సౌందర్య లహరి
(శ్రీ శంకర భగవత్పాద విరచితము)
(శ్రీ లలితాంబికాయైనమః)
ప్రక్షిప్త శ్లోకము __1
( సౌందర్య లహరి స్తోత్రం లో మూడు శ్లోకాలు ప్రక్షిప్త శ్లోకాలు గా
ప్రచారంలో ఉన్నాయి)
"సమానీతః పద్భ్యాం మణిముకురతా మమ్బరమణిః
భయాదన్తర్బద్ద స్తిమిత కిరణ శ్రేణి మసృణః !
దధాతి త్వద్వక్త్రం ప్రతిఫలిత మశ్రాన్త వికచం
నిరాతంకం చంద్రాన్నిజ హృదయ పంకేరుహ మివ !!
ఈ శ్లోకం లో శ్రీదేవి ముఖ ప్రతిబింబ మహిమ ను స్తుతించారు.
అమ్మా! భగవతీ!ఆకాశానికి మణి వంటి వాడైన సూర్యుడు నీ పాదసేవకుడు గానూ , నీవు పాదము లుం చే మణిదర్పణం గానూ ఏర్పడిన వాడై యున్నాడు. అమిత ప్రకాశ వంతమైన నీ ముఖాన్ని ౘూసి , అతడు భయపడి తన వేయి సూర్యకిరణాలను పైకి ప్రసరింౘ నీ యకుండా తన లోనే అణౘు కుంటున్నాడు. నీ కిరీట మందున్న చంద్రుడి చేత, తన హృదయంలోని తామర
( నీ ముఖ ప్రతిబింబము ) ముడుౘు కొనకుండా వికాసము పొంది వెలుగు ౘుండగా దానిని ధరిస్తున్నాడు.
--((**))--
ప్రక్షిప్త శ్లోకము __2
" సముద్భూత స్థూల _ స్తనభర ముర శ్చారుహసితం
కటాక్షే కందర్పః _ కుసుమిత కదంబద్యుతివపుః !
హరస్య త్వద్భ్రాంతిం _ మనసి జనయామాస మదనో
మావయ్యా యే భక్తాః పరిణతి రమీషా మియముమే" !!
దేవీ ఉపాసన వల్ల, " సారూప్యము" ఫలితంగా వస్తుందని చెప్పబడింది.
తల్లీ! దేవీ ! నిన్ను ఉపాసించిన మన్మథుడు, సారూప్య రూపమైన ఫలమును పొంది, ఉన్నతము లైన స్తనముల బరువును భరింౘుౘున్న నీ ఉరస్థ్సలమునూ సుందరమైన నీ చిరునవ్వు నూ , కడిమి పూవుల కెంపు ఛాయ గల నీ శరీరము నూ ,కడగంటి ౘూపులయందు అనురాగము నూ వహించి , పరమశివుని మనస్సులో నే తాను ఈ రూపంతో , నీవు అనే భ్రాంతిని కలిగిస్తున్నాడు.
ఉమాదేవీ! నీ భక్తులందరికీ పరిణామము ఇటువంటిదే అవుతుంది కదా !
( నీ భక్తులందరకూ సారూప్య రూపమైన ఫలము కలుగుతుందని భావము)
అమ్మ ను ఉపాసించిన వారు, ఆమె దయవల్ల దేవీ రూపాన్నే పొందుతారని భావము.
--((**))--
సుమతీ శతకం.
తల్లిదండ్రులు తమ బిడ్డలను సన్మార్గ గాములను చేసే ప్రథమ ప్రయత్నమే
ఈ సుమతి శతక సాథన . ఇది కంద పద్య శతకం.
శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకలజనులు నౌరా యనగ
ధారాళమైన నీతులు
నోరూరగఁ జవులు పుట్ట నుడివెద సుమతీ !
ఓ సుమతీ .! ఆ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వలన ప్రాప్తించిన కవితాగుణం తో సమస్త ప్రజానీకము భళీ యని మెచ్చుకొనేటట్లు , ధారాశుధ్ధి కల్గి , ప్రసిద్ధములై ,అపవాదము లేని నీతులను మళ్ళీ మళ్ళీ వినాలనే కోరిక కలిగేటట్లు గా చెపుతాను.
......... ----- అని ప్రతిజ్ఞ చేసి , కవి ఈ శతకాన్ని ప్రారంభిస్తున్నాడు. ఇది కవికి తన కవిత్వం పై తన కున్న అపారమైన నమ్మకానికి ఉదాహరణ. ఆ నమ్మకం వమ్ము కాలేదు . ఎనిమిదివందల సంవత్సరాలుగా నోరూరి ,చవులు కలిగించి తెలుగు వారి నాలుకలపై సుమతీ పద్యాలు నాట్యమాడుతూనే ఉన్నాయి. ఇదే కదా ఒక మహాకవికి జాతి అందించే మహా నీరాజనం..
తెలుగు నాట పూర్వకాలం లో ఏదైనా వ్రాయడానికి మొదలుపెట్టే ముందు “శ్రీరామ జయం” అనో , “శ్రీరామ “ అనో “శ్రీరామ రక్ష” అనో ,వ్రాసి , కన్నుల కద్దుకొని తరువాత ,వ్రాయడం ప్రారంభించడం మన పూర్వీకుల అలవాటు. ఇది తెలుగు జాతి నడచిన బాట. ఆ శ్రీరాముడు తెలుగు వారి ఆరాథ్యదైవం కదా. అదే ఈ కవి చేత శ్రీరామ అనిపించింది . కావ్యాన్ని "శ్రీ " తో ప్రారంభించడం శుభకరమని మన పూర్వ కవులు ఒక సంప్రదాయం ప్రవేశపెట్టారు. " మంగళాదీని మంగళ మథ్యాని ."..... అనేది ఆర్యోక్తి...
విత్తమందు భ్రా౦తి వాసినయట్టి
పురుషుడవనిలోన పుణ్యమూర్తి
పరులవిత్తమరయ పాపసంచితమగు
విశ్వదాభిరామ వినురవేమ
పరులసొమ్ము కోసం ఎగబడనివాడే పుణ్యాత్ముడు. అలాకాదని బుద్ధికి గడ్డి మేపుతూ పక్కవాళ్ళ జేబుల్లో చేతులు పెట్టేవాళ్లకు మిగిలేవి పాపాలమూటలే.
"మంచిమాటవినర మానవుండ" శతకం రచయిత్రి భమిడిపాటి కామేశ్వరమ్మ
నీదిగాని దానికెన్నడాశించకు
నీదియైనదాని వదలబోకు
నీకు సాటిరారు నిలలోన నెవ్వరు
"మంచిమాటవినర మానవుండ
ఇతరుల ఆస్తులకు ఆశపడకపోవడం మంచిదే కానీ సొంత మనుకున్నదాన్ని కాపాడుకొనే విజ్ఞతకూడా డాలి.లేకపోతే యిల్లు గుల్లవుతుంది. కాపురం వీధిపాలవుతుంది.
మాడలమీద నాసఁగలమానిసి కెక్కడి కీర్తి?కీర్తి పై
వేడుకగల్గు నాతనికి విత్తము మీద మరెక్కడాస? యీ
రేడు జగంబులందు వెలహెచ్చిన కీర్తి ధనంబు గాంచి స
స్ప్రౌఢ యశంబు జేకొనియె బమ్మయసింగడు దానకర్ణుడై
క్షమ గలిగిన సిరి గలుగును
క్షమగలిగిన దన కలుగు సౌర ప్రభయున్
క్షమ గలిగిన దొన గలుగును హరియు మెచ్చు
విశ్వదాభిరామ వినుర వేమ
ఓర్పు వున్నయెడలసంపదలు గలుగును, దానితో సూర్యుని వంటి వెలుగు కలుగును (కీర్తి)ఓర్పుతో రక్షణ కూడా కలుగును, హరి కూడా మెచ్చుకుంటాడు.
జాతి నీతి వేరు జన్మంబదొక్కటి
అరయ తిండ్లు వేరె యాకలొకటే
దర్శనములు వేరు దైవమౌ నొక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ
' ప్రాణమయ కోశం '
దీనిలో లోపలినుండి బయటికి వెళ్ళే ' ప్రాణం ' బయటినుండి లోనికి పోవు ' అపానం ' నాభిస్థానంలోఉండి శరీరమంతటా రసాన్ని వ్యాపింపజేసే ' సమానం ' కంఠంలో ఉండి ఆహార పానీయాలను లోనికి ఆకర్షించి బలపరాక్రమాలను కలిగించే ' ఉదానం ' శరీరం అంతటా వ్యాపించి జీవుడు శరీరంలో ఆ యా కర్మలను చేయటానికి తోడ్పడు ' వ్యానం ', అను పంచ ప్రాణాలున్నాయి.
దీనిలో లోపలినుండి బయటికి వెళ్ళే ' ప్రాణం ' బయటినుండి లోనికి పోవు ' అపానం ' నాభిస్థానంలోఉండి శరీరమంతటా రసాన్ని వ్యాపింపజేసే ' సమానం ' కంఠంలో ఉండి ఆహార పానీయాలను లోనికి ఆకర్షించి బలపరాక్రమాలను కలిగించే ' ఉదానం ' శరీరం అంతటా వ్యాపించి జీవుడు శరీరంలో ఆ యా కర్మలను చేయటానికి తోడ్పడు ' వ్యానం ', అను పంచ ప్రాణాలున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి