించి మనస్సును మార్చేదే దమము

దు:క్ఖాల భావాలను మనసుకు రానీక
భాదలు, కష్టాలను మనసుకు రానీక
ప్రతీకార వాంఛ మనసుకు రానీక
శాంతంగా, సహనంగా ఉండుటే తితిక్ష

బాహ్య వస్తువులకు ఆకర్షణ చెందక
ఇతరుల మాటలకు ఉత్తేజ పడక
ఇంద్రియాలకు సంచలనం చెందక
మనస్సును ఆరోగ్యముగా ఉంచుటే ఉపరతి

శాస్త్రపు వాచ్య లక్ష్యార్ధాలను
పెద్దల గురువుల వాక్యాలను
వివేక విజ్ఞాన విషయాలను
మనస్సు సత్య దర్శనంగా మారేది శ్రద్ధ

సునిశితమూ, తీక్షణమూ
వివేక విజ్ఞాన పూరితమూ
బుద్ధి సత్య మార్గ సమగ్రంగా,
ఏకాగ్రంగా ధ్యానిస్తు ఉండే మనసే సమాధానము


--((*))--



ప్రాంజలి ప్రభ - నేటి కవితలు -6

lave is home                 = ప్రేమే మనకు గృహము
Love is boring             =  ప్రేమే మనకు నిష్ఠత
love is exciting             =  ప్రేమే మనకు అద్భుతం
love is listening            =  ప్రేమే  మనకు శ్రవణం

love is forgiving           = ప్రేమే మనకు క్షమాపణ
love is imperfect         = ప్రేమే మనకు అసంపూర్ణం 
love is chemistry         = ప్రేమే మనకు రసాయణం 
love is selfless             = పెమే మనకు నిస్వార్ధం 

love is being partners  = ప్రేమే మనకు భాగస్వామ్యం
love is corny as hell    = ప్రేమే మనకు హెల్
love is finding a balance = ప్రేమే మనకు తెలిపే పద్దు
love is compromise     = ప్రేమే మనకు సహకారం

love is kiss on the fore head  = ప్రేమే మనకు తలపై ముద్దు
love is sharing the covers      = ప్రేమే మనకు సహచరితం
love is just talk but not action = ప్రేమే మనకు సంతులనం
love is laughing  at stupid things together = ప్రేమే మనకు నవ్వులమయం

ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో

ప్రాంజలి ప్రభ - నేటికవితlu 6

ఓ మనిషి నిజ స్థితి
గమనించటం ఎవరికైనా కష్టం
ప్రస్తుతమున్న స్థితి
బ్రతుకు మార్గం చూపుట నిజం

కొరికే లేకున్న స్థితి
బంధాలను తెంచుకొని ఉండటం 
వ్యక్తిగమనించే స్థితి
ఎదిరించలేని పరిస్థితి ఏర్పడటం

వినవల్సిన పరిస్థితి  
గత్యంతరం లేక చెవులప్పచెప్పడం 
కనవల్సిన పరిస్థితి
ప్రకృతి భాధను తప్పక భరించటం

పల్కవల్సిన పరిస్థితి
మధవర్తిగా న్యాయాన్ని చెప్పడం
నిర్వికల్ప ఉపాధిస్థితి
ఉపాధి పొంది జీవనం గడపడం

నిత్యనిర్మలమైన స్థితి
ఎప్పటిపని అప్పుడు చేసి ఉండటం
సందేహ నివృత్త్త స్థితి
సమయం వ్యర్థంకాక పరిష్కరించటం

మాలిన్య ధ్వంస స్థితి
ఆరోగ్య రక్షణ కోసం ఇదొక పోరాటం
స్వేశ్చతో యోగ స్థితి
పక్షిలాగా బ్రతకాలని ప్రయత్నిచటం

శాశ్వతమేదో తెల్పె స్థితి
నమ్మకమే ఆరోగ్యానికి నిదర్శనం
మనస్సు స్వభావ స్థితి
అందరిని ప్రేమించి ఆదరించటం

ఇంద్రియాల నిగ్రహ స్థితి
చాతకానిదాన్ని ప్రయత్నం చేయటం
సత్య మైన ఆత్మ స్థితి 
కొత్త ప్రయోగాలతో నిత్యా నూతనం

వయస్సును గుర్తించే స్థితి
మనిషి ప్రవర్తన బట్టి తెలపటం
మనస్సును భ్రమించే స్థితి
అతివేగం ఆయాసం కల్పించటం

కాలమును జయించే స్థితి
కానీ వాటికి ప్రయత్నిమ్చాటమే నాటకం 
ప్రకృతిని కల్సి భరించే  స్థితి
చీకటి వెలుగుల్ని భరించి జీవించటం


 --((*))--

ప్రాంజలి ప్రభ - నేటి కవితలు - 5

తోలి తొలకరి చినుకులు
మది తలపుల ఉడుకులు
కలువ కలయిక వలపులు
మమత మలుపుల తలుపులు 

విలువల సెలవుల ఉరకలు
ఒకరికొకరు సరిగమపదనిసలు
అవధి ఉరకల కమతములు   
కుశల శుభ విరిసిన వనములు 

పవన వలయపు తపనలు
తరువు కదలిక చిటికెలు
తరుణములొ మరలె కురులు
కతల కలయిక మనసులు 

సిరిపలుకుల కులుకులు
నవవిధముల మలుపులు
ఎవరికి తెలుపని తెనియలు
మనసు మనసు కలిసె కళలు  
--((*))--


నేటి కవిత  -3

ఊపిరున్నంతవరకు
ఉనికిని చాటుకోవలసిందే
ఎండిపోనంతవరకు
ఏరు పారుతూ ఉండవలసిందే 

ప్రాణమున్నంత వరకు
తల్లితండ్రులు ప్రేమను పంచాల్సిందే
ఓర్పు ఉన్నంత వరకు
ప్రతి ఒక్కరు శ్రమించాల్సిందే 

నీరు పడేంత వరకు
బావిని పట్టుదలతో తవ్వవలసిందే
మూర్ఖుడు మారేంతవరకు
భయంతో వేచి చూడ వలసిందే 

బద్ధకం వదిలే వరకు
మెదడుకు పని చెప్పవల్సిందే
క్రమశిక్షణ ఉండేంత వరకు
ఓర్పు పట్టుదల ఉండవలసిందే


కష్టాలు వచ్చేంత వరకు
సుఖాల జీవితమ్ గడపవల్సిందే  
ప్రాణాలున్నంత వరకు
దీపారాధన, దైవప్రార్ధన చేయ వల్సిందే
  
ధర్మబుద్ధి ఉన్నంత వరకు
యమధర్మరాజూ వెనక్కు పోవాల్సిందే
కర్మ శుద్ధి అయ్యేంత వరకు
జన్మజన్మల జీవితం గడపాల్సిందే
 --((*))--


నేటి కవితలు  -1   

చేయి చేయి కలిస్తే చెప్పఁట్లు 
మనసు మనసు కలిస్తే ముచ్చట్లు  
పువ్వు పువ్వు కలిస్తే పూదోట 
మనిషి మనిషి కలిస్తేనే సృష్టి 

సప్త స్వవరాలు కలిస్తేనే సంగీతం 
సప్త సముద్రాలు కలిస్తేనే ప్రపంచం  
సూర్యుడు సంచరిస్తేనే వేడి వెలుగుల మయం 
చంద్రుడు సంచరిస్తేనే వెన్నెల చల్ల దనం 

మేఘాలు పక్షులు విహరిస్తేనే ఆకాశం 
సర్వం భరిస్తూ వృక్షాలు వికసిస్తేనే భూమి 
సర్వప్రాణుల ఆహారంకు సహకరించేదే అగ్ని 
ప్రతిప్రాణి జీవించుకు ముఖ్యమైనది  గాలి

మేఘాలు పక్షులు లేకపోతే ఆకాశాన్ని చూసేదెవరు  
ప్రేమతో ఉండే జీవులు, వృక్షాలు ఉంటేనే పుడమి 
ప్రాతినిముషం అగ్ని గాలి వ్యర్థం కాకుండా ఉంటేనే 
ప్రపంచం దేదీప్యమానంగా వెలుగుతా ఖాయం       

--((*))-- 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి